
టాలీవుడ్ హీరోల్లో నితిన్ స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లాడు. ప్రముఖ దర్శకులతో సైతం చిత్రాలు చేశారు. మాస్ మూవీస్ చేయడంతో పాటు లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల్లోనూ నటించారు. అలా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా హిట్ సినిమాలతో ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే నితిన్.. జూన్ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. షాలిని అనే అమ్మాయితో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.
అయితే తాజాగా నితిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను త్వరలోనే తండ్రి కాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. వివాహం అయినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ జంట అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం తప్ప ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. అయితే దీపావళి సందర్భంగా ఈ జంట ఓ ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో అభిమానులు ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నితిన్ స్వయంగా రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది.
Happy Diwali 🪔…. From ours to yours ❤️ pic.twitter.com/CkA7pT8IEi
— nithiin (@actor_nithiin) October 24, 2022
Comments
Please login to add a commentAdd a comment