Honey Singh
-
ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ.38 లక్షల బిల్లు కట్టా: సింగర్
చేతిలో డబ్బున్నంతవరకు ఖర్చుచేయడం చాలామందికి దురలవాటు. ఇలాంటి చెడు అలవాటు ఒకప్పుడూ తనకూ ఉండేదంటున్నాడు ప్రముఖ సింగర్ హనీ సింగ్. పార్టీల పేరుతో దుబారా ఖర్చు చేసేవాడినంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా జీవితంలో ఎక్కువ డబ్బు పార్టీలకే వెచ్చించాను. జేబులో ఉన్నదంతా బిల్లు కట్టేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లేవాడిని. అప్పట్లో చాలా కాస్ట్లీఅలా 2013లో ఓసారి ఎనిమిది మంది ఓ క్లబ్లో పార్టీ చేసుకున్నాం. అప్పట్లో దుబాయ్‌లో ఉండాలంటే చాలా డబ్బులు వెచ్చించాలి. ఇప్పుడలా లేదనుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్ అందరం కూర్చుని తాగాం. మా టేబుల దగ్గరకు అమ్మాయిలు కూడా వచ్చారు. 23 మంది అమ్మాయిలను మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం. రూ.38 లక్షల బిల్లుఫుల్లుగా తాగాం, తిన్నాం. కట్ చేస్తే రూ.38 లక్షల బిల్లు కట్టమన్నారు. ఒక్క రోజుకు లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఇందుకోసం ఏకంగా మూడు క్రెడిట్ కార్డులు వాడాను అని చెప్పుకొచ్చాడు. హనీసింగ్ ఈ మధ్యే గ్లోరీ ఆల్బమ్ రిలీజ్ చేశాడు. మీర్జా, తు మేరా 22 మై తేరా 22, ద ఎక్స్పోజ్, జొరావర్ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్‌కు ముందే ఆ రికార్డ్ క్లోజ్ -
షారూఖ్.. లుంగీ డ్యాన్స్ సాంగ్ తనకు నచ్చలేదన్నాడు
చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని పాటలన్నీ హిట్టే! అందులోని లుంగి డ్యాన్స్ సాంగ్ అయితే మరింత స్పెషల్.. అయితే ఈ పాట చేయడానికి షారూఖ్ ఖాన్ నిరాకరించాడంటున్నాడు సింగర్ హనీ సింగ్. తాజా ఇంటర్వ్యూలో మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హనీ సింగ్ మాట్లాడుతూ.. నేను, గిప్పీ కలిసి ఆంగ్రేజీ బీట్ అనే మ్యూజిక్ వీడియోను థాయ్‌లాండ్‌లో షూట్ చేశాం. ఈ సాంగ్‌లో దాదాపు 400 మంది అమ్మాయిలు బికినీలో కనిపిస్తారు. రేపు నా ఇంటిమీదకొస్తే..అయితే అప్పటికే పంజాబ్‌లో(అసభ్యకరమైన లిరిక్స్ వాడుతున్నానంటూ) నామీద కోపంతో నా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో గిప్పి ఈ ఆంగ్రేజీ బీట్‌ను పక్కన పడేద్దామన్నాడు. నువ్వు ఢిల్లీలో ఉంటావు, కాబట్టి నీ దిష్టిబొమ్మలు తగలబెట్టినా బేఖాతరు చేస్తున్నావు. కానీ నేను పంజాబ్‌లోనే ఉంటాను. వాళ్లు మా ఇంటికి వచ్చి గొడవ చేసినా చేస్తారని భయపడ్డాడు. ఈ వీడియోను రిలీజ్ చేయకుండా ఆపేద్దామన్నాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించా..దానికోసం అంత ఖర్చు పెట్టింది ఇలా ఆపేయడానికా? అని చాలాసేపు వాదించాను. పంజాబ్‌లో తిరస్కరిస్తారేమో కానీ బెంగళూరు, హైదరాబాద్, వారణాసి.. ఇలా ఇతర నగరాల్లో కచ్చితంగా ఆదరిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఆ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే నాతో మాట్లాడనని శపథం చేశాడు. దీంతో ఆ మ్యూజిక్ వీడియోను పక్కన పడేయక తప్పలేదు.రెండూ సూపర్ హిట్ఆంగ్రేజీ బీట్ లాంటిదే ఓ సాంగ్ కావాలని కాక్టైల్ సినిమాటీమ్ అడిగింది. అలాంటిది వద్దని పార్టీ ఆల్ నైట్ కంపోజ్ చేసిచ్చాను. కానీ వాళ్లు మాత్రం ఆంగ్రేజీ బీట్‌నే తీసుకున్నారు. పార్టీ ఆల్ నైట్ మరొకరు కొనుక్కున్నారు. రెండూ సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఇలాంటిదే ఇంకోటి కావాలని చెన్నై ఎక్స్‌ప్రెస్ టీమ్ అడిగింది. సరేనని లుంగీ డ్యాన్స్ కంపోజ్ చేశాను.షారూఖ్‌కు నచ్చలేదుకానీ షారూఖ్ ఖాన్ అది తనకు నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. నేను నిరాశతో నిర్మాత భూషణ్ కుమార్ దగ్గరకు వెళ్లి సాంగ్ వినిపించాను. అప్పుడతడు ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నాడు. నిజానికి ఈ పాటను ప్రైవేట్‌గా రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమా కోసం తీసుకున్నారు అని చెప్పాడు. బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హనీసింగ్‌తో ఛత్రపతి హీరోయిన్ డేటింగ్? నటి ఏమందంటే?
బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా, ర్యాపర్, సింగర్ హనీ సింగ్ ఇటీవల ఓ ఈవెంట్లో కలిసి కనిపించారు. హనీసింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కాడు. ఇంకేముంది, వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందంటూ బీటౌన వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ రూమర్స్ నుస్రత్ చెవిన పడ్డాయి. ఈ వార్తలు విన్న భామ ఆగ్రహమో, అసహనమో వ్యక్తం చేయకుండా ఎగిరి గంతేసినంత పని చేసింది. నుస్రత్ బరూచా హిందీ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు హనీసింగ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. 'మీకో విషయం తెలుసా, ఇది నా జీవితంలోనే ఫస్ట్ డేటింగ్ రూమర్. నేను పెద్దగా ఎవరితోనూ తిరగను కాబట్టి నాపై ఇంతవరకు ఎలాంటి రూమర్ రాలేదు. కానీ ఈ పుకారు గురించి విన్నాక.. వావ్, నాకూ ఒకరు ఉన్నారన్నమాట అని సర్ప్రైజ్ అయ్యా. ఇక మీదట ఎవరడిగినా సరే, నాపై కూడా ఓ లవ్ రూమర్ ఉందని చెప్పుకోవచ్చు. అయినా జనాలకు బొత్తిగా పని లేకుండా పోయింది. ఏదేదో ఊహించుకుంటూ ఎప్పుడూ ఊహల్లోనే బతికేస్తున్నారు. సరే, నా గురించి కూడా ఏదేదో అనుకోండి, నేనేం పట్టించుకోను, నాకే సమస్యా లేదు' అని చెప్పుకొచ్చింది హీరోయిన్. కాగా నుస్రత్, హనీ సింగ్ 2021లో వచ్చిన ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి, సినిమాలు వదిలేసుకున్నా: హీరో అవే మనల్ని దూరం చేశాయి: సమంత -
ప్రముఖ సింగర్‌పై హత్యాయత్నం, ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ పంజాబ్ సింగర్‌పై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్య ఘటన మరవకముందే మరో పంజాబీ సింగ్‌పై దాడి జరగడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. శనివారం రాత్రి పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్‌పై హత్యాయత్నం జరిగినట్లు పంజాబీ ర్యాపర్ హనీ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మేరకు అల్ఫాజ్ సింగ్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హనీ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో అల్ఫాజ్ సింగ్ తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ ‘శనివారం రాత్రి నా సోదరుడు అల్ఫాజ్ సింగ్ పై ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారు ఎవరైనా వారిని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి నా సోదరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అంటూ హనీ సింగ్ పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే అతడి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉందని చెప్పాడు. నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు సింగర్ అల్ఫాజ్ పై హత్యాయత్నానికి ప్రయత్నించి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అల్ఫాజ్ ని హాస్పిటల్ లో చేర్పించారట. అయితే.. అల్ఫాజ్ పై దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: కె భాగ్యరాజ్‌కు షాక్, నటీనటుల సంఘం నుంచి తొలగింపు View this post on Instagram A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh) -
ప్రముఖ సింగర్ విడాకులు, పదేళ్ల బంధానికి ముగింపు
సినీ ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల ట్రెండ్ పెరిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. భార్య షాలిని తల్వార్‌తో తెగదెంపులు చేసుకున్నాడు.భరణంగా కోటి రూపాయలను కూడా సమర్పించాడు.తొలుత షాలిని తనకు భరణంగా రూ. 10కోట్లు డిమాండ్ చేయగా చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు. కాగా హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని తల్వార్ గతేడాది ల్లీలోని తీస్ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇరు వాదనలు విన్న కోర్టు విచారణ అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం వీరికి మనస్పర్థలు రావడంతో చివరికి విడాకులు తీసుకున్నారు. -
ప్రముఖ సింగర్‌పై గృహహింస, లైంగిక వేధింపుల కేసు
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడేళ్ల క్రితం అనగా 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్‌లోని పలు భారీ ప్రాజెక్ట్స్‌లో పని చేయడానికి ముందే హనీ సింగ్ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక దీపికా పదుకోనె, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘కాక్టెయిల్’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ బాగా ప్రాచుర్యం పొందారు. ఈ పాట సూపర్ హిట్ అవ్వడమే కాకా 2011లో టాప్ సాంగ్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చిన ఫిర్యాదులతో అతడి కెరీర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంకా స్పందించలేదు. -
ఫేమస్ సింగర్‌ను గుర్తుపట్టలేదు, పాపం.. ఫీలయ్యాడు
సెలబ్రిటీలు అన్నాక గుర్తింపు కోరుకుంటారు. ఏ పార్టీలోనైనా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలనుకుంటారు. కానీ వాళ్లను ఎవరూ గుర్తించకపోతేనే ఎంతో ఫీలవుతారు. ప్రముఖ ర్యాపర్ యోయో హనీసింగ్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అందుకు తానే కారణమంటున్నాడు బాలీవుడ్ సింగర్ షాన్. తాజాగా షాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "యోయో హనీసింగ్‌ను అంతకు ముందెప్పుడూ నేరుగా చూడలేదు. కేవలం టీవీలోనే చూసేవాడిని. ఓ పార్టీలో అతడిని ప్రత్యక్షంగా చూశాను, కలిశాను. కానీ అతడే హనీసింగ్ అని గుర్తుపట్టలేదు. స్క్రీన్ మీద బక్కపలుచగా ఉండే అతడు రియాలిటీలో మాత్రం లావుగా ఉన్నాడు. ఆయన నా దగ్గరకొచ్చి షాన్ సర్, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అంటూ నవ్వుతూ మాట కలిపాడు. అయినప్పటికీ అతడెవరో పోల్చుకోలేకపోయాను. ఆ తర్వాత నాతో మాట్లాడింది హనీసింగ్ అని అర్థమైంది. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఇప్పటిదాకా మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను, సారీ అని చెప్పాను. దానికతడు కొంచెం బాధపడ్డాడు. నిజంగానే అప్పుడు నేను పిచ్చోడిలా ప్రవర్తించాను. అతడిని గుర్తుపట్టలేదు అని చెప్పకుండా ఉంటే సరిపోయేది కదా!" అని పేర్కొన్నాడు. కాగా షాన్ ఆ మధ్య ర్యాప్ సాంగ్స్ మీద చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. జనాలకు సంగీతాన్ని అర్థం చేసుకునే కళ లేనందునే ర్యాప్ సాంగ్స్‌కు ఆదరణ పెరుగుతుందని షాన్ విమర్శించాడు. హనీసింగ్ ఆలపించిన లుంగి గ్యాన్స్, సన్నీ సన్నీ వంటి పాటలను ఎవరైనా పాడగలరని పెదవి విరిచాడు. చదవండి: ఆరోజే 'ఐ లవ్యూ' చెప్పుకున్నాం.. బుక్స్ ఇచ్చి అందులో ఏం రాసేవాడంటే! -
సింగర్‌పై కేసు నమోదు.. హత్యా బెదిరింపులు
చండీగఢ్: పంజాబ్ ర్యాప్ సింగర్ హనీ సింగ్‌పై కేసు నమోదు చేసిన అనంతరం తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గలాటీ తెలిపారు. హనీ సింగ్ రూపొందించే అల్బమ్స్‌లో మహిళలను అవమానించే రీతిలో అసభ్య పదాలు ఉన్నాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హర్యానా హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల అతనిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తన ట్విటర్ ఖాతా ద్వారా హత్యా బెదిరింపులుతో పాటు, అసభ్య సందేశాలు పంపుతున్నట్లు వెల్లడించారు. అయితే తాను ఎవరికీ భయపడేదిలేదని, ఇలాంటి వాటిపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మనీషా స్పష్టం చేశారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా హనీ సింగ్ పాటలు అభ్యంతరకర రీతిలో ఉంటున్నాయని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ కమిషనర్‌కు, హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న అతని అభిమానులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పాటే పురుగు మందు...
బాలీవుడ్ బాత్ ‘పానీ... పానీ’... వంటి సూపర్ హిట్ ర్యాప్ సాంగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హనీ సింగ్ ఆ తర్వాత దేశంలో ఒక పెద్ద సునామీనే లేవనెత్తాడు. ఇతగాడి పాటలు, రీ మిక్స్‌లు కొత్త తరాన్ని ఉర్రూతలూగించాయనే చెప్పాలి. అయితే ఇతడంటే చిరాకు పడేవాళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నారనేది వాస్తవం. పంజాబీ గాయకులలో గతంలో ఎవరికీ రాని వ్యతిరేకత ఇతడు మూట గట్టుకుంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల ఉత్తరాఖండ్ రైతులకు మాత్రం హనీసింగ్ ఆపద్బాంధవుడు అయ్యాడు. అక్కడి బంగాళాదుంప పంట అడవి పందుల బారిన పడుతుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న రైతులు దీనికి విరుగుడు కనిపెట్టారు. పొలాల్లో సౌండ్ బాక్స్‌లు పెట్టి పెద్ద ఎత్తున హనీసింగ్ పాటలు రేయింబవళ్లు వినిపిస్తుంటే అడవి పందులు కాదు కదా పురుగూ పుట్ర, నక్కలు గిక్కలు ఏవీ రావడం లేదట. ఇది విని హనీ సింగ్ ఏడ్వాలా సంగీత ప్రియులు నవ్వాలా వేయి వాద్యాల ప్రశ్న! -
అడవి పందులను తరిమేస్తున్న హనీసింగ్!
నైనిటాల్: 'శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః' అంటారు. సంగీతానికి పశుపక్ష్యాదులు సైతం స్పందిస్తాయని వింటూనే ఉంటాం. అదే సంగీతంతో అడవిపందులను సైతం తరిమేయొచ్చా? అవునంటున్నారు రైతులు. ఉత్తరాఖండ్ రైతులకు అడవిపందుల బెడద ఎక్కువగా ఉంది. అవి తమ పంటలను సర్వనాశనం చేస్తుండటంతో వాటిని తరిమేయాలని రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అది సర్కారుకు తలకు మించిన భారం అవుతుంది. దీంతో అక్కడి రైతులు వినూత్నంగా ఆలోచించారు. తమ పొలాల వద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. వాటిలో పంజాబీ గాయకుడు యోయో హనీసింగ్ పాటలను ప్లే చేస్తున్నారు. అది కూడా భారీ శబ్దంతో.. ఈ ఐడియా బ్రహ్మాండంగా పనిచేసింది. దీంతో అడవి పందులతో పాటు ఇతర జంతువులు కూడా తమ పొలాల జోలికి రాకుండాపోయాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నైనిటాల్ జిల్లాలోని ధరి గ్రామానికి చెందిన రైతు బిషన్ జంత్వాల్ బంగాళాదుంపలు సాగుచేశాడు. అడవిపందుల బెడద నుంచి పంటను కాపాడుకోవడానికి వ్యవసాయ క్షేత్రం చుట్టూ స్పీకర్లను ఏర్పాటుచేసి మంచి ఫలితాలను పొందాడు. తర్వాత ఇదే విధానాన్ని ఆ ప్రాంతంలోని ఇతర రైతులు కూడా అనుసరిస్తున్నారు. -
నేనేం కొట్టలేదు : షారుఖ్ ఖాన్
బాలీవుడ్ పాప్‌సింగర్ హనీసింగ్‌ను కొట్టలేదని షారుఖ్ ఖాన్ తెలిపారు. తాను హనీపై చేయి చేసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘కొన్ని నెలలుగా నేను హనీని కలవనేలేదు ఎందుకిలాంటి వార్తలు వస్తున్నాయో అర్థం కావట్లేదు’’అని షారుఖ్ అన్నా రు. ‘‘హనీకి అనారోగ్యంగా ఉందన్న సంగతి తెలిసింది. బాగానే గుర్తుచేశారు. వెంటనే ఫోన్ చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. నిజానికి, ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం షారుఖ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్ మీద చేయిచేసుకొని, వార్తల్లో నిలిచారు. -
కబడ్డీ లీగ్‌లో హనీసింగ్ జట్టు
న్యూఢిల్లీ: ప్రపంచ కబడ్డీ లీగ్‌లోని ఓ జట్టును స్టార్ ర్యాపర్ యో యో హనీ సింగ్ కొనుగోలు చేశాడు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వివిధ దేశాల్లో ఈ లీగ్ జరగనుంది. ‘కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం. నేను బాగా నమ్మే క్రీడలో భాగస్వామినవుదామని అనుకున్నాను. అందుకే ప్రపంచ కబడ్డీ లీగ్‌లో జట్టును కొన్నాను. నా టీమ్‌కు టొరంటో ఆతిథ్యమిస్తుంది. జట్టుకు యో యో టైగర్స్ అని పేరు పెట్టాను’ అని ఈ పంజాబీ సింగర్ తెలిపాడు. ఇప్పటికే అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ కూడా ఈ లీగ్‌లో జట్లను కొన్నారు. మొత్తం పది జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో ఐదు నెలల పాటు 94 మ్యాచ్‌లు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిన జరుగుతాయి.