బుల్లెట్ బండిపై వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ పాల్గొన్నారు. యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు.
హరీశ్ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు చేయనుందని హరీశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్‌లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్ హబ్ వస్తుందని తెలిపారు. కాగా, పొన్నాల వద్ద నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జిని హరీశ్ ప్రారంభించి బుల్లెట్ బండిపై బ్రిడ్జి మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment