ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ.38 లక్షల బిల్లు కట్టా: సింగర్‌ | Singer Honey Singh: Once Spent Rs 38 Lakh in a Night in Dubai | Sakshi
Sakshi News home page

Honey Singh: దుబాయ్‌లో పార్టీ.. ఒక్క పూటకే లక్షల బిల్లు.. ఖాళీ చేతులతో..

Published Sat, Oct 26 2024 4:55 PM | Last Updated on Sat, Oct 26 2024 5:37 PM

Singer Honey Singh: Once Spent Rs 38 Lakh in a Night in Dubai

చేతిలో డబ్బున్నంతవరకు ఖర్చుచేయడం చాలామందికి దురలవాటు. ఇలాంటి చెడు అలవాటు ఒకప్పుడూ తనకూ ఉండేదంటున్నాడు ప్రముఖ సింగర్‌ హనీ సింగ్‌. పార్టీల పేరుతో దుబారా ఖర్చు చేసేవాడినంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా జీవితంలో ఎక్కువ డబ్బు పార్టీలకే వెచ్చించాను. జేబులో ఉన్నదంతా బిల్లు కట్టేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లేవాడిని. 

అప్పట్లో చాలా కాస్ట్‌లీ
అలా 2013లో ఓసారి ఎనిమిది మంది ఓ క్లబ్‌లో పార్టీ చేసుకున్నాం. అప్పట్లో దుబాయ్‌లో ఉండాలంటే చాలా డబ్బులు వెచ్చించాలి. ఇప్పుడలా లేదనుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్‌ అందరం కూర్చుని తాగాం. మా టేబుల​ దగ్గరకు అమ్మాయిలు కూడా వచ్చారు. 23 మంది అమ్మాయిలను మా పార్టీలో జాయిన్‌ చేసుకున్నాం. 

రూ.38 లక్షల బిల్లు
ఫుల్లుగా తాగాం, తిన్నాం. కట్‌ చేస్తే రూ.38 లక్షల బిల్లు కట్టమన్నారు. ఒక్క రోజుకు లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఇందుకోసం ఏకంగా మూడు క్రెడిట్‌ కార్డులు వాడాను అని చెప్పుకొచ్చాడు. హనీసింగ్‌ ఈ మధ్యే గ్లోరీ ఆల్బమ్‌ రిలీజ్‌ చేశాడు. మీర్జా, తు మేరా 22 మై తేరా 22, ద ఎక్స్‌పోజ్‌, జొరావర్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement