సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇండియావైడ్‌గా క్రేజ్ ఉంటుంది. రజనీ సెలబ్రిటీలకే సెలబ్రిటీ. తలైవా సినిమా వస్తోందంటే ఎవరైనా వెనక్కి వెళ్లాల్సిందే. రజనీ తాజా చిత్రం కాలా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. విడుదలకు ముందే ‘కాలా’ కళ్లు చెదిరే రికార్డులను నెలకొల్పింది.
కబాలి ఆశించినంతగా ఆడకపోయినా ఈ సినిమా దాదాపు 600కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. కేవలం సూపర్‌స్టార్ మేనియా ఈ సినిమా కలెక్షన్లను పెంచింది. ప్రసుత్తం కాలా సినిమా విడుదలకు ముందే 230కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్‌లో 70కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 33కోట్లు, కేరళలో పది కోట్లు, రెస్టాఫ్ కంట్రీ ఏడు కోట్లు, ఓవర్సిస్ హక్కులు 45కోట్లు, థియేట్రికల్ హక్కులు 155కోట్లు, బ్రాడ్ కాస్ట్ హక్కులు 70కోట్లు, మ్యూజిక్ ద్వారా 5కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కాలాకు కష్టాలు తొలగి, విడుదలకు మార్గం సులువైతే ఇంకో 20కోట్ల బిజినెస్ జరగవచ్చు. కానీ కాలాకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. దాదాపు ఈ సినిమా 280కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్‌గా చెప్పవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
Comments
Please login to add a commentAdd a comment