ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఓ కేటగిరీని చేర్చినట్లు అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్ అవార్డుల విభాగాల సంఖ్య 24కు చేరనుంది. కానీ ఈ ఏడాది మార్చి 10న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ, 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ ‘క్యాస్టింగ్ డైరెక్టర్స్’ విభాగంలో అవార్డును ప్రదానం చేయరు. 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు.
అంటే.. 2025లో రిలీజయ్యే సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అవుతారు. ‘‘ఫిల్మ్ మేకింగ్ విభాగంలో, ఆస్కార్ ప్రదానోత్సవంలో క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు వారిని ఈ ప్రదానోత్సవంలో భాగం చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జానెట్ యంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ క్రామెర్. ‘‘క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు’ అనేది మా కృషికి గుర్తింపుగా భావిస్తున్నాం.
ఆస్కార్ అకాడమీకి «థ్యాంక్స్’’ అని క్యాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ గవర్నర్‌లు రిచర్డ్ హిక్స్, కిమ్ టేలర్–కోల్‌మన్, డెబ్రా జేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించి ఓ కేటగిరీని చేర్చారని, చివరిసారిగా 2001లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌ను చేర్చారని హాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment