న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పండగ రోజుల్లో తెల్లవారుజాము 4 నుంచి 5 వరకు, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో బాణసంచా కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సంప్రదాయానికి తగ్గట్లు సమయాన్ని మార్చుకోవచ్చని, మొత్తంగా 2 గంటలు దాటొద్దంది. 2 గంటల నిబంధన దేశవ్యాప్తంగా వర్తిస్తుందని జస్టిస్ కోర్టు స్పష్టంచేసింది. పర్యావరణహిత బాణసంచా తప్ప ఇతర రకాల బాణసంచా ఢిల్లీలో విక్రయించడానికి వీల్లేదని తేల్చింది. ఈ నిబంధన ఈ దీపావళికే కాకుండా ఇతర పండగలకూ వర్తిస్తుందని చెప్పింది.
నిషేధించిన బాణసంచా నిబంధన ఆన్‌లైన్ విక్రయాలకూ వర్తిస్తుందని, కోర్టు ఆదేశాలను ఇ–కామర్స్ వెబ్‌సైట్లు పాటించానలని, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో నిఘా పెట్టాలని 23వ తేదీన వెలువరించిన తీర్పులో వెల్లడించింది. అయితే హానికారక బాణసంచాను పూర్తిగా నిషేధించ లేదని, బహుశా వచ్చే ఏడాదికి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని బాణసంచా విక్రయంపై కోర్టును ఆశ్రయించిన ఉత్పత్తిదారులకు తెలిపింది. తాము çతీర్పును తప్పుపట్టలేదని, గత సంవత్సరం బాణసంచాను నిషేధిస్తూ కోర్టు వెలువరించిన తీర్పుపైనే తమ ఆవేదన అని బాణసంచా ఉత్పత్తిదారులు సుప్రీంకు విన్నవించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment