వికలాంగుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ | Komaki Launches E-Scooter For Specially Abled Riders | Sakshi
Sakshi News home page

వృద్ధులు, వికలాంగుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

Published Wed, Aug 11 2021 7:05 PM | Last Updated on Wed, Aug 11 2021 7:10 PM

Komaki Launches E-Scooter For Specially Abled Riders - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ కొమాకి వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈవీని మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. మెకానికల్ పార్కింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లతో కొత్త ఎక్స్ జీటీ ఎక్స్5ను కోమాకి లాంఛ్ చేసింది. ఈ ఎక్స్ జీటీ-ఎక్స్5 (72వి24ఎహెచ్) ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ధర రూ.90,500(ఎక్స్ షోరూమ్), ఎక్స్ జీటీ-ఎక్స్5 జీఈఎల్ రిటైల్స్ ధర రూ.72,500 (ఎక్స్ షోరూమ్). ఇప్పటివరకు ఎక్స్ జీటీ ఎక్స్5 1,000 యూనిట్లను ఇప్పటికే విక్రయించట్లు ఈవి తయారీదారు ప్రకటించింది.

ఈ మోడల్ దేశవ్యాప్తంగా కంపెనీ అన్ని షోరూమ్ కొనుగోలు చేయడానికి లభ్యం అవుతుంది. ఈ స్కూటర్ ను ఆన్‌లైన్‌ లో ఉచితంగా బుక్ చేస్తే సమీప డీలర్ ద్వారా మీకు డెలివరీ చేయనున్నారు. కోమాకి మోడల్స్ పై ఈఎమ్ఐ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్5 రెండు(ఎరుపు, బూడిద) రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 80-90 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది విఆర్ఎల్ఎజెల్ బ్యాటరీలు, లిథియం-అయాన్ బ్యాటరీలతో రెండింటితో పనిచేస్తుంది. దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement