Development programs
-
ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా సిద్దిపేట: హరీశ్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ పాల్గొన్నారు. యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు. హరీశ్ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు చేయనుందని హరీశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్ హబ్ వస్తుందని తెలిపారు. కాగా, పొన్నాల వద్ద నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జిని హరీశ్ ప్రారంభించి బుల్లెట్ బండిపై బ్రిడ్జి మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. -
పల్నాడు జిల్లా: పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: అమరావతి మండలం మల్లాదిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సీసీరోడ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, సచివాలయాలు ద్వారా వేగంగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. చదవండి: ‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’ మూడేళ్లలో విప్లవాత్మక మార్పు: అంబటి రాంబాబు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, పులిచింతల నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా గురజాల, నరసరావుపేట ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఈ మూడేళ్ల పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చామన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలతో సుపరిపాలన అందిస్తున్నామని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
నిర్దేశిత లక్ష్యం మేరకు సిమెంట్ అందించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా జరుగుతున్న నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌ను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అందించాలని సిమెంట్ కంపెనీలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ సూచించారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తగిన సహకారం అందించాలని కోరారు. మంగళవారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులిద్దరూ సమావేశమయ్యారు. నిర్దేశించిన మొత్తంలో 30 శాతం సిమెంట్ కూడా కొన్ని కంపెనీలు అందించలేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సీఎం జగన్ లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చారని, మొదటి దశలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు సహా ప్రభుత్వ విభాగాలకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ.. నిర్దిష్ట కాలవ్యవధిలో సిమెంట్ సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
సంచార జాతులకు ‘సంక్షేమం’
సాక్షి, అమరావతి: ఆకర్షించే వింత ఆహార్యం.. రోడ్డు పక్కన ప్రమాద భరితమైన సర్కస్ విన్యాసాలు.. వనమూలికలు, పూసలు అమ్మకం, ఎలుకలు పట్టడం లాంటి వాటి ద్వారా బతుకు నెట్టుకొచ్చే సంచార జాతులకు నవశకం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలస బతుకులకు భరోసా ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి చేరువ చేస్తున్నారు. సంచార జాతుల పిల్లల చదువులు, సంక్షేమ పథకాలకు కీలకమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘దేవరవాండ్లు’కు చెందిన నాలుగు సంచార జాతుల కుటుంబాలకు రెవెన్యూ అధికారులు గత బుధవారం కుల ధ్రువీకరణ పత్రాలు (బీసీ –ఏ) జారీ చేయడం గమనార్హం. దాదాపు యాభై ఏళ్ల క్రితం 1970లో అనంతరాము కమిషన్ చేసిన సిఫారసులు ఇన్నేళ్లకు కార్యరూపం దాల్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలం నుంచి దుర్భరం.. దేశంలో సుమారు 500 సంచార జాతులను బ్రిటీష్ ప్రభుత్వం 1871లో క్రిమినల్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చి అణిచివేసింది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సంచార జాతులను 1952 ఆగస్టు 31న విముక్త జాతులుగా ప్రకటించారు. వీరి అభివృద్ధి కోసం 1947లో క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ, 1949లో అనంతశయనం అయ్యంగార్ కమిటీ, 1961–62లో వెన్నెలగంటి రాఘవయ్య ట్రైబల్ ఎంక్వైరీ, 2008లో బాలకృష్ణా రేణికే జాతీయ కమిషన్, 2015లో బిక్కు రామ్‌జీ ఇదాత్జీ కమిషన్లు వేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో 2 లక్షల మందికిపైనే రాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్నారు. ఒకే చోట నివాసం ఉంటూ కాస్త అభివృద్ధి చెందిన వారిని విముక్తి జాతులుగా వ్యవహరిస్తున్నారు. ఒక చోట నివాసం ఏర్పాటు చేసుకుని బతుకుదెరువుకు వేర్వేరు ప్రాంతాలు తిరిగి వచ్చే వారిని అర్థ సంచార జాతులుగా పిలుస్తున్నారు. సొంత ఊరు, గూడు లేకుండా ఉపాధి కోసం ఊరూరా తిరిగేవారిని సంచార జాతులుగా విభజించారు. అత్యంత వెనుకబడిన జాతులు రాష్ట్రంలో 32 ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటీవల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సంచార జాతుల బతుకులు మెరుగుపరుస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేవరవాండ్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పాలకొల్లు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ప్రభుత్వం తమను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల సంచార జాతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. –పెండ్ర వీరన్న, ఏపీ ఎంబీసీ చైర్మన్ అమ్మ ఒడితో బిడ్డను చదివిస్తున్నా వలస బతుకులతో మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలవతో నా బిడ్డ రమేష్ చదువులకు అమ్మ ఒడి ఆసరాగా నిలిచింది. లేదంటే మా మాదిరిగానే కూలి పనికి వెళ్లాల్సి వచ్చేది. నా బిడ్డ చదువుకు అండగా నిలిచిన సీఎం జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోలేం. –పి,లక్ష్మీ, సిరిపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లా. ‘చేయూత’ అందించారు భిక్షాటనతో జీవనం గడిపే మాకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున ఇస్తున్నారు. దీంతోపాటు రోజువారీ పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నా. గతంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసుతో మాకు గుర్తింపు వచ్చింది. –వాడపల్లి పెద్దింట్లు, సీతారామపురం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అత్యంత దుర్భర జీవనాన్ని గడుపుతున్న సంచార జాతులకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇప్పుడు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. అమ్మ ఒడితో పాటు చేయూత తదితర పథకాలను వర్తింపజేస్తున్నారు. ఉపాధి కోసం ఊరూరా తిరుగుతూ రోడ్ల పక్కన, మురికి కాల్వల గట్లుపై, రైల్వే ట్రాక్‌ల వెంట పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో సంచార జాతుల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్య శకం మొదలైంది. -
‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’
వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందని, అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశాలకు మోదీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నడుమ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఏడాదికి ఎజెండాను ఖరారు చేస్తారు. కరోనా కారణంగా ఎస్సీఓ అధినేతల వార్షిక సమావేశం తొలిసారిగా ఆన్లైన్లో జరగనుంది. భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్సీఓ ఈ నెలలో ఐదు సమావేశాలను నిర్వహించనుంది. ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అధ్యక్షత వహిస్తారు. సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు. -
అభివృద్ధి పథంలో గురజాల
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల.. తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్‌రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్‌రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్‌రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు. ► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్‌రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు. ► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్‌రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్‌కు మహేష్‌రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్‌ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం.. గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్‌రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది. ► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్‌రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు. -
అభివృద్ధిపైనే దృష్టి: కేటీఆర్
సాక్షి, ఖమ్మం: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని నిబద్ధత,చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.487 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. విద్యుత్ సమస్యలను ఎప్పుడో అధిగమించామని.. తాగునీటి సమస్య పరిష్కరించడానికే మిషన్ భగీరథను చేపట్టామని కేటీఆర్ తెలిపారు. -
ముగిసిన సీఎం జగన్ విశాఖ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటన ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు గన్నవరం నుంచి బయలుదేరిన సీఎం జగన్.. మధ్యాహ్నం 3.50గంటలకు విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువులు మంత్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. (చదవండి : విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం) తమ అభిమాన నేతను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. కారులో ఉన్న సీఎం జగన్‌లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్కేబీచ్కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. (చదవండి : విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్) దాదాపు రెండు గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించిన సీఎం జగన్.. కైలాసగిరికి చేరుకొని పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కైలాసగిరిలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆర్కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు వారు సన్మానం చేశారు. అనంతరం సాయంత్రం 7.40 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
విశాఖలో సీఎం వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం..
-
విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
-
విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేసేలా రెండు రోజుల పాటు ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. సీఎం రాకతో సాగర తీరం జనసందోహంలా మారింది. థాంక్యూ సీఎం నినాదం హోరెత్తింది. వేదికపైకి వచ్చిన సీఎం జగన్‌కు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి శాలువా కప్పి సత్కారం చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల్ని వివరిస్తూ.. లేజర్ స్పెషల్ షో ప్రదర్శించారు. స్థానికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ఇప్పేడే ఇక్కడే ప్రారంభిస్తున్నాం’ అని సీఎం జగన్ అనగానే లేజర్ షో ద్వారా విశాఖ ఉత్సవ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు వారు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమాని జనం భారి ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించనున్నారు. మొదటి రోజు శాస్త్రీయ నృత్యం, లేజర్ షో, పాప్ సింగర్ అనుదీప్ ప్రత్యక్ష కచేరీ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమాలు జరగనున్నాయి. రెండవ రోజు, 'త్రీరీ' లైవ్ బ్యాండ్, ఆర్చరీ షో, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కచేరీ, లేజర్ షో మరియు బాణసంచా తదితర ప్రోగ్రామ్‌లతో విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా ముగియనుంది. -
వీఎంఆర్డీఏ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంపై ఆది నుంచీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. రాజధాని ప్రతిపాదన తర్వాత విశ్వ నగరాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. శనివారం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ర్యాలీగా నేరుగా కైలాసగిరికి వెళ్లిన సీఎం అక్కడ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మీ, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, అదీప్ రాజ్, విశాఖ ఎంపీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పీఎన్‌ఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌కు దారిపొడవునా కృతజ్ఞత పూర్వక స్వాగతం లభించింది. సీఎం కాన్యాయ్‌పై పూల వర్షం కురిపించారు. బెలూన్లను గాల్లోకి విసిరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. ‘జై జగన్.. జయహో జగనన్న’ అనే నినాదాలతో విశాఖపట్నం మార్మోగింది. కారులో ఉన్న సీఎం జగన్‌లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్కేబీచ్కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. కాన్వాయ్ వాహనంలో ముఖ్యమంత్రి ఎడమవైపున ఉంటారు. దీంతో రోడ్డుకు ఒకవైపున మాత్రమే నిలబడి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధానిగా ప్రతిపాదించిన కొద్ది రోజుల్లోనే విశాఖ అభివృద్ధికి బీజం వేస్తూ ఏకంగా రూ.1285.32 కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకోనున్నాయి. -
నేడు విశాఖకు సీఎం జగన్ పర్యటన
-
నేడు విశాఖకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రూ.905.50 కోట్లు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో రూ.379.82 కోట్ల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ ఉత్సవ్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్)గా విశాఖ నగరం కావొచ్చంటూ సీఎం ఇటీవల అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యలు చేసిన అనంతరం తొలిసారిగా నగరానికి వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించనున్నారు. సీఎం పర్యటన సాగేదిలా.. సీఎం వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి 3.50 గంటలకు కైలాసగిరి వెళ్తారు. వీఎంఆర్డీఏ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక అక్కడినుంచి బయల్దేరి డాక్టర్ వైఎస్సార్ సెంట్రల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. -
మీ రుణం తీర్చుకుంటున్నా..
సాక్షి ప్రతినిధి కడప: ‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం.. ‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్‌లో ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), లింగాల బ్రాంచ్ కెనాల్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్‌తో లింక్ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం. మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్‌బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన పనుల వివరాలు.. ►పులివెందులలో రూ.347 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు. ►గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా వేముల, వేంపల్లె మండలాల్లోని 15 వేల ఎకరాల స్థిరీకరణ. రూ.58 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) నుంచి నీళ్లందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర ఉన్న వి.కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, టి.వెలమవారిపల్లె, ముచ్చుకోన చెరువులకు నీరందుతుంది. (తర్వాత ఈ నీళ్లు పాపాగ్నిలో కలుస్తాయి) తద్వారా నందిపల్లి, ఉప్పాలపల్లె, ముసల్‌రెడ్డిపల్లె గ్రామాలకు సైతం ప్రయోజనం చేకూరుతుంది. ►చిత్రావతి నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపి, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వల్ల ప్రభావితమయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం. రూ.350 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కోమన్నూతల, ఎగువపల్లి, మురారిచింతల, అంబకపల్లె, ఎర్రబల్లి చెరువు, మోటూన్నూతలపల్లె వంక, తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగివారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్ నిర్మించి యూసీఐఎల్ పల్లెలకు నీటి సరఫరా చేయొచ్చు. ►పులివెందులలో రూ.100 కోట్లతో 55.36 కిలోమీటర్లు భూగర్బ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందులలో రూ. 65 కోట్లతో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్ నిర్మాణం. ►వేంపల్లె గ్రామ పంచాయతీలో రూ.63 కోట్లతో 85.50 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.114 కోట్ల పాడా నిధులతో సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, పీబీసీ, సీబీఆర్ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. దీంతోపాటు పీబీసీ నుంచి దొండ్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనం బావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయనిచెరువు నుంచి బత్తెనగారి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్ కెనాల్ కింద రామట్లపల్లె చెరువు, గుణకనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపురెడ్డిపల్లె, కమ్మాయిగారిపల్లె కుంటకు నీళ్లందిస్తారు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.13.21 కోట్లతో ఏడు మార్కెట్ గిడ్డంగులతోపాటు పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల కల్పన ►పులివెందులలో హార్టికల్చర్ పంటల కోసం రూ.13 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రీకూలర్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు. ►నల్లచెరువుపల్లె గ్రామంలో రూ.27 కోట్లతో 132 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి కలిగేలా పనులు. ►రూ.10 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం.. 10 గ్రామాల్లోని 2,100 వ్యవసాయ, 10,200 గృహ విద్యుత్ సర్వీసులకు లబ్ధి. ►రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19.60 కోట్లతో కడప – పులివెందుల రోడ్డులోని వేంపల్లె పట్టణం నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు పనులు. ►రూ.11.52 కోట్లతో పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి. ►రూ.9.30 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విస్తరణ. ►రూ.17.50 కోట్లతో పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు. తద్వారా 14 రకాల స్పోర్ట్స్‌కు అన్ని రకాల వసతులతో శిక్షణ. ►రూ.20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.16.85 కోట్లతో 51 దేవాలయాల పునరుద్ధరణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 18 కొత్త దేవాలయాల నిర్మాణం. ►పులివెందులలో రూ.10 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (మినీ సచివాలయం) ఏర్పాటు. ►రూ.11.20 కోట్లతో నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం. ►రూ.4.50 కోట్లతో వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం. ►రూ.20 కోట్లతో వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల నిర్మాణం. ►పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.20 కోట్లతో లెక్చర్ కాంప్లెక్స్, నైపుణాభివృద్ది కేంద్రం ఏర్పాటు. ►రూ.4 కోట్లతో వేంపల్లెలో బీసీ బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణం. ►పులివెందులలో రూ.3.64 కోట్లతో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణం. ►పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నాం. నాన్నగారి హయాంలో నిర్మించిన.. ప్రస్తుతం దైన్యస్థితిలో ఉన్న ఐజీ కార్ల్ భవనాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. త్వరలో వీటికి పునాది రాయి వేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లిస్తాం. దేవుడి ఆశీర్వాదంతో మరిన్ని గొప్ప పనులు చేసేలా దీవించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ -
మహిళల అభివృద్ధికి మైక్రో క్రెడిట్ ప్లాన్
సాక్షి, సంగారెడ్డి: మహిళల అభివృద్ధి కోసం ‘మైక్రో క్రెడిట్ ప్లాన్’అమలు చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే దే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని చెప్పారు. మహిళలకు రుణాలివ్వడానికి మైక్రో క్రెడిట్ ప్లాన్ ను అమలు చేస్తామని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఈ ప్లాన్ ద్వారా విరివిగా రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో వీరికిచ్చే ప్రోత్సాహకం రూ.50 వేలు ఉండగా, ప్రస్తుతం దానిని రూ.లక్షకు పెంచామని తెలిపారు. వీరికి కల్యాణలక్ష్మి సైతం వర్తిస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళితే వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 35 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 500 పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జీఎస్టీ పరిహారం..ఎన్నాళ్లీ జాప్యం?
సాక్షి, అమరావతి: జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్) పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం వల్ల ఆదాయాలు తగ్గి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చర్య ఆందోళన కలిగిస్తోంది. జీఎస్టీ పరిహారంగా ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్యకాలంలో రాష్ట్రానికి రూ.1,966.33 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 529 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1,437.33 కోట్ల పరిహారం కేంద్రం నుంచి రావాలి. జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోవడంతో పరిహారం సకాలంలో చెల్లించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాల్సిందే జీఎస్టీ అమలు చేసినప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గితే దాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకు 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ఆధారంగా తీసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయం కంటే 14 శాతం వృద్ధి లేకపోతే.. ఎంత మేర తగ్గితే ఆ మొత్తాన్ని పరిహారంగా కేంద్రం చెల్లిస్తుంది. జీఎస్టీ అమలు సంవత్సరంలో మన రాష్ట్రానికి 2017–18 సంవత్సరానికి కనీస ఆదాయం లక్ష్యాన్ని నెలకు రూ.1,502.48 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు 2019–20 సంవత్సరానికి కనీస ఆదాయ మొత్తం నెలకు రూ.1,952.62 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలానికి రాష్ట్రానికి రూ.13,668.35 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.11,702.02 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ ఏడు నెలలకు కేంద్రం రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా రూ.1,966.33 కోట్లు చెల్లించాలి. జాప్యంపై వివిధ రాష్ట్రాల ఆందోళన జీఎస్టీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యంపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఆర్థిక మందగమనంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోయారు. జీఎస్టీ పరిహారంగా రాజస్థాన్‌కు రూ.4,400 కోట్లు, ఢిల్లీకి రూ.2,355 కోట్లు, పంజాబ్‌కు రూ.2,100 కోట్లు, కేరళకు రూ.1,600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు ఈ ఏడు నెలల కాలానికిగాను రూ.1,437.33 కోట్ల పరిహారం చెల్లింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్రం నుంచి హామీ వచ్చింది. ఇది కాకుండా డిసెంబర్ నాటికి మరో రూ.500 కోట్లు పరిహారం కోరాల్సి ఉంటుంది. - పీయూష్ కుమార్, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్ -
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
మీద్వారా అభివృద్ధి జరక్కపోవచ్చు
సాక్షి, అమరావతి: అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నయి... కానీ అవి మీ ద్వారా జరక్కపోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంలేదని పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన 13 నిమిషాలపాటు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమపై జరుగుతున్న కక్షసాధింపు, నిధుల విడుదల చేయకపోవడంపై గట్టిగా ప్రశ్నించడంతో సీఎం ఆచితూచి స్పందించారు. తాను రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నానని, నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. మీ నియోజకవర్గాల్లో మీరు అడిగినవి జరగకపోయినా, తమ వారి ద్వారా నిధులు పంపిస్తున్నానని తెలిపారు. ఓడిపోయిన వారికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించినా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. నియోజకవర్గాలకు నిధులిచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నానని చెప్పారు. రేషన్ వ్యవస్థను గాడిన పెట్టామని అందరికీ సక్రమంగా సరుకులు అందిస్తున్నామని సీఎం చెప్పగా... రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాంటివేం ఇప్పుడు జరగడంలేదని, కాంగ్రెస్ హయాంలోనే అవన్నీ జరగాయని సీఎం బుకాయించారు. తన నియోజకవర్గంలో తానే స్వయంగా బియ్యం లారీని పట్టించానని రామకృష్ణారెడ్డి చెప్పగా మారుమాట్లాడలేదు. రాష్ట్రమంతా అభివృద్ధి జరిగిపోతుందని సీఎం చెబుతున్నప్పుడు... మన సొంత గ్రామం చంద్రగిరిలో ఏం అభివృద్ధి జరిగిందో ఇద్దరం వెళ్లి చూద్దామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నప్పుడు స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్యేలంతా తమకూ నిధులివ్వాలని కోరినా ఆయన మాట్లాడలేదు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి తమ సమస్యలను వినిపించినప్పుడు వారికివ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తరచూ పిలుపునిచ్చే ముఖ్యమంత్రి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు గొడవ చేస్తారేమోననే ఆందోళన అటు అధికారవర్గాల్లోనూ, పోలీసుల్లోనూ కనిపించింది. -
నిధులున్నా... నిర్లక్ష్యం!
విజయనగరం మున్సిపాలిటీ: మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న రూ. కోట్లది నిధులు ఖర్చు చేయటంలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి. 13వ ఆర్ధిక సంఘం పద్దు కింద 2010-11 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం వరకు ఐదు విడతల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి రూ. 23.47 కోట్లు మంజూరు చేయగా... అధికారిక లెక్కల ప్రకారం 2016 మార్చి నెలాఖరు నాటికి రూ. 8.67 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిబంధనల మేరకు ఈ నిధులతో సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్నిర్వహణ లో భాగంగా ఔట్ ఫ్లో డ్రైన్స్‌తో పాటు ప్రధాన డ్రైన్ల నిర్మాణం, తాగు నీటి సరఫరాకు వినియోగించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి నిధుల వినియోగం గడువు ముగిసిపోగా... రూ14.80 కోట్లు వెనక్కిమళ్లిపోయే ప్రమాదం దాపురించింది. అయితే ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించడంవల్ల ఈ మొత్తాన్ని ఏడునెలల్లో ఖర్చుచేయాలి. నిధుల వినియోగంలో వెనుకబడ్డ విజయనగరం ప్రభుత్వం విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ విజయనగరం వెనకబడింది. ఈ పద్దు కింద రూ. 12 కోట్లు మంజూరు చేయగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వివిధ పద్దుల కింద మున్సిపల్ ఖజానాలో రూ. కోట్లాది నిధులు మూలుగుతుండగా... వాటిని ఖర్చు చేయటం ఎలాగో తెలీక సతమతమవుతున్న పాలకులు, అధికారులకు ఆర్ధిక సంఘం నిధులు వినియోగం కత్తిమీద సాములా మారింది. బొబ్బిలి మున్సిపాలిటీకి రూ2.75కోట్లు విడుదల చేయగా.. రూ. 1.67 కోట్లు ఖర్చు చేశారు. సాలూరు మున్సిపాలిటీకి రూ. 3.56 కోట్లు కేటాయించగా రూ. 1.80కోట్లు, పార్వతీపురం మున్సిపాలిటీకి రూ. 3.59 కోట్లు మంజూరు చేయగా... రూ. 2.39 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. అసలు నిధులు లేక అనేక చోట్ల పనులు నిలిచిపోతుంటే.. నిధులుండీ ఖర్చుచేయలేని చేతకాని తనంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గడువులోగా వినియోగిస్తాం: విజయనగరం కమిషనర్ మూలుగుతున్న నిధుల విషయమై విజయనగరం మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా... 13వ ఆర్థిక సంఘం నిధులు వినియోగానికి గడువు పొడిగిస్తూ ఉత్తర్వలు జారీ అయినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో మిగిలి ఉన్న నిధులను వినియోగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నిర్దేశించిన గడువులోగా నిధులు వినియోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ముఖ్య మంత్రి కార్యక్రమం రద్దు
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వెంకటాచలం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆలస్యం అవ్వడంతో.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. వెంకటాచలంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లి హ్యాండీక్యాప్డ్ కోసం ఏర్పాటు చేసిన నూతన భవన శంకుస్థాపన ముఖ్యమంత్రి చేయాల్సి ఉండగా.. ఆయన లేకపోవడంతో.. కేంద్ర మంత్రే ప్రారంభించారు. అనంతరం ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ శిక్షణ సంస్థకు శంకుస్థాపన చేశారు. -
విశాఖపై మమకారం
అభివృద్ధి కోసం తాపత్రయం ప్రగతికి అర్థం.. వైఎస్ హయాం సాక్షి, విశాఖపట్నం: అరకొరగా రేషన్ కార్డులు.. అదృష్టవంతులకే పింఛన్లు..ఏ కొందరికో ఇళ్లు..ఇదంతా 2004కు ముందు దుస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు వంటివి మంజూరయ్యాయి. ఆయన హయాంలో విశాఖపట్నం జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ దుర్మరణం చెంది ఆరేళ్లవుతున్న సందర్భంగా ఆయన హయాంలో విశాఖలో చేపట్టిన వివిధ పనులు, పథకాలపై ఈ కథనం.. వైఎస్ తన ఐదేళ్ల పదవీ కాలంలో జలయజ్ఞం పథకం కింద విశాఖ జిల్లాలో భారీ గా నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణ పనులకు రూ. 42 కోట్లు కేటాయించారు. తాండవ రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ. 55 కోట్లు, తాండవ నదిపై మినీ ఆనకట్ట నిర్మాణానికి, రావణాపల్లి ప్రాజెక్టుకు రూ. 18 కోట్లు వెచ్చించారు. ఇలా వివిధ సాగునీటి ప్రాజెక్టులతో వేలాది ఎకరాల కు అదనపు ఆయకట్టు పెంచారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. అంతేకాదు.. జిల్లాలో భారీగా గృహ నిర్మాణం చేపట్టారు. ఐదేళ్లలో మొత్తం 3,20,621 ఇళ్లు నిర్మించారు. పెద్దసంఖ్యలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత అభయహస్తం తదితర పింఛన్లు ఇచ్చారు. ఇలా మొత్తం 3,20,123 మందికి లబ్ది చేకూర్చారు. ఇందుకోసం ఏడాదికి మొత్తం రూ. 8.24 కోట్లు ఖర్చు చేశారు. ఇక నగరం విషయానికొస్తే.. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద విశాఖకు అధిక నిధులు వచ్చేలా కృషి చేశారు. ఈ పథకంలో విశాఖ నగరానికి రూ.2200 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో విలీన గ్రామాలను కలుపుతూ వేసిన బీఆర్టీఎస్ రోడ్లకు రూ.450 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.250 కోట్లు, 15 వేల జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు రూ.450 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.23 కోట్లతో ఎండాడ వద్ద మంచినీటి పథకం, విశాఖ నగర దాహార్తిని తీర్చే తాటిపూడి పైప్‌లైన్‌కు రూ.95 కోట్లు ఖర్చు చేశారు. మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్‌ల ఏర్పాటుతో విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు. అలాగే 1130 పడకలు, 21 సూపర్‌స్పెషాలిటీ బ్లాకులతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక విమ్స్ ఆస్పత్రికి రూ. 250 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకూ రూ.87 కోట్లు వెచ్చించి విశాఖలోనే తొలి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. విశాఖ విమానాశ్రయం విస్తరణ, ఆధునీకరణకు రూ.100 కోట్లు, విమానాశ్రయం ముంపుబారిన పడకుండా కాలువ నిర్మాణానికి రూ.60 కోట్లు వెచ్చించారు. ప్రస్తుత పరిస్థితి.. : వై.ఎస్. మరణాంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. జలయజ్ఞం ప్రాజెక్టులపై క్షక్ష కట్టింది. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం అప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చేసి పక్కన పెట్టేసింది. విమ్స్ ఆస్పత్రి అతీగతీ లేకుండా అక్కరకు రాకుండా నిరుపయోగంగా ఉంది. పైగా 1130 పడకలను 250కి కుదించాలని చూస్తోంది. అర్హులైన లబ్దిదార్లు పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సర్కారు రకరకాల నిబంధనలతో సంక్షేమ పథకాలకు వీరిని దూరం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాటి వైఎస్ హాయాంకు, నేటీ చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వర్థంతి సందర్భంగా విశాఖ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
ప్రజల్లోకి మోదీ పథకాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్ధనాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. సీతమ్మధారలోని కేఎన్ఎస్ ఫంక్షన్ హాలులో శనివారం పార్టీ కమిటీల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరినీ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా మలుచుకు నేందుకు నాయకులు కృషి చేయాలని సిద్ధార్ధనాథ్ కోరారు. - పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయండి - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్ధనాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. సీతమ్మధారలోని కేఎన్ఎస్ ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన పార్టీ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కర్ని పార్టీ క్రియాశీలక కార్యకర్తగా మలుచుకు నేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకాలను రక్షాబంధన్ రోజున ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం నిర్ణయించిందని..ఇప్పటికే తొమ్మిది సభ్యులతో ఒక కమిటీని కూడా నియమించిందన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం 11వేల మంది లబ్దిదారులకు ఈపథకాల ఫలాలను అందించేందుకు అసెంబ్లీ స్థాయిలోనూ తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఈ కమిటీలను ఆగస్టు నెలాఖరు కల్లా మండల, జిల్లాస్థాయిల్లో ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడు గున ఉన్న లబ్దిదారులందరికి చేరవేయడం ద్వారా పార్టీని పటిష్ట పర్చు కోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విశాఖలోనే కాదు..రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని.. ఇందుకు ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదే నిదర్శనమన్నారు. పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీచేసే స్థాయికి పార్టీ కేడర్ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ర్టమంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నగరాధ్యక్షుడు పివి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
దిశానిర్దేశం
- అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి - ఆరోపణలు తిప్పికొట్టండి - టీడీపీ విస్తృత సమావేశంలో పార్టీశ్రేణులకు చంద్రబాబు పిలుపు - క్రమశిక్షణపై నేతలకు క్లాస్ సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని శేషసాయి కల్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, పార్టీ ఎన్నికల కన్వీనర్ కళావెంకట్రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితర నేతలు ప్రసంగించారు. గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలు, అనుబంధ కమిటీల ఏర్పాటు, ప్రజాప్రతినిధులు, పార్టీ మధ్య సమన్వయం, సంస్థాగత కమిటీలకు శిక్షణ-కార్యాచరణ ప్రణాళిక, కార్యకర్తల సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఏడు మిషన్లు - ఐదు గ్రిడ్లు - ఐదు క్యాంపెయిన్లు, సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, డ్వాక్రా రైతు రుణమాఫీ తదితర 15 అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా సెక్షన్-8 అమలుపై ప్రజల్లో చర్చ తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కొంతమంది కావాలని బురద జల్లుతున్నారని, సమర్థవంతంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఇక నుంచి తాను విజయవాడలోనే ఎక్కువగా ఉంటానని, బస్సులోనే నిద్రపోతానని, ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తానని వివరించారు. నాయకులకు క్లాస్ ఉదయం 10.45 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం కాగా, సమావేశ మందిరంలో సగం కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు క్రమశిక్షణ నేర్చుకోవాలంటూ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. ఎంపీ కేశినేనికి అభినందనలు టాటా ట్రస్టు ద్వారా 264 గ్రామాల్లో సూక్ష్మ ప్రణాళిక తయారు చేయడం, రైతులకు లాభదాయకమైన వెదురు చెట్ల పెంపకంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చేపట్టడం అభినందనీయమని, మిగిలిన నేతలు అదే తరహాలో పనిచేయాలని సూచించారు. నిరాశగా వెనుదిరిగిన లంబాడీలు ఎ.కొండూరుకు చెందిన సుమారు 70 మంది లంబాడీలు ముఖ్యమంత్రిని కలిసేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నారు. తమ ఆధీనంలో ఉన్న అటవీ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరేందుకు వచ్చారు. అయితే, వారిని కనీసం ప్రాంగణం లోపలకు కూడా రానీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో నిరాశతో వెనుదిరిగారు. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ నిరుద్యోగులు సీఎంను కలిసి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. హెల్త్ కార్డుల పంపిణీ రాత్రి 9 గంటలకు సీఎం జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు పంపిణీ చేశారు. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలను ఇప్పించాలని జర్నలిస్టులు కోరగా, మీ మేనేజ్మెంట్ను కోరాలని సూచించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూరగాయల గజమాలతో చంద్రబాబును సత్కరించారు.