![Rajinikanth in kaala - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/13/Rajinikanth.jpg.webp?itok=QlQ0rBKX)
‘కాలా’ చిత్రంలోని ఓ దృశ్యం
స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పటం లేదు. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రజనీకాంత్ సినిమా క్లిప్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ముంబై మాఫీయా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం లీకైంది. యాక్షన్ సీన్‌కు సంబంధించిన ఈ క్లిప్ లో రజనీ మంటల మధ్యలో విలన్లతో పోరాడుతున్నాడు. వీడియో లీక్‌పై ఇప్పటికే చిత్రయూనిట్ చర్యలు ప్రారంభించింది. ఎడిటింగ్ జరుగుతున్న సమయంలోనే క్లిప్ లీక్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాలా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment