
రాపర్ , గాయకుడు యో యో హనీ సింగ్ సంగీతాభిమానులకు పరిచయం అవసరంలేదు.అంతర్జాతీయంగా గత పదిహేనేళ్లుగా పాప్ సంగీతాన్ని ఏలుతున్న ఘనత అతగాడి సొంతం. ఇటీవల హనీ సింగ్ భారత పర్యటన సందర్భంగా ఒక విశేషం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హనీ సింగ్ భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాలొ (ఏప్రిల్ 4) మ్యూజిక్ కన్‌సర్ట్ ఏర్పాటైంది. అతని సంగీత ఝరిలో ప్రేక్షకులంతా ఓలలాడుతున్నారు. ఈ కచేరీ సందర్భంగా వేదికపై ఉన్న యో యో హనీ సింగ్‌ను కలవడానికి ఒక వృద్ధుడు దూసుకొచ్చాడు. భారీగా గుమిగూడిన జనాల మధ్యనుంచి ,బారికేడ్‌ను దూకి మరీ వృద్ధుడి ముందుకొచ్చాడు. నెత్తిన తలపాకాగాతో ఆ పెద్దాయన (సింగ్) రావడాన్ని చూసి హనీ సింగ్ ఆయను వేదికమీదకు ఆహ్వనించాడు. అంతే.. వేదికమీదకు రాగానే సూపర్‌గా స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హనీసింగ్ హిట్ ట్రాక్ డోప్ షోప్‌కు హుషారుగా నృత్యం చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఉత్సాహంతో ఊగిపోయారు.

హనీ సింగ్ స్వయంగా ఈ చిన్న క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. " మై ఫరెవర్ యంగ్ ఫ్యాన్స్" అంటూ పోస్ట్ చేయడం హైలైట్ అయింది.
జస్‌ప్రీత్ పనేసర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో మొత్తం వీడియోను షేర్ చేయడంతో బారికేడ్‌ను దాటి సింగ్‌ను కంటెంట్ సృష్టికర్త జస్‌ప్రీత్ తండ్రి అని తేలింది. "కోల్‌కతాలో హనీ సింగ్ కచేరీలో నాన్నకు ఒక అద్భుతమైన క్షణం" అంటూ ఈ జస్‌ప్రీత్ వీడియోలో చెప్పారు. "నాకు హనీ సింగ్ అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయస్సు నుండి అతని పాటలు వింటున్నాను. నా తండ్రి ఈ రోజు అతనితో వేదికపై డ్యాన్స్ చేశాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది" అంటూ పేర్కొన్నాడు.