
వైజ్ఞానికరంగంలో ఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ రాధాకృష్ణ (ఆర్కే) 80 ఏళ్ళ వయసులో జనవరి 21న హైదరాబాదులో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఉత్తీర్ణులైన తొలితరం విద్యార్థుల్లో ఆయన ఒకరు. బీఏఆర్‌సీ (బార్క్)లో పరిశోధనలు చేస్తున్న క్రమంలో 1970కి ముందే కంప్యూటర్ రంగంలో ప్రవేశించారు. కశ్మీర్, శ్రీనగర్, చండీగఢ్‌లలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లలో ప్రొఫెసర్‌గా పనిచేసారు.
అలహాబాద్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి 20 మంది దాకా నోబెల్ బహుమతి గ్రహీతలను ఆహ్వా నించి ‘సైన్సు సదస్సు’లను ఏడెని మిదేళ్ల పాటు నిర్వహించిన బృందంలో ఆర్కే కీలక పాత్ర వహించారు. ఆ నోబెల్ సైంటిస్టులు వారం రోజులపాటు క్యాంపస్ లోనే ఉండి ఉపన్యాసాలు, చర్చల్లో పాల్గొనే వారు. దేశ మంతటి నుంచీ సైన్సులో బోధన – పరిశోధనల పట్ల అసక్తి కల వెయ్యిమంది విద్యార్థులు, టీచర్లు ఆహ్వానితులుగా ఆ వారం రోజులూ అక్కడే ఉండే వీలు కల్పిం చిన విశిష్ట కార్యక్రమం అది. అందులో 200 మంది స్కూల్ ఫైనల్ స్థాయి విద్యార్థులూ ఉండే వారు. ఈ కార్యక్రమ ప్రధాన రూపకర్త ఆర్కే.
ఆయన దేశభక్తి కేవలం నినాదప్రాయం కాదు. ప్రొఫెసర్‌గా ఎందరో విద్యార్థులను సైంటిస్టులుగా తయారుచేసి దేశానికి అందించిన ఆచరణశీలి ఆయన. సైన్సు విద్యను ప్రోత్సహించటానికి జీవితాన్ని అంకితం చేశారు. దశాబ్దాల క్రితమే ఎమ్‌ఐటీ (అమెరికా)లో ఆయన చేసిన కృషి ప్రశంసలందుకున్నది. 70 దేశాల ఉన్నత విద్యాలయాల్లో సైన్సు కార్యక్రమాల నిర్వహణలో పని చేసిన రాధాకృష్ణ ప్రధాన కార్య క్షేత్రం మాత్రం మన దేశమే. ఆయా దేశాల్లో 16 అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులు నిర్వహిం చినా, విదేశాల్లో పని చేయటానికి ఆయన ఇష్టపడలేదు. దేశంలోని ఎంటెక్, పిహెచ్‌డీ వంటి కోర్సులకు, ట్రిపుల్ ఐటీ స్థాయి విద్యాసంస్థలకు కావల్సిన పాఠ్యాంశాలను రూపొందించటం; రక్షణ శాఖలో, విద్యారంగంలో సాంకేతిక సలహా దారుగా పని చేయడం, విద్యా వాతావర ణాన్ని, శాస్త్రీయ çస్పృహను పెంపొందిం చడం వంటి ఎన్నో రకాలుగా దేశానికి విశిష్ట సేవలను అందించారు.
– మరింగంటి శ్రీరామ, రిటైర్డ్ సీజీఎం, సింగరేణి ‘ 94922 05310
Comments
Please login to add a commentAdd a comment