
వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఎస్‌సీఓ సమావేశాలకు మోదీ
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాదికి ఎజెండాను ఖరారు చేస్తారు. కరోనా కారణంగా ఎస్‌సీఓ అధినేతల వార్షిక సమావేశం తొలిసారిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్‌సీఓ ఈ నెలలో ఐదు సమావేశాలను నిర్వహించనుంది. ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment