RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్‌కు ముందే ఆ రికార్డ్‌ క్లోజ్‌ | Pushpa Part 2 Beat RRR Record In Number Of Releasing Screens | Sakshi
Sakshi News home page

RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్‌కు ముందే ఆ రికార్డ్‌ క్లోజ్‌

Published Sat, Oct 26 2024 2:25 PM | Last Updated on Sat, Oct 26 2024 4:37 PM

Pushpa Part 2 Beat RRR Record In Number Of Releasing Screens

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  'పుష్ప2: ది రూల్‌' పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్న చిత్రంగా పుష్ప2 రికార్డులకెక్కింది. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా ఈ చిత్రం విడుదల కానుంది. 'పుష్ప: ది రైజ్'కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RRRను బీట్‌ చేసిన పుష్ప
ఐకాన్‌ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్‌ సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ మార్కెట్‌ పెరిగింది. మాలీవుడ్‌లో అయితే ఏకంగా తమ హీరోగా వారు అభిమానిస్తారు. ఇప్పుడు బెంగాలీలు కూడా బన్నీకి ఫ్యాన్స్‌ అయిపోయారు. పుష్ప తర్వాత యూట్యూబ్‌లలో ఆయన నటించిన గత సినిమాలు చూసిన వారు ఫిదా అయిపోయారు. అలా మొదటిసారి బెంగాలీలో కూడా పుష్ప2 విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌లలో పుష్ప2 చిత్రం విడుదల కానుంది. ఇండియాలో 6,500, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లలో గ్రాండ్‌గా ఈ మూవీ విడుదల కానుంది. 

ఇంతటి భారీ సంఖ్యలో విడుదల అవుతున్న భారతీయ ఏకైక సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  ఇప్పటివరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇంతటి స్థాయిలో విడుదల కాలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో ఇప్పటి వరకు ఉన్న  10,200 స్క్రీన్స్‌ల రికార్డు పుష్పతో తుడిచిపెట్టుకుపోయింది. బాహుబలి2 8500 స్క్రీన్స్‌లలో రిలీజ్‌ కాగా కల్కి 8400 స్క్రీన్స్‌లలో సందడి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement