Actress Baby Shamili With Her Sister Shalini Family Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Baby Shamlee: అక్క షాలినితో షామిలీ, ఎంతగా మారిపోయిందో..

Published Thu, Mar 10 2022 12:54 PM | Last Updated on Thu, Mar 10 2022 7:43 PM

Actress Baby Shamili With Her Sister Shalini Family Photos Goes Viral - Sakshi

చైల్డ్‌ అర్టిస్ట్‌గా ఎంతో మందిని ఆకట్టుకుంది నటి బేబీ షామిలీ. ‘అంజలి అంజలి..  మెరిసే నవ్వుల పువ్వుల జాబిల్లీ’ అంటూ క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఎంతోమంది మనసులు దొచుకుంది. ఇక ఓయ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షామిలీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాల నటిగా ముద్దుగా కనిపించిన షామిలీ పెద్దాయ్యాక బోద్దుగా ఉందని, ముఖంలో చిన్ననాటి కళ లేదంటూ ట్రోల్స్‌ ఎదుర్కొంది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం సినిమాలకు బ్రేక్‌ తీసుకుంది.

చదవండి: పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్‌ నిర్ణయం!

ఆ తర్వాత శరీరాకృతిపై ఫోకస్‌ పెట్టిన షామిలీ ఒక్కసారిగా బక్కచిక్కి నాగశౌర్య అమ్మమ్మగారి ఇల్లు మూవీతో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చింది.  అయినప్పటికీ అఫర్స్‌ రాకపోవడం ఇక నటనకు గుడ్‌బై చెప్పి చదువుపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన సోదరి, నటి షాలిని-అజిత్‌ల ఫ్యామిలీ ఫంక్షన్‌లో తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా షామిలీ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: ఆ యాక్షన్‌ సీన్‌లో ప్రభాస్‌ను విలన్‌ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత..

ఇందులో అక్క షాలిని, ఆమె కూతురు అనోష్కతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌస్.. దానికి తగ్గట్టుగా ముడి వేసిన జుట్టుతో షామిలీ సరికొత్త లుక్‌లో మెరిసిపోయింది. సన్నగా నాజుగ్గా తయారైన షామిలీని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. సూపర్‌ మేడం, చాలా అందంగా ఉన్నారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు అంటూ నెటిజన్లు నుంచి కాంప్లీమెంట్స్‌ అందుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement