hero nitin
-
తెలుగు సినిమాల్లోనే ఎలాంటి రోల్ ఎవరు చేయలేదు..
-
ఇప్పుడు బాలీవుడ్ కి అంత లేదు... టాలీవుడ్ టాప్ లో ఉంది
-
మీకోసం ఎక్సట్రార్డినరీ మూవీ రిలీజ్..!
-
హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ.. అక్కడి నుంచి పోటీ?
టాలీవుడ్ హీరో నితిన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?.. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా?. సినిమా కెరీర్‌ను ఫణంగా పెట్టి పొలిటికల్ కెరీర్లోకి దూకేంత సాహసం చేస్తారా?. ఎందుకు ఈ మధ్యన హీరో నితిన్ పేరు చెప్పగానే అనేక రాజకీయ పుకార్లు షికారు చేస్తున్నాయి?.. నిజామాబాద్ జిల్లాకు చెందిన యంగ్ హీరో నితిన్ పేరు ఈ మధ్యకాలంలో పొలిటికల్ సర్కిల్స్‌లో పదే పదే వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆయన నిజమాబాద్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే పుకారు ఒకటి షికారు చేస్తోంది. నితిన్ బంధువులు కొందరు రాజకీయాల్లో ఉండటంతో వారి ఈ గుసగుసలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ విషయాన్ని జిల్లాకు చెందిన కొందరు రాజకీయ విశ్లేషకులు కొట్టేస్తున్నారు. ఆయన తన బంధువులకు టికెట్ ఇప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప స్వయంగా రాజకీయాల్లో రావడానికి కాదు అని వారు అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ ఎంట్రీపై పుకార్లు షికారు.. నితిన్ రాజకీయ ప్రవేశం గురించి గతంలో కూడా వాడిగా వేడిగా పుకార్లు షికారు చేశాయి. గతంలో ఆయనను కొంతమంది బీజేపీ పెద్దలు కలిసి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలకడమే దీనికి కారణం. అయితే, ఆయన వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తన బంధువులు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తన మద్దతు కాంగ్రెస్‌కే వుంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో సత్సంబంధాలు.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన నితిన్ కుటుంబం.. చాలా రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి పేరున్న నిర్మాత. నితిన్ రక్త సంబంధీకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మేనమామ నగేష్ రెడ్డి గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీకి పది సంవత్సరాలు చైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టికెట్‌ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ టికెట్‌ను జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డి, భూపతిరెడ్డి లాంటి నాయకులు ఆశిస్తున్నట్టు సమాచారం. రేవంత్‌తో భేటీ.. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ మీదే హీరో నితిన్ కూడా కన్నేశారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, నితిన్ స్వయంగా రాజకీయాల్లోకి రాకపోవచ్చని.. తన మేనమామ నగేష్ రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డితో నగేష్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ సమయంలో టికెట్ ప్రస్తావన వచ్చిందని సమాచారం. అయితే, సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయింపు ఉంటుందని రేవంత్.. నగేశ్‌కు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నితిన్ ద్వారా టికెట్ కోసం నగేశ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపోస్తోంది. మరి నితిన్ స్వయంగా రాజకీయ రంగంలోకి దిగుతారా లేదా మేనమామకు టికెట్ ఇప్పించుకుంటారా అనేది వేచి చూడాలి. ఇది కూడా చదవండి: బీజేపీలో బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి సమక్షంలో నేతల మధ్య రగడ -
అభిమానులకు నితిన్ త్వరలోనే సర్ ప్రైజ్ ఇవ్వనున్నారా?
టాలీవుడ్ హీరోల్లో నితిన్ స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లాడు. ప్రముఖ దర్శకులతో సైతం చిత్రాలు చేశారు. మాస్ మూవీస్ చేయడంతో పాటు లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల్లోనూ నటించారు. అలా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా హిట్ సినిమాలతో ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే నితిన్.. జూన్ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. షాలిని అనే అమ్మాయితో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా నితిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను త్వరలోనే తండ్రి కాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. వివాహం అయినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ జంట అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం తప్ప ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. అయితే దీపావళి సందర్భంగా ఈ జంట ఓ ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానులు ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నితిన్ స్వయంగా రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది. Happy Diwali 🪔…. From ours to yours ❤️ pic.twitter.com/CkA7pT8IEi — nithiin (@actor_nithiin) October 24, 2022 -
బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జేపీ నడ్డాతో భేటీ కానున్న హీరో నితిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శంషాబాద్ నోవాటెల్‌లో రేపు(శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ కానున్నారు. సినీ రచయితలు, క్రీడాకారులతో కూడా నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవలే అమిత్‌షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? -
ఎంగేజ్డ్
హీరో నితిన్ వివాహం షాలినీతో నిశ్చయమయిన సంగతి తెలిసిందే. బుధవారం నితిన్ ఇంట్లో జరిగిన నిశ్చితార్థం వేడుక జరిగింది. ‘ఎంగేజ్డ్’ అంటూ నితిన్ తన నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. నితిన్ క్రీమ్ కలర్ కుర్తా, పైజమాలో హ్యాండ్సమ్గా కనిపించగా, షాలిని ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. వీరి వివాహ వేడుక ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్నామా ప్యాలెస్‌లో జరగనుంది. వాస్తవానికి వీరి వివాహాన్ని భారీ ఎత్తున ప్లాన్చేశారు, కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. అతికొద్దిమంది బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది. -
టైమ్ ఫిక్స్
హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘రంగ్ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో), ‘చెక్’ (చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో) చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు నితిన్. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్‌పేట’, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న హిందీ హిట్ ‘అంధాదూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తారు. -
వంశీ... భాగ్యరాజా కలసి చేసినట్లు..!
హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఏవీయస్ రాజు సమర్పణలో స్వీయదర్శకత్వంలో శివరాజ్ కనుమూరి రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్ లుక్ వీడియో పోస్టర్‌ను దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్ ఆవిష్కరించారు. లుక్ కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు. చిత్రబృందానికి నితిన్ శుభాకాంక్షలందజేశారు. దర్శకులు వంశీ, భాగ్యరాజాలు కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంటుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొంభై శాతం చిత్రీకరణ పూర్తయ్యిందనీ, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ శివరాజ్ కనుమూరి, ఏవీయస్ రాజు తెలిపారు. ఈ చిత్రానికి రచనా సహకారం అందించడంతో పాటు ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న పరమ్ సూర్యాన్షు, ముఖ్య పాత్ర చేస్తున్న రవివర్మ పాల్గొన్నారు. -
ఫైట్లు కంటే డ్యాన్సులు బాగుంటాయి: నాగ్
విజయవాడ : విజయదశమికి 'అఖిల్' సినిమా విడుదల అవుతుందని హీరో నాగార్జున తెలిపారు. కల్యాణ్ జ్యూయలర్స్ 7 స్టార్ సెలబ్రేషన్స్‌ను ఆయన నిన్న విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ అఖిల్ చిత్రంలో ఫైట్లు కంటే డ్యాన్సులు చాలా బాగుంటాయన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్...వీవీ వినాయక్ దర్శకత్వంలో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అఖిల్ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'అఖిల్' . 'ది పవర్ ఆఫ్ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి హీరో నితిన్ నిర్మాత. విజయదశమి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ వార్తల్లో... నిజం లేదట!
అక్కినేని కుటుంబం నుంచి కొత్తగా తెరపైకి వచ్చిన నట వారసుడు అఖిల్ అక్కినేని. ‘మనం’ క్లైమాక్స్‌లో ఒక చిన్న అతిథి పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన ఈ నవ యువకుడు పూర్తిస్థాయి హీరోగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం షూటింగ్లో అఖిల్ బిజీ బిజీగా ఉన్నారు. మరో యువ హీరో నితిన్, ఆయన అక్కయ్య నిఖితా రెడ్డి తమ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. అన్నపూర్ణా ఏడెకరాల్లో కుటుంబ సన్నివేశాలతో సహా కొన్ని కీలక ఘట్టాలను తీస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన యువ నటి సాయేషా సైగల్ వెండితెరకు పరిచయమవుతున్నారు. సుప్రసిద్ధ బాలీవుడ్ జంట సైరా బాను - దిలీప్ కుమార్‌లకు అతి సమీప బంధువు - ఈ నూతన నటి. వెలిగొండ శ్రీనివాస్ అందించిన ఈ చిత్ర కథకు కోన వెంకట్ - గోపీమోహన్ జంట మాటలు సమకూరుస్తున్నారు. కాగా, ఈ చిత్రకథ ఒక సోషియో - ఫ్యాంటసీ అనీ, గతంలో చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’కీ దీనికీ పోలికలున్నాయనీ ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదనీ, ఈ చిత్రకథ వినోదాత్మకంగా సాగుతుందనీ చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కథాంశం ఏమైనప్పటికీ, అటు నాగార్జున బృందం, ఇటు నితిన్ బృందం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా హీరోగా అఖిల్ ఎంట్రీ భారీగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో! -
నాన్న , నేను అనుకునే అలా చేశాం : నాగార్జున
‘‘నాన్నగారు ఇంకా చాలా రోజులు ఉండరని అప్పటికే మాకు తెలుసు. అందుకే, ఆయన చేతుల మీదుగా అఖిల్ పరిచయం అయితే బాగుంటుం దను కున్నాం. నాన్న గారి ఆశ కూడా అదే. అందుకే మేమిద్దరం అనుకుని, ‘మనం’ ద్వారా అఖిల్‌ను పరిచయం చేశాం. నాన్నగారి ఆశీర్వాదాలు చిన్నవి కాదు.. చాలా పెద్దవి’’ అంటూ తనయుడు అఖిల్ పరిచయ వేడుకలో అక్కినేని నాగార్జున ఉద్వేగంగా మాట్లాడారు. చిన్నప్పుడే ‘సిసింద్రీ’లో ఆకట్టుకున్న అఖిల్ ‘మనం’లో కొన్ని సెకన్లే కనిపించినా, ‘స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది’ అనిపించుకున్నారు. ఇక, పూర్తిస్థాయి హీరోగా అఖిల్ పరిచయం కానున్న చిత్రం ఆ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, శనివారం రాత్రి హైదరాబాద్‌లో అక్కినేని అభిమానుల సమక్షంలో హీరోగా అఖిల్ పరిచయ వేడుకను భారీయెత్తున నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఈ కథ చాలా బాగుంది. అయితే, ఇది ప్రేమకథా చిత్రం కాదు. పూర్తిగా మాస్ మూవీ’’ అన్నారు. ఇక, అఖిల్ దూసుకెళ్లిపోతాడని దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆశీర్వదించారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఇది అభిమానులు పండగ చేసుకోవాల్సిన సమయం. పరిశ్రమకు కొత్త సూపర్ స్టార్ వచ్చాడు. క్రికెట్లో సిక్సర్లు, సెంచరీలు కొడతాడు. అలాగే, తన ప్రతి సినిమా కూడా సెంచరీయే అవుతుంది. అఖిల్ కచ్చితంగా తెరపైనా ఆల్‌రౌండర్ అవుతాడు’’ అని పేర్కొన్నారు. అమల మాట్లాడుతూ - ‘‘అక్కినేని కుటుంబంలోకి నాగార్జున ఫ్యాన్‌గా ప్రవేశించా. మా అబ్బాయిని మీ (అభిమానులను ఉద్దేశించి) చేతుల్లో పెడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ సాయేషా ఓ క్లాసిక్ బ్యూటీ’’ అని చెప్పారు. నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘క్రికెట్ అంటే అఖిల్‌కి హాబీ. దాని కోసమే ఎంతో కష్టపడేవాడు. ఇక, సినిమా అంటే పిచ్చి. దీనికోసం ఏ స్థాయిలో కష్టపడతాడో ఊహించవచ్చు. దేశంలోని ప్రతి అభిమానినీ ఇంప్రెస్ చేస్తాడు’’ అన్నారు. వీవీ వినాయక్ మాట్లా డుతూ, ‘‘నన్ను నమ్మి నాగార్జునగారు పెద్ద బాధ్యతను నాకప్పగిం చారు. ఆయన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతాను’’ అని తెలిపారు. నితిన్ మాట్లాడుతూ - ‘‘నా ఆప్తమిత్రుడు అఖిల్‌తో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాగార్జునగారు నటించిన ‘నిన్నే పెళ్లాడతా’, వీవీ వినాయక్ గారి మాస్ సినిమాలు కలిస్తే ఈ సినిమా’’ అని చెప్పారు. ఈ వేడుకలో మహేశ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ఉద్వేగంగా ఉంది : అఖిల్ అక్కినేని ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. చాలా ఉద్వేగంగా ఉంది. ముందుగా ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లే మా ‘అమ్మా, నాన్న’. ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో అమ్మ చెబుతుంటుంది. నాన్న అయితే ఎప్పుడూ అభిమానుల గురించే చెబుతుంటారు. మా అన్నయ్య (నాగచైతన్య) నా గురించి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. మేమిద్దరం సూపర్ హిట్ మల్టీస్టారర్ మూవీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నా. గత ఐదేళ్లుగా సీసీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా వెంకీ (వెంకటేశ్) మామతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. అసలేం చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? అని తర్జన భర్జన పడుతున్న సమయంలో చీకట్లో సెర్చ్ లైట్లా కనిపించారు వినాయక్ గారు. మంచి కథ చెప్పారు. నేను అన్నయ్యలా భావించే నా స్నేహితుడు నితిన్ దాదాపు రెండు, మూడేళ్లుగా ‘నీ ఫస్ట్ సినిమా కమర్షియల్ హంగులతో ఉండాలి’ అని నసపెడుతూ వచ్చాడు (నవ్వుతూ). చివరికి తనే నా నిర్మాత కావడం ఆనందంగా ఉంది. సోమవారం నుంచి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొననున్నాను. ఈ సమయంలో తాతగారు గుర్తొస్తున్నారు. ఆయన దేవుణ్ణి నమ్మేవారు కాదు. ఎందుకంటే అభిమానుల్లోనే దేవుణ్ణి చూసుకున్నారు. నాకూ వాళ్ళే దేవుళ్ళు.’’ -
హీరో నితిన్‌ను పెళ్ళి చేసుకుంటానంటూ..!
-
హీరో నితిన్నే పెళ్లి చేసుకుంటా..!
* హీరోనే పెళ్లి చేసుకుంటానంటూ మారాం * కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టిన పోలీసులు బంజారాహిల్స్: సినీ నటుడు నితిన్ నివాసంలోకి ప్రవేశించి ఓ యువతి కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... రాత్రి పదిగంటల ప్రాంతంలో ఓ యువతి జూబ్లీహిల్స్‌లోని సినీ నటుడు నితిన్ ఇంటివద్దకు చేరుకుంది. అక్కడి సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి ప్రహరీ దూకి ఇంట్లోకి ప్రవేశించి కారిడార్‌లో నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున నితిన్ తల్లి నిద్రలేచి చూడగా యువతి కనిపించింది. ఆందోళన చెందిన నితిన్ తల్లి ఆ యువతిని ప్రశ్నించింది. ‘నేను నితిన్ అభిమానిని.. ఆయన కోసమే ఇక్కడికి వచ్చా’నని స్పష్టం చేసింది. దీంతో నితిన్ తల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యువతిని విచారించగా ఆమె ఓ పోలీసు అధికారి కూతురని తెలిసింది. ‘నేను నితిన్‌ను ప్రేమిస్తున్నానని.. ఆయన లేకుంటే జీవించలేను.. ఆయన్నే పెళ్లి చేసుకుంటా’నని పోలీసులతోనూ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు ఆ యువతిని ఆమె ఇంటి వద్ద వదిలేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి
చిన్నదాన నీకోసం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మించిన ‘చిన్నదాన నీకోసం’ ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ శనివారం రాత్రి ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించారు. హీరో నితిన్, హీరోయిన్ మిస్త్రీ, డెరైక్టర్ కరుణాకర్ హాజరై ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స డ్రమ్ముతో, నటుడు ఆలీ డ్యాన్సతో యూత్‌కు కిర్రెక్కించారు. తిరుపతి: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి అని అందుకే తన ప్రతి సినిమాలో పవన్‌కల్యాణ్ పేరు వచ్చేట్టు సూచించామని హీరో నితిన్ అన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం రాత్రి ‘చిన్నదాన నీకోసం’ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిం ది. శ్రేష్ట్‌మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై ఘన విజయం సాధిం చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని శనివారం రాత్రి తిరుపతిలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నితిన్, హీరోయిన్ మిస్త్రీ, నిర్మాత నిఖితా రెడ్డి, డెరైక్టర్ కరుణాకరన్‌తో పాటు ఆలి, నరేష్, జోష్ రవి, మధు, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌తో పాటు చిత్రం యూనిట్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ తాను నటించిన తాజా చిత్రం చిన్నదాన నీకోసం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండువారాలుగా టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. పవన్‌కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. అందుకే ఆయనను ఎంతగానో ఆరాధిస్తానన్నారు. 12 వరుస ప్లాప్‌ల తర్వాత విడుదలైన ఇష్క్ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు పవన్‌కల్యాణ్ వచ్చి తనను ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. దేవుడే పవన్‌కల్యాణ్ రూపంలోవచ్చి విజయం అందించారని తెలిపారు. పవన్‌కల్యాణ్, కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితోనే సినిమారంగానికి వచ్చానని చెప్పారు. తొలిచిత్రం కరుణాకరన్‌తోనే చేయాలనుకున్నప్పటికీ 20 సినిమాల తర్వాత అవకాశం దక్కిందన్నారు. ఈ చిత్రంలో తాను పవన్‌కల్యాణ్ అభిమానిగా నటించానన్నారు. ఈ సినిమా అనంతరం ఈ చిత్ర హీరోయిన్ మిస్త్రి పెద్దహీరోయిన్‌గా ఎదుగుతారని జోస్యం చెప్పారు. అలాగే సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ చక్కటి మ్యూజిక్ అందించారన్నారు. హీరోయిన్ మిస్త్రి మాట్లాడుతూ ఈ చిత్రం వందశాతం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చె ప్పారు. సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ మాట్లాడుతూ నితిన్‌తో తనది నాల్గవ చిత్రమన్నారు. ఇప్పటికే ఆడియో విజయవంతమయిందని, చిత్రం మరింత విజయవంతమవుతుందని చె ప్పారు. తిరుపతికి చెందిన సినీనిర్మాత ఎన్వీ.ప్రసాద్ మాట్లాడుతూ చిన్నదాన నీకోసం ఆల్‌టైమ్ రికార్డు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ నితిన్ జ్ఞాపికలు అందజేశారు. -
శ్రీవారి సన్నిధిలో హీరో నితిన్
-
తొలిప్రేమలాగా 'చిన్నదాన నీకోసం' కూడా
తిరుమల : ఈ నెల 25న విడుదల కానున్న 'చిన్నదాన నీకోసం' సినిమా ప్రతిఒక్కర్నీ ఆలరిస్తుందని హీరో నితిన్ ధీమా వ్యక్తం చేశాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమని నిత్ తెలిపాడు. వచ్చే గురువారం సినిమా విడుదల సందర్భంగా.... నితిన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనాల విరామ సమయంలో అతను స్వామివారి సేవలో పాల్గొన్నాడు. అనంతరం అర్చకులు నితిన్‌ను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర విజయంపై ఇష్క్ హీరో ధీమా వ్యక్తం చేశారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవటం తనకు సెంటిమెంట్‌గా మారిందన్నాడు. తొలిప్రేమ చిత్రంలాగా 'చిన్నదాన నీకోసం' కూడా అందర్ని ఆకట్టుకుంటుందన్నాడు. ప్యూర్ లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలిపాడు. గత రెండు సినిమాల్లో పాటలు పాడిన... తాను ఈ చిత్రంలో పాట పాడలేదని...విలేకర్ల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇక 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా నితిన్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. -
హీరో అఖిల్... నిర్మాత నితిన్!
కొంత కాలంగా వార్తల్లో ప్రథమాంశంగా నిలుస్తోన్న అఖిల్ అక్కినేని సినీ అరంగేట్రం జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హీరో నితిన్ నిర్మాత కావడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలు కానుంది. నితిన్ మాట్లాడుతూ -‘‘అఖిల్ సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాం. ‘దిల్’తో నా కెరీర్‌ని మలుపు తిప్పిన వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించే అద్భుతమైన సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’ అని చెప్పారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ముహూర్తం షాట్ తీసినట్లు అఖిల్, నితిన్‌లు ట్విట్టర్లో పెట్టగానే ఒక గంటలో రెండు లక్షల క్లిక్స్ వచ్చాయంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.