Training centers
-
కర్ర తీసాము అంటే..
పిఠాపురం: కనుమరుగైపోతున్నాయి అనుకుంటున్న కర్రసాము, కత్తిసాము (శిలంభం) అనే ప్రాచీన యుద్ధ కళలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. పూర్వం యుద్ధాల్లో ఆయుధంగా వాడిన కర్ర, కత్తి.. ఆ తర్వాత వచ్చి న ఆధునిక ఆయుధాలతో యుద్ధ క్షేత్రం నుంచి కనుమరుగయ్యాయి. అయితే కళగానూ ప్రాచుర్యం పొందిన కర్రసాము, కత్తిసాములను గ్రామీణ ప్రాంతాల్లో యువకులు అభ్యసించేవారు. పెళ్లిళ్లు, పండుగలు, ఊరేగింపులు లాంటి సందర్భాల్లో విన్యాసాలు చేస్తుండేవారు. వీటి సాధనకు గ్రామంలో వ్యాయామ శాలలు (తాలింఖానాలు) ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో కర్ర, కత్తి సాము పోటీలు కూడా నిర్వహించేవారు. రానురాను ఈ కళను నేర్చుకునేవారు తక్కువయ్యారు. అయితే ఇటీవల ఈ కళ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. కర్ర, కత్తిసాములపై గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేట, అమలాపురం, పిఠాపురం తదితర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 మంది వీటిల్లో శిక్షణ పొందుతున్నారు. కర్రసాములో రకాలు కర్రసాములో ఒంటిబాణా, ఓడిబాణా అనే కర్రలను తిప్పుతూ ఉంటారు. ఇద్దరు పరస్పరం గురిచూసి తిప్పుతూ ఒకరిపై ఒకరు దాడికి యత్నిస్తుంటే దెబ్బ తగలకుండా తప్పించుకోవడం ఇందులో నైపుణ్యం. ఈ సమయంలో వివిధ వాయిద్యాలకు అనుగుణంగా ఈ విద్యను ప్రదర్శిస్తారు. అలాగే కర్రకు నూనెలో తడిపిన గుడ్డ చుట్టి వెలిగించి ఆ మంటలతో కర్రసాము చేస్తూ అబ్బురపరుస్తుంటారు. ఇదే మాదిరిగా కత్తులతోనూ చేసే విన్యాసాలు, ఈ పోరాటాలలో ఎత్తుకు పైఎత్తు వేస్తూ కత్తిని ఎదుటి వారిపై ప్రయోగించడానికి చేసే ప్రయత్నాలు, తప్పించుకుంటూ ప్రత్యర్థిని ఎదుర్కొనే వ్యూహాలు గగుర్పాటు కలిగిస్తాయి. కత్తిసాములో కత్తి, డాలు ధరించి రకరకాలుగా తిప్పుతూ విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిÙని కింద పడుకోబెట్టి అతని శరీరంపై వివిధ పళ్లు, కూరగాయలు ఉంచి నరుకుతుంటే చూస్తూ విస్తుపోవాల్సిందే. మనిషి పొట్టభాగంపై తమలపాకు ఉంచి, దానిపై ఓ పలుచని వస్త్రం వేసి ఆ వస్త్రం చిరగకుండా తమలపాకు రెండు ముక్కలయ్యేలా కత్తితో నరకడం అద్భుతంగా ఉంటుంది. పోటీలు ఇలా.. జాతీయ స్థాయిలో కర్రసాము, కత్తిసాము పోటీల్లో పాల్గొంటూ స్థానిక రాష్ట్ర యువకులు పతకాలు సాధిస్తున్నారు. కర్రసాము పోటీలను సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, బల్లెం, సురులు, ఫైట్ అనే ఆరు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఈపోటీలను నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. వీరు జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది కర్రసామును క్రీడగా నేర్చుకోవడానికి విద్యార్థులు ముందుకు వస్తున్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఏపీ టీంను తయారు చేసి మంచి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక శిక్షణ పొంది జాతీయస్థాయిలో విజేతలయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నాం. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తాం. – టి అబ్బులు, కర్రసాము శిక్షకుడు, పిఠాపురం రాష్ట్ర స్థాయి స్వర్ణం సాధించాను పిఠాపురంఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. చిన్నప్పుడు దేవుడి సంబరాల్లో కర్రసాము చేయడం చూసేదానిని. దానిని నేర్చుకోవాలని ఆసక్తి ఏర్పడి నేర్చుకున్నాను. గతంలో కర్రసాములో రాష్ట్ర స్థాయి స్వర్ణ పతకం సాధించాను. మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసాన్నిచ్చే ఈకళను నేర్చుకోవడం ఆనందంగా ఉంది. – పి నిర్మల, కొండెవరం ఆత్మరక్షణకు ఈ కళను నేర్చుకున్నా నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఆత్మ రక్షణలో మెళకువల కోసం కర్రసాము నేర్చుకున్నా. రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్నాను. కొండెవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి పతకం సాధించడానికి ప్రయత్నం చేస్తుంటాను. – షేక్ అమీద, పిఠాపురం -
బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడుల్లో చేరని బాలల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్ష విభాగం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలన్న లక్ష్యం మేరకు సమగ్ర శిక్ష విభాగం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో ఏ స్కూల్లోనూ నమోదు కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రాథమిక విద్యను ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. ఇలా బడి బయట ఉన్న పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా 11,331 మంది ఉన్నట్లు సమగ్ర శిక్ష విభాగం గుర్తించింది. వీరికి నాన్ రెసిడెన్షియల్ విధానంలో 3, 6, 9 నెలల కాల వ్యవధితో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో టీచర్ వలంటీర్లను నియమించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించనున్నారు. అనంతరం ఆ విద్యార్థులను వారి వయసుకు తగ్గ తరగతుల్లో చేర్చనున్నారు. సమగ్ర శిక్ష విభాగం జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తల ద్వారా టీచర్ వలంటీర్లను నియమించనున్నారు. టెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ప్రత్యేక శిక్షణా కేంద్రాలకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో టీచర్ వలంటీర్లకు ఇంటర్మీడియెట్‌తో డీఈడీ, ప్రాథమికోన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. టీచర్ వలంటీర్లకు నెలకు రూ.7,500 చొప్పున అందిస్తారు. వలంటీర్లకు ఐదు రోజులపాటు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీచింగ్ టెర్నింగ్ మెటీరియల్ కింద ప్రతి సెంటర్‌కు రూ.1,000 విలువైన వస్తువులు అందిస్తారు. ఇవికాకుండా ప్రతి కేంద్రంలోని పిల్లలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తారు. పిల్లలకు సంబంధించిన స్టేషనరీకి రూ.200, బ్యాగుకు రూ.200, చెప్పులకు రూ.100 చొప్పున అందిస్తారు. పిల్లలకు కావాల్సిన వివిధ సబ్జెక్టుల పుస్తకాలను సమగ్ర శిక్ష విభాగం అందజేస్తుంది. ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కొండలు, నదులు, వాగులు వంటి ఆటంకాలు ఉన్న చోట స్కూల్ పాయింట్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంఈవోలు, హెడ్మాస్టర్ల పర్యవేక్షణలోనే ఇవి కొనసాగాలని, ఎన్జీవోల ద్వారా నిర్వహించరాదని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది విద్యార్థులు ఉండాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో వీరి సంఖ్య 13 వరకు ఉండొచ్చన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీ ఈ కేంద్రాలకు అనుమతి మంజూరు చేస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధిత మండలం, పంచాయతీ, గ్రామానికి చెందిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులైనవారు లేనిపక్షంలో మండల పరిధిలో లేదా డివిజన్ పరిధిలో ఇతరులకు అవకాశం కల్పిస్తారు. -
ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా సిద్దిపేట: హరీశ్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ పాల్గొన్నారు. యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు. హరీశ్ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు చేయనుందని హరీశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్ హబ్ వస్తుందని తెలిపారు. కాగా, పొన్నాల వద్ద నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జిని హరీశ్ ప్రారంభించి బుల్లెట్ బండిపై బ్రిడ్జి మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. -
మాకు ఇదేం ‘శిక్ష’ణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ మొదలైంది. జిల్లా, మండల స్థాయిల్లో కొద్దినెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి.. అన్ని స్థాయిల ఉపాధ్యాయులు విధిగా హాజరుకావాలని విద్యా శాఖ ఆదేశించింది. ఈ శిక్షణ బాధ్యతలను అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి అప్పగించారు. యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రంలో 20వేల మంది రిసోర్స్ పర్సన్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆదిలోనే అనాసక్తి.. శిక్షణ మొదలైన రోజే ఉపాధ్యాయుల నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. మండు వేసవిలో శిక్షణ ఇవ్వడం సరికాదని, సరిగా శిక్షణ పొందే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాదు శిక్షణ కోసం అవసరమైన కొద్దిపాటి ఖర్చు పెట్టుకోవ డానికి కూడా టీచర్లు అనాసక్తత కనబరుస్తున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. లాంగ్ నోట్‌బుక్, పెన్ను, లంచ్ బాక్స్, మంచినీళ్లు వెంట తెచ్చు కోవాలని చెప్తే తప్పుపడుతున్నారని అంటున్నాయి. ఇక శిక్షణ కేంద్రాల్లో కొన్నిచోట్ల ఫ్యాన్లు లేవని, మంచినీటి వసతి కూడా కల్పించలేదని డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి పేర్కొన్నారు. వేసవి ఎండలు పెరిగిపోతున్నందున ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే శిక్షణ ఇవ్వాలని టీపీటీఎఫ్ నేతలు రమణ, మైస శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. 60 వేల మందికి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దాదాపు 60 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధనపై శిక్షణ ఇస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లోని ఒక్కో కేంద్రంలో దాదాపు 40 మందికి శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని, తొలి విడతగా ఐదు రోజులు కొనసాగుతుందని వివరించారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా శిక్షణ పూర్తి చేసి, టీచర్లను బోధనకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. -
ఆగమాగమైన అమీర్‌పేట ఐటీ!
అమీర్‌పేట.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచానికి తెలిసిన పేరు.. కుప్పలుతెప్పలుగా ఉండే కోచింగ్ సెంటర్లలో గుంపులుగా యువత.. ఉదయం, సాయంత్రం ఆ ప్రాంతం కరపత్రాలతో నిండిపోతుంది. ఆకాశాన్ని మూసేలా పోటాపోటీ బ్యానర్లు.. ఎటు చూసినా ఆఫర్లమయం.. కాస్త ఆలోచించి శిక్షణ తీసుకొని కష్టపడితే చాలు ఫ్లైట్‌లో విదేశాలకు ఎగిరిపోవచ్చు.. పల్లెల్లో సైకిళ్లు ఎరుగని యువకులు సైతం పెద్ద కంపెనీల్లో కొలువులు చేస్తున్నారంటే అమీర్‌పేట పుణ్యమే.. ఎర్రబస్సు ఎరుగని పల్లె టు అమెరికా వయా అమీర్‌పేట అన్నా అతిశయోక్తి కాదేమో.. దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువులకు బాటలు ఇక్కడి నుంచే మొదలయ్యేవి. ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను విద్యార్థులకు పండొలచినట్లు చెప్పి సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దే సెంటర్లు కోకొల్లలు. ఏడాదికి ఐదు లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్‌కు పునాది అమీర్‌పేట. కరోనా కాటుకు ఇక్కడి ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం మూతపడ్డాయి. -సనత్‌నగర్ ఆ తొమ్మిది నెలల్లో ఏం జరిగిందంటే.. ► కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ముందు ఐటీ విద్యార్థులతో అమీర్‌పేట అలరారింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కోచింగ్ సెంటర్లు తెరుచుకోలేదు. ► ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. అకాడమీ ఇయర్ పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్వేర్ కొలువు కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపే అడుగులు వేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దాదాపు 18 రాష్ట్రాల నుంచి ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు వస్తారు. ► ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కావడంతో పాటు ఐటీ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. ఆ ప్రకారంగా ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కలల జాబ్‌ను సంపాదించేందుకు ఇక్కడి కేంద్రాల్లో వాలిపోతుంటారు. ► ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 9 నెలలుగా విద్యార్థులు లేక శిక్షణ కేంద్రాలు బోసిపోయాయి. అప్పట్లో ఒక్క విద్యార్థి అమీర్‌పేట గడప తొక్కాడంటే.. అతడిని ఏదో రకంగా తమ కేంద్రంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. అలాంటిది తొమ్మిది నెలలు పాటు విద్యార్థులు దూరమైతే పరిస్థితి ఊహించుకోవచ్చు. ► అమీర్‌పేట కేంద్రంగా 400–450 వరకు శిక్షణ కేంద్రాలు ఉంటే కరోనా దెబ్బకు అందులో 80 శాతం మేర దివాళా తీసి పెట్టేబేడా సర్దుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. మిగతా 20 శాతం సంస్థలు ‘ఆన్లైన్’ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి. 50వేల మంది ఉపాధిపై వేటు.. ► అది మైత్రీవనం భవనంలో కొనసాగుతున్న ఐటీ శిక్షణ కేంద్రం. కరోనాకు ముందు 80 మంది పనిచేసేవారు. ఆన్లైన్ శిక్షణ కొనసాగిస్తుండటంతో ఇప్పుడు కేవలం నలుగురితో నడిపిస్తున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులను భారీగా కుదించుకోగా.. ఇక మూతపడ్డ శిక్షణ కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ► టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లు, టీ స్టాల్స్.. ఇలా పదుల సంఖ్యలో చిరువ్యాపారులు ఇక్కడ ఐటీ విద్యార్థులను నమ్ముకుని బతికేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది ఊళ్లకు వెళ్లిపోయారు. అలాగే శిక్షణ కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు ఒక పెద్ద టీమ్ ఉంటుంది. ఇప్పుడు వారంతా అడ్రస్ లేకుండాపోయింది. ఇక హాస్టల్స్ పరిస్థితి అగమ్యగోచరం. టాలెంట్‌కే పెద్దపీట.. కరోనాకు ముందు ప్రతి 100 మందిలో 10 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా మోస్ట్ టాలెంటెడ్ వారికే అవకాశం కల్పిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభ సమయంలో చాలా ఐటీ కంపెనీలు కరోనా సాకుతో చాలామందిని ఇంటికి సాగనంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో టాలెంట్ కలిగిన ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫ్రెషర్స్‌కు తక్కువ వేతనాలు ఇచ్చినా తమకు అనుకూలంగా ఉంటారన్న భావనతో ఉన్నట్లు సమాచారం. ‘ఆన్లైన్’.. ఒక సవాలే.. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్లో బోధించినట్లు ఇక్కడ కుదరదు. ఐటీ శిక్షణ అంటే విద్యార్థిని ఉద్యోగ జీవితంలోకి ఆహ్వానించే ఓ ఫ్లాట్‌ఫాం. అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐటీ విజ్ఞానాన్ని నూరిపోయాలి. ఫిజికల్ తరగతులతోనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. అలాంటిది ఆన్లైన్లో ఆ తతంగాన్ని పూర్తి చేయాలంటే పెద్ద సవాలే.. అందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, ఆన్లైన్ సిమిలేటర్స్ సమకూర్చుకోవాలి. ఐటీ శిక్షణ కేంద్రాలకు ఇది మరింత భారం. కీలక సమయం కోల్పోయాం.. ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై మాసాలు అత్యంత కీలకం. కరోనా కారణంగా ఆ సమయాన్ని కోల్పోయాం. ఆన్లైన్ తరగతులను సీరియస్‌గా ఫాలో అయితే జాబ్ కొట్టొచ్చు. కరోనాతో కొంతమేర ఐటీ కంపెనీలు డీలా పడిన మాట వాస్తవమే. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులను పక్కకు తప్పించారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. – నరేష్, ఎండీ, నరేష్ టెక్నాలజీ 400 మందికి ఉద్యోగాలు.. సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలపై కోవిడ్–19 కోలుకోని దెబ్బకొట్టింది. అమీర్‌పేట, కేపీహెచ్‌కాలనీ ప్రాంతాల్లో 80 శాతం వరకు శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. విద్యార్థులకు స్కిల్స్ ఉంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా శిక్షణ పొందినా ఉద్యోగం గ్యారంటీ. తాము కోవిడ్‌లోనూ 400 మందికి ప్లేస్మెంట్ అందించాం. స్కిల్స్ ఉంటే ఇంటికే ల్యాప్‌టాప్ పంపించి పని చేయించుకుంటారు. – దండు విశ్వనాథరాజు, సీఈఓ, వెక్టార్ ఇండియా -
ఖాకీల్లో దడపుట్టిస్తున్న కరోనా
సాక్షి, ఖమ్మం : హైదరాబాద్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ (సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య సిబ్బందికి కరోనా రావడంతో 24గంటల పాటు విధులు నిర్వహించే పోలీస్ శాఖలో కరోనా టెన్షన్ మొదలైంది. నిత్యం అన్ని ప్రాంతాల్లో డ్యూటీ చేసే వారిని..ఈ పరిస్థితిలో మరింత జాగరుకతతో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దారుడి వెంట గుంపులుగా ప్రజలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది అంతా మాస్క్ ధరించాలని, తరచూ చేతులను శానిటైజ్ చేసుకుంటుండాలని, విధులు నిర్వర్తించేప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే అంతటా పకడ్బందీగా ఆచరిస్తున్నారు. 50 ఏళ్ల వారిపై దృష్టి పోలీస్ శాఖలోని వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో 50 నుంచి 55ఏళ్ల వయస్సు ఉన్న వారిపై ఉన్నతాధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఉండాలని ఇప్పటికే అవగాహన కల్పించారు. కరోనా వైరస్ బారిన పడి తర్వాత ఆస్పత్రుల్లో ఇబ్బంది పడొద్దని వీరికి బయట విధులను తగించేస్తున్నారు. సీపీ కార్యాలయంలో కట్టుదిట్టం ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న సీపీ కార్యాలయంలో కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యాలయంలో ప్రవేశించే సమయంలో అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. చేతులకు శానిటేజర్ పూస్తున్నారు. వారు సామాన్య ప్రజలైనా, పోలీస్ అధికారులైనా, వీఐపీలు అయినా..ఈ నిబంధనలు కచ్చితం చేశారు. గతంలో సీపీని, అడిషనల్ డీసీపీలను కలిసేందుకు వచ్చే వారు కార్యాలయంలోని హాల్లో కూర్చునేవారు. కరోనా దృష్ట్యా ఇప్పుడు కార్యాలయం ఆవరణలోనే ప్రత్యేకంగా టెంట్ వేసి వారు కూడా భౌతికదూరం పాటించేలా కూర్చోబెడుతున్నారు. కొన్ని నెలలుగా బయటకు రాని శిక్షణ కానిస్టేబుళ్లు లాక్డౌన్ కాలం అయిన మార్చి చివరి నుంచి లాక్డౌన్ ఎత్తేశాఖ ఇన్ని రోజులుగా ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రం బయటకు వెళ్లడం లేదు. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఖమ్మంలోని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాటి రాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. వారికోసం కుటుంబ సభ్యులను సైతం రావద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. -
శిక్షణ లేకుండానే విధుల్లోకి
సాక్షి, నల్లగొండ : శిక్షణ లేకుండానే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. అంతకు ముందే పంచాయతీ కార్యదర్శులకు టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల కోడ్‌తోనియామకాలు ఆగిపోయాయి. ఎన్నికలు పూర్తయితన తర్వాత విధుల్లో చేరారు. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో గ్రామాల్లో కొత్త పంచాయతీ చట్టం ప్రకారం విధులు ఎలా నిర్వహించాలో పూర్తి స్థాయిలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సందేహాలతో చేరే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా నియామకం కాగానే శిక్షణ ఇస్తారు. వీరికి ఎలాంటి శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 పంచాయతీలకు గత జనవరి మాసంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులను జిల్లాకు అలాట్ చేయడంతో వారికి జిల్లా పంచాయతీ అధికారి జాయినింగ్ ఉత్తర్వులు అందజేయడం.. వెంటనే వారు విధుల్లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం కాకముందు గతంలో రెండు మూడు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ప్రస్తుతం కొత్త నియామకాల కారణంగా ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఏర్పాటయ్యాడు. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. దాని బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. చట్టం అమలులో భా గంగా సర్పంచ్‌కు, ఉపసర్పంచ్‌కు ఇటీవల ప్రభుత్వం చెక్ పవర్‌ను అందించింది. గతంలో సర్పం చ్‌కు, కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. నిధుల విని యోగానికి సంబంధించిన ఆడిట్ మాత్రం సర్పం చ్, కార్యదర్శే చేయాల్సి ఉంది. ఇందులో తప్పిదాలు చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవు. కార్యదర్శుల విధులు కొత్తచట్టం ప్రకారం పనితీరును ప్రతినెలా వెబ్సైట్లో పొందుపర్చాలి. లే అవుట్లు, భవన నిర్మాణాలు, అందుకు సంబంధించిన అనుమతుల కోసం గ్రామపంచాయతీలకు అనుసంధానంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆ సాఫ్ట్ వేర్ కూడా ఇప్పటికే జిల్లాకు చేరింది. గ్రామాల్లో ఉపాధి హామీతోపాటు జనన, మరణ, ఇతర గ్రామానికి సంబంధించిన సమాచారానికి సంబంధించి ప్రతి ఒక్క విషయానికి పంచాయతీ కార్యదర్శే ప్రముఖ పాత్ర వహించాలి. విధులు సరిగా నిర్వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకునేందుకు కూడా చట్టంలో ఉంది. తొలగింపు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఏప్రిల్ 12న పంచాయతీ కార్యదర్శులు నియామకాలు తీసుకొని అదే రోజు విధుల్లో చేరాలని ఆదేశాలు ఉండడంతో వెంటనే చేరారు. మరుసటి రోజు నుంచే పంచాయతీలకు వారిని కేటాయిం చారు. ప్రస్తుతం కొత్త చట్టం గ్రామంలోని ప్రతి పనికి సంబంధించి కార్యదర్శే బాధ్యత వహించాలి. అది కూడా ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. -
ఔత్సాహిక నేతల కోసం ట్రైనింగ్ సెంటర్
లక్నో: డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులుగా మారేందుకు ప్రత్యేకంగా కళాశాలలు ఉన్నాయి. అదే తరహాలో రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేందుకు ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయ శిక్షణా కేంద్రం కోసం రూ.198 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 16 ఎకరాల్లో ఇక్కడి ఘజియాబాద్ జిల్లా కేంద్రంలో దీని నిర్మాణం జరగనుంది. ఈ శిక్షణా కేంద్రంలో రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తులతో పాటు చట్టసభల ప్రతినిధులు చేరవచ్చని యూపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు వేర్వేరు దేశాధినేతలు, నిపుణులు, రాయబారులు, రాజకీయ ప్రముఖులతో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చే ప్రజలు సందర్శించేందుకు వీలుగా దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ఉన్న ఘజియాబాద్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రాన్ని యూపీ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహిస్తుందనీ, దీనికి గుర్తింపు కోసం పలు జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చిస్తున్నామని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామనీ, మరో రెండేళ్లలో ఈ శిక్షణా కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. -
అంగన్వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలు మూసివేత
దెందులూరు: జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ కేంద్రాలకు బ్యాచ్‌లను నిలిపివేశారు. దీంతో శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ«ధ్వర్యంలో 2002లో జిల్లాలోని దెందులూరు మండలంలో, 1983లో ఏలూరులో అంగన్వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలను మంజూరు చేసింది. ఒక్కో కేంద్రంలో 13 మంది ఉద్యోగులను ఆవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జిల్లా ఐసీడీఎస్ పీడీ ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో కో–ఆర్డినేటర్–1, ఇన్స్ట్రక్టర్లు–2, డ్రాయింగ్, క్రాఫ్ట్, టైలరింగ్ టీచర్లు–3 క్లర్క్–1, కంప్యూటర్ ఆపరేటర్–1, అటెండర్–1, వాచ్మెన్–1, కుక్–1, చౌకీదార్–1, స్వీపర్–1 ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ వేతనం ఇచ్చేవారు. ఒక్కో బ్యాచ్‌లో 40 మంది అంగన్వాడీ వర్కర్లు, 50 మంది ఆయాలకు శిక్షణ ఇచ్చేవారు. 40 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. 2017 మార్చిలో ఈ శిక్షణ కేంద్రాలకు బ్యాచ్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ ఏడాది జూన్‌లో ఈ కేంద్రాల ఉద్యోగులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. అనంతరం నో వర్క్, నో పే అంటూ కమిషనర్ రెండు కేంద్రాలకు ఆదేశాలు పంపారు. దీంతో ఏలూరు, దెందులూరులో పనిచేస్తున్న 26 మంది వివిధ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. వీంతో ఆ కుటుంబాల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవల దెందులూరులో పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇన్స్ట్రక్టర్లు, కో–ఆర్డినేటర్లు నివేదిక అందజేసి ఉపాధి కల్పించాలని వేడుకున్నారు. నా సీనియారిటీ వృథా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రంలో ఇన్‌స్ట్రక్టర్‌గా 15 ఏళ్లు సేవలందించాను. అకస్మాత్తుగా శిక్షణ కేంద్రాలకు బ్యాచ్‌ల కేటాయింపు నిలిపివేశారు. 15 ఏళ్ల సీనియారిటీ వృధా అయ్యింది. చాలా బాధగా వుంది. – నిర్మల, ఇన్స్ట్రక్టర్ మా భవిష్యత్తు ఏమిటి? అంగన్వాడీ వర్కర్ల ట్రైనింగ్ సెంటర్లకు బ్యాచ్‌ల కేటాయింపు నిలిపివేయటంతో ఉపాధి కోల్పోయాను. నాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.– రాధ, ఇన్స్ట్రక్టర్ కనీస సమాచారం ఇవ్వలేదు అంగన్వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలకు కనీస సమాచారం ఇవ్వకుండా బ్యాచ్‌లను నిలిపివేశారు. ప్రస్తుతం మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏళ్ల తరబడి సేవలందించాము. ప్రభుత్వం మాకు ఇచ్చే కానుక ఇదేనా. – బెనర్జీ, ఇన్స్ట్రక్టర్ ప్రభుత్వం స్పందించాలి అంగన్వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలకు బ్యాచ్‌లను ప్రభుత్వం నిలిపివేసే ముందు ఈ కేంద్రాల్లో సేవలందిస్తున్న సిబ్బంది గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. మా భవిష్యత్తు అంధకారం చేస్తారా. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలేగానీ అదే సమస్యగా మారకూడదు. ప్రభుత్వం మానవతాదృక్పధంతో స్పందించి తిరిగి బ్యాచ్‌లను అంగన్వాడీ శిక్షణ కేంద్రాలకు పంపాలి. – సుప్రియ, ఇన్స్ట్రక్టర్ -
కంప్యూటర్ పాఠం.. భవితకు సోపానం
విద్యార్థులతో కిటకిటలాడుతున్న శిక్షణ కేంద్రాలు సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు పోచమ్మమైదాన్ : ఇది కంప్యూటర్ యుగం. ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతిచోటా కంప్యూటర్లను వినియోగిస్తుండటాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్ అక్షరాస్యత ఎంతో అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే వేసవి సెలవుల్లో తమ పిల్లల్ని షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేందుకు పంపిస్తున్నారు. విద్యార్థులు సైతం రోజూ ఎంతో ఉత్సాహంగా శిక్షణ కేంద్రాలకు వెళ్లి, నిపుణుల పర్యవేక్షణలో సాంకేతిక అంశాల్ని నేర్చుకుంటున్నారు. ఫలితంగా వరంగల్, హన్మకొండ, కాజీపేటలతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నారుు. దీంతోపాటు టైప్ రైటింగ్ కోర్సులను నేర్చుకునేందుకూ ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో తొలుత కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నారు. వాటిపై పట్టుసాధించిన విద్యార్థులకు డీసీఏ వంటి సాధారణ స్థారుు కోర్సుల్లో చేర్చుకుంటున్నారు. పాఠశాల దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక విద్యాపరమైన అంశాల్లో వారు ప్రతిభ కనబర్చే అవకాశాలు ఉంటాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పాఠశాలల్లో నిర్వహించే కంప్యూటర్ క్లాస్‌లలో విద్యార్థులు మరింత రాణించడానికి ఈ షార్ట్ టర్మ్ ట్రెరుునింగ్ దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, మల్టీమీడియూ, సీ ల్యాంగ్వేజ్, జావా, సీపీపీ, డాట్నెట్, ఒరాకిల్, హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్, 2డీ యూనిమేషన్, 3డీ యూనిమేషన్, మాయూ, అకౌంటింగ్ కోర్సులు నేర్పిస్తున్నారు. బీటెక్ విద్యార్థులకు ప్రత్యేకంగా.. బీటెక్ విద్యార్థులు, ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే వారి కోసం కంప్యూటర్ ట్రెరుునింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నారుు. ఆయూ విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు దోహదపడేలా ఈ కోర్సులను రూపొందించారు. హన్మకొండ, వరంగల్ల పరిధిలోని కొన్ని శిక్షణ కేంద్రాల్లో బీటెక్ విద్యార్థులకు రాబోయే సెమిస్టర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ముందస్తుగా కోర్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఫీజుల విషయూనికొస్తే ఒక్కో లాంగ్వేజీని బట్టి దాదాపు రూ.1000 నుంచి రూ.5వేల దాకా తీసుకుంటున్నారు. -
జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు
అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: నేత కార్మికులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాంపల్లిలోని చేనేత భవన్లో గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనంతరం చేనేత శిక్షణ కేంద్రాన్ని జూపల్లి సందర్శించారు. శిక్షణ పొందుతున్న కార్మికులతో మాట్లాడారు. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తక్షణమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాంధీ జయంతి అక్టోబర్ 2నుంచి వాటిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ నిఫ్ట్ సహకారంతో నూతన డిజైన్ల తయారీలో మెళకువలను నేర్చుకోవాలన్నారు. తద్వారా బహిరంగ మార్కెట్లో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగే అవకాశం వుంటుందన్నారు. చేనేత ఉత్పత్తుల ద్వారా తాము రోజుకు కనీసం రూ.60 నుంచి రూ.75కు మించి పొందలేకపోతున్నామని కార్మికులు మంత్రికి విన్నవించారు. -
‘గురువు’ల కొలువుకు నోటిఫికేషన్
* 1,210 పోస్టులకు 50 వేలమందికి పైగా అభ్యర్థులు * ఎస్జీటీలకు తక్కువ పోటీ, ఎస్‌ఏలకు హోరాహోరీ * జిల్లాలో కళకళలాడుతున్న శిక్షణా కేంద్రాలు భానుగుడి (కాకినాడ) : ఉపాధ్యాయ ఎంపిక అర్హత పరీక్ష (టెట్ కమ్ టీఆర్టీ (డీఎస్సీ)కు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కావడంతో ఆ ఉద్యోగార్థుల్లో ఆనందం, ఆత్రుత పెల్లుబుకుతున్నాయి. జిల్లాలో 884 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), 326 స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు 50 వేలమందికి పైగా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కొన్ని కేంద్రాలు అభ్యర్థుల సంఖ్య విపరీతంగా ఉండడంతో చోటులేక తాత్కాలికంగా వేసిన పందిళ్లలో శిక్షణనిస్తున్నాయి. ఎప్పటిలానే ఈ డీఎస్సీకి కూడా ఎస్జీటీ పోస్టులకు పోటీ తక్కువగానే ఉంది. 884 పోస్టులకు పోటీ పడుతున్న వారు (ప్రస్తుతం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారితో కలిపి) 4,200 మంది ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు 4.7 మంది పోటీపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగాలకు సంబంధించి అతి తక్కువ పోటీ ఉన్నది ఎస్జీటీకి మాత్రమే కావడం విశేషం. ఈ ఏడాది ఉన్న ఖాళీలు వచ్చే డీఎస్సీకి ఉండవని, ప్రస్తుత రేషనలైజేషన్ ప్రక్రియ, డీఎస్సీ అనంతరం చాలా వరకు ఖాళీలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. అలాగే అతి ఎక్కువ ఖాళీలు గల జిల్లా ప్రస్తుతం తూర్పుగోదావరేనంటున్నారు. ప్రభుత్వం ఎస్జీటీలుగా బీఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చేది లేదని తేల్చింది. ఇక జిల్లాలో ఉన్న ఎస్ఏ ఖాళీలను బట్టి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో ‘టెట్’ క్వాలిఫై అయిన అభ్యర్థులు 19,921 మంది ఉండగా, ‘టెట్’ కు హాజరు కాకుండా బీఎడ్ పూర్తి చేసిన వారితో కలిపితే మొత్తం 50 వేల మందికిపైగా బీఎడ్ అభ్యర్థులుంటారని అంచనా. జిల్లాలోని 326 ఎస్ఏ ఖాళీల్లో గణితం-25, బయాలజీ-26, సోషల్- 79, ఇంగ్లిష్-15, తెలుగు-27, హిందీ-14, స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం- 2, ఉర్దూ-1, ఫిజికల్ డెరైక్టర్-1, లాంగ్వేజ్ పండిట్ తెలుగు-83, ఉర్దూ -1, హిందీ -29, సంస్కృతం-5 ఉన్నాయి. ఇవి కాక స్పెషల్ పాఠశాలల్లో గణితం -1, ఇంగ్లిష్-1, ఫిజిక్స్-1, ఎల్పీ తెలుగు-1, ఎల్పీ హిందీ-1 ఖాళీలున్నాయి. మొత్తం మీద వీటికి 50 వేలమందికి పైగా అభ్యర్థులు పోటీపడుతుండడం గమనార్హం. మంత్రి గారూ! వాటినీ కలపండి! 2000, 2008, 2012 డీఎస్సీలకు సంబంధించి మున్సిపల్ ఖాళీలను సైతం కలిపి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈసారి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే స్పందించి ఎప్పటిలానే మున్సిపల్ ఖాళీలను సైతం ప్రస్తుతం నోటిఫికేషన్లో పొందుపరిచాలని ఎస్టీయూ నాయకులు తోటకూర సాయిరామకృష్ణ, పీవీ సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ ఖాళీలకు ప్రత్యేకంగానోటిఫికేషన్ జారీ చేస్తామనడం సమంజసం కాదన్నారు. సిలబస్‌కు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వకపోవడాన్ని వారు తప్పబట్టారు. కేవలం జీఓను జారీచేసి సిలబస్, సబ్జెక్టుల వారీ మార్కుల వివరాలను వెల్లడించకపోవడం శోచనీయమన్నారు. వీటిపై పూర్తి స్పష్టతనిచ్చి అభ్యర్థుల్లో గందరగోళాన్ని తొలగించాలన్నారు. -
శిక్షణ.. కలేనా!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వైద్య ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాంతీయ శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఎంతకీ ముందుకు కదలడం లేదు. వరంగల్‌లో ప్రాంతీయ శిక్షణ కేంద్రం మంజూరై మూడేళ్లు గడిచింది. కానీ.. అది కలగానే మిగిలింది. పారామెడికల్, నర్సింగ్, వైద్య సిబ్బంది, వైద్యులకు వృత్తిపరమైన శిక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఒక్క హైదరాబాద్‌లోనే శిక్షణ కేంద్రం ఉంది. 2011లో జాతీయ ఆరోగ్య శాఖ సిఫారసు మేరకు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రాంతీయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2011 ఆగస్టు 24న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు అటకెక్కింది. దీనికి సంబంధించిన ఫైల్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... వ్యాధుల నియంత్రణ, మాతా, శిశు సంరక్షణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, ఆరోగ్య కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, ఆర్థిక వ్యవహారాలపై అవగాహనతోపాటు వ్యక్తిత్వ నైపుణ్యం వంటి అంశాలు శిక్షణలో భాగంగా ఉంటాయి. వరంగల్ జిల్లాలో వైద్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో నూతన భవనం సిద్ధంగా ఉంది. దీన్ని శిక్షణ కేంద్రంగా మార్చితే వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉద్యోగులు ఇక్కడే శిక్షణ పొందే వెసులుబాటు ఉంటుంది. వేలాది మంది వైద్య ఉద్యోగులకు శిక్షణ పొందడం, పని తీరును మెరుగుపరచు కోవడం, పదోన్నతులు పొందడం సులభతరమని చెప్పాలి. కానీ... శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండడంతో వెద్య ఉద్యోగులకు పూర్తి స్థారుులో శిక్షణ అందకుండా పోతోంది. చిగురిస్తున్న ఆశలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే కేంద్రం ఉండడంతో అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం వీలుకావడంలేదు. వైద్య ఆరోగ్య శాఖ పరిపాలన విషయంలో ఇప్పుడు వరంగల్ జిల్లా ముద్ర ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తాటికొండ రాజయ్య ఉన్నారు. ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టర్ పిల్లి సాంబశివరావు సైతం వరంగల్ జిల్లా వాసే. ఆరోగ్య శాఖకు సంబంధించి మంత్రి, పాలనపరమైన ఉన్నతాధికారి ఇద్దరూ జిల్లా వాసులే కావడంతో వైద్య ఆరోగ్య శిక్షణ కేంద్రానికి మోక్షం కలుగుతుందనే ఆశ చిగురిస్తోంది.