
అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన.. రెండు వారాల్లోనే 50,000 బుకింగ్‌లను అందుకుంది. లాంచ్ సమయంలో ప్రకటించిన ధర మొదటి 10000 యూనిట్లకు మాత్రమే పరిమితం అని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ ఆఫర్‌ను 50000 బుకింగ్‌లకు పొడిగించింది. మొత్తం బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి.
రెండు వారాల క్రితం షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్‌తో పాటు అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్‌ను కూడా లాంచ్ అయింది. లాంచ్ సమయంలో, టెస్సెరాక్ట్‌ను రూ. 1.20 లక్షల ప్రారంభ ధరకు ఆవిష్కరించారు. ఈ ధర మొదటి 10,000 ప్రీ బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుందని బ్రాండ్ వెల్లడించింది. ఈ ప్రకటన తరువాత కేవలం 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. దీంతో కంపెనీ ఈ ఆఫర్‌ను మరో 30,000 ప్రీ-బుకింగ్‌లకు విస్తరిస్తున్నట్లు నిర్ణయించింది.
అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.
టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్‌బోర్డ్ నావిగేషన్‌తో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్‌క్యామ్‌లు (ముందు, వెనుక), వైర్‌లెస్ ఛార్జింగ్, హ్యాండిల్‌బార్ కోసం హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.
టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment