Leaked video
-
ఫ్లాష్‌బ్యాక్.. నీచంగా మాట్లాడింది గుర్తుందా?
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారిని ముప్ప తిప్పలు పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, సీఎంగా ఉన్న చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి అప్పట్లో లీకైంది. ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాధాకృష్ణ బూతు పురాణం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. చంద్రబాబు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. లీకైన వీడియోలో వారి సంభాషణ ఇలా.. చంద్రబాబు : ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ... రాధాకృష్ణ : ఏంది? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇది అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా.. జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దే వద్దు. తీసేయండి. చంద్రబాబు : అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం. బాబు : కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం.. ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు (హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటప్పుడు) పది వేలిచ్చాను. ఆ తర్వాత అంతెందుకులే అనుకుని రూ.5 వేలిచ్చా. ఆ తర్వాత దాన్ని రూ.2,000 వేలకు తగ్గించా. ఇలా ఇచ్చింది 1,300 మందికే. నేనేమంటానంటే నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. రాధాకృష్ణ: ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే.. చంద్రబాబు: రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తాను.. ఎంత మందికి అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు అట్లా చేయాలి. -
60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ
చండీగఢ్: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగి యూనివర్సిటీ విద్యార్థినిలు నిరసనకు కూడా దిగారు. అయితే విషయంపై యాజమాన్యం స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం, అర్థరహితం అని కొట్టిపారేసింది. యూనివర్సిటీలో ఒక్క అమ్మాయి ప్రైవేటు వీడియో మాత్రమే లీక్ అయినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని వెల్లడించింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ ఒక్క వీడియో తప్ప మరే ఇతర అమ్మాయిల వీడియోలు లీక్ కాలేదని తేలిందని చెప్పింది. 60 ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. There are rumours that 7 girls have committed suicide whereas the fact is that no girl has attempted any such step. No girl has been admitted to hospital in the incident: Chandigarh University pic.twitter.com/5zsMeibsxW — ANI (@ANI) September 18, 2022 అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని బవా చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని కనీసం ఆస్పత్రిలో కూడా చేరలేదని వెల్లడించారు. వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. This is Horrible Scenes From Chandigarh University #justiceforCUgirls #chandigarhuniversity pic.twitter.com/5eLP7BIYTc — r/Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2022 Chandigarh University videos scandal: Protests over objectionable clips of girls bathing in hostel Girl student arrested; police deny reports of suicide attempt on campus Details: https://t.co/RK1H5IZ5WU#chandigarhuniversity #protests pic.twitter.com/y94OTRibmN — Asianet Newsable (@AsianetNewsEN) September 18, 2022 చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..! -
షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి
ఇటీవల భోజ్‌పురి నటి త్రిష కర్ మధు ఎంఎంఎస్ లీకై ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతేగాక ఈ దారుణానికి పాల్పడిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె వాపోయింది. ఇదిలా ఉండగానే తాజాగా మరో భోజ్‌పురి నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో ఓకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. చదవండి: సెక్స్ రాకెట్: టాప్ మోడల్, నటి అరెస్ట్ ప్రియాంక పండిట్ నగ్న వీడియోను పలువురు షేర్ చేయగా మరికొందరు మీమ్స్‌తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాస్తా ఆమె దృష్టికి వెళ్లడంతో నటి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక తనంటే పడని వారు ఎవరో ఈ పని చేశారని, ఈ వీడియో తనది కాదని స్పష్టం చేసింది. అచ్చం తనలా ఉన్న మరో యువతి వీడియోను తన పేరుతో పోస్టు చేసినట్లు పేర్కొంది. అంతేగాక ఈ వీడియో పాతదని కూడా ఆమె వెల్లడించింది. ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు లిఖితపూర్వకంగా ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా..ప్రముఖ నటి వీడియో లీక్ -
‘సలార్’ వీడియో లీక్.. ప్రభాస్ లుక్ అదుర్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సలార్ షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ఇక ఇది సినిమాలో సన్నివేశానికి సంబంధించినది కాదు కానీ సాలార్ షూటింగ్ స్పాట్లో ప్రభాస్‌కు సంబంధించినది. ఈ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ వీడియో లేటెస్ట్ వీడియోనా? కాదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం సన్నాహాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది. #Prabhas Full Video 💥💥 #Salaar Yesterday Shoot Time pic.twitter.com/ztrmSs7zNw — RUPESH CHOWDARY ™ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Rupesh_NC) August 11, 2021 -
ఫుటేజ్‌ను తీయించే వరకు విశ్రమించను
బేబీగా ఎవరికి కనిపిస్తాం? అమ్మానాన్నకే కదా! చిన్నప్పుడే కాదు, ఇప్పుడూ. ఆ ఫొటోలు బైట పెడతామా? గర్ల్స్ మీకే..! ‘ఒక స్మైల్ రా కన్నా..’ అనగానే.. స్టిల్ ఇచ్చేయకండి. వీడియోలోకి వెళ్లిపోకండి. బాయ్‌ఫ్రెండ్ మంచివాడే. అమ్మానాన్న అయితే కాడు. అనుమానిస్తే ఏం పోయింది? నమ్మితేనే కదా ఏదైనా! ఇంటర్నెట్ను.. మీ.. బేబీ అల్బమ్ కానివ్వకండి. అమ్మానాన్న జాగ్రత్త. ఐదేళ్ల ‘లా’ కోర్సు నాలుగో సంవత్సరంలో ఉన్న సోనా అబ్రహాం ఆరేళ్లుగా ఇంటర్నెట్ నుంచి తన వీడియో క్లిప్పులను తీయించడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2013లో పద్నాలుగేళ్ల వయసులో ఆమె నటించిన ‘ఫర్ సేల్’ అనే మలయాళీ చిత్రంలోని రేప్ సీన్ వీడియో క్లిప్పులు అవి! ఒక మైనరు బాలికపై కొందరు అత్యాచారం చేస్తారు. దానిని వీడియోలో చిత్రీకరించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అది చూసి ఆ బాలిక అక్క ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదీ ఆ సినిమా కథ. మైనరు బాలిక పాత్రను సోనా వేసింది. ఆ సీన్‌ని హ్యాండ్ కెమెరాతో ప్రైవేట్‌గా షూట్ చేశారు. సినిమాలో పది సెకన్లు ఉంటుంది. ‘‘అవసరం అయినంత వరకే వాడుకుని మిగతా ఫుటేజ్‌ని డిలీట్ చేస్తాం’’ అని డైరెక్టరు, నిర్మాత చెప్పారు. సోనా నమ్మింది. సోనా తల్లిదండ్రులూ నమ్మారు. ఏడాది తర్వాత ఆ ఫుటేజ్ (సినిమాలో వాడగా మిగిలిన భాగాలు) యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయింది! అంటే వాళ్లు డిలీట్ చేయలేదు. పైగా లీక్ చేశారు. యూట్యూబ్ నుంచి పోర్న్ సైట్‌కు కూడా ఫుటేజ్ చేరిపోయింది! సోనా వణికిపోయింది. తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు తల్లడిల్లిపోయారు. కూతుర్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దురదృష్టం.. ఇప్పటికీ ఆ క్లిప్పులు నెట్లో ఎక్కడో ఒక చోట పైకి లేస్తూనే ఉన్నాయి. సోనాకు ఒకటి అర్థం అయింది. మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలను పోలీసు వ్యవస్థ కూడా ఆపలేకపోతోందని. అయినా నిస్పృహ చెందలేదు. ‘‘ఆనవాళ్లు కూడా లేకుండా క్లిప్పును తీయించేవరకు నేను విశ్రమించను’’ అని అంటున్నారు. అమ్మానాన్న ఆవేదన తీర్చడం ముఖ్యం అనుకుంది. ∙∙ ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ సంస్థ చేపట్టిన ‘రెఫ్యూజ్ ది అబ్యూజ్’ అనే ప్రచారోద్యమం కోసం.. టీనేజ్‌లో తనకు జరిగిన ఆ నమ్మకద్రోహం గురించి సోనా బహిర్గతం చేసినప్పుడు గానీ ఈ విషయం బయటికి రాలేదు. ఇంతకాలం సోనా ఒంటరిగానే పోరాడుతూ వస్తున్నారు. పోలీసులు కూడా చేసిందేమీ లేదు. వీడియో క్లిప్పులు లీక్ అయ్యేలా అలక్ష్యాన్ని ప్రదర్శించిన ఆ నిర్మాత, దర్శకుడు తేలిగ్గానే తప్పించుకున్నారు. సోనా తల్లిదండ్రులు 2014లో ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్‌ను కలిసి కూతురి షూటింగ్ ఫుటేజ్ యూట్యూబ్‌లో రాకుండా చేయమని వేడుకున్నారు. యూట్యూబ్‌కి కమిషనర్ లెటర్ పెట్టినట్లున్నారు. తాత్కాలికంగా అయితే డిలీట్ అయింది. ఆ వెంటనే పోర్న్ సైట్లలోకి, సోషల్ మీడియాలోకి వ్యాపించింది! సోనాకు డైరెక్టర్ రేప్ సీన్‌ను వివరిస్తున్న ఆడియో కూడా ఆ వీడియోకు జత అయి ఉంది. దాంతో అది మామూలు సినిమాకు కాకుండా.. పోర్న్ కోసం చేసిన షూటింగ్‌లా ఉంది. టెన్త్ నుండి ఇంటర్‌కు ఆమెతో పాటు ఆ క్లిప్పులు కూడా వచ్చి జాయిన్ అయ్యాయి! ‘తనే ఆ వీడియోలో ఉంది’ అనే గుసగుస క్లాస్ రూమ్‌లో, కాలేజ్‌లో ఏదో ఒక మూల నుంచి వినిపించేది. గట్టి అమ్మాయి కాబట్టి తట్టుకుని నిలబడింది. ‘‘నమ్మకద్రోహం చేసిన వాళ్లది నేరం అవుతుంది తప్ప, నమ్మి మోసపోయిన వాళ్లది కాదు’’ అని అమ్మానాన్న సోనాను ఊరడిస్తూనే ఉన్నారు. వాళ్లిచ్చిన మానసిక స్థైర్యంతో చదువు మీద దృష్టి పెట్టింది. ‘లా’ చదువుతూనే నటిగా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా గుర్తింపు సంపాదించింది. ఆ గుర్తింపు ఆమె ‘గతానికి’ భవిష్యత్తు లేకుండా చేసింది. క్లిప్పుల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. అయితే తను మాత్రం సైబర్ నేర ప్రపంచాన్ని ఊరికే వదిలిపెట్టదలచుకోలేదు. అమాయకులైన ఎందరో అమ్మాయిలను వలలో పడకుండా చేయడానికి, పడితే బయటికి రప్పించడానికి న్యాయశాస్త్రాన్ని ఒక పదునైన ఆయుధంగా మలచుకోబోతున్నారు. ఆమె కేసు ఇప్పుడు హైకోర్టులో ఉంది. కేరళ ఉమన్ కమిషన్ ఆమెకు అండగా ఉంది. కేరళ పోలీస్ హై టెక్ సెల్ ఇంటర్నెట్ నుంచి సోనా క్లిప్పులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పుడు న్యాయ విద్యార్థిని మాత్రమే. బాలికలు, మహిళలకు సైబర్ అకృత్యాల నుంచి గట్టి రక్షణ కంచెను నిర్మించబోతున్న భవిష్యత్ న్యాయవాది. తన తల్లిదండ్రుల్లా ఇంకొకరు మానసిక క్షోభ పడకూడదని తీర్మానించుకున్న అమ్మాయి. పోరాటం ఆపను మొదట నా వీడియోలు నెట్లో కనిపించినప్పుడు నా జీవితం ముగిసినట్లే అనిపించింది. అందరూ నన్నే చూస్తూ, నా గురించే మాట్లాడుకుంటున్నారన్న భావన! ‘నాకిలా కావలసిందే’ అనుకున్నాను. నన్ను దోషిగా భావించుకున్నాను. తర్వాత ఆలోచిస్తే, ఇందులో నేను చేసిన తప్పేముంది అనిపించింది. ‘తల వంచుకోవలసింది, అవమాన పడవలసిందీ నేను కాదు’ అనుకున్నాను. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను. నా కోసమే కాదు, నాలా మోసపోతున్న అమ్మాయిల కోసం కూడా. – సోనా అబ్రహాం అభినందనలు సోనా సోనా.. జీవితం నరకప్రాయం అవడం అంటే ఏమిటో నేను ఊహించగలను. అమ్మాయిల్ని నిరంతరం ఇలాంటి నరకాలు వెంటాడుతూనే ఉంటాయి.. మన ప్రమేయం ఏమీ లేనివి, నమ్మి మోసపోయినందుకు అనుభవించేవీ! మన ధైర్యమే మన పోరాట శక్తి. నువ్వు ఒక్కరివి, ఒంటరివి కాదు. నీ వైపు నేనున్నాను. నువ్వు చూపుతున్న మనోబలానికి సాటి మహిళగా అభినందనలు, ధన్యవాదాలు. – నటి పార్వతి -
నటి అత్యాచార వీడియో లీక్
స్పెయిన్: ప్రఖ్యాత నటి అత్యాచార వీడియో లీకైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారం జరిగిన రెండేళ్ల తర్వాత వీడియో లీకవడం గమనార్హం. వివరాలు.. బిగ్గెస్ట్ టీవీ రియాలిటీ షో బిగ్‌బ్రదర్ ఆధారంగా స్పెయిన్‌లో ‘గ్రాన్ హెర్మానో’ షో ప్రసారమవుతోంది. 2017లోని సీజన్లో స్పానిష్ నటి కార్లోటా ప్రాడో పాల్గొంది. ఆ హౌస్‌లోకి ఆమె ప్రియుడు జోస్ మారియా లోపెజ్ కూడా వచ్చాడు. వీరిద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా ఓ నాడు ఇంటి సభ్యులంతా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అందరూ మద్యం సేవించి మత్తులో ఎక్కడి వారక్కడే స్పృహ లేకుండా పడిపోయారు. ఈ క్రమంలో కార్లోటాపై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీంతో షో నియమాలు ఉల్లంఘించిన కారణంగా మారియా లోపెజ్‌ను షో నుంచి పంపించేశారు. అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్లోటాను ఓ గదిలోకి పిలిపించి కెమెరాల్లో రికార్డైన అత్యాచార వీడియోను చూపించారు. అది చూసి స్థానువైపోయిన కార్లోటా.. ఆపండి.. ప్లీజ్.. నావల్ల కాదు, దయచేసి ఆపేయండి అంటూ చేతులెత్తి వేడుకుంది. రోదిస్తున్న హృదయంతో, కన్నీళ్లతో అర్తించింది. అయినా సరే, షో నిర్వాహకులు ఆ రాత్రి తనపై అత్యాచారం జరిగిన పుటేజీలను ఆమెకు చూపించారు. షో యాజమాన్యం బాధితురాలి అత్యాచార వీడియోను టెలికాస్ట్ చేయలేదు కానీ బయటకు లీకవకుండా కాపాడలేకపోయింది. పైగా వీటిని కొన్ని కంపెనీలు ప్రచారం కోసం యాడ్స్‌లో వాడుకోవడం సిగ్గుచేటు. దీనిపై అక్కడి ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుడిని శిక్షించాలని.. అంతేకాక నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారితీసిందంటూ షోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. -
నా పేరే ఎందుకు?
రిలీజ్ కాని సినిమాలకు చెందిన క్లిప్పింగ్‌లు, స్టిల్స్ అప్పుడప్పుడు నెట్లో వైరల్ కావడం ఈ టెక్నాలజీ యుగంలో సాధారణ విషయమై పోయింది. హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమా రొమాంటిక్ సీన్ ఒకటి నెట్లో వైరల్‌గా మారింది. అది దేవ్ పటేల్, రాధికా ఆప్టే మధ్య సాగే శృంగార సన్నివేశం. ఈ వీడియోకి సంబంధించిన ఫొటోలు ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని ఎక్కువగా నెట్లో తిరుగుతోంది. ఈ విషయంపై రాధికా ఆప్టే స్పందించారు. ‘‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో బోలెడన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అందుకో హైలీ రొమాంటిక్ సీన్ ఒకటి లీకైంది. కానీ ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని నా పేరుతోనే ఎందుకు? ఇది ప్రచారం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందులో దేవ్ పటేల్ కూడా ఉన్నారు కదా. హీరో పేరుతో కాకుండా హీరోయిన్ పేరుతో ఎందుకు వైరల్ చేస్తున్నారు. సొసైటీలో ఉన్న సైకో మెంటాలిటీస్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయనిపిస్తోంది’’ అన్నారు రాధిక. మూడేళ్ల క్రితం ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు రాధికా ఆప్టే. అప్పుడు లీకైన వీడియోలో నటుడు రాధికా ఆప్టేతో నటుడు ఆదిల్ హుస్సేన్ ఉన్నారు. అప్పుడు కూడా రాధికా ఇలానే స్పందించారు. -
‘బ్రహ్మాస్త్ర’ వీడియో లీక్..!
బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరు బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వీడియో లీక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గోడ మీదనుంచి రోప్స్ సహాయంతో.. రణ్‌బీర్ కపూర్ ముందుకు వెళ్తుండం.. ఆలియా భట్ కూడా తన వెనక రావడం.. అయితే ఆలియా ఎక్కడ జారి పడుతుందో అంటూ జాగ్రత్తగా చేయి పట్టుకోవడం.. లాంటి దృశ్యాలతో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఓ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవలే పూర్తిచేసినట్లు నాగ్ తెలిపాడు. -
లీకైన రజనీ యాక్షన్ వీడియో
స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పటం లేదు. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రజనీకాంత్ సినిమా క్లిప్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై మాఫీయా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం లీకైంది. యాక్షన్ సీన్‌కు సంబంధించిన ఈ క్లిప్ లో రజనీ మంటల మధ్యలో విలన్లతో పోరాడుతున్నాడు. వీడియో లీక్‌పై ఇప్పటికే చిత్రయూనిట్ చర్యలు ప్రారంభించింది. ఎడిటింగ్ జరుగుతున్న సమయంలోనే క్లిప్ లీక్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాలా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ కానుంది. -
ఆ ప్రశ్న అడిగినందుకు హీరోయిన్ ఆగ్రహం!
తన అభినయంతో బాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ రాధికా ఆప్తే. 'కబాలి' సినిమాతో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు తాజాగా 'పర్చెడ్' సినిమాలో బోల్డ్ నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమాలో రాధికా ఆప్తే నటించిన నగ్న శృంగార దృశ్యాలు ఆన్లైన్లో లీకై దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నగ్న దృశ్యాల లీక్ గురించి ప్రశ్నించిన ఓ విలేకరిపై రాధికా ఆప్తే ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సారీ, మీ ప్రశ్న చాలా మూర్ఖంగా ఉంది. మీలాంటి వ్యక్తుల వల్లే వివాదాలు పుడుతాయి. మీరు ఆ దృశ్యాన్ని చూశారు. దానిని ఇతరులతో పంచుకున్నారు. కాబట్టి మీరే ఆ వివాదాన్ని సృష్టించారు' అంటూ ఆ విలేకరికి ఆమె షాకిచ్చారు. 'పర్చెడ్' సినిమాలో రాధికా ఆప్తే, అదిల్ హుస్సేన్ మధ్య ఉన్న రొమాంటిక్ దృశ్యాలు ఆన్లైన్లో లీక్ కావడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఆ ఒక్క దృశ్యం కన్నా ఎంతో కీలకమైన కథాంశం ఉందని, స్త్రీల దృక్కోణంలో సినిమా తెరకెక్కిందని చిత్ర రూపకర్తలు తెలిపారు. ఏమాత్రం బెదరకుండా మనస్సులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రాధికా ఆప్తే ఈ వివాదంపై గతంలో స్పందించారు. ఆ ఒక్క దృశ్యం గురించి వివాదం చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. తానొక నటిని అని, తాను ఎలాంటి పాత్ర వచ్చినా దానిని చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ సినిమాలను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుందని ఆమె పేర్కొంది. -
లీకైన వీడియోకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తాజా సినిమా 'పర్చెడ్' సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఈ లీక్ విషయంలో 'కబాలి' హీరోయిన్ రాధికకు సహ నటుడు ఆదిల్ హుస్సేన్ అండగా నిలిచారు. 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' పేరిట దృశ్యాలను ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దృశ్యాలను ఎందుకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్' అని పేర్కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ దృశ్యంలో తామిద్దరం నటించినా.. రాధికను కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్నిరోజుల కిందట ఇంటర్నెట్లో లీకైన ఈ ఘాటైన దృశ్యాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలను ఎవరూ లీక్ చేశారనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'లీకైన వీడియోలకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్' అని అనకుండా 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' అని టైటిల్ పెట్టారు. ఎందుకంటే పురుషుడు శృంగారంలో పాల్గొనడం ఈ దేశంలో పెద్ద విషయం కాదు. కానీ మహిళల విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తారు. మన నివసిస్తున్న పితృసామ్య వ్యవస్థ ఆలోచన ధోరణిని ఇది చాటుతోంది. పాశ్చాత్య దృశ్యాల్లో అలాంటి సీన్లు సినిమాలో ఉండటం మాములు విషయమే' అని పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నా కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన సమాజ వైఖరిని అద్దం పడుతోందని పేర్కొన్నారు. లీనా యాదవ్ తెరకెక్కించిన 'పర్చెడ్' సినిమా 2015 టొరంటో చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఓ భార్య, ఓ తల్లి, ఓ కూతురు, ఓ వేశ్య.. ఇలా నలుగురు మహిళల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. -
బ్రేక్‌ఫాస్ట్ షో : ఈ దృశ్యాలు శ్రీవారివే(నా)!!
-
ఈ దృశ్యాలు.. తిరుమల శ్రీవారివే(నా)?!