atharintiki dharedhi
-
అత్తారింటికి దారేది నటుడికి ప్రతిష్టాత్మక అవార్డ్!
టాలీవుడ్ మూవీ అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీకి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రానికి గానూ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. తాజా చిత్రం ది మెహతా బాయ్స్‌లో నటనకు ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బోమన్.తాజాగా టోరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. తండ్రి, కుమారుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో ది మెహతా బాయ్స్ అనే చిత్రాన్ని బోమన్ ఇరానీ తెరకెక్కించారు. కాగా.. అంతకుముందే సెప్టెంబరు 20న చికాగోలో జరిగిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ది మెహతా బాయ్స్ మూవీ ఆయనకు మరో ఘనతను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఆస్కార్-విజేత అలెగ్జాండర్ డినెలారిస్ కథ అందించారు. ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. -
చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!
బొమన్ ఇరానీ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదీ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. 2003లో డర్నా మనా హై చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బొమన్ ఇరానీ.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో అత్తారింటికీ దారేదీ మూవీతో ఫేమస్ అయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ మూవీ డంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ వివరాలేంటో చుద్దాం. మధ్య తరగతి పార్సీ కుటుంబంలో జన్మించిన బోమన్ ఆరు నెలల వయస్సులోపే తండ్రిని కోల్పోయాడు. ముంబయిలో పుట్టిన పెరిగిన బొమన్ ఇరానీ.. ఆయన కుటుంబం కోసం చిన్న చిన్న పనులు కూడా చేశారు. బాలీవుడ్‌లోకి రాకముందు బొమన్ ఇరానీ తాజ్ మహల్ హోటల్లో వెయిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆయన తల్లికి చిన్నపాటి చిరుతిళ్ల దుకాణం ఉండేది. అందులోనూ బొమన్ ఇరానీ పనిచేస్తూ తన తల్లికి అండగా నిలిచారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా తాను డైస్లెక్సియా అనే వ్యాధితో పోరాడినట్లు తెలిపారు. (ఇది చదవండి: 'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్) వెయిటర్‌గా.. బోమన్ ఇరానీ మాట్లాడుతూ..' నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పాసయ్యాక వెయిటర్ కోర్సు చేశాను. వెయిటర్‌గా 6 నెలల కోర్సులో చేరా. వెయిటర్ ఉద్యోగం కోసం తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లా. ఆ తర్వాత హోటల్లో ఆరు నెలల పాటు రూమ్ సర్వీస్‌లో పనిచేసి.. ఏడాదిన్నర తర్వాత వెయిటర్‌గా మారానని' తెలిపారు. తల్లి కోసం తన ఉద్యోగాన్ని వదిలి.. బోమన్ తల్లి ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమ దుకాణాన్ని నడపాలని నిర్ణయించుకున్నాడు. అలా 14 ఏళ్లపాటు బోమన్ దుకాణాన్ని నడిపాడు. అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉండేదని..తాను అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాడు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) ఫోటోగ్రాఫర్ నుంచి నటుడిగా.. బోమన్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని తండ్రి కూడా ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో బోమన్ ఫోటోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చాలా రోజుల తర్వాత బోమన్ సక్సెస్స అయ్యారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు అతన్ని యాడ్‌లో నటించమని అడిగాడు. దీంతో అప్పటి నుండి అతను దాదాపు 180కి పైగా యాడ్స్‌లో కనిపించారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించడానికి కూడా ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా చూశారు. ఇరానీ నటనను చూసి ఆయనకు మున్నా భాయ్ ఎంబీబీఎస్‌లో అవకాశమిచ్చారు. అలా ఆయన తన సినీ ప్రయాణం ప్రారంభించారు. ఈ మూవీ కోసం బోమన్ ఇరానికి రూ.2 లక్షలు ఆఫర్ చేశారు. ఆ తర్వాత బొమన్ ఇరానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దృష్టిలో పడ్డారు. అందివచ్చిన అవకాశంతో బాలీవుడ్లో నో ఎంట్రీ, ఖోస్లా కా ఘోస్లా, డాన్, లగే రహో మున్నా భాయ్, 3 ఇడియట్స్, హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్, జాలీ ఎల్ఎల్బీ,ఉంచాయ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కనిపించనున్నారు. తెలుగులోనూ అత్తారింటికీ దారేది, బెంగాల్ టైగర్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. -
మామియార్ వీట్టుక్కు...
అత్తను తీసుకురావడానికి మేనల్లుడు శింబు తన ప్రయత్నాలను మొదలెట్టేశారు. మరి అత్తను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి పథకాలను రచిస్తున్నాడు? అత్తారింటికి దారిని ఎలా కనుక్కున్నాడో తెలుగు సినిమా చూసినవాళ్లకు తెలుసు. తమిళంలో మామియార్ వీట్టుకు (అత్తారింటికి) అడ్రస్ ఎలా కనిపెడతాడో చూడాలి. శింబు హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘా ఆకాశ్ కథానాయిక. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జార్జియాలో ఆరంభమైంది. ఇందులో శింబుకు అత్తగా అప్పటి స్టార్ హీరోయిన్, దర్శకుడు సుందర్ భార్య ఖుష్బు యాక్ట్ చేయనున్నారట. చిత్రబృందం మాత్రం ఆ విషయంలో అప్డేట్ ఇవ్వలేదు. -
అత్తారింటికి దారేది!?
సాక్షి, కామారెడ్డి: కొత్తగా పెళ్లయిన అల్లుడు, కూతుర్ని దీపావళి పండుగకు ఆహ్వానించి హారతులు ఇవ్వడం సంప్రదాయం. పండుగకు వచ్చే అళ్లునికి తమకు తోచిన కట్నకానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అ యితే ఈ ఏడాది దీపావళి పండుగ రోజున మౌఢ్యం ఉండడంతో అత్తారింటికి వెళ్లకూడదని వేద పండితులు చెబుతున్నారు. కొందరు పండితులు మాత్రం విశాఖలు ఉన్న సమయంలో మాత్రమే అత్తారింటికి వెళ్లొద్దని, మౌఢ్యం ఉన్నపుడు వెళ్లొచ్చని చెబుతున్నారు. భిన్న వాదనల మధ్య చాలామంది అయోమయంలో ఉన్నారు. బుధవారం దీపావళి పండుగ హారతులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గురువారం లక్ష్మీదేవి పూజలు ఉంటాయి. రెండురోజుల పాటు పండగను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అయితే మూఢంలో పండుగకు అత్తారింటికి వెళ్లొద్దని కొం దరు పండితులు చెబుతున్నారు. మరికొందరు పండితులు మాత్రం మూ డంలో వెళ్లడంలో ఏ ఇబ్బంది లేదంటున్నారు. దీంతో చాలామంది కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. పండితులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయోమయం నెలకొంది. రెండు రోజుల పండుగ దీపావళిని రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. బుధవారం ఉదయం హారతులు తీసుకుంటారు. గురువారం లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. దీంతో రెండు రోజుల పాటు పండుగ జరుగనుంది. పండుగ రెండు రోజులు రావడంతో విద్యాసంస్థలు చాలావరకు రెండు రోజుల సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం 19ని సెలవుదినంగా, 18ని ఐచ్చిక సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పేనీలు, సేమియాలు కొనుగోళ్లు చేస్తుండడంతో మార్కెట్లో సందడి నెలకొంది. -
ఆయనకు ఫ్యాన్ అయిపోయాను : సమంత
ఏమాయ చేశావె, బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది... అన్నీ ఒకదాన్ని మించి ఒకటి హిట్టు. ఇప్పుడున్న ఏ కథానాయికకూ లేని ట్రాక్ రికార్డ్ ఇది. తాజా సంచలనం ‘అత్తారింటికి దారేది’తో కథానాయికగా సమంత సెంటిమెంట్ మరింత బలపడింది. ‘ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాలు మీకు కలిసి రావేమో!’ అని ‘ఎటోవెళ్లిపోయింది మనసు’, ‘జబర్దస్త్’ చిత్రాలను దృష్టిలో పెట్టుకొని విలేకరులంటే -‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది. ‘జబర్దస్త్’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రాలు బాగా ఆడి ఉంటే... కచ్చితంగా వాటిని పెద్ద సినిమాలనే అనేవారు. అవి ఆడలేదు కాబట్టే మోస్తరు బడ్జెట్ చిత్రాలంటున్నారు. ఏదిఏమైనా... నేను నటించిన భారీ చిత్రాలన్నీ విజయాలను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘అత్తారింటికి దారేది’లో నేను చేసిన ‘శశి’ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ పాత్ర ద్వారా కామెడీ కూడా చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాతో నేను పవన్‌సార్ ఫ్యాన్‌ని అయిపోయా. మళ్లీ ఆయనతో నటించాలని ఉంది’’ అని చెప్పారు.