బొమన్ ఇరానీ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదీ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. 2003లో డర్నా మనా హై చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బొమన్ ఇరానీ.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో అత్తారింటికీ దారేదీ మూవీతో ఫేమస్ అయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ మూవీ డంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ వివరాలేంటో చుద్దాం.
మధ్య తరగతి పార్సీ కుటుంబంలో జన్మించిన బోమన్ ఆరు నెలల వయస్సులోపే తండ్రిని కోల్పోయాడు. ముంబయిలో పుట్టిన పెరిగిన బొమన్ ఇరానీ.. ఆయన కుటుంబం కోసం చిన్న చిన్న పనులు కూడా చేశారు. బాలీవుడ్‌లోకి రాకముందు బొమన్ ఇరానీ తాజ్ మహల్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆయన తల్లికి చిన్నపాటి చిరుతిళ్ల దుకాణం ఉండేది. అందులోనూ బొమన్ ఇరానీ పనిచేస్తూ తన తల్లికి అండగా నిలిచారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా తాను డైస్లెక్సియా అనే వ్యాధితో పోరాడినట్లు తెలిపారు.
(ఇది చదవండి: 'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్)
వెయిటర్‌గా..
బోమన్ ఇరానీ మాట్లాడుతూ..' నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పాసయ్యాక వెయిటర్ కోర్సు చేశాను. వెయిటర్‌గా 6 నెలల కోర్సులో చేరా. వెయిటర్ ఉద్యోగం కోసం తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లా. ఆ తర్వాత హోటల్‌లో ఆరు నెలల పాటు రూమ్ సర్వీస్‌లో పనిచేసి.. ఏడాదిన్నర తర్వాత వెయిటర్‌గా మారానని' తెలిపారు.
తల్లి కోసం తన ఉద్యోగాన్ని వదిలి..
బోమన్ తల్లి ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమ దుకాణాన్ని నడపాలని నిర్ణయించుకున్నాడు. అలా 14 ఏళ్లపాటు బోమన్ దుకాణాన్ని నడిపాడు. అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉండేదని..తాను అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాడు.
(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!)
ఫోటోగ్రాఫర్ నుంచి నటుడిగా..
బోమన్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని తండ్రి కూడా ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో బోమన్ ఫోటోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చాలా రోజుల తర్వాత బోమన్ సక్సెస్స అయ్యారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు అతన్ని యాడ్‌లో నటించమని అడిగాడు. దీంతో అప్పటి నుండి అతను దాదాపు 180కి పైగా యాడ్స్‌లో కనిపించారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించడానికి కూడా ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా చూశారు. ఇరానీ నటనను చూసి ఆయనకు మున్నా భాయ్ ఎంబీబీఎస్‌లో అవకాశమిచ్చారు. అలా ఆయన తన సినీ ప్రయాణం ప్రారంభించారు. ఈ మూవీ కోసం బోమన్ ఇరానికి రూ.2 లక్షలు ఆఫర్ చేశారు. ఆ తర్వాత బొమన్ ఇరానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దృష్టిలో పడ్డారు.
అందివచ్చిన అవకాశంతో బాలీవుడ్‌లో నో ఎంట్రీ, ఖోస్లా కా ఘోస్లా, డాన్, లగే రహో మున్నా భాయ్, 3 ఇడియట్స్, హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్, జాలీ ఎల్‌ఎల్‌బీ,ఉంచాయ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కనిపించనున్నారు. తెలుగులోనూ అత్తారింటికీ దారేది, బెంగాల్ టైగర్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment