సాక్షి, కామారెడ్డి: కొత్తగా పెళ్లయిన అల్లుడు, కూతుర్ని దీపావళి పండుగకు ఆహ్వానించి హారతులు ఇవ్వడం సంప్రదాయం. పండుగకు వచ్చే అళ్లునికి తమకు తోచిన కట్నకానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అ యితే ఈ ఏడాది దీపావళి పండుగ రోజున మౌఢ్యం ఉండడంతో అత్తారింటికి వెళ్లకూడదని వేద పండితులు చెబుతున్నారు. కొందరు పండితులు మాత్రం విశాఖలు ఉన్న సమయంలో మాత్రమే అత్తారింటికి వెళ్లొద్దని, మౌఢ్యం ఉన్నపుడు వెళ్లొచ్చని చెబుతున్నారు. భిన్న వాదనల మధ్య చాలామంది అయోమయంలో ఉన్నారు. బుధవారం దీపావళి పండుగ హారతులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గురువారం లక్ష్మీదేవి పూజలు ఉంటాయి. రెండురోజుల పాటు పండగను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అయితే మూఢంలో పండుగకు అత్తారింటికి వెళ్లొద్దని కొం దరు పండితులు చెబుతున్నారు. మరికొందరు పండితులు మాత్రం మూ డంలో వెళ్లడంలో ఏ ఇబ్బంది లేదంటున్నారు. దీంతో చాలామంది కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. పండితులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయోమయం నెలకొంది.
రెండు రోజుల పండుగ
దీపావళిని రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. బుధవారం ఉదయం హారతులు తీసుకుంటారు. గురువారం లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. దీంతో రెండు రోజుల పాటు పండుగ జరుగనుంది. పండుగ రెండు రోజులు రావడంతో విద్యాసంస్థలు చాలావరకు రెండు రోజుల సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం 19ని సెలవుదినంగా, 18ని ఐచ్చిక సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పేనీలు, సేమియాలు కొనుగోళ్లు చేస్తుండడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment