specially abled people
-
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. -
దివ్యాంగునిపై పోలీసుల దారుణం.. నీళ్లు అడిగాడని.. వీడియో వైరల్..
లక్నో: దివ్యాంగునిపై ఇద్దరు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నీళ్లు అడిగినందుకు అర్థరాత్రి అతనిపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముడు చక్రాల బండిలో కూర్చున్న వ్యక్తి పేరు సచిన్ సింగ్. 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. స్థానికంగా సిమ్‌లు అమ్మతుంటాడు. ఓ రెస్టారెంట్లో సప్లయర్‌లా కూడా పనిచేస్తాడు. శనివారం రాత్రి పని ముగించుకుని వస్తుండగా.. అతనికి ఓ తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న చెరువులో వదిలి వస్తుండగా.. పోలీసులు ఎదురైనట్లు చెప్పారు. చేతి కడుకోవడానికి నీళ్లు అడిగిన క్రమంలో పోలీసులు ఫైరనట్లు వెల్లడించారు. In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G — Piyush Rai (@Benarasiyaa) July 30, 2023 చేతికి తాబేలు వాసన కారణంగానే తాను నీళ్లు అడినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. విచక్షణా రహితంగా తలపై కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానిక ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరు పోలీసులను రాజేంద్ర మని, అభిషేక్ సింగ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందినవారిగా గుర్తించారు. విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. -
మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..
-
Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..
కొంతమంది చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంటారు. చేసిందితప్పు అని చెప్తే ఇంకా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నచ్చచెప్పే ప్రయత్నం, శాంతంగా వివరణ ఇచ్చిన బుర్రకెక్కుదు. పైగా అలా చెప్పిన వాళ్లని తిట్టడమో! లేక వారిపై దాడి చేయడమో చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే యూఎస్‌లోని ఒక రెస్టారెంట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....అమెరికాలోని బియాంకా ప్లోమెరా అనే 19 ఏళ్ల యువతి హ్యాబిట్ బర్గర్ గ్రిల్ రెస్టారెంట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అయితే అక్కగే ఒక దివ్యాంగుడు కూడా పనిచేస్తున్నాడు. కొంతమంది మగవాళ్లు సదరు దివ్యాంగుడిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం ప్రారంభించారు. దీన్ని చూసిన అసిస్టెంట్ మేనేజర్ ప్లోమెరా వారిని అడ్డుకుని మీరు చేసింది కరెక్ట్ కాదు, అతను దివ్యాంగుడు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అంతే ఒక వ్యక్తి అనూహ్యంగా ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత వెంటనే ఆమె కూడా ప్రతిదాడి చేయడం ప్రారంభించగా... మళ్లీ యువతి ఘోరంగా దాడి చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో యువతి కుడి కన్నుకి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు మాత్రం ఆమె కన్నుని కాపాడలేకపోయారు. ఫలితంగా ఆమె కుడి కన్నుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో నెట్టింట హల్చల్ చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు రెస్టారెంట్ వద్దకు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. @raulbrindis Un hombre golpeó repetidamente a Bianca Palomera, 19, asistente. gerente de @habitburger en Mahogany en Antioch después de que ella le dijo que se fuera porque estaba acosando a un adolescente con necesidades especiales. @CaraTurky @DrZpitapita . pic.twitter.com/XTA7Pzym59 — Bunburyfan (@Bunburyfan8) November 17, 2022 (చదవండి: ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు) -
Zomato: వీల్‌చైర్‌లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు అధికమవ్వడంతో డెలివరీ బాయ్‌లు కూడా పెరిగిపోయారు. చాలా మంది యువత పార్ట్‌టైం జాబ్ కింద డెలివరీబాయ్‌లా పనిచేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండలు, వానలు, ట్రాఫిక్ వంటి ఆటంకాలను దాటుకొని కస్టమర్లకు టైంలోగా ఆర్డర్ అందించాల్సిందే. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తి కృషి, పట్టుదల పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నైకి చెందిన 37 ఏళ్ల గణేష్ మురుగన్ జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను దివ్యాంగుడు. వీల్‌చైర్‌లో కూర్చొని ఆర్డుర్లు డెలివరీ చేస్తూ బతుకు బండి లాక్కొస్తున్నాడు. దేశంలోనే తొలి వీల్‌చైర్ డెలివరీబాయ్‌గా అతను రికార్డు సృష్టించాడు. నడవలేని స్థితిలో ఉన్న గణేష్.. వీల్‌చైర్‌లో కూర్చొని ఆర్డర్లు అందిస్తున్న వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశాడు. గత నాలుగు రోజులుగా ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీటిని రీపోస్టు చేస్తూ ‘గొప్ప స్ఫూర్తికి నిజమైన ఉదాహరణ' అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఆయన ధైర్యాన్ని, సంకల్ప శక్తిని కొనియాడుతున్నారు. అంతేగాక గణేష్‌కు ఉపాధి కల్పించినందుకు జోమాటోను కూడా ప్రశంసించారు. చదవండి: చిత్రం భళారే విచిత్రం.. రాజమౌళి మూవీనే తలదన్నే వీడియో.. ఆరేళ్ల క్రితం ప్రమాదంలో వెన్నెముకకు గాయం కావడంతో మురుగన్ వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. అయితే అదే అతన్ని సంకల్ప దైర్యాన్ని రెట్టింపు చేసింది. మురుగన్ లైఫ్ స్టోరీని జూన్‌లో ఛత్తీస్‌గఢ్ ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా మొదటిసారి ట్విట్టర్లో పంచుకున్నారు. కష్టాలపై పోరాడటం మానేసి చేతులెత్తేసే వారందరికీ ఇది స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇక మురుగన్ వీల్ చైర్‌ను మద్రాస్‌లోని ఐఐటీ స్టార్టప్ రూపొందించింది. దీనిని నాలుగు గంటలు పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. -
హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’
లండన్: ఇటీవల కాలంలో అందరూ ఉబర్, ఓలా, ఆన్లైన్ రైడ్ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. దీంతో మనకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగానూ మంచి వెసులబాటుగానూ ఉంటుంది. మంచి రద్దీ సమయంలో ఈ క్యాబ్‌ల సాయంతో త్వరితగతిన వెళ్లవచ్చు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) అయితే మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేయించుకుని పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే సదరు డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్‌తో మాట్లాడటం ఇష్టం లేకనో లేక మరో ఇతర కారణాలతోనో కేవలం మెసేజ్‌లను పెడతారు. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు. వివరాల్లోకెళ్లితే....లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్నఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఆ లెటర్లోని సందేశం ఏమిటంటే " నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు. మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి ఏయూఎక్స్ కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజు మీరు ఏం కావల్సిన బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు." అని ఉంది. దీంతో జెరెమీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తాను తన జీవిత కాలంలో ఎక్కిన ఉబెర్ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్ తనకు ప్రత్యేకం అని చెప్పాడు. ఈ మేరకు జెరెమీ ఈ ఉబర్ డ్రైవర్ సందేశంతోపాటు ఓనూర్ గ్రేట్ హిరో అంటూ ట్యాగ్లైన జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్ల ఈ సందేశం ఎంత హృదయపూర్వకంగా ఉందో అంటూ ఓనూర్ కష్టపడేతత్వాన్ని, మర్యాదపూర్వక స్వభావాన్ని ప్రశంసిస్తు ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) I have just entered the most wholesome Uber of my entire life. Big ups, Onur, absolute hero ❤️ pic.twitter.com/lID9Mn7pqF — Jeremy Abbott (@Funster_) October 21, 2021 -
వికలాంగుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ కొమాకి వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. మెకానికల్ పార్కింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లతో కొత్త ఎక్స్ జీటీ ఎక్స్5ను కోమాకి లాంఛ్ చేసింది. ఈ ఎక్స్ జీటీ-ఎక్స్5 (72వి24ఎహెచ్) ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ధర రూ.90,500(ఎక్స్ షోరూమ్), ఎక్స్ జీటీ-ఎక్స్5 జీఈఎల్ రిటైల్స్ ధర రూ.72,500 (ఎక్స్ షోరూమ్). ఇప్పటివరకు ఎక్స్ జీటీ ఎక్స్5 1,000 యూనిట్లను ఇప్పటికే విక్రయించట్లు ఈవి తయారీదారు ప్రకటించింది. ఈ మోడల్ దేశవ్యాప్తంగా కంపెనీ అన్ని షోరూమ్ కొనుగోలు చేయడానికి లభ్యం అవుతుంది. ఈ స్కూటర్ ను ఆన్లైన్ లో ఉచితంగా బుక్ చేస్తే సమీప డీలర్ ద్వారా మీకు డెలివరీ చేయనున్నారు. కోమాకి మోడల్స్ పై ఈఎమ్ఐ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్5 రెండు(ఎరుపు, బూడిద) రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 80-90 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది విఆర్ఎల్ఎజెల్ బ్యాటరీలు, లిథియం-అయాన్ బ్యాటరీలతో రెండింటితో పనిచేస్తుంది. దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. -
మాస్కులతో వివాహం చేసుకున్న దివ్యాంగులు
జోధ్‌పూర్: పెళ్లంటే కలకాలం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. అయితే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు కరోనా వచ్చి పెళ్లిళ్లను వెక్కరిచింది. తానుండగా వివాహాది శుభకార్యాలు జరిగేది లేదంది. దీంతో వందలాది వివాహాలు వాయిదా పడ్డాయి. కానీ కొంతమంది మాత్రం అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాల్సిందేనని మంకుపట్టి పడుతూ మరీ మనువాడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ దివ్యాంగుల జంట కూడా ఇప్పట్లో కరోనా పోయిలా లేదుగానీ అనుకుని గురువారం నాడు కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరంగా పెళ్లి తంతు పూర్తి చేసుకుంది. (కల్యాణానికి కరోనా సెగ) అటు పురోహితుడు మాస్కు కట్టుకునే మంత్రాలు ఉచ్ఛరించాడు. ఇటు వధూవరులతోపాటు కుటుంబ సభ్యులు కూడా మాస్కులు ధరించారు. సుబోధ్ డేవ్ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే వివాహం జరిపామని వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నామని, అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామన్నారు. అయితే లాక్డౌన్ వల్ల వేడుకలు క్యాన్సిల్ చేసుకుని నిరాడంబరంగా వివాహం జరిపామని తెలిపారు. కాగా లాక్డౌన్ ఇప్పటికి మూడు సార్లు పొడిగించిన తెలిసిందే. ప్రస్తుతం కేంద్రం విధించిన లాక్డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. (మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000) -
అర్ధరాత్రి స్వతంత్రం
తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు పనుల్ని తెమలనివ్వరు. తల్లి అంటిపెట్టుకుని ఉండాల్సిన పిల్లలు పనుల్ని అసలు మొదలే పెట్టనివ్వరు. అందుకే ఈ తల్లులంతా.. అర్ధరాత్రి వెలిగే కిచెన్లు అయ్యారు. పిల్లలు నిద్రపోయే వరకు ఉండి.. కేకుల బేకింగ్ పనిలోకి దిగుతున్నారు. కోర్సు చేసింది.. ఆర్థిక స్వాతంత్య్రం కోసం. కళ్లు మూతలు పడుతున్నా మేల్కొని ఉంటోంది అర్ధరాత్రి స్వతంత్రం కోసం. ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్‌కి లాక్డౌన్ అడ్డుపడింది. ‘క్రాఫ్ట్ బేకింగ్’కోర్సు అది. పూర్తయిన బ్యాచ్‌లోని మహిళలంతా రుచిగా కేకులు తయారు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నారు. ‘వైట్ వాంచో’, ‘బార్బీ’ కేకులను చేస్తే వాళ్లు చెయ్యాల్సిందే. అంత రుచిగా వచ్చాయి కోర్సు ట్రైనింగ్‌లో. ఆ రెండు కేక్స్‌కి మంచి మార్కెట్ ఉంది. బయట మార్కెట్లే లేవు! చేసి చుట్టుపక్కల అమ్మేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయి. ‘ఆంటీ.. మళ్లీ చేస్తారా?’ పిల్లలొచ్చి అడుగుతున్నారు. నేర్చుకున్న విద్య వృధాగా పోలేదు. లాక్‌డౌన్‌ని ఎత్తేస్తే వీళ్ల కుటీర కేక్ పరిశ్రమకు పెద్ద పెద్ద బేకరీలు బెంబేలెత్తి పోవాల్సిందే. ఇక్కడి వరకు చెప్పుకుని ఆపేస్తే ఇది స్వయం ఉపాధి కథ మాత్రమే అవుతుంది. క్రాఫ్ట్ బేకింగ్ కోర్సు ఫస్ట్ బ్యాచ్‌లోని 35 మంది మహిళలూ తల్లులే. వీరిలో 30 మంది ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పిల్లలున్న తల్లులు. అరె! అలా ఎలా కుదిరింది. కుదర్లేదు. ఎంపిక చేసుకున్నారు. కోళికోడ్ నేషనల్ ట్రస్ట్, కోళికోడ్ పరివార్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలున్న తల్లుల సంఘం.. మూడూ కలిసి ట్రైనింగ్ ఇచ్చిన మాతృమూర్తులు వీరంతా. కేరళ ప్రభుత్వ పథకం ఎ.ఎస్.ఎ.పి. (అడిషనల్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామ్) కింద ఉన్న ఉపాధి కోర్సులలో ‘క్రాఫ్ట్ బేకింగ్’ కూడా ఒకటి. కోర్సు చేసిన వాళ్లంతా కోళికోడ్‌లోని దగ్గరి దగ్గరి ప్రాంతాల నుంచి వచ్చినవారే. కోర్సు అయిపోగానే ఇంటికి వచ్చి సోలియా బైజు అనే మహిళ చేసిన మొదటి పని.. వెనీలా, చాక్లెట్, స్ట్రా బెర్రీ కేకులను తయారు చేయడం. ఎలా వస్తాయో చూద్దాం అని చేసింది. ‘ఇంత బాగా ఎలా వచ్చాయి’ అనే ప్రశంసలు వచ్చాయి. కొడెంచెరీ, కొడువల్లి ప్రాంతాల్లో సోలియా కేకుల్ని తిన్నవారు.. ‘కొత్త బేకరీ పడిందా?’ అనుకున్నారు. అయితే సోనియా వాటిని రాత్రంతా మేల్కొనే ఉండి తెల్లవారు జామున చేస్తోందని వారికి తెలిసే అవకాశం లేదు. నిజానికి అప్పుడు మాత్రమే ఆమెకు కుదురుతుంది. తన నాలుగేళ్ల కొడుకును వదిలి పనిలో పడటానికి ఆమెకు దొరికే సమయం అది. ఆ చిన్నారికి నరాల బలహీనత. ఏ అర్ధరాత్రి తర్వాతో కాని నిద్రపోడు. అప్పటివరకు తల్లి తన పక్కన ఉండాల్సిందే. నజీబత్ సలీమ్, షైజాలది కూడా సోలియా పరిస్థితే. నిద్రకు ఆగలేగ రెప్పపడుతున్నా.. పిల్లల కంటికి అనుక్షణం రెప్పల్లా ఉండాలి. నజీబత్ చెంబుకడవులో, షైజా ఉన్నికుళంలో ఉంటారు. పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి కేకుల తయారీ మొదలుపెడతారు. సోలియాకు అప్పుడే కొంత డబ్బును వెనకేయడానికి వీలవుతోంది. ఆమె బిడ్డకు తరచు డైపర్స్ మారుస్తుండాలి. భర్తను డబ్బులు అడగవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టనవసరం లేకపోవడం ఆమెకు సంతోషాన్నిస్తోంది. రోజుకు ఇరవై కేకులు చేసి అమ్మగలుగుతోంది. నజీబత్‌కు పద్నాలుగేళ్ల కూతురు ఉంది. అది తల్లికి సహాయం చేసే వయసే కానీ, మానసికంగా తనింకా పసిపాపే. ఎనభైశాతం ‘మెంటల్లీ ఛాలెంజ్డ్’. ఆ పాప నిద్రపోయాకే నజీబత్‌కు పని మొదలుపెట్టడం సాధ్యమౌతుంది. అయితే ఎప్పుడు నిద్రపోతుందో చెప్పలేం. అప్పటి వరకు ఆమె వేచి చూడవలసిందే. అప్పటికి నజీబత్ కళ్లూ నిద్రకు బరువెక్కుతుంటాయి. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలవంతంగా నిద్ర ఆపుకుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లాడు. షైజా కొడుకు వయసు 22 ఏళ్లు. అతడికి మానసిక వైకల్యంతో పాటు వినికిడి లోపం కూడా ఉంది. అతడు నిద్రపోయాకే కేకుల తయారీకి, కేకులపైన ఐసింగ్కీ వీలవుతుంది షైజాకు. లాక్డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ బ్యాచ్‌లోని వాళ్లతో కేకులు తయారు చేయించి మార్కెట్ చేయాలని ఎ.ఎస్.ఎ.పి. జిల్లా కోఆర్డినేటర్ మెర్సీ ప్రియా ఇప్పటికే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు. నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్న ఈ తల్లులకు.. కష్టాన్ని మరిపించేలా ఆ ప్రతిఫలం ఉండబోతోందన్న మాట. బార్బీ కేకు, వైట్ వాంచో కేక్ -
జనగణమన: దివ్యాంగులకు ఊరట
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు గౌరవ సూచకంగా నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, దివ్యాంగులకు ఈ నిబంధన ఇబ్బందిగా మారడంతో వారికి సడలింపును ఇస్తున్నట్లు తాజాగా పేర్కొంది అత్యున్నత న్యాయస్ధానం. మిగతావారు కచ్చితంగా జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడాలని స్పష్టం చేసింది.