Hero Ajith Kumar Daughter Anoushka And Family Latest Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ajith Kumar: అజిత్‌ కూతురు అనౌష్కను చూశారా? ఇప్పుడు ఎంత అందంగా తయారైందో!

Jan 2 2023 4:16 PM | Updated on Jan 2 2023 4:54 PM

Hero Ajith Kumar Daughter Anoushka, Family Latest Pics Goes Viral  - Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ అజిత్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌. ఇండస్ట్రీలో ఆయనకు వివాదా రహితుడు. పొగడ్తలైన, విమర్శలనై ఒకేలా తీసుకుంటూ తన పనేంటో తాను చూసుకుంటాడు. ఇక తన పని తర్వాత అజిత్‌ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది కుటుంబానికే. హీరోగా ఎంత బిజీగా కుటుంబానికి ఎప్పుడు సమాయాన్ని కెటాయిస్తాడు.

చదవండి: వాల్తేరు వీరయ్య టైటిల్‌ సాంగ్‌ లిరిక్స్‌ వివాదం.. యండమూరికి చంద్రబోస్‌ గట్టి కౌంటర్‌

ముఖ్యంగా పండుగలు, పుట్టిన రోజు వేడుకుల, స్పెషల్‌ డేస్‌ అసలు మిస్‌ అవ్వడు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు అజిత్‌. అయితే అజిత్‌ కుటుంబం విషయంలో చాలా గోప్యత పాటిస్తాడనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషమాలను, కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయమైన బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపడు. ఈ నేపథ్యంలతో న్యూ ఇయర్‌ను కుటుంబంతో కలిసి విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకున్నాడు అజిత్‌.

భార్య షాలిని, కూతురు అనౌష్క, కుమారుడు ఆద్విక్‌లతో కలిసి విదేశాల్లో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇందులో అజిత్‌ కూతురు అనుష్క స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. మీడియా ముందు పెద్దగా కనిపించని అనౌష్క హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కనిపించి షాకిచ్చింది. మీడియాకు, సోషల్‌ మీడియా దూరంగా ఉండే అజిత్‌ కూతురు సడెన్‌గా ఇలా కనిపించడంతో ఆమె హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె ఏం చేస్తుంది, ఏం చదువుతుంది, సినిమాల్లోకి ఎప్పుడు ఇస్తుంది? అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.

చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement