విద్యార్థులతో కిటకిటలాడుతున్న శిక్షణ కేంద్రాలు
సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు
పోచమ్మమైదాన్ : ఇది కంప్యూటర్ యుగం. ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతిచోటా కంప్యూటర్లను వినియోగిస్తుండటాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్ అక్షరాస్యత ఎంతో అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే వేసవి సెలవుల్లో తమ పిల్లల్ని షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేందుకు పంపిస్తున్నారు. విద్యార్థులు సైతం రోజూ ఎంతో ఉత్సాహంగా శిక్షణ కేంద్రాలకు వెళ్లి, నిపుణుల పర్యవేక్షణలో సాంకేతిక అంశాల్ని నేర్చుకుంటున్నారు. ఫలితంగా వరంగల్, హన్మకొండ, కాజీపేటలతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉన్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నారుు. దీంతోపాటు టైప్ రైటింగ్ కోర్సులను నేర్చుకునేందుకూ ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో తొలుత కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నారు. వాటిపై పట్టుసాధించిన విద్యార్థులకు డీసీఏ వంటి సాధారణ స్థారుు కోర్సుల్లో చేర్చుకుంటున్నారు.
పాఠశాల దశలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక విద్యాపరమైన అంశాల్లో వారు ప్రతిభ కనబర్చే అవకాశాలు ఉంటాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పాఠశాలల్లో నిర్వహించే కంప్యూటర్ క్లాస్‌లలో విద్యార్థులు మరింత రాణించడానికి ఈ షార్ట్ టర్మ్ ట్రెరుునింగ్ దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో డీసీఏ, పీజీడీసీఏ, డీటీపీ, మల్టీమీడియూ, సీ ల్యాంగ్వేజ్, జావా, సీపీపీ, డాట్‌నెట్, ఒరాకిల్, హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, 2డీ యూనిమేషన్, 3డీ యూనిమేషన్, మాయూ, అకౌంటింగ్ కోర్సులు నేర్పిస్తున్నారు.
బీటెక్ విద్యార్థులకు ప్రత్యేకంగా..
బీటెక్ విద్యార్థులు, ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే వారి కోసం కంప్యూటర్ ట్రెరుునింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నారుు. ఆయూ విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు దోహదపడేలా ఈ కోర్సులను రూపొందించారు. హన్మకొండ, వరంగల్‌ల పరిధిలోని కొన్ని శిక్షణ కేంద్రాల్లో బీటెక్ విద్యార్థులకు రాబోయే సెమిస్టర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ముందస్తుగా కోర్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఫీజుల విషయూనికొస్తే ఒక్కో లాంగ్వేజీని బట్టి దాదాపు రూ.1000 నుంచి రూ.5వేల దాకా తీసుకుంటున్నారు.