
టాలీవుడ్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్‌లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే డైరెక్టర్తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.
కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.