సినీ ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల ట్రెండ్ పెరిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. భార్య షాలిని తల్వార్‌తో తెగదెంపులు చేసుకున్నాడు.భరణంగా కోటి రూపాయలను కూడా సమర్పించాడు.తొలుత షాలిని తనకు భరణంగా రూ. 10కోట్లు డిమాండ్ చేయగా చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు.
కాగా హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని తల్వార్ గతేడాది ల్లీలోని తీస్ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇరు వాదనలు విన్న కోర్టు విచారణ అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం వీరికి మనస్పర్థలు రావడంతో చివరికి విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment