ప్రజల్లోకి మోదీ పథకాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్ధనాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. సీతమ్మధారలోని కేఎన్‌ఎస్ ఫంక్షన్ హాలులో శనివారం పార్టీ కమిటీల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరినీ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా మలుచుకు నేందుకు నాయకులు కృషి చేయాలని సిద్ధార్ధనాథ్ కోరారు.
- పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయండి
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దార్ధనాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. సీతమ్మధారలోని కేఎన్‌ఎస్ ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన పార్టీ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కర్ని పార్టీ క్రియాశీలక కార్యకర్తగా మలుచుకు నేందుకు నాయకులు కృషి చేయాలన్నారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకాలను రక్షాబంధన్ రోజున ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం నిర్ణయించిందని..ఇప్పటికే తొమ్మిది సభ్యులతో ఒక కమిటీని కూడా నియమించిందన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం 11వేల మంది లబ్దిదారులకు ఈపథకాల ఫలాలను అందించేందుకు అసెంబ్లీ స్థాయిలోనూ తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు.
ఈ కమిటీలను ఆగస్టు నెలాఖరు కల్లా మండల, జిల్లాస్థాయిల్లో ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడు గున ఉన్న లబ్దిదారులందరికి చేరవేయడం ద్వారా పార్టీని పటిష్ట పర్చు కోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విశాఖలోనే కాదు..రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని.. ఇందుకు ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదే నిదర్శనమన్నారు. పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీచేసే స్థాయికి పార్టీ కేడర్ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో రాష్ర్టమంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నగరాధ్యక్షుడు పివి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.