ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్తల్లో పద్మవిభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ ఒకరు. కలకత్తాలో 1894 జనవరి 1న జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. ప్రాథమిక కణాల (దైవకణాల)పై ఐన్‌స్టీన్‌తో కలిసి సమర్పించిన అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ‘బోస్–ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్’గా పరిగణిస్తున్నారు.
బోస్ సంప్రదాయ భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ఒకేలా ఉండే కణాలతో గణన స్థితుల అద్భుతమైన మార్గం ద్వారా ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమాన్ని ఉత్పాదించి ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. దానిని నేరుగా జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆ పరిశోధనా పత్రం ప్రాముఖ్యాన్ని గుర్తించి, దానిని జర్మన్ భాషలోకి అనువదించారు. దానిని బోస్ తరపున ప్రతిష్ఠాత్మక ‘జీట్స్‌క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్’కు సమర్పించారు. ఈ గుర్తింపు ఫలితంగా, బోస్ యూరోపియన్ ఎక్స్–రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలల్లో రెండు సంవత్సరాలు పని చేయగలిగారు. ఈ సమయంలో అతను లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ, ఐన్‌స్టీన్‌లతో కలిసి పనిచేశారు. వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవల జ్ఞాపకార్థం, కణ భౌతిక శాస్త్రంలో ప్రాథమిక ఉప పరమాణు కణాలలోని ఒక కణానికి ‘బోసాన్స్’ అని ఆయన పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు.
బోస్–ఐన్‌స్టీన్ కండెన్సేట్ (బీఈసీ) అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే పదార్థ స్థితి. ఆయన పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారితీశాయి. మెరుగైన కచ్చితత్వం, స్థిరత్వంతో అత్యంతపొందికైన లేజర్‌లను సృష్టించడానికి బీఈసీలను ఉపయోగించవచ్చు. సూపర్ కండక్టివిటీని అధ్యయనం చేయడంలో సహాయపడతాయి. క్వాంటం కంప్యూటర్ల ప్రాథమిక యూనిట్లు అయిన క్వాంటం బిట్‌లనుసృష్టించడానికి ఉపయోగించవచ్చు. గురుత్వాకర్షణ, భ్రమణం,ఇతర భౌతిక పరిమాణాలను కొలవడానికి అత్యంత సున్నితమైన సెన్సార్‌లను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.అపూర్వమైన కచ్చితత్వంతో అణు గడియారాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఇది జీపీ, ఇతర నావిగేషన్ వ్యవస్థలను మెరుగుపరు స్తుంది. డీఎన్‌ఏ వంటి జీవసంబంధమైన అణువుల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఉన్నమందులు, చికిత్సల అభివృద్ధికి దారితీశాయి. ఆయన రూపొందించిన బోస్– ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ , బోస్– ఐన్‌స్టీన్ కండన్సేట్ విషయాలపై పరిశోధనలు చేసినవారికి ఏడు నోబెల్ బహుమతులు రావడం విశేషం.
– మడక మధు ఉపాధ్యాయుడు, మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
(నేడు సత్యేంద్రనాథ్ బోస్ వర్ధంతి)
ఇదీ చదవండి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
Comments
Please login to add a commentAdd a comment