4 సిగరెట్ల పొగ ఉంది.. పీల్చనిస్తారా..? అస్సలు ఆ ప్రశ్నే లేదంటారు కదా.. మరి అంత కాలుష్యంతో సమానమైన పాము బిళ్ల (దీపావళికి కాల్చే క్రాకర్)లను మాత్రం ఎన్నింటినో మీ పిల్లలతో కాల్పిస్తారు.. బాణసంచా కాల్చినప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో హానికరమైన పీఎం2.5 (2.5 మైక్రాన్ల కన్నా చిన్నవైన పర్టిక్యులేట్ మ్యాటర్) కణాలు, ధూళి వంటివి పరిమితికి మించి దాదాపు 2 వేల రెట్లు ఎక్కువగా వెలువడుతాయి. కాకరపువ్వొత్తులు, తాళ్లు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పాము బిళ్లలు, థౌజండ్ వాలాల వంటివన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన పరిమితిని మించి కొన్ని వందల రెట్లు పీఎం2.5ను వెదజల్లుతున్నాయని మహారాష్ట్రలోని పుణెకు చెందిన చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణె యూనివర్సిటీ ఇంటర్‌డిసిప్లినరీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ల అధ్యయనంలో వెల్లడైంది. – సెంట్రల్ డెస్క్