Shalini
-
స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.. అంతలోనే కనుమరుగైన స్టార్స్ వీళ్లే!
సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగంలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు.. అవకాశాలు కూడా అలా వెతక్కుంటూ వస్తాయి. అయితే అదే క్రేజ్ కెరీర్ మొత్తం ఉంటుందనుకోవడం పొరపాటే. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే ఈ పరిస్థితి కాస్తా భిన్నంగా ఉంటుంది. ఒకసారి గుర్తింపు వచ్చినా.. దాన్ని కెరీర్ మొత్తం నిలబెట్టుకోవడం కష్టమే. అలా మొదట స్టార్ హీరోయిన్లుగా ఫేమ్ తెచ్చుకున్న కొందరు స్టార్స్ తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. అలాంటి వారి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ స్టార్ డమ్ నుంచి కనుమరుగైన నటీమణులెవరో మీరు చూసేయండి.అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి..తెలుగులో రవితేజ సరసన అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో మెప్పించిన కోలీవుడ్ భామ ఆసిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తన కెరీర్ తమిళంలో పోక్కిరి, కావలన్, తెలుగులో లక్ష్మీ నరసింహ, రెడీ, ఘర్షణ, హిందీలో గజిని, హౌస్‌ఫుల్ 2 వంటి భారీ విజయాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఆసిన్, ఫిల్మ్‌ఫేర్, సైమా లాంటి అనేక అవార్డులను గెలుచుకుంది. తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన 2015 నుంచి చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా కనుమరుగైంది.అజిత్ భార్య శాలిని..తొలి రోజుల్లో బేబీ శాలినిగా గుర్తింపు పొందిన శాలిని అజిత్ కుమార్. 1980లలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఎంటే మమట్టిక్కుట్టియమ్మక్కు, టీవీ సిరీస్ అమ్లూ వంటి చిత్రాలలో బాలనటిగా మెప్పించింది. అంతేకాకుండా పలు క్లాసిక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ 2000 ఏడాదిలో నటుడు అజిత్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. 2002 తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది.నగ్మాతెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నగ్మా. 1990లో తమిళం, తెలుగు, హిందీ, భోజ్‌పురి సినిమాల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఘరనా మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి అల్లుడు లాంటి హిట్ సినిమాల్లో కనిపించింది. తమిళంలో కాదలన్, బాషా, మెట్టుకుడి, తమిళంలో చతురంగం, చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కానీ 2008లో తన సినీ కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలోనే నగ్మా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.గోపికమలయాళంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి గోపిక. ముఖ్యంగా ఫోర్ ది పీపుల్ అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా గోపిక తనదైన ముద్ర వేసింది. రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో అభిమానులను మెప్పించింది. అయితే 2008లో వివాహం తర్వాత గోపిక సినీ పరిశ్రమను పూర్తిగా విడిచిపెట్టేసింది.తెలుగులో స్టార్ హీరోయిన్..రంభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి యీది కాగా.. సినిమాలతో వచ్చిన గుర్తింపు వల్ల రంభగా మార్చుకుంది. 1990ల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగింది. అరుణాచలం, ఉల్లతై అల్లిత, క్రానిక్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో భైరవ ద్వీపం, బంగారు కుటుంబం, హిట్లర్, గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకెళ్తోన్న రంభ 2011లో నటనకు ఎండ్ కార్డ్ ఇచ్చేసింది. -
'పులి బిడ్డ' అంటూ అజిత్ కుమారుడి విజయంపై ప్రశంసలు
కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కుమారుడు ఆద్విక్ రన్నింగ్ రేసులో విజయం సాధించి ప్రథమ బహుమతి అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను అజిత్ ((Ajith Kumar)) సతీమణి షాలిని (Shalini) సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు రేసింగ్‌లో తండ్రి సత్తా చాటితే.. కుమారుడు రన్నింగ్ రేస్‌లో దుమ్మురేపుతున్నాడని, అదే రక్తం అంటూ..ఆద్విక్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అజిత్‌లాగే ఆయన కుమారుడు అద్విక్‌కి కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. తాజాగా అద్విక్ తమిళనాడు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటాడు. రన్నింగ్ రేస్, రిలే రేసులలో మొదటి స్థానంలో నిలిచి తండ్రికి తగిన కుమారుడని పేరు గడించాడు. ఏకంగా మూడు మెడల్స్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను షాలిని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పులికి పులినే పుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. తండ్రి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే.. కుమారుడు పాఠశాల నుంచి తన విజయాలను మొదలు పెట్టాడని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం గర్వపడేలా మంచి రన్నింగ్ రేసర్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తూ..శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను ప్రకటించిన అజిత్.. దుబాయ్ వేదికగా జరిగిన '24హెచ్ దుబాయ్' కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. పలు దేశాలకు చెందిన రేసర్లతో పోటీపడి హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడినప్పటికీ దానిని లెక్కచేయకుండా బరిలోకి దిగినందుకు గాను.. స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డుతో అజిత్‌ను గౌరవించారు. సినీ పరిశ్రమకు అజిత్ చేసిన సేవలకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో కేంద్రం గౌరవించింది. తాజాగా ఆయన్ను పద్మభూషణ్‌తో సత్కరించింది. తన విజయానికి, సంతోషానికి షాలినీ ప్రధాన కారణం అని అవార్డ్ వచ్చిన సందర్భంగా అజిత్ తెలిపారు. ఆయన నటించిన కొత్త సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న తెలుగు,తమిళ్లో విడుదల కానుంది. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
-
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది షాలిని పాసీ. ఈ రియాలిటీ షోతో ఆమె పేరు దశదిశల మారుమోగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తు చేసుకుంది. ప్రసవానంతరం వెన్నెముక గాయం బారినపడి స్పర్శ కోల్పోయిన క్లిష్ట పరిస్థితులు గురించి వెల్లడించింది. ఇక జీవితంలో తాను నృత్యం చేయలేదని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. అంతేగాదు ఆ పరిస్థితులను ఎలా అధిగమించి మాములు స్థితికి రాగలిగిందో కూడా వివరించింది. షాలిని పాసి(Shalini Passi) 20 ఏళ్ల వయసులో తన కొడుకు రాబిన్‌కి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వెనుముక గాయం కారణంగా వెన్ను నుంచి కాళ్ల వరకు స్పర్శ(sensation) కోల్పోయింది. ఇక ఆమె జీవితంలో నడవడం, నృత్యం(dance) చేయడం అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు వైద్యులు (Doctors). దీంతో ఒక్కసారిగా కళ్లముందు జీవితం చీకటిమయం అయ్యినట్లు అనిపించింది. ఇంతేనా తన పరిస్థితి అని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.జీవితాంతం వెన్నెముక ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిందేనని వైద్యులు చెప్పడంతో బాధతో తల్లడిల్లిపోయింది. నిజానినికి షాలినికి హిల్స్ వేసుకోవడం, డ్యాన్స్ చేయడం మహా ఇష్టం. అయితే ఇక్కడ షాలిని దిగులుతో కూర్చొండిపోలేదు. ఎలాగైనా ఆ బాధను అధిగమించాలని సంకల్పించుకుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకుంది. యోగా, ఆయుర్వేదం వంటి వాటితో కండరాలను బలోపేతం చేసుకునేలా శిక్షణ తీసుకుంది. అలా ఆమె వెనుముక సమస్యను జయించింది. ఇప్పటికీ తాను ఆయుర్వేద వైద్యుడి దగ్గరకే వెళ్తానని అంటోంది షాలిని. ఆయన తనకు ఎలాంటి మందులు ఇవ్వకుండానే నయం చేశారని చెబుతోంది. అలాగే చెకప్ కోసం ప్రతి ఐదు నెలలకొకసారి ఆ వైద్యుడిని కలుస్తానని అంటోంది. తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి తన వైద్య బృందం ఆశ్యర్యపోయినట్లు చెప్పుకొచ్చారు షాలిని. నిజంగా ఇది అద్భుతం. నడవగలగడం, నృత్యం చేయడం చూస్తుంటే నమ్మలేకపోతున్నామని వైద్యులే ఆశ్చర్యపోయారని షాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే తన కొడుకుతో గల అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన కొడుకుకి అక్కలా, స్నేహితురాలిలా ఉంటానని, అందువల్లే తన కొడుకు తనతో అన్ని ఫ్రీగా షేర్ చేసుకుంటాడని చెప్పుకొచ్చారు షాలిని. ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంతో ఫేస్చేస్తే తోకముడిచి తీరుతుందని షాలిని అనుభవం చెబుతోంది కదూ..!.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన నితిన్ భార్య (ఫోటోలు)
-
భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ ఒకడు. ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చేస్తున్నాడు. ఇతడి భార్య షాలిని.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. రీసెంట్గా తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. షూటింగ్ నిమిత్తం యూకేలో ఉన్న అజిత్.. భార్య పుట్టినరోజుకి రాలేకపోయాడు. అయితేనేం ఖరీదైన లగ్జరీ కారుని బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)నవంబర్ 20న షాలినీ.. తన పుట్టినరోజు నాడే లెక్సెస్ LM 350h మోడల్ కొత్త కారుతో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా అజిత్.. షాలినికి కారు బహమతిగా ఇవ్వడం బయటకొచ్చింది. మార్కెట్లో కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉందని తెలుస్తోంది. అంతకు ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు తన భర్తకు ఇష్టమని చెప్పి, డుకాటీ లేటెస్ట్ మోడల్ రేస్ బైక్‌ని షాలినీ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా భార్య, భర్తకు బహుమతి ఇవ్వగా.. ఇప్పుడు తిరిగి అతడి భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చాడు.ఇదంతా పక్కనబెడితే అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ సంక్రాంతి రేసులో ఉందని అంటున్నారు. అది కూడా 'గేమ్ ఛేంజర్'తో పాటు జనవరి 10నే థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తమిళనాడులో మాత్రం చరణ్ మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశముంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
24 ఏళ్ల తర్వాత కలిసిన హీరోహీరోయిన్
రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' క్రేజ్ వేరే లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన మాధవన్, షాలినీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది దాదాపు 24 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సందర్భంగా ఏంటో తెలీదు గానీ మాధవన్‌ని చాన్నాళ్ల తర్వాత కలిసి షాలినీ.. రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి 'ఎండ్రెండుం పున్నాగై' అని క్యాప్షన్ పెట్టింది. 'ఎప్పటికీ నవ్వడం' అని తెలుగులో దీనికి అర్థం. తమ అభిమాన జోడీని దాదాపు 24 ఏళ్ల తర్వాత చూసిన ఫ్యాన్స్.. సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. కామెంట్స్ పెడుతూ తమ ప్రేమని చూపిస్తున్నారు.ఇక మాధవన్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉండగా.. షాలినీ తమిళ హీరో అజిత్ ని 2000లో పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్
‘‘మా అమ్మ (శాలినీ) స్వగ్రామం కుందాపురానికి నన్ను తీసుకొచ్చి ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకోవాలనేది ఆమె చిరకాల కల.. అది ఎట్టకేలకు నెరవేరింది’’ అన్నారు హీరో ఎన్టీఆర్. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని ఎన్టీఆర్ శ్రావణ శనివారం సందర్భంగా దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లి శాలినీ, భార్య లక్ష్మీ ప్రణతి, కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కనకదాసు దర్శించుకున్న కనక కిటికీ ద్వారా అందరూ నల్లనయ్య (శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని దర్శించారు.దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ‘‘ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో అమ్మ (శాలినీ) కల ఎట్టకేలకు నెరవేరింది. అమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆమె బర్త్‌డేకి రెండు రోజుల ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆమెకు నేనిచ్చిన అత్యుత్తమ బహుమతి.విజయ్ కిరగందూర్ సార్‌కి (హోంబలే ఫిలింస్ అధినేత) థ్యాంక్స్. నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే నా ప్రియ మిత్రుడు రిషబ్ శెట్టి కూడా నాతో వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
భర్త తర్వాత భార్య
బెంగళూరు: ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమంటే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అన్నీ తానై వ్యవహరించడం. కర్నాటకలో ఈ కీలక పోస్టును భర్త తర్వాత భార్య చేపట్టే అరుదైన రికార్డును రజనీష్ గోయల్, శాలినీ రజనీష్ లు దక్కించుకున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రజనీష్ గోయల్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా శాలినిని నియమిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 1989 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ అయిన శాలిని గ్రామీణాభివృద్ధిలో పీహెచ్డీ చేశారు. మేనేజ్మెంట్, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారికతలపై పలు పుస్తకాలు రచించారు. రజనీష్ దంపతులకంటే ముందు కర్నాటకలో మరో జంట కూడా ప్రధాన కార్యదర్శులుగా పని చేసింది. 20 ఏళ్ల కిందట బి.కె.భట్టాచార్య, ఆయన భార్య థెరెసా భట్టాచార్యలు ఇద్దరూ సీఎస్‌లుగా చేశారు. -
ఆస్పత్రిలో స్టార్ హీరో భార్య.. అసలేమైంది?
కోలీవుడ్ స్టార్ అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే అజిత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా అజిత్ భార్య షాలిని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అజిత్ పక్కనే ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. లవ్ యూ ఫరెవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆమెకు ఏమైందని అజిత్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా మరేమైనా కారణాలున్నాయా? తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
23 ఏళ్లుగా సినిమాలకు దూరం.. స్టార్ హీరోతో పెళ్లి ఆపై రూ. 300 కోట్లతో..
కోలీవుడ్ హీరోయిన్ షాలిని చిన్నప్పటి నుంచి తన చురుకైన నటనతో అభిమానులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో బాలతారగా నటించిన షాలినిని బేబీ షాలిని అని ముద్దుగా పిలుచుకునేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కథానాయికగా వెలుగొందుతున్న షాలిని 1997లో విడుదలైన అనియతి ప్రవు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసింది. తమిళ్లో విజయ్ సరసన 'కాదలుక్కు మరియాధై' చిత్రంతో షాలిని తెరంగేట్రం చేసింది.తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన షాలిని తమిళంలో తన తదుపరి చిత్రంలో అజిత్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అజిత్, షాలినీ కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్కాలం’. శరణ్ దర్శకుడు. 1999 ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా విడుదలై విజయం సాధించడంతో వారి రొమాన్స్ కూడా అలాగే సాగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన సఖి చిత్రంతో ఈ జోడీ మరింత పాపులర్ అయింది. సినీరంగంలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో అదే ఏడాదిలో అజిత్- షాలిని వివాహం చేసుకున్నారు. అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. బాలనటిగా దక్షిణాదిలో రాణించి ఆపై టాప్ హీరోయిన్ స్థాయికి షాలినీ చేరుకుంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగానే ఉంది. అలా సినిమా నుంచి తప్పుకున్న 23 ఏళ్ల తర్వాత కూడా శాలినికి సినిమా ఛాన్స్‌లు వచ్చాయి కానీ, సున్నితంగా వాటిని ఆమె తిరష్కరించింది. తన పిల్లలు అనుష్క (16), అద్విక్ (09) చదువు విషయంలో ఆమె ఎక్కువగా సమయం కేటాయిస్తుంది. తమిళంలో కేవలం 5 సినిమాల్లోనే షాలిని హీరోయిన్గా నటించినా.. ఆ కాలంలో రూ. 50 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. అజిత్, షాలినీల ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే తిరుగులేని హీరోయిన్గా కొనసాగిన షాలిని చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. -
'దయచేసి అది నమ్మొద్దు'.. ఫ్యాన్స్‌ను కోరిన స్టార్ హీరో భార్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. దీంతో పాటు విడాయమర్చి అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అయితే అజిత్ నటి షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2000లో అజిత్ కుమార్- షాలిని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా షాలిని పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా బయటపడింది. ఈ విషయాన్ని షాలిని అజిత్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరికీ నా మనవి.. ఇది నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్ కాదు.. దయచేసి ఎవరూ కూడా నమ్మి ఫాలో అవ్వొద్దు. ధన్యవాదాలు' అంటూ అభిమానులను కోరింది. షాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. (ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024 -
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్‌గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్‌తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్‌కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్‌లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్‌కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్‌కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్‌కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది. -
విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
పంజాబ్ చెందిన రాపర్ సింగర్ యో యో హనీ సింగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వివాహా బంధానికి ముగింపు పలికారు. తాజాగా యో యో హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్లకు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా.. జనవరి 2011లో షాలిని తల్వార్‌ను హనీ సింగ్ వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) కాగా.. 2021లో తన భర్త హనీ సింగ్‌పై షాలిని గృహ హింస కేసు పెట్టింది. అంతే కాకుండా అతనికి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దీంతో ఈ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో షాలినికి కోటి రూపాయల చెక్కును భరణంగా ఇచ్చాడు హనీ సింగ్. కాగా.. సింగర్ ప్రస్తుతం నటి, మోడల్ టీనా థడానీతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. హనీ సింగ్ పంజాబీతో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాలకు పాటలు పాడారు. అతని అసలు పేరు హిర్దేశ్ సింగ్ కాగా.. యో యో హనీ సింగ్ పేరుతో ఫేమస్ అయ్యారు. అతను 2003లో రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత పంజాబీ సంగీతంలో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) -
ఆత్మహత్యకు అసిస్టెంట్ మేనేజర్ శాలిని కారణమని ఆరోపణ
-
పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లిన అజిత్..
తమిళ చిత్రసీమలో జెంటిల్మన్ గుర్తింపు ఉన్న అతికొద్ది మంది నటుల్లో హీరో అజిత్ కుమార్ ఒకరు. అజిత్ తన కెరీర్‌తో పాటు కుటుంబ జీవితంలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తున్నాడు. అజిత్ లాంటి భర్త కావాలని కోలివుడ్లో కలలు కనే యువతులు ఎందరో ఉన్నారు.పెళ్లయి 23 ఏళ్లు గడిచినా అజిత్‌కు భార్య షాలినిపై ప్రేమ తగ్గలేదు. ఆదర్శ జంటల జాబితాలో అజిత్- షాలిని పేరు మొదటగా వినిపిస్తుంది. కానీ అజిత్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. ఆయనకు వచ్చిన స్టార్‌డమ్‌ని తలకు ఎక్కుంచుకునే వ్యక్తి కాదు. అజిత్ ఒక సినిమాని పూర్తి చేసిన తర్వాత, దాని గురించి అన్ని ఆలోచనలను విడిచిపెట్టి, తనకు ఇష్టమైన బైక్‌పై రైడ్‌కు వెళతాడు. అజిత్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం ఎప్పుడూ వేదికపైకి కూడా రాడు. అజిత్ తన అభిరుచిని కొనసాగించడంలో భార్య షాలిని నుంచి ఎక్కువ మద్దతు ఉంది. అజిత్ షాలినిని సినిమా ద్వారా సంపాదించిన నిధిగా చూస్తాడు. అజిత్ 2000లో షాలినిని పెళ్లాడాడు. అమర్కలం సినిమాలో షాలినితో కలిసి నటించిన తర్వాతే అజిత్ ప్రేమలో పడ్డాడని, ఆ విషయాన్ని షాలినితో చెప్పాడు. తరువాత, రెండు కుటుంబాలు ఈ సంబంధానికి మద్దతు ఇచ్చాయి. తర్వాత పెళ్లితో అజిత్- షాలిని కలిసి జీవితాన్ని ప్రారంభించారు. (నటి హీరా రాజగోపాల్‌తో అజిత్) అజిత్‌కు సినిమా ఛాన్స్‌లు ఇప్పించిన హీరోయిన్ షాలిని కంటే ముందు అజిత్ మరొక హీరోయిన్‌తో రొమాన్స్ చేశాడని కోలీవుడ్‌లో ప్రచారంలో ఉంది. తమిళ నటి హీరా రాజగోపాల్‌తో అజిత్ ప్రేమలో ఉన్నాడని అప్పట్లో భారీగానే వార్తలు వచ్చాయి. ఆమె తెలుగు మూలాలు ఉన్నా కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అజిత్ కెరియర్ ప్రారంభంలో ఆమె పలు సినిమా అవకాశాలు ఇప్పించినట్లు ప్రచారం ఉంది. అయితే వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో హీరాతో అజిత్ బ్రేకప్ చెప్పేశాడట. ప్రేమ బ్రేకప్ అయిన తర్వాత అజిత్ జీవితంలోకి షాలిని వచ్చిందని టాక్. ఇదే విషయాన్ని కోలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ ఇలా వెల్లడించారు. (ఇదీ చదవండి: సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?) '1996లో తమిళ్లో వచ్చిన 'వాన్మతి' సినిమాలో హీరోయిన్గా నటించిన స్వాతిని కూడా అజిత్ ప్రేమించాడు. ఒకానొక సమయంలో స్వాతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో అజిత్ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు. అయితే దీనికి నటి కుటుంబం అంగీకరించకపోవడంతో అజిత్ ఆ సంబంధాన్ని విడిచిపెట్టాడు' అని బెయిల్వాన్ రంగనాథన్ చెప్పారు. కానీ అజిత్ జీవితంలో తొలిప్రేమ మాత్రం హీరా రాజగోపాల్ అనే ఆయన చెప్పాడు. అప్పట్లో మోహన్‌లాల్ నిర్వాణం చిత్రంలో కథానాయికగా నటించి మలయాళీ హృదయాలను కొల్లగొట్టిన నటి ఆమె. హీరాకు అప్పట్లో భారీగా ఫ్యాన్స్ ఉండేవారు. (వాన్మతి నటి స్వాతితో అజిత్) హీరాతో అజిత్ గాఢమైన ప్రేమలో ఉన్నాడని. ఆమెను అజిత్ పెళ్లి చేసుకోనున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ కూడా చాలా చనువుగా ఉండేవారని పలు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన 'కథల్ కొట్టాయ్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. సెట్లో హీరాకు అజిత్ ప్రేమలేఖలు కూడా రాసినట్లు పుకార్లు వచ్చాయి. తర్వాత వారిద్దరితో బ్రేకప్ అవడంతో.. 2000 సంవత్సరంలో అజిత్-షాలినిని పెళ్లి చేసుకోవడం జరిగినట్లు వార్తలు వచ్చాయి. (షాలినితో అజిత్ పెళ్లి ఫోటోలు) అజిత్ ఎవరితో జోడీ కట్టినా షాలినీకి ఎవరూ సాటిరారని, అజిత్‌కి షాలినీ పర్ఫెక్ట్ పెయిర్ అని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అజిత్‌తో వివాహం అయిన తర్వాత శాలిని నటనకు దూరమైంది. ఇప్పుడు షాలిని మంచి కుటుంబ మహిళగా తన పాత్ర పోషిస్తుంది. తాజాగా షాలిని సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. షాలిని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండటంతో అభిమానులు అజిత్‌కు సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. తునివ్ (తెగింపు) అజిత్ నటించిన చివరి సినిమా.. తన తర్వాతి ప్రాజెక్ట్ విధముయిర్చి ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతుంది. -
కేబుల్‌రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
ఆ నెలలోనే వరుణ్- లావణ్య పెళ్లి.. అతిథుల లిస్ట్‌లో టాలీవుడ్ జంట!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేడుక మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి. ఇప్పటికే పెళ్లి తేదీపై చాలా ఇంటర్వ్యూల్లో వరుణ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. పెళ్లి తేదీ ఇంకెప్పుడు ప్రకటిస్తారంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీని అమ్మ నిర్ణయిస్తుందని ఇటీవల ఓ ఇంటరాక్షన్ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్-లావణ్య వివాహాం జరిగేలా కనిపిస్తోంది. (ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!) అయితే ఇప్పుడు వేదికతో పాటు ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖుల ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. వరుణ్, లావణ్యకు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, స్నేహితులు చాలామందే ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథుల లిస్ట్‌లో హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పెళ్లిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు ఇతర నటీనటులు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖుల గెస్ట్ లిస్ట్ గురించి మరిన్నీ ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి వేదికతో పాటు తేదీ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ పెళ్లికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 9న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. (ఇది చదవండి: లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్! ) -
పట్టణంలో వినోదం
సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ని మేకర్స్‌కు అందించారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్లో జరిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూట్‌కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్‌ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల. -
నితిన్ కౌగిలిలో భార్య షాలిని.. క్యూట్ పెయిర్ ఫోటోలు
-
టార్చర్.. రోజూ కొట్టేవాడు, పార్కింగ్ ప్లేస్‌లో పడుకునేదాన్ని: నటి
పుట్టినరోజు, పెళ్లిరోజు, ప్రేమికుల రోజు.. కాదేదీ సెలబ్రేట్ చేసుకోవడానికి అనర్హం అన్నట్లుగా బోలెడన్ని స్పెషల్ డేలు ఉన్నాయి. స్పెషల్ డే రోజు స్పెషల్ షూట్ సరేసరి. ఈ మధ్య అయితే ప్రీవెడ్డింగ్ షూట్, మెటర్నటీ షూట్.. ఇలా అనేక రకాల ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు. అయితే తమిళ బుల్లితెర నటి షాలిని మాత్రం వినూత్నంగా విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త పీడ విరగడైందన్నట్లుగా అతడి ఫోటోలు చింపుతూ ఇన్నాళ్లకు విముక్తి లభించిందన్నట్లుగా ఫోటోలకు పోజులిచ్చింది. ఇది చూసి కొందరు విస్తుపోగా ఆమె బాధ అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ నటి తను విడాకులు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందో వెల్లడించింది. అంతేకాదు ఆ ఫోటోషూట్ పబ్లిసిటీ కోసం చేయలేదని, తనలాంటి మహిళలకు ఓ మెసేజ్‌గా ఉపయోగపడాలని భావించానంది. భర్త పెట్టిన టార్చర్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'దుబాయ్‌లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్‌లో వచ్చి పడుకునేదాన్ని. ఎందుకంటే గొడవను పెద్దది చేయకుండా, దాన్ని ఆపేయడానికే ప్రయత్నించేదాన్ని. అంతకుమించి ఏం చేయాలో తెలియకపోయేది. ఒక్క క్షణం పోలీసుల దగ్గరకు వెళ్దామా.. అనిపించినా మళ్లీ అతడి జీవితం నాశనం అవుతుంది కదా అని నేను అడ్జెస్ట్ అయిపోయేదాన్ని. అలా అతడు కొట్టినప్పుడల్లా కింద పార్కింగ్ ప్రదేశంలో పడుకునేదాన్ని. తెల్లారాక ఇంటికి వెళ్లేదాన్ని. 2019 వరకు నాలుగేళ్లదాకా అతడితో దెబ్బలు తిన్నాను. అన్నేళ్లు తిన్న దెబ్బలను ఆరోజు అతడికి తిరిగివ్వాలనిపించింది. తిరగబడ్డాను, కొట్టాను. 'ఇన్ని రోజులు నా పాప కోసం ఆలోచించి మర్యాద ఇస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నా బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా రాక్షసుడిలా మారి తన ముందే నన్ను కొట్టావు.. ఇకపై నీలాంటి తండ్రి తనకు అవసరం లేదు' అని ముఖం మీదే చెప్పాను. అతడిపై చేయి చేసుకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. అయినా ధైర్యంగా నేను వెళ్లడం కుదరదు.. కావాలంటే నువ్వే వెళ్లిపో అని చెప్పాను' అంటూ తను అనుభవించిన నరకం గురించి చెప్పుకొచ్చింది. కాగా ముల్లుమ్ మల్లురమ్ సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకున్న షాలిని సూపర్ మామ రియాలిటీ షోలోనూ మెరిసింది. ఆమె రియాజ్‌ను పెళ్లాడగా వీరికి రియా అనే కుమార్తె ఉంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధించడంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవలే న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంతో ఫోటోషూట్ నిర్వహించి మరీ సంబరాలు జరుపుకుంది నటి. View this post on Instagram A post shared by shalini (@shalu2626) చదవండి: వెకేషన్లో దిల్ రాజు కుమార్తె, ఫోటోలు వైరల్ -
విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!
ఎవరైనా వేడుకలు చేసుకోవాలంటే ఓ సందర్భం అంటూ ఉండాలి. బర్త్ డే, మ్యారేజ్ డే, ఇంకా ఏదైనా స్పెషల్ డేస్‌లో పార్టీ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని బాధాకరమైన సందర్భాలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎక్కువగా వేడుకలు జరుపుకోవడం మనం చూస్తుంటాం. ఇవన్నీ పక్కనే పెడితే వీరిపై విడాకుల వార్తలు ఎక్కవగా వింటుంటాం. (ఇది చదవండి: తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ) ఎవరైనా సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటే వారితో పాటు అభిమానులు బాధపడతారు. కానీ అందుకు భిన్నంగా విడాకుల అలాగే తాజాగా ఓ బుల్లితెర నటి విడాకులు తీసుకుంది. అయితే ఈ విషయానికి ఆమె ఎలాంటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా ఈ సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా ఫోటో షూట్ నిర్వహించింది. ఇంతకీ ఆమె ఎవరో ఓ లుక్కేద్దాం. తమిళ ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి షాలిని ముల్లుమ్ మల్లరుమ్ అనే తమిళ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. జీ తమిళ్లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలో కూడా కనిపించింది. అయితే గతంలో రియాజ్‌ను వివాహం చేసుకున్న షాలినికి రియా అనే కుమార్తె కూడా ఉంది. కొన్ని నెలల క్రితం షాలిని భర్త రియాజ్ తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు విడాకులు మంజూరు కావడంతో ఫోటో షూట్ నిర్వహించి మరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది బుల్లితెర నటి. (ఇది చదవండి: అలాంటి వారిని పూర్తిగా వదిలేయండి.. రష్మీ పోస్ట్ వైరల్) షాలిని తన ఇన్‌స్టాలో రాస్తూ..'విడాకులు తీసుకున్న వారికి ఇదే నా సందేశం. వివాహాబంధాన్ని విడిచిపెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఇలాంటి వాటిని ఎదుర్కొవాల్సిందే. విడాకుల తీసుకుంటే మనం ఫెయిల్ అయినట్లు కాదు. మీ లైఫ్‌లో ఇది టర్నింగ్ పాయింట్. మీ జీవితంలో సానుకూల మార్పులకు సంకేతం. ఇలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే నాలాగా ధైర్యవంతులైన మహిళలందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. మాజీ భర్త ఫోటోను చింపివేస్తూ మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. విడాకులు తీసుకోవడాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా నెటిజన్స్ అవాక్కవుతున్నారు. View this post on Instagram A post shared by shalini (@shalu2626) -
దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, ఫొటోలు వైరల్
తమ చిత్రాలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గల్లాపెట్టెలను నింపే నటుల్లో అజిత్ ఒకరు. అయితే ఈయన ఇతర నటులకు పూర్తిగా భిన్నం. చిత్ర పరిశ్రమకు చెందిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఏ చిత్ర వేడుకల్లోనూ పాల్గొనరు. అసలు తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అజితే. తనూ, తన వృత్తి, ప్రవృత్తి, తన కుటుంబం అదే ఈయన లోకం. అందుకే విమర్శలు, వదంతులు అజిత్ దరిచేరవు. ఇక ఆయన జీవిత భాగస్వామి శాలిని గురించి చెప్పాలంటే ఈమె బాల్యంలో లిటిల్ సూపర్ స్టార్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం ఇలా పలు భాషల్లో నటించి తన నటనతో వావ్ అనిపించుకున్నారు. కథానాయకిగా కొన్ని చిత్రాల్లో నటించారు. అలా అద్భుతం అనే చిత్రంలో అజిత్‌తో జతకట్టారు. అప్పుడు వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత శాలిని నటనకు స్వస్తి పలికి కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కాగా అందరిలాగా అజిత్ శాలిని దంపతులు తరచూ బయట ప్రపంచంలోకి రారు. అది నటుడు అజిత్‌కు ఇష్టం ఉండదు. తనకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పరచుకొని అందులోనే తన సంతోషాన్ని వెతుక్కుంటారాయన. ఈయన నటన తర్వాత ఇష్టపడేది బైక్ రేస్. అలా స్టేట్ లెవెల్ బైక్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. ఇక విషయానికి వస్తే.. చాన్నళ్ల తర్వాత అజిత్, శాలిని దంపతులు విహారయాత్రలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవును అజిత్ తన భార్య శాలినితో కలిసి ఇటీవల విహారయాత్ర కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ సముద్రంలో బోట్లో విహరిస్తున్న ఫోటోలు నెటిజన్లను చేతినిండా పని చెబుతున్నాయి. కాగా తుణివు చిత్రంతో భారీ హిట్ కొట్టిన అజిత్ త్వరలో తన 62వ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు. -
విడాకుల రూమర్స్‌పై స్పందించిన స్టార్ కపుల్!.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ కపుల్స్‌లో అజిత్-షాలిని ఒకరు. అయితే కొద్దిరోజులుగా వీరికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 22ఏళ్ల అజిత్-షాలినిల వివాహ బంధంలో కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయని, త్వరలోనే వీరి విడాకులు తీసుకోనున్నారంటూ కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. దీంతో బెస్ట్ కపుల్స్‌గా ఉన్న అజిత్-షాలినిలు విడిపోవడం ఏంటని అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న ఈ రూమర్స్‌కి అజిత్-షాలినిలు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవలె అజిత్‌తో ఉన్న వరుస ఫోటోలను షాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా ఓ వెకేషన్‌కు సంబంధించి భర్తతో కలిసి ఉన్న పిక్స్‌ని పోస్ట్ చేసి పరోక్షంగా దీనిపై స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా అజిత్-షాలినిల విడాకుల ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అజిత్ ‘తునీవు'(తెగింపు) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
షాలినితో పెళ్లి వద్దని అజిత్‌కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్!
కోలీవుడ్‌లోని ప్రముఖ జంటల్లో అజిత్ కుమార్-షాలిని ఒకరు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన షాలిని తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఈ క్రమంలో అమర్కలం(1999) మూవీలో తొలిసారిగా అజిత్‌తో జోడీ కట్టింది. నిజానికి ఈ సినిమా చేయడానికి మొదట షాలిని ఒప్పుకోలేదు. తాను చదువుకోవాలని కాబట్టి ఈ సినిమా చేయలేనని చెప్పేసింది. దీంతో నిర్మాతలు హీరోనే రంగంలోకి దిగమని సూచించారు. అలా అజిత్ తనగురించి పరిచయం చేసుకుంటూ ఆమెతో కలిసి పనిచేయాలని ఉందంటూ చాలాసేపు తనను ఒప్పించే ప్రయత్నం చేసి చివరకు సఫలమయ్యాడు. ఈ సినిమా షూటింగ్లో అజిత్ అనుకోకుండా ఆమె మణికట్టుకు గాయం చేయడం, తరచూ తన పరిస్థితి గురించి ఆరా తీసే క్రమంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా రిలీజైన మరుసటి ఏడాదే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే అప్పట్లో అజిత్తకు షాలినిని పెళ్లి చేసుకోవద్దని సూచించాడట డైరెక్టర్ రమేశ్ ఖన్నా. జనాలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు, ఆ షాలినిని పట్టించుకోవద్దు అని చెప్పాడట. కానీ అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం రమేశ్‌కు తెలియదు. దీంతో మరో డైరెక్టర్ శరణ్.. హీరోకే వార్నింగ్ ఇస్తున్నావు, తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి అని హెచ్చరించాడట. అప్పుడు కానీ రమేశ్‌కు వారు ప్రేమలో ఉన్నారని తెలిసిరాలేదు. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 24న జరిగిన అజిత్ పెళ్లికి కూడా వెళ్లి దంపతులను ఆశీర్వదించాడు. ఇక పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే! -
హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని నితిన్ భార్య షాలిని (ఫొటోలు)
-
అజిత్ కూతురు అనౌష్కను చూశారా? ఎంత అందంగా తయారైందో!
తమిళ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ అజిత్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇండస్ట్రీలో ఆయనకు వివాదా రహితుడు. పొగడ్తలైన, విమర్శలనై ఒకేలా తీసుకుంటూ తన పనేంటో తాను చూసుకుంటాడు. ఇక తన పని తర్వాత అజిత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది కుటుంబానికే. హీరోగా ఎంత బిజీగా కుటుంబానికి ఎప్పుడు సమాయాన్ని కెటాయిస్తాడు. చదవండి: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ ముఖ్యంగా పండుగలు, పుట్టిన రోజు వేడుకుల, స్పెషల్ డేస్ అసలు మిస్ అవ్వడు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. అయితే అజిత్ కుటుంబం విషయంలో చాలా గోప్యత పాటిస్తాడనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషమాలను, కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయమైన బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపడు. ఈ నేపథ్యంలతో న్యూ ఇయర్‌ను కుటుంబంతో కలిసి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. భార్య షాలిని, కూతురు అనౌష్క, కుమారుడు ఆద్విక్లతో కలిసి విదేశాల్లో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇందులో అజిత్ కూతురు అనుష్క స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మీడియా ముందు పెద్దగా కనిపించని అనౌష్క హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కనిపించి షాకిచ్చింది. మీడియాకు, సోషల్ మీడియా దూరంగా ఉండే అజిత్ కూతురు సడెన్‌గా ఇలా కనిపించడంతో ఆమె హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె ఏం చేస్తుంది, ఏం చదువుతుంది, సినిమాల్లోకి ఎప్పుడు ఇస్తుంది? అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ View this post on Instagram A post shared by வீர சென்னை (@ajithkumar_fansclup) -
సిరిసిల్ల: షాలిని ప్రేమ-పెళ్లి వ్యవహారం సుఖాంతం?!
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారిన యువతి కిడ్నాప్ వ్యవహారం.. ఆపై ఇష్టపూర్వక వివాహంగా మారి ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని షాలిని ప్రకటించడం, ఆమెను బెదిరించి ఉంటారన్న తల్లిదండ్రుల అనుమానాలతో కేసు ఉత్కంఠగా మారింది. అయితే.. సాయంత్రం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను కలిసిన నవ దంపతులు.. రక్షణ కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో.. ఆ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించిన ఆయన.. పెద్దలను పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. తన ఇష్ట ప్రకారమే తన ప్రియుడితో వెళ్లానని తెలిపిన ఎస్పీకి షాలిని వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాదు నాలుగైదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఏడాది కిందట ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే.. షాలిని అప్పటికి మైనర్ కావడంతో.. వివాహం చెల్లదని చెబుతూ పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. ఈ క్రమంలో.. మైనార్టీ తీరాక వివాహం చేసుకుందామని షాలినితో చెప్పాడు జ్ఞానేశ్వర్. త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని ఆమెకు ముందుగానే సమాచారం ఇచ్చాడు. అయితే.. షాలిని గుడికి వెళ్తుందనే సమాచారం జానీకి ముందే తెలుసు!. అందుకే ఆమెను తీసుకెళ్లే యత్నం చేశాడట. కానీ.. ముఖానికి అడ్డుగా కర్చీఫ్ ఉండడంతో ఎవరో అనుకుని ఆమె భయపడి ప్రతిఘటించినట్లు షాలిని వెల్లడించింది. తీరా కారులోకి వెళ్లాక.. అది అతనే అని తెలిసి వెంట వెళ్లినట్లు చెప్పింది. తమ ఇష్టప్రకారమే వివాహం జరిగిందని, తల్లిదండ్రుల నుంచి ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని ఆ నవ దంపతులు జిల్లా ఎస్పీని కోరారు. దీంతో.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కిడ్నాప్ గురైందనుకున్న యువతి షాలిని.. పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మా బిడ్డను మా ముందు నిలబెట్టండి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నానని చెప్తున్న షాలిని వ్యవహారంలో తమ గోడును కూడా వినాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బలవంతంగా షాలినిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని ఉంటాడని, తమ బిడ్డను తమ ముందు నిలబెడితే అసలు విషయం తేలుతుందని షాలిని తల్లిదండ్రులు వాపోతున్నారు.భయపెట్టి లేదంటే తమను చంపుతామని బెదిరించి.. తమ కూతురితో జానీ అలా చెప్పించి ఉంటారని షాలిని తల్లిదండ్రులు చంద్రయ్య-పద్మ ఆరోపిస్తున్నారు. -
ఎంగేజ్మెంట్ అయిన మరునాడే యువతి కిడ్నాప్ కలకలం..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే యువతి మైనర్‌గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో పోక్సో కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు -
Shalini: ఆమె ముసుగు వెనుక ధైర్యం
భుజాన బ్యాగ్‌తో ఆమె అందరిలాగే కాలేజీకి వెళ్లింది. క్యాంటీన్లో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసింది. అమ్మాయి కావడంతో.. సాధారణంగా కొందరు యువకులు నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమె కూడా వాళ్లతో ఫోన్ ఛాటింగ్‌లతో గడిపింది. సరదాగా క్లాసులు బంక్ కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లింది. ఇంతా స్టూడెంట్ అనే ముసుగులోనే! కానీ, ఆ ముసుగు వెనుక అసలు రూపం మొన్నటిదాకా ఎవరికీ తెలియదు. షాలినీ చౌహాన్.. గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. స్టూడెంట్ ముసుగుతో ర్యాగింగ్ భూతం.. కొమ్ములు వంచిన ఈ ఖాకీ చొక్కాకి, ఆ ప్రయత్నంలో ఆమె ప్రదర్శించిన తెగువకి దేశం మొత్తం సలాం కొడుతోంది. మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అయిన షాలినీ చౌహాన్(24).. స్టూడెంట్ వేషంలో ర్యాగింగ్ చేసేవాళ్లను పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఇండోర్ మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో ఆమె ర్యాగింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. మూడు నెలలుగా కాలేజీ క్యాంపస్‌లోనే స్టూడెంట్ ముసుగులో ఆమె ఇండోర్ పోలీసులు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్‌లో పాల్గొంది. పదకొండు మంది సీనియర్లు ర్యాంగింగ్ పేరిట వేధిస్తున్న వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది ఆమె. దీంతో.. ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్స్పెక్టర్ తజీబ్ ఖ్వాజీ నేతృత్వంలో.. కానిస్టేబుల్ షాలినీ ఈ ఆపరేషన్‌కు దిగింది. తరచూ ఆ కాలేజీలో జూనియర్ల నుంచి ర్యాగింగ్ వ్యవహారం దృష్టికి వస్తుండడం.. అవి మరీ శ్రుతి మించి ఉంటోందన్న విషయం తెలియడంతో పోలీసులు క్యాంపస్‌లో పర్యటించారు. అయితే భయంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్టూడెంట్ మాదిరి ఉన్న షాలినీ రంగంలోకి దించారు ఖ్వాజీ. షాలినీ, మరికొందరు కానిస్టేబుల్స్‌తో కలిసి క్యాంపస్‌లో సివిల్ డ్రెస్‌లో కలియదిరిగింది. విద్యార్థులతో మాట్లాడడం మొదలుపెట్టింది. తాను విద్యార్థుల్లో కలిసి పోయింది. జూనియర్లు, సీనియర్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. ర్యాంగింగ్ మరీ దారుణంగా ఉంటుందని గుర్తించింది. ఈ క్రమంలో.. ర్యాంగింగ్కు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించింది. తన ఐడెంటిటీ రివీల్ చేయకుండానే వివరాలను సేకరించింది. అయితే.. ఈ మూడు నెలల కాలంలో ఎవరికైనా అనుమానం రాలేదా? అని షాలినీని అడిగితే.. టాపిక్ మార్చేదానినని చెప్పిందామె. అమ్మాయిని కావడంతో.. స్టూడెంట్స్ కొందరు సొల్లు కార్చుకుంటూ మాట్లాడేవారని, అదే తనకు బాగా కలిసి వచ్చిందని చెప్తోందామె. -
విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే.. గర్ల్‌ఫ్రెండ్‌తో సింగర్ షికార్లు
బాలీవుడ్ స్టార్ సింగర్, రాపర్ యోయో హనీసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. భార్య షాలినీ తల్వార్‌తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే ఇప్పుడు మరో గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కి హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానిని చేయి పట్టుకొని వేదిక వద్దకు తీసుకెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. టీనా తడానీ ఎవరా అని సెర్చ్ చేయగా ఆమె ఒక మోడల్ అని తెలిసింది. అంతేకాకుండా రీసెంట్గా రిలీజైన హనీసింగ్ మ్యూజిక్ ఆల్భమ్లోనూ ఆమె కనిపించింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో హనీసింగ్ తన ప్రేమ గురించి ఓపెన్‌గానే బయటపెట్టేశిన సంగతి తెలిసిందే. 'ఆమె రూపంతో పాటు మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది. నా గతం గురించి అన్నీ తెలిసి కూడా నన్ను అంగీకరించింది. చాలా కాలంగా నేను సంతోషంగా లేను. కానీ ఆమె నా జీవితంలోకి వచ్చాక చాలా ఆనందంగా, రొమాంటిక్‌గా ఉంటున్నా. అందుకే నా కొత్త ఆల్భమ్ సాంగ్ ఆమెకి డెడికేట్ చేస్తున్నా' అంటూ హనీసింగ్ పేర్కొన్నాడు. అయితే ఆమె పేరు చెప్పడానికి ఆరోజు అంగీకరించని హనీసింగ్.. ఢిల్లీ ఈవెంట్లో మాత్రం టీనాను గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. దీంతో వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. .@asliyoyo Introduce His New GF Tina 🔥 Watch full Video : https://t.co/wOZDycy7dk#Yoyohoneysingh #Honeysingh #Honeysinghgirlfriend @Yoyohon86350823 #HoneySingh pic.twitter.com/zjz4lA4Hvi — Himanshu Aswal (Artist) (@Himanshaswal) December 7, 2022 -
ఒక్కసారి నవ్వండి.. ఇక నవ్విస్తూనే ఉంటారు!
ప్రపంచంలో ఉచితంగా దొరికే విలువైన ఔషధం ఏమిటో తెలుసా? నవ్వు! నవ్వా?! అని హాశ్చర్యపడకండి. ఇది నిజం. ఒక్కసారి నవ్వి చూడండి. మీలో ఉన్న ‘టెన్షన్’ ‘ఒత్తిడి’ ‘బాధ’ అనే మహా సముద్రాలు చుక్క నీరు లేకుండా ఎండిపోతాయి. మనసు హాయిగా ఆకాశంలో తేలిపోతుంటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉచితంగా మన ఒంట్లోకి వచ్చి చేరుతుంది. నవ్వే వాళ్లు–నవ్వించే వాళ్లు అనేది ఒకప్పటి మాట. అయితే చెన్నైలోని ‘ది హిస్టీరికల్’లాంటి క్లబ్‌లు ఇద్దరి మధ్య ఉన్న రేఖను తొలగించాయి. ఇక్కడ అందరూ నవ్వించేవాళ్లే. నవ్వులను హాయిగా ఆస్వాదించేవాళ్లే! చెన్నైలోని ఫస్ట్ ఆల్–ఉమెన్ ఇంప్రొవైజేషన్ థియేటర్ ‘ది హిస్టీరికల్’ ప్రత్యేకత ఏమిటంటే ప్రేక్షకులు నవ్వడంతోపాటు నవ్వించేలా చేయడం. ప్రేక్షకులు ఒక ఐడియా చెబితే దాని నుంచి ఆశువుగా హాస్యాన్ని పుట్టిస్తారు. ఇది మాత్రమే కాదు ఫన్–యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఉదా: స్పిన్ ఏ యాన్–ఒక పదం చెబితే దాన్ని నుంచి సన్నివేశాలను, హాస్యాన్ని సృష్టించడం. జిప్ జాప్ జోప్–ప్లేయర్స్ తమలో అపారమైన శక్తి ఉందని నమ్ముతుంటారు. దాన్ని ఇతరులకు పంచి, ఇలా చెయ్యి... అని చెబుతుంటారు. డబుల్ ఎండోమెంట్–మూడో ప్లేయర్‌కు ఏం చెప్పాలనేది ఇద్దరు ప్లేయర్స్ రహస్యంగా మాట్లాడుకుంటారు. ‘ది హిస్టీరికల్ క్లబ్’ అనేది షాలిని విజయకుమార్ మానసపుత్రిక. ఒకప్పుడు చెన్నైలోని ‘హాఫ్–బాయిల్డ్ ఇంక్’ ఇంప్రూవ్ కామెడీ గ్రూప్‌లో పనిచేసింది. ఆ గ్రూపులో తానొక్కరే మహిళ. ‘కామెడీ ఫీల్డ్‌లోకి ఎంతోమంది మహిళలు రావాలనే కోరికతో ది హిస్టీరికల్ క్లబ్‌ను ప్రారంభించాను. స్త్రీలలో సహజంగా నవ్వించే గుణం ఉంటుంది. అయితే ఆ ప్రతిభను తమ సన్నిహితుల దగ్గర మాత్రమే ప్రదర్శిస్తారు. అంతర్జాతీయ, దేశీయ క్లబ్‌ల నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభించిన ‘ది హిస్టీరికల్’ మా నమ్మకాన్ని నిలబెట్టింది’ అంటుంది శాలిని. శాలిని మొదట తన ఐడియాను నటుడు కార్తీక్‌తో పంచుకున్నప్పుడు ‘బాగుంటుంది’ అని ప్రోత్సహించాడు. ఆ తరువాత అమృత శ్రీనివాసన్‌తో కలిసి, మన దేశంలోనే పెద్దదైన ‘ఇవమ్’ స్టాండప్–కామెడీ మూమెంట్ సహకారంతో ‘ఫీల్ ఫ్రీ టూ బీ ఫన్నీ’ కామెడీ క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని ద్వారా ‘ది హిస్టీరికల్ క్లబ్’కు అవసరమైన పదమూడుమంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. ‘ఇంప్రొవైజేషనల్ థియేటర్ లేదా ఇంప్రూవ్ అనేది కామెడీలోని సబ్ జానర్. చిన్న స్టోరీ లైన్ చెబితే అప్పటికప్పుడు హాస్యాన్ని పుట్టించే కళ. మనలోని సృజనాత్మకశక్తులను ప్రదర్శించడానికి వేదిక’ అంటుంది ‘ది హిస్టీరికల్’ సభ్యులలో ఒకరైన జిక్కీ నాయర్. ‘నవ్విపోదాం’ అని ప్రేక్షకులుగా వచ్చినవాళ్లు ఇతరులను నవ్వించడం అనేది అంత తేలిగ్గా ఏమీ జరగదు. మొదట బిడియ పడతారు. వాతావరణానికి అలవాటుపడతారు. ఆ తరువాత ఆత్మవిశ్వాసంతో తమలోని సృజనకు రెక్కలు ఇస్తారు. హాయిగా నవ్విస్తారు. ‘ఇప్పుడు ఉన్న సభ్యులతో మాత్రమే సంతృప్తి పడడం లేదు. ఇంకా ఎక్కువమంది సభ్యులు భాగమయ్యేలా కృషి చేస్తాం’ అంటుంది శాలిని. ‘ది హిస్టీరికల్ లక్ష్యం ఒకటే... ఇందులో చేరిన సభ్యులు తమలోని బిడియాలు, భయాలను పక్కనపెట్టి సౌకర్యంగా ఉండాలి. నవ్వడంతో పాటు నవ్వించాలి కూడా’ అంటుంది జిక్కి నాయర్. ‘మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చిన కార్యక్రమం ఇది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మన ఐడియాలు పంచుకోవచ్చు. అవి నవ్వుల పువ్వులవ్వడం చూడవచ్చు’ అంటుంది ‘ది హిస్టీరికల్’ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర శంకరన్. (క్లిక్ చేయండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి) -
సోషల్ మీడియాలోకి స్టార్ హీరో భార్య ఎంట్రీ!
మూడేళ్ల వయసులోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది షాలిని. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కోలీవుడ్ హీరో అజిత్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఆమె అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాకు కూడా దూరమైంది. తాజాగా ఆమె అభిమానులతో టచ్‌లో ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. shaliniajithkumar2022 ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. పనిలో పనిగా ఆమె భర్తతో కలిసి దిగిన ఫొటోలను పంచుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. అలా సోషల్ మీడియాలోకి వచ్చిందో లేదో అప్పుడే షాలినిని 50వేల మంది ఫాలో అవుతున్నారు, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) చదవండి: ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్ అయ్యేది మూడేళ్లు డిప్రెషన్లో.. నా కూతురి కోసమే బెంగ -
అభిమానులకు నితిన్ త్వరలోనే సర్ ప్రైజ్ ఇవ్వనున్నారా?
టాలీవుడ్ హీరోల్లో నితిన్ స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లాడు. ప్రముఖ దర్శకులతో సైతం చిత్రాలు చేశారు. మాస్ మూవీస్ చేయడంతో పాటు లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల్లోనూ నటించారు. అలా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా హిట్ సినిమాలతో ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే నితిన్.. జూన్ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. షాలిని అనే అమ్మాయితో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా నితిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను త్వరలోనే తండ్రి కాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. వివాహం అయినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ జంట అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం తప్ప ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. అయితే దీపావళి సందర్భంగా ఈ జంట ఓ ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానులు ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నితిన్ స్వయంగా రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది. Happy Diwali 🪔…. From ours to yours ❤️ pic.twitter.com/CkA7pT8IEi — nithiin (@actor_nithiin) October 24, 2022 -
ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్
అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. భరించలేని వెన్నునొప్పితో బాధ పడిన షాలిని తన పరిశోధనలో భాగంగా తెలుసుకున్న విషయం... హెంప్ మొక్కకు వెన్నునొప్పిని తగ్గించే శక్తి ఉంది అని. అది ప్రయోగాత్మకంగా నిరూపణ కావడంతో హెంప్ ఉత్పత్తుల విలువను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోదరి జయంతి భట్టాచార్యతో కలిసి ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’కి శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది. షాలిని భట్టాచార్య నిలకడగా ఒకచోట ఉండే రకం కాదు. స్పెయిన్‌లో ఉంటున్న శాలినికి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి షాలినికి కష్టం వచ్చిపడింది. భరించలేని వెన్నునొప్పి! బయట అడుగు వేయలేని పరిస్థితి. చిన్న బ్యాగ్‌ను ఇటు నుంచి అటు పెట్టాలన్నా వీలయ్యేది కాదు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మొదలైంది. ఏదో కాస్త తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న సోదరి జయంతితో కలిసి తన సమస్యకు పరిష్కారాన్ని వెదకడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన క్రమంలో వారికి ఎప్పుడో విన్న హెంప్ (ఒక రకమైన కనబిస్ మొక్క) గుర్తుకు వచ్చింది. వేసవి సెలవులు వస్తే చాలు...కొండకోనల్లో తిరగడం తమ అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి మొక్కల గురించి స్థానికుల నుంచి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకునేవారు. ఒకసారి హిమాలయాలో విస్తారంగా పెరిగే, విస్తృత ఔషధగుణాలు ఉన్న హెంప్ గురించి విని ఉన్నారు. ఆ జ్ఞాపకంతో హెంప్ గురించి లోతైన పరిశోధన ప్రారంభించారు. వెన్నునొప్పిని తగ్గించే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్లు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఆ సమయంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది... అజ్ఞాతంగా ఉన్న హెంప్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి దాని ఔషధశక్తి ఏమిటో తెలియజేయాలని. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం ఇండియా హెంప్ అండ్ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ హెంప్ ట్రేల్ మిక్స్, హెంప్ హార్ట్, ప్రొటీన్ పౌడర్, హెంప్ ఆయిల్... మొదలైన న్యూట్రీషన్–ప్యాక్డ్ హెంప్ ప్రాడక్స్‌ను తీసుకువచ్చింది. ‘షార్క్ ఇండియా రియల్టీ షో’ నుంచి ఆహ్వానం అందడాన్ని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గొప్పగా భావిస్తారు. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలవేదికగా షార్క్ ఇండియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫండింగ్ విషయంలో మేలు జరుగుతుంది. ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’ కో–ఫౌండర్‌గా జయంతి భట్టాచార్యకు షార్క్ ఇండియా నుంచి ఆహ్వానం లభించింది. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న జయంతికి తమ ఉత్పత్తుల గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో అనేది తెలియని విషయమేమీ కాదు. ఆమె ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. రకరకాల దేశాల నుంచి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అయితే సరిౖయెన డీల్ కుదరకపోవడంతో వాటిని ఆమోదించలేదు. ఫండింగ్ మాట ఎలా ఉన్నా ‘షో’కు వచ్చిన ప్రముఖుల సూచనలతో బ్రాండింగ్ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఆ తరువాత సరిౖయెన ఇన్వెస్టర్లు వచ్చారు. కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. నిజానికి హెంప్ ఉత్పత్తులను మార్కెట్ లో సక్సెస్ చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెంప్ సాగు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అనుమానం మిగిలే ఉంది. దీన్ని తీసివేయడానికి ప్రచార రూపంలో గట్టి ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు ఈ డైనమిక్ సిస్టర్స్. ‘ప్లానెట్ ఫ్రెండ్లీ ప్లాంట్ అయిన హెంప్‌పై మాకు ఉన్న నమ్మకం వృథాపోలేదు. మా వ్యాపారం విజయవంతమైంది అనేదానికంటే, ఇండియా హెంప్ అండ్ కంపెనీ ద్వారా హెంప్‌లోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది షాలిని. -
ప్రముఖ సింగర్ విడాకులు, పదేళ్ల బంధానికి ముగింపు
సినీ ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల ట్రెండ్ పెరిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. భార్య షాలిని తల్వార్‌తో తెగదెంపులు చేసుకున్నాడు.భరణంగా కోటి రూపాయలను కూడా సమర్పించాడు.తొలుత షాలిని తనకు భరణంగా రూ. 10కోట్లు డిమాండ్ చేయగా చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు. కాగా హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని తల్వార్ గతేడాది ల్లీలోని తీస్ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇరు వాదనలు విన్న కోర్టు విచారణ అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం వీరికి మనస్పర్థలు రావడంతో చివరికి విడాకులు తీసుకున్నారు. -
జూ. ఎన్టీఆర్ తల్లి శాలినిపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Yash Interesting Comments On Jr NTR Mother Shalini: కన్నడ స్టార్ హీరో యశ్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2 గురువారం(ఏప్రిల్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ మూవీ విడుదల నేపథ్యంలో చిత్రం గత కొద్ది రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్గా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ యాంకర్ సుమతో ముచ్చటించారు. చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్లీ గిఫ్ట్! అదేంటో తెలుసా? ఈ సందర్భంగా సుమ వారిని ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చెప్పమని అడగ్గా.. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపించాడు ప్రశాంత్ నీల్. ఇక యశ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని, పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసి థ్రిల్ అయ్యానన్నాడు. అలాగే చరణ్, ఎన్టీఆర్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ గొప్ప నటులని, చరణ్, తారక్‌లతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని చెప్పాడు. ‘హైదరాబాద్‌లో నేను ఎక్కడ షూటింగ్ చేసినా చరణ్ ఇంటి నుంచి భోజనం పంపిస్తాడు. అంతేకాదు మా మధ్య అంతకుమించి స్పెషల్ బాండింగ్ ఉంది’ అని యశ్ అన్నాడు. చదవండి: సోనూ సూద్‌కు ఫన్నీ రిక్వెస్ట్, స్పందించిన రియల్ హీరో అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తారక్ కూడా నన్ను వ్యక్తిగతంగా డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆయన కుటుంబం చాలా బాగా రీసివ్ చేసుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో మంచి బాండింగ్ కుదిరింది. ఆమె కర్ణాటకకు చెందిన వారు కావడంతో మా మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడింది. అందుకే శాలినిగారు నన్ను చాలా ప్రత్యేకంగా చూసుకున్నారు.కుటంబంలోని వ్యక్తిగా ట్రీట్ చేశారు. ఆయన కుటుంబం ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ యశ్ చెప్పుకొచ్చాడు. కాగా హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీణా టాండన్‌లు కీ రోల్ పోషించారు. -
భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా..
ఓ సౌత్ స్టార్ కపుల్ రొమాంటిక్ డేట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి రోజు సందర్భంగా ఈ కపుల్స్ పబ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్యయంగా ఆ స్టార్ హీరో భార్య షేర్ చేయడంతో బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకి ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు అజిత్-షాలినిలు. సోమవారం వారి 23వ పెళ్లి రోజు సందర్భంగా అజిత్, షాలినిలు రొమాంటిక్ డిన్నర్ డేట్‌కు వెళ్లారు. చదవండి: సీక్రెట్ రివీల్ చేసిన హెబ్బా పటేల్ అక్కడ బ్లూ లైట్లో డాన్స్ చేస్తూ అజిత్ భార్య షాలికి వెనక నుంచి హగ్ చేసుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ ఫొటో చూసిన వారి ఫ్యాన్స్ మురిసిపోతూ వారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ ఫొటోలో అంత ప్రత్యేకత ఏం ఉందంటే.. పెళ్లైన తర్వాత ఇలా వీరిద్దరూ ఇలా కనిపంచడం తొలిసారి. అజిత్ హీరోగా ఎంత బిజీ ఉన్న ఫ్యామిలీకి మాత్రం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాడు. స్టార్ హీరో అయిన అజిత్.. కుటుంబం, వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఇష్టపడడు. పిల్లలు, భార్యతో అజిత్ పబ్లిక్‌లోకి రావడం చాలా అరుదు. చదవండి: హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే! షాలిని, అజిత్లది ప్రేమ పెళ్లి అయినప్పటికీ వీరిద్దరూ ఇలా ఎన్నడూ క్లోజ్‌గా కనిపించింది లేదు. వారి 23 ఏళ్ల వైవాహిక బంధంలో ఈ దంపతులు రొమాంటిక్ డేట్ రావడం, ఆ ఫొటోలు షేర్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫొటో ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే వారిద్దరూ జంటగా నటించిన ‘అద్భుతం’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం షాలిని సినిమాలకు గుడ్‌బై చెప్పి గృహిణిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. View this post on Instagram A post shared by Shamlee (@shamlee_official) -
గుర్తు పట్టలేనంతగా ‘ఓయ్’ హీరోయిన్ షామిలీ, ఫొటోలు వైరల్
చైల్డ్ అర్టిస్ట్‌గా ఎంతో మందిని ఆకట్టుకుంది నటి బేబీ షామిలీ. ‘అంజలి అంజలి.. మెరిసే నవ్వుల పువ్వుల జాబిల్లీ’ అంటూ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్తో ఎంతోమంది మనసులు దొచుకుంది. ఇక ఓయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన షామిలీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాల నటిగా ముద్దుగా కనిపించిన షామిలీ పెద్దాయ్యాక బోద్దుగా ఉందని, ముఖంలో చిన్ననాటి కళ లేదంటూ ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. చదవండి: పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం! ఆ తర్వాత శరీరాకృతిపై ఫోకస్ పెట్టిన షామిలీ ఒక్కసారిగా బక్కచిక్కి నాగశౌర్య అమ్మమ్మగారి ఇల్లు మూవీతో హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ అఫర్స్ రాకపోవడం ఇక నటనకు గుడ్‌బై చెప్పి చదువుపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన సోదరి, నటి షాలిని-అజిత్‌ల ఫ్యామిలీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా షామిలీ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: ఆ యాక్షన్ సీన్లో ప్రభాస్‌ను విలన్ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత.. ఇందులో అక్క షాలిని, ఆమె కూతురు అనోష్కతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌస్.. దానికి తగ్గట్టుగా ముడి వేసిన జుట్టుతో షామిలీ సరికొత్త లుక్‌లో మెరిసిపోయింది. సన్నగా నాజుగ్గా తయారైన షామిలీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సూపర్ మేడం, చాలా అందంగా ఉన్నారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు అంటూ నెటిజన్లు నుంచి కాంప్లీమెంట్స్ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Shamlee (@shamlee_official) -
వైరల్ అవుతున్న అజిత్ ఫ్యామిలీ ఫొటోలు, స్టైలిష్ లుక్‌తో షాకిచ్చిన ‘తల’
Ajith Family Pics Goes Viral: తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వలిమై మూవీ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా బోని కపూర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన వలిమై తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఇప్పటి వరకు వలిమై దాదాపు రూ. 130 కోట్ల నుంచి రూ. 140 కోట్ల వరకు వసూళ్లు చేసి ఉంటుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వలిమై బ్లాక్‌బస్టర్ హిట్‌తో అజిత్ ఫుల్ ఖుషిలో ఉన్నాడు. అదే జోష్‌లో కుమరుడు అద్విక్ బర్త్‌డేను కుటుంబంతో కలిసి గ్రాండ్తో సెలబ్రెట్ చేసుకున్నాడు అజిత్. చదవండి: ఆమెతో నా భర్త వివాహేతర సంబంధం, విడాకులు: నటి భావోద్వేగం ఇందుకోసం భార్య పిల్లలతో రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే హీరోగా అజిత్ ఎంత బిజీగా ఉన్న ఖాళీ సమయాన్ని ఎక్కువగా కుటుంబానికి వెచ్చిస్తాడు. అయితే ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ ముచ్చట్లను ఎక్కువగా ప్రస్తావించడు. ఈ నేపథ్యంలో తన కూతురు, కొడుకు ఫొటోలు కానీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటకు రావడం చాలా అరుదు. ఈ క్రమంలో కొడుకు బర్త్‌డే సెలబ్రెషన్లో భాగంగా భార్య శాలిని, కూతురు అనౌష్క, కుమారుడు అద్విత్తో కలిసి దిగిన ఫొటో ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటుంది. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ ఇందులో ‘తల’ కుమారుడిని చూసి కుట్టి తల(జునియల్ తల) అంటూ ముద్దుగా పిలుచుకుంటున్న అజిత్ ఫ్యాన్స్. ఇదిలా ఈ ఫొటోలో ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేసే మరో సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు పంచ కట్టు, తెల్ల జుట్టుతో ఉండే అజిత్ ఈ ఫొటోల ఫుల్ స్టైలిష్‌గా కనిపించాడు. పెద్ద గడ్డం, వైట్ హెయిర్ సూట్‌తో పాటు చెవి రింగ్ ధరించి తల గ్యాంగ్‌లీడర్‌లా కనిపించాడు. అజిత్ కొత్త లుక్‌ను చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు లేట్ చేయకుండ తల కొత్త సినిమా స్టార్ చేశాడని, ఇది ఆయన న్యూ ప్రాజెక్ట్‌లోని లుక్ అయ్యింటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్ గురించి ఫేక్ న్యూస్.. స్పందించిన మేనేజర్
Shalini Ajith Kumar Is Not On Twitter: స్టార్ హీరో అజిత్ భార్య, హీరోయిన్ షాలిని పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది రియల్ అకౌంట్ కాదు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాలిని పేరుతో ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. మిస్సెస్ షాలిని అజిత్‌కుమార్ పేరుతో క్రియేట్ అయిన ఈ ట్విట్టర్ అకౌంట్‌ను అప్పటికే కొందరు అభిమానులు ఫాలో అయ్యారు. విషయం తెలుసుకున్న అజిత్‌కుమార్ కార్యాలయం సిబ్బంది వెంటనే దీన్ని గుర్తించి ఇది ఫేక్ అకౌంట్ అని తేల్చేశారు. షాలినికి సోషల్ మీడియాలో ఎటువంటి ఖాతా లేదని అజిత్‌కుమార్ వ్యక్తిగత పీఆర్వో స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక హీరో అజిత్‌కుమార్ సైతం తనకు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవని ఇటీవలె పేర్కొన్న సంగతి తెలిసిందే. There is a fake twitter account in the name of #MrsShaliniAjithkumar and we would like to clarify that she is not in twitter. Kindly ignore the same . — Suresh Chandra (@SureshChandraa) February 2, 2022 -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
సేఫ్‌గా లేనంటూ నితిన్ భార్య పోస్ట్.. వీడియో వైరల్
దీపావళి పండగను టాలీవుడ్ సెలెబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు, స్పెషల్ వంకటకాలతో పాటు పటాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నితిన్ భార్య షాలిని షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో షాలినిని గన్‌తో బెదిరిస్తున్నాడు నితిన్. అయితే అది నిజం గన్ కాదు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకీ. దీపావళి పండగవేళ.. నితిన్ చిన్నపిల్లలాడిలా బొమ్మ తుపాకీ చేతపట్టి ఇంట్లో హల్చల్ చేశారు. షాలినిని షూట్ చేయగా.. ఆ సౌండ్ కి ఆమె చెవులు మూసుకుంది. ఈ వీడియోని షాలిని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్తోంది’అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) -
20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి.. కామెడీ రోల్లో షాలిని!
ప్రముఖ తమిళ హీరో అజిత్ భార్య, నటి షాలిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2000 ఏడాదిలో అజిత్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె హౌజ్ వైఫ్‌గా సెటిలైన విషయం తెలిసిందే. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత షాలిని మూవీస్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా మణిరత్నం ప్రముఖ తమిళ నవలైన పొన్నియన్ సెల్వన్‌ను వెబ్ సిరీస్‌గా అదే పేరుతో తెరకెక్కిస్తున్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీం సిటీలో జరుపుకుంటోంది. ఇందులో హీరో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తిలు లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజా ఈ సిరీస్‌లో షాలిని కూడా నటిస్తున్నారని, ఇందులో ఆమె ఓ కామెడీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐశ్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవీలు ఈ సిరీస్ షూటింగ్లో పాల్గొన్నారు. కాగా షాలిని ఈ నెల చివరిలో సష్త్రటింగ్లో పాల్గొననున్నారని, త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. అయితే చివరిగా 2001లో వచ్చిన తమిళ చిత్రం ‘పిరియాధ వరం వెండం’లో షాలినీ నటించారు. ఇందులో హీరో ప్రశాంత్‌కు జోడీగా ఆమె కనిపించారు. (చదవండి: వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు) (హీరో అజిత్‌కి ఏమైంది? షూటింగ్ ఫోటో వైరల్) -
వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు
తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాదాలకు దూరంగా.. తన పనేంటో తాను చూసుకుంటారు అజిత్. ఇక తన అభిమానులు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. ఇక అజిత్‌కు ఎంత క్రేజ్ ఉందో ఆయన కుమారుడికి కూడా అదే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆరేళ్ల అజిత్ కుమారుడు ఆద్విక్ అజిత్ బయట కనిపిస్తే.. చాలు సోషల్ మీడియాలో కుట్టి థలా ఫోటోలు తెగ వైరలవుతాయి. తాజాగా బుధవారం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తల్లి షాలినితో కలిసి ఆద్విక్ ఓ పెళ్లికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (చదవండి: హ్యూమాకి భయమా?) ఈ ఫోటోల్లో షాలిని, ఆద్విక్తో పాటు షామిలి కూడా ఉన్నారు. బాల నటులుగా కోట్లాది మంది హృదాయాలను కొల్లగొట్టిన షాలిని సిస్టర్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కుట్టి థలా వెరీ క్యూట్ అంటూ అజిత్ ఫ్యాన్స్ ఆద్విక్ని తెగ పొగుడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజిత్ వలిమై చిత్రంలో నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫి అందిస్తుండగా..హ్యుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
భార్య బర్త్‌డే, పార్టీ ఇచ్చిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ ఏకకాలంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంత బిజీబిజీగా ఉన్న సమయంలోనూ భార్య పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. పైగా పెళ్లి తర్వాత షాలిని కందుకూరికి ఇదే తొలి బర్త్‌డే కావడంతో ఆమెకు ఏ లోటూ లేకుండా అన్నీ దగ్గరుండి పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి బంధుమిత్రులతో పాటు నటుడు వెన్నెల కిషోర్, దర్శకుడు వెంకీ కుడుముల సహా పలువురు సెలబ్రిటీలు విచ్చేశారు. ఈ బర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'నీతో గడిపిన క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి' అంటూ నితిన్ షాలినితో దిగిన ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: 'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్) ఇక ఈ మధ్యే నితిన్ దంపతులు తిరమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ భార్యను కారులో కొండపైకి పంపించి ఆయన మాత్రం సామాన్య భక్తుల మాదిరిగా నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాగా జూలై 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ఎక్కువగా ఆహ్వానాలు పంపకపోవడంతో కొద్ది మంది సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. ఇక నితిన్ నటిస్తున్న 'రంగ్‌దే' చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'అంధాధున్' తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో 'చెక్' సినిమాల్లో నటిస్తున్నాడు. (చదవండి: ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’) Happy Birthday to my lovely wife! ❤️ The happiest parts of my day are the times I've spent with you. Here’s to a lifetime of being in love with you. 🤗 pic.twitter.com/HmtQuGITAD — nithiin (@actor_nithiin) January 7, 2021 -
దర్శకుడిని పెళ్లాడిన హీరోయిన్
ఇటీవలి కాలంలో ఓటీటీలో విడుదలైన మంచి విజయం సాధించిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా హీరోయిన్ షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకుంది. ఆ సినిమాలో రాధ క్యారక్టర్ కనిపించి అలరించిన షాలిని.. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ ఆకట్టుకుంది. ఒక్క సినిమాతోనే ఎంతోమందిని తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. తాజాగా ఈ హీరోయిన్ సడన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. కరోనా కారణంగా పెద్దగా బంధువులు హడావుడి లేకుండా తమిళ దర్శకుడు మనోజ్ బీదను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్లస్ అనే కన్నడ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన షాలిని.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నటిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు దక్కించుకుంటున్న ఈమె హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకొని ఊహించని షాక్ ఇచ్చింది.(చదవండి : రావణ లంక ఆడియో విడుదల..) -
నితిన్-షాలినీల వివాహం
-
‘ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్–షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేసిన నితిన్ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు. పెళ్లి కానుక నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్ కథానాయిక. నితిన్ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ టు అవర్ హీరో’ అంటూ ‘రంగ్ దే’ టీమ్ టీజర్‌ని విడుదల చేసింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Mothaniki oka INTIVAADINI ayyanuu..😀😀 need all ur blessings n love 🙏🙏 pic.twitter.com/rWUNFDHZ5O — nithiin (@actor_nithiin) July 26, 2020 -
‘నాన్నా నవ్వుతోంది.. నేను కట్టలేను’
హీరో నితిన్ మరి కొద్ది గంటల్లో తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు మూళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ తాజా చిత్రం రంగ్‌దే టీమ్ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర బృందం.. ఆదివారం సాయంత్రం రంగ్‌దే టీజర్‌ను విడుదల చేసింది. నితిన్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ టీజర్‌పై స్పందించిన.. ఈరోజు మరింత స్పెషల్‌గా చేసినందుకు రంగ్‌దే టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.(మెహందీలో మెరిసిన షాలిని-నితిన్) ఈ టీజర్లో నితిన్ తన తండ్రి నిర్ణయం మేరకు కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడంతో బిజీ అయినట్టు చూపించారు. ఇందులో ‘అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు’, ‘చేయి తీయ్ జస్టిస్ చౌదరి’, ‘నాన్న నవ్వుతుంది.. నేను కట్టలేను’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. (పెళ్లి సందడి షురూ) మరోవైపు నితిన్-షాలిని పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. నగరంలోని తాజ్ ఫలక్‌నుమాలో ఈ వేడుక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలతో పాటుగా, అతికొద్ది మంది సన్నితులు, అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. -
ఇవాళ టాలీవుడ్ యువ హీరో నితిన్ వివాహం
-
హీరో నితిన్ పెళ్లి సందడి
-
పెళ్లి సందడి షురూ
హీరో నితిన్, షాలినీల పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కరోనా కారణంగా వారి పెళ్లిని నిరాడంబరంగా చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం కూడా సింపుల్‌గా జరిపారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నితిన్ ని పెళ్లి కొడుకుని చేశారు. ఈ వేడుకకు హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్ హాసినీ క్రియేష¯Œ ్స నిర్మాత చినబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘‘నన్ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా ఆశీర్వదించడానికి పవర్‌స్టార్, త్రివిక్రమ్, చినబాబుగార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు నితిన్. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెహందీలో మెరిసిన షాలిని-నితిన్
హైదరాబాద్ : యంగ్ హీరో నితిన్ పెళ్లి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఆదివారం రాత్రి 8.30 నితిన్-షాలినిలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్‌నుమా హోటల్లో ఈ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. తాజాగా మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నితిన్ స్నేహితురాలు, ప్రముఖ స్టైలిస్ట్ డిజైనర్ కోన నీరజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.(నితిన్ ఎంగేజ్మెంట్తో వేడుకలు షురూ) ఈ వేడుకలో చేతులకు మెహందీ పెట్టుకున్న షాలిని.. రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయారు. నితిన్ బ్లూ కలర్ కుర్తాలో కళ్లకు డిఫరెంట్ గాగూల్స్ పెట్టి స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా.. పరిమిత అతిథుల సమక్షంలో షాలిని మెడలో నితిన్ మూడు మూళ్లు వేయనున్నారు. సినీ పరిశ్రమ నుంచి హీరోలు పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, దర్శకుడు త్రివిక్రమ్.. నితిన్-షాలినిల వివాహా వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా నితిన్ తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (నితిన్ పెళ్లికి టైమ్ ఫిక్స్) -
ఎంగేజ్డ్
హీరో నితిన్ వివాహం షాలినీతో నిశ్చయమయిన సంగతి తెలిసిందే. బుధవారం నితిన్ ఇంట్లో జరిగిన నిశ్చితార్థం వేడుక జరిగింది. ‘ఎంగేజ్డ్’ అంటూ నితిన్ తన నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. నితిన్ క్రీమ్ కలర్ కుర్తా, పైజమాలో హ్యాండ్సమ్గా కనిపించగా, షాలిని ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. వీరి వివాహ వేడుక ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్నామా ప్యాలెస్‌లో జరగనుంది. వాస్తవానికి వీరి వివాహాన్ని భారీ ఎత్తున ప్లాన్చేశారు, కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. అతికొద్దిమంది బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది. -
నితిన్ ఎంగేజ్మెంట్తో వేడుకలు షురూ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. ఐదు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకలు నేటి నుంచే మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్దలు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వహించాయి. పరిమిత అతిథుల మధ్య ఇరు కుటుంబాల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంగేజ్మెంట్తో ప్రారంభమైన ఐదు రోజుల పెళ్లి సంబరాలు ఆసాంతం కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే జరగనున్నాయి. ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. (కరోనా ఎఫెక్ట్: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్) తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ నితిన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయంగా ఆహ్వానం అందజేశారు. అలాగే సినీ ఇండస్ట్రీలో తన గురువు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌తోపాటు సినీ ఇండస్ట్రీ పెద్దలను పెళ్లికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు. వీరి పెళ్లి ఏర్పాట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ఆరంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో నితిన్, షాలినిల పసుపు, కుంకుమ వేడుక జరిగింది. ఆ తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో లాక్డౌన్ వచ్చిపడింది. దీంతో ఆ శుభకార్యం ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు నితిన్ పెళ్లి చేసుకుంటూ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టబోతున్నాడు. (మా పెళ్లికి రండి : కేసీఆర్‌కు ఆహ్వానం) -
టైమ్ ఫిక్స్
హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘రంగ్ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో), ‘చెక్’ (చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో) చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు నితిన్. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న హిందీ హిట్ ‘అంధాదూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తారు. -
నితిన్ పెళ్లి ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: హీరో నితిన్, షాలినీల వివాహానికి తేదీ ఖరారైంది. ఈ నెల 26న రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్‌లో నితిన్, షాలినీల పెళ్లి వేడుక సింపుల్‌గా జరగనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. (తనిఖీకి ఇంకా రెండు గంటల సమయం) ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల వారు, సన్నిహితులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే. (ఆ పాత్రకు తను బాగా సరిపోతుందన్నారు: రవీకాంత్) -
12న పెళ్లి పనులు ఆరంభం
రెండేళ్ల క్రితం నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో నటించారు. ఆ సినిమాలో పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలు, పెళ్లి వేడుక ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది నితిన్ తన పెళ్లిని దాదాపు అంత ఘనంగా చేసుకోవాలనుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ దుబాయ్‌ని వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఏప్రిల్‌లో షాలినీతో దుబాయ్‌లో ఏడడుగులు వేయాలనుకున్నారు నితిన్. అయితే కరోనా కారణంగా ప్లాన్ మార్చారు. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఈ నెల నితిన్, షాలినీల వివాహం జరగనుంది. ఈ 12 నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నెల 20తో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఆ తర్వాత పెళ్లి తేదీని ఖరారు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనుంది. -
వచ్చే నెలలో నితిన్ వివాహం
నాగర్ కర్నూల్‌కు చెందిన షాలినితో నితిన్ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమను పెళ్లి పీటలెక్కించేందుకు ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అన్నీ కలిసొస్తే నితిన్ ఈపాటికే ఓ ఇంటివాడయ్యేవాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల అన్ని ప్లాన్లు రద్దయ్యాయి. దీంతో దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పెడింది. అయితే వచ్చే నెలలోనే నితిన్ వివాహానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (కరోనా ఎఫెక్ట్: అభిమానులకు నితిన్ విజ్ఞప్తి ) తొలుత డిసెంబర్లో పెళ్లి జరగనుందని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం జూలైలోనే వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇప్పట్లో కరోనా సమస్య ముగిసే సూచనలు లేకపోవడంతో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి ప్లాన్‌ను విదేశాల నుంచి హైదరాబాద్‌కు మార్చారు. నగర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ వివాహం జరగనుందని టాక్. ఇక ఈ విషయాన్ని నితిన్, షాలినీ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. (అలా షాలినీతో ప్రేమలో పడ్డా : నితిన్) -
తమిళ హీరో అజిత్‌కు ఏమైంది?
-
హీరో అజిత్‌కు ఏమైంది?
గత రెండు రోజులుగా కోలీవుడ్‌లో హీరో అజిత్ గురించి చర్చ కొనసాగుతోంది. ఆయనకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 22న అజిత్ తన భార్య షాలినితో కలిసి ముఖాలకు మాస్క్‌లు ధరించి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అజిత్‌కు ఏమైందన్న ప్రశ్న సర్వత్ర నెలకొంది. ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముఖానికి మాస్క్‌లతో అజిత్ ఆస్పత్రికి వెళ్లడం ఆయన వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. (బాలీవుడ్‌ను వదలని కరోనా..) దీని గురించి పలు రకాల ప్రచారం జరుగుతోంది. అజిత్ తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని.. ఆయన్ను పరామర్శించడానికే అజిత్, షాలిని దంపతులు వెళ్లారని ఒక ప్రచారం జరుగుతోంది. కాగా అజిత్‌కు ఆ మధ్య శస్త్ర చికిత్స జరిగిందని, దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళుతుంటారని, అందులో భాగంగా అజిత్, తన భార్యతో కలిసి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయమై అజిత్ వర్గం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా అజిత్ ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ నిలిచిపోవడంతో అజిత్ ఇంట్లోనే ఉంటున్నారు. (నాలుగు జతల బట్టలతో ఉంటున్నా: నటి) -
చాలామంది గెటౌట్ అన్నారు
‘‘కాలేజీ నేపథ్యంలో హ్యాపీడేస్ నుంచి ‘ప్రేమమ్’ వరకు చాలా సినిమాలొచ్చాయి. కాలేజ్‌లో జరిగే ఓ ఫెస్ట్ (ఫెస్టివల్) ఆధారంగా వస్తున్న సినిమా మా ‘యురేక’’ అన్నారు కార్తీక్ ఆనంద్. సయ్యద్ సోహైల్ రియాన్, కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, షాలిని, సమీక్ష ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో ప్రశాంత్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. లలిత కుమారి సహనిర్మాత. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ – ‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు, కథలు రాయడం ఆసక్తి. ‘యురేక’లో నటించి, దర్శకత్వం వహించాను. ఓ కాలేజ్ ఫెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మర్డర్ మిస్టరీయే ఈ చిత్రం. సినిమాకు సెకండాఫ్ హార్ట్ లాంటింది. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. సమకాలీన అంశాలకు సందేశాన్ని జోడించాం. సినిమా చాన్స్ కోసం స్క్రిప్ట్స్ పట్టుకుని చాలామంది ప్రొడ్యూసర్స్‌ని కలిశాను. నేనే యాక్ట్ చేసి, డైరెక్ట్ చేస్తానని చెప్పగానే చాలామంది గెటౌట్ అన్నారు. ప్రశాంత్‌గారు నన్ను నమ్మి ‘యురేక’కి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తూ సెలవుల్లో ‘యురేక’ సినిమా తీశాను. ఈ సినిమా ఫలితాన్ని బట్టి నా కెరీర్‌ను నిర్ణయించుకుంటాను’’ అన్నారు. -
కష్టాలు దాటుకుంటూ వచ్చాం
కార్తీక్ ఆనంద్, సయ్యద్ సోహైల్ రియాన్, డింపుల్ హయతి, షాలిని ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమాకు లలిత కుమారి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలవారు కష్టాలు పడుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు సినిమాల నిర్మాణం, విడుదల వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి’’ అన్నారు. ‘‘ఓ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ ఈ చిత్రం. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ, ఓ లీడ్ రోల్ చేస్తానని కథ చెప్పినప్పుడు ఎక్కువమంది ఒప్పుకోలేదు. కానీ నిర్మాత ప్రశాంత్ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు’’అన్నారు కార్తీక్ ఆనంద్. ‘‘భవిష్యత్‌లో కార్తీక్ మంచి స్థాయిలోకి వెళతాడు’’ అన్నారు సయ్యద్. ‘‘యువత తలచుకుంటే ఏమైనా సాధించగలరు అన్నదే మా సినిమా’’ అన్నారు ప్రశాంత్. ‘‘కొత్తవారు తీసిన సినిమా అని కాకుండా తప్పక చూడండి’’ అన్నారు లలితకుమారి. నటుడు ఆర్కే, సంగీత దర్శకుడు నరేష్, ఎడిటర్ అనిల్ పాల్గొన్నారు. -
అలా షాలినీతో ప్రేమలో పడ్డా : నితిన్
నితిన్ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ సాక్షిగా షాలినీని పెళ్లాడబోతున్నారు. విశేషం ఏంటంటే... ఇప్పుడు నితిన్ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్ ‘ది బ్యాచ్‌లర్’. అయితే నితిన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పడబోతోంది. ఇక నితిన్ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం... ► ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మరి షాలినీతో పెళ్లి కూడా అలానే చేసుకోబోతున్నారా? నితిన్: నా చిన్నప్పుడు అలాగే అనుకున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేస్తున్నప్పుడు కూడా అలానే అనుకున్నాను. కానీ ఆ సినిమా ఆడలేదు కదా. ఒకవేళ ఆ సినిమా ఆడి ఉంటే అలానే చేసి ఉండేవాణ్నేమో. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు. ► మీ జంట చూడటానికి చాలా బావుంది. షాలినీని ఎప్పుడు కలిశారు? ఎలా కలిశారు? ‘ఇష్క్’ (2012) సినిమా జరుగుతున్న సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. చూడగానే నా మనసుకు తను బాగా నచ్చింది. ముందు ఫ్రెండ్స్‌లానే ఉన్నాం. కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నెక్ట్స్ స్టెప్ తీసుకున్నాం. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పాం. ఇంట్లోవారికి చెప్పగానే రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు. చాలా సంతోషపడ్డాం. ► ‘జయం’ సినిమాలో సదాని కలవడానికి చాలా కష్టపడతారు. షాలినీని కలుసుకోవడానికి ఏయే ప్లాన్లు వేశారు. ఎన్నెన్ని కష్టాలు పడ్డారు? ‘జయం’ సినిమాలో కుర్రాడిని కాబట్టి సెట్లో తాడులతో కట్టేవారు. ఇంటి పై కప్పు నుంచి సదా రూమ్‌లోకి దూకేవాణ్ణి (నవ్వుతూ). అది సినిమాలో. రియల్ లైఫ్‌కి వస్తే.. తనతో కలసి బయటకు వెళ్లి, నలుగురి కంట్లో పడితే లేనిపోని వార్తలు వస్తాయి. అనవసరమైన అటెన్షన్ ఎందుకు? అనుకున్నాం. అందుకే కారులో బాగా తిరిగేవాళ్లం. మా ఫేవరెట్ డ్రైవ్ ఇన్ ఉంది. అక్కడికెళ్లి కాలక్షేపం చేసేవాళ్లం. అంతే.. ► ‘నాకు భార్యగా షాలినీయే కరెక్ట్’ అని ఏ సందర్భంలో అనిపించింది? ఫలానా మూమెంట్ అని చెప్పలేను. ఫ్రెండ్షిప్ పెరుగుతున్న క్రమంలో అలా జరిగిపోయింది. తన స్వభావం నాకు చాలా నచ్చింది. అందర్నీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. అందరితో ఒకేలా మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చింది. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతుంది. తనలో మంచి క్వాలిటీ ఏంటంటే.. స్థాయి తేడా చూడదు. ► ఇంతకీ పెళ్లయ్యాక జాయింట్ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నారా? ఆ విషయం గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. మా ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటున్నాం. ఆమెకు కూడా అదే ఇష్టం. మా రెండు కుటుంబాలకు మంచి సింక్ కుదిరింది. అంతా బాగున్నాం. ► మీరు ప్రేమలో ఉన్న విషయం ఇంట్లో కనీసం ఒక్కరికి కూడా తెలియదా? నా సిస్టర్‌కు, కొంతమంది ఫ్రెండ్స్‌కు తెలుసు. మేం పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాం. ► ఫోన్‌కాల్స్‌తో బిజీగా ఉండేవారా? నేను షూట్లో ఉంటే తను అర్థం చేసుకుంటుంది. షూటింగ్ పూర్తయి ఇంటికొచ్చాక ఒక అరగంట మాట్లాడుకునేవాళ్లం. అంటే సందర్భాన్నిబట్టి అది గంట అయినా కావొచ్చు, ఇంకా తక్కువైనా కావొచ్చు. ► షాలినీవాళ్లది సినిమా బ్యాగ్రౌండా? సినిమా నేపథ్యం లేదు. వాళ్ల తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్. ► మొన్న వేలంటైన్స్ డేకి ఏం చేశారు? ఆ రోజంతా బిజీ. మా పెళ్లి వేడుకలో భాగమైన పసుపు కొట్టే ఫంక్షన్లో బిజీగా ఉన్నాం అందరం. నేను ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. ఫోన్ చేసి ‘హ్యాపీ వేలంటైన్స్ డే’ అని చెప్పాను.. అంతే. ► ఫస్ట్ వేలంటైన్స్ డేని ఎలా జరుపుకున్నారు? నాకు తెలిసి ఏ వేలంటైన్స్ డేనీ స్పెషల్‌గా జరుపుకున్నది లేదు. షూటింగ్స్‌తో బిజీగా ఉండేవాణ్ణి మధ్యలో ఒకటీ రెండు సార్లు వేలంటైన్స్ డే రోజు ఖాళీగా ఉన్నప్పుడు డ్రైవ్ ఇన్లోనే కారులో కూర్చుని కొత్త డిష్ ఆర్డర్ చేసి తింటూ కబుర్లు చెప్పుకున్నాం.. అంతే. ► రొమాంటిక్ సీన్స్‌లో యాక్ట్ చేయొద్దు అనే ఆర్డర్స్ వచ్చేశాయా? లేదు. నా ప్రొఫెషన్ని బాగా అర్థం చేసుకుంది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకైతే చెప్పలేదు. ముందు ముందు చెబుతుందేమో చూసుకోవాలి (నవ్వుతూ). ► పెళ్లి షాపింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? ఇంకా ఏమీ అనుకోలేదు. మా పెళ్లి ఏప్రిల్ 16 అయితే నా షూటింగ్స్ ఏప్రిల్ 6 వరకూ ఉన్నాయి. షూటింగ్స్ గ్యాప్ మధ్యలో పెళ్లి షాపింగ్ చేయాలి. మా ఇంట్లో, వాళ్ల ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ► ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ సక్రమంగానే కనిపిస్తాయి. కానీ తనలో మీకు నచ్చని క్వాలిటీలు, మీలో తనకి నచ్చని క్వాలిటీలు ఉండి మార్చుకున్న సందర్భాలున్నాయా? ఇద్దరికీ పరిచయం అయింది 8 ఏళ్ల క్రితం. నాలో కొన్ని.... తనలో కొన్ని మైనస్సులు సహజం. గొడవ పడేవాళ్లం. మాట్లాడుకోకుండా ఉండేవాళ్లం. వాటి అన్నింటిలో నుంచి తను కొంచెం మారింది. నేను కొంచెం మారాను. ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఏదో లోపాలుంటాయి. ఇద్దరం మార్చుకుంటూ వచ్చి, ఫైనల్‌గా ఏడడుగులు వేయాలనే స్టెప్ తీసుకున్నాం. ► పెళ్లి ప్లాన్స్ గురించి? దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య మా పెళ్లి జరగనుంది. ఏప్రిల్ 22 లేదా 23 ఇండస్ట్రీ వాళ్లకు రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దుబాయ్‌లో పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మా అక్కాబావ, షాలినీ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. -
మే నెలలో హీరో నితిన్ వివాహం
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో నితిన్ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్ స్టేటస్‌కి ఫుల్స్టాప్ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. మే నెలలో నితిన్ వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది. నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలినీ అని, ఇది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని భోగట్టా. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించారట ఇరు కుటుంబ సభ్యులు. -
భార్య షాలిని బర్త్‌డేకు అజిత్ సర్ప్రైజ్..
చెన్నై : భార్య షాలిని బర్త్‌డే నాడు తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆమెకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈనెల 20న షాలిని 40వ ఏట అడుగుపెట్టిన క్రమంలో ఆమె క్లాస్మేట్స్ అందరినీ పార్టీకి రప్పించి భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. స్పెషల్ డేను తల్లితండ్రులు, పిల్లల మధ్య జరుపుకుందామని భార్యకు చెప్పిన అజిత్ ఆమెకు తెలియకుండా ఆమె చిన్ననాటి స్నేహితులందరినీ పార్టీకి ఆహ్వానించారు. ఈ పార్టీకి వేదికగా షాలిని ఎంతో ఇష్టపడే సముద్రానికి అభిముఖంగా ఉన్న ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. వేడుకలకు బుక్ చేసిన హాల్ అంతటినీ షాలిని చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ ఎదిగిన తీరును కళ్లకు కట్టేలా బేబీ షాలిని పేరిట ఆమె ఫోటోలతో నింపారు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి తరలిరావడంతో తన భర్త తనను సంతోషంగా ఉంచేందుకు ఇలా ప్లాన్ చేశారని తెలుసుకుని షాలిని మురిసిపోయారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న అజిత్, షాలిని 2000 సంవత్సరంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి కుమార్తె అనౌష్క, కుమారుడు అద్విక్లున్నారు. -
చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!
తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ కార్యక్రమం ఏదైనా అతడి పేరు వినబడితే చాలు ఈలలు, కేకలతో ప్రాంగణమంతా మోత మోగిపోవాల్సిందే. సామాన్యుడి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన అజిత్‌ను అభిమానులు ముద్దుగా తాలా అని పిలుచుకుంటారు. సినిమాలతోనే కాకుండా కారు రేసులు, రైఫిల్ షూటింగ్ వంటి ఈవెంట్లలో కూడా దుమ్ములేపే అజిత్‌కు అభిమానులు నీరాజనాలు పడతారు. ఎంతలా అంటే కేవలం అజిత్ మాత్రమే కాదు అతడి పిల్లల ఫొటోలు కూడా ట్రెండింగ్‌లో నిలిచేంతగా. ఇంతకీ విషయమేమిటంటే.... అజిత్ కూతురు అనౌష్క, కుమారుడు అద్వైక్ కలిసి ఉన్న క్యూట్ ఫొటో ఒకటి బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన అక్క అనౌష్కతో కలిసి అద్వైక్ నవ్వుతున్న ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిన్న తాలా! మరీ ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా. దిష్టి తగులుతుంది కదా అంటూ #AadvikAjith హ్యాష్ ట్యాగ్‌తో ఫొటోను షేర్ చేయడంతో ట్విటర్లో ట్రెండింగ్‌గా నిలిచింది. కాగా హీరోయిన్ షాలినిని ప్రేమించిన అజిత్ 2000లో ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు కూతురు అనౌష్క, కొడుకు అద్వైక్ ఉన్నారు. ఇక ఈ ఏడాది విశ్వాసంతో హిట్ కొట్టిన అజిత్.. తాజాగా పింక్ రీమేక్ నెర్కొండ పారవైతో ప్రేక్షకులను పలకరించాడు. -
యూత్‌కి థ్రిల్
కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు తదితరులు నటించిన ఈ సినిమాకి సహ నిర్మాత: లలితకుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
పాటల తోటకి ప్రాణాంతక వ్యాధి..
మొన్నటి దాకా తమతో సరదాగా నవ్వుతూ ఆనందంగాతిరిగిన తమ స్నేహితురాలు ఒక్కసారిగా ప్రాణాంతక వ్యాధి బారిన పడడంతోతట్టుకోలేకపోయారు ఆమె స్నేహితులు. ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. స్నేహితులు అంటే ఆట పాటల్లోనూ విందు వినోదాల్లో మాత్రమే కాదు.. ఆపత్కాలంలోనూ తోడుంటారని, బాసటగా నిలుస్తారని నిరూపిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో :‘ఎలాగైనా మా ఫ్రెండ్‌ని కాపాడుకోవాలి సర్. అదే మా ముందున్న లక్ష్యం’ అంటూ చెబుతున్న మణిరాజ్‌ను చూస్తే తమ స్నేహాన్ని నిలుపుకోవాలని మనసారా కష్టపడుతున్న నిజమైన ఫ్రెండ్‌కి ప్రతిరూపంలా కనపడతాడు. ‘చాలా మంచి అమ్మాయి సార్.. ఎంతో హ్యాపీగా ఉండేది. మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. దేవుడు ఆమెకి ఎందుకీ కష్టం ఇచ్చాడో’’ అని అంటున్నప్పుడు ఆధునిక యువతలో సెంటిమెంట్స్ కొరవడుతున్నాయనే మాట ఎంత తప్పో అర్థమవుతుంది. పాటల తోటకిప్రాణాంతక వ్యాధి ఉప్పల్‌లో నివసించే షాలిని తల్లి దగ్గర ఉంటోంది. బి.ఆర్. అంబేడ్కర్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ రెండో ఏడాది చదవుతోంది. ఆటపాటల్లో బెస్ట్ అనిపించుకునే షాలిని స్నేహితులకు ఎంతో ఆప్తురాలు. ‘తను చాలా బాగా పాడుతుంది. గాయనిగా చాలా సర్టిఫికెట్లు కూడా అందుకుంది. ప్రదర్శనలు ఇచ్చింది. చాలా సరదాగా యాక్టివ్‌గా ఉంటుంది’ అంటూ ఆమె గురించి చెప్పారు మిత్రబృందం. కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమెకి బ్లడ్ కేన్సర్ అని డాక్టర్లు నిర్థారించారు. షాలినీ బతకాలంటే దాదాపు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. విద్యార్థుల విజ్ఞప్తికి ట్వీట్ చేసిన కేటీఆర్ ఈ మాట విని షాలిని తల్లి తల్లడిల్లిపోయింది. భర్తతో విడిపోయి ఒంటరిగా అద్దె ఇంట్లో నివసిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌కి కూతురిని రక్షించుకోవడానికి అవసరమైన డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. ఆమెకి ఉన్న నగానట్రా అన్నీ అమ్మేస్తే వచ్చిన రూ.5 లక్షలు వైద్యం కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు మరో రూ.25 లక్షలు అవసరం. అలాంటి సమయంలో ఈ స్నేహ బృందం మేమున్నామంటూ ముందుకొచ్చారు. షాలిని స్నేహితురాలు సరస్వతి, జనార్దన్ తదితరులు ఆమెను రక్షించుకునేందుకు నడుం కట్టారు. అంతా కలిసి రూ.2 లక్షల దాకా చందాలు వసూలు చేసి ఇచ్చారు. ప్లకార్డ్స్ పట్టుకుని తమ స్నేహితురాలిని కాపాడాలని ప్రదర్శనలు ఇచ్చి మరో రూ.25 వేలు సమకూర్చారు. ‘మంత్రి కేటీఆర్‌కి కూడా షాలిని పరిస్థితిపై ట్వీట్ చేస్తే వివరాలు పంపండి అంటూ స్పందించారు. మేం పంపాం. ఇంకా స్పందన రాలేదు’ అని వీరు చెప్పారు. ముందుకొచ్చిన సంస్థలు స్నేహితురాలిని రక్షించుకోవడానికి సహ విద్యార్థులు పడుతున్న తపన చూసి హైదరాబాద్ కైట్స్, నిఫ్టా, మిలాప్ తదితర సంస్థలు ‘మేము సైతం’ అంటూ ముందుకొచ్చాయి. అలా ఇంకో రూ.5 లక్షల దాకా పోగయ్యాయి. ‘షాలినికి ప్రస్తుతం బసవతారకం ఆస్పత్రిలో కీమోథెరపీ చేస్తున్నారు. విడతల వారీగా ఏదో ఒక మార్గంలో ఆమె చికిత్స ఆసాంతం మా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని మణిరాజ్ వివరించాడు.వరుస ఈవెంట్లు ఇందులో భాగంగా ఆదివారం ‘స్కెచ్ ఫర్ షాలిని’ పేరిట ఆమె ఫ్రెండ్స్ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. మాదాపూర్‌లోని ఫీనిక్స్ అరెనా వేదికగా ఔత్సాహిక చిత్రకళా విద్యార్థులు దీనిలో పాల్గొని లైవ్ స్కెచ్ వేస్తారు. ‘ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఫీ లేదు. 150 మంది దాకా ఆర్ట్ స్టూడెంట్స్ వచ్చి స్కెచ్ వేయవచ్చు. ‘ద బెస్ట్’ అనుకున్న పెయింటింగ్‌కి తగినంత గుర్తింపు వచ్చేలా చేస్తాం. అక్కడే డొనేషన్ బాక్స్ పెడతాం. స్కెచ్ ఫర్ షాలిని.. లైవ్ స్కెచ్ ప్రదర్శనకు వచ్చిన వారు విరాళాలు ఇవ్వవచ్చు’ అంటూ తమ కార్యక్రమం గురించి వివరించారు మిత్రబృందం. ఇదే కాకుండా వచ్చే వారం 5కే రన్ కూడా నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి వారాంతంలో ఇలా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. షాలిని చాలా హుషారుగా కనిపిస్తోందని, ఆమె తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతుందని హైదరాబాద్ కైట్స్ నిర్వాహకులు కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్నే‘హితానికి’ నిజమైన అర్థం చెబుతున్న ఈ విద్యార్థులకు సహకరించాలనుకునేవారు 9966862800/ 9705110802నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఇంజినీరింగ్ నేపథ్యంలో...
కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. టీజర్ విడుదలైన కొద్ది సేపటికే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘త్వరలోనే మా చిత్రాన్ని ట్రైలర్‌ని రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని ప్రశాంత్ తాత అన్నారు. అపూర్వ, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
నవీన్ చంద్రతో నటించడం చాల కష్టం
-
దుబాయ్
‘‘స్వర్ణా... అంతా బాగేనా?’’ మల్లేష్.‘బాగే మల్లేషన్నా.. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా.. ఈలోపు నువ్వే..’’ ‘‘షాలినీ కలుస్తుందా స్వర్ణా?’’ ఆమె మాటను పూర్తికానివ్వని మల్లేష్ ఉత్సుకత..‘‘ఫోన్?’’ ‘‘విల్సన్‌తో మాట్లాడకపోయినవా?’’ మల్లేష్.‘‘ఫోన్ చేశా. చాలా రాష్‌గా మాట్లాడాడు షాలినీ గురించి’’ అని ఓ క్షణం ఆగి.. ‘‘ఏం కథ పెట్టింది నీ ఫ్రెండ్? అబార్షన్ ఇల్లీగల్ అని తెలియదా? పోగొట్టడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎరక్కపోయి ఇరుకున్నా. ఇలాంటిదని తెలిస్తే.. వీసానే ఇప్పించకపోదును అంటూ చాలా అసహ్యంగా వాగాడు! షాలినీని కలవడానికి, మాట్లాడ్డానికి చాలా ట్రై చేశా. ప్చ్..! ఇప్పుడైతే ఫోన్‌కూడా పనిచేయట్లేనట్టుంది. ఎక్కడుందో.. ఏమో’’ బాధగా స్వర్ణ.‘‘షాలిని వాళ్ల అమ్మ నంబర్ ఏమన్నా ఉందా? ఆమెతో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా?’’ అడిగాడు.‘‘ఉన్నట్టుంది.. ఆమెతో మాట్లాడి..నీకు కాల్ చేస్తా..’’ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది స్వర్ణ. షర్ట్ పాకెట్లో ఫోన్ పడేసుకుంటూ గతంలోకి జారుకున్నాడు మల్లేష్. షాలిని ప్రెగ్నెంట్ అని తెల్వంగానే ఇండియా వచ్చేసిండు. అంతకుముందే.. మస్తు సార్ల సేuŠ‡ని చుట్టీ అడిగిండు. ఇయ్యలే. కరెక్ట్‌గా శాలినీ కడుపుతో ఉన్నా అని చెప్పుడు.. చుట్టీ దొరుకుడు ఒక్కసారే అయినయ్. ‘‘మా అమ్మకు బాగాలేదంట షాలినీ..! సోనాపూర్ క్యాంప్‌లో ఉండే మా ఊరాయన మొన్ననే ఇండియా నుంచి అచ్చిండు. మా అమ్మ మంచలకెంచి అస్సలు లేస్తలేదని చెప్పిండు. నేను బోవాలే. పదిహేను రోజులల్ల అస్తా మల్లా!’’ తెల్లవారి ప్రయాణం అనగా ముందు రోజు రాత్రి ఎప్పటిలెక్కనే గ్యారేజ్‌లో కల్సుకున్నడు షాలినీని. గుడ్ల నిండా నీళ్లు దీసుకుంది తప్ప ఏం మాట్లాడ్లే ఆ పిల్ల. దగ్గరకు దీసుకుంటూ చెప్పిండు ‘‘ఏం ఫికర్వెట్టుకోకు. తొందరగనే అస్తా..ఒకవేళ రాకపోతే మా అమ్మ ప్రాణం కిందమీదైంది అనుకో. ఫోన్ చేస్తా. ఏజెంట్‌తో మట్లాడి నువ్వే ఇండియాకు వచ్చేటట్టు చేస్తా. సరేనా..’’అని. అయినా ఆమె ఏం మాట్లాడ్లే. ఒక్కసారి తన కండ్లల్లకు జూసింది. గద్వ వట్టుకుని మళ్లా అన్నడు. ‘‘సరేనా’’ అని. కౌగిలి ఇడిపించుకుని ఎన్కకు తిరిగి చూడకుండా పోయింది. అబద్ధం చెప్తుండని ఆ పిల్లకు అర్థమైందా? ప్రెగ్నెంట్ అని తెల్వంగనే పారిపోతున్నడు అనుకుందా? పారిపోవుడు.. భయపడుడు నివద్దే కదా! ఊర్ల పెండ్లాం ఉందని నిజం చెప్పలే. ఇద్దరు పిల్లల తండ్రి అనీ చెప్పలే. లేని అమ్మకు రోగం అంటగట్టిండు. ఏం జేస్తడు? అప్పటికే తుట్టి యెవుసంతో పుట్టెడు అప్పులు. పెండ్లం మెడల పుస్తె అమ్మి మరీ దుబాయ్వాయే. ఎప్పుడో చిన్నప్పుడు గమ్మత్గా నేర్సుకున్న కార్ డ్రైవింగ్ అక్కరకొచ్చింది. తాను డ్రైవర్‌గా చేసే సేuŠ‡ ఇంట్లనే షాలిని పని మనిషి. తనను జూసి ఆ పిల్ల తెలుగు మాట్లాడేసరికి ప్రాణం లెషొచ్చిన్నట్టయింది. అట్ల అయిన దోస్తాని దొంగతనంగా రొట్టెలు, కూరలు తెచ్చిచ్చేదాకా వెరిగింది. ప్రేమిస్తున్నా అని ఇంకా దగ్గరైండు. ఇల్లు, పిల్లలు ఎవ్వరు గుర్తురాలే. మూడ్నెల్లకు ఒకసారి ఇంటికి పైసలు పంపిస్తున్నప్పుడు ఇంటోల్లకు ఒక కాల్ చేస్తుండే గంతే. ఆ పిల్ల గర్భవతి అని తెల్సినంకనే ఇల్లు, పెండ్లాం, పిల్లలు గుర్తొచ్చుడు మొదలువెట్టిండ్రు. తప్పిచ్చుకొని ఇండియాకొచ్చేషిండు. టపాటపా వేప చెట్టు ఆకులు రాలుతూండడంతో వాస్తవంలోకి వచ్చాడు మల్లేష్. చుట్టూ చూశాడు. ఎండ మండుతోంది. తను కూర్చున్న చెట్టు తప్ప ఇంకే చెట్టూ ఊగట్లేదు. ఉక్కపోత ఉగ్గబట్టి రవ్వంత గాలికీ చోటివ్వట్లేదు. ఆ పెద్ద వేప చెట్టు మాత్రం వేర్లు పెకలి నేల కూలుతుందా అన్నంతగా ఊగుతోంది.. వింతగా! దడ పట్టుకుంది మల్లేష్‌కి. లేచి నిలబడ్డాడు.అతని ముందుకు ఒక్కసారిగా సుడి గాలి.. మనిషి ఆకారంలో! గిర్రున తిరుగి మాయమైంది. రెండు మొహాలు.. కనిపించాయి.. మల్లేష్‌కి.. అంత వేగంలో కూడా ఒక మొహాన్ని గుర్తుపట్టగలిగాడు.. శాలిని! మరి ఇంకో మొహం..? అపరిచితమైందీ కాదు.. సుపరిచితం అంతకన్నా కాదు. ఎవరు ఆమె.. ఎక్కడ చూశాడు? చూశాడా? లేక భ్రమా?మొహం పాలిపోయింది.. ఎండకు గొంతు తడారి పెదవులు పొడిబారాయి!దాహం.. దాహం.. మంచి నీళ్లు.. నోరు ఎండిపోతోంది. చేనును తడుపుతున్న బోర్ పంప్ దగ్గరికి వెళ్లాడు. నీటి ధారకు దోసిలి పట్టాడు. ఠక్కున నీళ్లు ఆగిపోయాయి. బోర్ మాత్రం నడుస్తూనే ఉంది. ‘‘ఎడారి దేశంలో ఉండొచ్చావ్.. దప్పిక అలవాటవలేదా?’’ వినిపించింది వెనకనుంచి.షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. ఓ స్త్రీ.. ఇందాకటి ఇంకో మొహం.నవ్వుతోంది.. తనను చూసి. నల్ల చీర.. చెవులదాకా వెడల్పు.. మెడ మీద పడేంత పొడవు ఉన్న దట్టమైన తెల్లటి జుట్టు ముడి.. రూపాయి బిళ్లంతా నల్లటి బొట్టుతో ఉంది ఆ స్త్రీ. జలజలమని నీటి ప్రవాహం పంప్ వెంట. ఆ చప్పుడికి అటు వైపు చూశాడు. ‘‘పో..’’ గద్దించింది ఆమె.తన ప్రమేయం లేకుండానే ఎవరో వెనక నుంచి తోసినట్టు.. వచ్చి పంప్ దగ్గర పడ్డాడు. దోసిలి పట్టాడు. మళ్లీ ఆగిపోయింది. బిత్తరపోయి వెనక్కి తిరిగాడు. ఆవిడ లేదు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగులు దీశాడు. పది అడుగులు వేస్తే వచ్చే ఇల్లు.. ఎంత పరిగెత్తినా రావట్లేదు. మధ్యాహ్నం మొదలుపెడితేపొద్దుగుంకింది.. చూస్తుండగానే చీకట్లూ అలుముకున్నాయి. అల్లంత దూరంలోనే కనపడుతోంది ఇల్లు.. అయినా చేరుకోలేకపోతున్నాడు. మొసతో వగరుస్తున్నాడు. ఇంట్లో లైట్వెలుగుతోంది. భార్య చేటలో బియ్యం చెరుగుతోంది. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నీడలుగా కనపడుతున్నారు. చేయి చాస్తే అందుకునేంత చేరువగా ఉన్నారు. ఆయసంతో అడుగులు వేయలేక చేయి చాచాడు.. ఎవరినీ అందుకోలేకపోతున్నాడు. గుండెలో నొప్పి.. ఓ చేత్తో గుండెను పట్టుకొనే ఇంకో చేత్తో తన వాళ్లను అందుకోవాలనే ఆరాటంతో పరిగెడ్తున్నాడు.. అర్ధరాత్రి అయింది.. అయినా ఇల్లు చేరలేదు మల్లేష్. ఆగిపోయాడు.. తన వల్ల కాదు.. మాట్లాడలేనంత ఎండిపోయి ఉంది నోరు.. దాహం.. దాహం.. మాట గొంతులో ఉంది.. బయటకు రావట్లేదు..కళ్లు మూతలు పడ్తున్నాయి..ఎదరుగా ఆమె.. ‘‘చేరుకున్నావా నీ వాళ్లను? వీళ్ల కోసమే కదా.. షాలినీని ఒంటరిగా వదిలి వచ్చేశావ్? పిరికితనంతో బిడ్డను పుట్టకుండానే చంపేశావ్.. వెళ్లు... నీ వాళ్ల దగ్గరకు వెళ్లు.. పో... ఊ.. ’’ గర్జించింది ఆ స్వరం. మళ్లీ అప్రయత్నంగానే పరుగు మొదలుపెట్టాడు మల్లేష్. జేబులో ఉన్న ఆయన ఫోన్ మోగుతోంది.. చాలా సేపటి నుంచి.. ఛాతి దగ్గర ఎడమవైపు కలుక్కు మంటూంటే.. చేత్తో పట్టుకున్నాడు. ఆ స్థానంలోనే ఉన్న జేబులోని ఫోన్ ప్రెస్ అయి స్పీకర్‌తో సహా ఫోన్ కాల్ ఆన్ అయింది..‘‘మల్లేషన్నా.. షాలినీ మీద బెంగతో వాళ్లమ్మ చనిపోయిందట అన్నా.. ’’ కుప్పకూలిపోయాడు మల్లేష్. - సరస్వతి రమ -
లవ్ థ్రిల్లర్
కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించారు. లలితకుమారి బొడ్డుచర్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో లవ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ఇంటెన్సివ్‌గా ఉండి, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ తదితరులు నటించిన ఆ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
చెన్నైలో శ్రీదేవి సంవత్సరీకం
పెరంబూరు (చెన్నై): దివంగత నటి శ్రీదేవి తొలి స్మారక దిన కార్యక్రమం చెన్నైలో గురువారం జరిగింది. ‘అతిలోక సుందరి’ శ్రీదేవి గతేడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. మరో 10 రోజులకు శ్రీదేవి మరణించి ఏడాది పూర్తి అవుతుంది. అయితే తిథి ప్రకారం గురువారానికి (14వ తేదీ) ఏడాది అయ్యింది. దీంతో ఆమె భర్త బోనీకపూర్, ఆయన సోదరుడు అనిల్ కపూర్, కూతుళ్లు జాన్వి, ఖుషీ గురువారం చెన్నైకి చేరుకుని.. శ్రీదేవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ నటుడు అజిత్, ఆయన భార్య శాలిని పాల్గొన్నారు. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తమిళ వెర్షన్లో అజిత్ అతిథి పాత్రలో నటించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. అజిత్‌తో ఒక సినిమా నిర్మించాలని శ్రీదేవి అనుకున్నారని ఒక ఇంటర్వ్యూలో బోనీకపూర్ వెల్లడించారు. సరైన కథ దొరక్కపోవడంతో సినిమా తీయలేకపోయినట్టు చెప్పారు. హిందీలో హిట్టయిన పింక్ సినిమాను తమిళంలో తీయాలని తనకు అజిత్ సూచించారని చెప్పారు. -
ప్రేమ పోరాటం
‘‘మోని’ టైటిల్ ఆసక్తిగా ఉంది. దర్శకుడు సత్యనారాయణ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తాను ఇదివరకు చేసిన ‘నందికొండ వాగుల్లోన’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ‘మోని’ కూడా సూపర్ హిట్ అవ్వాలి. నిర్మాతకు డబ్బులు రావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. లక్కీ ఏకారి, నాజియా జంటగా సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో రంజిత్ కోడిప్యాక సమర్పణలో తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రం ‘మోని’. నవనీత్ చారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను సాయి వెంకట్ విడుదల చేశారు. రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘షాలిని, నందికొండ వాగుల్లోన’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు లక్కీ ఏకారి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉన్నాయి. మా బ్యానర్లో రెండో చిత్రంగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుంది’’ అన్నారు సత్యనారాయణ ఏకారి. ‘‘ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు మాకు, మా టీమ్‌కి మంచి క్రేజ్ తేవాలి’’ అని లక్కీ ఏకారి, నాజియా అన్నారు. సంగీత దర్శకుడు నవనీత్ చారి పాల్గొన్నారు. -
ఎంటర్టైనింగ్.. ఎంగేజింగ్
కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో ప్రశాంత్ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ –‘‘ఈ చిత్రానికి కథే బలం. యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో జరిగే కథ ఇది. యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్.మా సినిమాలో అదేంటన్నది సస్పెన్స్’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘మా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. జులై ఫస్ట్ వీక్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోయిన్గా ఇది నా రెండో చిత్రం. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు డింపుల్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: విశ్వ. -
మేకింగ్ ఆఫ్ అర్జున్‌రెడ్డి