Radhakrishna
-
నేరుగా ఓటీటీకి వస్తోన్న లవ్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఇటీవల ఓటీటీలు అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాయి. చిన్న సినిమాలైనా సరే కథ, కథనం బాగుంటే చాలు. ఇలాంటి సినిమాలే ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. కొన్ని చిన్న చిత్రాలైతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ అలా విడుదలయ్యే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మరింత ఊపందుకుంటోంది.తాజాగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీలోనే విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 35 చిన్న కథ కాదు హీరో విశ్వదేవ్ నటించిన లేటేస్ట్ మూవీ నీలి మేఘ శ్యామ. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా కనిపించనుంది. రవి ఎస్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి అర్జున్-కార్తిక్ కథను అందించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. గతంలోనే అనౌన్స్ ఓటీటీకి వస్తుందని ప్రకటించిన చిత్రబృందం.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆహాలో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మొదట థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నించినా.. తర్వాత నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల 35 చిన్న కథ కాదు మూవీతో మెప్పించిన విశ్వదేవ్ రాచకొండ ఇటీవల విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. -
బోట్ల పేరుతో బాబు క్షుద్ర రాజకీయం..
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్,చంద్రబాబు ఇల్లు కోసం ప్రజల ప్రాణాలతో చలగాటాలా..
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏపీకి చేసిన నష్టం రూ.2500 కోట్లు..
-
వివేకా హత్య కేసుపై కథనాలు ఎలా ప్రచురిస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా, ఆ కేసు గురించిన కథనాలు ఎలా ప్రచురిస్తారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది. కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి, తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను, కేసును ప్రభావితం చేస్తున్నారని తీవ్రంగా మండిపడింది. ఘటన జరిగినట్లు రాస్తే సరిపోతుందని, దానికి కారకులు, ఎవరిది తప్పు వంటి వివరాలేవీ ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవన్నీ చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని, దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటివరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయవచ్చని తెలిపింది.దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ ఆరు వారాల పాటు నిలిపివేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనంవివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ఓ వ్యక్తిని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు కోర్టు వారిద్దరినీ వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. ఈ కేసును కొట్టేయాలని, తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ రాధాకృష్ణ, శ్రీనివాస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రజ్యోతి కథనం గురించి, ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారో వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా కథనాలు ప్రచురిస్తారని, ట్రయల్ కూడా నిర్వహించి తీర్పులిచ్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా.. ‘ఘటన అంటే ఏమిటి? ఓ వ్యక్తి గాయపడితే గాయపడ్డాడు అని రాయాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని ఎవరు గాయపరిచారు, దాని వెనుక ఎవరున్నారు, అంతిమంగా తప్పు ఎవరిది వంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు. దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలే’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధితునిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ కేసు చెల్లదన్నారు. ఇది కేకే మిశ్రా కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
TG: గవర్నర్‌కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. శనివారం ఉదయం రాజ్‌భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఆహ్వానం గవర్నర్‌కు అందించారు. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.సోనియా రాక అనుమానమే!ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్‌రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈలోపు రేపటి వేడుకల కార్యక్రమాల్లోనూ ఆమె ఐదు నిమిషాలు ప్రసంగిస్తారని ఉంది. దీంతో ఆమె రాక ఖరారైందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం.. పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే సోనియా కార్యాలయం తెలంగాణ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
కేసీఆర్‌పై ఏబీఎన్ తప్పుడు కథనాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యక్తిత్వాన్ని దిగ జార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర జ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై కూడా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీసు స్టేషన్లో, ఇతర చానళ్లపై బంజా రాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనల్లో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్‌లు, వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ‘మార్గదర్శి మా నాన్న.. మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు’ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్న ట్లు ఈడీ తేల్చిందంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసిందని వివరించారు.ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, ఫిర్యాదును పెన్‌డ్రైవ్ ద్వారా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన వార్త పూర్తి సారాంశాన్ని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసే సమ యంలో కేసీఆర్, కవిత ఫొటోలతో పాటు ఈడీ, మద్యం సీసాల క్లిప్పింగులను జత చేశారని తెలి పారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్‌రావు.. కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపై ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నింది తుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత, కేసీఆర్‌కు ఆపాదిస్తూ ఏబీఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు.కేసీఆర్, కవిత, బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. న్యాయవిచారణ అంశాల ను కూడా ఏబీఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యా నాలతో తప్పుదోవ పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశా రని పేర్కొన్నారు. దీంతో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరక్టర్ భానుకృష్ణ, ఈడీ పి.వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణ కు మార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్‌తో పాటు మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.కేసీఆర్ ఇమేజీని దెబ్బ తీసేందుకే..వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ స్థాయి, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆయన తెలంగాణ భవన్లో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీ 6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ టీవీ, బీఆర్కే, డైలీ న్యూస్, జర్నలిస్టు సాయి చాన ల్, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్, ఆర్ టీవీ, రాజ్‌న్యూస్, రెడ్ టీవీ, వైల్డ్ ఓల్ప్.. తది తర 16 టీవీ, యూ ట్యూబ్ చానళ్లపై పోలీసు లకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. తప్పుడు వార్తలు, కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీఆర్ఎస్ రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నె గోవర్దన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు. -
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్‌గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్‌ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్ ఛానల్లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్‌ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్‌కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఫ్లాష్‌బ్యాక్.. నీచంగా మాట్లాడింది గుర్తుందా?
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారిని ముప్ప తిప్పలు పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, సీఎంగా ఉన్న చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి అప్పట్లో లీకైంది. ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాధాకృష్ణ బూతు పురాణం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. చంద్రబాబు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. లీకైన వీడియోలో వారి సంభాషణ ఇలా.. చంద్రబాబు : ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ... రాధాకృష్ణ : ఏంది? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇది అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా.. జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దే వద్దు. తీసేయండి. చంద్రబాబు : అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం. బాబు : కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం.. ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు (హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటప్పుడు) పది వేలిచ్చాను. ఆ తర్వాత అంతెందుకులే అనుకుని రూ.5 వేలిచ్చా. ఆ తర్వాత దాన్ని రూ.2,000 వేలకు తగ్గించా. ఇలా ఇచ్చింది 1,300 మందికే. నేనేమంటానంటే నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. రాధాకృష్ణ: ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే.. చంద్రబాబు: రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తాను.. ఎంత మందికి అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు అట్లా చేయాలి. -
Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్‌సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్‌కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్ జాదవ్ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్‌లోని చించోలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. -
మోదీ మాస్టర్ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
-
Pawan Kalyan: రాజకీయ అజ్ఞాని అని ఒప్పుకున్నట్లేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చినట్లు! ఆయన ఏమి సాధించినట్లు! ఆయన ఏమి మాట్లాడుతున్నట్లు! ఎవరి కోసం ఆయన పని చేస్తున్నట్లు! ఎవరో ఒకరిని ద్వేషించడానికి అయితే రాజకీయాలలోకి రావడం వల్ల ఉపయోగం ఉండదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయడానికి రాజకీయాలలోకి రావాలని అనుకుంటారు. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, వేరే పార్టీ నేత కోసం నిత్యం పరితపించే వ్యక్తిగా పవన్ దేశంలోనే ఒక రికార్డు సాదించినట్లు అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ తీరుతెన్నులు చూశాక ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్ అవసరం ఎంత మాత్రం లేదనిపిస్తుంది. ఆయనకు ఒక సిద్దాంతం లేదని, పద్దతి పాడు లేదని అడుగడుగున అందరికి తెలిసిపోతుంది. అందుకే ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నారని భావించాలి.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయనకు ద్వేషం ఉండవచ్చు. ఆయనను అర్జంట్‌గా పదవి నుంచి దించేయాలన్నంత కోపం ఉండవచ్చు. అందుకోసం ఆయన ప్రయత్నిస్తే తప్పేమీ కాదు. కానీ జగన్‌ను అసలు ఎందుకు పదవి నుంచి దించాలన్నదానిపై ఆయనకు ఒక స్పష్టత ఉండాలి కదా! తనపార్టీని తానే నాశనం చేసుకుని, తన పార్టీవారిని తానే అవమానించి బయటకు వెళ్లగొడుతున్న అరుదైన రికార్డు ఉన్న పవన్ కల్యాణ్‌కు ఏవిషయంలోను స్పష్టత ఉండదు. అలాంటప్పుడు జగన్ విషయంలో ఏమి క్లారిటీ ఉంటుంది! జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయనకు వ్యతిరేకత ఉందా? వలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవి నచ్చలేదా! ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రత్యేక నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తేవడం పవన్‌కు ఇష్టం లేదా? జగన్ విధానాలు నచ్చకపోతే ఫలానాది బాగాలేదు.. తాము దానికి ప్రత్యామ్నాయం ఇది సూచిస్తున్నానని చెప్పవచ్చు.కానీ అలా ఎన్నడైనా చేశారా! సముద్ర తీరంలో జగన్ నిర్మిస్తున్న ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యుత్, తదితరరంగాలలో కొత్తగా తెస్తున్న పరిశ్రమలు ఇష్టం లేదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారికి వీటిని అడ్డుకోవడం ద్వారా ఒక లాభాన్ని ఆశిస్తున్నారు. వాటిపై దుష్ప్రచారం చేయడం ద్వారా తమకు రాజకీయ లబ్ది కలగాలని వారు కోరుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వాన్ని నడపవచ్చన్నది రామోజీ, రాధాకృష్ణల కుట్ర. కానీ, అందులో పవన్ కల్యాణ్‌కు అసలు పాత్రే ఇవ్వరు కదా. మహా ఇస్తే ఒక ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు తప్ప ఇంకొకటి కాదని అంతా భావిస్తారు. ఈ మాత్రం దానికి పవన్ కల్యాణ్ తన ప్రతిష్టను అంతా పణంగా పెట్టి తన పార్టీని తాకట్టు పెట్టి. తనవారందరిని నట్టేట ముంచి చంద్రబాబు పాదాల వద్ద రాజకీయ బానిసత్వం చేయడం దేనికో ఆయన అభిమానులకు కూడా అంతు పట్టదు.ఈ మద్యకాలంలో పార్టీ నుంచి బయటకు వస్తున్న అనేక మందినేతలు ఎలా వాపోతున్నారో కనబడుతూనే ఉంది కదా! శాసనసభ ఎన్నికలలో పార్టీ తరపున పోటీచేసే అవకాశం వస్తుందని నమ్మిన పలువురు నేతలు కోట్లు ఖర్చు పెట్టారట. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారిని తూర్పు తిరిగి దండం పెట్టుకోండని చెప్పి, ఆయన మాత్రం పడమర వైపు తిరిగి చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. తత్పలితంగా పార్టీని కేవలం పది, పరకా సీట్లకే పరిమితం చేశారు. మిగిలిన చోట్ల లక్షలు, కోట్లు వ్యయం చేసిన నేతలంగా నిండా మునిగిపోయారు. బుద్ది తక్కువై పవన్‌ను నమ్మామని వారు చెబుతున్నారు. ఇందులో తెలుగుదేశం నేతల్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే వారంతా చాలాకాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. పదో - పరకో సీట్లు పడేస్తే పవన్ కల్యాణ్ తాము చెప్పినట్లు పడి ఉంటారని వారు అంటూ వచ్చారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఒక సభలో చెప్పి, తాను పదోపరకకో లొంగుతానా? అంటూ మాట్లాడితే జనసేన వారంతా బాగా మాట్లాడారులే అనుకున్నారు.. కానీ ఆయన చివరికి పది సీట్ల కోసం టీడీపీకి సరెండర్ అయ్యారు. పేరుకు ఇరవైఒక్క సీట్లు అయినా, పది సీట్ల వరకు చంద్రబాబు పంపించిన టీడీపీ నేతలకే పవన్ సీట్లు ఇచ్చారు.ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? వారాహి భోషాణం దేనికి, ఎవరి కోసం బిల్డప్? అసలు తెలుగుదేశంలో విలీనం చేసేస్తే సరిపోయేది కదా అని జనసేనను నమ్మి నాశనం అయినవారు అడుగుతున్నారు. వారిది అరణ్యరోదనగా మిగిల్చిన పవన్ కల్యాణ్ ప్రతి విషయంలోను చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు తెలివిగా పవన్ కల్యాణ్‌ను పది సీట్లకే పరిమితం చేసి జనసేనను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో ఇంతకాలం తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నానని, చంద్రబాబుకు సమానంగా ఆయన పక్కనే నడుస్తున్నానని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌ను అసలు ఆ రేసులో లేకుండా చేసుకున్నారు. తద్వారా తాను, లేదా తన కుమారుడు లోకేష్‌లు మాత్రమే.. ఒకవేళ అవకాశం వస్తే సీఎం పదవి చేపట్టడానికి వీలుగా పవన్‌ను లొంగదీసుకున్నారు.పవన్ కూడా ఒక ఎమ్మెల్యే పదవి వస్తే మహద్బాగ్యం అంటూ పిఠాపురంలో ఒక నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతను బతిమలాడుకుంటున్న తీరు ఆయన రాజకీయాలకు పనికిరాడని రుజువు చేస్తుంది. తనపార్టీవారిని గెలిపిస్తారని అనుకు్న్నవారికి భ్రమలు తొలగిస్తూ పవన్ కల్యాణ్ తను గెలుపుకోసం పిఠాపురంలో టీడీపీ నేత కాళ్లావేళ్లా పడుతున్నారు. ఇలా తన రాజకీయ పార్టీని తానే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు చూస్తే రాజకీయాలలో ఏ మాత్రం పరిణితి లేని అజ్ఞాని అన్న సంగతి పదే, పదే అర్ధం అవుతుంది. జగన్ తనకు తానే దండలో రాయి పెట్టుకుని కొట్టుకున్నారట! ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా ఇలా మాట్లాడతారా! లోకేష్ పిచ్చి వ్యాఖ్యలకు, పవన్ బుర్ర తక్కువ కామెంట్లకు తేడా ఏమీ కనిపంచదు. చంద్రబాబే అతి తెలివితో ముందుగా తానేదో ఖండించినట్లు నటించి, ఆ తర్వాత గులకరాయి తగిలిందంటూ డబుల్ టాక్ చేశారు.పవన్ కల్యాణ్‌కు ఆ మాత్రం కూడా కుట్ర తెలివితేటలు కూడా లేవు. చంద్రబాబు ఏది చెబితే అదే తాను కూడా వంత పాడి గులకరాయి స్వరం ఎత్తుకున్నారు. జగన్‌కు తగిలింది గ్రానైట్ రాయి అని, పొరపాటున అది నవరగంతకు తగిలినా, కంటికి తగిలినా ఎంత ప్రమాదం జరిగేది! అంతదాకా ఎందుకు ఒక గులకరాయిని తీసుకుని తమవాళ్లతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కొట్టించుకు చూస్తే దాని పవర్ ఏమిటో తెలుస్తుంది. జగన్‌కు ఆ రకంగా గాయమైతే కనీసం సానుభూతి తెలపకపోగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏవేవో నేరాలు జరిగాయట. అప్పుడు ఎవరూ స్పందించలేదట. సమాజంలో జరిగే నేరాలకు, ముఖ్యమంత్రిపై దాడికి లింకు పెట్టి మాట్లాడడంలోనే పవన్ కల్యాణ్ అజ్ఞానం తెలుస్తుంది.సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడారు. అది ఎప్పుడు జరిగింది.. చంద్రబాబు పాలన టైమ్ లోనే కదా! మరి అలాంటి చంద్రబాబుతో ఎందుకు జత కట్టారు! వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా! అప్పుడు శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని పవన్ అన్నారా! పైగా వివేకా కూతురు సునీత నాలుక మడతేసి చెబుతున్న అసత్యాలను ఈయన ఎత్తుకున్నారు. సునీతే తన తండ్రి హత్య జరిగిన రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు కదా! ఆ తర్వాత కాలంలో, హత్య తానే చేశానని చెప్పుకుంటున్న వ్యక్తికి ఈమె ఎందుకు బెయిల్ ఇప్పించారు! ఈ విషయాలేవీ పవన్‌కు పట్టవా! ఏదో ఒకటి జగన్ పై బురద వేసి చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తికి ఎవరు రాజకీయాల గురించి చెప్పాలి.మళ్లీ ముప్పైవేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ పిచ్చి వాగుడు. అదే నిజమని నమ్మితే వలంటీర్ల వ్యవస్థను తీసివేస్తామని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడంం లేదు? చంద్రబాబు అయితే యూటర్న్ తీసుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారే! జగన్ అమలు చేస్తున్న స్కీములను తామూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా తాము ఎంత బలహీనంగా ఉన్నది వీరిద్దరూ తెలియచేస్తున్నట్లే కదా! జగన్‌పై జరిగిన దాడి లేదా హత్యాయత్నం ఘటనలో తొలుత పవన్ సోదరుడు నాగబాబు కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినా, ఆ తర్వాత సర్దుకుని దాడిని ఖండించారే.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, దాడి హేయమని ఖండించారు కదా! నాగబాబుకు దాడి ఎలా కనిపించింది? పవన్ కల్యాణ్‌కు ఎందుకు కనిపించలేదు! అంటే పవన్ కల్యాణ్ పిచ్చి మాటలుమాట్లాడుతున్నారని తేలిపోవడం లేదా! పవన్‌కు నాగబాబు ఇచ్చిన స్టేట్ మెంటే జవాబుగా కనిపిస్తుంది కదా! అంటే నాగబాబుకు ఉన్న విజ్ఞత కూడా పవన్ కల్యాణ్‌కు లేదనే అనుకోవల్సిందే కదా! పవన్ కల్యాణ్ హుంకరింపులు, గంతులు, ఆవేశం నటిస్తూ ఊగిపోవడాలు ఇవన్ని చూసిన తర్వాత మనందరికి ఒక స్పష్టత వస్తుంది కదా! ఈయన రాజకీయాలకు ఏ మాత్రం తగడని. వ్యక్తిగత జీవితంలో అనైతిక ప్రవర్తనతో పాటు, ఇలాంటి అజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరం! ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు సిగరెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఉంటాయి. అలాగే పవన్ కల్యాణ్ పాలిటిక్స్ రాజకీయ సమాజానికి, ఏపీ ప్రజలకు ప్రమాదకరమని అనిపించడం లేదా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సొంత రాజకీయం చెల్లదని బాబుకి అర్థమౌతోందా..!?
నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు కూటమి పార్టీలు మొండి చేయి చూపాయి. రఘురామకృష్ణరాజు రెచ్చిపోయి రచ్చబండ పేరుతో రచ్చచేసి అప్రతిష్టపాలైన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు హాండిచ్చిన తీరు రాజకీయాలలో ఉన్నవారికి గుణపాఠం అని చెప్పాలి. నోటి దురద అనండి, నోటి దూల అనండి, తీట అనండి... ఏదైనా కాని తొందరపాటుతో, అతిశయంలో ఏది పడితే అది మాట్లాడి కొందరు నేతల మన్ననలు పొందుదామనుకునే వారికి ఇలాగే పరాభవం ఎదురవుతుంటుంది. తన గురించి తాను గొప్పగా ఊహించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత తప్పో రాజుకు ఇప్పటికైనా అర్దం అవుతుందా? అన్నది డౌటే. ఎందుకంటే ఆయనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్అని రాజు ఆరోపించే దైన్య స్తితికి తెచ్చారు. ఎందుకంటే ఆయన నాలుగేళ్లుగా ఎవరి ట్రాప్ లో ఉన్నారు? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల ట్రాప్ లోనే కదా! నిజంగా రాజుకు ఇవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడే నర్సాపురం సీటును టీడీపీ కోటాలోకి తీసుకుని ఇచ్చి ఉండవచ్చు కదా! లేదా బీజేపీ గట్టిగా కోరుకున్న విశాఖపట్నాన్ని వారికి ఇచ్చి, తాను నర్సాపురం తీసుకుని రాజుకు కేటాయించవచ్చు కదా! విశాఖలో తన బందువైన భరత్‌కు సీటు ఇవ్వడంలో చూపిన ఆసక్తి రఘురామకీష్ణంరాజుపై లేదనే కదా దీని అర్ధం. రాజు గట్టిగా కోరి ఇంకా ప్రకటించని విజయనగరం సీటు అయినా పొందవచ్చు. ఆ రకంగా ఈయన ప్రయత్నిస్తారో, లేక చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయ్యారు కనుక నోరు మూసుకుని కూర్చుంటారో తెలియదు. చిత్రమైన సంగతి ఏమిటంటే బీజేపీలో ఆరు సీట్లలో ఒక్కరే ఒరిజినల్ బీజేపీ నేత. నర్సాపురం నుంచి బీజేపీ టిక్కెట్ పొందిన శ్రీనివాస వర్మ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వలస వెళ్లినవారే. సీ.ఎమ్.రమేష్ టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలోకి వెళ్లారు. ఆయన బీజేపీలో ఉన్నట్లు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎన్నికల విరాళం ఇచ్చారు. అయినా బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ ఎంపీ, తదుపరి టీడీపీ ఎంపీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు టిక్కెట్ ఇచ్చారు పురందేశ్వరి కాంగ్రెస్ లో పదేళ్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీలోకి వచ్చారు. వర ప్రసాద్ తనకు టిక్కెట్ ఇవ్వని వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే మరుసటి రోజే ఈ పార్టీ టిక్కెట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. వీరందరికి టిక్కెట్లు ఇచ్చి రఘురామకృష్ణంరాజుకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే ఆలోచించుకోవాలి. ఈ వ్యవహారంలో రాజు వల్ల తమకు కూడా నష్టం జరుగుతోందని భావించారో ఏమో కాని, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ ద్వారా రాయబారం చేసి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెబుతున్నట్లు ఉన్నారు. అది బుగ్గ గిల్లి జోలపాడడానికే కావచ్చు. ఉండి నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. మరి ఆయనను మార్చి రఘురామ కు ఇస్తారా అన్నది డౌటే. 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టీడీపీ పంచన చేరారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణల ప్రాపకం కోసం వారు ఏది మాట్లాడమంటే అది మాట్టాడి పరువు పోగొట్టుకున్నారు. చివరికి తాను ఏమి మాట్లాడుతున్నానో తనకే తెలియని పరిస్థితికి వెళ్లారు. ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయినా జగన్‌కు ఉన్న ఆదరణ రీత్యా ఈయన బయటపడగలిగారు. డిల్లీలో జగన్‌తో సంబందం లేకుండా సొంత రాజకీయం చేయడం, బీజేపీ వారితో పైరవీ చేసుకుని కమిటీ పదవులు పొందడం వంటివి చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకత్వంతో కొంత తేడా వచ్చింది. అయినా కొంత సంయమనం పాటించి ఉంటే అన్ని సర్దుకుపోయేవేమో! అలాకాకుండా టీడీపీకి ఏజెంట్ అయిన ఆంద్రజ్యోతి రాదాకృష్ణ ట్రాప్‌లోకి వెళ్లి, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆరంభించారు. ఆ సమయంలో ఒక ఏడాది పాటు మౌనంగా ఉండండని, ఆ తర్వాత అన్ని కుదుట పడతాయని కొందరు హితవు చెప్పినా ఆయన వినలేదు. దీంతో నరసాపురంలో మరో నేతను వైసీపీ ఇన్ చార్జీగా ప్రకటించింది. ఆ తర్వాత పార్టీకి సంబందం తెగిపోయింది. ఆ దశలో కాస్త నిజాయితీ ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజు ప్రతిష్ట నిలబెట్టుకుని ఉండేవారు. ఉభయ గోదావరి జిల్లాలలో క్షత్రియులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. కాని రాజు తెలివితక్కువగా, మూర్ఖంగా, కేవలం ప్రచార పిచ్చితో దానిని అంతటిని నాశనం చేసి, ఆయన వర్గానికి కూడా కళంకం తెచ్చారన్న విమర్శలకు గురయ్యారు. వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్‌ను కోరుతూ పిటిషన్ ఇచ్చినా, రకరకాల పద్దతులలో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని నాలుగేళ్లు కధ నడిపించారు. ఈ కాలంలో ఒకటి,రెండుసార్లు తప్ప నియోజకవర్గం వైపే చూడలేదు. ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవి 5 వంటివి తనకు లైవ్ కవరేజీ ఇస్తున్నాయనే సంబడంలో ఆయన రోజూ జగన్‌పై విమర్శలు సాగించారు. అవి కూడా కొన్నిసార్లు దూషణలుగా, అనుచిత వ్యాఖ్యలుగా ఉండేవి. ఒక అగ్రవర్ణ సామాజికవర్గాన్ని తూలనాడడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటివాటి ద్వారా కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టే యత్నం కూడా చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేసింది. అప్పట్లో ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడైనా పదవికి రాజీనామా చేసి, వైసీపీకి చాలెంజ్ విసిరారా అంటే అదీ లేదు. ఓడిపోతానన్న పిరికి తనంతో ఉండిపోయారు. ఈయనను వైసీపీ ఎంపీగా పిక్చర్ ఇస్తూ ఎల్లో మీడియా కధ నడిపేవి. తనకు టీడీపీ, బీజేపీ, జనసేనలలో ఎవరైనా టిక్కెట్ ఇస్తారని బీరాలు పోయేవారు. నిజంగానే ఈయనకు అంత పలుకుబడి ఉందేమోలే అనుకున్నవారు ఉన్నారు. ఆ నమ్మకంతోనే వైసీపీని, జగన్‌ను అంత నీచంగా మాట్లాడుతున్నారని భావించినవారు లేకపోలేదు. సీన్ కట్ చేస్తే ఆ మూడు పార్టీలు ఈయనను వదలించుకోవడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఉన్నవి,లేనివి కలిపి అబద్దాలు చెప్పించిన టీడీపీ నేతలే ప్రస్తుతం మొహం చాటేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు. చంద్రరబాబు నాయుడును నమ్మితే ఇంతే సంగతి అన్నది సాదారణంగా ఉన్న నానుడి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధికి కాకుండా టీడీపీకి ఓటు వేసి అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు. ఆమె బాపట్ల లోక్ సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు. దాంతో తత్వం బోధపడి ఏమన్నారో చూడండి. 'రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారు ఈ రోజు అర్దం అయింది "అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంటే దాని అర్దం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమే కదా! రఘురామకృష్ణంరాజుకు కూడా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది కదా! ఆయనను నిలదీసి తాను ఇంతగా సేవ చేస్తే ఇలా నమ్మక ద్రోహం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించాలి కదా! మరో ప్రత్యామ్నాయ సీటుకు డిమాండ్ చేయాలి కదా! ఈ మూడు పార్టీలు రఘురామకృష్ణంరాజుకు టిక్కెట్ ఇవ్వడం వేస్ట్ అని అనుకున్నాయనే కదా అర్ధం. తనను కరివేపాకు మాదిరి చంద్రబాబు వాడేసి, ఎటూ కాకుండా చేశాడని ఈయనకు జ్ఞానోదయం అవ్వాలి కదా! ఇంత జరిగాక కూడా తాను చంద్రబాబుతోనే ఉంటానని ఉసూరుమంటూ చెప్పారు. తనకు ఇంతకన్నా గతి లేదని ఫీల్ అవుతున్నారని ఆయన మొహం చూస్తేనే అర్దం అవుతుంది. తాను చిన్న ఓటమికి గురయ్యాయని అంటూ మళ్లీ ఆత్మవంచన చేసుకుని జగన్తన ప్రభావం చూపి టిక్కెట్ రాకుండా చేశారని పిచ్చి విమర్శ చేశారు. ఇలా చాతకాని వ్యాఖ్యలు చేసే బదులు తాను ఇంతకాలం తప్పు చేశానని, శ్రీదేవి మాదిరి తనకు కూడా జ్ఞానోదయం అయిందని ప్రకటించి రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో ఆయన ఆలోచించాలి. అలా చేసే పరిస్థితి లేదు.. రామోజీ, రాదాకృష్ణ తదితర తెలుగుదేశం ఎజెంట్లు పెట్టిన ప్రలోభాలకు లొంగి, రోజూ తనను కాబట్టి టీవీ లైవ్ లలో చూపిస్తున్నారని, పత్రికలలో తన స్టేట్ మెంట్లు వేస్తున్నారని భ్రమపడి, వారి కోరిక మేరకు పిచ్చి మాటలన్నీ మాట్లాడి, ఇప్పుడు లబో, దిబో అంటున్నారు. ఇప్పటికైనా వారంతా తనను వాడుకుని వదలివేశారన్న సంగతి బోదపడిందో లేదో తెలియదు. రఘురామకృష్ణరాజుకు ఇంకో ఆప్షన్ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేత, తన వియ్యంకుడైన కెవిపి రామచంద్రరావునో, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలనో కోరితే. వారు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. కాంగ్రెస్ టిక్కెట్ పైన అయినా, లేక స్వతంత్ర ఈ అభ్యర్ధిగా అయినా రంగంలో దిగి తన సత్తా చూపితే అప్పుడు రఘురామకృష్ణంరాజుకు కొంతైనా విలువ వస్తుంది. లేకుంటే ఈయన రోశం ఉన్న రాజకాదని, ఉత్తి రాజే అన్నే భావన కలుగుతుంది. సర్వభ్రష్టత్వం చెంది రఘురామకృష్ణంరాజు, టీడీపీ కూటమికే ఊడిగం చేస్తారా? లేక తనకు కూడా వ్యక్తిత్వం ఉందని నిరూపించుకుంటారా అన్నది ఆయన తేల్చుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నోరు జారిన రేవంత్ ప్రకృతి తో జాగ్రత్తగా ఉండాలి కదా మరి ..!
-
మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాస్ లీడరే కాదు.. ఆయన ప్రసంగం కూడా మాసే. పురాణాలను, ఆ పురాణాల్లోని ఇతివృత్తాలను, పాత్రలను గుర్తు చేస్తూ.. ఆ పాత్రలను నేటి రాజకీయాలతో పోల్చుతూ ఆయన చేసే ప్రసంగాలను అభిమానులనే కాదు.. ప్రతీ ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. "ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే శ్రీకృష్ణ పరమాత్ములు..నేను అర్జునుడిని" అన్న డైలాగ్.. వీపరీతంగా జనంలోకి వెళ్లింది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలు కౌరవ సేనను చీల్చిచెండాడినట్లు.. జగన్ మాటలు ఎల్లో మందను చీల్చి చెండాడుతున్నాయి. ప్రజలను శ్రీకృష్ణుడి స్థానంలో కూర్చోపెడుతున్న తీరు.. ఓ స్పష్టమైన సంకేతాన్నిస్తోంది. ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని ఆయన సుస్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆయుధం పట్టకుండా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించినట్లు.. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే తనను గెలిపించాలని చెబుతున్నారు. "జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాన్ని బయటకు తీయండి" అన్నారు. మహాభారతంలో పాండవులు వనవాసం, అజ్ఞాత వాసానికి వెళ్లేటప్పుడు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్తారు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాక తిరిగి జమ్మ చెట్టు దగ్గరకు వచ్చి ఆయుధాలు తీసుకుంటారు. ప్రజల ఓట్లను ఆయుధాలతో పోల్చడమంటే.. కౌరవ సేన లాంటి ఎల్లో మందను ఓటు అనే ఆయుధంతో చీల్చి చెండాడాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం.. ఉత్తర కోస్తా సిద్ధం..రాయలసీమ సిద్ధం..ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధమని సభకు వచ్చిన లక్షలాది జనంలో ఉత్తేజం నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సభ ముగిసిన తర్వాత కూడా ప్రజలు, మీడియానే కాదు తెలుగుదేశం, ఎల్లో మీడియా కూడా సీఎం జగన్ ప్రసంగం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. "బిందువు బిందువు కలిసి సింధువైనట్లు" అనగానే జనం స్పందించిన తీరు.. సమర నినాదాన్ని గుర్తు చేసింది. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాడీ లాంగ్వేజీలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన వచ్చిన తరువాత ఈ సభ జరిగింది. సహజంగానే ఈ సభ ఎలా ఉంటుంది..? సీఎం జగన్ స్పీచ్ ఎలా ఉంటుంది..? అని వైఎస్ఆర్ సీపీ నేతలే కాదు కూటమిలోని నేతలు కూడా ఎదురు చూశారు. 2014లో కూడా ఇలానే ముగ్గురు కలిసి వచ్చారని.. తరువాత ప్రజలను మోసం చేసి ఎవరిదారిన వారు వెళ్లారని సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేశారు. 2014 టీడీపీ మేనిఫెస్టో సిద్ధం వేదిక నుంచి చూపిస్తూ.. ఇలా రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి వస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న తనకు ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో.. ప్రతి ఇంట స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. ఈ మహా సంగ్రామానికి మీరంతా సిద్ధమా..? అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి జగన్ అన్నప్పుడు.. సిద్ధం.. సిద్ధం..సిద్ధమంటూ లక్షలాది గొంతుకలు ఒక్కసారిగా నినదించాయి. చంద్రబాబుది తుప్పుపట్టిన సైకిల్ అని.. ఆ సైకిల్‌కు టైర్లు, ట్యూబ్‌లు కూడా లేవని.. ఆ తుప్పు పట్టిన సైకిల్‌ను తోయడానికి పొత్తులతో వస్తున్నాడని జగన్ అన్నప్పుడు సభా ప్రాంగణం దద్దరిల్లి పోయింది. కిల్ సైకిల్.. కిల్ సైకిల్ అని యవత అరవడం వినిపించింది. గంటా 21 నిమిషాలు పాటు సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా 15 లక్షల మంది, టీవీల్లో అంతే స్థాయిలో, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దాదాపు కోటి మంది చూసి ఉంటారని గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పొత్తుల తరువాత జరిగిన సభ కావడంతో జాతీయ ఛానల్స్ కూడా విస్తృత ప్రచారాన్ని ఈ సిద్ధం సభకు ఇచ్చాయి. దురదృష్టమేమంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్‌కు లక్షలాది జనం గ్రాఫిక్స్‌లా కనిపించడం... ఓ రకంగా ఇది ప్రజలను అనుమానించడం, అవమానించడమే. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించడమంటే ఇదేనేమో. ఐటీడీపీ గ్రాఫిక్స్‌ను ఫ్రంట్ పేజీలో వేసుకునే స్థాయికి దిగజారడం శోచనీయం. -వైవీ రెడ్డి -
ఏపీ ఎన్నికల వరకు బాబు జిమ్మిక్కులు తప్పవా..?
‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎంత కష్టం వచ్చిపడింది..! ‘ఆయన తనకు ఇష్టం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పడం లేదట. ఎన్డీఏలో చేరక తప్పడం లేదట. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమట’. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తన భావాలను సహచరులతో ఆయన పంచుకున్నారట. ఆ సహచరుడు ఎవరో తెలిసిందే కదా! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే అని వేరే చెప్పనవసరం లేదు. వారిద్దరూ కూర్చుని ఒక వంటకం తయారు చేసి జనం మీద వదిలారన్నమాట. అందులో ఏమి రాశారో చూడండి..’’ 'రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దష్టిలో ఉంచుకుని ఎన్డీఏలో చేరాలని హోం మంత్రి అమిత్‌షా మనల్ని ఆహ్వానించారు. మనకు ఉన్న పరిమితులు, సమస్యలపై చర్చించాం, వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రిత్యా తప్పదేమోననిపిస్తుంది’ అని చంద్రబాబు అన్నారట. దీనినే హిపోక్రసీ అని అంటారు. తెలుగులో కపటత్వం అన్నమాట. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తాను గెలవలేమోనన్నది వారి భయం. ఏపీలో ఎన్నికల మేనేజ్మెంట్లో చిక్కులు వస్తాయేమోనన్నది వారి సందేహం. గత ఎన్నికల ముందు మాదిరి తమ నేతల ఇళ్లలో ఐటీ, ఈడీ సోదాలు జరిగితే ఇక్కట్ల పాలవుతామేమోనన్నది వారి డౌటు. ఇంకేమైనా కొత్త కేసులు ఉన్నాయేమో! దీనిని వదలి ఈ డ్రామా ఎందుకు? ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఫెయిర్‌గా తాము గతంలో బీజేపీని వదలి తప్పు చేశాం.. ఇప్పుడు కోరుకుంటున్నాం అని అంటే సరిపోతుంది. అలాగే ప్రధాని మోదీని తెలివితక్కువగా దూషించాం.. అందుకు క్షమించాలని కోరుకుంటున్నాం అని అంటే పర్వాలేదు. కాని ఇక్కడ కూడా ఆత్మ వంచనే. అమిత్‌షానే వీరిని పదే, పదే పిలిచినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం. బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు ఈ కథనాన్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పాతిక సార్లు షా అప్పాయింట్‌ను చంద్రబాబు కోరితే, ఆ విషయం రాయకుండా షా రమ్మన్నారని ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్లీ వైఎస్సార్సీపీపై విమర్శలు. రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోయిందని అంతా అనుకుంటున్నట్లు అబద్దపు ప్రచారం. బీజేపీతో పొత్తుపై మైనార్టీ వర్గాలు అసంతృప్తి చెందవచ్చని, కాని పరిస్థితులను విశదీకరించి చెబితే అర్ధం చేసుకుంటారని అమిత్‌షా అన్నారట. ఎంత కథ రాశారండి. యూపీలో ఒక్క సీటు కూడా మైనార్టీలకు ఇవ్వకుండా ఎన్నికలలో పోటీచేసిన బీజేపీ, ఏపీలో మైనార్టీ నేతలు టీడీపీకి మద్దతు ఇవ్వరేమోనని ఆలోచన చేస్తుందా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాయ ప్రచారం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణలో బీజేపీ సిద్దపడకపోవడం వల్లే, కాంగ్రెస్‌తో తప్పనిసరి పరిస్థితిలో జట్టు కట్టవలసి వచ్చిందని కూడా చంద్రబాబు చెబితే అమిత్‌షా ఊ కొట్టారట. కాంగ్రెస్‌కు ఇచ్చే బదులు బీజేపీకే పరోక్ష మద్దతు ఇచ్చి ఉండవచ్చు కదా..! 2019లో దేశం కోసం కాంగ్రెస్‌తో స్నేహం అని చంద్రబాబు భావన అని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊదరకొట్టాయి కదా! మోదీ అంత అవినీతిపరుడు లేడని, ఉగ్రవాది అని, ముస్లీంలకు రక్షణ ఉండదని, త్రిబుల్ తలాఖ్ తెచ్చారని ఇలా ఎన్నో విమర్శలు చేశారు కదా! ప్రత్యేక హోదాను కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లినా విభజన హామీలు నెరవేరలేదని, ఏడాదిన్నర పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మోదీ అవమానించారని చెప్పారు కదా! మరి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏమి మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలను కాకా పట్టి మరీ వారిని కలిశారో చెప్పాలి. ప్రత్యేక హోదా ఇస్తామని, ఇతర సమస్యలను తీర్చుతామని అమిత్‌షా ఏమైనా హామీ ఇచ్చారా? అలా ఇచ్చి ఉంటే కదా! రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో జతకట్టి ఎన్డీఏలో చేరుతున్నామని చెప్పాలి. అదేమి కాకుండా చంద్రబాబు బీజేపీని అంటకాగే యత్నం చేస్తున్నారంటే దానికి ఒక కారణం చెబుతున్నారు. ఇదంతా ఈనాడు అధినేత రామోజీరావు ఇచ్చిన సలహా అని అంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని రామోజీ భావిస్తున్నారట. దానినుంచి తప్పించుకోవడానికి కేంద్రంలోని బీజేపీతో జట్టు కడితే ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినా, అంత దూకుడుగా వెళ్లకపోవచ్చన్నది ఆయన భావన అని రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది. తాను కూడా బీజేపీవారితో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే తనపై ఉన్న మార్గదర్శి కేసులలో అరెస్టు వరకు వెళ్లకుండా తప్పించుకోగలిగానని చెబుతున్నారట. ఈ ప్రచారంలో నిజం ఉందో, లేదో తెలియదు కాని, ఈ వాదనలో హేతుబద్దత ఉన్నట్లు అనిపిస్తుంది. మరో వైపు ఎక్కువ సర్వేలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటే ఒక్క సీ-ఓటర్ సర్వే టీడీపీకి ఫేవర్‌గా రావడం కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది. టైమ్స్ నౌ, న్యూస్ అరెనా ఇండియా, జనమత్, పొలిటికల్ క్రిటిక్ వంటి పలు సంస్థల సర్వేలలో ఏపీలో 17 నుంచి 20 లోక్‌సభ సీట్లు, 113 నుంచి 118 అసెంబ్లీ సీట్లతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే సీ-ఓటర్ సర్వే మాత్రం భిన్నంగా ఇచ్చింది. పదిహేడు సీట్లు టీడీపీ, జనసేన కూటమికి వస్తాయని అంటున్నది. 2019లో కూడా ఈ సంస్థ టీడీపీనే గెలుస్తుందని చెప్పింది కాని, వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇటీవలె జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని సీ-ఓటర్ చెబితే, ఆ రెండుచోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపధ్యంలో సీ-ఓటర్ సర్వే గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. అసలు ఈ సర్వేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లే నమ్మడం లేదని అనుకోవచ్చు. చంద్రబాబు అయితే జనసేనతో పొత్తు కోసం పడిన తంటాలు తెలిసినవే. వారిద్దరూ కలిశాక, నిజంగానే వారికి గెలుస్తామన్న నమ్మకం ఉండి ఉంటే బీజేపీని ఎందుకు బతిమలాడుకుంటారు? వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పదే, పదే ఎందుకు చెబుతుంటారు? వచ్చే రెండు నెలలు కూడా టీడీపీ అనండి.. చంద్రబాబు అనండి.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ.. ఇంకా ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ఎన్నికలు అయ్యేవరకు మనకు ఈ బెడద తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
రామోజీ, రాధాకృష్ణ రోడ్లపైకి వస్తే చెప్పులతో కొడతారు
-
ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్?
ఏపీలో ఎల్లో మీడియా పూర్తిగా బరితెగించేసింది. ఏకంగా ఇప్పుడు బహిరంగంగా అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా సిగ్గుపడటంలేదు. తెలుగుదేశం పార్టీ కరపత్రాల కన్నా హీనంగా మారిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి నిత్యం ఇదే పనిలో ఉంటున్నాయి. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వం రాగానే తమపై కేసులు పెడతారేమోనని అధికారులు భయపడుతున్నారట. దీనిపైనే చర్చించుకుంటున్నారట. గతంలో పత్రికలు, టీవీలు ఇలా ప్రచారం చేసేవి కావు. ✍️రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటుంటాయి. ఒకదానికి ఒకటి సమాధానం ఇచ్చుకుంటాయి. ఇంతకాలం అలాంటివి చూశాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా హద్దులు దాటిపోయి అధికారులను బెదిరించే దశకు చేరుకున్నాయి. దీనికి ఒక కారణం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండేవారు. తామే పవర్లోకి వస్తున్నాం. అధికారుల సంగతి చూస్తాం. వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చే పోలీసు అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నాం.. వారందరి అంతు తేలుస్తా అంటూ లోకేష్ ఎక్కడబడితే అక్కడ మాట్లాడుతూ వచ్చారు. యువగళం పేరుతో సాగిన పాదయాత్రలో ఆయన ఇదే పనిగా పెట్టుకుని మాట్లాడుతుండేవారు. ✍️చంద్రబాబు మరో అడుగు ముందుకేసి తనను ఎవరు ఏమీ పీకలేరని అనేవారు. గొడవలు చేసి కేసులు పెట్టించుకునేవారికి పెద్ద,పెద్ద పదవులు ఇస్తామని ప్రచారం చేశారు. దానిని అమాయకంగా నమ్మిన కొందరు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు చేసి కేసుల్లో చిక్కుకుని నానా పాట్లు పడవలసి వచ్చింది. లోకేష్ కొన్నిసార్లు పూర్తిగా బాధ్యతారహితంగా కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేరు ప్రస్తావించి తాను అధికారంలోకి రాగానే ఏమి చేస్తానో చూడండి అంటూ బెదిరించేవారు. చిత్తూరు ఏఎస్పీని పేరు పెట్టి మరీ బెదిరించారు. దీనిపై ప్రజలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజకీయంగా తమకు ఉపయోగపడటంలేదని ఆ తర్వాత కాలంలో అర్ధం అయిందో, ఏమో తెలియదు కానీ.. కాస్త స్వరం మార్చి పోలీసు అధికారులందరిపై తమకు కోపం లేదని, కొందరే ప్రభుత్వానికే అనుకూలంగా ఉండేవారిపైనే తమ విమర్శలంటూ సర్దుకోవడానికి యత్నించారు. ఈలోగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలు తెరపైకి రావడం, చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయి రాజమహేంద్రవరం జైలులో ఉండవలసి రావడం, లోకేష్ యువగళం యాత్రను ఆపి ఢిల్లీకి వెళ్లిపోవడం వంటివి జరిగాయి. ✍️దీంతో, వారికి కొంత భయం పట్టుకుంది. అధికారులపై దాడి చేయడం తగ్గించారు. తాజాగా లోకేష్ మళ్లీ యువగళం ఆరంభించినా, అధికారుల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు. కానీ, వైఎస్సార్సీపీ వారందరిని జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ఆయన తండ్రికి జైలర్ పాత్ర ఇచ్చారు. టీడీపీ గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా జైలర్ ఎలా అవుతారో, లేదా జైలర్ ఉద్యోగం కూడా ఆయన చేతిలోకే తీసుకుంటారో తెలియదు. అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న గ్యారంటీనే లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న ఆశతో తంటాలు పడుతున్నారు. ✍️ఈ క్రమంలో టీడీపీ, జనసేనలకు ఊపిరి పోయడానికి కంకణం కట్టుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పచ్చ మీడియా సంస్థలు పచ్చ నేతలకు బదులు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే పనిలోపడ్డాయి. గత కొన్నాళ్లుగా ప్రత్యేకించి చంద్రబాబుపై కేసులు వచ్చాక, ఈ మీడియా.. అధికారులను భయపెట్టడానికి అన్ని యత్నాలు చేస్తున్నాయి. ఒకసారి అధికారులు కేసులువస్తాయని భయపడి కేంద్రానికి వెళ్లడానికి అప్లై చేసుకుంటున్నారని రాయడం, డిప్యుటేషన్‌పై పనిచేసే అధికారులు కొందరు ఇక్కడ పరిస్థితి రీత్యా వెళ్లిపోవాలని చూస్తున్నారని మరోసారి, మళ్లీ వారి సర్వీస్ పొడిగింపు ఆదేశాలు వస్తే మరో రకంగాను రాస్తూ ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. ✍️ఒకరోజు ఆంధ్రజ్యోతి అలాంటి బెదిరింపు కథనం రాస్తే ఆ మరుసటి రోజు ఈనాడు అందుకుంటుంది. ఉదాహరణకు నవంబర్29వ తేదీన ఈనాడు దినపత్రిక బ్యానర్ కథనం చూడండి.. ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి అని అధికారులు చర్చించుకుంటున్నారని ఒక చెత్త వార్త రాశారు. ఇదే తరహా వార్త అంతకు ఒకటి, రెండు రోజుల ముందు ఆంధ్రజ్యోతి రాసింది. ఈ రెండు పత్రికలు, టీవీలు పేరుకే విడివిడిగా ఉన్నాయి తప్ప, కంటెంట్ దాదాపు అంతా కలిసే జనం మీదకు వదలుతున్నారు. ఈనాడు ఎంత నీచంగా రాసిందంటే అధికారులు కేసులకు భయపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ప్రతిపక్షనాయకులపైన, ప్రభుత్వానికి గిట్టని వారిపైన అక్రమ కేసులు బనాయించి, మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం అని రాసిపడేశారు. ✍️చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, లోకేష్ తదితరులు ఊరుకునేలా లేరని వారు అనుకుంటున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ ఒక్క అధికారితో వీరు మాట్లాడి రాసినట్లు ఇందులో కనబడదు. వారి సొంత పైత్యం అంతా జనం మీద రుద్దేశారు. ఎవరూ అక్రమ కేసులు పెట్టాలని కోరరు. కానీ, పెట్టినవన్నీ అక్రమ కేసులే అని ఈనాడు మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ మీడియానే తన ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇచ్చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చేస్తోందన్న భ్రమ కల్పించడానికి, ఆ తర్వాత ఏదో అయిపోతుందన్నట్లు భ్రాంతి కల్పించడానికి ఈనాడు, జ్యోతి, టీవీ-5 తదితర ఎల్లో మీడియా ఈ రకంగా చేస్తోందన్న సంగతి ప్రజలకు అర్ధం కాకుండా ఉండదు. ఎందుకంటే చంద్రబాబుపై వచ్చిన అభియోగాలలో అత్యధికభాగం పూర్తిగా దర్యాప్తులో ఆధారాలు దొరికిన తర్వాతే కేసులు పెట్టడం జరిగింది. ఆ వాస్తవం టీడీపీ వారికి కూడా తెలుసు. ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు సైతం తెలుసు. కానీ, తమకు మీడియా ఉంది కనుక దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబును రక్షించడానికి వారు చేస్తున్న కుట్రలేనని ఈ వార్తలు చదివితే బోదపడుతుంది. ✍️ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో కొందరు పోలీసు అధికారులతో పాటు మీడియా అధిపతుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఒక పోలీసు అధికారి అయితే టీడీపీని తాను నడుపుతున్నట్లుగా ఆయా పార్టీ పదవులను ఇచ్చేవారట. ఆ విషయం టీడీపీ నేతే విజయవాడలో పార్టీ మీటింగ్‌లోనే చెప్పిన సంగతి మర్చిపోయారా! ఇప్పుడు అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా!. ✍️ఇక ఆంధ్రజ్యోతి చిత్రంగా మరో వార్త ఇచ్చింది. ఇసుక ద్వారా సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరితే, ఇంకా ఎక్కువ రావాల్సిందని, అందువల్ల ఇంత నష్టం జరిగిందంటూ ఓ పిచ్చి వార్తను ఇచ్చింది. ఇలా తప్పుడు కథనాలు రాసి నడిరోడ్డు మీద నగ్నంగా తిరగడానికి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏ మాత్రం ఫీల్ కావడం లేదు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవని అంటారు. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసే బ్లాక్ మెయిలింగ్‌కు అధికారులు భయపడతారా? అదే కరెక్టు అయితే చంద్రబాబు పాలన సమయంలో అనేక మంది కేంద్రానికి వెళ్లారు. వారంతా కూడా ఆ టైమ్‌లో జరిగిన అక్రమాలకు భయపడే కేంద్రానికి వెళ్లారని ఈ ఎల్లో మీడియా ఒప్పుకుంటుందా?. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మన భూభాగంలోకి వెళ్తే దండయాత్రా!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం న్యాయ, ధర్మబద్ధంగానే స్వా«దీనం చేసుకున్నామని.. ఇది దండయాత్ర ఎలా అవుతుందో ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు నాగార్జునసాగర్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారని.. తద్వారా కోల్పోయిన రాష్ట్ర హక్కులను సీఎం వైఎస్ జగన్ సాధించారని ఆయన తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా జలాలకు మించి ఒక్క నీటి బొట్టునూ అదనంగా వాడుకోబోమని తేల్చిచెప్పారు. ‘మా వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం. దీనిని తెలుగు ప్రజలంతా సమరి్థస్తారని.. స్వాగతిస్తారని భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా పంతాలకు, పట్టుదలకు వెళ్లొద్దు’.. అంటూ అంబటి విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంపై ఎల్లో మీడియా అవాస్తవాలు పోగేసి అచ్చేస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని రెండు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబటి ఇంకా ఏమన్నారంటే.. హక్కును కాపాడుకుంటే దండయాత్ర అంటారా..? మరోవైపు.. కృష్ణా బోర్డు పరిధిని 2021, జూలై 15న కేంద్రం నిర్దేశించాక.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని.. తెలంగాణ సర్కారే ఒప్పుకోలేదని గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పును మేం సరిదిద్దితే.. సాగర్ మీదకు దండయాత్ర చేస్తున్నామని ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు రాస్తారా? ఇదేనా మీ జర్నలిజం? మేం తెలంగాణ భూభాగంలోకి వెళ్తే అది తప్పవుతుందిగానీ మన భూభాగంలోకి మనం వెళ్తే అది తప్పెలా అవుతుంది? తెలంగాణలో మాకు ఎలాంటి లక్ష్యాలు లేవు.. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే విషయంలో వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తెలంగాణలో మాకు ఎలాంటి లక్ష్యాలు, ప్రయోజనాల్లేవు. ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరంగానీ ఓడించాల్సిన అవసరం కూడా లేదు. పొరుగు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మేం సత్సంబంధాలు కొనసాగిస్తాం. దిగజారి మాట్లాడుతున్న పురందేశ్వరి.. సాగర్ స్పిల్ వేపైకి మన పోలీసులను పంపడం దారుణమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగజారి మాట్లాడుతున్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? ఏపీలో టీడీపీకి సమాధే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు, ఆ పార్టీ శ్రేణుల ప్రవర్తనవల్ల వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రజలు ఆ పార్టీని కూకటివేళ్లతో పెకళించి, సమాధి కట్టబోతున్నారు. ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును జైలుకు పంపితే.. ఒక్క పవన్ మాత్రమే వెళ్లి టీడీపీతో కలిసి పోటీచేస్తానని ప్రకటించారు. పవన్‌కళ్యాణ్ ఇంత త్యాగం చేసి తెలంగాణలో ఆయన ఎనిమిది సీట్లల్లో పోటీచేస్తే.. చంద్రబాబు సామాజికవర్గం వారు పవన్‌ను గెలిపిస్తామని ఎందుకు అనలేదు? చంద్రబాబు కోసం పనిచేస్తున్న పవన్ పిచ్చోడు అయితే అవ్వొచ్చేమోగానీ.. ఆయన సామాజికవర్గం వాళ్లు మాత్రం పిచ్చోళ్లు కాదు. బాబు అసమర్థతవల్లే హక్కులు కోల్పోయాం.. ► కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. ► బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతను ఏపీకి, సాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించింది. కానీ, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందన్న సాకుతో తెలంగాణ దానిని అ«దీనంలోకి తీసుకుని తన వాటాకు మించి అధికంగా జలాలను వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తోంది. ► అలాగే.. నాగార్జునసాగర్‌ను కూడా తెలంగాణ సర్కార్ 2014లోనే పూర్తిగా అ«దీనంలోకి తీసుకుంది. ► కానీ, అప్పటి సీఎం బాబు ఇదంతా చూస్తూ మిన్నుకుండిపోయారు. తద్వారా సాగర్‌పై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టినట్లయింది. 2015 ఫిబ్రవరి 13న చంద్రబాబు హయాంలో సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయటానికి మన అధికారులను పంపితే.. తెలంగాణ అధికారులు అభ్యంతరం పెట్టారు. దాంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరికి చంద్రబాబు గవర్నర్ దగ్గర మొరపెట్టుకుని.. తెలంగాణ సర్కార్ దయాదాక్షిణ్యాలతో నీరు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన నీటిని మనం విడుదల చేసుకోవాలంటే తెలంగాణ సర్కార్ అనుమతి అవసరమా? -
ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండాలని కోరాం: పేర్ని నాని
-
దొరికిపోయిన గజదొంగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ ఐటీ శాఖే నిగ్గు తేల్చినా పచ్చ మీడియా ఎందుకు కథనాలు రాయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు దొరికిన దొంగ.. గజదొంగ! చిన్న కాంట్రాక్టులోనే రూ.118 కోట్లు నొక్కితే 14 ఏళ్లు సీఎంగా బొక్కిందెంత? రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు కళ్లకు ఇవి కనిపించడం లేదా? ఈ బాగోతాన్ని రాయాలనిపించడం లేదా?’ అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ అవినీతిని ప్రశ్నిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు సొంత వదినే కాబట్టి ఆమె మాట్లాడటం లేదని, ఇక కమ్యూనిస్టులు ఎలాగూ స్పందించరని చెప్పారు. కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తెహల్కా ఎప్పుడో చెప్పింది చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని, సచ్చిలుడినని కితాబు ఇచ్చుకుంటున్నారు. జాతీయ మీడియా కథనాలతో ఆయన ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారో బహిర్గతమైంది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు షోకాజ్‌పై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు అందాయనడానికి వాట్సాప్ చాట్స్, ఈ–మెయిల్ ఆధారాలున్నాయని ఐటీశాఖ స్పష్టం చేసింది. చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు ఇంత డబ్బు నొక్కేశారంటే ఆయన ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు? ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పట్లేదు. ఆయన వందిమాగధులు, భజన బృందాలు స్పందించడం లేదు. ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్–2 సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేకపోయావు బాబూ? కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడో 1999లోనే తెహల్కా చెప్పింది. ఓటుకు కోట్లు కేసు ద్వారా కూడా ఆయన వద్ద ఎంత అవినీతి సొమ్ము పేరుకు పోయిందో వెల్లడైంది. లోకేశ్ పాత్ర కూడా.. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ పేరు కూడా చెబుతున్నారు. చిన్నచిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్‌కు, మీకు ఉంది కదా! మీ అవినీతిని బహిర్గతం చేసిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? 2014లో చంద్రబాబు 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు. ఎన్నికలు కాగానే దాన్ని మాయం చేశారు. అధికారంలోకి వస్తానని ఆయనకే నమ్మకం లేదు. ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం ఏమిటి? గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి లాస్ట్ బాల్ అన్నట్లుగా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్ ఇచ్చి నిష్క్రమిస్తారు. -
యాక్ తూ..వాడు జర్నలిస్టా
-
పవన్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్