న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు దివ్యాంగులు గౌరవ సూచకంగా నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పకుండా ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, దివ్యాంగులకు ఈ నిబంధన ఇబ్బందిగా మారడంతో వారికి సడలింపును ఇస్తున్నట్లు తాజాగా పేర్కొంది అత్యున్నత న్యాయస్ధానం.
మిగతావారు కచ్చితంగా జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడాలని స్పష్టం చేసింది.
జనగణమన: దివ్యాంగులకు ఊరట
Published Tue, Apr 18 2017 2:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement