బంగారు తెలంగాణ నిర్మిద్దాం | Spicy gold nirmiddam | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ నిర్మిద్దాం

Published Mon, Nov 17 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

బంగారు తెలంగాణ నిర్మిద్దాం

బంగారు తెలంగాణ నిర్మిద్దాం

 ఉప్పునుంతల/అమ్రాబాద్:  రాష్ట్ర ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. రాష్టానికి దక్కాల్సిన 54 శాతం విద్యుత్‌వాటా అందకపోవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పునుంతల వె ల్టూరు గ్రామరైతు మధన్‌మోహన్‌రెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ.. ఆంధ్రా పా లకులు విభజన ఒప్పందాలను ఉల్లఘించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీచేశారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే బ్యాంకులకు రూ.4250 కోట్లు బ్యాంకులకు చెల్లించి మిగతా డబ్బులకు హామీఇచ్చినట్లు తెలిపారు. ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోరుునా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 480 కోట్ల పంట నష్టపరిహారం అందించామన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు సెరికల్చర్, హార్టికల్చర్, గ్రీన్‌కల్చర్‌కు 75 శాతం సబ్సిడీని అందిస్తున్నామని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 200కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహించి మొదటగా 20వేల పంపుసెట్లు సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 45వేల చెరువులుండగా, ఈ ఏడాది 9వేల గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ. రెండువేల కోట్లు కేటాయించినట్లు వివరించారు.

వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించి రైతులు ఆర్థికాభివృద్ధ్ది సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మె ల్యే గువ్వల బాల్‌రాజు, జేడీఏ భగవత్ స్వరూప్, ఏడీఏ సరళకుమారి, ఆర్డీఓ వీరారెడ్డి,  టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా తదితరులు పాల్గొన్నారు.

 మిగులు విద్యుత్‌ను సాధిస్తాం
  60 ఏళ్ల ఆకాంక్ష.. 14ఏళ్ల పోరాటం.. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ కల సకారమైందని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం రాజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమ్రాబాద్‌కు వచ్చిన ఆయన ఇప్పలపల్లి గ్రామంలో రూ.రెండుకోట్ల వ్యయంతో నూతనంగా నిర్మంచిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలన అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్‌ను సాధిస్తామన్నారు. దీంతో రైతాంగానికి ఏడు గంటల విద్యుత్‌ను తప్పకుండా ఇచ్చి తీరుతామన్నారు. బడు గు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులందరికీ  ఆసరా, కల్యాణలక్ష్మి పథకాలను వర్తింపజేస్తామని, ఆహార భద్రతాకార్డులు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, ఇతర ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement