వంశీ... భాగ్యరాజా కలసి చేసినట్లు..! | Jayammu nischayammu First Look Video Poster | Sakshi
Sakshi News home page

వంశీ... భాగ్యరాజా కలసి చేసినట్లు..!

Published Mon, Feb 15 2016 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

వంశీ... భాగ్యరాజా కలసి చేసినట్లు..!

వంశీ... భాగ్యరాజా కలసి చేసినట్లు..!

హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఏవీయస్ రాజు సమర్పణలో స్వీయదర్శకత్వంలో శివరాజ్ కనుమూరి రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్ లుక్ వీడియో పోస్టర్‌ను దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్ ఆవిష్కరించారు. లుక్ కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు.

చిత్రబృందానికి నితిన్ శుభాకాంక్షలందజేశారు. దర్శకులు వంశీ, భాగ్యరాజాలు కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంటుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొంభై శాతం చిత్రీకరణ పూర్తయ్యిందనీ, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ శివరాజ్ కనుమూరి, ఏవీయస్ రాజు తెలిపారు. ఈ చిత్రానికి రచనా సహకారం అందించడంతో పాటు ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న పరమ్ సూర్యాన్షు, ముఖ్య పాత్ర చేస్తున్న రవివర్మ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement