టాలీవుడ్ మూవీ అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీకి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రానికి గానూ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. తాజా చిత్రం ది మెహతా బాయ్స్‌లో నటనకు ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బోమన్.
తాజాగా టోరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. తండ్రి, కుమారుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో ది మెహతా బాయ్స్ అనే చిత్రాన్ని బోమన్ ఇరానీ తెరకెక్కించారు. కాగా.. అంతకుముందే సెప్టెంబరు 20న చికాగోలో జరిగిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ది మెహతా బాయ్స్ మూవీ ఆయనకు మరో ఘనతను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఆస్కార్-విజేత అలెగ్జాండర్ డినెలారిస్ కథ అందించారు. ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment