Diwali festival
-
అతనితో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతున్న ఫొటోస్
-
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్‌లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్‌లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ
-
బండిపై పేలిన టపాసులు.. ముక్కలు ముక్కలుగా
-
ఏక్తా దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ
-
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్
-
భయంకరంగా టపాసుల రేట్లు.. ఖాళీగా షాపులు
-
అమెరికాలో దీపావళి సంబరాలు
-
ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగర ప్రాంతంలో వర్షాలతో కాస్తంత తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..దీపావళి పండుగతో మళ్లీ విజృంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి మరీ ఢిల్లీ ప్రజలు టపాసులు కాల్చడంతో సోమవారం తెల్లవారుజాముకు వాయు నాణత్య సూచీ(ఏక్యూఐ)500 పాయింట్లకు చేరుకుంది. టపాసుల పొగకు మంచు తోడవ్వడంతో ఢిల్లీలోని రోడ్లన్నీ కాలుష్యంతో చీకట్లు కమ్ముకున్నాయి. ఎదురుగా వస్తున్న సైతం వాహనాలు కనిపించని స్థాయికి వాయు కాలుష్యం చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హరియాణా, రాజస్థాన్, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలి్చవేతల కారణంగా ఢిల్లీ నగరం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పంట వ్యర్థాల దహనాన్ని ఆపేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. ఢిల్లీలో ఎటువంటి బాణసంచా కాల్చొద్దంటూ సూచనలు చేసింది. అయితే, ప్రజలు ఈ సూచనలను లెక్కచేయకుండా దీపావళి రోజు బాణసంచాను యథా ప్రకారంగా కాల్చేశారు. ఫలితంగా నగరంలోని చాలా చోట్ల వాయు నాణ్యత (ఏక్యూఐ) 500పైగా నమోదయింది. అక్కడక్కడా 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్లో 959, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 910, కరోల్ బాగ్ ప్రాంతంలో 779 వరకు నమోదైంది. వాహనదారులపై 1, 93, 585 చలాన్ల జారీ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఈనెల 7న ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిరోజూ 3వేలకు పైగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 385 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కాలుష్య ఉల్లంఘనలపై 1, 93, 585 చలాన్లు జారీ చేయగా..10 నుంచి 15ఏళ్ల నాటి 32 డీజిల్, పెట్రోల్ వాహనాలతోపాటు 15 ఏళ్ల కంటే పాతవైన మరో 14, 885 వాహనాలను సైతం సీజ్ చేసినట్లు న్యాయస్థానానికి సమరి్పంచిన నివేదికలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. -
Diwali Bash: దీపావళి వేడుకల్లో మెరిసిపోయిన బాలీవుడ్ తారలు ఫోటోలు
-
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
లండన్: బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను. అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్ స్పష్టం చేశారు. -
పండుగ వేళ .. తగ్గిన నోట్ల వినియోగం
ముంబై: దీపావళి పండుగ వారంలో చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం రూ. 7,600 కోట్ల మేర తగ్గింది. రెండు దశాబ్దాల్లో ఇంత భారీ స్థాయిలో తగ్గడం జరగడం ఇదే ప్రథమం. డిజిటల్ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుండటం ఇందుకు దోహదపడిందని ఒక నివేదికలో ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2009లో దీపావళి వారంలో కూడా సీఐసీ స్వల్పంగా రూ. 950 కోట్ల మేర తగ్గినప్పటికీ, అప్పట్లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రేరేపిత మందగమనం ఇందుకు కారణమని వారు తెలిపారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు భారత పేమెంట్ వ్యవస్థ రూపురేఖలను మార్చేశాయని ఆర్థికవేత్తలు చెప్పారు. నగదు ఆధారిత ఎకానమీ నుంచి స్మార్ట్‌ఫోన్ ఆధారిత పేమెంట్ వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందిందని వివరించారు. చెల్లింపు విధానాల్లో సీఐసీ వాటా 2016 ఆర్థిక సంవత్సరంలో 88 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి తగ్గింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 శాతానికి తగ్గుతుందని అంచనా. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో 11.26 శాతంగా ఉన్న డిజిటల్ లావాదేవీల వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 80.4 శాతానికి చేరగా, 2027 నాటికి 88 శాతానికి చేరవచ్చని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. -
Diwali 2022: అరవిరిసిన కాంతులు.. పండుగ వేళ ఇంటిని ఇలా అలంకరించండి!
దీపపు కాంతులతో కూడిన పూల పరిమళాలు దీపావళి అందాన్ని పెంచి ఆనందం మిన్నంటేలా చేస్తాయి. పండుగరోజు ఇంటి అలంకరణలు చేయడం సాధారణమే కాని దానికి కొంచెం కళాత్మకత జోడిస్తే దీపావళి రోజు ఇల్లు గ్రాండ్ లుక్‌తో అదిరిపోతుంది. ఈ సరికొత్త అలంకరణ ఐడియాలపై ఒక లుక్... 1. దీపావళి అంటే తీపి లేకుండా జరగదు కదా! కుటుంబ సభ్యులందరూ కలసి తీపిని పంచుకునే డైనింగ్ టేబుల్ అలంకరణ ఇలా ఉంటే... 2. ఈ అలంకరణకు సమయం ఎక్కువే పట్టొచ్చు కాని మీ ఇంటి దీపావళిని ప్రత్యేకంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. 3. చూడటానికి హాయిగా ఎంత బావుందో కదా! శ్రద్ధ తీసుకుని చేసే ఈమాత్రం చిన్న అలంకరణ చాలు ఇంటికి అద్భుతమైన అందం చేకూరడానికి! 4. వివిధ ఆకారాల్లో ఉండే వేలాడే దీపాలంకరణకు పూల సొబగులు అద్దితే కనులకు భలే విందు! 5. చూడటానికి ఎటువంటి హడావిడి లేకున్నా ప్రశాంతమైన భావనను కలిగించాలంటే అరటాకులలో దీపాలు పరిచి ఆహ్లాద దీపావళిని ఆహ్వానించండి. 6. కాదేదీ అలంకరణకు అనర్హం. ఇంట్లో పడున్న వాటితోనూ అందం తేవొచ్చు. గోడ మీద బొమ్మను చిత్రించి చిన్న వెదురు తట్టల్లో దీపాలు పెట్టి ఇంట్లో ఉన్న నిచ్చెనకి పూల అలంకరణలు చేస్తే చాలు.. -
పండుగ ధమాక షురూ!.. ఇంటింటికి కిలో చికెన్, మద్యం, క్రాకర్స్ బాక్స్
సాక్షి, నల్లగొండ: పండుగ ధమాక షురూ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ తాయిలాల పంపిణీని ప్రారంభించాయి. చికెన్, మద్యంతోపాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇస్తున్నాయి. అంతేకాదు.. ఓట్లు వేయించగలిగే నాయకులకు భారీగా ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ ఓటర్ల ఇంటికే చికెన్, క్రాకర్ బాక్సుల పంపిణీని ఆదివారమే ప్రారంభించింది. మరో పార్టీ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం కల్లా పిల్లలకు క్రాకర్స్ అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మరోవైపు పెద్దలకు మద్యం బాటిళ్ల పంపిణీని కూడా షురూ చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కొన్ని చికెన్ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. వాటిన్నంటిని తీసుకెళ్లి, ఆయా గ్రామాల్లో ఇంటింటికి పంచేందుకు కొందరు గ్రామ నాయకులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. గ్రామాల్లో చికెన్ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులను పురమాయించినట్లు సమాచారం. చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే గ్రామ, మండల స్థాయి నేతలకు బెస్ట్ ఆఫర్లు గ్రామ మండల స్థాయి నాయకులకు ప్రధాన పార్టీలు దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద మొత్తంలో బొనాంజా ప్రకటించాయి. భారీ మొత్తంలో నగదును నజరానాగా అందజేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ వార్డు సభ్యుని నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకుని వరకు ఓట్లు వేయించగలిగే సత్తాను బట్టి రూ.25 వేల నుంచి రూ.2లక్షలు వరకు ముట్టజెప్తున్నట్లు తెలిసింది. మరో ప్రధాన పార్టీ వారు కూడా రూ.10వేల నుంచి మొదలుకొని రూ.లక్షన్నర వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల పుణ్యమాని నియోజకవర్గంలో పండుగ అంతా పార్టీల విందులతోనే గడిచిపోతోంది. గత కొన్ని రోజులుగా నియోకవర్గంలో పొద్దంతా ప్రచారం, సాయంత్రం మద్యం సిట్టింగ్‌లు వేస్తూ విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో బయట నిర్వహించే సిట్టింగ్‌లు బంద్ చేసి ఇంటికే మద్యం, మాంసం పంపిణీలో పడ్డాయి. చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు మహిళలకు చీరలు.. దీపావళి సందర్భంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ పార్టీ నాయకులు మునుగోడు, మర్రిగూడ మండలాల్లో చీరల పంపిణీని ప్రారంభించింది. మరో పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చీరలు పంచితే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో చీరలు కొనుక్కొమ్మని డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. -
న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం
లాస్ఏంజెలెస్: న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజును సెలవుగా ప్రకటించడంపై బాలీవుడ్ నటి, నిర్మాత ప్రియాంకా చోప్రా జొనాస్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని పబ్లిక్ స్కూళ్లకు 2023 నుంచి దీపావళి రోజున సెలవు ఉంటుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ గురువారం ప్రకటించడంపై శనివారం రాత్రి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తన చిన్నతనంలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్కూలుకు వెళ్లినప్పటి రోజులను గుర్తుకు వచ్చి ఏడ్చేశానని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సుమారు 2 లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు. వీరంతా దీపావళి పండుగను జరుపుకుంటారని, అందుకే సెలవుగా ప్రకటించాలని నిర్ణయించామని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం లాస్ఎంజెలెస్లో నివాసం ఉంటున్నారు. -
భాగ్యనగరంలో దీపావళి పండగ శోభ (ఫొటోలు)
-
వెలుగు దివ్వెల దీపావళి
-
Diwali: నరకాసురుని వధను స్మరించటమంటే..
నరకాసురుని వధను స్మరించటమంటే మనలో ఉన్న దుర్గుణాలను దగ్ధం చేసి, సద్గుణాలను పొంది ఉన్నతుల మవాలి అని సంకల్పించుకోవటమే ! మనలోని అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతి ప్రకాశించాలి. అదే దీపావళి పండుగ. నరక చతుర్దశి నాడు యమ ప్రీతికై పూజలు నిర్వహించి దీపాలను వెలిగించాలి. అలా చేస్తే పితృదేవతలు నరక విముక్తులై స్వర్గానికి చేరుతారు. "నరకాయ ప్రదాతవ్యో దీపాన్సంపూజ్య దేవతాః ! చతుర్దశ్యాం తు యే దీపాన్ నరకాయ దదన్తి చ !! తేషాం పితృగణాస్సర్వే నరకాత్స్వర్గమాప్తుయాత్"!! దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, "దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి" అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి, కళ్ళు తడి చేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. ఆనందంగా ఎంత సేపన్నా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరకడ్డీలు, అగ్గిపెట్టెలు, విమానాలు, రాకెట్లు, వెన్న ముద్దలు మొదలైనవన్నీ కాల్చవచ్చు. కానీ "బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలి" అని ధర్మశాస్త్రం చెప్తోంది. సాధారణంగా అందరూ దీపావళికి ముందే ఇంటికి వెల్ల వేయించుకుంటారు. పండుగనాడు ఇంటి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు, బంతిపూల మాలలు కడతారు. పెద్ద పెద్ద రంగవల్లులతో ఇంటి ప్రాంగణమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ముగ్గుల మధ్యలో పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి దీపాలు పెడతారు. ఈ పండుగ ఐదు రోజులు, కార్తీక మాసమంతా సూర్యోదయాత్పూర్వము, సూర్యాస్తమయ సమయంలోను దేవుని దగ్గర, తులసి కోట దగ్గర దీపాలు పెట్టడమే కాక, ఇంటి గుమ్మాలకి ఇరువైపులా దీపపు ప్రమిదలు పెడతారు. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి, వత్తులు వేసి వెలిగించి - "దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన ! దీపో మే హరతు పాపం దీపజ్యోతీ నమోऽస్తు తే"!! అని పగలు, "....సంధ్యా దీపం నమోస్తు తే" అని సాయంత్రము ప్రార్థిస్తాము. దీపావళి నాడు సాయంత్రం ప్రమిదలలో దీపాలు వెలిగించాక, "శుభం కురుధ్వం కళ్యాణ మారోగ్యం ధన సంపదం ! శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతీ నమోऽస్తు తే"!! అని ఆ జ్యోతులను ప్రార్థించాలి. ఆ తరువాత దీపాలను వరుసగా ఇంటి లోగిళ్ళలో పిట్టగోడల మీద, డాబా మీద పెడతాము. జ్యోతులను వెలిగించటం మన సనాతన సంప్రదాయము. అది మన భారతీయ సంస్కృతి. అందుకే రోజూ పూజా గృహంలోనూ, తులసి కోట దగ్గర దీపాలు పెడతాము. అన్ని శుభకార్యాలలో, శుభ సందర్భాలలో వేదికల మీద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు దీప ప్రజ్వలనము చేస్తాము. ఎట్టి పరిస్థితులలోనూ మనము దీపాలను కొండెక్కించము. వాటంతర అవే నిధనమవాలి. కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని "అలక్ష్మీ నిస్సరణము" అంటారు. దీపావళి పండుగకి ముందే అనేక రకాలైన మిఠాయిలు - అరిసెలు, లడ్డూలు, మైసూర్ పాకులు, జిలేబీ, కజ్జికాయలు, బూందీ, జంతికలు, కాజాలు మొదలైనవి ఎన్నో రకాలు తయారుచేసి, వాటితో పాటు దీపావళి నాడు ఇంట్లో వండిన పులిహోర, పరమాన్నము, గారెలు, బూరెలు లేక బొబ్బట్లు లాంటి వాటిని ఇరుగుపొరుగు వారికి ఇచ్చి, బంధువులతో కలిసి భోజనం చేస్తాము. ఒక్కరే తినటం అన్నది మన సంస్కృతి కాదు. "సహనౌ భునక్తు" అని మనకు వేదం చెప్తోంది. కలిసి మెలిసి ఉండటమన్నది సృష్టి ధర్మం. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కూడా తమకు సహకరించే వారికి - అంటే ఇంట్లో పని చేసే వారికి, చాకలి వారికి, పోస్ట్ మాన్ కి, పాలు పోసే వారికి, పూలను ఇచ్చేవారికి, ఇలా అందరికీ కూడా కొత్త బట్టలు ఇచ్చి, బహుమతులు, మిఠాయిలు, బాణసంచా పంచిపెట్టి మన ఆనందాన్ని వారికి పంచుతాము. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని, తర్వాత నరక చతుర్దశిని, అమావాస్యనాడు దీపావళిని, ఆ తరువాత రోజును బలిపాడ్యమిని, ఆ మరుసటి రోజును భగినీ హస్త భోజనము లేక యమద్వితీయ అని, వరుసగా ఐదు రోజుల పండగ చేసుకుంటాము. ధన త్రయోదశి నాడు ధనలక్ష్మితో పాటుగా ధన్వంతరిని కూడా పూజించాలి. ఆయన క్షీరసాగర మథన సమయంలో అమృతభాండంతో పాలసముద్రంలోనుంచి ఆవిర్భవించాడు. ఆయన ఆరోగ్య ప్రదాయకుడు, రోగనివారకుడు, అమృత ప్రదాత. -రచన : సోమంచి రాధాకృష్ణ చదవండి: Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా! -
తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోక కంటకుడై! ఆఖరికి..
యావత్ భారత్ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. మన పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతో పాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి పండుగ లోనూ అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. వాటిని మనం అర్థం చేసుకుని ఆచరించాలి. శరత్కాలంలోని ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి జగన్మాతను దేవీ నవరాత్రులలో ఆరాధిస్తాము, దశమినాడు విజయదశమి మహా పర్వదినముగా పండుగ చేసుకుంటాము. ఆ మాసం చివరిలో, అమావాస్య నాడు కూడా జగన్మాతనే ఆరాధిస్తాము. మహాలక్ష్మీ పూజను, కుబేరలక్ష్మీ పూజను చేసుకుంటాము. మాస ప్రారంభంలోనూ, అంతమందు చివరి దినము నాడు కూడా జగన్మాతనే ఆరాధించడం వల్ల ఆశ్వయుజ మాసమంతా జగన్మాతను ఆరాధించిన ఫలం మనకు లభిస్తుంది. అమావాస్యను, పౌర్ణమిని కూడా "పూర్ణ తిథులు" అంటారు. అలాంటి ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు, స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు మనము దీపావళి పండుగను జరుపుకొంటాము. ఈ దీపావళి కూడా పెద్ద పండుగే ! ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనము అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి, అని - ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము, దేవతలనారాధిస్తాము. "దీపానాం ఆవళీ - దీపావళీ." దీపావళి అంటే దీపముల వరుస. దీపావళి రోజు రాత్రి సమయంలో యావత్ భారతదేశం అసంఖ్యాకమైన విద్యుద్దీపాలంకరణతోను, నూనె దీపాల ప్రమిదలతోనూ అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీపావళి పండుగనాడు విశేషంగా ఆచరించే పనులు సూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానమాచరించటము, పితృ తర్పణాలివ్వటము, దానము చెయ్యటము, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటము, ఆకాశదీపము పెట్టటము. ఆకాశదీపం పెట్టడం వల్ల దూరప్రాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు వలన మార్గ దర్శనమవుతుంది. మన సనాతన ధర్మంలో 'అగ్ని ఆరాధన' ముఖ్యమైనది. "అగ్ని మిచ్ఛధ్వం భారత !" అన్నారు మహర్షులు. భా అంటే కాంతి, ప్రకాశము. కాంతి యందు, ప్రకాశమునందు, వెలుగు నందు అనగా జ్ఞానమునందు రతి కలవారు, అభినివేశము, ఇచ్ఛ కలవారు భారతీయులు. అంటే జ్ఞానాన్ని కాంక్షించేవారు. అసలైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని కోరి సాధన చేసేవారు భారతీయులు. ప్రధానంగా మనది అగ్ని ఆరాధన సంప్రదాయము. మన పూర్వీకులు నిత్యాగ్నిహోత్రులు, నిరతాన్నదాతలు. నిత్యము 24 గంటలు 365 రోజులు ప్రతి ఇంట్లోనూ ఒక గదిలో - అగ్ని గృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అగ్ని అసలు ఎప్పుడూ నిధనమవదు. అది మన సంప్రదాయము. అగ్నిలో సర్వదేవతలు ఉంటారు. ఒక్క దీపము వెలిగించి అక్షింతలు వేసి నమస్కరిస్తే, సర్వదేవతలను ఆరాధించిన ఫలం లభిస్తుంది. "అగ్ని ముఖా వై దేవాః" అన్నారు. మనము ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపమును, దీపజ్యోతిని ఆరాధిస్తాము. ఏ శుభకార్యములు చేసినా, ఏ వేడుకలు చేసినా, గొప్ప ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, దైవ ప్రార్థన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకుంటాము. వివాహములు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాము. అంటే దీపము, దీపములో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపము వెలిగించటము అన్నది అత్యంత ప్రధానమైనది అని అందరికీ తెలియజేయటానికి, అందరి చేత దీపములు వెలిగించబడటానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. "దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః" దీపము సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము. ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాము. వారి సంతానమే నరకాసురుడు అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాము. కార్తీకమాసం కూడా దీప ప్రజ్వలనకు అత్యంత ప్రధానమైన మాసము. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీకములో అయ్యవారిని - పరమశివుడిని ఆరాధిస్తాము. హిరణ్యాక్షుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాహవతారంలో వచ్చి హిరణ్యక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మ దేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, 'కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా' అని ఆలోచించి, "నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి" అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదు, అనే భ్రమతో నరకుడు లోక కంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో శీలవంతులైన 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచ జన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకుడు అజ్ఞానానికి ప్రతీక. నరకము అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. మానవులందరూ మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి నడతను కలిగి ఉండాలి. ఇంక, నరకుడి చెరలో ఉన్న 16 వేల మంది స్త్రీలను విడిపించినప్పుడు వారందరూ శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా వరించారు. 16 వేల మంది అంటే అర్థం ఏమిటి? అంటే, మనకు కల ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, మనోబుధ్యహంకార చిత్తములు అనబడే అంతరింద్రియము - అంతఃకరణము. ఇవన్నీ కలిసి 16. ఈ 16 అజ్ఞానంతో ఆవరించబడి ఉండటమే నరకుడు 16 వేల మందిని చెరబట్టటం. ఎప్పుడైతే మన ఇంద్రియాలు, మనసు, అంతఃకరణము అన్నీ పరమాత్మ వైపు మరలుతాయో, అప్పుడు - ఆ జీవుడు పరమాత్మను ఆశ్రయించినప్పుడు, అతని అజ్ఞానము నశించి జ్ఞానవంతుడై పరమాత్మను చేరుతాడు. అదే శ్రీకృష్ణుడు విడిపించిన 16,000 మంది శ్రీకృష్ణుడిని వరించటము అని అంటే ! దీపావళి పండుగను అజ్ఞానము మీద జ్ఞానము యొక్క, అంధకారము మీద వెలుగు యొక్క విజయముగాను, నిరాశ మీద ఆశ సాధించిన విజయముగాను చెప్పవచ్చును. "అసతోమా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ." నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాయిద్యములు మ్రోగించి సత్యభామా శ్రీకృష్ణులకు స్వాగతం చెప్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి. -రచన : సోమంచి రాధాకృష్ణ చదవండి: Walnut Halwa: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! -
Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. ఇలా ఈజీగా
ఈ దీపావళికి ఇంట్లో వాళ్ల కోసం మీ చేతులతో స్వయంగా ఇలా కోవా రవ్వ బర్ఫీ తయారు చేయండి. నోటిని తీపి చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. కోవా రవ్వ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు: ►బొంబాయి రవ్వ – అర కప్పు ►పచ్చి కోవా –అర కప్పు ►పాలు – అర కప్పు ►పంచదార – అర కప్పు ►యాలకుల పొడి – అర టీస్పూన్ ►నెయ్యి – పావు కప్పు ►కుంకుమ పువ్వు – చిటికెడు కోవా రవ్వ బర్ఫీ- తయారీ విధానం: ►ముందుగా పాలు వేడి చేసుకోవాలి ►రెండు స్పూన్ల వేడి పాలలో కుంకుమ పువ్వును నానబెట్టాలి ►నెయ్యి వేడి చేయాలి. తర్వాత.. అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టాలి ►అదే మూకుడులో కోవా, పాలు పోసి కోవా కరిగేంత వరకు కలబెట్టాలి ►ఇందులో చక్కెర కూడా వేసి కరిగేంత వరకు తిప్పాలి ►ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి జత చేయాలి ►ఈ మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ►మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ►నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకుని.. తరిగిన డ్రైఫ్రూట్స్‌ను వాటిపై చల్లి సిల్వర్ ఫాయిల్‌తో అలంకరించుకోవాలి ►కొద్దిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! Bellam Gavvalu Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా! -
మహిళా కాలేజీని చుట్టుముట్టి.. గోడ దూకి రచ్చ రచ్చ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మిరాండా హౌస్ మహిళా కళాశాలలో ఈనెల 14న నిర్వహించిన దీపావళి మేలా ఉద్రిక్తతంగా మారింది. క్యాంపస్‌లో వేడుకలు జరుగుతున్న క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న పదుల సంఖ్యలో పోకిరీలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా నినాదాలు చేయటం, గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీపావళి వేడుక ప్రారంభమైన ఒక గంట సమయంలోనే.. మహిళా కళాశాల చుట్టూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. పోకిరీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించలేమని గ్రహించిన కళాశాల యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘క్యాంపస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో చాలా మంది పురుషులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. లోపలికి అనుమతించాలని అసభ్యకరంగా నినాదాలు చేశారు. గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. లోపలికి ప్రవేశించిన కొందరు మహిళల తరగతి గదుల వంటి నిషేధిత ప్రాంతాలను ఆక్రమించారు. ప్రొఫెసర్స్, స్టాఫ్ మాటలను సైతం లెక్కచేయలేదు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కళాశాలలో ఇష్టానుసారం వ్యవహరించారు.’ అని కళాశాల విద్యార్థి సంఘం ఓ ప్రకటన చేసింది. పురుషులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లోకి వచ్చిన పోకిరీలు.. అక్కడి మహిళలను తమ కోరికలు తీర్చే వస్తువులుగా పేర్కొన్నారని, దాంతో విద్యార్థినులు భయంతో పరుగులుతీసినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రకటించారు. ఈ సంఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలిపారు. Men climbing over the walls to get into Miranda House during an open fest. What followed was horrible. Cat-calling, groping, sexist sloganeering and more. Men entering safe spaces to harass gender minorities is nothing new, but they out do themselves every time. pic.twitter.com/UkMAuJZKVU — Sobhana (@sobhana__) October 15, 2022 ఇదీ చదవండి: నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర! -
మేడిన్ ఇండియా ఐఫోన్ 14
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టబోయే ఐఫోన్ 14ని చైనాతో పాటు భారత్‌లోనూ దాదాపు ఏకకాలంలో తయారుచేయడంపై టెక్ దిగ్గజం యాపిల్ కసరత్తు చేస్తోంది. చైనాలో ఉత్పత్తి మొదలుపెట్టిన రెండు నెలలకే తర్వాత భారత్‌లోనూ తయారీ ప్రారంభించాలని భావిస్తోంది. దీంతో చైనాలో తయారయ్యే ఐఫోన్ 14 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానుండగా.. మేడిన్ ఇండియా వెర్షన్ అక్టోబర్ ఆఖరు లేదా నవంబర్ నాటికి సిద్ధం కాగలదని భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 24కే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా చైనాలో ఉత్పత్తి చేసే ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాక యాపిల్ ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత భారత్‌లో తయారు చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో అమెరికా, చైనా ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడం, కోవిడ్‌పరమైన లాక్డౌన్లతో సమస్యలు తలెత్తడం వంటి అంశాల వల్ల చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయంగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంపై యాపిల్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రెండు దేశాల్లో తయారీ కార్యకలాపాల మధ్య జాప్యాన్ని గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఉంటున్న ఆరు నుంచి తొమ్మిది నెలల జాప్యాన్ని రెండు నెలలకు తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించాయి. భారత్‌లో తయారీని వేగవంతం చేసేందుకు సరఫరాదారులతో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది. ఏకకాలంలో ఉత్పత్తి.. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ సంస్థలు యాపిల్ కోసం ఐఫోన్ 13 ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్ల విలువ చేసే ఐఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో యాపిల్ తమ ఉత్పత్తులను ఇరు దేశాల్లో (భారత్, చైనా) ఏకకాలంలో ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. తదుపరి ఐఫోన్ వెర్షన్ .. భారత్, చైనా నుంచి ఒకే సమయంలో రావచ్చని పేర్కొన్నాయి. ఇందుకోసం చైనా నుంచి విడిభాగాలను ఎగుమతి చేయడం, భారత్‌లో వాటిని అసెంబ్లింగ్ చేయడానికి సంబంధించిన ప్రక్రియను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచే రెండు దేశాల్లో ఉత్పత్తి ఏకకాలంలో ప్రారంభించాలని యాపిల్, ఫాక్స్‌కాన్ భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా సాధ్యపడకపోవచ్చని ఇరు కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలికంగానైనా ఈ ప్రణాళికను అమలు చేయాలని అవి భావిస్తున్నట్లు వివరించాయి. ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయడమంటే చాలా కష్టతరమైన వ్యవహారమే. ఓవైపు వందలకొద్దీ సరఫరాదారులతో సమన్వయం చేసుకుంటూ మరోవైపు యాపిల్ విధించి కఠినతరమైన డెడ్లైన్లు, నాణ్యతా ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. చైనాకు దీటుగా ఐఫోన్ల ఉత్పత్తిని సాధించగలిగితే భారత్‌కు పెద్ద మైలురాయిగా మారగలదు. -
మూరత్ ట్రేడింగ్ మురిపించెన్..!
ముంబై: దీపావళి రోజు గంటసేపు జరిగిన మూరత్ ప్రత్యేక ట్రేడింగ్ మురిపించింది. స్టాక్ సూచీలు సంవత్ 2078 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికాయి. మూరత్ ట్రేడింగ్‌లో ఎంపిక చేసుకున్న షేర్లు లాభాల్ని పంచుతాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడటంతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. రెండురోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ గురువారం సాయంత్రం 6:15 నిమిషాలకు సెన్సెక్స్ 436 పాయింట్ల లాభంతో 60,208 వద్ద మొదలైంది. నిఫ్టీ 106 పాయింట్ల పెరిగి 17,935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆటో షేర్లకు కలిసొచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకూ అధిక డిమాండ్ నెలకొంది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ సూచీలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను విక్రయించగా.., దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.38 కోట్ల షేర్లను కొన్నారు. బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్ఛంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు పనిచేయలేదు. నేడు, రేపు(శని,ఆది) సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. ప్రపంచ మార్కెట్లకు ఫెడ్ బూస్ట్... ఫెడ్ రిజర్వ్ కమిటి గురువారం రాత్రి ప్రకటించిన పాలసీ నిర్ణయాలు మెప్పించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. తక్షణమే ఫెడ్ ట్యాపరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నెలవారీగా చేపడుతున్న బాండ్ల కొనుగోళ్లను ఈ నవంబర్ నుంచి ప్రతి నెలా 15 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉందని హామీనిచ్చింది. ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అమెరికా అక్టోబర్ ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐరోపా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూఎస్ సూచీలు అరశాతం లాభంతో ప్రారంభమయ్యాయి. -
ఒంగోల్ లో ఘనంగా నరకాసుర వధ కార్యక్రమం
-
'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా'
-
'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా'
న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా. సైన్యం కోసం 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకొచ్చా. ప్రతీ దీపావళి సైనికులతో జరుపుకుంటున్నా. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉంది. సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారు. సర్జికల్ స్ట్రైయిక్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణం. దేశానికి సైన్యం సురక్షా కవచం' అని అన్నారు. दीपावली के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि यह प्रकाश पर्व आप सभी के जीवन में सुख, संपन्नता और सौभाग्य लेकर आए। Wishing everyone a very Happy Diwali. — Narendra Modi (@narendramodi) November 4, 2021 -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
-
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్
-
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.#HappyDiwali — YS Jagan Mohan Reddy (@ysjagan) November 4, 2021 చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ -
సెలెక్ట్ మొబైల్స్ దీపావళి ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ దీపావళీ సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. 55 అంగుళాల నోకియా 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.32,999లకు, 43 ఇంచుల నోకియా 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.22,999లకే అందించనుంది. మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్‌ను పొంద వచ్చు.బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, అమెజాన్, పేటీఎం కొనుగోలు ద్వారా రూ.3,500 వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రలోని 80కి పైగా సెలెక్ట్ స్టోర్లలో నవంబర్ ఒకటో తేది నుంచి 6తేది వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ధమాకా ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సీఎండీ వై.గురు తెలిపారు. -
హరిత టపాసులతో కాలుష్యానికి చెక్
సాక్షి, అమరావతి: దీపావళి సందర్భంగా పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి హరిత టపాసులు చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్రంలో దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. సాధారణంగా గాలిలో ధూళికణాలు (పీఎం 10, పీఎం 2.5) 60కి మించకూడదు. కానీ దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. అలాగే శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది. అన్నిచోట్ల అందుబాటు తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు.తక్కువ బూడిద, ముడిపదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు. చూడ్డానికి ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లతోపాటు ఆన్లైన్లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్‌లోగో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. హరిత టపాసులతో పర్యావరణ పరిరక్షణ ప్రజలందరు హరిత టపాసులను కాల్చాలి. అప్పుడు ప్రజారోగ్యానికి ఇబ్బందులు తప్పుతాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దీపాల పండుగను అందరు సురక్షితంగా జరుపుకోవడానికి హరిత టపాసులు ఉపయోగపడతాయి. – అశ్వినీకుమార్ పరిడ, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ -
Diwali Special 2021: ఘుమఘుమలాడే బనానా బటర్ బిట్స్, చాక్లెట్ పేడా తయారీ..
దీపాలవళి పండుగ వేళ ఈ వెరైటీ రుచులతో ఇంటి అతిధులను మరింత ఆనందపరచండి. బనానా బటర్ బిట్స్ కావలసిన పదార్ధాలు అరటిపండ్లు – 2 (గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి) పీనట్ బటర్ – పావు కప్పు బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు నువ్వులు (వేయించినవి) – అర టేబుల్ స్పూన్ చాక్లెట్ చిప్స్ – పావు కప్పు, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్ తయారీ విధానం ముందుగా పీనట్ బటర్, బాదం పౌడర్, నువ్వులు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకుని ఓవెన్లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. మరోవైపు ప్రతి అరటిపండు ముక్కపైన అర టీ స్పూన్ బటర్ మిశ్రమాన్ని పెట్టి.. దానిపైన మరో అరటిపండు ముక్కను ఉంచి.. ఆ బిట్స్‌ని ఒకొక్కటిగా మెల్ట్ అయిన చాక్లెట్ మిశ్రమంలో సగానికి ముంచి పెట్టుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత చాక్లెట్ మిశ్రమం గట్టిపడ్డాక సర్వ్ చేసుకోవాలి. చాక్లెట్ పేడా కావలసిన పదార్ధాలు మిల్క్ పౌడర్ – 1 కప్పు పంచదార చిక్కటి పాలు – పావు కప్పు చొప్పున నెయ్యి కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున డ్రై ఫ్రూట్స్ ముక్కలు – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, నాన్ స్టిక్ పాత్రలో మిల్క్ పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాల తర్వాత పంచదార, చిక్కటి పాలు, కోకో పౌడర్ వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి వేసుకుని.. గరిటెతో కలుపుతూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని చల్లారనిచ్చి.. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్‌లో డిజైన్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ముక్కలు పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
Diwali Special 2021: గోరంత దీపం జగమంత వెలుగు
దీపావళి అంటే సరదాలు... సంబరాలు. చిటపటలాడే సీమటపాకాయలు... వెలుగులు చిమ్మే విష్ణుచక్రాలు... ముఖంలోకి వెలుగులు తెచ్చే మతాబాలు కొంటెగా కాళ్ల కిందికొచ్చి కితకితలు పెట్టే భూచక్రాలు ఉగాదికి కవి సమ్మేళనాలు... పంచాంగ శ్రవణాలు అయితే దీపావళికి కథలు.... కవితల పోటీలు కొత్తబట్టల మెరుపులు.. మిఠాయిల ఘుమఘుమలు. పిల్లలు పెద్దలుగా... పెద్దలు పిల్లలుగా మారి చేసుకునే వేయి దీపాల వెలుగుల పండగ. ఇవన్నీ పండగలోని విశేషాలు... దీపావళిరోజు పిల్లలకు తలంటు పోసి కొత్తబట్టలు తొడిగి, రకరకాల పిండివంటలతో అన్నం తినిపించి సాయంత్రం పూట దీపాలు వెలిగించి, దగ్గరుండి మరీ వారిచేత కాకరపువ్వొత్తులూ, చిచ్చుబుడ్లూ, మతాబులూ కాల్పించడం పెద్దలందరూ చేసే పనే! అయితే అసలు ఈ పండుగను ఎందుకు చేసుకుంటున్నామో మాత్రం వాళ్లకి చెప్పడం లేదు. ఏ పండుగనైనా, పర్వదినాన్నయినా సరే... ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుని చేసుకోవడం వల్ల ఎన్నో రెట్లు ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! ధన త్రయోదశి లేదా ధన్‌తేరాస్ దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌తేరాస్’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం. పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని బహుళపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అనిపేరు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారం, వెండి, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేసి, ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మహిళలు అందమైన రంగవల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి, సిరిసంపదలతో తులతూగుతారని నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతుకు తగినట్లు బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు. పురాణాల్లోని ఓ కథ దీని గురించి తెలియజేస్తుంది. హేమ రాజు అనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుట్టాడు. అతడి పదహారవ ఏట మరణం తథ్యమని జ్యోతిషులు పేర్కొంటారు. అయితే సుమంగళి యోగం ఉన్న ఓ రాజకుమారితో అతడికి వివాహం జరిపించడం వల్ల అతడికి ప్రాణగండం తప్పిపోతుందని తెలుసుకున్న రాజు ఏరికోరి ఆ యోగం ఉన్న ఓ రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించాడు. కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్లైన మూడో రోజు తన భర్తను మృత్యువు నుంచి కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి, జాగారం చేసింది. విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి, ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి, భగవంతుని స్మరిస్తూ, తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచింది. ఆ మర్నాడు ఉదయం యమ ధర్మరాజు సర్పరూపంలో ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆ దీపాల వెలుగులో ఆయన చూపు మసకబారిపోవడమే కాదు, లోనికి ప్రవేశించలేకపోయాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్లిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు త్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ‘ధనత్రయోదశి’ని నిర్వహిస్తున్నారు. చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మరో కథ.. పాలకడలిలో శేషతల్పంపై పవళించే మహావిష్ణువు చెంత ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధన త్రయోదశిగా పురాణాలు చెబుతున్నాయి. తన నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై ఓ ముని కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి (మహారాష్ట్ర కొల్హాపూర్) చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి.. లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి, అది ‘ధన త్రయోదశి’ అయింది. ఇవాళ ఆది వైద్యుడైన ధన్వంతరి జయంతి కాబట్టి ‘ధన్వంతరి త్రయోదశి’గానూ భావిస్తారు. అందుకే వైద్యులు ధన్వంతరిని ఘనంగా పూజిస్తారు. ధన్వంతరికి ప్రతిరూపంగా మనకు ప్రాణదానం చేసే వైద్యులను సన్మానించడం, సంభావించడం మంచిది. మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. అందుకే ‘త్రివిక్రమ త్రయోదశి’గా పిలవడమూ పరిపాటి. ఈరోజుకు కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అనే ఇతర పేర్లూ ఉన్నాయి. ఈ పర్వదినాన ఏం చేయాలి? బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. నేడు శుచిగా స్నానాదులు ముగించిన తరువాత, ఏమీలేని పేదలకు భోజనమో, వస్త్రమో, రొక్కమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతుందీ పండగ. స్వర్ణపుష్పాలు లేనప్పుడు, బంగారమంటి మనసుతో అర్చించినా లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. నరకచతుర్దశి ఆ పేరెందుకు వచ్చింది? ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. మనం ఆచరించే పండుగలలో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత. నరక చతుర్దశి ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి మూలంగా తప్ప మరేవిధంగానూ మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేశాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వంద్వయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేశాడు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూ వారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన చెరలో ఉంచడం ఇతనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయన వెన్నంటే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాలతో అతడిని నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు నరకుడిపై సుదర్శనాన్ని ప్రయోగించడంతో అతడి శిరస్సు నేలరాలి, మరణం సంభవించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా గుర్తింపు పొందుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో, చీకటిని పారదోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే నరక చతుర్దశిగా మారింది. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగన స్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం. చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వాసం. సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ విశ్వాసం. అజ్ఞానాన్ని, అవిద్యను పారదోలే దీపతోరణాలు లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్నిరకాలైన చీకట్లను, అంటే.. అవిద్యను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు, జ్ఞానప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, çపుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకరవస్తువులయందు, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసిని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి్త. పరధనం కోరని వారు, అబద్ధాలాడని వారు, అప్రియంగా మాట్లాడనివారు.. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రులు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళినాడు బాణసంచా కాల్చడం ఆనవాయితీ. టపాసులు కాల్చేముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్త్రాన్ని చుట్టి, దానిని కాలుస్తూ దుబ్బూ దుబ్బూ దీపావళీ మళ్లీ వచ్చే నాగులచవితి.. అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో పేదవారికి దానధర్మాలు చేయడం, సాటివారికి సాయపడే బాధ్యత పురుషులది, బాణాసంచా కాల్చి పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం బాధ్యత. ఈ పండుగ సంప్రదాయం ఇది... దీపావళి అంటే దివ్వెల వరుస. దీపావళి రోజు సాయంకాలం... నువ్వులనూనె లేదా ఆవునేతిని మట్టి ప్రమిదెలలో నింపి, దీపాలు వెలిగించాలి. అనంతరం దీపతోరణాలతో గృహాన్ని అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు అందరూ మందుగుండు సామగ్రిని కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఈ వేళ తప్పనిసరిగా లక్ష్మీపూజ చేయాలి. దీపావళి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణ, భారత భాగవతాలను చదివితే ఆ కథలు తెలుస్తాయి. రామాయణంలో తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన రావణాసురుడు మాయోపాయంతో సీతను ఎత్తుకు వెళతాడు. ఆ తర్వాత రావణాసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని గురించి మనం ముందే తెలుసుకున్నాం కదా... మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అమృతం కోసం దేవ దానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. నాలుగవ కథగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. ఐదవ వృత్తాంతంగా రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. బాణసంచా ఎందుకు కాలుస్తారు? దీపావళినాడు టపాసులు పేల్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకాలైన క్రిమికీటకాలు రోగాలను కలిగిస్తాయి. దీపావళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజే స్తాయి. అలాగని మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. బలిపాడ్యమి దీపావళి మరునాటినుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. కార్తీక శుద్ధపాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈరోజు బలిచక్రవర్తిని పూజించి ‘బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సు రారాతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి. భగినీహస్త భోజనం కార్తీక శుక్ల విదియ తిథి రోజున ‘భగినీ హస్త భోజనం’ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి. సూర్యుని బిడ్డలైన యమునా నది, యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, ఆమె పిలవగా పిలవగా యమధర్మరాజు ఓరోజున యమున ఇంటికి సకల పరివార సమేతంగా వచ్చాడు. ఆరోజు కార్తీక శుక్ల విదియ. ఇంటికి వచ్చిన సోదరుని చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించింది. తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా వరం కోరుకోమనగా. యమున ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజు ఆమె కోర్కెని విని ఆనందించి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతి వంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగల్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చాడు. అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది. తరవాత యమునను పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! దేశవిదేశాల్లో దీపావళి ►దీపావళికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత ఉన్నాయి. విశాఖదత్తుడు తన ముద్రారాక్షస నాటకంలో దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా వర్ణించాడు. కౌముది అంటే వెన్నెల. కార్తీక మాసాన్ని కౌముదీ మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాస ప్రారంభంలో దీపాల వెలుగులతో నిండి ఉంటుంది కదా! అంతేకాక ఆ మాసమంతా ముత్తైదువులు దీపాలను వెలిగించి చివరగా జీవ నది ద్వారా స్వర్గానికి చేర్చటం వల్ల తమకు మాంగల్యబలంతోపాటు పాడిపంటల సమృద్ధి, సంతానాభివృద్ధి చెందుతాయని హైందవుల ప్రగాఢ విశ్వాసం. ►ఈ దీపావళి రోజునే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడని చారిత్రక కథ. ఈ దీపావళిని స్వర్ణ దీపావళిగా ఋగ్వేదం విశదీకరించింది. భోజమహారాజు దీనిని ‘సుఖరాత్రి’గా అభివర్ణిస్తే, హర్ష చక్రవర్తి దీపావళిని ‘దీపప్రతి పాదోత్సవం’గా వ్యవహరించాడని నైషధ కావ్యం చెబుతోంది. ►సిక్కులు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించి ప్రార్థనలు జరుపుతారు. వారి మతగురువైన గురు హరగోవింద్ సాహిబ్ మొగల్ చక్రవర్తుల చెరనుంచి విడుదలైన రోజు కనుక గొప్ప ఉత్సాహంగా జరుపుకుంటారు. ►ఈ రోజు జైనులు మహావీరుని నిర్వాణదినంగా భావించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అంతేకాక జైన మత గ్రంథాలను పారాయణం చేస్తారని జైన హరివంశం చెబుతోంది. ►మొగల్ చక్రవర్తి అక్బరు ఈ దీపావళి పండుగను ఘనంగా జరిపించినట్లు అబుల్ ఫజల్ రాసిన ‘అక్బర్నామా’ ద్వారా విశదమవుతోంది. ►ఈ పండుగను ‘దివ్వెల పండుగ’గా రెడ్డి రాజుల కాలంలో వ్యవహరించే వారని ‘సింహాసన ద్వాత్రింశక’ ద్వారా తెలుస్తోంది. ►విజయ నగర రాజుల వైభవ కాలంలో అత్యంత వైభవోపేతంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకొన్నట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. అంతేకాక విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో కాంటి’ దీపావళిని విశదపరచాడు. ►ఈ పండుగను ‘యక్షరాత్రి’ గా జరిపినట్లు తెలుస్తోంది. ‘జ్యోతిష రత్నమాలను’ రచించిన ‘శ్రీపతి’ అనే మరాఠీ కవి దీపావళిని దాని ప్రాశస్త్యాన్ని వివరించాడు. ►జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరిసి దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా చాటే ప్రతీతి ఉంది. ►వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుతారు. మానవునిలో దాగి ఉన్న విచారా (చీకటి)న్ని పోగొట్టి ఆనందాన్ని (వెలుగు) వికసింపచేసేది. దీపాలు వెలిగించడం సంతోషానికి సంకేతం. యావద్భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకోవడం విశేషం. ►గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో దీపావళిని రైతులు ‘పశుపూజారి’ దినోత్సవంగా జరుపుకుంటారు. ‘ధన్‌తేరాస్’ పేరున కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గోవర్ధనగిరిని నిర్మించి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ‘భారత్ మిలన్’ పేరిట దీపావళి జరుగుతుంది. ►రాజస్థాన్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి నాడు భూతబలి ఇస్తారు. అంటే కుక్కలకు, కాకులకు ఆహారాన్ని పెట్టి పసుపు కుంకుమలతో పూజిస్తారు. ‘అన్నకూట్’ అన్న పేరుతో మధుర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టి ఆదరిస్తారు.‘గోవర్థనగిరి’ వారు నరక చతుర్దశి, దీపావళి రెండు రోజులు జరుపుతారు. ►పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కాళీపూజలు జరుపుతారు. ఈ పూజను ‘జగద్ధాత్రి’ అనిపిలుస్తారు. కేరళలో బలిచక్రవర్తిని జయించిన రోజుగా పరిగణించి దీపావళి పండుగను జరుపుతారు. ఇలా భారతదేశంలోనే కాక దేశవిదేశాల్లో అనాదిగా అన్ని మతాలవారు, అన్ని వర్గాల వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అతిముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. – డి.వి.ఆర్. భాస్కర్ చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
పేలుతున్నాయ్.. టపాసుల ధరలు
సాక్షి, అమరావతి: దీపావళి వెలుగులపై టపాసుల ధరలు నీళ్లు చల్లాయి. కాకరపువ్వొత్తులు కూడా కొనలేని స్థితికి తెస్తున్నాయి. వీటివల్ల ప్రజలకు పండగ ఆనందం దూరమవడమే కాదు.. వ్యాపారాలనూ దెబ్బతీస్తున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా దీపావళి వెలవెలబోయింది. ఈ ఏడాదైనా వెలుగులు కురిపిస్తుందనుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాదితో పోలిస్తే అన్ని టపాసుల ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కాకరపువ్వొత్తుల పెట్టె కూడా ఈ ఏడాది రూ.50 పెట్టందే రాదని వ్యాపారులు చెబుతున్నారు. టపాసుల్లో భారీ డిమాండ్ ఉండే 1000 వాలా సీమటపాకాయల ధర ఈ ఏడాది రూ.600 పైనే పలుకుతోందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి శ్రీనివాసరావు చెప్పారు.ధరలు ఇలా ఉంటే ప్రజలు కొనడం తగ్గించేస్తారని, వ్యాపారం పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పండుగకు మరో అయిదు రోజులే ఉన్నప్పటికీ, రిటైలర్లు కూడా కొనుగోలుకు అంతగా ముందుకు రావడంలేదని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది అమ్మకాలు బాగుంటాయన్న ఉద్దేశంతో భారీగా టపాసులు కొన్నామని, ధరలు పెరగడంతో రిటైల్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని విజయవాడకు చెందిన హోల్‌సేల్ వ్యాపారి ఎన్.మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు కారణమిదీ.. కోవిడ్‌తో పాటు బాణసంచా అత్యధికంగా తయారయ్యే తమిళనాడులోని శివకాశిలో ఈ ఏడాది వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. దీంతో ఉత్పత్తి తగ్గింది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ తడిసిమోపెడయ్యాయి. ఈ కారణాల వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు రిటైల్ షాపుల ఏర్పాటుకు నిబంధనలు కఠినతరం చేయడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. వీటివల్ల ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన డిమాండ్ పర్యావరణ అనుకూలమైన గ్రీన్ క్రాకర్స్‌కు డిమాండ్ పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. తక్కువ శబ్దంతో రంగు రంగుల్లో ఉండే చిచ్చుబుడ్లు, షాట్స్ ఎక్కువగా అడుగుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన వ్యాపారి కేవీఎన్ మూర్తి చెప్పారు. టపాసులు కాల్చిన తర్వాత వచ్చే వ్యర్థాల నుంచి మొక్కలు వచ్చే టపాసులు, డ్రోన్ ఫైర్ వర్క్స్ వంటివి ఈ ఏడాది ఎక్కువగా అందుబాటులోకి వచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. వీటి ధరలు కూడా భారీగానే ఉంటున్నాయి. గ్రీన్ క్రాకర్స్ ధరలు రూ.200 నుంచి మొదలవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా అమ్మకాలు ఆన్లైన్ ద్వారా కూడా టపాసుల అమ్మకాలు జరుగుతున్నాయి. స్టాండర్డ్ కంపెనీతో పాటు పలు సంస్థలు హైదరాబాద్ క్రాకర్స్, క్రాకర్స్వాలా, క్రాకర్స్మేళా పేరుతో ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. నచ్చిన వస్తువులను విడివిడిగా తీసుకోవడంతో పాటు పలు రకాల టపాసులను కలిపి ప్యాక్లుగా కూడా విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో గిఫ్ట్ బాక్స్ ధరలు రూ.1,250 నుంచి రూ.3,950 వరకు ఉన్నాయి. -
ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ షాపింగ్ అప్పుడే మొదలైంది. అయితే కరోనా పూర్తిగా కనుమరుగు కాకపోవడంతో భద్రమైన, సురక్షితమైన షాపింగ్‌కే 50 శాతం మంది హైదరాబాదీలు మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, స్థానిక స్టోర్ల నుంచి హోం డెలివరీ విధానం ద్వారా షాపింగ్ చేస్తామని 75 శాతం హైదరాబాదీ కుటుంబాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, రౌటర్లు, ఏసీ, హీటర్లు, వాక్యూమ్ క్లీనర్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ ప్యూరిఫైర్లు, వినిమయ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉత్పత్తులు, ఇంటికి మరమ్మతులకు సంబంధించిన కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పండుగ సామగ్రి, వస్తువులు, తినుబండారాల తయారీకి ఉపయోగించే పదార్థాలు, దుస్తులు, బంధుమిత్రులకు కానుకలు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అప్లియన్స్లు వంటివి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 10 నగరాల్లోని దాదాపు 2 లక్షల మంది నుంచి సేకరించిన వివిధ అంశాల ఆధారంగా రూపొందించిన ‘లోకల్ సర్కిల్స్ మూడ్ ఆఫ్ ది కన్జూమర్ నేషనల్ సర్వే’లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కుటుంబాల బడెŠజ్ట్పై తీవ్ర ప్రభావం.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ దాకా దేశవ్యాప్తంగా వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్ అనూహ్యంగా పెరిగిందని అంచనా వేసింది. మే 30 నాటికి 30 శాతం మేర ఉన్న షాపింగ్, సెప్టెంబర్ ఆఖరుకు 60 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. అయితే గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాల బడ్జెట్లను ప్రభావితం చేస్తున్నట్లు సర్వే తేల్చింది. గత మూడు వారాలుగా వినియోగదారులు వివిధ ఉత్పత్తులు, సర్వీసుల గురించి ‘ఆన్లైన్ లోకల్ కమ్యూనిటీస్’నుంచి సలహాలు, సిఫార్సులు కోరుతున్న పరిస్థితుల్లో దేశంలోని 10 ప్రధాన నగరాల్లోని కుటుంబాలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయన్న దానిపై లోకల్‌సర్కిల్స్ అధ్యయనం దృష్టి సారించింది. ఈ నగరాల్లోని కుటుంబాలు ఏయే వస్తువుల కొనుగోళ్ల షాపింగ్‌కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, గురుగ్రామ్, నోయిడాలోని 61 వేల కుటుంబాల్లోని 2 లక్షల మందిపై ఈ సర్వే నిర్వహించారు. షహర్ హమారా హైదరాబాద్‌లో.. పండుగ సీజన్లో వినియోగదారుల సెంటిమెంట్ ఎటువైపు మొగ్గుచూపుతుందని అంచనా వేసేందుకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే 4 వేల కుటుంబాలు వాటిలోని 13 వేల మంది నుంచి వివరాలు సేకరించారు. షాపింగ్ విధానాలు, కేటగిరీ వస్తువులు. ఏ పద్ధతులు, విధానాల్లో షాపింగ్ చేస్తారు? ఎలాంటి కేటగిరీలకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులు కొంటారు? పండుగ సందర్భంగా ఎలాంటి వస్తువులు కొనాలని అనుకుంటున్నారు..? ఏయే వాటికి ఖర్చు చేయబోతున్నారనే అంశాలను పరిశీలించారు. ఇక్కడి సర్వేలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. భద్రమైన, సురక్షిత షాపింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నట్లు 50 శాతం మంది స్పష్టం చేశారు. తమకు అనువైన బడ్జెట్‌తో, ఆయా వస్తువుల అవసరం.. విలువ ఆధారంగా షాపింగ్ చేస్తామని 38 శాతం, తమవీలు, సౌకర్యాన్ని బట్టి వస్తువులు కొనుగోలు చేస్తామని 12 శాతం వెల్లడించారు. అది కూడా ఆన్లైన్ సైట్లు, యాప్‌ల ద్వారా మెజారిటీ వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని 62 శాతం వెల్లడించారు. వివిధ వినియోగ వస్తువులను కొనేందుకు షాపులు, మార్కెట్లకు వెళతామని 25 శాతం మంది, స్థానికంగా ఉన్న స్టోర్ల ద్వారా, క్యాటలాగ్ ఆన్లైన్ ఆర్డర్ డెలివరీ ద్వారా 13 శాతం కొనుగోలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ సర్వే కీలకాంశాలు.. షాపింగ్ చేసేటప్పుడు ఏది ముఖ్యం ►భద్రత 50 శాతం ►బడ్జెట్/విలువ 38 శాతం ►వీలు, అనుకూలతలను బట్టి 12 శాతం ఇష్టమైన వస్తువుల కొనుగోళ్లు? ►ఆన్లైన్ సైట్లు, యాప్‌ల ద్వారా ఆర్డర్ 62 శాతం ►స్టోర్స్ లేదా మార్కెట్లను సందర్శిస్తామన్న 25 శాతం ►క్యాటలాగ్ ఆన్లైన్, ఆర్డర్ డెలివరీ ఉన్న స్టోర్ల నుంచి 13 శాతం ఏ వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తారు ? ►స్మార్ట్ఫోన్లు, మొబైల్, టాబ్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, రౌటర్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏసీ, హీటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, టీవీ. ఫ్రిజ్‌లు, ఎయిర్ ప్యూరీఫయర్లు వంటివి 75 శాతం ►కేవలం స్మార్ట్ఫోన్లు, ఇతర వినిమయ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉత్పతుతలు 25% మంది ఎలాంటి ఆహార పదార్థాలు, నిత్యావసరాలు కొంటారు ? ►స్పెషల్ వస్తువులు, పండ్లు, ఫలాలు, డ్రైఫూట్లు, సంప్రదాయ స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లు, ఇతర పదార్థాలు 75 శాతం ►వీటిలో కొన్నింటిని మాత్రమే కొనే వారు 25 శాతం -
దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దీపావళి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పూర్ణ–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పూర్ణ–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (07607) నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పూర్ణలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07608) నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.25 గంటలకు పూర్ణ చేరుకుంటుంది. -
దీపావళికి గృహ శోభ.. బాంటియాలో ఫర్నివాల్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గత 65 ఏళ్లుగా ఫర్నిచర్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగిన బాంటియా... దీపావళి పండుగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. ‘బాంటియా ఫర్నిచర్’ పేరిట ఫర్నిచర్ కార్నివాల్‌ను ప్రారంభించింది. గృహ, ఆఫీస్ ఫర్నిచర్ల కొనుగోళ్ల మీద ఆఫర్లను, డిస్కౌంట్ సేల్‌ను అందిస్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని అన్ని బాంటియా స్టోర్లతో పాటు ఆన్లైన్ (బాంటియా.ఇన్)లో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్, బుక్‌షెల్ఫ్, బెడ్రూమ్ సెట్స్, ఆఫీస్ కురీ్చలు, టేబుల్స్ వంటి అన్ని రకాల ఫర్నిచర్లు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. నెలవారి వాయిదా (ఈఎంఐ) రూపంలో బాంటియా ఫర్నిచర్‌ను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు మరింత సులువుగా, ఆర్థిక భారం లేకుండా ఫర్నిచర్‌ను కొనుగోలు చేసేందుకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి మిగిలిన మొత్తానికి 36 నెలల ఈఐఎం ఆప్షన్ ఉంది. ఈఎంఐ కోసం పలు ఫైనాన్షియల్ కంపెనీలతో భాగస్వామ్యమైంది. 60 సెకన్లలోపు ఈఎంఐ తక్షణ అనుమతి వస్తుంది. ఎక్స్ఛేంజ్పై 20–30 శాతం రాయితీ.. బాంటియాలో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 20–30 శాతం రాయితీపై సరికొత్త ఫరి్నచర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫరి్నచర్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకున్నాయి. సోఫాల ధరలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు, డైనింగ్ టేబుల్స్ రూ.7 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, బెడ్ల ధరలు రూ. 8 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు, ఔట్‌డోర్ ఫర్నిచర్ల ధరలు రూ.12 వేల నుంచి రూ. లక్ష వరకున్నాయి. విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగాం బహుమతులు అందిస్తూ కస్టమర్ల పండుగ ఆనందాలను రెట్టింపుమయం చేస్తున్నాం. అందు కే బాంటియా విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది. పండుగ షాపింగ్‌లో మేము కూడా భాగస్వామ్యమయ్యాం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వినియోగదారుల కోసం ఫరి్నచర్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – సురేందర్ బాంటియా, ఎండీ, బాంటియా బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ నాణ్యమైన ఫర్నిచర్‌కు బాంటియా పెట్టింది పేరు. ఫర్నిచర్‌ను బుక్ చేసిన రోజే ఇంటికి డెలివరీ చేస్తాం. ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ఆనందాన్ని రెండితలు చేసుకునేలా ఆఫర్లను అందిస్తున్నాం. మధ్యాహ్నం 1 గంట లోపు ఫర్నిచర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లను కూడా అందిస్తాం. – అమిత్ బాంటియా, డైరెక్టర్, బాంటియా -
హోం లోన్స్‌పై యాక్సిస్ ఫెస్టివల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్.. దీపావళి పండుగ సందర్భంగా కొన్ని గృహ రుణాల పథకాలపై ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. అంతేకాదు ఆన్లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంపిక చేసిన హోమ్ లోన్ పథకాలపై 12 నెలసరి వాయిదాల (ఈఎంఐ) మినహాయింపుతో బంపరాఫర్ అందించింది. అంతేకాదు టూవీలర్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆన్–రోడ్ ఖరీదు మొత్తాన్ని రుణంగా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ ఈ పండుగ సీజన్‌కు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ‘దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్: ఎందుకంటే ప్రతి రోజూ దీపావళి రాదు‘ పేరిట యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించింది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 స్థానిక దుకాణాదారుల నుంచి కొనుగోళ్లు జరిపితే 20 శాతం దాకా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు, కాబట్టి కస్టమర్లు, యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ సుమిత్ బాలి పిలుపు ఇచ్చారు. చదవండి: యాక్సిస్ బ్యాంకుతో షాపింగ్ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్! -
Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తయారీ సంస్థ రియల్ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్ సందర్భంగా 5జీ స్మార్ట్ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. ఒకటో రెండో కాదని ఏకంగా 60 లక్షల ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే రియల్ మీ నార్జో5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 ఉండగా.. రాబోయే 5జీ స్మార్ట్ ఫోన్ రూ.7వేలకే అందిస్తామని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ 5జీ సమ్మిట్ వేదికగా మాధవ్ సేథ్ మాట్లాడుతూ " రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో 90 శాతం మంది 5జీ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందరికి కంటే ముందుగా తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తెచ్చి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తాం. ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్ సంస్థల కంటే ముందుగా 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రియల్ మీ పని చేస్తుందని" రియల్ మీ సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ చెప్పారు. 5 ప్రాడక్ట్లు + 1 స్మార్ట్ ఫోన్ దీపావళి ఫెస్టివల్ సందర్భంగా సేల్స్ కోసం రియల్ మీ 1 + 5 + టి స్ట్రాటజీని అప్లయ్ చేయనుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్లెస్ హెడ్ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసేందుకు రియల్ మీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. ఆ ఐదు వస్తువుల్నికొంటే ఒక స్మార్ట్ ఫోన్‌ను ఆఫర్ ప్రకటించనుంది. వీటితో పాటు రియల్‌మీకి చెందిన స్మార్ట్ హోమ్ పరికరాలైన గేమ్ కన్సోల్స్, కంప్యూటర్ మౌస్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, స్కేల్స్, టూత్ బ్రష్‌లు, సాకెట్లు, బల్బులు, కెమెరాలను విడుదల చేయనుండగా.. ఈ ఏడాది నవంబర్ లో జరిగే దిపావళి పండుగ సందర్భంగా కష్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్ మీ మరిన్ని ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
మన నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’
జైపూర్/న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు. ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా రాజస్తాన్‌లోని పాలీ పట్టణంలో నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని మోదీ కొనియాడారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో మీడియా ఒక విలువైన భాగస్వామి అని తెలిపారు. సోమవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఆయన లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. సానుకూలమైన విమర్శలు లేదా విజయగాధలను ప్రచారం చేయడం ద్వారా మీడియా ప్రజలకు మేలు చేస్తోందన్నారు. -
ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు
సాక్షి, ముంబై: దీపావళి రోజున ముంబైలో శబ్ద కాలుష్యం తక్కువ స్థాయిలో నమోదైంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాడానికి నగరంలో పటాకులు, బాణసంచా బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణాసంచా కాల్చేందుకు బాంబే హైకోర్టు అనుమతులు ఇచ్చింది. అటు బృహణ్ ముంబై చర్యలు, ఇటు హైకోర్టు సూచనలతో దీపావళి నాడు శబ్ద కాలుష్యం అత్యల్ప స్థాయిలో నమోదైందని ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో తెలిపింది. ఎన్జీఓ వ్యవస్థాపకురాలు సుమైరా అబ్దులాలి ఆదివారం ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘దీపావళి రోజున ముంబై నగరంలో అత్యల్ప స్థాయిలో శబ్ద కాలుష్యం నమోదైంది. బాణాసంచా కాల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను అమలుచేయడం, జనాల్లో అవగాహన రావడంతోనే ఇది సాధ్యమైంది. చదవండి: ఢిల్లీకి కాలుష్యం కాటు దీపావళి సందర్భంగా ఈ ఏడాది నమోదైన ధ్వని తీవ్రత గత 15 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉంది. నగరంలోని సైలెన్స్ జోన్ శివాజీ పార్క్ మైదానంలో రాత్రి 10 గంటలకు వరకు పటాకులను పేల్చడానికి ఇచ్చిన గడువులో 105.5 డెసిబెల్ నమోదైంది. ముంబైలో గరిష్టంగా ధ్వని తీవ్రత 2019 లో 112.3 డెసిబెల్స్, 2018 లో 114.1 డెసిబెల్స్, 2017 లో 117.8 డెసిబెల్స్ నమోదైంది. అయితే, శివాజీ పార్క్ వద్ద చాలా మంది ప్రజలు మాస్కులు ధరించకుండానే పండగ జరుపుకోవడం ఆందోళన కలిగిస్తోంది’అని పేర్కొన్నారు. ఏదేమైనా ముంబై నగరం మొత్తంలో ధ్వని తీవ్రతను కచ్చితంగా లెక్కకట్టడం సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీకి కాలుష్యం కాటు
న్యూఢిల్లీ: బాణసంచాపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్యం తీవ్రతకు కరోనా మళ్లీ విజృంభిస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. దీపావళి పర్వదినాన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టపాసుల మోత మోగుతూనే ఉంది. ఫలితంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 కొన్ని ప్రాంతాల్లో 500 దాటి పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో 32% పెరిగిన కాలుష్యం కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం పీఎం 2.5 స్థాయి శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో 32 శాతం పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యతా సూచిలో పీఎం 2.5 స్థాయి 490 వరకు వెళ్లింది. 490 అంటే ఆ గాలిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో పీల్చిన గాలితో ఆస్తమా వంటి వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ కాలుష్యంతో కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం 9 గంటల వేళ పీఎం 2.5 ఏకంగా 545కి చేరుకుంది. ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమ్రంతి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. -
విశ్వనాథ్‌గారిని కలవాలనిపించింది: చిరంజీవి
కళాతపస్వి కె. విశ్వనాథ్ ని చిరంజీవి గురువులా భావిస్తారు. దీపావళి పండగ సందర్భంగా సతీమణి సురేఖతో కలసి గురువు ఇంటికి వెళ్లారు చిరంజీవి. విశ్వనాథ్ దంపతులు చిరు దంపతులను ఆశీర్వదించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి’ వంటి సినిమాలు చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచాయి. గురు–శిష్యులిద్దరూ తమ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విశేషాలను, ఆ సినిమాల సమయంలో ఏర్పడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘విశ్వనాథ్‌గారిని కలవాలనిపించి ఆయన ఇంటికి వచ్చాను. నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారాయన. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చిరంజీవి. -
కరోనా కారు చీకట్లో ఆశల దీపావళి
-
ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో ఉన్న ఐటీ మాల్.. దీపావళి నేపథ్యంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్, అవిటా బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే స్క్రాచ్ కార్డుపై రూ.2,500 నుంచి రూ.50,000 వరకు నగదు, ల్యాప్‌టాప్, మొబైల్స్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.5,000 వరకు విలువైన యాక్సెసరీస్ కూడా ఉచితంగా అందుకోవచ్చని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. పరిశ్రమలో తొలిసారిగా 70–80% కొత్త మోడళ్లు కొలువుదీరాయని చెప్పారు. కంపెనీలు 10 శాతం వరకు ధరలను తగ్గించడం వినియోగదార్లకు ప్రయోజనం అన్నారు. జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ధరల శ్రేణి రూ.20,000లతో మొదలుకుని రూ.7 లక్షల వరకు ఉంది. -
‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’
వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశాలకు మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాదికి ఎజెండాను ఖరారు చేస్తారు. కరోనా కారణంగా ఎస్సీఓ అధినేతల వార్షిక సమావేశం తొలిసారిగా ఆన్లైన్లో జరగనుంది. భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్సీఓ ఈ నెలలో ఐదు సమావేశాలను నిర్వహించనుంది. ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు. -
బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్
సాక్షి, బెంగళూరు : బాణాసంచా నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణాసంచాను కొనొద్దు, కాల్చొద్దు అంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాణాసంచా కాల్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తామని ఆయన నిన్న పేర్కొన్నారు. టపాసులు అధికంగా కాల్చడం వల్ల కాలుష్య ప్రమాణం పెరిగి కరోనా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో టపాసులను ఈ ఏడాది దీపావళికి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ తీర్మానం వల్ల ప్రజలెవరూ టపాసులు కొనడం కానీ, అమ్మడం కానీ చేసి నష్టపోవద్దని సూచించారు. ఈ ఏడాది బాణాసంచా లేకుండానే దీపావళి పండుగ జరుపుకుందామని పిలుపునిచ్చారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం) అయితే తాజాగా బాణాసంచా నిషేధం నిర్ణయంపై యడియూరప్ప సర్కార్ పునరాలోచన చేసింది. వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్‌ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శనివారం తెలిపారు. దీపావళి పండుగని పురస్కరించుకొని కర్ణాటకలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే తయారు చేసి, అమ్మాలని అన్నారు. ప్రజలు నిబంధనలకు లోబడి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇక కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. (‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’) -
పలు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తే , మరికొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కాలుష్య కారక టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కరోనా వైరస్ విజృంభణ, కాలుష్యం పెరిగిపోతూ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. టపాసులపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్తాన్, సిక్కిం, కర్ణాటక ఉన్నాయి. బాణసంచా కాల్చడంతో వాయుకాలుష్యం పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, కోవిడ్ విజృంభిస్తున్న వేళ టపాసులు కాల్చడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పడంతో పలు రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్ 30 వరకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.. ఒక్కో రాష్ట్రం బాణసంచా కాల్చడంలో నిషేధం విధించడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో బాణసంచాలో 90% తమిళనాడులోని శివకాశి ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ ఉండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం పెరగకుండా చూడండి: సుప్రీంకోర్టు ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగ నేపథ్యంలో రాజధానిలో కాలుష్యం పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన బెంచ్ వీలైనంత త్వరగా కాలుష్య నివారణకు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించింది. -
మళ్లీ టపాసుల చర్చ
గత కొన్నేళ్లుగా టపాసులు, బాణసంచా వినియోగంపై నియంత్రణ, నిషేధం వంటివి దీపావళి పండగ సమయానికి బాగా చర్చకొస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ, దాని శివారు ప్రాంతాల్లోనూ నాలుగేళ్లుగా పండగకు ముందు విధి, నిషేధాలు అమలవుతున్నాయి. ప్రభుత్వం చొరవ చూపని సందర్భంలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ఉత్తర్వులివ్వడం కూడా ఒకటి రెండు సందర్భాల్లో చోటుచేసుకుంది. అయితే ఈసారి కరోనా వైరస్ మహమ్మారి విసిరిన పంజాతో మరికొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు సైతం టపాసులు, బాణసంచా వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తాము తీసుకోదల్చుకున్న చర్యల్ని ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా నిషేధిస్తే, మరికొన్ని నియంత్రణలు విధించాయి. హరియాణా, మధ్యప్రదేశ్ ‘దిగు మతి చేసుకున్న’ టపాసులు పంపిణీ చేయొద్దని, వాడొద్దని నిషేధం పెట్టాయి. తాజాగా కర్ణాటక కూడా నిషేధించదలచుకున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. దీపావళికి మాత్రమే కాదు... కాళిపూజ, ఛాత్ పూజల్లో కూడా టపాసులు, బాణసంచా వాడరాదని ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లక్రితం దీపావళికి టపాసులు వాడరాదని సుప్రీంకోర్టు నిషేధం విధించిన ప్పుడు హిందూ మత సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం హిందువుల ఆచారాలు, సంప్రదా యాల సమయాల్లోనే ఇలాంటివి గుర్తొస్తాయా అని ప్రశ్నించాయి. అసలు టపాసులు, బాణసంచా కాల్చడం ఎప్పటినుంచి దీపావళికి సంప్రదాయమైందో చెప్పడానికి పెద్దగా ఆధారాల్లేవు. చైనాలో 10 లేదా 11వ శతాబ్దంలో తుపాకి మందు కనిపెట్టాక అక్కడినుంచి భారత్, యూరప్‌లకు అది చేరిందని, ఆ తర్వాత చాన్నాళ్లకు టపాసులు వినియోగంలోకొచ్చాయని మహారాష్ట్రకు చెందిన చరిత్రకారుడు పీకే గోడే అభిప్రాయపడ్డారు. కనుక ఆ తర్వాతకాలంలో ఎప్పుడో పండగలకు బాణసంచా, టపాసులు వాడటం మొదలైవుండొచ్చన్నది ఆయన అంచనా. మొగల్ చక్రవర్తి షా జహాన్ కుమారుడు దారా షికో పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అమ్మాయి తరఫువారు బాణసంచాతో స్వాగతం పలుకుతున్నట్టు తెలిపే ఒక పెయింటింగ్ ఢిల్లీ జాతీయ మ్యూజియంలో వుంది. కాలుష్యం పెను సమస్యగా మారిందనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం వుండదు. దీపావళి పండగ సమయంలో భారీగా టపాసులు, బాణసంచా అధికంగా వుంటుంది కనుక ఆ కాలుష్యం మరిన్ని రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యంతోపాటు శబ్దకాలుష్యం కూడా ఎక్కువే వుంటుంది. రెండేళ్లక్రితం తొలిసారి సుప్రీంకోర్టు ‘హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఉత్పత్తి చేయాలని, వాటినే అమ్మాలని తెలిపింది. అలాగే రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే వాటిని కాల్చాలని కూడా పరిమితి విధించింది. అయితే దాన్ని పెద్దగా పాటించినవారు లేరు. దీపావళి రాత్రి మోగిన టపాసులు, ఆ మర్నాడు వెలువడిన కాలుష్యం గణాంకాలు ఆ సంగతిని తెలియజెప్పాయి. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టపాసుల వాడకాన్ని పూర్తిగా ఆపేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ తీవ్రతనూ, కాలుష్యం వల్ల ఢిల్లీ ఊపిరాడకుండా మారిన వైనాన్ని అందరూ చూశారు గనుక టపాసులకు దూరంగా వుండటం క్షేమదాయకమని చెప్పారు. అయితే మన ప్రభుత్వాలతో సమస్యేమంటే... పండగకు వారం, పదిరోజుల ముందు మాత్రమే వాటికి నిషేధం ఆలోచనమొదలవుతుంది. వాస్తవానికి పండగకు చాలా చాలా ముందుగానే వ్యాపారులు సరుకు కోసం ఆర్డర్లు ఇస్తారు. ఆ తర్వాత వారి నుంచి రిటైల్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. టపాసుల పరిశ్రమలు అధికంగా వుండే తమిళనాడులోని శివకాశి వంటిచోట ఏడాది పొడ వునా వాటి తయారీ ఉంటుంది. ప్రభుత్వాలు ఈ కాలమంతా మౌనంగా వుంటాయి. వాటికి నిజంగానే కాలుష్యంపై ఆందోళన వున్నప్పుడు ప్రక్రియ మొదలైనప్పుడే దాన్ని నియంత్రించే చర్యలు ప్రారం భించాలి. కానీ అది జరగదు. తీరా సరుకంతా రిటైల్ దుకాణాలకు చేరాక పాలకుల ప్రకటనలు ప్రారం భమవుతాయి. న్యాయస్థానాల ఆంక్షలు కూడా అప్పుడే వెలువడతాయి. సహజంగానే అప్పటికే పెట్టు బడి పెట్టిన దుకాణాల వారు ఆ విధినిషేధాలను పట్టించుకోరు. ఇది ఏటా పునరావృతమవుతున్నా పరిస్థితి మారడం లేదు. ఈసారి కరోనా వైరస్ ప్రభావం వల్ల వేరే రాష్ట్రాలు సైతం టపాసులు, బాణసంచా వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవి కూడా పండగ ముంగిట్లో వుండగానే మేల్కొన్నాయి. టపాసులు, బాణసంచా వినియోగం వల్ల భారీ మొత్తంలో రసాయనాలు వాతావరణంలో కలుస్తాయి. ముఖ్యంగా టపాసుల్లోవాడే కార్బన్, సల్ఫర్, కాడ్మియం... వేర్వేరు రంగుల కాంతులు వెదజల్లేందుకు, అవి కాంతిమంతంగా వుండేందుకు తోడ్పడే ఇతర రసాయనాలు ప్రమాదకరమైనవి. ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఇలాంటి రసాయనాల వల్ల కలిగే కీడును ఎదుర్కొనగల సామర్థ్యం తక్కువగా వుంటుంది గనుక వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం వుంటుంది. వారిలో శారీరక, మానసిక సమస్యలు మొదలవుతాయి. ఈ రసాయనాలవల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, చూపు మసకబారటం, బధిరత్వం, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కేన్సర్లు, కండరాల బలహీనత, హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వంటివి ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భస్థ శిశువులకూ, నవజాత శిశువులకూ కూడా అనేక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మనుషులకే కాదు... జంతువులకూ, మొక్కలకూ కూడా ప్రమాదమేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఒక్క దీపా వళి సమయంలో మాత్రమే కాదు... సాధారణ రోజుల్లో సైతం టపాసులు, బాణసంచా వినియోగం తగ్గించడంపై శ్రద్ధ పెట్టాలి. మొత్తంగా అన్ని రకాల కాలుష్యాన్ని అరికట్టడానికి నిరంతర చర్యలుండాలి. అప్పుడు మాత్రమే ప్రజానీకంలో టపాసులు, బాణ సంచా వల్ల కలిగే అనర్థాలపై నిజమైన అవగాహన ఏర్పడుతుంది. -
ఢిల్లీలో కేవలం ‘గ్రీన్’ దీపావళి
న్యూఢిల్లీ: దీపావళి పండుగని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే ఢిల్లీలో తయారు చేసి, అమ్మాలని మంత్రి బుధవారం చెప్పారు. మరోవైపు ఈ ఏడాది టపాసులకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్ 3 నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా గోపాల్ రాయ్ వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలెవరూ టపాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది దీపావళి టపాసులు పేల్చడం, పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ సారి టపాసులకి దూరంగా ఉండాలన్నారు. -
ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం మంచి అవకాశం సిద్ధమవుతోంది. టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ ఈ పండుగ సందర్భంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వారికి భారతదేశం అంతటా ఎయిర్‌పాడ్ ఉచితంగా అందించనుంది. కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్ లేదా ఆపిల్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వినియోగదారులకు 15 వేల రూపాయల ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించనుంది. (ఐపోన్ 12 : ఆపిల్ ఈవెంట్ పై క్లారిటీ) ఈ పరిమిత సమయం ఆఫర్ అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. 64 జీబీ వేరియంట్ ఐఫోన్ 11 ఆపిల్ ఆన్లైన్ స్టోర్‌లో రూ .68,300 ధర వద్ద లభిస్తుంది. ఎయిర్‌పాడ్స్ 14,990 రూపాయలకు విక్రయిస్తోంది. అయితే ఆపిల్ అందించే తాజా ఉచిత ఎయిర్‌పాడ్స్ ఆఫర్‌తో ప్రస్తుతం ఐఫోన్ 11 ధర రూ. 53,310 దిగి వచ్చినట్టే. ఆపిల్ వినియోగదారులు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆపిల్ ఉత్పత్తులపై డీల్స్ సాధారణంగా ఎక్కువ సమయం ఉండవు. సో.. ఆపిల్ ప్రేమికులు..త్వర పడండి!! (అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : ఐఫోన్ 11పై ఆఫర్) కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా 50వేల రూపాయల లోపు ధరకే ఐఫోన్ 11ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. అటు మరో దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 16-21వరకు బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలకు తెరతీయనున్న సంగతి తెలిసిందే. -
టపాసులకు భయపడి పట్టాలపైకి
దొడ్డబళ్లాపురం: అప్పటి వరకూ దీపావళి పండు గ సంబరాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇంటి యజమాని మృతి ఆ ఇంటి ఇల్లాలి కలలను ఛిన్నాభిన్నం చేశాయి. టపాసుల సరాన్ని అంటించిన వ్యక్తి నిప్పురవ్వల నుండి తప్పించుకునే ప్రయత్నంలో రైలు పట్టాలపైకి పరిగెత్తగా, అదే సమయంలో వస్తున్న రైలు ఢీకొని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంజునాథ్ (38) మృతి చెందిన వ్యక్తి. ఎలా జరిగిందంటే బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడ పరిధిలోని విజయనగర్ కాలనీలో నివసించే మంజునాథ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రాయచూరుకు చెందిన మంజునాథ్ భార్య విజయరంజనితో కలిసి నివసిస్తున్నాడు. వివాహం జరిగిన పదేళ్లకు గర్భం దాల్చిన భార్య ఇప్పుడు ఆరునెలల గర్భవతి అని తెలిసింది. మంగళవారం రాత్రి దీపావళి సందర్భంగా మంజునాథ్ టపాసులు కాల్చే క్రమంలో టపాసుల సరం అంటించాడు. నిప్పురవ్వల ఎగరడంతో తప్పించుకోవాలని పక్కనే ఉన్న రైలుపట్టాలపైకి పరిగెత్తాడు. అదే సమయంలో బెంగళూరు నుండి వస్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా ఢీకొంది. దీంతో మంజునాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న విజయరంజని కళ్ల ముందే భర్త మరణించడంతో కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న దొడ్డ రైల్వేపోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించారు.కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ దీపావళికి మోత మోగించారు..
సనత్‌నగర్: నగరంలో ఈసారి దీపావళికి టపాసుల మోత మోగింది. పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా నగరవాసులు వినిపించుకోలేదు. ఫలితంగా గతేడాది దీపావళి రోజు కంటే ఈసారి కాలుష్యం అధికంగా నమోదైంది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పరిమితికి మించి ధ్వని కాలుష్యం నమోదు కాగా, గాలిలో కాలుష్య ఉద్గారాల పరిమితి పెరిగింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దీపావళికి సంబంధించిన ప్రాథమిక నివేదికను మంగళవారం విడుదల చేసింది. నివాస ప్రాంతాల్లో గతేడాది ధ్వని కాలుష్యం సరాసరిన (ఉదయం 6–రాత్రి 10) 64 డెసిబెల్స్ నమోదైతే... ఈసారి అది 69 డెసిబెల్స్‌కు పెరిగింది. నిబంధనల మేరకు రెసిడెన్షియల్ప్రాంతాల్లో 55 డెసిబెల్స్‌కు మించరాదు. వాణిజ్య ప్రాంతాల్లో గతేడాది 71 డెసిబెల్స్ నమోదైతే.. ఈసారి 72 డెసిబెల్స్‌కు పెరిగింది. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో 65 డెసిబెల్స్‌కు మించరాదు. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత టపాసుల మోత మోగిందని నివేదిక పేర్కొంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు 64 డెసిబెల్స్ ఉంటే... ఆ తర్వాత రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు 71 డెసిబెల్స్‌కు పెరిగింది. గతేడాది ఈ ప్రాంతాల్లో రాత్రి 10గంటల తర్వాత 66 డెసిబెల్స్‌గా ఉంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే 7 డెసిబెల్స్ తగ్గడం గమనార్హం. కమర్షియల్ ప్రాంతా ల్లో రాత్రి 10 తర్వాత 70 డెసిబెల్స్‌కు మించ రాదు. పీఎం10 రెట్టింపు శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కారణమయ్యే పీఎం 10 ఉద్గార స్థాయి ఊహించని రీతిలో పెరిగినట్లు పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో సగటున 85 ఉంటే దీపావళి రోజున 163 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. అంటే సాధారణ రోజుల్లో కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదైంది. పీఎం 10 గతేడాది దీపావళికి 140 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్ నమోదు కాగా... ఈసారి అదనంగా 23 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్ మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వాస్తవానికి గాలిలో పీఎం10 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 100 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటరు మించరాదు. ఇక పీఎం 2.5 మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గింది. 2018లో 95 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటర్‌గా ఉంటే... ఈసారి 71.6 గా నమోదైంది. పీఎం 2.5 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 60కి మించరాదు. పెరిగిన ఎన్ఓఎక్స్ కళ్లు, ముక్కు మండేలా చేసే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ (ఎన్ఓఎక్స్) గతేడాది కంటే పెరిగింది. 2018లో 43.5 మైక్రోగ్రాము/క్యూబీక్ మీటర్ నమోదు కాగా.. ఈసారి 65కు నమోదైంది. ఇక శ్వాసకోశ, బ్రాంకైటీస్, చికాకును కలిగించే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్ఓ2) గతేడాది కంటే కాస్త తగ్గడం ఊరటనిచ్చింది. 2018లో 7.6 నమోదు కాగా.. ఈసారి 6.0 నమోదైంది. అందుకే పెరిగిందా? ఓవైపు కాలుష్యం పెరగ్గా... మరోవైపు టపాసుల విక్రయాలు మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదు కావడానికి కారణం గాలిలో ఆర్ధ్రత (తేమ శాతం) ఎక్కువగా ఉండడమేనని తెలుస్తోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు టపాసుల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు త్వరలో గాలిలో కలసిపోయే ఆస్కారం ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లో చుట్టుముట్టడంతో కాలుష్యం ఎక్కువగా నమోదైందని పేర్కొంటున్నారు. గతేడాది గాలి వేగం 1.6 మీటర్స్/సెకనుగా ఉండగా... ఈసారి 0.5 మీటర్స్/సెకనుకు పడిపోయింది. సనత్‌నగర్‌లో అత్యధికం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను పరిశీలిస్తే అత్యధికంగా సనత్‌నగర్‌లో 361, బొల్లారంలో 300 నమోదైంది. ఈ మేర స్థాయి ఆరోగ్యానికి హానికరమని పీసీబీ పేర్కొంది. ఇక సున్నిత (సెన్సిటివ్) ప్రాంతాల్లోనూ కాలుష్య ఉద్గారాలు వెలువడ్డాయి. హెచ్‌సీయూ వద్ద 170, జూపార్కు వద్ద 113 నమోదైంది. -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
‘మేరీ గోల్డ్’ కేజీ రూ.800
కొత్తగూడెంటౌన్: దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు లక్ష్మీపూజ చేస్తారు. దీంతో పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కిలో మేరీ గోల్డ్ చామంతి ఏకంగా రూ.800 ధర పలకడంతో అవాక్కవుతున్నారు. వారం కిందట వంగ రంగు చామంతి కిలో రూ.400 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగూడెంలోని సూపర్‌బజార్, గణేశ్‌టెంపుల్ ఏరియా, రామవరం, త్రీటౌన్ సెంటర్, విద్యానగర్‌కాలనీ, పాలకేంద్రం, రుద్రంపూర్, గౌతంపూర్, ధన్‌బాద్‌లతోపాటు పలు ప్రాంతాల్లో పూల కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. కూసుమంచి మండలంలో.. కూసుమంచి: మండలంలోని చేగొమ్మ క్రాస్‌రోడ్ లో బంతిపూల తోటలను పలువురు గిరిజనులు సాగుచేశారు. వారు అక్కడే పూలను విక్రయిస్తున్నారు. కిలో పూలు రూ.60 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. మూడు రోజుల కిందట రూ.40 వరకే పూలను అమ్మగా పండుగ సందర్భంగా ఆదాయం పెరిగింది. ఖమ్మం–సూర్యాపేట రా్రïÙ్టయ రహదారి పక్కన ఈ తోటలు ఉండటంతో వచ్చిపోయే వాహనదారులు పూలను కొంటున్నారు. వైరాలో.. వైరా: రెండు రోజుల కిందట కిలో రూ.35 నుంచి రూ.40 ఉన్న బంతి పూల ధర ఒక్కసారిగా రూ.80 నుంచి రూ.100కు పెరిగింది. వైరా–ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై పల్లిపాడు సమీపంలో బంతిపూల సాగు సుమారు 20 ఎకరాల్లో ఉంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. హైవే మీద ఉండటంతో పూలను మార్కెట్‌కు తీసుకుపోయే ఖర్చు కూడా తగ్గింది. వాహనదారులు వాహనాలు నిలిపి విరివిగా బంతిపూలు కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ ఉంది. -
ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి
దీపావళి అనగానే మనసుకి ఆహ్లాదాలనిచ్చే దీపాలూ, వాతావరణాన్ని కలుషితం చేసే టపాకాయలే గుర్తొస్తాయి. అందుకే దీపావళి పండుగని ప్రమాదకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏటా వేలాది మందిని మృత్యువు దరికి చేరుస్తోన్న టపాకాయలు కాల్చొద్దంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఎకోఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో, తక్కువ పొగని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్ బల్బులకు బదులుగా బయోడీగ్రేడబుల్ దీపాలను వెలిగించడం వల్ల కూడా కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. ఇందులోభాగంగానే ఈసారి ఢిల్లీ ప్రభుత్వం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లను కాల్చుకోవడానికి మాత్రమే అనుమతినిచ్చింది. అవి కూడా ప్రభుత్వం తయారు చేసిన వాటిని మాత్రమే కొనాలి. ప్రభుత్వం తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటితోనే ఈసారి ఢిల్లీ వాసులు దీపావళి జరుపుకొని సంతృప్తి పడవలసిందే. -
హైదరాబాద్‌లో మొదలైన దీపావళి సందడి
-
ప్రమాదాలకు దూరంగా...
ఒకపక్క వానలు బాగా పడ్డాక... మరో పక్క ఈశాన్య రుతుపవనాలు రాబోయే ముందర వచ్చే పండగ దీపావళి. అంటే రెండు వానల సీజన్ల మధ్య ఇది వస్తుంది . ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. దాంతో ఇళ్లన్నీ చెమ్మతో నిండి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఇంటికి వెల్ల/సున్నం వేశారనుకోండి. అప్పుడా సున్నం ప్రభావంతో ఇంట్లోని హాని చేసే సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అంతేకాదు... వెంటనే రాబోయే ఈశాన్య రుతుపవనాల్లోని మరో చెమ్మ కాలంలో సైతం ఈ సున్నం ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనూ ఇల్లు సూక్ష్మ జీవుల నుంచి సురక్షితంగా ఉంటుంది. ఇక ఈ చెమ్మ సీజన్లో వేగంగా పెరిగిపోయే అనేక రకాల హానికారక సూక్ష్మజీవులు నశించిపోయేందుకు బాణాసంచా నుంచి వచ్చే పొగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఈ సీజన్లో టపాకాయలు కాలుస్తారు. వాటి నుంచి వెలువడే గంధకం, పొటాషియం వంటి వివిధ రసాయనాలు కీటకాలను, క్రిములను తుదముట్టించడమే కాదు... వాటి పెరుగుదలను చెమ్మతో నిండిన ఈ సీజన్ తగ్గే వరకు అరికడతాయి. అంతేకాదు... ఈ సీజన్లో పడ్డ విపరీతమైన వర్షాల వల్ల గుంతల వంటి వేర్వేరు చోట్ల, మనకు తెలియకుండానే వివిధ ప్రాంతాల్లో పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగీ విస్తరించాయి. ప్రత్యేకంగా ఈ సీజన్లో డెంగీతో పాటు చికన్‌గున్యా జతకట్టి మరింత విజృంభించింది. వర్షాలు పడ్డప్పుడువచ్చే ఈ సీజన్‌లోని వ్యాధుల నుంచి రక్షించడానికి, వ్యాధికారక క్రిములను తుదముట్టించడానికి ఈ బాణాసంచా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవీ దీపావళి పటాసుల పాటిజవ్ అంశాలు. కానీ నాణేనికి మరో వైపు ఉన్నట్లే దీపావళి బాణాసంచాతో మరికొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెవులకు బాణాసంచా శబ్దాలు ఎంతో హాని చేస్తాయి. చెవుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీపావళి మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. గట్టి శబ్దాలతో అనార్థాలివే... ►గట్టి శబ్దాల వల్ల నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వయోవృద్ధులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. మనకు హాని కలిగించే శబ్దాలను రెండురకాలు విభజించుకోవచ్చు. మొదటిది... అకస్మాత్తగా వినిపించే శబ్దం... దీన్ని ఇంపల్స్ సౌండ్ అంటారు. రెండోది... దీర్ఘకాలం పాటు శబ్దాలకు అలా ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఈ రెండోరకాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. మనం దీపావళి సందర్భంగా ఎదుర్కొనే శబ్దం మొదటిదైన ఇంపల్స్ సౌండ్. దాంతో ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఉదాహరణకు... అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. చెవిలో నొప్పి, గుయ్‌మనే శబ్దం వినిపిస్తూ ఉండటం. చెవి లోపల ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతినడం. కొన్ని సందర్భాల్లో చెవి నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి నష్టం కూడా జరగవచ్చు. ►ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్’గా పేర్కొనవచ్చు. ఆ వ్యవధి దాటిన తర్వాత కూడా చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. ►గర్భిణుల్లో 140 డిసిబుల్స్‌కు మించిన పెద్ద శబ్దం వల్ల కలిగే స్టిమ్యులేషన్స్తో నొప్పులు వచ్చి నెలలు నిండటానికి ముందే ప్రసవం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు బాణాసంచా శబ్దాల నుంచి దూరంగా ఉండాలి. ఇక వయోవృద్ధులు కూడా శబ్దాలతో ప్రభావితమవుతారు కాబట్టి వారూ దూరంగానే ఉండాలి. జాగ్రత్తలు: శబ్దాల వల్ల కలిగే దుష్ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు కొందరు చెవిలో దూది పెటుకుంటారు. చెవిలో దూదివల్ల కేవలం 7 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉండే శబ్దాల నుంచి మాత్రమే రక్షణ లభిస్తుంది. టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. అందుకే ఈ శబ్దాల నుంచి రక్షించుకోడానికి వీలైతే ఇయర్‌ప్లగ్స్ వంటివి వాడటం మంచిది. ►పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వెయ్యకూడదు. ►శబ్దాల కారణంగా చెవి ప్రభావితమైనప్పుడు ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. వారు ఆడియోమెట్రీ వంటి పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. ►పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. ►బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం వంటివి చేయకూడదు. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
స్టాక్స్..రాకెట్స్!
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం, వాణిజ్య యుద్ధ భయాలు, జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్ వంటి గడ్డు పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్ 15 దాకా సుమారు 11% రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్ సూచీ 6%, స్మాల్‌క్యాప్ సూచీ 10% మేర క్షీణించాయి. అయితే, రియల్టీ 14%, బ్యాంకెక్స్ 13%, ఆయిల్ అండ్ గ్యాస్ 13% పెరిగాయి. ఇక సంవత్ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా. ఈ నేపథ్యంలో నిఫ్టీ 14,000 పాయింట్లకు , సెన్సెక్స్ 46,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ‘సంవత్ 2076’లో ఐటీ, మెటల్, ఫార్మా, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నది బ్రోకరేజీ సంస్థల సూచన. ప్రైవేట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నాయి. ఆ సిఫారసుల వివరాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... బ్రోకరేజి సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 469 టార్గెట్ ధర రూ. 550 ఇతరత్రా సవాళ్లు, కొత్తగా బయటికొస్తున్న మొండిపద్దులకు సంబంధించి మిగతా బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆదాయాలను మెరుగుపర్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. రుణ వితరణకు సంబంధించి వార్షిక ప్రాతిపదికన 2019–21లో 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. హెచ్‌యూఎల్ ప్రస్తుత ధర రూ. 2,143 టార్గెట్ ధర రూ. 2,265 మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్పులు, చేర్పులు చేసుకోగల సామర్థ్యాలు, ప్రీమియమైజేషన్ ట్రెండు పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవటం వంటివి ఈ సంస్థకు సానుకూలాంశాలు. లార్జ్ క్యాప్ కన్జూ మర్ సంస్థల్లో హెచ్‌యూఎల్ ఆదాయాలు మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి. టైటాన్ ప్రస్తుత ధర రూ. 1,334 టార్గెట్ ధర రూ. 1,435 సొంతంగా అమలు చేస్తున్న వ్యూహాలు, నియంత్రణ వ్యవస్థ పరంగా సానుకూలాంశాలు టైటాన్ వృద్ధికి దోహదపడనున్నాయి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రూప్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) అమ్మకాల వృద్ధిలో జ్యుయలరీ విభాగం వాటా 60% పైగా ఉంది. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ ప్రస్తుత ధర రూ. 282 టార్గెట్ ధర రూ. 350 నిర్వహణ పనితీరు స్థిరంగా ఉంది. ఆదాయాలు మెరుగుపడతాయి. అలాగే, ఎన్సీఎల్టీకి చేరిన మొండిపద్దుల నుంచి కూడా భారీ రికవరీలకు గణనీయమైన అవకాశాలున్నాయి. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత ధర రూ. 2,103 టార్గెట్ ధర రూ. 2,600 లిక్విడిటీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. తక్కువ వ్యయాలతో నిధులు సమీకరించుకోగలగడం, మార్కెట్ షేరు పెంచుకోగలగడం దీనికి సానుకూల అంశాలు. 2019–2022 మధ్య ఏయూఎం వృద్ధి వార్షిక ప్రాతిపదికన 14 శాతం స్థాయిలో ఉండొచ్చని, నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ: రెలిగేర్ బ్రోకింగ్ హావెల్స్ ఇండియా ప్రస్తుత ధర రూ. 665 టార్గెట్ ధర రూ. 795 కొంగొత్త ఉత్పత్తులతో పోర్ట్‌ఫోలియోను వేగవంతంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంఈజీ రంగంలో అత్యధికంగా మార్కెట్ వాటా, పటిష్టమైన నెట్వర్క్ దీనికి లాభించే అంశాలు. పండుగ సీజన్ డిమాండ్‌తో రాబోయే రోజుల్లో పనితీరు మరింత మెరుగుపడవచ్చు. రుణభారం తక్కువగా ఉండటం, రాబడులు మెరుగ్గా ఉండటం కలిసొస్తాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ధర రూ. 578 టార్గెట్ ధర రూ. 695 ఆటో పరిశ్రమలో మందగమ నం కారణంగా ఏడాది కాలంగా ఈ షేరు కరెక్షన్కు లోనయ్యింది. వర్షపాతం బాగుండటం, ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉండటం, తక్కువ స్థాయిలో వడ్డీ రేట్లు ట్రాక్టర్ పరిశ్రమ రికవరీకి తోడ్పడగలవని అంచనా. ఫోర్డ్ ఇండియాతో జట్టు కట్టడం .. ఎంఅండ్ఎం పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టపర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి, భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మారికో ప్రస్తుత ధర రూ. 393 టార్గెట్ ధర రూ. 451 సమీప భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీకి సవాళ్లు ఉన్నప్పటికీ.. క్రమంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవచ్చు. సానుకూల అంచనాల కారణంగా 13–15 శాతం మేర ఆదాయ వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. కొత్త ఉత్పత్తులు, కొన్ని విభాగాల్లో అగ్రస్థానం ఉండటంతో పాటు కొబ్బరి ధరలు తగ్గుతుండటం.. కంపెనీ మార్జిన్లపరంగా సానుకూల అంశాలు. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 699 టార్గెట్ ధర రూ. 780 పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త ఉత్పత్తులు, నెట్వర్క్ పటిష్టపర్చుకోవడం సానుకూల అంశాలు. మున్ముందు రూమ్ ఏసీలు, ఎయిర్ కూలర్లకు డిమాండ్‌తో వోల్టాస్ విక్రయాలు గణనీయంగా పెరగవచ్చు. తీవ్ర పోటీ ఉన్నా రూమ్ ఏసీల విభాగంలో వోల్టాస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. బ్రోకరేజి సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుప్రీం ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,173 టార్గెట్ ధర రూ. 1,420 దేశీయంగా అతి పెద్ద ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఒకటి. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో తాగు నీటి వసతి కల్పించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చడం వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పైపుల రంగానికి .. తద్వారా ఈ సంస్థకు సానుకూల అంశాలు. 2019–21 మధ్య కాలంలో కంపెనీ ఆదాయాలు 13 శాతం పైగా వృద్ధి చెందగలవని అంచనా. యునైటెడ్ బ్రూవరీస్ ప్రస్తుత ధర రూ. 1,337 టార్గెట్ ధర రూ. 1,620 దేశీ బీరు మార్కెట్లో 52 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. పటిష్టమైన బ్రాండ్స్, విస్తృతమైన నెట్వర్క్ దీనికి బలం. ఇతర ఉత్పత్తుల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం బ్రాండ్స్ విక్రయాలు మెరుగుపడనుండటం సంస్థకు సానుకూలం. కొత్తగా క్రాఫ్ట్ బీరు, నాన్–ఆల్కహాల్ బెవరేజెస్ వ్యాపారాలు కూడా సంస్థకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కాన్సాయ్ నెరోలాక్ ప్రస్తుత ధర రూ. 545 టార్గెట్ ధర రూ. 620 దేశీయంగా అతి పెద్ద ఇండస్ట్రియల్ పెయింట్ కంపెనీ. ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగంలో 35 శాతం, మొత్తం పెయింట్స్ మార్కెట్లో 14 శాతం వాటా ఉంది. పట్టణీకరణ, రీపెయింటింగ్కు డిమాండ్‌తో పాటు మెరుగైన వర్షపాతం, అందరికీ ఇళ్ల పథకాలు మొదలైనవి పెయింట్ పరిశ్రమకు, ఈ సంస్థకు సానుకూల అంశాలు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు కోత కూడా కంపెనీకి లాభిస్తుంది. డాబర్ ఇండియా ప్రస్తుత ధర రూ. 465 టార్గెట్ ధర రూ. 550 పలు రకాల ఉత్పత్తులతో.. వివిధ విభాగాల్లోకి కంపెనీ విస్తరించింది. మూడు బ్రాండ్స్ (రియల్, వాటికా, ఆమ్లా) టర్నోవరు రూ. 1,000 కోట్ల పైగా ఉంటుండగా, రూ. 100 కోట్ల పైగా టర్నోవరుండే బ్రాండ్స్ 16 దాకా ఉన్నాయి. పతంజలి నుంచి పోటీ తగ్గి గత కొద్ది త్రైమాసికాలుగా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తోంది. జేకే సిమెంట్ ప్రస్తుత ధర రూ. 1,117 టార్గెట్ ధర రూ. 1,260 గ్రే సిమెంట్ విభాగంలో టాప్ సంస్థల్లో ఇదొకటి. వైట్ సిమెంట్‌లో మార్కెట్ లీడరు. ఉత్తర, దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ విస్తరణ ప్రణాళికల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. వైట్ సిమెంటు విభాగంలో అగ్రస్థానంలో ఉండటం, కార్పొరేట్ ట్యాక్స్ కోత దీనికి లాభించగలవని అంచనా. బ్రోకరేజి సంస్థ : ఏంజిల్ బ్రోకింగ్ మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 7,469 టార్గెట్ ధర రూ. 8,552 ప్యాసింజర్ వాహనాల విభాగంలో 52 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతూ ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షిస్తోంది. ఆటోమొబైల్ రంగం రికవర్ అయ్యే క్రమంలో ముందుగా అవకాశాలను అందిపుచ్చుకునే సత్తా ఉండటం దీనికి సానుకూలం. జీఎంఎం ఫాడ్లర్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 ఆగ్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా తదితర రంగాల్లో రసాయనాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించే గ్లాస్ లైన్డ్ (జీఎల్) స్టీల్ పరికరాల ఉత్పత్తిలో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలకు సరిపోయేలా ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. మధ్యకాలికంగా జీఎల్యేతర వ్యాపారాలను కూడా మెరుగుపర్చుకుంటోంది. లార్సన్ అండ్ టూబ్రో ప్రస్తుత ధర రూ. 1,425 టార్గెట్ ధర రూ. 1,850 ఇన్ఫ్రా, హైడ్రోకార్బన్, సర్వీసుల విభాగాలతో దేశీయంగా అతి పెద్ద ఈపీసీ కంపెనీ. వివిధ అనుబంధ సంస్థల ద్వారా ఐటీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ, విదేశాల్లో రూ.3 లక్షల కోట్ల విలువ చేసే ఆర్డర్లతో పటిష్టంగా ఉంది. ప్రభుత్వం ఇన్ఫ్రాపై దృష్టి, కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు వంటివి సంస్థకు లాభించేవి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,229 టార్గెట్ ధర రూ. 1,390 డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతోంది. నగరాలు కానిచోట కొత్త శాఖల సంఖ్యను మరింతగా పెంచుకోవడం, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)లను 4 రెట్లు పెంపు, వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ క్లయింట్స్ సంఖ్య రెట్టింపు వంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది. మెరుగైన మార్జిన్లు నమోదు చేయగలుగుతోంది. బ్లూ స్టార్ ప్రస్తుత ధర రూ. 795 టార్గెట్ ధర రూ. 867 భారత్‌లో ఏసీలు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఒకటి. రూమ్ ఏసీల మార్కెట్లో ప్రతి ఏడాది తన మార్కెట్ వాటాను పెంచుకుంటూనే ఉంది. ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయంలో కూలింగ్ ప్రొడక్ట్స్ డివిజన్ వాటా పదేళ్లలో రెట్టింపైంది. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగనున్నది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం చొప్పున వృద్ధి చెందగలదని అంచనా. మార్జిన్లు వచ్చే ఏడాది 7%కి పెరగవచ్చు. గోల్డ్ రన్.. రూ. 41,500కు చేరే అవకాశం అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే. 2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్ ఒక మోస్తరుగానే ఉంది. వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. -
దివ్వెకువెలుగు
దీపాల పండగకు దివ్వె వెలుగులు విరజిమ్ముతుంది. మరి ఆ దివ్వెకే వెలుగులు అద్దితే.. ఆ వెలుగు మరింత కళగా, కాంతిని విరబూస్తుంది. దీనికి ఎంతో ఖర్చు అక్కర్లేదు. ఇంట్లో ఏదో సందర్భంలో కొని వాడకుండా పక్కన పెట్టేసిన పూసలు, లేసులు, కలర్స్‌తో ప్రమిదలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ►మట్టి ప్రమిదలు, చిన్న చిన్న కుండలు, మట్టి ప్లేటు, పెయింట్, పూసలు, చమ్కీలు, లేస్, గ్లూ... తీసుకోవాలి. ►ప్రమిదలకు, ప్లేట్‌కు లోపలి వైపు ఒక రంగు, బయటి వైపు ఒక రంగు వేయాలి. ఆరిన తర్వాత లేస్ లేదా పూసల దండను గ్లూ సాయంతో ప్రమిదలకు, కుండలకు చుట్టూ అతికించాలి. ►ప్లేటులో కుండలను వరసగా పెట్టి, వాటి ముందు అలంకరించిన దివ్వెను అతికించాలి. ప్రమిదలకు అద్దాలు, చమ్కీలను కూడా అతికించవచ్చు. ఇలా అందమైన రూపాల్లో దివ్వెను నచ్చిన డిజైన్లలో అలంకరించుకోవచ్చు. -
పండుగ కళ కనిపించాలి
పండుగ రోజున డ్రెస్‌కు తగ్గట్టు అలంకరణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అప్పుడే కళగా కనిపిస్తారు. కొందరు కేవలం ముఖం ఒక్కటే బాగుంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా కాలి వేళ్ల నుంచి కేశాల వరకూ పండగరోజున ప్రత్యేక అలంకరణతో మెరిసిపోవచ్చు. ►డ్రెస్ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్ వర్క్, మిర్రర్‌వర్క్.. వంటివి సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. ►ఎదుటివారి చూపు వేసుకున్న డ్రెస్ తర్వాత మన కేశాలంకరణ మీద పడుతుంది. తలకు నూనె పెడితే ముఖం జిడ్డుగా కనిపిస్తుంది కాబట్టి శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణలు బాగుంటాయి. ►ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు. ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి. -
నమో ఆరోగ్య దీపావళి
ధర్మశాస్త్రాలలో చెప్పిన దీపావళికి ఇప్పటి దీపావళికి సంబంధం లేదు. ఈనాటి పండుగ ధన వ్యయానికి, ప్రాణప్రమాదాలు, గాయాలకు కారణమౌతోంది. అసలైన దీపావళిని శారీరక మానసిక ఆరోగ్యాల కోసం మన ఋషులు ఏర్పరిచారు. చలికాలంలో పర్యావరణ పరిరక్షణ, వ్యాధి నిర్మూలన ఈ పండుగ నిర్దేశిత లక్ష్యాలు. చలితో మంచుతో వాతావరణంలో, ఉష్ణోగ్రతలో మార్పులను తట్టుకొనే విధంగా నువ్వుల నూనెతో అసంఖ్యాకంగా దీపాలను వెలిగించటమే దీపావళి. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతల సమ్మేళనంగా ఏర్పడిన దీపావళి పండుగ భారతీయ పర్వదినాలలో ప్రధానమైనది. పౌరాణికంగా ఈ పండుగ ద్వాపర యుగంలో సత్యభామాశ్రీకృష్ణులు నరకాసురుని సంహరించిన సందర్భంగా ఏర్పడింది. పదహారు వేలమంది స్త్రీలను చెరపట్టిన పరమ దుర్మార్గుణ్ని చంపినప్పుడు ప్రజలలో కలిగిన ఆనందానికి ఈ పండుగ సంకేతం అయినప్పటికీ ఇందులోని పరమార్థం వేరే ఉంది. చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల నివారణకు నువ్వులు, నువ్వులనూనె వాడకం సులభోపాయం. దీపావళి పండుగలోని పరమార్థం కూడా ఇదే! వేదాలు, ఉపనిషత్తులలో, పితృకార్యాలలో ప్రస్తావించబడిన తిలలు (నువ్వులు) ద్వాపర యుగం అనగా అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుండి భారతదేశంలో పండుతున్నాయి. శ్రీకృష్ణావతార కాలానికి – నువ్వుల పంట భౌగోళిక చరిత్రకు... లెక్క సరిపోతుంది. ఆశ్వయ్యుజ కృష్ణపక్షస్య చతుర్దశ్యాం విధూదయే తిలతైలేన కర్తవ్యం స్నానంనరక భీరుణా (నిర్ణయ సింధు) నరక చతుర్దశినాడు తప్పకుండా అందరూ నల్ల నువ్వులతో కలిపి కొట్టిన సున్నిపిండిని నువ్వుల నూనెను తలకు, ఒళ్లంతా పూసుకుని కుంకుడుకాయ రసంతో తలంటి పోసుకోవాలి. అమావాస్యనాడు సాయంకాలం లక్ష్మీదేవి పూజ చేసి నువ్వులనూనెతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగించాలి. అప్పుడు ఉష్ణోగ్రత పెరిగి చలి తగ్గుతుంది. పొలాల్లో, ఇళ్లల్లో బాధించే క్రిమికీటకాలు దీపాల వెలుగుకు ఆకర్షింపబడి దీపాల చుట్టూ తిరుగుతూ చచ్చిపోతాయి. నువ్వులనూనెతో వెలిగే దీపాలకున్న శక్తిని తెలపటానికే దీపావళి పండుగ ఏర్పడింది. దీపైః నీరాజనాదత్రసైషా దీపావళీ స్మృతా’ (మత్స్యపురాణం) పిల్లలు, పెద్దలు స్వయంగా తయారుచేసుకునేవన్నీ వెలుగునిచ్చేవే. పేలుడు పదార్థాలకు దీపావళి పండుగకు సంబంధం లేదు. ఆవు పేడ, తాటి పూలు, బొగ్గులతో చుట్టిన పూల పొట్లాలను వీధిలో నిలబడి గిరగిరా తిప్పితే శారీరక వ్యాయామంగా పౌరుష సూచకంగా పర్యావరణ పరిరక్షణకు పనికివస్తాయి. శబ్దాలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో చెవులు, కళ్లు పాడుచేసుకోమని దీపావళి చెప్పలేదు. గోగు పుల్లలకు గుడ్డ చుట్టి నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. దీపావళి నాడు ఉదయం నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. నువ్వులనూనెతో చేసిన గారెలు, వడలు వంటి పిండివంటలు, చిమ్మిరి ఉండలు నైవేద్యం పెట్టాలి. నువ్వు తెలగపిండి కూరల్లో కలిపి వండాలి. ఇలా శారీరక ఆరోగ్యానికి అన్నివిధాల లాభదాయకమై... పర్యావరణాన్ని, పంటలను రక్షించటానికి, చలిని పోగొట్టటానికి ఏర్పడింది దీపావళి పండుగ. నరకాసురుని కథ ద్వారా యువతరంలో సత్ప్రవర్తనను, తల్లిదండ్రులకు చక్కని పిల్లల పెంపకాన్ని తెలియచేసే కర్తవ్యబోధిని. శాస్త్రీయంగా, నిరాడంబరంగా నిర్భయంగా నిజమైన దీపావళి పండుగను జరుపుకుందాం. దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకుందాం. – డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
రిలయన్స్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ ఆఫర్
పండుగల సీజన్ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి 31వరకు కొనసాగనున్న తాజా ఆఫర్లో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్ వంటి ఎల్రక్టానిక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్ ఉన్నట్లు వెల్లడించింది. లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు, ఎల్ఈడీ టీవీలు, ఐ–ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్ కాలంలో మై జియో స్టోర్స్‌లో వోచర్లను సైతం అందిస్తున్నట్లు తెలిపింది. -
సురక్షిత దీపావళి
దీపావళి పండగ మనసుకే కాదు... దీపకాంతులతో కళ్లకూ పండగే. రంగురంగుల కాంతులీనుతూ వెలిగే బాణాసంచా, మతాబులు కళ్లను మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ సంబరాలూ సంరంభాలూ కళ్లకు ప్రమోదమే గానీ ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. సురక్షితమైన దీపావళి వేడుకలతో మన కళ్లను కాపాడుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోండి. పనిలో పనిగా కళ్లతో పాటు ఒంటినీ సంరక్షించుకోండిలా. జాగ్రత్త ►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే. ►బాణాసంచా కేవలం లైసెన్స్డ్ షాప్‌లోనే కొనాలి. ►ఇంట్లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ వంటి దాన్లో పెట్టాలి. ►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి. ►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు. ►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. ►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది. ►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు. ►కాల్చేసమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది. ►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం. ►టపాసు నుంచి తలను వీలైనంత దూరంగా ఉంచాలి. ►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. ►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి. ►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్ఫీషియల్), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్ డెప్త్), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్ బర్న్స్). ►వీటిల్లో మీడియన్ డెప్త్, డీప్ బర్న్ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్) మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. ►ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ►డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు. ►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు. ►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడి వస్త్రం ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి. ►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు. ►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు. ►మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు. ఐ కేర్ ►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం. ►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు. ►తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దానివల్ల కార్నియల్ బర్న్స్ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు. ►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి. ►కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు. ►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►వెలుగులు, రవ్వలతోపాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది. ►రాకెట్ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ►డైరెక్ట్ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ►అలాంటిదే జరిగితే కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ►గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి. -
దీపావళికి పట్టు జార్జెట్టు
ఇది మెరిసే పండగ.మగువలూ మెరిసే పండగ. వాకిలిలో దీపాలు వెలుగుతాయి. వాకిలి లోపల గృహిణి కళ కళకళలాడుతుంది. ఈ దీపావళికి కొత్త డిజైన్ని ట్రై చేయండి. జార్జెట్ చీరకు పట్టు అంచును జతచేయండి. ఆ కట్టుతో ఆకట్టుకోండి. అందరికీ సూటబుల్ బెనారస్ పట్టు మంచి కాంతిమంతమైన రంగులతో, డిజైన్‌తో ఇట్టే ఆకట్టుకుంటుంది. పండగలకు, పెళ్లిళ్లకు బెనారస్ పట్టు చీరలను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అలాగే జార్జెట్ చీరలను అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ఈ రెంటినీ ఇష్టపడేలా కాంబినేషన్ చీరను డిజైన్ చేశాం. సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకు కొత్త కళ తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈ జార్జెట్ బెనారస్ పట్టుల కాంబినేషన్. టీనేజర్ల దగ్గర నుంచి అన్ని వయసుల వారూ వీటిని కట్టుకోవచ్చు. వేడుకలలో బ్రైట్‌గా వెలిగిపోవచ్చు. ►హెవీగా కాకుండా బెనారస్‌ను అంచు, బుటీలుగా తీసుకున్నారు. ►పాతకాలం అంటే నలభై యాభై ఏళ్ల క్రితం అమ్మలకు ఇలాంటి బ్రైట్ డిజైన్ ఉన్నకలర్ కాంబినేషన్ చీరలు ఉండేవి. ఆ డిజైన్ వచ్చేలా వీటిని డిజైన్ చేశారు. ►ఈ చీరలకు ఎలాంటి బ్లౌజ్ వేసినా బాగా నప్పుతుంది. అంటే చీర రంగులోనే ఉండే సెల్ఫ్ బ్లౌజ్ అయినా, ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ►ఈ చీరలన్నింటికీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ బ్లౌజ్‌లను వాడారు. ►కేశాలంకరణ, ఆభరణాలు సింపుల్‌గా ఉన్నా కాస్త హెవీగా ఉన్నా ఈ చీరలకు నప్పుతుంది. -
ఆగి..చూసి..కొందాం..
సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి పండగలొచ్చాయంటే చాలు... ఏ ఇంట్లో చూసినా కొత్తదనం ఉట్టిపడుతుంది. చాలామంది పండగల సందర్భంగా ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తారు. నచ్చిన బైక్ కొనుక్కొని రయ్‌మంటూ దూసుకెళ్లాలని కుర్రకారు.. బడ్జెట్‌కు అనుగుణంగా పాత వాహనాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని మధ్యతరగతి వర్గాలు... సొంత కారు కొనుక్కోవాలని ఉద్యోగ వర్గాల వారు ఆలోచిస్తుంటారు. వీరంతా పండగ రోజుల్లోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్లో వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దసరా వెళ్లిపోయింది.. దీపావళి వస్తోంది. కానీ అమ్మకాలు మాత్రం మందగమనంలోనే ఉన్నాయి. కొత్త వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తిగా ఉన్నారు. నచ్చిన కార్లు, బైక్‌లు కొనుక్కోవాలని ఉన్నప్పటికీ వాయిదాలు వేస్తున్నారు. ఏ నెలకానెల ఇలా వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ప్రతి ఏటా దసరా, దీపావళి పర్వదినాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలతో సందడిగా ఉండే షోరూమ్‌లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌తో పోల్చుకుంటే ఈసారి అక్టోబర్‌లో అమ్మకాలు 30 శాతానికి పడిపోయినట్లు రవాణా అధికారులు తెలిపారు. ప్రతిఏటా ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కే వ్యక్తిగత వాహనాలు ఈ ఏడాది కొంతమేర తగ్గడం గమనార్హం. బీఎస్–6 కోసం వెయిటింగ్... త్వరలో అందుబాటులోకి రానున్న భారత్ స్టేజ్–6 టెక్నాలజీ వాహనాల కోసం సిటీజనులు ఎదురు చూస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బీఎస్–6 వాహనాలు వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతమున్న బీఎస్–4 వాహనాల కొనుగోలుపై నగరవాసులు విముఖత చూపుతున్నారు. కార్లు, బైక్‌లలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పాత వాటి స్థానంలో కొత్త వాహనాలకు నగరవాసులు అప్డేట్ అవుతున్నారు. దీంతో రెండు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దసరా, దీపావళి రోజుల్లో కళకళలాడాల్సిన షోరూమ్‌లు వెలవెలబోతున్నాయి. నగరంలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉండగా... వీటికి అనుబంధంగా మరో 100 వరకు సబ్‌డీలర్స్ షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతినెలా సుమారు 35వేలకు పైగా బైక్‌లు, మరో 10 వేలకు పైగా కార్ల విక్రయాలు జరుగుతాయి. వీటిలో 10 శాతం వరకు స్పోర్ట్స్ బైక్‌లు, హైఎండ్ వాహనాలు ఉంటాయి. చెన్నై, బెంగళూర్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌లో ఆటోమొబైల్ రంగం పరుగులు తీస్తోంది. గ్రేటర్ జనాభా కోటికి పైగా ఉంటే వాహనాల సంఖ్య అరకోటి దాటింది. కానీ ఈ ఏడాది అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అన్ని నగరాల్లో ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతున్నట్లుగానే నగరంలోనూ జరుగుతోంది. ఆర్థికమాంద్యంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కొత్త టెక్నాలజీ వాహనాలు మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో దసరా, దీపావళి సీజన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ‘ప్రతిఏటా దసరా నుంచి దీపావళి వరకు కనీసం 1,000 బైక్‌లు విక్రయించేవాళ్లం. కానీ ఈసారి 700 కంటే ఎక్కువగా అమ్మలేకపోయాం. బీఎస్–6 వస్తే తప్ప విక్రయాలు పెరిగే అవకాశం లేదు. అందుకోసం మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే’అని నగరానికి చెందిన ఒక ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ తెలిపారు. ‘బైక్‌లు విక్రయాలు కొంచెం ఫర్వాలేదు. కానీ కార్ల అమ్మకాలే చాలా అధ్వానంగా ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి అమ్మకాలు పెరుగుతాయని ఆశించాం. కానీ అందుకు భిన్నంగా ఉంది’ అని మరో డీలర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం... ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రతిరోజు సుమారు 180–200 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కానీ వీటి సంఖ్య ప్రస్తుతం 150కి పడిపోయింది. అందులో బైక్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఖైరతాబాద్‌లోనే కాదు.. గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, కొండాపూర్, మలక్‌పేట్, మెహదీపట్నం, మేడ్చల్, సికింద్రాబాద్, బండ్లగూడ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు 1850–2000 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వీటిలో 1700 వరకు బైక్‌లు ఉంటే మరో 300 వరకు కార్లు ఉంటాయి. కానీ ఈ సంఖ్య కొద్ది రోజులుగా గణనీయంగా పడిపోయింది. రోజుకు 1500 వరకు మాత్రమే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాటిలో బైక్‌లే ఎక్కువగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో సుమారు 48,000 వాహనాలు నమోదు కాగా... ఈ నెలలో ఇప్పటి వరకు ఆ సంఖ్య 33,600 వరకు ఉంది. ‘మరికొద్ది రోజుల్లో అక్టోబర్ ముగియనుంది. కానీ అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు మాత్రం లేవు’ అని ఒక డీలర్ విస్మయం వ్యక్తం చేశారు. నిజానికి గ్రేటర్లో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 55.52 లక్షలకు చేరుకుంది. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో అరకోటికి పైగా వాహనాలు ఉన్నాయి. రూ.లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లు, హైఎండ్ కార్లు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని పొదుపు పాటిస్తున్న మధ్యతరగతి వేతనజీవులు త్వరలో రానున్న బీఎస్–6 వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. -
అలర్ట్ హైదరాబాద్.. ఢాం ఢాం బంద్!
సాక్షి, సిటీబ్యూరో: కళ్లు మిరుమిట్లు గొలిపే టపాసులు, అధిక శబ్దంతో ధ్వని కాలుష్యం వెదజల్లే క్రాకర్స్‌కు ఈ దీపావళికి చెక్ పడనుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణ హననానికి కారణమవుతున్న భారలోహాల ఆనవాళ్లున్న ఈ టపాసులను అమ్మడం, పేల్చడం చేయరాదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. తాజాగా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) సైతం ఇవే మార్గదర్శకాలు జారీ చేసింది. లెడ్, లిథియం తదితర భారలోహాలున్న టపాసుల మోత కారణంగా సమీపంలోని పెట్రోలు బంకులకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న క్రాకర్స్ విక్రయించేవారి గుట్టురట్టు చేసేందుకు పీసీబీ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. తమ పరిశీలనలో ఇలాంటి క్రాకర్స్ పట్టుబడితే సదరు విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ప్రధానంగా చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రాకర్స్‌లోనే భారలోహాల ఆనవాళ్లు బయటపడుతుండడంపై నగరవాసులు, పర్యావేరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనర్థాలెన్నో... లెడ్, లిథియం, యాంటీమోనీ, మెర్క్యురీ, ఆర్సినిక్ తదితర భారలోహాలతో తయారుచేసే ఫైర్‌క్రాకర్స్, మ్యూజికల్ క్రాకర్స్, లూనార్ రాకెట్స్ ఇతరత్రా... టపాసులు పేల్చేవారికి కొద్దిసేపు ఆనందం కలిగించినా, తద్వారా వెలువడే శబ్ద, వాయుకాలుష్యం నగర పర్యావరణ హననానికి కారణమవుతోంది. అంతేకాదు మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావాలు చూపడం తథ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అత్యధిక ధ్వనులు వెలువడే క్రాకర్స్ కారణంగా కర్ణభేరికి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇక అత్యధిక కాలుష్యం వెదజల్లే ఈ క్రాకర్స్ నుంచి వెలువడే పొగ ద్వారా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించే పరిస్థితులు మృగ్యమవుతాయని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశాలకు, కళ్లకు పొగబెట్టే ఈ క్రాకర్స్‌కు చెక్ పెట్టాలని సూచిస్తున్నారు. విదేశీ వద్దు... హైదరాబాద్ నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న టపాసులు విక్రయించే దుకాణాలను గుర్తించేందుకు పీసీబీ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. వీటిని విక్రయిస్తూ పర్యావరణ హననానికి కారణమవుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా విదేశాల నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే టపాసుల్లోనే వీటి ఆనవాళ్లుంటున్నాయని చెబతున్నారు. ఈసారి దివ్వెల పండగను అన్ని వర్గాలు కాలుష్య రహితంగా జరపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ టపాసులు కాల్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ రోజే అధికం.. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజున నగర వాతావారణంలో వివిధ రకాల కాలుష్యకారకాల మోతాదు రెట్టింపవుతున్నట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. సూక్ష్మ ధూళికణాల కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతుండగా.. దీపావళి రోజున 61 శాతానికి పెరుగుతున్నట్లు పీసీబీ వెల్లడించింది. సుప్రీంకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు దీపావళికి ముందు, తరువాత 15 రోజుల వరకు నగరంలో శబ్ద, వాయుకాలుష్యాన్ని శాస్త్రీయంగా లెక్కించి నివేదిక అందజేస్తామన్నారు. -
‘జీరో’జీఎస్టీ :తెల్లకాగితాలపైనే టపాసుల బిల్లులు
సాక్షి సిటీబ్యూరో: ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు ఇవ్వడం తప్పనిసరి. వినియోగదారులు అడగడమూ అవసరం. ‘వినియోగదారుడా మేలుకో.. బిల్లు తీసుకో’, ‘సకాలంలో పన్నులు చెల్లించడం’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలే పరిమితమవుతోంది. నగర మార్కెట్లో దీపావళి సందర్భంగా టపాసుల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా తెల్లకాగితాలపైనే జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. టపాసులపై జీఎస్టీ 18 శాతం ఉండడంతో ఒక్క సంస్థ కూడా బిల్లు రూపేణా వ్యాపారం చేయడం లేదు. చాలా వరకు తెల్లకాగితాలపైనే బిజినెస్ చేస్తూ ‘జీరో దందా’ కొనసాగిస్తున్నాయి. ఇలా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. అన్ని మార్కెట్లలోనూ అంతే... ఉస్మాన్‌గంజ్, సిద్ధిఅంబర్ బజార్, మలక్‌పేట్ ప్రాంతాలు టపాసుల వ్యాపారానికి అడ్డాలు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ హోల్‌సేల్ వ్యాపారం జరుగుతుంది. అయితే అన్ని మార్కెట్లలోనూ బిల్లులు ఇవ్వకుండానే సంబంధిత శాఖ అధికారుల అండదండలతో వ్యాపారులు దర్జాగా జీరో దందా చేస్తున్నారు. కొంతమంది నిజాయతీగా బిల్లులు ఇస్తుండగా... మరికొంత మంది వినియోగదారులు బిల్లులు అడిగినా ఏదో ఓ కాగితంపై రాసిస్తున్నారు. ఈ వ్యవహారమంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసే నడుస్తోంది. దీపావళి సీజన్లో ‘జీరో దందా’ నడిపేందుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో మాముళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దారులెన్నో... జీఎస్టీ చట్టం అమలులో ఉన్నా జీరో బిజినెస్‌కు దారులెన్నో ఉన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తోంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిచ్చేస్తారు. దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్ నంబర్ కనిపించవు. బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు. -
బజాజ్ ఫిన్సర్వ్ నుంచి సులభంగా పర్సనల్ లోన్
హైదరాబాద్: పండుగల సీజన్లో మీ ఇంటిని ఆధునీకరించుకునేందుకు, మీకు ఎదురయ్యే అదనపు ఖర్చులను తట్టుకునేందుకు పర్సనల్ లోన్ అక్కరకు వస్తుంది. దసరా, దీపావళి పండుగలు వచ్చే నెల రోజుల్లోపు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఫర్నిచర్ లేదా గృహోపకరణాలు ఇతరత్రా ఏవైనా కొనుగోళ్లకు బజాన్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్‌ను ఆఫర్ చేస్తోంది. సులభ అర్హత నిబంధనలు, పరిమిత డాక్యుమెంటేషన్‌తో కేవలం 5 నిమిషాల్లోనే పర్సనల్‌లోన్ అనుమతి ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు తెలిపింది. అర్హతను బట్టి రూ.25 లక్షల వరకు 24 గంటల వ్యవధిలోనే పొందొచ్చని.. 60 నెలల వరకు కాల వ్యవధిని ఎంచుకోవచ్చని పేర్కొంది. మరిన్ని వివరాలను https://www.bajajfinserv.in పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. -
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
కేపీహెచ్‌బీ కాలనీ: ఆర్థిక ఇబ్బందులతో చెలరేగిన కలహాలు చివరకు భార్యాభర్తల ఆత్మహత్యకు దారితీశాయి. భర్త షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవటంతో పాటు ఆస్తులు అమ్ముకోవటాన్ని ప్రశ్నించిన భార్య తీవ్ర మనోవేదనకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రేపల్లె గ్రామం అమరావతికి చెందిన బాపయ్య చౌదరీకి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన బాతినేని çశిరీష (27)తో 2017లో వివాహమైంది. కొన్నాళ్లపాటు స్వగ్రామంలో ఉన్న వీరు అనంతరం కేపీహెచ్‌బీకాలనీలో నివాసముంటూ దివ లేబరేటరీలో ఉద్యోగం చేస్తూ నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. బాపయ్య చౌదరి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసి నష్టపోయాడు. వివాహ సమయంలో భరణం కింద ఇచ్చిన భూమిని సైతం అమ్మివేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మనస్తాపానికి గురైన శరీష సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం దీపావళి రోజున ఆమె సోదరుడు కృష్ణ చైతన్య పండుగకు సోదరినిఆహ్వానించేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా ఆమె ఉరివేసుకుని కనిపించింది. బావ బాపయ్య చౌదరికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. గురువారం ఉదయం ప్రసాద్ అనే వ్యక్తి కృష్ణ చైతన్యకు ఫోన్ చేసి బాపయ్యచౌదరి సనత్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడడంతో మూడేళ్ల కూతురు మిగిలిన సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చీకట్లు నింపిన వెలుగులు
గోల్కొండ: దీపావళి పండుగ కొందరు జీవితాల్లో చీకట్లు నింపింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దాదాపుగా కంటి చూపు కోల్పోయారు. బాణసంచా కాల్చిన సంఘటనలో గాయపడ్డవారు మొత్తం 45 మంది వివిధ రకాల కంటి గాయాలతో సరోజిని ఆసుపత్రిలో చేరారు. వీరిలో 33 మందిని ఔట్ పేషెంట్ చికిత్స చేసి పంపించి వేశారు. 14 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చి చికిత్స అందించారు. కాగా వీరిలో ఇద్దరికి శాశ్వతంగా ఒకరికి కంటి చూపు రాదని డాక్టర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి గేటు ఎదుట టపాకాయలు కాలుస్తుండటం చూస్తున్న వనస్థలిపురానికి చెందిన కృష్ణమాచారికి ఒక టపాకాయ వచ్చి కుడి కన్నుకు తాకింది. అదే విధంగా లాలాపేటలో రిషికేష్ (14)కి టపాకాయలు ముఖం మీద పడ్డాయి. ఇందులో రిషికేష్ ముఖానికి తీవ్ర గాయలయ్యాయి. బుధవారం రాత్రి ఇరుగుపొరుగువారి కాల్చిన టపాసుల్లో పేలనివాటిని మాదన్నపేట్‌కు చెందిన సమీర్‌ఖాన్ గురువారం ఉదయం వాటిని కాలుస్తుండగా అవి ఒకేసారి పేలి కంట్లో పడ్డాయి. కాగా ఈ సంఘటనలో మదర్సా విద్యార్థి అయిన సమీర్ పాషా (9) కనురెప్పలు పూర్తిగా కాలిపోగా ఎడమ కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కోరంటికి చెందిన మైసమ్మ (60) ఆటోలో గోల్నాక నుంచి శ్రీరామ్‌నగర్‌కు వెళ్తుండగా అదే సమయంలో ఆటోలో రాకెట్ వచ్చి ఆమె కంటిపై పడింది. కనుగుడ్డుకు తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో ఆమెను సరోజిని ఆస్పత్రికి తరలించారు. మైసమ్మ పరిస్థితి విషమంగా ఉందని, కంటి చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంబర్‌పేట్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థి చరణ్ (11) టపాకాయలు కాలుస్తుండగా అవి పేలి ముఖంపై పడ్డాయి. దీంతో చరణ్ రెండు కళ్లకు గాయాలయ్యాయి. శంషాబాద్‌కు చెందిన కిరాణ షాపు వ్యాపారి రాజు గౌడ్ (38) తన కిరాణ షాపులో కూర్చుండి రోడ్డుపై దీపావళి వేడుకలను చూస్తున్నాడు. అదే సమయంలో ఓ రాకెట్ వచ్చి అతని ముఖానికి తాకింది. ఈ సంఘటనలో రాజు కళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ (28)రోడ్డుపై నిలబడి పిల్లలు టపాకాయలు కాలుస్తున్న దృశ్యాలను చూస్తుండగా ఓ టపాసు పేలి ఆయన కుడి కన్నుపై పడింది. దీంతో శ్రీనివాస్ కంటికి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతంమెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటిఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘2 గంటల’ నిబంధనలో మార్పులేదు
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పండగ రోజుల్లో తెల్లవారుజాము 4 నుంచి 5 వరకు, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో బాణసంచా కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సంప్రదాయానికి తగ్గట్లు సమయాన్ని మార్చుకోవచ్చని, మొత్తంగా 2 గంటలు దాటొద్దంది. 2 గంటల నిబంధన దేశవ్యాప్తంగా వర్తిస్తుందని జస్టిస్ కోర్టు స్పష్టంచేసింది. పర్యావరణహిత బాణసంచా తప్ప ఇతర రకాల బాణసంచా ఢిల్లీలో విక్రయించడానికి వీల్లేదని తేల్చింది. ఈ నిబంధన ఈ దీపావళికే కాకుండా ఇతర పండగలకూ వర్తిస్తుందని చెప్పింది. నిషేధించిన బాణసంచా నిబంధన ఆన్లైన్ విక్రయాలకూ వర్తిస్తుందని, కోర్టు ఆదేశాలను ఇ–కామర్స్ వెబ్సైట్లు పాటించానలని, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొంది. స్థానిక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో నిఘా పెట్టాలని 23వ తేదీన వెలువరించిన తీర్పులో వెల్లడించింది. అయితే హానికారక బాణసంచాను పూర్తిగా నిషేధించ లేదని, బహుశా వచ్చే ఏడాదికి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని బాణసంచా విక్రయంపై కోర్టును ఆశ్రయించిన ఉత్పత్తిదారులకు తెలిపింది. తాము çతీర్పును తప్పుపట్టలేదని, గత సంవత్సరం బాణసంచాను నిషేధిస్తూ కోర్టు వెలువరించిన తీర్పుపైనే తమ ఆవేదన అని బాణసంచా ఉత్పత్తిదారులు సుప్రీంకు విన్నవించుకున్నారు. -
దీపావళి ధమాకా రెండు గంటలే
న్యూఢిల్లీ: దీపావళి పండుగను ధూంధాం ధమాకాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటి నుంచే టపాసుల కొనుగోలు ప్రారంభించారా? వెలుగులు చిమ్మే చిచ్చుబుడ్లు, వీధివీధంతా మార్మోగే లక్ష్మీబాంబులు, వరుస పేలుళ్ల లడీలు.. ఇలా ఏమేం కొనాలో లిస్ట్ రెడీ చేసుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ దీపావళిని మీరలా జరుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దీపావళే కాదు.. రానున్న క్రిస్మస్, న్యూఇయర్ పండుగలనూ పేలుళ్లతో కాదు.. ప్రశాంతంగా జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పండుగ రోజు భారీగా విస్తరించే వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను, మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీపావళి తదితర పండుగల సందర్భంగా బాణసంచా పేలుళ్లను పూర్తిగా నిషేధించలేదు కానీ కొన్ని పరిమితులు విధించింది. తక్కువ వాయు కాలుష్యాన్ని వెదజల్లే బాణాసంచా (గ్రీన్ క్రాకరీ)ను మాత్రమే వినియోగించాలంది. అలాగే, దీపావళి నాడు రోజంతా కాకుండా, కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు.. అంటే కేవలం రెండు గంటల పాటే పటాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది.క్రిస్మస్, న్యూఇయర్‌లు అర్ధరాత్రి పండుగలు కాబట్టి, ఆ రోజుల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు, 35 నిమిషాల పాటు బాంబుల మోత మోగించవచ్చని పేర్కొంది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఒకే దగ్గర అంతా టపాసులు పేల్చుకునే అవకాశం కల్పించే కమ్యూనిటీ ఫైర్ క్రాకింగ్’ను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వరుస పేలుళ్లు జరిపే లడీ తరహా బాణసంచా వినియోగాన్ని నిషేధించింది. వెలుగు, చప్పుడు తక్కువ వచ్చేలా ప్రమాదకర రసాయనాలను తక్కువగా వినియోగించి టపాసులను తయారు చేయాలని ఉత్పత్తిదారులను ఆదేశించింది. నిబంధనల మేరకు టపాసుల వినియోగం జరిగేలా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసు అధికారిదేనని స్పష్టం చేసింది. తయారీదారుల జీవించే హక్కుపై... వాయు కాలుష్యానికి కారణమవుతున్న బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. బాణసంచా వినియోగంపై నిషేధం బదులు పరిమితులు విధించాలని తయారీదారులు ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని అర్థించారు. వాయు కాలుష్యానికి బాణసంచాతో పాటు గాలి, ఉష్ణోగ్రతలు కూడా కారణమేనన్నారు. స్పందించిన ధర్మాసనం..130 కోట్ల దేశ ప్రజల ఆరోగ్య హక్కుతోపాటు బాణసంచా తయారీదారుల జీవించే ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లకుండా చూస్తామంది. సుప్రీం ఆదేశాల వివరాలు.. ♦ బాణసంచాల నుంచి వెలువడే ధ్వని, పొగ ప్రమాణాలను పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్వో, పెసో) ధ్రువీకరించాల్సి ఉంటుంది. వీటిల్లో వాడే రసాయనాలను కూడా పెసో నిర్దేశించిన మేరకే వినియోగించాలి. ఇలా ధ్రువీకరించిన, గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే ఉత్పత్తికి, విక్రయాలకు అనుమతించాలి. నిబంధనలను ఉల్లంఘించిన విక్రేతల లైసెన్స్‌లను పెసో రద్దు చేయవచ్చు. ♦ లైసెన్స్ పొందిన విక్రేతలే టపాసులను విక్రయించాలి. కోర్టు ఆదేశాలకు లోబడి తయారైన వాటిని మాత్రమే వారు అమ్మాల్సి ఉంటుంది. లేకుంటే లైసెన్స్ రద్దు తప్పదు. ♦ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు బాణాసంచాను విక్రయించరాదు. ♦ పరిమితికి మించి ధ్వని, కాలుష్య కారకాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. ఉత్స వాలు, పెళ్లిళ్ల సందర్భంగా వాడే బాణసంచా కూడా ప్రమాణాలకు లోబడి ఉండాలి. ♦ గ్రీన్ బాణసంచా వల్ల వ్యర్థాల పరిమాణం 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతుంది. గ్రీన్ క్రాకర్స్ వల్ల ధ్వనితో పాటు కాంతి తీవ్రత కూడా 30 నుంచి 35 శాతం వరకు తగ్గుతుంది. దీంతోపాటు గాలిలో కలిసి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ల పరిమాణం కూడా గణనీయంగా పడిపోతుంది. ♦ భారీ వాయు, శబ్ద కాలుష్యం వచ్చే సిరీస్ క్రాకర్స్ లేక లారిస్(ఎత్తుకు వెళ్లి పేలడంతోపాటు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే)తయారీ, విక్రయాలపై నిషేధం. రివ్యూ పిటిషన్ వేస్తాం సుప్రీం తీర్పుపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని బాణసంచా తయారీ దారులు పేర్కొన్నారు. గ్రీన్ క్రాకరీ అనేదే లేదని, అలాంటి బాణసంచాను తయారు చేసేందుకు చాలా సమయం పడ్తుందని తెలిపారు. ఇప్పుడు తమ వద్ద ఉన్నది రెండేళ్లనాటి స్టాక్ అని చెప్పాయి. రెండు గంటల పాటే బాణసంచా పేలుళ్లకు అవకాశమివ్వడం వల్ల తమ బిజినెస్ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని శివకాశీలోనే దాదాపు 6 లక్షల మంది బాణసంచా తయారీతో ఉపాధి పొందుతున్నారని, అలాంటి వారి జీవనోపాధి సుప్రీంకోర్టు తీర్పుతో దెబ్బతింటుందని పేర్కొంది. మరోవైపు బాణసంచా పేలుళ్లతో వెలువడే వాయు, ధ్వని కాలుష్య స్థాయిలను కొలిచే పరికరాలు తమ వద్ద లేవని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, బాణసంచా విక్రేతలు సుప్రీంకోర్టు పేర్కొన్న పరిమితులలోపుఉన్న ఉత్పత్తులనే విక్రయించేలా చూడటం కూడా ఆచరణ సాధ్యం కాదన్నారు. కాగా, సుప్రీం తీర్పును పర్యావరణవేత్తలు స్వాగతించారు. -
పండుగకు వచ్చి.. మృత్యు ఒడిలోకి!
నకరికల్లు: పండగంటూ ఇంటికొచ్చిన బిడ్డ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన నకిరికల్లు సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ వద్ద చోటు చేసుకుంది. దీంతో దీపావళి వెలుగులు నిండాల్సిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి మణిదీప్(22) గురువారం సాయంత్రం నకరికల్లులోని చెరువు కట్టపైకి చేరుకున్నారు. అక్కడే భోజనం చేసి మంచినీళ్ల కోసం చెరువులోకి దిగుతూ జారి పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయి గల్లంతయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థి చెరువులో జారిపడి గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న ఎస్ఐ జి.అనిల్‌కుమార్ సిబ్బందితో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించారు.అప్పటికే చీకటిగా ఉండడంతో తిరిగి శుక్రవారం ఉదయం నుంచి వెతుకులాట ప్రారంభించారు. మృతదేహం నీటిపై తేలియాడడంతో అతికష్టం మీద వెలికితీశారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మున్సిపల్ డీఈ జె.శివరామకృష్ణ, ఏఈ షేక్. మహమ్మద్‌రఫీలు గురువారం రాత్రి ఘటనాస్థలిని పరిశీలించారు. మిన్నంటిన రోదనలు.. పండుగ ఘనంగా జరుపుకుందామని ఉల్లాసంగా వచ్చిన ఒక్కగానొక్క బిడ్డ ఇంటికి వచ్చిన 24గంటల్లోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుమారుడి ఆచూకి కోసం రాత్రంతా కునుకు లేకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులు మృతదేహాన్ని వెలికి తీయడంతో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. విద్యార్థి మృతదేహాన్ని చూసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. మృతుడి తండ్రి నకరికల్లు వాసులకు సుపరిచితుడు కావడంతో ఇనిమెట్ల, నకరికల్లు రెండు గ్రామాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి. రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలి చెరువులో ఇప్పటికే ప్రమాదవశాత్తు పడి ఆరుగురికి పైగా మృతిచెందారు. జిల్లాలోనే పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావడంతో ఈ ప్రదేశానికి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు స్పందించి రక్షణకు కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పండగ జోరు
-
దీపావళి పమ్డుగకు సీట్ల పాట్లు
-
అత్తారింటికి దారేది!?
సాక్షి, కామారెడ్డి: కొత్తగా పెళ్లయిన అల్లుడు, కూతుర్ని దీపావళి పండుగకు ఆహ్వానించి హారతులు ఇవ్వడం సంప్రదాయం. పండుగకు వచ్చే అళ్లునికి తమకు తోచిన కట్నకానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అ యితే ఈ ఏడాది దీపావళి పండుగ రోజున మౌఢ్యం ఉండడంతో అత్తారింటికి వెళ్లకూడదని వేద పండితులు చెబుతున్నారు. కొందరు పండితులు మాత్రం విశాఖలు ఉన్న సమయంలో మాత్రమే అత్తారింటికి వెళ్లొద్దని, మౌఢ్యం ఉన్నపుడు వెళ్లొచ్చని చెబుతున్నారు. భిన్న వాదనల మధ్య చాలామంది అయోమయంలో ఉన్నారు. బుధవారం దీపావళి పండుగ హారతులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గురువారం లక్ష్మీదేవి పూజలు ఉంటాయి. రెండురోజుల పాటు పండగను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అయితే మూఢంలో పండుగకు అత్తారింటికి వెళ్లొద్దని కొం దరు పండితులు చెబుతున్నారు. మరికొందరు పండితులు మాత్రం మూ డంలో వెళ్లడంలో ఏ ఇబ్బంది లేదంటున్నారు. దీంతో చాలామంది కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. పండితులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయోమయం నెలకొంది. రెండు రోజుల పండుగ దీపావళిని రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. బుధవారం ఉదయం హారతులు తీసుకుంటారు. గురువారం లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. దీంతో రెండు రోజుల పాటు పండుగ జరుగనుంది. పండుగ రెండు రోజులు రావడంతో విద్యాసంస్థలు చాలావరకు రెండు రోజుల సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం 19ని సెలవుదినంగా, 18ని ఐచ్చిక సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే పేనీలు, సేమియాలు కొనుగోళ్లు చేస్తుండడంతో మార్కెట్లో సందడి నెలకొంది. -
దివాళా బదులు దివాళి
సాక్షి, న్యూఢిల్లీ : వస్తు సేవల సుంకం మార్పులతో దేశ ప్రజలకు ముందుగానే దివాలి (దీపావళి) వచ్చిందని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆయన ప్రకటనపై ఘాటుగానే స్పందిస్తున్నాయి. దివాళి స్థానంలో దివాళా అనే పదం బావుంటుందని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యస్త్రాలను సంధించింది. ‘బహుశా ఆయన(మోదీ) పొరపాటున ఆ ప్రకటన ఇచ్చి ఉంటారేమో. దివాళా బదులు దివాళి అని చెప్పాల్సింది. ప్రస్తుత పరిస్థితులకు దివాళా అన్నదే సరిగ్గా సరిపోతుంది. జీఎస్టీ సంస్కరణలను ప్రధాని పండగతో పోల్చారు. కానీ, అది ప్రజల జీవన శైలిని ఏ మాత్రం మార్చలేకపోయింది. సామాన్యుడు ఇంకా కష్టాలను ఎదుర్కుంటూనే ఉన్నాడు. తప్పుడు వాగ్థానాలతో ఇంకా మభ్య పెట్టాలనే ఆయన చూస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. బీజేపీ పార్టీని అధికారం కోల్పోయినప్పడే ప్రజలకు నిజమైన దీపావళి అని మరో నేత అజోయ్ కుమార్ చెప్పారు. ధనికులకు, వ్యాపారవేత్తల గురించే మోదీ ఆలోచిస్తున్నారు తప్ప.. మధ్య తరగతిఽపేదల గురించి మోదీ ఏ మాత్రం ఆలోచించట్లేదని అజోయ్ అన్నారు. కాగా, జీఎస్టీ కింద 27 వస్తువులపై పన్ను తగ్గిస్తూ.. జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని స్వాగతించిన విషయం తెలిసిందే. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు 15 రోజుల ముందుగానే దీపావళి వచ్చిందని గుజరాత్ పర్యనటలో ఆయన పేర్కొన్నారు. అయితే దీనిని దివాళీ గిఫ్ట్‌గా దేశ ప్రజలు స్వీకరించడం లేదని శివసేన పేర్కొంది. మోదీ ప్రభుత్వ పాలన పట్ల దేశ ప్రజలు సంతోషంగా లేరని, అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు.