నువ్వు చెప్పేవన్నీ ముమ్మాటికీ నిజాలే
2019 ఎన్నికల సమయంలో ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుల సంభాషణ
ఉద్యోగుల గురించి నీచంగా మాట్లాడిన రాధాకృష్ణ
సీఎం హోదాలో సమర్థించిన చంద్రబాబు
ఉద్యోగులకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారిని ముప్ప తిప్పలు పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, సీఎంగా ఉన్న చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి అప్పట్లో లీకైంది. ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాధాకృష్ణ బూతు పురాణం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. చంద్రబాబు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు.
లీకైన వీడియోలో వారి సంభాషణ ఇలా..
చంద్రబాబు : ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ...
రాధాకృష్ణ : ఏంది? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇది అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా.. జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దే వద్దు. తీసేయండి.
చంద్రబాబు : అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా?
రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం.
బాబు : కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం.. ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్లో మరీ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు (హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటప్పుడు) పది వేలిచ్చాను. ఆ తర్వాత అంతెందుకులే అనుకుని రూ.5 వేలిచ్చా. ఆ తర్వాత దాన్ని రూ.2,000 వేలకు తగ్గించా. ఇలా ఇచ్చింది 1,300 మందికే. నేనేమంటానంటే నాలాంటి వాడు కాస్త లిబరల్‌గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి.
రాధాకృష్ణ: ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే..
చంద్రబాబు: రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తాను.. ఎంత మందికి అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు అట్లా చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment