computer
-
తొలి సైబర్ దాడి ఎప్పుడు జరిగింది?
జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 30న జరుపుకుంటారు. దీనిని ‘అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ డే’ అని కూడా అంటారు. సైబర్ బెదిరింపుల నుండి తమ కంప్యూటర్లు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడంపై అవగాహన కల్పించడమే కంప్యూటర్ భద్రతా దినోత్సవ లక్ష్యం. కంప్యూటర్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత, చరిత్రకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 1988లో కంప్యూటర్ సెక్యూరిటీ డే ప్రారంభమైంది. అదేసమయంలో సైబర్ దాడులు, డేటా చోరీ కేసులు వెలుగు చూశాయి. 1988, నవంబర్ 2న కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కంప్యూటర్ సిస్టమ్‌లను ప్రభావితం చేసే రహస్య వైరస్‌ను గమనించారు. ఇది నాలుగు గంటల్లోనే పలు విశ్వవిద్యాలయ కంప్యూటర్ వ్యవస్థలను ప్రభావితం చేసింది. దీనికి 'మోరిస్ వార్మ్' అని పేరు పెట్టారు. అదే ఏడాది నవంబర్ 14న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఈఐ) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)ని ఏర్పాటు చేసింది. అలాగే కంప్యూటర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 30ని నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు.కంప్యూటర్ సెక్యూరిటీ డే మనకు సైబర్ భద్రతను సీరియస్‌గా పరిగణించాలని గుర్తు చేస్తుంది. ఆన్లైన్ డేటాను సురక్షితంగా ఉంచడం ప్రతి వ్యక్తి , సంస్థ బాధ్యత. కంప్యూటర్ సెక్యూరిటీ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలుసురక్షిత పాస్వర్డ్లు: బలమైన, అసాధారణమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలివైరస్, మాల్వేర్ నుంచి రక్షణ: ఉత్తమ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరించాలి.డేటా బ్యాకప్: ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం తప్పనిసరి.నెట్వర్క్ భద్రత: సురక్షిత నెట్వర్క్ కనెక్షన్, ఫైర్‌వాల్‌ని ఉపయోగించాలి.సాఫ్ట్వేర్ అప్డేట్: తాజా భద్రతా ప్యాచ్‌లతో అన్ని సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తుండాలి. ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
వేలానికి 1983 నాటి యాపిల్ ప్రోటోటైప్
ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒక వస్తువును మార్కెట్లో లాంచ్ చేయాలంటే.. ముందుగా దాని ప్రోటోటైప్ విడుదల చేస్తుంది. ఆ ప్రోటోటైప్ ద్వారానే వస్తువు పనితీరు ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే వస్తువుల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత, ప్రోటోటైప్స్ నిరుపయోగమవుతాయి. కొన్నేళ్ల తరువాత ఇలాంటి వాటిని సంస్థలు లేదా వ్యక్తులు వేలంలో విక్రయిస్తాయి. ఆసక్తికలిగిన వారు భారీ మొత్తంలో ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటారు. 1983 నుంచి మనుగడలో ఉన్న అలాంటి ఒక యాపిల్ ప్రోటోటైప్ 'మాకింతోష్ #ఎమ్001' (Apple Macintosh Prototype #M0001) ఇప్పుడు వేలానికి వచ్చిందియాపిల్ మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ అక్టోబర్ 23 వరకు న్యూయార్క్‌లోని బోన్హామ్స్లో వేలానికి ఉంటుంది. ఇది సుమారు 120000 డాలర్లకు (రూ. 1 కోటి కంటే ఎక్కువ) అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన పురాతన యాపిల్ ఉత్పత్తులలో #ఎమ్001 ప్రోటోటైప్ కూడా ఒకటిగా మరో రికార్డ్ క్రియేట్ చేయనుంది.మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ నాలుగు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ.. ఇది మంచి స్థితిలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తులను వేలంలో విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఇలాంటి ఓ ప్రోటోటైప్‌ను 150075 డాలర్లకు విక్రయించారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్కంప్యూటర్లు మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, జెఫ్ రాస్కిన్ సంతకం చేసిన 128కే మాకింతోష్ మదర్బోర్డ్ 2021లో 132049 డాలర్లకు అమ్ముడైంది. ఆ తరువాత స్టీవ్ జావ్స్ ఉపయోగించిన మాకింతోష్ ఎస్ఈ కంప్యూటర్ను 126375 డాలర్లకు వేలంలో విక్రయించారు. దీన్ని బట్టి చూస్తే మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్‌లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్‌లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి. ముందంజలో సామ్సంగ్..ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్లో 48.7 శాతం వాటాతో సామ్సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్కు నాసా కాంట్రాక్టు ఈ ఏడాది 20 శాతం వృద్ధి..భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్‌లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. -
రెండువేల ఏళ్లనాటి కంప్యూటర్..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
చాలా ఆవిష్కరణలు మనమే కొత్తగా కనిపెట్టాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోని అపార మేధాతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఆయా వస్తువులు బయటపడితే గానీ నమ్మం. ఆ టైంలోనే వాళ్లు ఇంత టెక్నాలజీని కనిపెట్టారా..? అని అబ్బురపడతాం. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని అయిన కంప్యూటర్ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపై ఆధారపడిపోయాం. అలాంటి కంప్యూటర్ వేల ఏళ్లక్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే నమ్ముతారా..?. కానీ ఇది నమ్మకతప్పని నిజం. శాస్త్రవేత్తలు సైతం ఆ కంప్యూటర్ని చూసి అబ్బురపడ్డారు. అసలేం జరిగిందంటే..మొదటి కంప్యూటర్‌గా పిలిచే 'యాంటికిథెరా' అనే రెండు వేల ఏళ్ల పరికరాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది ఒక ఖగోళ క్యాలెండర్‌గా పేర్కొన్వచ్చు. దీన్ని 1901 నాటి గ్రీకు నౌక ప్రమాదంలో కనుగొన్నారు. అంటే సుమారు 120 ఏళ్ల క్రితం ఈ పరికరాన్ని కనుగొన్నారు. అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థంగాక శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. ఇది చేతితో నడిచే పరికరం. ఈ పరికరాంలో సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండ్-అప్ వ్యవస్థను ఉపయోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుని దశలు, గ్రహాణ సమయాలు గుర్తించే క్యాలెండర్ మాదిరిగా పనిచేసేది. ఇది సాధారణ ప్రయోజనాలకోసం ఉపయోగించి కంప్యూటరే అయినా వెయ్యి ఏళ్ల క్రితమే ఏ ఇతర సాధనల్లో ఇంత మెకానిజం లేదు. పైగా ఇది అధునాతమైనది కూడా. ఇక ఈ కంప్యూటర్ మెకానిజం 82 వేర్వేరు శకలాలుగా ఉంది. అసలు నిర్మాణంలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 30 తుప్పుపట్టిన కాంస్య గేర్వీల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇదేలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించారు. అప్పుడే ఇది గొప్ప మేధావి సృష్టించిన అద్భుతంగా గుర్తించారు. తాము పునర్నిర్మించిన ఈ త్రీడీ మోడల్ తమ వద్ద ఉన్న ఆధారాలకు సరిపోలుతుందని చెప్పారు.అంతేగాదు ఈ పరికరం సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల కదలికలను కేంద్రీకృత వలయాలపై ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఆ రోజుల్లేనే ఖగోళ వస్తువులు భూమి చుట్టు తిరుగుతాయని పురాతన గ్రీకులు నమ్మేవారని తెలుస్తుందన్నారు. అంతేగాదు ఈ పురాతన పరికరాన్ని బాబిలోనియన్ ఖగోళశాస్త్రం, ప్లేటోస్ అకాడమీ గణిత, పురాతన ఖగోళశాస్త్ర సిద్ధాంతాల కలియికతో ఆవిష్కరించినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
తొలి సజీవ కంప్యూటర్ని.. మీరెప్పుడైనా చూశారా!?
ప్రపంచంలోనే తొలిసారిగా సజీవ కంప్యూటర్ను రూపొందించారు స్వీడిష్ శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలాన్ని సేకరించి, లాబ్‌లో ఆ కణజాలాన్ని పదహారు చిన్న చిన్న ముద్దలుగా పెంపొందేలా చేశారు. వీటిని ‘ఆర్గనాయిడ్స్’ అంటున్నారు. మెదడు కణజాలం ముద్దలు వాటి నాడుల ద్వారా కంప్యూటర్ చిప్ మాదిరిగానే ఒక దాని నుంచి మరొకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలుగుతున్నాయి. మనిషి మెదడు కణజాలం కంప్యూటర్ కంటే వెయ్యిరెట్ల మెమరీకి 10 నుంచి 20 వాట్ల విద్యుత్తును వినియోగించుకుంటే, కంప్యూటర్లు 21 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటాయని ఈ ప్రయోగం చేపట్టిన స్వీడిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ప్రాసెసర్ చిప్ బదులుగా మనిషి మెదడు కణజాలంతో రూపొందిన చిప్‌ను అమర్చి తొలి సజీవ కంప్యూటర్ను తయారు చేయడంలో విజయం సాధించారు.‘ఫైనల్ స్పార్క్’ అనే స్టార్టప్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు సైన్స్ ఫిక్షన్‌ను తలపించే ఈ ప్రయోగం చేశారు. జీవనాడీ వ్యవస్థలను యంత్రాల్లో ఉపయోగించడం ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే తమ సంస్థను ప్రారంభించినట్లు ‘ఫైనల్ స్పార్క్’ కో–సీఈవో డాక్టర్ ఫ్రెడ్ జోర్డాన్ ప్రకటించారు.ఫైనల్ స్పార్క్ దాదాపు పదివేల సజీవ నాడీకణాలతో 0.5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కంప్యూటర్ చిప్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ‘మినీ బ్రెయిన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఆర్గనాయిడ్స్తో తయారైన ఈ మినీబ్రెయిన్స్ ఎలక్ట్రోడ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇవి చదవండి: త్రీ ఇన్ వన్ తందూర్.. -
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
పట్టణ యువతలో 61శాతం మందికి కంప్యూటర్ నైపుణ్యం
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్‌ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్‌ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..ఇక జోడించిన ఫైల్‌తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్‌తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. -
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్ తయారీదారు హెచ్‌పీ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చవకైన గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకురావడంపై దృష్టి సారించింది. తక్కువ ధరలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ల్యాప్టాప్స్ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌పీ భారీ డిస్కౌంట్లతో గేమింగ్ ల్యాప్‌టాప్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను ఇండియన్ మార్కెట్‌కి తీసుకొస్తుంది. ‘లూట్ డ్రాప్ సేల్’ పేరుతో హెచ్‌పీ కంపెనీ ఒమెన్, విక్టస్ ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్లు, మైక్రోఫోన్లు, కీబోర్డ్, మౌస్, మౌస్ ప్యాడ్ వంటి గేమింగ్ ఉపకరణాలపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని హెచ్‌పీ స్టోర్లు, హెచ్‌పీ ఆన్లైన్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మార్చి 3 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హెచ్‌పీ ఒమెన్ 16 ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.1,75,930 విలువైన 14వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ. 1,49,999కే లభిస్తుంది. 13వ జనరేషన్ ఒమెన్ 16 ల్యాప్‌టాప్ రూ.1,32,645 బదులుగా రూ.1,12,999 వస్తుంది. ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..? ఒమెన్ 16 ల్యాప్‌టాప్ కొనుగోలుపై ప్రముఖ బ్యాంకులతో రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందే సౌకర్యం కూడా ఉంది. హెచ్‌పీ మౌస్, మౌస్ ప్యాడ్, హెడ్‌సెట్‌తో సహా హైపర్ ఎక్స్ కొనుగోలుపై రూ.2,999 తగ్గిస్తున్నారు. హైపర్ ఎక్స్ క్లచ్ గేమ్ కంట్రోలర్‌పై రూ.999 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు!
‘యుగాంతం’.. ‘మహావినాశనం’ వీటికి సంబంధించిన చర్చలు ప్రపంచంలో కొత్తేమీకాదు. ఈ ఆసక్తికర అంశాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మానవాళి అంతం గురించి అంచనా వేయడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటర్ను ఉపయోగించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్ గురించి కంప్యూటర్ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల (ఒక మిలియన్ అంటే పది లక్షలు) దూరంలో ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని అన్నారు. ఈ విధంగా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్ విడుదల కానుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అగ్ని పర్వత విస్ఫోటనాలతో ఏర్పడే సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. ఫలితంగా భూభాగంలోని అధిక ప్రాంతాల్లో 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్వర్త్ హెచ్చరించారు. అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో భూమిపై నివాసయోగ్యంకాని సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది? -
షూ కాదిది, కంప్యూటర్!, ధర ఎంతంటే?
చూడటానికి స్పోర్ట్స్ షూలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది పర్సనల్ కంప్యూటర్. మామూలు కంప్యూటర్ సీపీయూలో ఉండే మదర్బోర్డ్, ప్రాసెసర్, హార్డ్‌డిస్క్, ర్యామ్ వంటి భాగాలన్నీ ఇందులోనూ ఉంటాయి. దీనిని మానిటర్‌కు అనుసంధానించుకుని, చక్కగా పనిచేసుకోవచ్చు. ఇందులో 2టీబీ హార్డ్‌డిస్క్, 32జీబీ ర్యామ్, ఎన్విడియా ఆర్టీఎక్స్ 4070 జీపీయూ, ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే 13700 సీపీయూ, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. అమెరికన్ కంపెనీ కూల్‌మాస్టర్ తన ముప్పయ్యో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల స్పోర్ట్స్ షూ ఆకారంలో ఉండే ఈ పీసీని ‘సీఎంఓడీఎస్’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6000 డాలర్లు (రూ.4.99 లక్షలు). -
Chandrababu : జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్‌ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్‌తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్‌తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్‌ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్‌ఖాన్‌కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్‌ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
ఈయన టైపింగ్ స్కిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే
-
టెక్నాలజీనే నమ్ముకుంటే ప్రమాదమే..
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు లక్షల మంది ఉద్యోగార్ధులకు సంబంధించిన అంశంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టతోనూ ఇమిడి ఉంటాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (2005–11) చైర్మన్‌గా, యూపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరగాళ్లు సులువుగా రూ. కోట్లు కొట్టేస్తున్న రోజుల్లో కీలకమైన ప్రశ్నపత్రాలను కేవలం టెక్నాలజీతో భద్రంగా ఉంచడం ఎంతవరకు సాధ్యమనే సందేహాన్ని ఆయన వెలిబుచ్చారు. సాంకేతికను కొంతవరకు నమ్ముకొని గత విధానాలను అనుసరిస్తే పేపర్ లీక్ వంటి ఘటనలకు తావుండబోదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు అనేక అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... మానవసహిత భద్రతకే ప్రాధాన్యమివ్వాలి... పాస్వర్డ్ లేదా ఓటీపీని తెలుసుకొని కేటుగాళ్లు రూ. కోట్లు కొల్లగొడుతున్న రోజులివి. కంప్యూటర్ యుగంలో రోజుకో సమస్య తెరపైకి వస్తోంది. అలాంటప్పుడు కేవలం సాంకేతికతపై ఆధారపడటం సరికాదేమో. టెక్నాలజీని అనుసరించడం అనివార్యమే అయినప్పటికీ లక్షల మంది జీవితాలతో ముడివడిన ఇలాంటి పరీక్షలపట్ల అప్రమత్తత అవసరం. మానవసహితమైన భద్రత కే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదనేది నా అనుభవం. అప్పట్లో ఏం చేశామంటే.. నేను ఆరేళ్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశాను. నా హయాంలో ఏనాడూ పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోలేదు. అప్పట్లో మేం అనుసరించిన విధానాలు వేరు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలాంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో అనుసరించిన విధానాలు లీక్‌లకు ఆస్కారం లేకుండా చేశాయి. ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు ఎగ్జామినర్లను పిలిచేవాళ్లం. వారిని పూర్తి భద్రత ఉన్న హాలులోకి పంపే ముందే సమగ్రంగా పరీక్షించే ఏర్పాట్లు ఉండేవి. వాళ్ల వద్ద పెన్ను, పెన్సిల్ ఆఖరుకు చిన్న కాగితం ముక్క కూడా లేకుండా జాగ్రత్త పడేవాళ్లం. వారు బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు ఉండేవి. ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశాలనేవీ వారు రాసుకొని వెళ్లేందుకు వీల్లేకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొనేవాళ్లం. ప్రశ్నపత్రం చైర్మన్‌కు కూడా తెలిసేది కాదు... ఒక్కో సబ్జెక్ట్ నిపుణుడు ఒక్కో పేపర్‌ను సెట్ చేశాక దాన్ని సీల్డ్ కవర్లో కమిషన్ సెక్రటరీకి అందజేస్తారు. సెక్రటరీ తనకు అందిన ఐదు పేపర్లనూ కమిషన్ చైర్మన్ ముందు పెట్టేవారు. అందులోంచి ఒక పేపర్‌ను చైర్మన్ ఎంపిక చేశాక నేరుగా ప్రింటింగ్ కేంద్రానికి తరలేది. ఇక్కడ కమిషన్ చైర్మన్ లేదా సెక్రటరీ ప్రశ్నపత్రాన్ని చూసే అవకాశం లేదు. అలాగే ఎంపిక చేసిన పేపర్ ఏమిటనేది దాన్ని సెట్ చేయడానికి వచ్చిన ఐదుగురికి తెలిసే అవకాశమే ఉండదు. ప్రింటింగ్ కేంద్రం నిర్వాహకులకు మాత్రమే ఈ పేపర్ ఏమిటనేది తెలిసే అవకాశం ఉంటుంది. పేపర్ లీక్ అయితే కేవలం ప్రింటర్‌ను మాత్రమే బాధ్యుడిని చేసేలా అప్పట్లో నిబంధనలుండేవి. ఒకవేళ పేపర్ లీక్ అయితే ప్రింటర్‌కు భారీ జరిమానా విధించేలా నిబంధనలు తెచ్చాం. పేపర్ లీక్ అయితే ప్రింటర్ ఆస్తులన్నీ జరిమానా కింద పోయేంత ప్రమాదం ఉండేది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి రిస్‌్కను ప్రింటర్ తీసుకొనే అవకాశం ఉండేది కాదు. ఈ విధానాన్ని అనుసరించడం వల్లే అప్పట్లో పేపర్ లీకేజీలు ఉండేవి కావు. భద్రత ఎంత వరకూ? పేపర్ల లీకేజీపై పత్రికల్లో వస్తున్న కథనాలనుబట్టి ఒక వ్యక్తి పాస్వర్డ్ తీసుకొని ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడున్న టెక్నాలజీపై అనేక అనుమానాలు రావడం సహజమే. ఇది ఎంతవరకు భద్రత ఇస్తుందనేది ఇందులో ప్రధానాంశం. తాత్కాలిక ఉద్యోగులు ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే వాదన అర్థరహితం. ఇప్పుడే కాదు... అప్పట్లోనూ తాత్కాలిక ఉద్యోగులు ఉండేవారు. కేవలం కమిషన్ నిర్వహణలో విశ్వసనీయతే ఇక్కడ ప్రధానం. ఏ వ్యక్తీ ప్రశ్నపత్రం చూసే అవకాశం లేకుండా చేయడమే ఇక్కడ ముఖ్యం. మళ్లీ పరీక్ష అనివార్యమే.. పేపర్ లీకేజీ వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించడం అనివార్యమే. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి వర్గాల మనో వేదన వర్ణనాతీతం. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్న వాళ్లున్నారు. ఎన్నో ఆశలతో ఇదే జీవితమని భావించి చదివిన వాళ్లూ ఉన్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే వారికి సమస్యే. కోచింగ్ కోసం మళ్లీ అప్పులపాలవ్వాల్సిన పరిస్థితి వారికి ఉండొచ్చు. ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు. పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వారి ఆవేదనకు కమిషన్ కారణం కాకుండా చూడొచ్చు. -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
Aston University: వైరస్‌కు ప్రతి సృష్టి!
లండన్: మానవ చరిత్రలో తొలిసారిగా వైరస్‌కు కంప్యూటర్ సాయంతో యథాతథంగా ప్రతి సృష్టి చేశారు! గతంలోనూ ఇలాంటివి జరిగినా జీవపరంగా, 3డి నిర్మాణపరంగా, జన్యుపరంగా ఓ వైరస్‌ను అచ్చుగుద్దినట్టుగా పునర్నిర్మించడం ఇదే తొలిసారట! బ్రిటన్‌లోని ఆస్టన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ద్మిత్రీ నెరుక్ ఈ ఘనత సాధించారు! అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు వాడినా కూడా ఈ పరిశోధనకు ఏకంగా మూడేళ్లు పట్టిందట! ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్ నిర్మాణాలను క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ, కంప్యుటేషనల్ మోడలింగ్ సాయంతో పరిశీలించారు. ‘‘ఇంతకాలం పాటు వైరస్ల పూర్తి జన్యు నిర్మాణక్రమం అందుబాటులో లేని కారణంగా వాటి తాలూకు జీవక్రియలపై మనకు సంపూర్ణ అవగాహన లేదు. తాజా అధ్యయనం ఈ విషయంలో దారి చూపగలదు’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘అంతేగాక ఈ పరిశోధన వల్ల యాంటీబయాటిక్స్‌కు మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాల దిశగా కొత్త దారి దొరుకుతుంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా సమస్యకూ పరిష్కారం లభిస్తుంది’’ అని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫారడే డిస్కషన్స్ జర్నల్‌లో పబ్లిషైంది. -
పీసీ అప్‌గ్రేడ్ కోసం ‘డబ్ల్యూడీ ఎస్ఎన్ 570’
విజయవాడ: నేడు డేటా వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల (పీసీలు) అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న పీసీల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎక్కువ మంది చూస్తున్నారు. ఇటువంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘వెస్టర్న్ డిజిటల్’ సంస్థ.. డబ్ల్యూడీ బ్లూ ఎస్ఎన్ 570 పేరుతో ఎస్ఎస్డీని తీసుకొచ్చింది. ఇది ఎంతో స్లిమ్‌గా చేతిలోనే పట్టే సైజుతో ఉంటుంది. 250జీబీ, 500జీబీ, 1టీబీ, 2టీబీ కెపాసీటీతో వీటిని విడుదల చేసింది. వీటి ధరలు రూ.2,750 నుంచి మొదలై రూ.20,999 వరకు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఐదేళ్ల వారంటీని ఆఫర్ చే స్తోంది. ఈ సంస్థ శాన్డిస్క్, డబ్ల్యూడీ పేరుతో ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటుంది. -
విశాఖ ఐటీ సెజ్‌లో తొలి ఇండియన్ ప్రాసెసర్‌తో కంప్యూటర్ తయారీ
సాక్షి, విశాఖపట్నం : పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తికి నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఎంతో ముఖ్యం. కానీ, వీటిల్లో అశ్లీలతకు ఆస్కారం ఎక్కువ. దీనికి పరిష్కారంగా.. భవిష్యత్‌లో ఎదురయ్యే డిజిటల్ సవాళ్లని ఎదుర్కొనేందుకు విశాఖపట్నం ఐటీ సెజ్ వేదికగా.. మొట్టమొదటి ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఆవిష్కృతమైంది. తొలి భారతీయ ప్రాసెసర్‌తో డిజిటల్ స్కూల్ బ్యాగ్ (డీఎస్బీ) పేరుతో రూపొందించిన సిద్ధి డీసీబీ పీఆర్4ఏ కంప్యూటర్లోని కంటెంట్‌ని 18 భారతీయ భాషల్లోకి అనువదించే సౌలభ్యం ఉంటుంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతమున్న కంప్యూటర్లకు భిన్నంగా కేవలం చదువు కోసం మాత్రమే వినియోగించుకునేలా సరికొత్త డివైజ్‌ని విశాఖకు చెందిన స్టార్టప్ సంస్థ డ్రీమ్‌చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. ఇది కేవలం భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్‌గా చరిత్ర సృష్టించనుంది. అక్షరమాల నుంచి అన్ని రకాల అంశాలనూ ఇందులో చదువుకునేలా తీర్చిదిద్దారు. నూతన విద్యావిధానాలకు అనుగుణంగా.. పిల్లల బరువులో 10 శాతం మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలన్న నిబంధనల మేరకు కేవలం 1.5 కిలోల బరువుతోనే ఈ డిజిటల్ స్కూల్ బ్యాగ్ కంప్యూటర్ని తయారుచేశారు. ఏళ్ల తరబడి ప్రయోగాల తర్వాత.. అనేక ప్రయోగాల తర్వాత డ్రీమ్‌చిప్ డెవలపర్ కంపెనీ ప్రతినిధులు గోపీకుమార్ బులుసు, మురళీమనోహర్, వెంకటేశ్వరరావు చివరికి విజయం సాధించారు. ఎలాంటి అశ్లీలత కంటెంట్‌కు తావులేకుండా కేవలం చదువుకు సంబంధించిన పాఠాలు మాత్రమే ఇందులో ఉండేలా ఈ కంప్యూటర్ని అభివృద్ధి చేశారు. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో పనిచేస్తుంది. బ్లూటూత్, వైఫై సౌకర్యం కూడా ఉంది. దేశంలోనే తొలి సొంత ప్రాసెసర్ వినియోగించిన కంప్యూటర్ ఇది. సొంత ఆపరేటింగ్ సిస్టమ్, కోడ్ లాంగ్వేజ్, ఫీచర్ల పరంగా.. ఇది ప్రస్తుతం ఉన్న ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం ఐదువేల పేజీల్ని ఇందులో నిక్షిప్తం చేసుకునేలా అభివృద్ధి చేశారు. పైగా దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.4 వేలకు ఈ కంప్యూటర్ని విక్రయించాలని డ్రీమ్‌చిప్ నిర్ణయించింది. ఏటా 50 లక్షల యూనిట్లు తయారీ భారతీయ భాషల్లో కంప్యూటర్ను తయారుచేసి.. విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే అందించాలన్న సంకల్పంతో రూపొందించాం. మేకిన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని పూర్తిగా వైజాగ్‌లోనే తయారుచేశాం. ఇందులో 100 మల్టీ సబ్జెక్ట్స్ పాఠాలతో భారత బాలశిక్ష కూడా లోడ్ చేశాం. ఈ కంప్యూటర్లను పెద్దఎత్తున తయారుచేసేందుకు ప్రభుత్వం లేదా ఏదైనా విద్యా సంబంధిత ట్రస్ట్‌తో కలిసి ఏటా 50 లక్షల యూనిట్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నూతన విద్యా విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాం. – గోపీకుమార్ బులుసు, డ్రీమ్ చిప్ చీఫ్ టెక్నాలజిస్ట్ డ్రీమ్‌చిప్ కంప్యూటర్ ప్రత్యేకతలివే.. ఇది తెలుగు భాషతో ప్రారంభమయ్యే కంప్యూటర్. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ భాషలోనే మొదలు పెట్టేలా సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. ఒక పాఠాన్ని తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ చదువుకునే వెసులుబాటు ఇందులో ఉంది. కేవలం కంప్యూటర్‌లా మాత్రమే కాకుండా.. దీన్ని డిజిటల్ స్కూల్ బ్యాగ్‌గా కూడా వినియోగించుకోవచ్చు. దీనికి ఒకవైపు స్క్రీన్, మరోవైపు టెక్ట్ సబుక్ లేదా నోట్‌బుక్ షెల్ఫ్, రైటింగ్ ప్యాడ్ ఉంటుంది. స్క్రీన్ కింద భాగంలో పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే అర కూడా ఉంది. స్క్రీన్ పైభాగంలో రాత్రిపూట చదువుకునేందుకు వీలుగా ఎల్ఈడీ టేబుల్ ల్యాంప్నూ అమర్చారు. -
కాగితం వృథాను అరికట్టే రోలర్జెట్ ప్రింటర్!
కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాక, ప్రింటర్ల వినియోగం కూడా పెరిగింది. ఆఫీసుల్లో వాడే ప్రింటర్ల వల్ల ఎంతో కొంత కాగితం వృథా అవుతుండటం మామూలే. ప్రింటర్ల వల్ల కాగితం వృథాను అరికట్టే ఉద్దేశంతో దక్షిణ కొరియాకు చెందిన డిజైనర్ జిసాన్ చుంగ్ ప్రయోగాత్మకంగా ‘రోలర్జెట్ ప్రింటర్’కు రూపకల్పన చేశాడు. పేపర్షీట్స్ బదులు పేపర్‌రోల్స్ వాడటానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దాడు. ప్రింటింగ్ పూర్తయ్యాక, ప్రింట్ అయినంత మేరకు దీని నుంచి కాగితాన్ని కత్తిరించి తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నమూనాగా రూపొందించిన ఈ ప్రింటర్ పనితీరు బాగున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెద్దస్థాయిలో దీని తయారీ చేపడితే, ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. -
చిచ్చర పిడుగు!...13 ఏళ్ల వయసులో 17 కంప్యూట్ భాషలు...
కొంతమంది పిల్లలు అత్యంత చురుకుగా అతి చిన్న వయసులోనేఅన్ని నేర్చుకుంటారు. జౌరా! అనిపించేలా పెద్దలే ఇబ్బంది పడి నేర్చుకున్న వాటిని సైతం అలవొకగా నేర్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి అతి పిన్న వయసులోనే కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రోగామింగ్ లాంగ్వేజ్‌లను సునాయాసంగా నేర్చకున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?... వివరాల్లోకెళ్తే....తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిప అర్నవ్ శివరామ్ 13 ఏళ్ల వయసులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ చిన్నారి అతి పిన్నవయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు. శివరామ్ 4 వతరగతి చదువుతున్నప్పుడే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. జావా, ఫైథాన్‌తో సహా మొత్తం 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకున్నాడు. అంతేకాదు భారత్‌లో తక్కువ పెట్టుబడితో ఆటో పైలెట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రూపొందించాలని యోచిస్తున్నట్లు శివరామ్ తెలిపాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసిస్తున్నారు. Tamil Nadu | Coimbatore's Arnav Sivram becomes one of the youngest children to have learnt 17 computer languages at the age of 13 I started learning computers when I was in 4th grade. I have learnt 17 programming languages including Java & Python, he said pic.twitter.com/FTehgFHrBt — ANI (@ANI) July 2, 2022 -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్‌తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్‌లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్‌లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్‌లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్‌లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకే పోష్చర్‌లో చాలాసేపు కంప్యూటర్‌పై పనిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవేమో!
కంప్యూటర్‌పై పనిచేస్తుండే సమయంలో కొందరు ఒకే భంగిమ (పోష్చర్)లో చాలాసేపు కూర్చుండిపోతారు. ఏకాగ్రతతో పనిలో మునిగిపోయినందున తమ పోష్చర్ విషయం పట్టించుకోరు. కేవలం కంప్యూటర్ మీద పనిచేసేవారే కాదు... చాలాసేపు కదలకుండా ఉండి పేషెంట్స్‌ను చూసుకునే వైద్యరంగాల్లోని వారికీ (హెల్త్ కేర్ గివర్స్), పోష్చర్ మారకుండా పనిచేసే ఇతర రంగాల్లోని వారికీ... కొద్దిసేపటి తర్వాత మెడ, ఒళ్లునొప్పులు రావడం, ఎంత జాగ్రత్తగాఉన్నా తప్పులు దొర్లడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం ‘స్టాటిక్ లోడింగ్’ అనే పరిస్థితి. నిజానికి ఈ పదం పూర్తిగా వైద్యరంగానిది కాదు. చాలాకాలం పాటు ఒకేచోట ఉండే వస్తువు స్థితిని తెలపడానికి భౌతిక/ఇంజనీరింగ్ శాస్త్రాల్లో ఉన్న పారిభాషిక పదమే... ఆ తర్వాత వైద్యశాస్త్రం వాడుకలోకి వచ్చింది. ఒకే పోష్చర్‌లో చాలాసేపు కూర్చుని / కదలకుండా ఉండటంతో వచ్చే ఈ కండిషన్ చాలా రకాల అనర్థాలకు దారితీస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ వేగం 20 శాతం వరకు తగ్గుతుంది. శ్వాస ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు 30 శాతం వరకు తగ్గుతాయి. అందుకే దేహానికి అవసరమైన ఆక్సిజన్ మోతాదులు సైతం 30 శాతం తగ్గిపోతాయి. ఫలితంగా కణాలన్నింటికీ అవసరమైన ప్రాణవాయువు తగ్గుతుంది. శారీరకంగా ఎలాంటి శ్రమ లేనప్పటికీ... తీవ్రమైన అలసట కలుగుతుంది. చాలాసేపు కంప్యూటర్‌పై టైపింగ్ వల్ల వేళ్ల సమస్యలూ, ఒకే భంగిమలో సుదీర్ఘకాలం కూర్చోవడంతో కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇటు కంప్యూటర్‌పై పనిచేసేవారూ లేదా ఇతరత్రా పనుల్లో చాలాసేపు ఒకే పోష్చర్‌లో ఉండేవారు.... కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచినిలబడి, కాసేపు అటు ఇటు తిరగాలి. కంప్యూటర్ స్క్రీన్‌ను అదేపనిగా రెప్పవాల్చకుండా చూడకూడదు. ఇది కంటికి శ్రమ కలిగించడం, కనురెప్పలు కొట్టకపోవడం (బ్లింక్ చేయకపోవడం)తో లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి స్రవించే కన్నీరు కంటిపై సమంగా విస్తరించదు. దాంతో కన్నుపొడిబారడం, కన్ను అలసటకు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి గంట తర్వాత కనీసం 10 నిమిషాల బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఒకేచోట కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉండేవారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు కనురెప్పలు తరచూ మూస్తుండాలి. దాంతో ‘స్టాటిక్ లోడింగ్’ అనర్థాలను చాలావరకు నివారించవచ్చు. చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా? -
వెన్నుముక మార్పిడి... వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..
Paralysed Man Walks Again: ఇంతవరకు పంది గుండె, కిడ్ని వంటివి మానవుడికి అమర్చడం వంటి సరికొత్త వైద్యా విధానాలను గురించి తెలుసుకున్నాం. పైగా అవయవాల కొరతను నివారించే ప్రక్రియలో భాగంగా జరిగిన సరికొత్త వైద్యా విధానాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇంతవరకు మనం వెన్నముక ఇంప్లాంటేషన్(మార్పిడి) గురించి వినలేదు. వెన్నముకకి గాయాలై శరీరం చచ్చుబడి పోయి మంచానికి పరిమితమైన వారికి ఈ ఇంప్లాంటేషన్ వరం. అసలు విషయంలోకెళ్తే...వెన్నముకకు గాయాలవ్వడంతో మంచానికి పరిమితమైన వాళ్లు మళ్లీ తాము జీవితంలో లేచి నిలబడలేమని నిరాశ నిస్ప్రహలకి లోనవ్వాల్సిన అవసరంలేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక సాయంతో రోగులు నిలబడటమే కాక వ్యాయమాలు కూడా చేయగలరని అంటున్నారు. వెన్నుమక గాయం కారణంగా కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన వాళ్లు సైతం లేచి నిలబడగలరిని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. 2017లో మిచెల్ రోకాటి మోటర్‌బైక్ ప్రమాదంలో వెన్నముకకు అయిన గాయం కారణంగా దిగువ శరీర భాగం చచ్చుబడిపోయింది. అయితే రోకాటి ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నుముక ఇంప్లాంటేషన్‌తో అడుగులు వేయగలిగారని నేచర్ మెడిసిన్ జర్నల్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ముగ్గరు రోగులు ఈ ఎక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక ఇంప్లాంటేషన్ సాయంతో తమ శరీరాన్ని కదిలించగలిగారని తెలిపారు. ఆరు సెంటీమీటర్ల ఇంప్లాంట్‌ను చొప్పించి, పల్స్‌ను చక్కగా ట్యూన్ చేసిన కొద్దిసేపటికే ముగ్గురులో కదిలికలను గుర్తించాం అని అన్నారు. ఈ ఎలక్ట్రోడ్లు ఇంతకుముందు అమర్చిన వాటి కంటే పొడవుగా, పెద్దవిగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాలను యాక్సెస్ చేయగలవని జపాన్ లాసాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్ జోసెలిన్ బ్లాచ్ చెప్పారు. అంతేకాదు ప్రారంభ దశలో కదిలించటానికి తమ ముందు శరీర భాగాంలో కొంత బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగి ప్రాక్టీస్ చేయడం ద్వారా నిలబడటం, నడవటం వంటివి చేయగలుగుతారన్నారు. అంతేకాదు దాదాపు కిలోమీటర్ దూరం వరకు నడవగలుగుతారని చెప్పారు. పక్షవాతాన్ని పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ పల్స్‌లను ఉపయోగించాలనే ఆలోచన నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే సాంకేతికత నుండి ఉద్భవించిందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ పల్స్ కంప్యూటర్ ద్వారా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని రోజు రోగి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ఈ ఎలక్ట్రిక్ పోల్స్‌ని యాక్టివేట్ చేయకుండా కూడా అవయవాలను కదిలించగలిగారని కానీ పూర్తిగా మాత్రం సాధ్యం కాదని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ యూరప్‌లో సుమారు 50 నుంచి100 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఈ కంప్యూటర్ ధర కేవలం రూ. 1000 మాత్రమే..!
సాధారణంగా ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ధర ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం..? సుమారు రూ. 15 వేల నుంచి 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది. సదరు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కాన్ఫీగరేషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా బ్రియాన్ బెంచాఫ్ అనే ఒక డెవలపర్ కేవలం 15 డాలర్లకే(సుమారు రూ. 1000) (Minimum Viable Computer) కంప్యూటర్ను తయారు చేసి అందరితో ఔరా..! అన్పిస్తున్నాడు...అసలు ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది..ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..! స్మార్ట్‌ఫోన్ సైజులో..! బ్రియాన్ తయారుచేసిన మినీ పాకెట్ సైజ్ కంప్యూటర్ ఇంచుమించు స్మార్ట్‌ఫోన్ సైజులో ఉంటుంది. ఇది ఒక Linux ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలోని ఆల్విన్నర్ F1C100s సిస్టమ్-ఆన్-ఎ-చిప్‌తో అనుసంధానించబడిన సాధారణ రెండు-పొరల పవర్ కంట్రోల్ బోర్డ్‌ను (పీసీబీ)ను ఉపయోగించారు. అంతేకాకుండా సింగిల్ CPU కోర్ కేవలం 533MHz వద్ద క్లాక్ చేయబడింది. విశేషమేమిటంటే Linux కు చెందిన ఆధునిక సంస్కరణలను అమలు చేయడానికి మద్దతును కలిగి ఉంది. ఇది స్క్రిప్ట్‌లను, పింగ్ రిమోట్ సర్వర్లను అమలు చేయగలదు. వివిధ రకాల USB పరికరాలతో ఆపరేట్ చేయవచ్చును. ఫీచర్స్‌లో కంప్యూటర్స్‌తో సమానంగా..! బ్రియాన్ తయారుచేసిన ఈ లైనక్స్ కంప్యూటర్లో సాధారణ కంప్యూటర్లో ఉండే ఫీచర్స్ అన్ని ఉన్నాయి. 2.3-అంగుళాల డిస్ప్లేతో స్ప్లిట్ ఐదు-వరుసల ఆర్తోగోనల్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ కంప్యూటర్ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్‌ను కలిగి ఉంది అంతేకాకుండా ఇది టచ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీనిలో AAA NiMH సెల్‌ను అమర్చాడు. ఇతర పెరిఫెరల్స్ కోసం ప్రామాణిక USB-A పోర్ట్ ఉంది. Wi-Fi అడాప్టర్, కీబోర్డ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కోసం యుటిలిటీ మద్దతు ఇచ్చే ఏదైనా ప్లగ్ ఇన్ చేయవచ్చు. అయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్‌ను ఉపయోగించాలి. ఈ కంప్యూటర్ను తయారుచేయడానికి బ్రియాన్ కేవలం 14.16 డాలర్లను మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ప్రాజెక్టును రియాలిటీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇతరుల సహాయంతో దీనిని మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని బ్రియాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. I designed the 'minimum viable computer', a full Linux computer that fits in your pocket. It costs $15.https://t.co/P7F3Re1mGw If you'd like to see more of this, please like, retweet, and share the above link in whatever forum or aggregator you frequent. pic.twitter.com/XzBSULz3El — VT-69 (@ViolenceWorks) January 26, 2022 చదవండి: మాస్కున్న ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..! -
దేశమే ఆయన కార్యక్షేత్రం
వైజ్ఞానికరంగంలో ఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ రాధాకృష్ణ (ఆర్కే) 80 ఏళ్ళ వయసులో జనవరి 21న హైదరాబాదులో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఉత్తీర్ణులైన తొలితరం విద్యార్థుల్లో ఆయన ఒకరు. బీఏఆర్సీ (బార్క్)లో పరిశోధనలు చేస్తున్న క్రమంలో 1970కి ముందే కంప్యూటర్ రంగంలో ప్రవేశించారు. కశ్మీర్, శ్రీనగర్, చండీగఢ్‌లలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లలో ప్రొఫెసర్‌గా పనిచేసారు. అలహాబాద్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి 20 మంది దాకా నోబెల్ బహుమతి గ్రహీతలను ఆహ్వా నించి ‘సైన్సు సదస్సు’లను ఏడెని మిదేళ్ల పాటు నిర్వహించిన బృందంలో ఆర్కే కీలక పాత్ర వహించారు. ఆ నోబెల్ సైంటిస్టులు వారం రోజులపాటు క్యాంపస్ లోనే ఉండి ఉపన్యాసాలు, చర్చల్లో పాల్గొనే వారు. దేశ మంతటి నుంచీ సైన్సులో బోధన – పరిశోధనల పట్ల అసక్తి కల వెయ్యిమంది విద్యార్థులు, టీచర్లు ఆహ్వానితులుగా ఆ వారం రోజులూ అక్కడే ఉండే వీలు కల్పిం చిన విశిష్ట కార్యక్రమం అది. అందులో 200 మంది స్కూల్ ఫైనల్ స్థాయి విద్యార్థులూ ఉండే వారు. ఈ కార్యక్రమ ప్రధాన రూపకర్త ఆర్కే. ఆయన దేశభక్తి కేవలం నినాదప్రాయం కాదు. ప్రొఫెసర్‌గా ఎందరో విద్యార్థులను సైంటిస్టులుగా తయారుచేసి దేశానికి అందించిన ఆచరణశీలి ఆయన. సైన్సు విద్యను ప్రోత్సహించటానికి జీవితాన్ని అంకితం చేశారు. దశాబ్దాల క్రితమే ఎమ్ఐటీ (అమెరికా)లో ఆయన చేసిన కృషి ప్రశంసలందుకున్నది. 70 దేశాల ఉన్నత విద్యాలయాల్లో సైన్సు కార్యక్రమాల నిర్వహణలో పని చేసిన రాధాకృష్ణ ప్రధాన కార్య క్షేత్రం మాత్రం మన దేశమే. ఆయా దేశాల్లో 16 అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులు నిర్వహిం చినా, విదేశాల్లో పని చేయటానికి ఆయన ఇష్టపడలేదు. దేశంలోని ఎంటెక్, పిహెచ్డీ వంటి కోర్సులకు, ట్రిపుల్ ఐటీ స్థాయి విద్యాసంస్థలకు కావల్సిన పాఠ్యాంశాలను రూపొందించటం; రక్షణ శాఖలో, విద్యారంగంలో సాంకేతిక సలహా దారుగా పని చేయడం, విద్యా వాతావర ణాన్ని, శాస్త్రీయ çస్పృహను పెంపొందిం చడం వంటి ఎన్నో రకాలుగా దేశానికి విశిష్ట సేవలను అందించారు. – మరింగంటి శ్రీరామ, రిటైర్డ్ సీజీఎం, సింగరేణి ‘ 94922 05310 -
అద్భుతం.. మైండ్‌తో ట్వీట్ చేసిన తొలి వ్యక్తి
Paralysed man becomes worlds first person: పక్షవాతం గురించి మనందరికి తెలిసిందే. శరీరంలో ఏ భాగానికి పక్షవాతం వస్తుందో ఆయా భాగాలు చచ్చుబడిపోవడమే కాకుండా కదిలించలేరు. ఒక్కొసారి ఆ పరిస్థితి చాలా దయనీయంగా కూడా ఉంటుంది. అయితే పక్షవాతంతో శరీరం అంతా చ్చుబడిపోయి కదలకుండా ఉన్నవ్యక్తి తన మనసుతో ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఎలా ట్విట్ చేశాడని ఆలోచించేయకండి.! (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ ఓకీఫ్ వేళ్లతో కాకుండా మొదడును మాత్రమే ఉపయోగించి ట్వీట్ చేశాడు. అంటే అతను మెదడు కంప్యూటర్‌కి కనక్ట్ అవ్వడంతో తన ఆలోచనలకు అనుగుణంగా సందేశం కంప్యూటర్లో టైప్ అవుతుంది. నిజానికి ఫిలిప్ 2015 నుండి అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్)తో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితి కారణంగా అతను శరీరం అంతా పక్షవాతానికి గురై కదలకుండ చచ్చుబడిపోయింది. అయితే కాలిఫోర్నియాకు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ ఇలాంటి వ్యక్తులు తమ మనసుతో కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగేలా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ 62 ఏళ్ల ఫిలిప్ మొదడుని కంప్యూటర్‌కి అనుసంధినిస్తూ పేపర్క్లిప్ పరిమాణంలో ఉండే సింక్రోన్ స్టెంట్రోడ్ అనే మైక్రోచిప్‌ని అమర్చింది. దీంతో అతని మెదడుకు సంకేతాలను అందజేసే చిన్నమొదడు ఆలోచనలను ఈ ఇంప్లాంట్ మైక్రోచిప్ చదివి టెక్స్ట్(సందేశంగా) రూపొందిస్తుంది లేదా అనువదిస్తుంది. అయితే ఫిలిప్‌కి ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ సాంకేతికతో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా ఫిలిప్ 'హలో వరల్డ్' అనే సందేశాన్ని ట్విట్ చేశాడు. ఈ ట్విట్ కారణంగా ఫిలిప్ ప్రపంచంలోనే ఆలోచన ద్వారా నేరుగా సోషల్ మీడియా సందేశాన్ని విజయవంతంగా పోస్ట్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అంతేకాదు ఇది మొదటి ప్రత్యక్ష-ఆలోచన ట్వీట్‌గా కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో ఫిలిప్ మాట్లాడుతూ..." ఈ సాంకేతికత గురించి మొదటిసారిగా విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అంతేకాదు ఈ సాంకేతికతను వినియోగించాలంటే కొంత సాధన కూడా అవసరం. ఇక ఇప్పుడు నేను కంప్యూటర్లో ఎక్కడ క్లిక్ చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అంతేకాదు ఈమెయిల్, షాపింగ్, బ్యాంకింగ్ వంటి పనుల్ని కంప్యూటర్లో చేయగలను " అని అన్నారు. (చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి)