Pa Ranjith
-
నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా!
వైవిధ్యభరిత కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ పా.రంజిత్. చుట్టూ ఉన్న సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకుని సినిమా అనే శిల్పంగా చెక్కుతుంటాడు. ఈయన సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లో బాటిల్ రాధ అనే సినిమా నిర్మిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్నదే కథ.పా.రంజిత్ ఎమోషనల్ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో పా.రంజిత్ (Pa. Ranjith) తన గతాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తోంది. తినే తిండి కోసం మనం ఎవరిపైనా ఆధారపడకూడదు. మా నాన్న కూడా ఎప్పుడూ అలాంటి పరిస్థితి రానివ్వలేదు. ఏనాడూ మమ్మల్ని పస్తులుంచలేదు. మేము మంచి బట్టలు వేసుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్తుండేవాడు. అందుకోసం ఎంతో కష్టపడేవాడు.(చదవండి: పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?)పండగరోజు అమ్మ ఏడుస్తూ..కానీ ఎప్పుడైతే తాగడం మొదలుపెట్టాడో తనను తానే కోల్పోయాడు. నాకు బాగా గుర్తుంది.. ఓ పండగరోజు ఊర్లోని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మా ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు నేను పన్నెండవ తరగతి చదువుతున్నాను. మా అమ్మ అలా నిత్యం ఏడుస్తుంటే చూడలేకపోయాను. తన బాధ భరించలేకపోయాను. చచ్చిపోదామనుకున్నాను. మా నాన్నతో మందు మాన్పించాలని అమ్మతో పాటు నా సోదరులు కూడా చాలా ప్రయత్నించారు.మద్యానికి బానిసై చనిపోయాడుచివరకు ఆస్పత్రిపాలయ్యాడు. ఆరు నెలలకంటే ఎక్కువ బతకడని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే కన్నుమూశాడు. నాన్న.. మా అమ్మను కష్టపెట్టినట్లుగా నేను నా భార్యాపిల్లల్ని బాధ పెట్టకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. బాటిల్ రాధ సినిమా (Bottle Radha Movie) విషయానికి వస్తే.. దినకరణ్ శివలింగం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో గురు సోమసుందరం, సంచన నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.విభిన్న సినిమాల డైరెక్టర్పా.రంజిత్ విషయానికి వస్తే.. అట్టకత్తి సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు. కార్తీతో మద్రాస్ మూవీ చేశాడు. రజనీకాంత్‌తో కబాలి, కాలా సినిమాలు చేశాడు. సార్పట్ట పరంపరై, నచ్చత్రం నగర్గిరదు మూవీస్ తెరకెక్కించిన ఈయన చివరగా తంగలాన్ చేశాడు. హిందీలోనూ నేరుగా ఓ సినిమా చేస్తానని గతేడాది ప్రకటించాడు. దీనికి బిర్సా ముండా అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు. ఎవరీ బిర్సా ముండాబిర్సా ముండా ఆదివాసీ నాయకుడు. 19వ శతాబ్దంలో జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 22 ఏళ్ల వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా నామకరణం చేశారు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా! -
సడెన్‌గా ఓటీటీలో 'తంగలాన్' సినిమా
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తంగలాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.తంగలాన్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిల్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం తాజాగా విడుదలైంది. తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
'తంగలాన్' ఓటీటీ విషయంలో తీర్పు వెల్లడించిన కోర్టు
విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో కాస్త జాప్యం ఎదురైంది. సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిని ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. అయితే, తంగలాన్ ఓటీటీ అంశంపై మద్రాస్ ప్రధాన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పలు తేదీలలో స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఓటీటీలో తంగలాన్ సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్లో తెలిపారు.తంగలాన్ ఓటీటీ వివాదం పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. 'తంగళన్ సినిమా ప్రభుత్వ నింబధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. తంగలాన్ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. స్టూడియో గ్రీన్ కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన తంగలాన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 110 కోట్లు రాబట్టింది. కోర్టు తీర్పుతో దీపావళి కానుకగ తంగలాన్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. -
'బిర్సా ముండా' జీవితంపై పా. రంజిత్ సినిమా ప్రకటన
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన తంగలాన్ రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈమేరకు చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమా తాజాగా హిందీ వర్షన్‌తో బాలీవుడ్లో విడుదలకానుంది. ఈ సందర్భం డైరెక్టర్ పా.రంజిత్ తన కొత్త సినిమా గురించి వెల్లడించారు. ఈసారి హిందీలో స్ట్రెయిట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశానని, దానికి 'బిర్సా ముండా' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు పా.రంజిత్ అధికారికంగా ప్రకటించారు.పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకొని వాటికి అందరూ మెచ్చేలా కమర్షియల్ పంథాలో సినిమా తీస్తారు. అందుకే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తెరకెక్కించనున్న బిర్సా ముండా చిత్రం కూడా అదే కోవకు చెందినదిగా చెప్పవచ్చు. అయితే, ఇందులో నటించబోయే నటీనటుల పేర్లు ఆయన వెల్లడించలేదు.ఎవరీ బిర్సా ముండాఆదివాసీ నాయకుడు బిర్సా ముండా (1875–1900) జీవిత చరిత్ర చాలా ఎమోషనల్‌గా ముగుస్తుంది. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనొక జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడిగా బిర్సా ముండా గుర్తింపు పొందారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. -
చరిత్ర కుహరాల నుంచి...
అణగారిన ప్రజలు తమకి ఓ గొప్ప పోరాట చరిత్ర ఉందని తెలిస్తే యధాతథ వాదాన్ని అంగీ కరించరు. వర్తమానంలో తమపై అమలయ్యే వివక్షను కచ్చితంగా ఎదిరిస్తారు. అది తమ తలరాత అని ఊరుకోకుండా తమపై రుద్దిన బానిసత్వంపై తిరగబడి తమదైన కొత్త సమాజాన్ని నిర్మించుకుంటా రని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో చెప్పాడు. ఫూలే చెప్పిన పోరాటాల చరిత్రను... ప్రాచీన భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి– వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశదీ కరించాడు. ఇంతకాలం కట్టుకథలు, పిట్టకథలు చరిత్రగా చలామణి అయినట్లే మన సినిమాలు కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేస్తూ కొందరి జీవితాన్నే అందరి జీవితంగా కాకమ్మ కథలతో జనం కంట్లో కారం కొట్టి బతికేస్తున్నాయి.అయితే సింహాల నుంచి చరిత్రకారుడు పుట్టు కొచ్చాడు. వర్ణ అంధత్వంతో కునారిల్లిన నూరేళ్ళ వెండి తెరను బదబదాలుగా చించి పోగులు పెడుతూ సరికొత్త దారిని వేసుకుంటూ పోతున్నాడు పా. రంజిత్. అవును పా. రంజిత్ అసలైన చరిత్రను రక్తమాంసాలతో సిల్వర్ స్క్రీన్ మీద పరుస్తున్నాడు. తంగలాన్ ఈ దేశ మూలవాసుల అసలు చరిత్ర... చూసినవాళ్లకి కంటి మీద కునుకు పడ నీయని చరిత్ర! తంగలాన్ అందర్నీ తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. కడుపులో చేయిపెట్టి దేవుతున్నాడు. కొందరు బాహాటంగానే వాంతులు చేసుకుంటున్నారు. మరికొందరికి రక్తం మరుగుతుంది, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చారెడు భూమి కోసం, కాసింత గౌరవం కోసం తమవాళ్ళు చేసిన హాహాకారాలు, కొండలు గుట్టలు దాటి నడిచిన యోజనాలు, కడచిన దారులు, చరిత్ర పొడవునా పారిన నెత్తురు కళ్ళముందు కదులుతూంటే గుండె చెరువవుతోంది.ఎవరు కాదని బుకాయించినా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం బౌద్ధంలో ఉంది. నేటి దళితులు బౌద్ధ సాహి త్యంలో పేర్కొన్న నాగుల సంతతివారు. వారే బౌద్ధాన్ని అవలంబించి బుద్ధుని మార్గంలో నడి చిన శాంతి కాముకులు. కానీ బౌద్ధాన్ని చంపి, బౌద్ధులపై అంటరాని తనాన్ని రుద్దుతూ వారి మెడలో ముంతలు కట్టింది వైదిక బ్రాహ్మణ మతం. తర్వాత తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దళితుల మెడలో ముంతను అంతే ఉంచి జంధ్యం వేసింది. వైష్ణవ మతంలోకి వెళ్ళిన దళితులను వెళ్లని వారి నెత్తిన కూర్చోబెట్టింది. ఈ చరిత్రను తంగలాన్‌లో పా. రంజిత్ కళ్ళకు కట్టించాడు.బౌద్ధంలో ‘హారీతి’ అనే దేవత ఉన్నట్టు తెలుగు శాస నాల్లో కూడా ఉంది. ఆమె ఒక ప్రకృతి దేవత. వజ్రయానంలో సిద్దులు చేసిన ప్రయోగాలు, సిద్దుల రసవాదం పక్కన పెట్టి వారిని ‘క్షుద్ర’ విద్యలు తెలిసిన మాంత్రి కులనీ, బుద్ధుడిని అశుభానికి గుర్తుగా ప్రచారం చేసింది పూజారి వర్గం. బౌద్ధాన్ని అవలంబించేవారిని ఉలిపి కట్టెలుగా, సమాజానికి కీడు చేసేవారిగా చిత్రించి వారిపట్ల ద్వేష భావం పెంచడాన్ని ఈ సినిమాలో సందర్భానుసారంగా చూపించాడు. తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమాజాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం.కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్. తంగలాన్ దళిత సమస్య తాలూకు ప్రతి అంశాన్నీ తడిమిందని చెప్పాలి. దళిత స్త్రీలు ఒకప్పుడు పైవస్త్రం రవిక వేసుకునే వీలు లేదు. అది కొన్ని ప్రాంతాలలో నిషేధం అయితే మరికొన్ని చోట్ల తమ పేదరికం వలన కూడా వారికి అది దక్కేది కాదు. వారు రవిక ధరించడం తమ జనంలో ఓ గొప్ప ఉత్సవం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశం ఒకటి అద్భుతంగా చిత్రించాడు పా. రంజిత్.అలాగే దళితుల ఆహారం! వారంతా గని తవ్వకం పనికి కోలార్ వెళ్లినాక కథానాయకుడు తంగలాన్‌తో అతని భార్య గంగమ్మ ‘మావా చింతపండు పులుసు పోసి నెత్తళ్ళ కూర వొండేదా?’ అంటే అతడు ‘కాదుమే, ఎండు తునకలు కూర చెయ్’ అంటాడు. వారు తిండిలేక అలమటిస్తున్నప్పుడు ఒక అడవి దున్న కనిపిస్తే దానిని నరికి మాంసం తిని తిరిగి శక్తి తెచ్చుకుని పని మెదలు పెట్టాలి అనుకుంటారు. ఇవన్నీ వారి జీవితాలలో సహజాతి సహజం. దళిత సమాజంలో స్త్రీ–పురుష సంబంధాలలో ఒకప్పుడు కనిపించే అరమరికలు లేనితనం, గుంపులో ఒకరిపట్ల మరొకరికి ఉండే కన్సర్న్, సామూహికత, చక్కటి సంభాషణలు తంగలాన్ సినిమాకు గొప్ప సౌందర్యాన్ని అద్దాయనవచ్చు.తెగిపడిన శాక్యముని తలని అతికించడం, చరిత్రలో కానరాకుండా పోయిన బంగారం లాంటి మూలవాసుల చరిత్రను వెలికితీయడం... అనే రెండు ముఖ్యమైన కర్తవ్యా లను తంగలాన్ శక్తిమంతంగా నిర్వహించింది. భూమి కోసం, భుక్తికోసం, ఆత్మగౌరవం కోసం చరిత్ర పొడవునా దళితులు వేసిన పొలికేకలు ఈ సినిమాలో మనకి అడుగ డుగునా వినిపిస్తాయి. చరిత్ర కళ్ళకు కట్టినట్టు వాస్తవికంగా కనిపించడం తంగలాన్ విజయం! నూరేళ్ళ వెండితెరపై మట్టి పాదాల్ని తన సంతకంగా ముద్రించిన సిసలైన తంగలాన్ పా. రంజిత్, తంగలాన్ పాత్రలో పూర్తిగా నిమగ్నమై గొప్పగా దానికి జీవం పోసిన హీరో విక్రమ్, అతని భార్యగా నటించిన పార్వతి, ప్రకృతి దేవత ‘ఆరతి’గా నటించిన మాళవిక, ఇతర నటీనటులు; ఒళ్ళు గగుర్పొడిచే సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్, ‘అంటారానోళ్ల’ చరిత్రని సంగర్వంగా సమర్పించిన జ్ఞాన వేల్... అందరికీ జై భీమ్!'తమిళనాడు నుంచి కోలార్ బంగారు గనులకు కూలికోసం గని తవ్వకం పనికి వెళ్లి అక్కడే స్థిరపడిన దళితులు 19వ శతాబ్దం చివరికి కేజీఎఫ్‌లో ఓ కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు. పండిత అయోతీదాసు కేజీఎఫ్ కేంద్రంగా ఆది ద్రావిడ ఉద్యమాన్ని నిర్మించాడు. దళితులు హిందువులు కాదు, ఆది బౌద్ధులని చెప్పి వారిలో ఆత్మగౌరవాన్ని నూరిపోసి ‘శాక్య బౌద్ధ సమా జాన్ని’ స్థాపించిన అయోతీదాసుకి కేజీఎఫ్ ఒక లిబరేటెడ్ లాండ్ (విముక్త భూమి). దీనికి కొనసాగింపుగా పెరియార్ 1932లో ద్రావిడ ఉద్యమాన్ని కేజీఎఫ్ నుంచే ప్రారంభించడం విశేషం. కేజీఎఫ్‌లో దళితులు ఇప్పటికీ కులానికీ, మత తత్వానికీ ఎదురు నిలుస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా నిర్మిస్తున్నారు. దాని వెనుక ఉన్న త్యాగాల చరిత్రను పట్టుకున్నాడు పా. రంజిత్'.– చల్లపల్లి స్వరూపరాణి, వ్యాసకర్త, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ -
నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్
కోలివుడ్ దర్శకుడు పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. అయితే, తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాకు అవార్డు రాకుండా అడ్డకున్నారని ఆయన ఆరోపించారు. పా.రంజిత్ చిత్రాల్లో రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అవి సామాజిక సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయి. సినిమాల ద్వారా రాజకీయాలను మాట్లాడతానని పా.రంజిత్ ఇటీవల స్ఫష్టంగానే చెప్పారు. ఈయన తాజాగా విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తంగలాన్ చిత్రం విశేష ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా పా.రంజిత్ ఇంతకు ముందు ఆర్య హీరోగా రూపొందించిన చిత్రం సార్పట్ట పరంపర. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ కూడా చేస్తానని దర్శకుడు ప్రకటించారు. కాగా ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులపై స్పందించిన దర్శకుడు పా.రంజిత్ సార్పట్ట పరంపర చిత్రానికి అవార్డు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపించారు. దీని గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల కారణంగానే తనను తన పనిచేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సార్పట్ట పరంపర చాలా పెద్ద విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్ర రెండో భాగం గురించి పలు విమర్శలు వచ్చాయన్నారు. అయితే, అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రం బహిరంగంగానే నిరాకరణకు గురైందన్నారు. పలు క్రిటిక్స్ అవార్డులను ఈ చిత్రం పొందిందన్నారు. అలా క్రిటిక్స్ అవార్డులను పొందిన చిత్రాలకు కచ్చితంగా జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. అయితే సార్పట్ట పరంపర చిత్రాన్ని జాతీయ అవార్డుల దరిదాపుల్లోకే వెళ్లలేకపోయిందని అన్నారు. ఆ అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రానికి అర్హత లేదా అని ప్రశ్నించారు. తన భావాలను ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిరాకరించారనే ఆరోపణను చేశారు. కావాలనే తన పనిని గుర్తించకూడదని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని అన్నారు. ఈ రాజకీయ ద్వేషాన్ని తాను అర్థం చేసుకోగలనని దర్శకుడు పా.రంజిత్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ వైపు తంగలాన్.. విడుదల తేదీ ప్రకటన
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సుమారు రూ. 40 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు,తమిళ,కన్నడలో మాత్రమే విడుదలైన తంగలాన్ ఇప్పుడు హిందీలో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. సౌత్ ఇండియా అభిమానులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. తాజాగా డైరెక్టర్ పా.రంజిత్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్టర్‌తో ఈ విషయం తెలిపారు. 'బంగారు వీరుడు ఆగస్టు 30న ఉత్తర భారత దేశానికి వస్తున్నాడు. ఈ ఎపిక్ స్టోరీని చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కథేంటి..?1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. -
'తంగలాన్' మరో కోణంలో చూస్తే.. సోషల్ మీడియా రివ్యూస్
ఆగస్టు 15న రిలీజైన డబ్బింగ్ సినిమా 'తంగలాన్'. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకొచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత తర్వాత మెల్లగా పికప్ అవుతోంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలవడం కూడా దీనికి ప్లస్. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో కొందరు తెగ నచ్చేస్తే.. మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. అయితే 'తంగలాన్'ని మరో కోణంలో చూసిన కొందరు సోషల్ మీడియాలో తమదైన రివ్యూలు ఇచ్చారు. అలాంటి వాటిలో కొన్ని మీకోసం..(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా)'ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో చెప్పేదే 'తంగలాన్' సినిమా. అలాగే మన సంస్కృతి, జీవన విధానాన్ని తెలియపరిచేలా లోతుగా అర్థం అయ్యేలా చాటి చెప్పిన దర్శకుడు పా.రంజిత్. మహిళలకు రవికలు పంచగానే అవి వేసుకుని ఊరంతా సంబరాలు జరుపుకొనేలా వచ్చే పాట 'మనకి మనకి'.. మన అమ్మలు, నాయనమ్మలు చిన్నతనంలో రోళ్లలో వడ్లు పోసి, దంచుతూ పాడుకునేలా సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, తంగలాన్ బట్టలు వేసుకుంటే ఓర్వకుండా చింపిన మళ్ళీ సూది దారంతో కుట్టుకుని తిరిగి వేసుకోవడం ఇదే కదా ఆత్మ గౌరవంతో కూడిన చారిత్రక జీవన విధానం. -సతీశ్ పొనగంటి'తంగలాన్' సినిమా ఆలోచన నాకు చాలా నచ్చింది. దక్షిణాది భారతీయుల చరిత్రని చూపించాడు. అప్పటి పరిస్థితులని చాలా అద్భుతంగా చూపించాడు. అయితే కథలో వివరణ మొదలవగానే నాకెందుకో డిస్ కనెక్ట్ అయిపోయాను. తంగలాన్ చూస్తుంటే.. ఫిట్జ్ కరాల్డో సినిమా గుర్తొచ్చింది. ప్రస్తుతమున్న వాళ్లలో డేరింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్ పా.రంజిత్. 'తంగలాన్' అస్సలు మిస్సవ్వొద్దు. -వెంకట సిద్ధారెడ్డి(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)కటిక దరిద్రుల ఆకలి పోరాటం- తంగలాన్... వాళ్లు పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూల వాసులు, దళితులు, ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు.. భార్యలతో బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురూ కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఓ ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు 'తంగలాన్'. కొన్ని నిజజీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం- తంగలాన్.సర్పట్ట చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు తంగలాన్! వీటిని తీసిన పా.రంజిత్ అనే వాడు మామూలు మనిషి కాదు. మహాదర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు. మన కాలం వీరుడు. 'నేను అంబేద్కరిస్ట్ని' అని ప్రకటించుకున్న రంజిత్.. రొటీన్ రొడ్డకొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థముంది. అతని ఆగ్రహానికో పద్ధతి ఉంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు. అదో తపస్సు. చెక్కు చెదరని నిబద్ధత. ఓ సూపర్ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ ఒళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్ చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ, ముందు మొనదేలిన ఈటెలూ, బంగారం ఒక తీరని దాహం, దురాశ. ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి! ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే, కమర్షియల్ స్కీమ్తోనే కొట్టాలి. బలమైన బ్లాక్‌బస్టర్ టెక్నిక్‌తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పా.రంజిత్ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన ఓ చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు. -తాడి ప్రకాష్ (ఇదీ చదవండి: ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్) -
తంగలాన్ కోసం విక్రమ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది. మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్ చేసే పా. రంజిత్.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది 'కేజీఎఫ్'. మళ్లీ అదే గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్.తంగలాన్ మేకింగ్ వీడియో చూసిని ప్రేక్షకులు విక్రమ్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో కొంతమేరకు మాత్రమే మేకింగ్ వీడియోలో చూపించారు. వైవిధ్య పాత్రలతో ఎప్పుడూ మెప్పించే చియాన్ విక్రమ్ 'తంగలాన్' కోసం కొత్త మేకోవర్‌లో దుమ్మురేపాడు. కేవలం విక్రమ్ కోసమే ఈ సినిమా చూడొచ్చు అనేలా వెండితెరపైన విజృంభించాడు. తంగలాన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో బరిసెలతో, ఈటెలతో ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా ఆయన నటించారు. ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తాజాగా విక్రమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
పేపర్ టీ కప్ కాంట్రవర్సీలో 'తంగలాన్' డైరెక్టర్
సెలబ్రిటీలు తమ సినిమా రిలీజ్‌కి ముందు వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేం కాదు. కావాలని చేస్తారో లేదంటే అనుకోకుండా జరుగుతుందో తెలీదు గానీ ఇలా జరిగిపోతుంటాయి. ఆగస్టు 15కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో డబ్బింగ్ మూవీ 'తంగలాన్' ఒకటి. దీని డైరెక్టర్ పా.రంజిత్. ఇతడే తాజాగా అంటరానితనంపై విచిత్రమైన కామెంట్స్ చేసి ట్రోలర్స్‌కి టార్గెట్ అయిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత ఇన్నాళ్లకు తిరుమలలో వరుణ్-లావణ్య)తమిళంలో రజనీకాంత్‌తో 'కబాలి', 'కాలా' సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్.. 'సార్పట్టా పరంపరై' అనే సినిమా తీశాడు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మీరు చూసే ఉంటారు. అగ్ర కులాల ఆధిపత్య ధోరణిపై ఎక్కువగా సినిమాలు తీసే ఇతడు.. తన భావజాలన్నే ఎక్కువగా చూపిస్తుంటాడనే పేరుంది. ఇప్పుడు 'తంగలాన్' రిలీజ్‌కి ముందు విచిత్రమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయిపోయాడు.'పేపర్ కప్పుల్లో టీ తాగడం అనేది కూడా ఆధునిక యుగంలో అంటరానితనమే' అని డైరెక్టర్ పా.రంజిత్ అన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడంలో భాగంగా పేపర్ కప్స్ అనేవి ప్రవేశపెట్టారు. ఈ చిన్న లాజిక్ మిస్ ఎలా మిస్ అయిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)Pa.Ranjith about paper cup in tea stalls. https://t.co/If0v93KsWX— Blue Sattai Maran (@tamiltalkies) August 14, 2024 -
తంగలాన్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..
కోలీవుడ్ సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విక్రమ్ ఫ్యాన్స్ తంగలాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15న విడుదల కానుంది. పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్ నెగటివ్ రోల్ పోషిస్తుండగా.. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.కోలార్ బంగారు గనుల నేపధ్యంలో, అక్కడ పని చేసే కార్యికుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్ర విడుదల తేదీని పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆగస్ట్ 15వ తేదీన తమిళం,తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తంగళాన్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.విక్రమ్, మాళవికా మోహనన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ట్రైలర్‌తోనే తెలుస్తోంది. వారిద్దరి మేకప్ కోసమే చాలా సమయం తీసుకున్నట్లు పలుప ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. సినిమా కోసం ఎంతటి కష్టమైన భరించే విక్రమ్ తంగలాన్ కోసం 35 కేజీలు తగ్గారట. ఈ సినిమాలో మరో విశేషం విక్రమ్‌కు ఎలాంటి డైలాగ్స్ ఉండకపోవడమని తెలుస్తోంది. అభిమానుల అంచనాలకు మించి తంగలాన్ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించాడు. ఆగష్టు 15న తంగలాన్ ప్రపంచంలో అద్భుతాలు ఉంటాయని అభిమానులు అంచనాలతో ఉన్నారు. -
డేట్ ఫిక్స్
‘తంగలాన్’ సినిమా థియేటర్స్‌కు వచ్చే తేదీ ఖరారైంది. విక్రమ్ హీరోగా నటించిన ఈ పీరియాడికల్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ శుక్రవారం ప్రకటించింది. పా. రంజిత్ దర్శకత్వంలో నీలమ్ప్రోడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు.18వ శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో విక్రమ్ ఓ తెగకు చెందిన నాయకుడిగా కనిపిస్తారు. -
విక్రమ్ భారీ బడ్జెట్ చిత్రం.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో విక్రమ్ లుక్, నటన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది.ఈ మూవీ ట్రైలర్ కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 10న తంగలాన్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ పా రంజిత్ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.కాగా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో కబాలి, కాలా, సార్పట్ట చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. A quest for gold and a battle for liberation meet through bloodshed 🔥#ThangalaanTrailer July 10th ✨@chiyaan @Thangalaan @GnanavelrajaKe @StudioGreen2 @OfficialNeelam @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @dhananjayang @NetflixIndia @jungleemusicSTH pic.twitter.com/rqyngoHRur— pa.ranjith (@beemji) July 8, 2024 -
తంగలాన్ రెడీ.. విడుదల ఎప్పుడంటే..?
విక్రమ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం విక్రమ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. కానీ, అప్పుడు కూడా ‘తంగలాన్ ’ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు.తాజాగా తంగలాన్ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వాయిదా పడింది. డిసెంబర్ 6న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. దీంతో తంగలాన్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. బన్నీ ముందుగా ఫిక్స్ చేసుకున్న ఆగష్టు 15ను విక్రమ్ లాక్ చేయనున్నాడని సమాచారం. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని పా. రంజిత్ తాజాగా తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
విక్రమ్ తంగలాన్.. ఆ నెలలోనే రిలీజ్‌కు ప్లాన్!
పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాను డైరెక్టర్ పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. స్టూడి యో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మాళవిక మోహన్, పార్వతి, డేనియల్ కల్టిగరోన్, పశుప తి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలోని గోల్డ్ మైన్ కార్మికుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. మొదట తంగలాన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చారు.కాగా తాజాగా చిత్రాన్ని జూన్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో తంగలాన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందించారు. -
విక్రమ్ క్రేజీ మూవీ.. డైరెక్టర్ లేటేస్ట్ అప్డేట్!
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పా.రంజిత్ సినిమా విడుదలపై స్పందించారు. దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ.. 'తంగలాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాను సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ డిఫెరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రలు పోషించారు. -
సెన్సార్ బోర్డుపై దర్శకుడు ఫైర్.. నా సినిమా అంటే చాలు..
దర్శకుడు పా.రంజిత్ చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అదే సమయంలో సెన్సార్ బోర్డు నుంచి సమస్యలూ ఎదురవుతుంటాయి. తాజాగా ఆయన సొంత బ్యానర్ 'నీలం ప్రొడక్షన్స్' సమర్పణలో తెరకెక్కిన బ్లూస్టార్ మూవీకి ఈ చిక్కులు తప్పలేవు. అశోక్ సెల్వన్, శాంతను, పృథ్వీ పాండియరాజన్, కీర్తిపాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జై కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెల 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బ్లూస్టార్‌కు ఎలాంటి సమస్యలు ఉండవనుకున్నా.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పా.రంజిత్ మాట్లాడుతూ.. నీలం ప్రొడక్షన్స్ సంస్థ నుంచి చిత్రం వస్తుందంటేనే ఏదేదో ఉంటుందని సెన్సార్ బోర్డు సభ్యులు అలర్ట్ అవుతున్నారని ఫైర్ అయ్యారు. బ్లూస్టార్ చిత్రానికి ఎలాంటి సమస్యలు రావని భావించానని, అయితే ఈ చిత్రం విడుదల కాకూడదని అక్కడే కొందరు అనుకోవడం మొదలెట్టారని చెప్పారు. అది విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనను రౌడీ అన్నారు ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించగా ఇది ఓ వర్గానికి అనుకూలంగా ఉందని చెప్పారు. నాయకుడు పూవై జగన్ మూర్తియార్ కథలా అనిపిస్తోందన్నారు. ఆయనను ఒక రౌడీగా అభివర్ణించినట్లు తెలిపారు. పూవై మూర్తియార్ తమను చదివించారని, ఆయన పెద్ద నాయకుడు అని, ఆయన్ని ఎలా రౌడీ అంటారని ప్రశ్నించానన్నారు. తాను ఎంత వాదించినా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెప్పారు. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి అక్కడ చెప్పిన కొన్ని మార్పులు చేసి బ్లూస్టార్ రిలీజ్ చేయగా అదిప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందుతోందన్నారు. సమైక్యతను చాటి చెప్పే చిత్రానికి సెన్సార్ సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చదవండి: విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక -
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్‌లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
తంగలాన్ గురించి బిగ్ సీక్రెట్ రివీల్ చేసిన విక్రమ్
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన తంగలాన్ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్లో విక్రమ్ చాలా వైల్డ్‌గా కనిపించాడు. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజర్‌ను చూపించారు. కానీ యాక్షన్ సీన్స్,బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని చెప్పవచ్చు. టీజర్లో పామును పట్టుకుని చేతితోనే విక్రమ్ రెండు ముక్కలు చేస్తాడు.. ఈ సీన్ భారీగా వైరల్ అవుతుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత తంగలాన్ గురించి విక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆయన రివీల్ చేశాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్‌కు డైలాగ్స్ ఉండవట. గతంలో శివపుత్రుడు చిత్రంలో కూడా ఆయనకు ఎలాంటి డైలాగ్స్ లేవు కానీ తన నటనతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆ సినిమాతోనే తెలుగులో ఆయనకు క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ గురించి విక్రమ్ ఇలా అన్నాడు. 'తెలుగు అభిమానులకు సినిమా అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు.. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా వారు ఆదరిస్తారు. దానికి నిదర్శనమే శివపుత్రుడు. ఆ సినిమాను వారు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నాకు ఎంతపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తంగలాన్ కూడా అంతే పేరు తెస్తుంది. ఈ చిత్రంలో నాకు ఎలాంటి డైలాగ్స్ లేవు.. అంతా అరవడమే. దానికి కారణం ఉంది. అదేంటో సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. శివపుత్రుడు మాదిరే తంగలాన్‌లో కూడా ఎలాంటి డైలాగ్స్ ఉండవు.' అని విక్రమ్ తెలిపాడు. -
తంగలాన్ టీజర్.. పామును రెండు ముక్కలు చేసిన విక్రమ్
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సిరీస్‌ల తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో ఎలాంటి డైలాగ్స్ లేకున్నా విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్ములేపాడు. ఇందులో విక్రమ్‌ను చాలా భయంకరంగా చూపించారని తెలుస్తోంది. యుద్ధంలో కత్తి పట్టుకొని యోధుడిలా చేతికి దొరికిన వారందరినీ హతమారుస్తు కనిపించాడు. ఓ సీన్లో కోబ్రా లాంటి పాముని చేతపట్టుకుని రెండు ముక్కలుగా చేసి కింద పడేస్తాడు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక డిఫరెంట్ కథనంతో తంగలాన్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. -
విక్రమ్ తంగలాన్ అప్డేట్ వచ్చేసింది
పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రం తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. నటి పార్వతి, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ చిత్రంపై నటి మాళవిక మోహన్ చాలా ఆశలు పెట్టుకుంది. కాగా తంగలాన్ చిత్రం అప్డేట్ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు. ఆయన తన ట్విట్టర్లో తంగలాన్ సంభవం చిత్ర టీజర్ అతి త్వరలో అని పేర్కొన్నారు. ఇది విక్రమ్ అభిమానులకు తీపి వార్తే అవుతుంది. కాగా తంగలాన్ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దిగడానికి నిర్మాత సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా నటుడు విక్రమ్ నటించిన మరో చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నటి రీతూ వర్మ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలిసింది. -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టండి చూద్దాం? ఇలా తయారైందేంటి!
దాదాపు హీరోయిన్లు అందరూ వీలైనంత గ్లామర్ చూపించేందుకు తహతహలాడుతుంటారు. కుదిరితే సినిమాల్లో.. లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా బ్యూటీస్ అందరూ ఫొటోషూట్స్‌తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఆ బాపతే. కాకపోతే ఆమె, ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఎక్కువసేపు సస్పెన్స్ ఉంచకుండా చెప్పేస్తున్నాం. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరేవరో కాదు మాళవిక మోహన్. కేరళకు చెందిన ఈమె.. దాదాపు పదేళ్ల నుంచి సినిమాలు చేస్తోంది. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా ఓ ఆరేళ్లపాటు మలయాళంలో మూడు, కన్నడ-హిందీలో తలో మూవీ చేసింది. 2019లో రజినీకాంత్ 'పెట్టా'లో నటించడం ఈమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిన తర్వాత మాళవిక మోహనన్‌కు దళపతి విజయ్ 'మాస్టర్', ధనుష్ 'మారన్' చిత్రాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడినప్పటికీ ఈమెకు ఓ మాదిరి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె, ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చియాన్ విక్రమ్ 'తంగలాన్'లోనూ ఈమెనే కథానాయిక. ఈ చిత్రంలోని ఈమె ఫస్ట్‌లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో మాళవికని చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఓ ఆయుధం, మెడ-నడుము-తల చుట్టూ తాళ్ల లాంటివి ఉన్నాయి. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో మాళవిక.. ఆరతి అనే పాత్రలో కనిపించబోతుంది. నార్మల్‌గా హాట్ అండ్ గ్లామర్‌గా కనిపించే ఈ బ్యూటీని ఇలా మార్చేయడం చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏదేమైనా మాళవిక లేటెస్ట్ లుక్ మాత్రం క్రేజీగా ఉంది. Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb — pa.ranjith (@beemji) August 4, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) -
ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన కథా నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక మోహనన్ కనిపించనుండగా.. పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఉప్పెన హీరోయిన్‌కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! ) అయితే ఈ ఏడాది తమిళంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రమిది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో తంగలాన్ చోటు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు. అయితే ఆస్కార్ రేసుకు సంబంధించిన ఇంకా ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఈ సినిమాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!) -
పా.రంజిత్‌కు నేను వ్యతిరేకిని కాదు: దర్శకుడు
తాను దర్శకుడు పా. రంజిత్‌కు వ్యతిరేకిని కాదని దర్శక నిర్మాత మోహన్ జి పేర్కొన్నారు. ఇంతకుముందు పళయ వన్నారపేటై, ద్రౌపది, రుద్రతాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వ రాఘవన్ కథానాయకుడు. నట్టి, రాధా రవి, కే రాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ప్రతిభ లేకపోతే ఎవరూ కథానాయకులుగా సక్సెస్ కాలేరన్నారు. మోహన్ జి కఠిన శ్రమజీవి, ప్రతిభావంతుడు అని, సినిమాపై ఎంతో మర్యాద, నమ్మకం కలిగిన మంచి దర్శకుడు అని ప్రశంసించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన దర్శకుడు మోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శక నిర్మాత మోహన్.జీ మాట్లాడుతూ.. బకాసురం చిత్రం చాలా మంది ప్రశంసించారని, అందుకు తనతోపాటు పనిచేసిన అందరూ కారణమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్, చాయాగ్రాహకుడు ఫరూక్ ముఖ్యమైన వారన్నారు. సెల్వ రాఘవన్ సైలెంట్‌గా ఉంటారని.. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని తెలిపారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను సెల్వరాఘవన్ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రాన్ని చూసిన తర్వాతే తనకు దర్శకుడు కావాలన్న కోరిక కలిగిందని చెప్పారు. లేకపోతే తాను ఒక వర్గానికి సంబంధించిన కథా చిత్రాలనే చేస్తానని ప్రచారం ఉందన్నారు. అందుకోసం తాను సినిమాలోకి రాలేదని స్పష్టం చేశారు. దర్శకుడు పా.రంజిత్ బడుగు వర్గాల ఇతివృత్తాలతోనూ, తాను ఓబీసీ ప్రజల కోసం చిత్రాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అయితే సినీ పరిశ్రమలో తాను ఎవరిని వ్యతిరేకులుగా భావించడం లేదని, ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్‌కు తాను వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. బకాసురన్ అందరి చిత్రం అని దర్శక నిర్మాత మోహన్.జి పేర్కొన్నారు. చదవండి: నా మనసు నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే.. శృతిహాసన్ పోస్ట్ వైరల్ -
మరో విభిన్నమైన పాత్రలో విక్రమ్.. మేకప్‌కే 4 గంటలు!
ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యం చూపించ డానికి హీరో విక్రమ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. సరికొత్త పాత్రలను చాలెంజ్‌గా తీసుకుని ఎంతో కష్టపడుతుంటారు. ‘శివపుత్రుడు’, ‘ఐ’, ‘కోబ్రా’ వంటి సినిమాల్లో విక్రమ్ చేసిన పాత్రలే ఇందుకు ఉదాహరణ. కాగా ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచేందుకు విక్రమ్ మరో సవాల్‌లాంటి ΄ాత్ర చేస్తున్నారు. విక్రమ్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విక్రమ ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారు. ఈ మేకప్‌కి నాలుగు గంటలు పడుతోందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తదుపరి షెడ్యూ ల్ను కర్ణాటకలో ప్లాన్ చేశారు. పార్వతీ మీనన్, మాళవికా మోహనన్, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
అవన్ని పుకార్లే.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తమిళసినిమా: ఇప్పుడున్న హీరోయిన్లు హీరోలకు ఏమాత్రం తగ్గడం లేదు. చాలా వరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన హీరోయిన్లు ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందు కోసం రిస్క్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటీవల యశోద చిత్రం కోసం నటి సమంత చాలా రిస్కీ ఫైట్స్‌లో నటించారు. అదే విధంగా ఇండియన్–2 చిత్రం కోసం నటి కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారి, కత్తి సాము వంటి విద్యల్లో శిక్షణ పొందారు. నటి మాళవిక మోహన్ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. పా .రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రాచీన కథాంశాలతో కూడిన చిత్రంలో మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈమె నటన దర్శకుడు పా.రంజిత్‌కు సంతృప్తి కలిగించలేదని, దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ఇటీవల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కారణం తంగలాన్ చిత్రంలోని తన పాత్ర కోసం నటి మాళవిక మోహన్ సిలంబాట్టం అనే ప్రాచీన ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతోంది. తను శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది. అందులో సిలంబం అనే అద్భుతమైన ప్రపంచంలోకి తొలి అడుగు వేశానని నటి మాళవిక మోహన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) చదవండి: మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్ పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు -
ఆ హీరోయిన్ విషయంలో తప్పు చేసినట్లు ఫీలవుతున్న డైరెక్టర్
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహన్. మలయాళంలో కథానాయికగా పరిచయమైన ఈమె రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో శశికువర్కు భార్యగా నటించిన మాళవిక మోహన్ నటనకు ప్రశంశలు లభించాయి. ఆ తర్వాత విజయ్‌తో మాస్టర్ చిత్రంలో నటింంది. ఆచిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ధనుష్ సరసన మారన్ చిత్రంలో నటింంది. అలాంటిది తాజాగా విక్రమ్‌కు జంటగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో ముఖ్యపాత్రల్లో పార్వతి, నటుడు పశుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆ మధ్య ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం విషయంలోనే నటి వళవిక మోహన్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగా దర్శకుడు పా.రంజిత్ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తాజా చిత్రం తంగలాన్ను చారిత్రక కథా నేపథ్యంలో రూపొందిస్తున్నారు. కాగా ఇందులో నటి మాళవిక మోహన్ నటన సంతృప్తి కలిగించడం లేదని, దీంతో పొరపాటున ఆమెని ఈ చిత్రానికి ఎంపిక చేశామా? అంటూ ఆయన తల కొట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించాలనే ఆలోచన వచ్చినట్లు, ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. వాస్తవం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. -
బాలీవుడ్లో దూసుకెళ్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్.. స్టార్ హీరోలతో సినిమాలు!
బాలీవుడ్ హీరోలు కొందరు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ వారు తమిళ సినిమాల్లో నటించడం లేదు. మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారంటే తమిళ దర్శకులతో సెట్స్‌లో కమ్యూనికేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఆ తమిళ దర్శకులతో ఈ హీరోలు ‘వాంగ వణక్కం’ (రండి.. నమస్కారం) అంటూ హిందీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లు–బాలీవుడ్ హీరోల కాంబినేషన్ చిత్రాల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ ప్రస్తుతం మూడు (పఠాన్, జవాన్, డంకీ) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘జవాన్’ సినిమాకు అట్లీ దర్శకుడు. తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సెల్’, ‘బిగిల్’ వంటి హిట్ చిత్రాలను అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో అట్లీకి ‘జవాన్’ తొలి చిత్రం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా అగ్రతార నయనతార నటిస్తున్నారు. హిందీలో నయనతారకు కూడా ‘జవాన్’ తొలి చిత్రం కావడం ఓ విశేషం. ‘జవాన్’ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది. (చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?) ఇంకోవైపు తమిళ దర్శకుడు శంకర్‌తో సినిమాకి సై అన్నారు రణ్వీర్ సింగ్. 2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) మంచి విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శంకర్. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే ఆరంభం కావాల్సింది కానీ ‘అన్నియన్’ హిందీ రీమేక్ హక్కుల విషయంలో చిన్న వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో శంకర్ ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చాక శంకర్ ‘అన్నియన్’ హిందీ రీమేక్‌ను ఆరంభిస్తా రని ఊహించవచ్చు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హిందీలో శంకర్ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘ఒకే ఒక్కడు’ని హిందీలో ‘నాయక్’ (2001)గా తెరకెక్కించారు శంకర్. ఇక 2017లో విడుదలైన ‘విక్రమ్ వేదా’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పుష్కర్–గాయత్రి ద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అయ్యింది. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. తమిళ ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌నూ తెరకెక్కించారు. పుష్కర్– గాయత్రి ద్వయానికి హిందీలో ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరోవైపు తక్కువ టైమ్‌లో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ హిందీలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా (తమిళ సినిమా ‘మాస్టర్’ హిందీ రీమేక్) చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే సల్మాన్‌తో లోకేశ్ వేరే ఓ సినిమా చేయనున్నారని కోలీవుడ్ టాక్. ఇంకోవైపు రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ హిందీలో ఓ సినిమా కమిట్ అయ్యారు. జార్ఖండ్‌కు చెందిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ‘జై భీమ్’ సినిమాతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ రాజా హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ‘దోసా కింగ్’గా చెప్పుకునే పి. రాజగోపాల్ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజగోపాల్, జీవ జ్యోతి శాంతకుమార్‌ల కోర్టు కేసు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందనుంది. వీరితోపాటు మరికొందరు తమిళ దర్శకులు హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
స్కిన్ షోలతో అవకాశాలు పొందడం ఇష్టం లేదు: హీరోయిన్
నేటితరం హీరోయిన్లు అవకాశాలు పొందాలన్నా, కెరీర్ నిలబెట్టుకోవాలంటే వారి ముందున్న ఒకే ఒక ఆప్షన్ గ్లామర్.. స్టార్ హీరోయిన్లు సైతం స్కిన్ షోలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యువనటి దుషారా స్కిన్ షోలతో అవకాశాలు పొందడం తనకు ఇష్టం లేదని, అలాగని తాను గ్లామర్‌కు వ్యతిరేకిని కాదని అంటోంది. బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ అచ్చ తమిళ ఆడపడుచు తొలి చిత్రంతోనే తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్యకు జంటగా సర్పట్ట పరంపరై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రంలో పల్లెటూరి యువతిగా పరిణితి చెందిన నటనతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పా.రంజిత్ దర్శకత్వంలో రెండోసారి నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకుంది. అదే నచ్చత్తిరం నగర్గిరదు నీలం ప్రొడక్షన్స్, యాళ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్ జయరాంకు జంటగా దుషారా నటించింది. తెన్మా సంగీతం అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటి దుషారాతో సాక్షి ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ పా.రంజిత్ దర్శకత్వంలో రెండోసారి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. ఆయన చిత్రాల్లో కథానాయికలకు నటించడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. నచ్చిత్తిరం నగర్గిరదు చిత్రంలో తనది చాలా ధైర్యం కలిగిన యువతి పాత్ర అని, సమకాలీన రాజకీయాలతో కూడిన ప్రేమ కథా చిత్రమని తెలిపింది. ముఖ్యంగా లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ అంశాలను చర్చించే విభిన్న కథాచిత్రమని చెప్పింది. ఇందులో కాళిదాస్ జయరాంతో నటించడం మంచి అనుభవం, ఇద్దరం పోటీ పడి నటించినట్లు తెలిపింది. తనకు చాలెంజింగ్ రోల్ పాత్రలో నటించడం చాలా ఇష్టమని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశాం అనే దాని కంటే ఎన్ని మంచి పాత్రలు చేశామన్నదే తనకు ముఖ్యమని అంటోంది ఈ ముద్దుగుమ్మ. -
శిష్యులకు దారిచూపుతున్న స్టార్ డైరెక్టర్.. సొంత సంస్థలో..
తమిళ సినిమా: సామాజిక అంశాలను ఇతివృత్తంగా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు పా రంజిత్ దిట్ట. నీలం ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి తన శిష్యులకు దర్శకులుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నీలం ప్రొడక్షన్స్, లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేత గణేశమూర్తితో కలిసి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ్, పృథ్వీ పాండియరాజన్, కీర్తి పాండియన్, దివ్య దురైస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జైకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ.. క్రికెట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. స్నేహానికి ప్రాధాన్యతను ఇస్తూ కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర షూటింగ్‌ను అరక్కోణం పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. గోవింద్ వసంత సంగీతం, తమిళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చదవండి: Prabhas: ప్రభాస్ సినిమాకు నిర్మాత మారనున్నాడా? -
ఓటీటీలో రిలీజ్ కానున్న అమలాపాల్ విక్టిమ్
వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్ వెబ్ సిరీస్. నాలుగు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్‌ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్‌ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు కన్ఫెషన్ పేరుతోనూ, పా.రంజిత్ దమ్మమ్ పేరుతోనూ, శింబుదేవన్ మొట్టై మాడి సిద్ధర్ పేరుతోనూ, ఎం.రాజేష్ విరాజ్ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఫైనల్‌గా విక్టిమ్ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్ సిరీస్ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సిరీస్ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్ ప్లాట్ తనను నిజజీవితంలో ఇన్స్పైర్ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు! -
కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!
కేజీయఫ్ అనగానే కళ్లముందుకు రాఖీభాయ్ వచ్చేస్తాడు. సలాం రాఖీభాయ్ అనే కటౌట్ కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో హై వోల్డేజ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు భాగాలు వస్తే.. రెండింటినీ సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. కేజీయఫ్2 అయితే ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇదే జోష్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యశ్ మూడో భాగాన్ని తీసుకొస్తారని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కేజీయఫ్ ఫ్యాన్స్. ఈసారి రాఖీ భాయ్ మరింత రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కేజీయఫ్3 లో రాఖీభాయ్ కాకుండా మరో హీరో నటించబోతున్నాడు. పార్ట్ 3లోకి చియాన్ విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా తమిళ దర్శకుడు పా. రంజిత్ తో కొత్త సినిమాను ప్రారభించాడు విక్రమ్. త్రీడీ ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. అది సరే, ఈ సినిమాకు, కేజీయఫ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఇండిపెన్డెన్స్కు ముందు నరాచిలో జరిగిన ఆచారకాలపైనే పా.రంజిత్ దృష్టిపెడుతున్నాడని సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు స్వాతంత్య్రం రాకముందు కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది పా.రంజిత్ చూపించబోతున్నాడట. (చదవండి: పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు) మరోవైపు కేజీయఫ్ 3 పై ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 3తో తిరిగొస్తామని అభిమానులకు మాట ఇచ్చాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత టైగర్ తో ప్లాన్ చేస్తోన్న మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాతే కేజీయఫ్ 3 తీసుకొస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ లోపే విక్రమ్ కేజీయఫ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
క్రేజీ కాంబినేషన్.. ‘విక్రమ్ 61’ ప్రారంభం
తమిళసినిమా: చియాన్ విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో భారీ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం విక్రమ్‌కు 61వ సినిమా కానుంది. దీనిని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా, నీలం ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఇది స్టూడియో గ్రీన్ సంస్థ 22వ చిత్రం. ఇంకా టైటిల్ నిర్ణయించని దీనికి కథ, కథనాన్ని తమిళ్ ప్రభ అందించారు. జి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, కిషోర్‌కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో నటుడు శివకుమార్, ఆర్య, నిర్మాత టి.శివ, ఎస్.ఆర్.ప్రభు, అభినేష్ ఇళంగోవన్, సంతోష్ పి.జయకుమార్, సీవీ కుమార్ హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ తొలి భాగం సెప్టెంబర్ 30న తెరపైకి రానుంది. చదవండి: Aaditi Pohankar: ఒకప్పుడు రాష్ట్రస్థాయి అథ్లెట్.. ఇప్పుడు స్టార్ నటి.. -
పా. రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ సినిమా.. త్రీడిలోనూ చిత్రీకరణ
Chiyaan 61: Vikram And Pa Ranjith Movie In 3D Version: విభిన్నమైన పాత్రలతో, సినిమాలతో అటు కోలీవుడ్‌నే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో చియాన్ విక్రమ్. వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ అందులో జీవించేస్తారు. ఇటీవల కొడుకు ధ్రువ్‌తో కలిసి మహాన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ 'కోబ్రా', 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' సినిమాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా విక్రమ్ హీరోగా మరో క్రేజీ సినిమా రానుంది. దర్శకుడు పా. రంజిత్ కాంబినేషన్లో విక్రమ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ నెలలోనే ఆరంభించాలనుకుంటున్నారు. 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు.. త్రీడీ వెర్షన్‌ను కూడా చిత్రీకరించాలనే యోచనలో ఉన్నట్లు చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. చదవండి: తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. టైటిల్ ఫిక్స్ నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ -
‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? రానా కామ్రేడ్ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి లీడ్రోల్లో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్ పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబులు సంయుక్తంగా నిర్మించారు. #Viraataparvam is the best Telugu film I've watched in recent times. Producers & dir @venuudugulafilm deserve much appreciation for making this film without any compromises.Special appreciations to @RanaDaggubati for accepting &doing this role & @Sai_Pallavi92 has done superbly👏 — pa.ranjith (@beemji) June 19, 2022 -
సార్పట్టా డైరెక్టర్‌తో విక్రమ్ సినిమా.. స్టోరీ లైన్ అదే
నటుడు విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందబోతున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ నటించిన కోబ్రా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న భారీ చిత్రంలో విక్రమ్ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా పా.రంజిత్ ప్రస్తుతం ‘‘నక్షత్రం నగర్గిరదు’’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే విక్రమ్ హీరోగా నటించే చిత్రం ప్రారంభం కానుంది. పా.రంజిత్ ఇంతకుముందు ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సార్పట్టా పరంపరై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విక్రమ్ హీరోగా రూపొందించనున్న చిత్రం కూడా పూర్తిగా క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. దీనికి మైదానం అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. -
దళిత రచనలతోనే సినీ ప్రయాణం ప్రారంభించాను: పా.రంజిత్
సాక్షి, చెన్నై: దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని దర్శక, నిర్మాత పా.రంజిత్ పేర్కొన్నారు. తన చిత్రాల ద్వారా సమాజంలోని అసమానతలు, అణగారిన జీవితాలను ఆవిష్కృతం చేసే దర్శకుడీయన. అలా తనకంటూ ప్రత్యేక బాటను ఏర్పరచుకుని సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న పా.రంజిత్ తన నీలం ఫౌండేషన్ ద్వారా ఏప్రిల్ నెల అంతా దళిత చరిత్ర మాసం పేరుతో చెన్నైలో సాంస్కృతిక కళలు, ఫొటో ఎగ్జిబిషన్, చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా మదురైలో శుక్ర, శనివారాల్లో దళితుల రచయితల కోసం దళిత సాహితీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత రచనలతోనే తన సినీ పయనం మొదలైందని తెలిపారు. దళితుల ఉన్నతికి దళిత సాహితీవేత్తలే దిశా నిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1990 ప్రాంతంలో దళిత సాహిత్యం మొదలైనప్పుడు పలు ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పుడు దళిత సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందిందని పా.రంజిత్ పేర్కొన్నారు. -
మీడియా సమావేశంలో రైటర్ చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. -
ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..
సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక దుషారా విజయన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్‌కాల్‌ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్లో సెలెక్ట్ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు. -
‘సార్పట్ట’ మూవీ రివ్యూ
టైటిల్ : సార్పట్ట జానర్ : పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నిర్మాణ సంస్థలు : నీలం ప్రొడక్షన్స్, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్ రాజ్ దర్శకత్వం : పా.రంజిత్ సంగీతం : సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్ : సెల్వ ఆర్.కె విడుదల తేది : జూలై(22), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’లాంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పా.రంజిత్. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? బాక్సర్‌గా ఆర్య ఎలా నటించాడు? ఈ చిత్రంతోనైనా పా.రంజిత్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ ఈ సినిమా కథ అంతా ఎమర్జెన్సీ కాలం(70వ దశకం)లో నడుస్తుంది. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్ సామ్రాజ్యం(ఆర్య)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్లేవాడు. కొడుకు బాక్సింగ్ పోటీలకు వెళ్లడం మాత్రం తల్లి భాగ్యం(అనుపమ కుమార్)కు అస్సలు నచ్చదు. కానీ సమర మాత్రం తల్లి కళ్లు కప్పి బాక్సింగ్ పోటీలను చూసేందుకు వెళ్లేవాడు. కట్ చేస్తే.. ఒకరోజు బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా, ఇడియప్ప మధ్య జరిగిన బాక్సింగ్ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్ చేసి గెలుస్తానని సమర ప్రత్యర్థులకు సవాల్ విసురుతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్ కొక్కెన్)తో పోటీ పడేందుకు సిద్దమవుతాడు. అసలు సమర బాక్సర్ అవడానికి అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బాక్సింగ్ బరిలోకి దిగిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమింగే గురువు రంగా కోసం సమర ఎలాంటి సహసం చేశాడు? బాక్సింగ్ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరా ఓడించాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బాక్సర్‌గా ఆర్య అద్భుతంగా నటించాడు. సమర పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్‌పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లిమాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగాను ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక ఆర్య తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర పశుపతిది. గురువు రంగా అలియాస్ రంగయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సమర భార్య పాత్రలో దుషారా విజయన్ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్ కొక్కెయ్ అదరగొట్టేశాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ అలరించాడు. అనుపమ కుమార్, షబ్బీర్ తదితురలు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్య చిత్రాలు ఇండియాలో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ కథలన్నింటిని ఒక్కసారి పరిశీలిసే.. ముందుగా హీరో సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతనిపై ఎవరికి ఎలాంటి అంచానాలు ఉండవు. కానీ ఏదో ఒక సంఘటన వల్ల హీరో ఆ క్రీడా రంగంలోకి సడెన్‌గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతనిలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ప్లాష్‌బ్యాక్... లక్ష్యం వెళ్తున్న హీరోకి అడ్డంకులు, చివరకు హీరో విజయం. ఇదే ప్రతి సినిమా నేపథ్యం. ‘సార్పట్ట’కూడా కొంచెం అటు,ఇటుగా అలాంటి కథే. బాక్సింగ్‌కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి చెప్పడం ఈ సినిమా స్పెషల్. అప్పటి బాక్సింగ్ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్ అంటే ఇష్టపడే ఒక యువకుడు తల్లి కోసం ఆ ఆటకు దూరంగా ఉండటం, అనుకోని సంఘటన వల్ల బాక్సర్‌గా మారి, ప్రత్యర్థులు చేసే కుట్రలను తిప్పికొడుతూ గురువుగారి మాట నిలబెట్టటం తదితర సన్నివేశాలను ఆసక్తిగా తీర్చిదిద్దాడు. అయితే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ‘భావోద్వేగం’అతి ముఖ్యమైనది. అదే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. సార్పట్టలో ఆ ‘ఎమోషన్’మిస్సయింది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా... కథలో, పాత్రల్లో ఒక నిలకడ లేకపోవడం ప్రతికూల అంశమే.సెకండాఫ్‌లో సాగదీత సీన్స్ సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. అలాగే ఒక్కసారి కూడా బాక్సింగ్ కోచింగే తీసుకొని హీరో.. ఉన్నట్లుండి గ్లవ్స్ వేసుకొని అత్యుత్తమ బాక్సర్‌ని చితక్కొట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. కానీ ‘కబాలి’,‘కాలా’లాంటి విభిన్న చిత్రాలను అందించిన పా.రంజిత్.. ఈ సారి భిన్నంగా స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్ టచ్ ఇచ్చి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇక సాంకెతిక విషయానివస్తే.. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతాన్ని కీలక పాత్ర. ఆ విషయంలో సంతోష్ నారాయణ్ సక్సెస్ అయ్యాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మురళి.జి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన లోపం సెల్వ ఆర్.కె ఎడిటింగ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్.. సెకండాఫ్‌లో ఉంటే ‘సార్పట్ట’ మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ‘సార్పట్ట’నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ ఆర్య, పశుపతి నటన నేపథ్య సంగీతం దర్శకత్వం ఫస్టాప్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్ సినిమా నిడివి ఊహకందే క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!
సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కబాలి, కాలా వంటి చిత్రాలు రూపొందించిన కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. రంజిత్ రెండోసారి తండ్రి అయ్యినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య అనిత చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తనకు కొడుకు పుట్టిన విషయాన్ని రంజిత్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుత్రోత్సాహంతో ఉన్న రంజిత్ ఇప్పటికే తన కొడుక్కి మిలిరాన్గా నామకరణం చేసినట్లు సమాచారం. రంజిత్ దంపతులకు ఇప్పటికే మఘజిని అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కూతురు పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన పా రంజిత్ తన కూతురుకు బర్త్‌డే రోజు ప్రత్యేక సందేశాన్ని రాశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా') కాగా పా రంజిత్, అనితలది ప్రేమ వివాహం. డిగ్రీ చదివే రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమలో పడిన వీరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే ఆర్యతో కలిసి బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు మొదట సూర్యను అనుకున్నట్లు సమాచారం. చివరకు సూర్యతో కుదరకపోవడంతో ఆర్యతో తెరకెక్కిస్తున్నారు. (వావ్.. అచ్చం ఐశ్యర్యరాయ్ లాగే..) -
'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా'
పాత్రలకు తగ్గట్టుగా మారడానికి హీరోలు చాలా శ్రమపడుతున్నారు. ఆరు పలకలు, ఎనిమిది పలకలు అంటూ కఠిన కసరత్తులతో బాడీని మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటుడు ఆర్య చేరారు. ఈయన ఇప్పటి గెటప్ చూస్తే ఆర్యనేనా అని ఆశ్చర్యపడతారు. ఇటీవల కాప్పాన్ చిత్రంలో కనిపించిన ఆర్య ప్రస్తుతం టెడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషాసైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి ఆర్య రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన బాడీ బిల్డర్‌గా మారారు.దర్శకుడు పా.రంజిత్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కాలా తరువాత పిర్చా ముండా అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టారా? అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా పడింది. దీంతో ఇప్పుడు నటుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసరాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే దీని గురించి చిత్ర వర్గాలు అధికారికంగా గురువారం వెల్లడించారు. ఇందులో ఆర్య బాక్సింగ్ క్రీడాకారుడిగా నటిస్తున్నారు. అందుకోసం ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. కఠినంగా కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్‌కు తయారయ్యారు. ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా ఉన్నారు. ఆ ఫొటోలను ఆయన ట్విట్టర్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆయన మిత్ర వర్గం వావ్ అదుర్స్ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క ఇక అభిమానులైతే సూపర్ అంటూ లైకులు కొడుతున్నారు. దీంతో ఆర్య నటించే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఆర్య తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు. అయితే నటుడు కలైయరసన్, దినేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. నటుడు ఆర్యకు అర్జెంట్‌గా ఇప్పుడు ఒక హిట్ కావాలి. దీంతో ఆయన తన చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందులో భాగమే ఈ సిక్స్‌ప్యాక్‌కు రెడీ అవడం అని భావించవచ్చు. -
మరో మల్టీస్టారర్ చిత్రంలో రానా!
చెన్నై : కోలీవుడ్ ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ చిత్రాలపై దృష్టి సారిస్తోందని చెప్పవచ్చు. ఇటీవల మణిరత్నం ‘సెక్క సెవంద వానం’పేరుతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియన్ సెల్వమ్’భారీగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయంరవి, కార్తీ, అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తీసురేశ్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. అదే విధంగా దర్శకుడు పా.రంజిత్ ఇక మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనేది తాజా సమాచారం. ఈయన ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా కబాలి, కాలా చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పా.రంజిత్ హిందీలో ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 2020లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలాంటిది తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆర్య, రానా, సత్యరాజ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇందుకోసం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
భావ స్వేచ్ఛకు హద్దులుండవా?
పెరంబూరు: భావ స్వేచ్ఛకు హద్దులుండవా? అంటూ న్యాయమూర్తి సినీ దర్శకుడు పా.రంజిత్‌ను ప్రశ్నించారు. దర్శకుడు పా.రంజిత్ ఇటీవల తంజావూరు జిల్లా, తిరుప్పనందాల్ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని రాజ రాజ చోళన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పా.రంజిత్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కోర్టు ఆయన్ని ఈ నెల 19వ తేదీ వరకూ అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆ గడువు పూర్తి కావడంతో దర్శకుడు పా.రంజిత్ మరోసారి ముందస్తు బెయిల్ కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం తిరుప్పనందాల్ పోలీసులకు ఈ కేసులో తగిన ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు పరిశీలించిన న్యాయమూర్తి భావస్వేచ్ఛకు హద్దులు ఉండవా? అంటూ దర్శకుడు పా.రంజిత్‌ను ప్రశ్నించారు. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. చదవండి : దేవదాసీలపై దర్శకుడి వ్యాఖ్యలు సబబేనా? -
దర్శకుడికి కోర్టులో చుక్కెదురు
పెరంబూరు: దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టులో చుక్కెదురైంది. నటుడు కార్తీ హీరోగా మెడ్రాస్, రజనీకాంత్ హీరోగా కబాలి, కాలా వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు పా.రంజిత్. ఈయన ఇటీవల తిరుప్పనందళ్ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొని రాజరాజ చోళన్‌ను కించపరచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మధురై హైకోర్టు శాఖలో పా.రంజిత్‌పై పిటిషన్ దాఖలు కావడంతో ఆయన మందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకున్నారు. దీంతో కోర్టు పా.రంజిత్‌ను ఈ నెల 21వ తేదీ వరకూ అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారంతో ఆ గడువు పూర్తి కావడంతో పా.రంజిత్ మందస్తు బెయిల్ కోసం మరోసారి శుక్రవారం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీనిపై విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు పా.రంజిత్‌ను అరెస్ట్‌చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
దేవదాసీలపై దర్శకుడి వ్యాఖ్యలు సబబేనా?
సాక్షి, న్యూఢిల్లీ : రాజరాజ చోళుడు–1 దళితుల భూములను లాక్కున్నారని, దేవదాసీల వ్యవస్థను పటిష్టం చేశారని ఆరోపించడం ద్వారా కబాలి, కాలా చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయనపై ‘హిందూ మక్కాల్ కాట్చీ (హిందూత్వ సంస్థ)’ ఫిర్యాదు చేయడంతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలవడం, రంజిత్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 17వ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్ చేయరాదంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్ వీగిపోతే ఆయన్ని అరెస్ట్ చేయవచ్చు. కేసు విషయాన్ని పక్కన పెడితే రంజిత్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాస్తవాలు ఏమిటీ ? అసలు రాజరాజ చోళుడు ఎవరు ? ఏ కాలం నాటి వారు ? గత ఐదు దశాబ్దాలుగా తమిళనాడులోని కొన్ని కులాలు ఆయన వారసులుగా ఎందుకు చెలామణి అవుతున్నాయి ? క్రీ.శకం 848 నుంచి 1070 క్రీ.శకం వరకు తమిళ ప్రాంతంలో చోళుల సామ్రాజ్యం కొనసాగింది. విజయాలయ చోళుడు ఆ వంశానికి చెందిన తొలి రాజుకాగా, అతిరాజేంద్ర చోళుడు ఆఖరివాడు. వీరిలో గొప్ప రాజుగా కీర్తిపొందిన వారు రాజరాజ చోళుడు–1. పలు ఆలయాలను నిర్మించడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. తంజావూరులోని బహాదీశ్వర ఆలయం (శివాలయం)ను నిర్మించినది ఆయనే. థేవర్లు, నాదర్లు, వన్నియార్లు, వెల్లాలార్లు వారసులట! రాజరాజ చోళుడి వారసులమని దక్షిణ తమిళనాడులో బలమైన ఓబీసీలుగా ఉన్న థేవర్లు, నాదర్లు, ఉత్తర తమిళనాడులోని ఓబీసీల్లో బలమైన వన్నియార్లు, ఎస్సీలైన దేవేంద్ర కుల వెల్లాలార్లు గత ఐదారు దశాబ్దాలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో ఈ కులాల వారు చోళుడి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. తామే అసలైన వారసులమంటూ రాష్ట్రమంతట పోస్టర్లు వేస్తారు. వీరిలో ఎవరు అసలు వారసులో తేల్చేందుకు ఎలాంటి చారిత్రక ఆధారాలు అందుబాటులో లేవు. రాజరాజ చోళుడి గురించి ‘పొన్నీయిన్ సెల్వన్’ పేరిట ఐదు సంపుటాలు రాసిన కల్కి క్రిష్ణమూర్తి కూడా ఆయన వారసుల గురించి పేర్కొనలేదు. 1950లో ‘పొన్నీయిన్ సెల్వన్’ ఓ తమిళపత్రికలో ఓ ధారావాహిక సీరియల్‌గా రావడంతో ఆయన గురించి ప్రతి ఇంటా తెల్సిపోయింది. ఆ తర్వాత వారసుల తగువు మొదలైనట్లు తెలుస్తోంది. దళితుల భూములను లాక్కున్నారా ? రాజరాజ చోళుడి హయాంలో బ్రాహ్మణులది అగ్రస్థానమని, ఆయన బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను దానం చేశారని వాటిని ‘బ్రహ్మదేయ’ అని వ్యవహరించేవారని తమిళనాడు నుంచి 28 వేల రాజ శిలా శాసనాలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపిన జపాన్ చరిత్రకారుడు నొబోరు కరషిమ తెలిపారు. బ్రాహ్మణులు నేరం చేస్తే చిన్న శిక్షలు, ఇతరులు నేరం చేస్తే పెద్ద శిక్షలు ఉండేవని కూడా పేర్కొన్నారు. అందుకనే పెరియార్ ఈవీ రామస్వామి తన రచనల్లో చోళులను తీవ్రంగా విమర్శించారు. అయితే రాజరాజ చోళుడి తర్వాత అధికారంలోకి వచ్చిన రాజులు బ్రాహ్మణులతోపాటు దళితులకు భూదానం చేశారని అప్పట్లో వ్యవసాయం చేసుకునే ‘పెరియార్ల’కు పన్ను మినహాయింపు కూడా ఇచ్చారని 2012లో విడుదలైన ‘చోళకళ సెప్పెదుగల్’లో ఎం. రాజేంద్రన్ (ఐఏఎస్) పేర్కొన్నారు. అయితే దళితుల వద్ద భూమి గుంజుకున్నట్లు ఆయన ఎక్కడా తెలపలేదు. అలాంటి ఆధారాలు కూడా లేవని కోల్‌కతాలోని ‘సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్’లో పొలిటికల్ సైన్స్ అసెస్టెంట్ ప్రొఫెసర్ కార్తీక్ రామ్ మనోహరన్ కూడా స్పష్టం చేశారు. మరి దేవదాసీల సంగతి దేవుళ్లకు దాస్యం చేసే దేవదాసీ వ్యవస్థను అప్పట్లో తమిళనాట ‘దేవరదియాల్’గా వ్యవహరించేవారు. క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు పాలించిన పల్లవ రాజుల కాలంలో ఈ వ్యవస్థ వచ్చింది. తమిళ దర్శకుడు రంజిత్ ఆరోపించినట్లుగా రాజరాజ చోళుడు హయాంలో బలేపేతం అయింది. ఆయన కాలంలో వివిధ దేవాలయాలకు దాదాపు 400 దేవదాసీలు ఉండేవారు. అనాథలు, అభాగ్యులైన ఆడ పిల్లలను దేవదాసీలుగా కొనుగోలు చేసేవారు. వారు కేవలం దేవాలయాలను శుభ్రం చేయడానికే పరిమితం అయ్యేవారు. అక్కడ భోంచేసి, అక్కడే పడుకుంటూ తమ జీవితాలను ఆలయాలకు అంకితం చేసేవారు. వారికి ప్రత్యేక గదులను కట్టించిన ఘనత రాజరాజ చోళుడిదే. ఇక్కడ రంజిత్ విమర్శ అర్థరహితం. లైంగికంగా దేవదాసీలను ఉపయోగించుకోవడం 18వ శతాబ్దంలో మొదలై, 19వ శతాబ్దంలో బలపడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. -
దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షింతలు
పెరంబూరు: సినీ దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షంతలు వేసింది. వివరాలు.. అట్టకత్తి, మెడ్రాస్, కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ ఇటీవల కుంభకోణం సమీపంలోని తిరుప్పనంద గ్రామంలో దళిత సంఘం నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన రాజరాజ చోళన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. నటుడు కరుణాస్ వంటి వారు పా.రంజిత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా తిరుప్పనంద గ్రామంలో పా.రంజిత్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ మతసామరస్యానికి వ్యతిరేకం అని, తమిళ స్త్రీల మనోభావాలను కించపరచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పా.రంజిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఆ ప్రాంత ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు పా.రంజిత్‌పై మతకలహాలను రేకెత్తించడం, శాంతి భద్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు. దీంతో పా.రంజిత్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పానని, తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాలు వక్రీకరించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తి రాజమాణిక్యం సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది దర్శకుడు పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సమాజంలో మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉండగా ప్రజలు గొప్పగా భావించే రాజరాజచోళన్ గురించి ప్రస్థావించాల్సిన అవసరం ఏముందని దర్శకుడు పా.రంజిత్‌కు అక్షింతలు వేశారు. అదే విధంగా ఈ నెల 19 వరకూ దర్శకుడిని అరెస్ట్ చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ కేసుకు సంబంధించి తిరుప్పనంద పోలీస్ ఇన్స్పెక్టర్ బదులు పిటిషన్‌ను 19వ తేదీన కోర్టులో దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు. -
క్యారే.. భారీ ప్లానా?
రజనీకాంత్‌ని రెండు సార్లు డైరెక్ట్ చేసి, క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు పా. రంజిత్. ‘కాలా’లో రజనీతో ‘క్యా రే సెట్టింగా?’ అనిపించిన రంజిత్ ఓ హిందీ చిత్రం తెరకెక్కిస్తారన్న వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఇది పీరియాడికల్ మూవీ అని సమాచారం. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఓ యోధుని జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోందట. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల్లోని చాలామంది స్టార్స్ నటించబోతున్నారట. ఓ ముఖ్య పాత్రలో ఆమిర్ ఖాన్ కూడా నటించొచ్చు అనే వార్త బీటౌన్‌లో షికారు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా సిల్క్ స్మిత బయోపిక్‌ను టీవీ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు పా. రంజిత్. -
సిరీస్‌గా సిల్క్ జీవితం
1980ల్లో హాట్ గాళ్‌గా సౌత్ ఇండస్ట్రీలను ఊపు ఊపేసిన స్టార్ సిల్క్ స్మిత. ఈ పాపులర్ స్టార్ జీవితం ఆధారంగా ఆల్రెడీ ‘డర్టీ పిక్చర్’ సినిమా తెరకెక్కింది. ఆ సినిమాతో విద్యా బాలన్ సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు సిల్క్ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్స్ జరుగుతున్నాయి. ‘కబాలీ’ ఫేమ్ పా.రంజిత్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తారట. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థతో కలసి రంజిత్ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేయనున్నారు. సిల్క్ జీవితంలో బాల్యాన్ని ఎవరూ సరిగ్గా చూపించలేదు. ఈ సిరీస్‌లో సిల్క్ బాల్యం నుంచి కథ చెప్పదలిచారట. సిల్క్‌కి ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. అందుకే వెబ్ సిరీస్ ద్వారా అన్ని భాషల వారికి ఈ కథను చూపించదలిచారట. ఇప్పటి వరకూ ఎవ్వరూ చూడని విధంగా రియలిస్టిక్‌గా చూపించాలనే ఆలోచనలో దర్శకుడు రంజిత్ ఉన్నారని సమాచారం. -
వెబ్ సిరీస్‌లో సిల్క్‌స్మిత బయోపిక్
తమిళసినిమా: ఏనుగు చచ్చినా వెయ్యే బ్రతికినా వెయ్యే అనే సామెత ఉంది. అలా కొందరు జీవించి ఉన్నప్పుడు తను లబ్ధి పొందటంతో పాటు ఇతరులకు లాభాలను అందించారు. అలాంటి వారిలో శృంగార తారగా ముద్ర వేసుకున్న బహుభాషా నటి సిల్క్‌స్మిత చేరుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు బయ్యర్లు చిత్రాలను కొనుగోలు చేసే ముందు సిల్క్ పాట ఉందా? అని అని అడిగి మరీ చిత్రాలను కొనుగోలు చేసేవారు. ఆమె నటించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉండేది. అలా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన సిల్క్‌స్మిత మరణానంతరం కథకు కాన్సెప్ట్‌గా మారి లాభాలను, అవార్డులను తెచ్చిపెట్టింది. అవును స్మిత జీవిత చరిత్రతో హిందిలో ది దర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కిన చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అందులో తన పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అంతే కాదు మలయాళంలోనూ సిల్క్‌స్మిత బయోపిక్‌తో చిత్రం తెరకెక్కింది. ఇదిలాఉండగా ఆమె జీవిత చరిత్ర తాజాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్క్‌స్మిత జీవితంలో చాలా మందికి తెలియని విషయాలను ఇందులో చూపించనున్నట్టు సమాచారం. అయితే ఇది వెబ్ సీరీస్‌గా రూపొందనుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే కబాలి, కాలా వంటి సంచలన చిత్రాల దర్శకుడు పా.రంజిత్ దృష్టి సిల్క్‌స్మిత బయోపిక్‌పై పడింది. ఆయన తన చిత్ర నిర్మాణ సంస్థలో సిల్క్ జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా నిర్మించనున్నారు. ఇందులో సిల్క్‌స్మిత ఆరంభ కాలం నుంచి అంతం వరకూ తెరకెక్కించనున్నారు. దీనికి సంబధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఐదు కథలతో సినిమా
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం ఓ అప్‌కమింగ్ డైరెక్టర్‌కి దక్కడం అంటే చిన్న విషయం కాదు. ఆ అరుదైన చాన్స్ దక్కించుకుని, రజనీతో వెంట వెంటనే ‘కబాలి, ‘కాలా’ చిత్రాలు తీసిన రికార్డ్‌ని దర్శకుడు పా. రంజిత్ సాధించారు. నెక్ట్స్ రంజిత్ నుంచి ఎలాంటి సినిమా రానుందంటే.. ఐదు కథలతో ఆయన ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సొంత బేనర్ నీలమ్ ప్రొడక్షన్స్‌పై రంజిత్ తీయనున్న ఈ చిత్రంలోని ఐదు కథల్లో నాలుగు కథలను వేరు వేరు దర్శకులు తెరకెక్కిస్తారు. ఓ కథను రంజిత్ తెరకెక్కిస్తారు. దీనికి ‘కుదిరై వాల్’ అనే టైటిల్‌ని అనుకున్నారట. అంటే.. గుర్రం తోక అని అర్థం. ఇది కాకుండా ఓ స్టార్ హీరో కోసం రెడీ చేసిన ఓ కథతో సినిమా తెరకెక్కించడానికి రంజిత్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
నాడు నో నేడు ఎస్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ ముందస్తు విడుదలపై కొన్నేళ్లుగా సాగుతున్న పోరాటం కొత్త మలుపు తిరిగింది. రాజీవ్ హంతకులకు క్షమాభిక్షపై గతంలో తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పిన అఖిలభారత కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాజాగా మాటమార్చారు. ‘పేరరివాళన్‌ను ముందుగా విడుదల చేయదలిస్తే ఎలాంటిæ అభ్యంతరం లేదని ప్రకటించారు. సదరు ఖైదీల క్షమాభిక్ష వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉండడంతో రాహుల్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజీవ్‌గాంధీ హత్యకు సంబంధించి తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో పేరరివాళన్ ఒకడు. వేలూరు జిల్లా జోలార్పేటకు చెందిన ఇతనిపై సీబీఐ ముఖ్యమైన నేరారోపణలు చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకోసం ఆత్మాహుతి దళం బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను పెరిరవాళనే కొనిచ్చాడనే అభియోగంపై 1991 జూన్ 11వ తేదీన అరెస్ట్‌చేసింది. రాజీవ్ హత్యకేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పేరరివాళన్‌కు మరణశిక్ష విధించింది. అతనితోపాటు మురుగన్, శాంతన్, నళినిలకు సైతం ఉరిశిక్ష విధించింది. 1998లో టాడా న్యాయస్థానం విధించిన ఈ శిక్షను 1999లో సుప్రీంకోర్టు సైతం ఖరారుచేసింది. ఆ తరువాత పేరరివాళన్ విడుదల చేయాలని అనేక సంఘాలు ఆందోళనలు చేశాయి. అతని తల్లి అర్బుతమ్మాళ్ పలువురు నేతలను కలుస్తూ మద్దతు సేకరించారు. అయితే ఈపోరాటాలు సాగుతుండగానే 2014లో పేరరివాళన్ తదితరులను ఉరివేసేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. అయితే క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వారు చేసుకున్న విజ్ఞప్తిపై పదేళ్లుగా నిర్ణయం తీసుకోనందున ఉరిశిక్ష వేయకూడదని సుప్రీం కోర్టులో బాధితులు పిటిషన్ వేశారు. దీంతో ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువడింది. అంతేగాక, పేరరివాళన్ విడుదలపై తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నారు. దీంతో పేరరివాళన్ విడుదల ఖాయమనే ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పేరరివాళన్‌ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత అప్పట్లోప్రయత్నం చేశారు. చట్టంలోని నిబంధనలు అందుకు అనుమతించలేదు. దీంతో పేరరివాళన్ గత 27 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 1991లో అతడు ఇచ్చిన వాంగ్మూలం తప్పుగా తర్జుమా చేసినందునే మరణిశిక్షకు గురైనాడని కేసు విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో రాజీవ్ హత్యకేసులో పేరిరవాళన్ అమాయకుడనే భావన నెలకొన్నా జైలు నుంచి విడుదలకు అవకాశం ఏర్పడలేదు. అతని తల్లి ఇప్పటికీ కొడుకు విడుదల కోసం పోరాడి అలసిపోయారు. రంజిత్ రాయబారం రాజీవ్ హంతకులు, ముఖ్యంగా పేరరివాళన్ ముందస్తు విడుదల అంశం దాదాపు తెరమరుగు కాగా, ప్రముఖ తమిళ దర్శకులు పా రంజిత్ రాయబారం చేయడంతో మరలా తెరపైకి వచ్చింది. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్న రంజిత్ సుమారు రెండుగంటలపాటూ తమిళనాడు రాజకీయాలను మాట్లాడుకున్న సమయంలో పేరరివాళన్ విడుదలకు సహకరించాల్సిందిగా రంజిత్ కోరారు. ‘పేరరివాళన్ విడుదల విషయంలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని రాహుల్ బదులివ్వగా రంజిత్ ధన్యవాదాలు తెలిపారు. రంజిత్‌తో కలిసి రాజకీయాలు మాట్లాడుకున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతోపాటు ఫొటో పెట్టారు. కాగా, గతంలో సోనియా విజ్ఞప్తి మేరకు నళిని మరణదండన, యావజ్జీవ శిక్షగా మారింది. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో పేరరివాళన్ విడుదలయ్యేనా, తల్లి అర్బుతమ్మాళ్తోపాటు ఇతరుల కల నెరవేరేనా, రాహుల్ విజ్ఞప్తిని కేంద్రం స్వీకరించేనా అనే అనుమానాలు వరుసపెట్టాయి. ఆనాడే చుక్కెదురు మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని భావించిన జయలలితకు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడే చుక్కెదురైంది. అంతేగాక మాజీ ప్రధానిని హత్యచేసిన వారికే క్షమాభిక్షా అంటూ ఆనాడు సాక్షాత్తు రాహుల్‌గాంధీనే అడ్డుపుల్లవేశారు. మరి ఈరోజు అదే వ్యవహారంలో తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం అంగీకరించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని మంత్రి కడంబూరు రాజా చెప్పడం ద్వారా బంతిని కేంద్రం కోర్టులో వేసి చేతులు దులుపుకున్నారు. -
కాలా దర్శకుడితో సూర్య?
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. దీంతో రజనీకాంత్ తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది కూడా. కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అట్టకత్తి చిత్రంలో మొదలైన ఈ దర్శకుడిగా పయనం ఈ దర్శకుడు మెడ్రాస్, కబాలి, కాలా వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. దీంతో నెక్ట్స్ ఏంటీ అన్నదానికి పా.రంజిత్ ఇటీవల నటుడు శింబును కలిశారు. ఆయనతో చిత్రం చేయనున్నారా అనే ప్రచారం జరిగింది. తాజాగా నటుడు సూర్య హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. నిజానికి పా.రంజిత్ మెడ్రాస్ చిత్రం తరువాతే సూర్యతో చిత్రం చేయాల్సింది. అయితే రజనీకాంత్‌ను దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ఆ ప్రపోజల్ ఆగింది. తాజాగా మళ్లీ సూర్య హీరోగా పా.రంజిత్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి కలయికలో చిత్రం వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. సామాజిక అంశాలే పా.రంజిత్ కథా చిత్రాలుగా ఉంటాయనడానికి ఆయన గత చిత్రాలే సాక్ష్యం. అయితే ఈ కాంబినేషన్లో చిత్రం గురించి ఇంకా అధికారికపూర్వక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య ఎన్జీకే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తరువాతే పా.రంజిత్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. -
కాలాకు ముందే టచ్‌లో ఉన్నాం
తమిళసినిమా: కాలా చిత్ర ప్రారంభానికి ముందే తామిద్దరం టచ్‌లో ఉన్నాం అని చెప్పింది నటి హ్యూమఖురేషీ. ఈ సుందరి కోలీవుడ్ ఎంట్రీనే సంచలన చిత్రంతో కావడం అదృష్టమే. రజనీకాంత్‌తో ఒక్క సన్నివేశంలో నటించినా చాలని ఎందరో కోలీవుడ్ ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటే అలాంటి అవకాశాన్ని హ్యూమఖురేషీని చాలా సులభంగా వరించిందనే చెప్పాలి. కాలా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రేయసిగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుని ఆ పాత్రతో మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమఖురేషీ. ఇంతకీ కాలా చిత్రానికి ముందు మేము టచ్‌లో ఉన్నాం అని ఈ అమ్మడు ఎవరి గురించి అంటుందనేగా మీ ఉత్సుకత. ఆ కథేంటో ఈ జాణ మాటల్లోనే చూద్దాం. నేను నటించిన హిందీ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ చూశారట. అందులో నా నటన ఆయనకు బాగా నచ్చేసింది. ఆయన నా గురించి చాలా మందికి చెప్పారట. అయితే నాకు నటుడు ధనుష్ నుంచే ఫోన్‌కాల్ వచ్చింది. నేను ధనుష్ చాలా కాలంగానే టచ్‌లో ఉన్నాం. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. ఇద్దరం కలిసి చిత్రం చేయాలనుకున్నాం. ఒక చిత్రంలో నటించాలనుకున్నా, పలు కారణాల వల్ల అది జరగలేదు. అలాంటిది ఒక సారి ధనుష్ నుంచి ఫోన్ వచ్చింది. అది చిత్రం గురించి మాట్లాడడానికేనని భావించాను. అయితే నేను నిర్మించనున్న చిత్రంలో నటించాలి. హీరో రజనీకాంత్ అని ఆయన చెప్పగానే నేను వింటోంది నిజమేనా అన్న సందేహం కూడా కలిగింది. ధనుష్ నిజమేనని నిర్ధారణ చేయడంతో ఆనందంతో ఎగిరి గంతేశాను. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్‌ను కలిశాను. ఆయన చెప్పిన కథ బాగా నచ్చేసింది. కాలా చిత్రంలో నటించాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఈ చిత్రంలో కష్టమైన విషయం ఏమిటంటే నేను రజనీకాంత్‌ను తిట్టడమే. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ సన్నివేశానికి మంచి పేరు వచ్చింది. రజనీకాంత్‌తో నటించడం మధురమైన అనుభవం. -
‘కాలా’ కలెక్షన్లు.. అట్టర్ ఫ్లాప్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ స్టార్ అభిమానులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. రజనీ ఇమేజ్ తగ్గ కథా కథనాలు కాకపోవటంతో కాలాపై అభిమానులు కూడా పెదవి విరిచారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాలా, ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఈ సినిమా.. రజనీ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ అంటున్నారు విశ్లేషకులు. తమిళనాట కాస్త పరవాలేదనిపించినా తెలుగు, హిందీ భాషల్లో కాలా వసూళ్లు భారీ నష్టాలు మిగిల్చేలా ఉన్నాయి. కాలా తెలుగు డబ్బింగ్ రైట్స్ 30 కోట్లకు పైగా ధర పలికినట్టుగా వార్తలు వినిపించాయి. అంటే ఈ సినిమా తెలుగులో విజయం సాధించాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి 30 కోట్లకు పైగా వసూళ్లు సాదించాలి. కానీ తొలి ఐదు రోజుల్లో కాలా కేవలం 7 కోట్లు మాత్రమే వసూళు చేసింది. సోమవారం తరువాత కలెక్షన్లు మరింతగా పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో కాలాకు భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేకులు. -
రజనీ ‘కాలా’... దుమ్మురేపుతున్న వసూళ్లు!
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘కాలా’... అంతగా గ్రాండ్ ఓపెనింగ్స్‌ను రాబట్టలేకపోయింది. రజనీ సినిమాలంటే సహజంగానే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కలెక్షన్ల సునామీ పోటెత్తుతుంది. అయితే, తొలిరోజు కాలా సినిమాకు చాలావరకు థియేటర్లు హౌస్‌ఫుల్ కాలేదని, అన్బుక్డ్ సీట్లు చాలా మిగిలిపోయాయని వార్తలు వచ్చాయి. రెండోరోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మెల్లిగా ఊపందుకున్నాయని సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండ్రోరోజుల్లో ఒక్క చెన్నైలోనే కాలా సినిమా మూడు కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్లో మిలియన్ మార్క్ (రూ. 6.83 కోట్లు)ను అందుకుంది. మొత్తానికి టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కాలా సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్లో వెల్లడించారు. చెన్నైలో ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 4.9 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో కాలా సినిమా సంచలన వసూళ్లు రాబడుతోంది. పద్మావతి సినిమా తర్వాత అత్యధిక విదేశీ వసూళ్లు రాబట్టిన సినిమాగా కాలా నిలిచింది. శాటిలైట్, మ్యూజిక్ తదితర హక్కుల ద్వారా విడుదలకు ముందే రూ. 230 కోట్ల బిజినెస్ చేసిన కాలా.. విడుదల తర్వాత కూడా వసూళ్లతో ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమా రజనీ ద్రవిడ డాన్‌గా, మురికివాడల్లో నివసించే తన ప్రజల హక్కుల కాపాడే వ్యక్తిగా అద్భుతమైన నటన కనబర్చారు. #BREAKING: In 3 Days, #Kaala has crossed ₹ 100 Cr Gross at the WW Box Office.. pic.twitter.com/N9NS1no2Mg — Ramesh Bala (@rameshlaus) June 10, 2018 -
కాలాతో పెట్టుకుంటే అంతే!
తమిళసినిమా: కాలా అంటే ఎవరు కరాకాలుడు. ఆయనతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? సినీ ప్రేక్షకులకు సూపర్‌స్టార్, అభిమానులకు తలైవా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా.ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తరువాత వస్తున్న చిత్రం కాలా కావడంతో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ మధ్య తూత్తుకుడి కాల్పులనంతరం ఆ సంఘటనలో మరణించిన వారి కటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ముఖ్యంగా ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందన్న రజనీ వ్యాఖ్యలను పలు తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాయి. కాలా చిత్రంకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ అలాంటి వాటిని పట్టించుకోలేదు. అయితే అందకు ముందు కావేరి మేనేజ్మెంటట్ బోర్డు ఏర్పాటు కోసం చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర త్యతిరేకతకు గురి చేశాయి. ఎంతగా అంటే కాలా చిత్ర విడుదలను ఆ రాష్ట్రంలో నిషేధించే స్థాయికి. దీంతో కోర్టు తీర్పు, కర్ణాటక ముఖ్యమంత్రి సహకారం, పోలీసుల రక్షణ వంటి చర్యలు కూడా కాలాకు ఆటంకాలను అడ్డుకోలేకపోయాయి. గురువారం కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చినా, కర్ణాటకలో పూర్తిగా విడుదల కాలేదు. అయితే శుక్రవారం నుంచి చిత్రం అక్కడ కూడా థియేటర్లకు వెళ్లింది. 400 వెబ్సైట్లు మూతబడ్డాయి కాగా కాలా చిత్రం కూడా పైరసీకి గురి కాక తప్పలేదు. చిత్రం విడుదలైన సాయంత్రమే 45 నిమిషాల చిత్రం ఫేస్‌బుక్‌లోకి వచ్చేసింది. అయితే అందుకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి. కాగా ఆ తరువాత కాలా చిత్రాన్ని 400 వెబ్‌సైట్స్ ప్రసారం చేసి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చాయి.అయితే కాలాతో పెట్టుకోవడం అంటే మాటలా? పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫలితం ఇప్పుడా వెబ్‌సైట్స్ అన్నీ మూత బడ్డాయన్నది తాజా సమాచారం. అదే విధంగా కాలా చిత్ర పైరసీ వ్యవహారంపై నిర్మాతల మండలి సీరియస్ అయ్యింది. ఎవరైనా కాలా చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో పైరసీకి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అభిమానుల మధ్య ఘర్షణ కాగా రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం గురించి ప్రకటించిన తరువాత ఆయన నటించిన చిత్రం కావడంతో కాలా చిత్రాన్ని చూడడానికి అబిమానులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. కాలా చిత్రాన్ని పుదుకోట్టైలో రెండు థియేటర్లలో విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు థియేటర్ల బంధోబస్తు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో పుదుకోట్టైలోని ఒక థియేటర్లో 4 గంటల షోకు వచ్చిన గంధర్వకోట్టైకు చెందిన రజనీ అభిమానులకు, వండిపేట్టైకు చెందిన అభిమానులకు మధ్య థియేటర్లో సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. చిత్ర ప్రదర్శన అనంతరం ఈ రెండు జట్ల మధ్య గొడవ కొట్లాటకు దారి తీసింది. దీంతో వారి ఇరు వాహనాలు ధ్వంసం అయ్యే స్థాయికి చేరాయి. ఒకరి వాహనంపై మరొకరు రాళ్లు, కట్టెలతో దాడి చేసి ధ్వంసం చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు ఘర్షణకు పాల్పడిన వారి గురించి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కాలా’ అరుదైన ఘనత
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలా. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. రజనీ కెరీర్లోనే అత్యల్ప వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా కాలా రికార్డ్ సృష్టించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో రిలీజ్ అయిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది కాలా. దాదాపు 35 ఏళ్ల తరువాత కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా సినిమాల ప్రదర్శనపై నిషేదాన్ని ఎత్తివేసింది. సౌదీ అరేబియాలో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండటంతో కాలాకు కలెక్షన్లు బాగానే ఉంటాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. కబాలి ఫేం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానా పటేకర్, ఈశ్వరీరావు, హూమా ఖురేసీ, సముద్రఖనిలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘కాలా’ మూవీ రివ్యూ
టైటిల్ : కాలా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రజనీకాంత్, నానా పటేకర్, హూమా ఖురేషి, ఈశ్వరీ రావు సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : పా.రంజిత్ నిర్మాత : ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ ఉంటుంది. అయితే రోబో తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో కలెక్షన్లు వచ్చినా సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. అయినా రజనీ మాత్రం మరోసారి పా.రంజిత్ కే అవకాశం ఇచ్చారు. ముంబై మురికి వాడల నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా కాలా. రజనీ ఏజ్‌కు ఇమేజ్ తగ్గ కథతో తెరకెక్కిన కాలా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? రజనీ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..? కబాలితో నిరాశపరిచిన పా.రంజిత్.. కాలాతో మెప్పించాడా..? కథ ; కరికాలా అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబైలోని మురికివాడ ధారావీకి పెద్ద దిక్కు. అక్కడే పుట్టి పెరిగిన కాలా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే ముంబైలో అత్యంత విలువైన ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు రాజకీయనాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. (సాక్షి రివ్యూస్) ముఖ్యంగా అధికార పార్టీ నాయకుడు హరిదేవ్ అభయంకర్ అలియాస్ హరిదాదా (నానా పటేకర్) ఎలాగైన ధారావీని నుంచి ప్రజలను వెల్లగొట్టి అక్కడ అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కాలా హరిదాదా పనులకు అడ్డుతగులుతాడు. అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది..? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు..? చివరకు ధారావీ ఏమైంది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రజనీకాంత్ తనదైన స్టైల్స్, మేనరిజమ్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. నటన పరంగా సూపర్బ్ అనిపించిన రజనీ యాక్షన్ సీన్స్ లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. విలన్ గా నానా పటేకర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో సూపర్బ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. రజనీ ఇమేజ్ను ఢీ కొట్టే పొలిటీషియన్ పాత్రలో నానా పటేకర్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. రజనీ భార్యగా ఈశ్వరీ రావు నవ్వించే ప్రయత్నం చేసింది. (సాక్షి రివ్యూస్)రజనీ, ఈశ్వరీ రావ్ల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. కీలక పాత్రలో నటించిన హూమా ఖురేషీ హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో అంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ ; కబాలి సినిమా తరువాత రజనీ ఇచ్చిన సెకండ్ చాన్స్‌ను దర్శకుడు పా.రంజిత్ వినియోగించుకోలేకపోయాడు. రజనీ నుంచే అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా సినిమాను రూపొందించిన రంజిత్ పూర్తిగా నిరాశపరిచాడు. రజనీ ఎంట్రీ విషయంలో కూడా పెద్దగా హడావిడి లేకుండా సాదాసీదాగా కాలా పాత్రను పరిచయం చేశాడు. తొలి భాగం అంతా అసలు కథ ప్రారంభించకుండా ఫ్యామిలీ సీన్స్‌తో లాగించేశాడు. కథలో రజనీ హీరోయిజాన్ని మరింతగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు. (సాక్షి రివ్యూస్)ఇంటర్వెల్ సీన్‌తో హైప్‌క్రియేట్ చేసినా ద్వితీయార్థంలో అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అక్కడక్కడా మెప్పించినా.. చాలా సందర్భాల్లో విసిగించాడు. మూడ్‌తో సంబంధం లేకుండా రాప్ బీట్లతో ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాడు. మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ధారావి మురికి వాడలను నేచురల్ గా చూపించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ ఇంటర్వెల్ సీన్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ ఎడిటింగ్ సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కళ్లు చెదిరే ‘కాలా’ రికార్డు
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇండియావైడ్‌గా క్రేజ్ ఉంటుంది. రజనీ సెలబ్రిటీలకే సెలబ్రిటీ. తలైవా సినిమా వస్తోందంటే ఎవరైనా వెనక్కి వెళ్లాల్సిందే. రజనీ తాజా చిత్రం కాలా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. విడుదలకు ముందే ‘కాలా’ కళ్లు చెదిరే రికార్డులను నెలకొల్పింది. కబాలి ఆశించినంతగా ఆడకపోయినా ఈ సినిమా దాదాపు 600కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. కేవలం సూపర్‌స్టార్ మేనియా ఈ సినిమా కలెక్షన్లను పెంచింది. ప్రసుత్తం కాలా సినిమా విడుదలకు ముందే 230కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్లో 70కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 33కోట్లు, కేరళలో పది కోట్లు, రెస్టాఫ్ కంట్రీ ఏడు కోట్లు, ఓవర్సిస్ హక్కులు 45కోట్లు, థియేట్రికల్ హక్కులు 155కోట్లు, బ్రాడ్ కాస్ట్ హక్కులు 70కోట్లు, మ్యూజిక్ ద్వారా 5కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కాలాకు కష్టాలు తొలగి, విడుదలకు మార్గం సులువైతే ఇంకో 20కోట్ల బిజినెస్ జరగవచ్చు. కానీ కాలాకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. దాదాపు ఈ సినిమా 280కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్‌గా చెప్పవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
‘కాలా’ కమర్షియల్ కాదు... మెసెజ్ ఓరియంటెడ్ : రజనీ
‘కాలా సినిమాను నేను రెండు మూడు సార్లు చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ కాదు.. ఒక మంచి మెసెజ్ ఉంటుంద’ని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడకు వస్తే నా గత సినిమాలు గుర్తొస్తాయి. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్ ఇలా ఓ పదిహేను తెలుగు సినిమాలు చేశాను. అయితే నేను తెలుగులో సినిమాల్లో కొనసాగాలా.. లేదా తమిళంలో చేయాలా అని ఆలోచించాను. నా గురువు బాలచందర్ గారు తమిళ్లో నాకు మొదటి సినిమాను ఇచ్చారు. నా సినీ జీవితం తమిళంలో మొదలైంది. అలా నా కెరీర్ తమిళ్లో కంటిన్యూ అయింది. తరువాత కొద్ది కాలానికి మోహన్‌బాబు పెదరాయుడు సినిమాలో పాత్ర ఇచ్చారు. దాని తరువాత మళ్లీ భాషా, ముత్తు, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, రోబో, శివాజి లాంటి సినిమాలతో మీ ముందుకు వచ్చాను. తమిళ్ ప్రేక్షకులు నన్నుఎంతగా అభిమానిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే అభిమానిస్తున్నారు. ఇది నా భాగ్యం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదాన్ని తీసుకునే వాడిని. దాసరి గారు చనిపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. నేను అమెరికాలో ఉండడం వల్ల కబాలి సినిమా సమయంలో నేనిక్కడికి రాలేకపోయాను. కబాలి చేస్తున్నప్పుడు ఇంత చిన్న కుర్రాడికి ఎందుకు చాన్స్ ఇచ్చారని అడిగారు. అతను కథ చెప్పినప్పుడు చేసినప్పుడే నాకు చాలా నచ్చింది. కబాలి సినిమాను ఎంత బాగా తీశాడో చూశాం. అందుకే మళ్లీ రంజిత్‌తో కలిసి చేయాలని అనిపించింది. అందుకే కాలా చేశాను. నా అల్లుడు (ధనుష్) నిర్మాత అంటే సినిమాను బాగా తీయగలడా అనే అనుమానం కలిగింది. కానీ అతను మంచి నటుడే కాదు, మంచి నిర్మాత అని కూడా నిరూపించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన హ్యూమా ఖురేషి కూడా ఎంతో సహకరించింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. సినిమాకు సంతోష్ నారాయణ మంచి సంగీతం అందించారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాంతానికి సంబంధించిన ఈ సినిమాలో, వారి జీవన పరిస్థితులు, అక్కడి మనుషుల ప్రేమలను అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటుంద’ని రజనీ అన్నారు. -
నా తండ్రి తప్పుడు మనిషి కాదు
సాక్షి, ముంబై/చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్ కాకుండా అడ్డుకుని తీరతామని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు కాలా కథ తన తండ్రిదేనంటున్న ముంబైకి చెందిన జర్నలిస్ట్ జవహర్ నాడర్, పరువు నష్టం దావా వేస్తానని కాలా నిర్మాతలను హెచ్చరించారు. కాలా సేట్ కథ... ట్యూటికోరిన్(తూత్తుకుడి)కి చెందిన ఎస్. థిరవియమ్ నాడర్ బెల్లం వ్యాపారి. 1957లో ముంబైలోని ధారావికి వలస వచ్చారు. అతనిని స్థానికులు ‘గుడ్వాలా సేట్’, ‘కాలా సేట్’ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు కాలా చిత్రంలో రజనీ పోషిస్తున్న పాత్ర తన తండ్రిదేనని జవహర్ వాదిస్తున్నారు. ‘నా తండ్రి కథ అన్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా మంచి మనిషిగా పేరున్న నా తండ్రిని తప్పుడు కోణంలో చూపించారు. ఆయన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను. 36 గంటల్లో రజనీకాంత్ సహా చిత్ర యూనిట్ మొత్తం లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ. 101 కోట్లకు దావా వేస్తా’ అని ఆయన లేఖలో హెచ్చరించారు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేయటం తెలిసిందే. కాలా టీమ్ స్పందన... ఇదిలా ఉంటే జవహర్ ఆరోపణలను కాలా చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’ను నటుడు ధనుష్ నిర్మించగా, రజనీకాంత్, ఈశ్వరి, నానాపటేకర్, సముద్రఖని, హూమా ఖురేషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న కాలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రజనీకాంత్ ‘కాలా’ ట్రైలర్
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ట్రైలర్ వచ్చేసింది. వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కబాలి డైరెక్టర్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ముంబై నేపథ్యంలో మరోసారి డాన్‌గా తలైవా అలరించబోతున్నాడు. ట్రైలర్ విషయానికొస్తే... బస్తీ, దానిని రక్షించే దాదా కాలాగా రజనీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నెగటివ్ రోల్లో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ నటించారు. ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే... అంటే పటేకర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘ఒక్కచోటూ వదల్లేదు. తన వెనుక పిచ్చోడిలా తిరిగా.. నేనంటే అంత ఇష్టమా?. చెప్పలేనంత... ఐ లవ్ యూ’... అంటూ ముదురు రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. రజనీకి జోడీగా ఈశ్వరి, హూమా ఖురేషీలు నటించారు. ‘ఈ తనవే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం.. కదలండి ఉద్యమిద్దాం.’ ‘నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం’ అంటూ రజనీ డైలాగులు ఓకే అనిపించాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సూపర్ స్టార్ గత చిత్రాల స్థాయిలో హడావుడి కనిపించకపోవటం గమనించదగ్గ విషయం. జూన్ 7న కాలా అన్ని భాషల్లో విడుదల కానుంది. -
హైదరాబాద్‌లో ‘కాలా’ ఈవెంట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. సూపర్‌స్టార్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే రజనీ గత సినిమా కబాలి దెబ్బ కాలాపై పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కబాలి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే.. సూపర్‌స్టార్ సినిమాకు ఉండాల్సిన హడావిడి ‘కాలా’కు లేదని అభిమానులు ఫీలవుతున్నారు. కాలా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించినా పాటలు అభిమానులను అలరించేలా లేవన్న టాక్ వినిపిస్తోంది. రజనీకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళ ఇండస్ట్రీ తరువాత రజనీకి టాలీవుడ్ అతి పెద్ద మార్కెట్. కానీ ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమా సందడి కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్తను ప్రకటించింది చిత్రయూనిట్. మే 29న కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభవుతుందని తెలిపారు. నానా పటేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వం వహించారు. తలైవాకు జోడిగా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘కాలా’ ఫస్ట్ సింగిల్ రేపే
సినిమా విజయాలతో సంబంధం లేని తిరుగులేని స్టార్డమ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతం. రజనీ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. రజనీపై ఉండే అభిమానం... సినిమా సక్సెస్‌పై ఆధారపడదు. సూపర్‌స్టార్‌కు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుసగా సినిమాలు నిరాశపరుస్తున్న అభిమానులు మాత్రం తలైవా సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. కబాలి ఫేం పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన రజనీ తాజా చిత్రం ‘కాలా’.. ఈపాటికే సినిమా విడుదలై సంచనాలు సృష్టించాల్సింది. కానీ తమిళ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆలస్యమైంది. లేటుగా వచ్చినా లేటేస్ట్‌గా వస్తా అనే డైలాగ్ ఎలాగూ రజనీకి ఉంది. కాలా సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటును పలికాయని తెలుస్తోంది. తలైవాకు ఉన్న క్రేజ్‌కు ఎంతైనా పెట్టొచ్చు అంటున్నారు అభిమానులు. ప్రముఖ హీరో, రజనీ అల్లుడైన ధనుష్ ఈ చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ధనుష్ ట్వీటర్ ద్వారా తెలియపరిచారు. మే 9న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నట్లు, రేపు (మే 1) సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు నటించారు. ఈ సినిమాకు కబాలి ఫేం సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. A surprise to Superstar fans. #kaala 1st single #semmaweightu will be released tom evening at 7 pm. #rajinism #thalaivar @Music_Santhosh @beemji @vinod_offl @humasqureshi pic.twitter.com/mLDt1oCfm2 — Dhanush (@dhanushkraja) 30 April 2018 Wunderbar films presents, Superstar’s #kaalaa audio will release on #may9th ... get ready to celebrate thalaivars swag with Santosh narayanan’s stylish music. pic.twitter.com/FbrRwFmtng — Dhanush (@dhanushkraja) 28 April 2018 -
‘కాలా’ శాటిలైట్ రైట్స్‌కు భారీ ప్రైజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తమిళనాట సినీరంగం సమ్మె కారణంగా కాలా సినిమాను జూన్ 7కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం లేకపోయినా.. కాలా సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సంస్థ 75 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తుండటంతో ఉత్తరాదిలో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. రజనీ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. -
‘కాలా’ సెన్సార్ పూర్తయ్యిందా..?
రజనీకాంత్ ఈ పేరే ఒక సంచలనం. నడిచినా, నవ్వినా, అది ఒక ట్రెండే. రజనీ చిత్రం వస్తుంది అంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాల్సిందే. కబాలి విడుదల సందర్భంగా చాలా ప్రైవేట్ సంస్థలు సెలవు దినంగా ప్రకటించాయి కూడా. కానీ కబాలి ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినా ఆ సినిమా డైరెక్టర్ పనితనం నచ్చి అదే డైరెక్టర్‌కు మళ్లీ అవకాశం ఇచ్చాడు రజనీ. ప్రస్తుతం కాలా చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తమిళనాడులో జరుగుతున్న సినీ పరిశ్రమ నిరవధిక సమ్మెల కారణంగా ఈ చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. కాలా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయనీ, సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సెన్సార్ సభ్యులు దాదాపు 10 మార్పులు సూచించారని కొన్ని సన్నివేశాలను తీసేశారని సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. -
రజనీ మూవీ రిలీజ్ మళ్లీ డౌటే!
సాక్షి, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా మూవీ విడుదల మరింత ఆలస్యం కానుంది. పా. రంజిత్ దర్శకత్వంలో విజయం సాధించిన ‘కబాలి’ సినిమాకు సీక్వెల్‌గా ’కాలా’ రూపొందింది. రజనీ నటించిన 2.0 (రోబో-2) కంటే ముందుగానే ఏప్రిల్ 27న కాలా విడుదలవుతుందని ఆ మూవీ యూనిట్ ఇటీవల వెల్లడించింది. కానీ కొన్ని కారణాల వల్ల మాఫియా డాన్ కరికాలన్‌గా రజనీని చూడాలంటే అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందని కోలీవుడ్ టాక్. తమిళ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తమ సమస్యల పరిష్కారం కోసం త్వరో దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కాలా విడుదల ఆలస్యం కానుంది. కావాలంటే నెల ముందుగానే విడుదల చేసుకోవాలని టీఎఫ్‌పీసీ సూచించడంతో అందుకు సాధ్యం కాదని కాలా మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో కాలా విడుదల కానుందని తెలుస్తోంది. కాగా మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. -
కాలా టీజర్ కేక
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్న కాలా చిత్రం టీజర్ గురువారం అర్ధరాత్రి విడుదలై కేక పుట్టిస్తోంది. కబాలి తరువాత రజనీ నటించిన చిత్రం కాలా. ఆయన అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి ఈశ్వరిరావు రజనీకాంత్‌కు భార్యాగా నటించారు. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చిత్ర టీజర్‌ను మార్చి ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు నటుడు ధనుష్ ముందుగా ప్రకటించడంతో రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కంచి కామకోటి పిఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి శివైక్యం కావడంతో కాలా టీజర్ విడుదలను ఒక్క రోజు వాయిదా వేశారు. గురువారం అర్ధరాత్రి విడుదలైన టీజర్ కేక పుట్టిస్తోంది. రజనీ పంచ్ డైలాగులు దుమ్మురేపుతూ చిత్ర రెంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఒక్కడినే నిలబడ్డా దిల్లుంటే మొత్తంగా రండి అని తిరునెల్వేలి తమిళ యాసలో రజనీ చెప్పే డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. నా రౌడీయిజాన్ని మొత్తం చూడలేదు. చూస్తారా? అంటూ తనదైన స్టైల్లో రజనీకాంత్ చెప్పే డైలాగులకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తం 78సెకన్ల నిడివి కలిగిన కాలా టీజర్ అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ కిరాక్ పుట్టిస్తోంది. టీజర్ విడుదలైన కొద్ది గంట ల్లోనే కబాలి చిత్ర టీజర్‌ను బీట్ చేసేందంటున్నారు సినీ వర్గాలు. అయితే ఈ టీజర్‌పై కొన్ని విమర్శలు తెలెత్తడం గమనార్హం. కాలా చిత్రంలో రజనీ అణగారిన జనం కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కబాలి చాయలు కనిపిస్తున్నాయని,వరుసగా రజనీకాంత్‌ను రౌడీగా చూడడం మోనాటనీగా భావించే అవకాశం ఉందనే విమర్శలు మొదలయ్యాయి. అదేవిధంగా రాజ్యాంగ కర్త అంబేడ్కర్‌ను కించపరచే విధంగా సంభాషణలు చోటుచేసుకున్నాయనే వివాదం తెరపైకి వస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాలి. -
కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు!
సాక్షి, సినిమా : ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ టీజర్ వచ్చేసింది. తలైవా మరోసారి మాఫియా డాన్ పాత్రలో అదరగొట్టారు. ‘కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు’, ‘వీరయ్య బిడ్డని రా.. ఒక్కడినే ఉన్నా.. దిల్ ఉంటే గుంపుగా రండి’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మాణంలో పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. తమిళ టీజర్ ను ముందుగా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ 10 గంటలకు తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. రజనీ డాన్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. నానా నటిస్తున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతమందించారు. టీజర్ గురువారమే రిలీజ్ కావాల్సి ఉండగా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరణం నేపథ్యంలో ఆయన గౌరవార్థం టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ధనుష్ ట్విటర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
రజనీ సినిమా టీజర్‌కు డేట్ ఫిక్స్
రజనీకాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాలా’. 2.ఓ రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. మార్చి 1న కాలా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా హుమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తోంది. సంతోష్ నారయణ్ సంగీతమందిస్తున్నారు. -
లీకైన రజనీ యాక్షన్ వీడియో
స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పటం లేదు. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రజనీకాంత్ సినిమా క్లిప్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై మాఫీయా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం లీకైంది. యాక్షన్ సీన్‌కు సంబంధించిన ఈ క్లిప్ లో రజనీ మంటల మధ్యలో విలన్లతో పోరాడుతున్నాడు. వీడియో లీక్‌పై ఇప్పటికే చిత్రయూనిట్ చర్యలు ప్రారంభించింది. ఎడిటింగ్ జరుగుతున్న సమయంలోనే క్లిప్ లీక్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాలా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ కానుంది. -
‘రజనీ బతిమాలితేనే ఒప్పుకున్నా’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించటంపై స్పందించిన నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తమిళ సినిమా చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదన్న నానా పటేకర్, రజనీ కోరినందువల్లే కాలా సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. -
రైటర్ రజనీ!
గాల్లోకి సిగరెట్ ఎగరేసి అలవోకగా నోటితో రజనీకాంత్ క్యాచ్ చేయడం చూశాం. నేను.. ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అని రజనీ డైలాగ్స్ చెప్పడమూ చూశాం. స్టైలు స్టైలు రా.. ఇది సూపర్స్టైలు రా అంటూ ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించిన రజనీ స్టైలిష్ డ్యాన్స్ చూశాం. కానీ ఆయనలో ఎవరికీ తెలియని ఇంకో స్టైల్ ఉంది. అదే ఆయన రైటింగ్ స్టైల్. యస్.. రజనీ కథ రాశారని నటుడు–దర్శకుడు సముద్రఖని చెబుతున్నారు. ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన సినిమా ‘కాలా’. ఇందులో సముద్రఖని కీలక పాత్ర చేశారు. ‘కాలా’ షూటింగ్ అనుభవాలను ఆయన పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం కోసం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాం. రజనీసార్ ఫుల్ ఎనర్జీతో ఉండేవారు. ఫస్ట్ షాట్‌కు ఎలా ఉంటారో మార్నింగ్ 4 గంటల లాస్ట్ షాట్‌కు సేమ్ ఎనర్జీ. ఇది చూసి మేం అందరం షాక్ అయ్యాం. అంతేకాదు రజనీసార్ ఓ కథ రాశారు. ఆ కథ నాకు చెప్పారు. అందులో నన్నే నటించమన్నారు. ఆ సినిమాకి రైటర్‌గా రజనీసార్ పేరు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు సుమద్రఖని. అయితే ఈ సినిమాను ఎప్పుడు తీయాలనుకుంటున్నారో మాత్రం సముద్రఖని చెప్పలేదు. -
రజనీకాంత్, ధనుష్‌లకు ఊరట
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా కాలా. రజనీకాంత్ తో కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై కథలో రాజశేఖర్ అనే వ్యక్తి కేసు వేసిన సంగతి తెలిసిందే. తాను కరికాలన్ పేరుతో తయారు చేసుకున్న కథను తన అనుమతి లేకుండా కాలా పేరుతో తెరకెక్కిస్తున్నారని. తాను రిజిస్టర్ చేయించుకున్న కరికాలన్ అనే పేరులోని కాలా అన్న పదాన్ని కూడా తన అనుమతి లేకుండానే వినియోగించుకుంటున్నారని కాలా యూనిట్ పై రాజశేఖర్ కేసు వేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం హీరో రజనీకాంత్, నిర్మాత ధనుష్, దర్శకుడు పా రంజిత్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన చిత్రయూనిట్, తాము ఎవరి కథను తీసుకోలేదని పా రంజిత్ స్వయంగా రాసుకున్న కథతోనే కాలాను తెరకెక్కిస్తున్నామని తెలిపారు. టైటిల్ పూర్తి చాలా రోజుల క్రితమే రిజిస్టర్ చేయించామని క్లారిటీ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత లాభం కోసమే రాజశేఖర్ తమ చిత్రంపై ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. టైటిల్ రిజిస్టర్ చేయించిన సంవత్సరం లోపు చిత్రాన్ని ప్రారంభించాలని కానీ రాజశేఖర్ కరికాలన్చిత్రాన్నిఇంత వరకు ప్రారంబించలేదు. 2006లో టైటిల్ రెన్యువల్ కూడా చేయలేదని తెలిపారు. కాలా యూనిట్ వాదనతో ఏకభవించిన న్యాయస్థానం రాజశేఖర్ పిటీషన్‌ను కొట్టివేస్తూ తీర్పు నిచ్చింది. -
రజనీకాంత్ డ్యాన్సే హైలెట్..!
అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కిన 2.0 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్, తన నెక్ట్స్ సినిమా కాలా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను 2.0 తరువాత రెండు నెలల గ్యాప్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రజనీ అల్లుడు, హీరో ధనుష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల పరిచయ గీతాన్ని భారీగా తెరకెక్కించారు. ఈ పాటలో రజనీ డ్యాన్స్ మూమెంట్స్ హైలెట్ గా నిలవనున్నాయట. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హుమా ఖురేషీ, నానా పటేకర్, సముద్రఖని, పంకజ్ త్రిపాఠి, అంజలీ పాటిల్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా కాలా. కబాలి లాంటి భారీ చిత్రాన్ని అందించిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీతో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రజనీ మాఫీయా డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాలో కలిసి నటించిన ఈ స్టార్స్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరను పంచుకోవటం హాట్ టాపిక్ మారింది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
రజనీ 'కాలా' మొదలైంది..!
కబాలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో మరో సినిమా మొదలైంది. కాలా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం ముంబైలో ప్రారంభమైంది. షూటింగ్లో పాల్గొనేందుకు రజనీ కూడా ముంబై చేరుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ.. దారవీ ప్రాంతంలోని తమిళుల కోసం పోరాడే కరికాలన్ పాత్రలో కనిపించనున్నాడు. రజనీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో మరోసారి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు, రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్. ఇప్పటికే రోబో సీక్వల్గా తెరకెక్కుతున్న 2.0 షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్.., పూర్తి సమయం కాలా కే కేటాయించనున్నాడు. -
సూపర్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ
సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు గానీ.. బాలీవుడ్ భామలు సౌత్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. టెక్నికల్ గానే కాక కలెక్షన్ల పరంగా కూడా సౌత్ సినిమాలు బాలీవుడ్‌తో పోటి పడుతున్నాయి. దీంతో బాలీవుడ్ బ్యూటీస్ మన సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా టాప్ స్టార్స్ సినిమాల్లో బాలీవుడ్ తారలు నటిస్తే బిజినెస్‌కు కూడా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో మన మేకర్స్ నార్త్ భామల కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కూడా బాలీవుడ్ భామనే హీరోయిన్గా ఫైనల్ చేశారు. కబాలి తరువాత పా రంజిత్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్న రజనీ ముందుగా విద్యాబాలన్‌ను తీసుకోవాలని భావించాడు. కానీ ఫైనల్‌గా హాట్ బ్యూటీ హుమా ఖురేషిని ఫైనల్ చేశారు. ధనుష్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమాకు అంగకీరించడు. అది కూడా సినిమా పూర్తయిన తరువాత రెండు మూడు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న తరువాతే మరో సినిమాను మొదలు పెడతాడు. చాలా ఏళ్లుగా రజనీ ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం రూట్ మార్చాలని నిర్ణయించుకున్నాడట రజనీ. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమాలో నటిస్తున్న రజనీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో అదే స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదు. కానీ 2.0 సెట్స్ మీద ఉండగానే రజనీ మరో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు రజనీ. ఈసినిమాను వచ్చే నెల రెండో వారం ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారట. ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని రజనీ తన అల్లుడు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ రూల్ ను మార్చుకున్నారట. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ధనుష్ నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. కబాలి సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయిన రంజిత్, సినిమాతో మాత్రం నిరాశపరిచాడు. మరి రజనీ ఇచ్చిన ఈసెకండ్ ఛాన్స్ ను ఎంత వరకు సక్సెస్ చేస్తాడో చూడలి. -
కబాలి 2లో మరో కొత్త లుక్‌లో రజనీ
సూపర్ రజనీకాంత్ హీరోగా ఘనవిజయం సాధించిన సినిమా కబాలి. ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే రజనీ తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా రజనీ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే కబాలి ఫీవర్ నడుస్తుండగానే ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు రజనీ. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 పనుల్లో బిజీగా ఉన్న రజనీ కబాలి సీక్వల్ పని కూడా మొదలెట్టేశాడు. ఇటీవల రజనీని కలిసిన దర్శకుడు పా రంజిత్, సీక్వల్లో రజనీ లుక్, కాస్ట్యూమ్స్ పై చర్చించాడు. త్వరలోనే కబాలీ 2 సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది. -
ఆ సినిమా కబాలి 2 కాదు
రజనీకాంత్ హీరోగా కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్, ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక సమయంలో టాప్ స్టార్లు కూడా పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి క్యూ కట్టారు. అయితే కబాలి రిలీజ్ తరువాత మాత్రం సీన్ మారిపోయింది. ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకు వచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్ల నష్టపోయారు. దీంతో ఇక రంజిత్‌కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వటం కష్టమనే భావించారు అంతా. కానీ అందరికీ షాక్ ఇస్తూ రజనీ హీరోగా పా రంజిత్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా రజనీ అల్లుడు, తమిళ హీరో ధనుష్ స్వయంగా ప్రకటించారు. దీంతో రజనీ హీరోగా రంజిత్ తెరకెక్కించబోయే సినిమా కబాలి 2 అంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు పా రంజిత్ క్లారిటీ ఇచ్చాడు. తాను రజనీ హీరోగా మరో సినిమా చేస్తున్న మాట నిజమేనని అయితే ఆ సినిమా కబాలి సీక్వల్ మాత్రం కాదని ప్రకటించాడు. ఓ కొత్త కథను రజనీకి వినిపించానని ఆయనకు కథ నచ్చి స్క్రిప్ట్ రెడీ చేయమన్నారని తెలిపాడు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో సీక్వల్ పూర్తవ్వగానే పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు?
శంకర్ '2.0' సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే.. మరో సినిమాను ఫైనలైజ్ చేసి.. తన అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తాడు రజనీకాంత్. 'కబాలి' దర్శకుడు పా రంజిత్‌తో తాను మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు సూపర్ స్టార్. ఈ సినిమాకు తన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉంటాడని తెలిపాడు. ఈ ప్రకటన సహజంగానే రజనీ అభిమానుల్ని థ్రిల్ చేసింది. సూపర్ హిట్ అయిన 'కబాలి'కి సీక్వెల్‌గా ఈ సినిమా రానున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పా రంజిత్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో ముచ్చటిస్తూ తనకు మరోసారి ఎలా అవకాశం వచ్చిందో వివరించారు. 'కబాలి విడుదలైన కొన్నిరోజులకు సౌందర్య (రజనీ కూతురు) మేడం నాకు కాల్ చేశారు. కబాలి సినిమా పట్ల రజనీ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆయన నన్ను కలువాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేం కలిశాం. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ 'నీతో పనిచేయడం ఎంతో బాగుంది. నీకు ఓకే అయితే, మనం కలిసి మళ్లీ ఒక సినిమా చేద్దాం' అన్నారు. దీంతో నేను ఎంతో సంతోషించాను. రజనీ సర్ సాధారణంగా దర్శకులకు రెండో అవకాశం ఇవ్వరు. ఇప్పటివరకు చాలా తక్కువమంది ఆయన నుంచి ఈ అవకాశం పొందారు' అని రంజిత్ చెప్పారు. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా ఉంటారని రజనీయే చెప్పినట్టు వెల్లడించారు. అయితే, ఇది 'కబాలి' సినిమాకు సీక్వెలా? కాదా? అన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం తాను సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు చెప్పారు. -
మామ హీరో... అల్లుడు నిర్మాత
మామ ఏమో సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్.. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అల్లుడు కూడా మామకు తగ్గవాడే. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ చిత్రం చేయనున్నారు. కలిసి అంటే ఇద్దరూ ఆన్ స్క్రీన్‌పై కాదు. మామ ఏమో ఆన్ స్క్రీన్. అల్లుడేమో ఆఫ్ స్క్రీన్. యస్.. మామగారు రజనీకాంత్ నటించే చిత్రాన్ని అల్లుడుగారు ధనుష్ నిర్మించనున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబాలి’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు రజనీ. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘2.0’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారీ సూపర్‌స్టార్. ఆ తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అనే ప్రశ్నలకు ఫుల్స్టాప్ పెట్టారు ధనుష్. ‘కబాలి’ చిత్రాన్ని రూపొందించిన పా.రంజిత్ దర్శకత్వంలోనే మావయ్య హీరోగా, తాను నిర్మాతగా కొత్త చిత్రం ఉంటుందని ధనుష్ పేర్కొన్నారు. సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై దీన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ‘2.0’ పూర్తయ్యాక ఈ కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. -
ధనుష్ ఖాతాలో కబాలి-2
-
ధనుష్ ఖాతాలో కబాలి-2
ఒక విజయం మనిషి దశనే మార్చేస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కబాలి చిత్రం భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసిందన్నది మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లను వసూలు చేసిన ఏకైక చిత్రం కబాలి. ఈ రికార్డును ఇప్పట్లో మరో భారతీయ చిత్రం టచ్ చేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇంత భారీ వసూళ్లకు కారణం ఎవరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎస్ ఆయనే సూపర్‌స్టార్ రజనీకాంత్. యువ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడి చేత కబాలిడా అనిపించింది. టాక్‌కు అతీతంగా కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం కబాలి. ఇంత సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడి తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. రంజిత్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇంతకు ముందు సూర్య వెల్లడించారు. అయితే ఆయన ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అంటే రంజిత్ చిత్రం డ్రాప్ అయినట్లే. కాగా కబాలి దర్శకుడితో ఇళయదళపతి విజయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అదీ వాస్తవ రూపం దాల్చలేదు. తాజాగా రంజిత్ కబాలి సీక్వెల్‌కు కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని తన అల్లుడు ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తారని, స్వయంగా సూపర్‌స్టారే దర్శకుడు రంజిత్‌కు చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కబాలి-1లో రజనీకాంత్ నటించే అవకాశం ఉందన్నది చెప్పకనే చెప్పినట్లయ్యింది కదూ. కాగా మన సూపర్ స్టార్ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారన్న మాట. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథ మార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అప్పటికి రజనీకాంత్ తాజా చిత్రం 2.ఓ పూర్తి అవుతుందన్నది గమనార్హం. -
కబాలి డైరెక్టర్‌తో సూర్య సినిమా లేనట్టేనా..?
ఇటీవల కాలంలో భారీ హైప్ క్రియేట్ చేసిన సౌత్ సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దర్శకుడు పా రంజిత్‌కు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అందుకే కబాలి రిలీజ్‌కు ముందే స్టార్ హీరోల నుంచి రంజిత్‌కు అవకాశాలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో సూర్య అయితే తన నెక్ట్స్ సినిమా రంజిత్‌తోనే అని ప్రకటించేశాడు. అయితే కబాలి రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్న సూర్య, రంజిత్ల సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా కబాలి రిలీజ్ తరువాత సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో సీన్ రివర్స్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కబాలి, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టినా.. డిస్ట్రీబ్యూటర్లు మాత్రం నష్టపోయారన్న టాక్ వినిపించింది. దీంతో సూర్య కూడా రంజిత్‌తో చేయబోయే సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడట. ప్రస్తుతానికి రంజిత్‌తో చేయాలనుకున్న సినిమాను పక్కకు పెట్టే ఆలోచనలో ఉన్నాడు సూర్య. -
కబాలి కలెక్షన్లు 600 కోట్లా..?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలికి సంబందించి మరో ఆసక్తికరమైన వార్త మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి డివైడ్ టాక్‌తో మొదలైనా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేసింది. ప్రీవ్యూ షోస్ తోనే రికార్డ్‌లకు తెర తీసిన కబాలి, తొలి రోజు కలెక్షన్ల విషయంలో బాలీవుడ్‌కు కూడా సాధ్యం కాని భారీ రికార్డ్ సెట్ చేసింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లపై వినిపిస్తున్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేరట్లలో కొనసాగుతున్న కబాలి, 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కలెక్షన్లపై అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటనా లేకపోయినా ఫ్యాన్స్ కబాలి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. -
300 కోట్లు దాటిన 'కబాలి' కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ కలెక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ రాకపోయినా కేవలం రజనీ ఫాలోయింగ్‌తో కబాలి సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. రజనీకాంత్, పేదల కోసం పోరాడే మాఫియాడాన్‌గా నటించిన ఈ సినిమా.. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారం కాస్త తడబడినట్టుగా కనిపించినా ప్రస్తుతం కలెక్షన్లు బాగానే ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్. గురువారం సాయంత్రం చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్లో కలెక్షన్లపై నిర్మాత థాను క్లారిటీ ఇచ్చారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రకటించారు. రజనీ మానీయా కారణంగా కేవలం ఆరు రోజుల్లో ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయన్నారు. ఇప్పటికే తొలి రోజు రికార్డ్ల విషయంలో టాప్‌గా నిలిచిన కబాలి, రోబో కలెక్షన్ల రికార్డ్లను చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
సూర్య సినిమా టైటిల్ '5.35'..?
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది నటుడు సూర్య. ఇటీవల వరుస ప్రయోగాలతో కాస్త స్లో అయిన సూర్య, 24 సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ మాసాలా ఎంటర్టైనర్ సింగం సీరీస్‌లో ఎస్ 3 సినిమా చేస్తున్న ఈ గజిని స్టార్ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సూర్య. అయితే కబాలి విషయంలో డివైడ్ టాక్ రావటంతో సూర్య సినిమా పట్టాలెక్కుతుందా..? లేదా.? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోసారి ప్రయోగానికే రెడీ అయిన సూర్య ఈ సినిమాకు 5.35 అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫైనల్ చేశాడట. ఇటీవల 24తో సక్సెస్ కొట్టిన ఈ కోలీవుడ్ స్టార్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, సెప్టెంబర్‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న వార్త కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. -
కబాలిలో రంజిత్ స్టయిల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా.. అందులోనూ ఇంట్రడక్షన్ సీన్ అంటే స్పెషల్ ఎఫెక్ట్లు, సూపర్ హీరో స్టైల్ మేకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ కబాలి సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన కబాలి సినిమా తొలి షాట్లో రజనీ ఓ పుస్తకం చదువుతూ కనిపిస్తారు. కెమెరా జైలు ఊచల నుంచి మెల్లగా కదులుతూ వెళ్లి చివరగా రజనీకాంత్ నటించిన కబాలి క్యారెక్టర్‌పై ఫోకస్ అవుతుంది. ఆ సమయంలో రజనీ చేతిలో ఓ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పేరు ‘మై ఫాదర్ బాలయ్య’. తెలంగాణకు చెందిన దళిత రచయిత వైబీ సత్యనారాయణ రచించిందే ఈ పుస్తకం. స్వాతంత్య్రానికి ముం దు, ఆ తర్వాత దళితుల జీవన పోరాటం.. చదువు కోసం వారుపడిన పాట్లే ఇతివృత్తంగా ఈ పుస్తక రచన సాగింది. ఈ సీన్ దర్శకుడు పా రంజిత్ అభిమానులను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు. వారంతా ఇదీ రంజిత్ మార్కు షాట్ అని ముక్త కంఠంతో చెపుతున్నారు. కబాలి డెరైక్టర్ రంజిత్ 2014లో రూపొందించిన సినిమా మద్రాస్. తమిళ సినిమాల్లో దళితుల ప్రాతినిథ్యానికి ‘మద్రాస్’ సినిమాను ఓ సాధనంగా వాడుకున్నారని పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు కబాలి విషయంలోనూ అదే పంథా అనుసరించారు రంజిత్. కబాలి చిత్రానికి ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. డెరైక్టర్ రంజిత్‌తో మొదలుపెడితే సినిమాటోగ్రాఫర్ జి.మురళి, ఆర్ట్, కాస్ట్యూమ్ డెరైక్టర్ థా రామలింగమ్, పాటల రచయితలు ఉమాదేవి, అరుణ్రాజా కామరాజ్, ఎం.బాలమురుగన్ ఇలా అందరూ దళితులే. వీరిలో కొందరు తమను కులం పేరుతో గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సినిమా అనేది ఓ కళ అని, ఇక్కడ కళలో నైపుణ్యం మాత్రమే గుర్తింపును ఇస్తుందని, దీనికి ఇతర గుర్తింపులేమీ అవసరం లేదని చెపుతున్నారు. మరికొందరు గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే ఇప్పుడు తమను ఈ స్థానానికి ఎదిగేలా చేశాయని చెపుతున్నారు. మద్రాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో రంజిత్ మాట్లాడుతూ.. తనకు కులం గురించి మాట్లాడటంపై నమ్మకం లేదని చెప్పారు. ‘మద్రాస్’లో కుల వ్యవస్థ గురించి నిర్భయంగా చూపించారు. తమిళ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేయడం అదే తొలిసారి. రంజిత్ సినిమాల్లో ప్రధాన పాత్రలు దళిత సాహిత్యం చదువుతూనో.. లేదా అంబేడ్కర్ చెప్పిన మాటలను అండర్లైన్ చేసి చూపిస్తూనో కనిపిస్తుంటాయి. మలేసియాలో అణచివేతకు గురవుతున్న తమిళుల కోసం పోరాటం చేసే ఓ వ్యక్తి ఇతివృత్తంతోనే కబాలిని రూపొందించాడు రంజిత్. -
అక్కడ ‘కబాలి’ క్లైమాక్స్ మారింది!
విడుదలకు ముందు ‘కబాలి’ సినిమా క్లైమాక్స్‌పై అనేక కథనాలు వచ్చాయి. ‘కబాలి’ సినిమాలో నెగిటివ్ ఎండింగ్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో క్లైమాక్స్‌లో ‘కబాలి’ చనిపోతాడా? అని రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ నిజానికి దర్శకుడు పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో సాహసం చేయలేకపోయాడు. చివరి సీన్లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించినా.. ఈ తూటాకి ‘కబాలి’ చనిపోయాడా? అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు చూపించలేదు. కథ, కథనం విషయంలో తనదైన స్టైల్‌ను ఫాలో అయిన పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో మాత్రం సాహసించలేకపోయాడు. రజనీ పాత్ర తెరపై చనిపోయినట్టు చూపించడం అంత ఈజీ కాదు. దీనిని అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే తుపాకీ శబ్దంతో, కొంత సస్పెన్స్‌తో ‘కబాలి’ క్లైమాక్స్‌ను ముగించాడు. దీంతో సినిమా నెటిగివ్ ఎండింగా.. పాజిటివ్ ఎండింగా అనేది ప్రేక్షకుడికి అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా క్లైమాక్స్ గురించి మరో ట్విస్టు వెలుగుచూసింది. సినిమా అంతా మలేషియా నేపథ్యంగా, అక్కడ జరిగే గ్యాంగ్‌వార్ ప్రధాన కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలేషియాలో ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చారు. క్లైమాక్స్‌లో ‘కబాలి’ పోలీసులకు లొంగిపోతాడని పేర్కొన్నారు. మలేషియా నేపథ్యంగా సినిమా తెరకెక్కడం, ఎక్కువశాతం షూటింగ్ అక్కడే జరిగిన నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత రాకుండా.. చట్టాన్ని గౌరవించి ‘కబాలి’ పోలీసులకు లొంగిపోయినట్టు పేర్కొన్నారని భావిస్తున్నారు. -
ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..?
కబాలి సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అంటూ ప్రకటించేశారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రంజిత్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. హిట్ ఇచ్చిన నటీనటులు, దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. అదే ఫ్లాప్ ఇస్తే మాత్రం పట్టించుకోరు. మరి ఇప్పుడు పా రంజిత్ పరిస్థితి ఏంటి అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తన నెక్ట్స్ పా రంజిత్‌తో అంటూ ప్రకటించిన సూర్య, మాట నిలబెట్టుకుంటాడా..? కబాలి తరువాత కూడా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా..? చూడాలి. -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న కబాలి
భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్సాఫీస్ రికార్డ్ల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సంచలనాలను నమోదు చేసిన తలైవా, రిలీజ్ తరువాత కూడా తన హవా కోనసాగిస్తున్నాడు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాకు థియేటర్లు లభించటంతో కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధ్యమవుతున్నాయి. తమిళనాట 650కి పైగా స్క్రీన్‌లో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో రిలీజ్ అయిన కబాలి భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కబాలి హవా దక్షిణాదిని ఊపేయనుంది. రజనీకి భారీ క్రేజ్ ఉన్న తెలుగు, తమిళ్లోనే కాదు, కేరళలో కూడా కబాలి భారీగా రిలీజ్ అయ్యింది. దాదాపు 306 థియేటర్లలో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డ్ సృష్టించింది. కబాలి సంచలనాలు దక్షిణాదికే పరిమితమైపోలేదు. ఉత్తరాదిలో కూడా తలైవా హవా చూపిస్తున్నాడు. కేవలం ఈ సినిమా చూడటానికే విదేశీయులు ముంబై చేరుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో కలిపి 135 థియేటర్లలో కబాలి సందడి కనిపిస్తుండగా, పంజాబ్‌లో 70 థియేటర్లలో కబాలి రిలీజ్ అయ్యింది. ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కబాలి మేనియా బాగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన తలైవా.. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావటంతో బాహుబలి, భజరంగీబాయిజాన్ లాంటి భారీ రికార్డ్‌లకు డోకా లేదన్న వాదన వినిపిస్తోంది. -
'కబాలి' మూవీ రివ్యూ
టైటిల్ : కబాలి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, విన్స్స్టన్ చావో సంగీతం : సంతోష్ నారాయణ్ దర్శకత్వం : పా రంజిత్ నిర్మాత : కలైపులి ఎస్ థాను భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీ మానియా రేంజ్ ఏంటో చూపిస్తూ ఈ సినిమా ప్రపంచదేశాల సినీ అభిమానులను సైతం ఆకర్షించింది. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన సినిమా.. కేవలం రెండు యావరేజ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాకు ఇంత హైప్ ఎలా క్రియేట్ అయ్యిందంటూ ట్రేడ్ పండితులు కూడా అవాక్కవుతున్నారు. అసలు అంతలా కబాలిలో ఏముంది..? నిజంగానే రజనీ కబాలితో మ్యాజిక్ చేశాడా..? అభిమానుల అంచనాలను కబాలి అందుకుందా..? కథ : మలేషియా, కౌలాలంపూర్‌లో జరిగిన గ్యాంగ్ వార్‌లో అరెస్ట్ అయిన మాఫియా డాన్ కబాలి(రజనీ కాంత్). 25 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కబాలి విడుదలవుతున్నాడంటూ, ప్రభుత్వం, పోలీస్ శాఖలు అలర్ట్ అవుతాయి. తిరిగి గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదల చేస్తారు. కానీ మలేషియాలో మగ్గిపోతున్న భారతీయుల కోసం పోరాటం చేసే కబాలి బయటకు రాగనే అక్కడి పరిస్థితులను చూసి మరోసారి పోరాటం మొదలు పెడతాడు. డ్రగ్స్ అమ్ముతూ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే 43 గ్యాంగ్‌తో యుద్ధం ప్రకటిస్తాడు. కబాలి రాకకోసం ఎదురుచూస్తున్న 43 గ్యాంగ్ లీడర్ టోని లీ (మలేషియా నటుడు విన్స్స్టన్ చావో) తన అనుచరుడు వీరశంకర్ (కిశోర్) సాయంతో కబాలిని చంపేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ ప్రయత్నాల నుంచి కబాలి ఎలా బయటపడ్డాడు..? అసలు కబాలి డాన్‌గా ఎందుకు మారాడు..? అతని కుటుంబం ఏమైంది..? చివరకు టోని లీ కథను కబాలి ఎలా ముగించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కబాలిగా రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ వయసులో కూడా తనలోని స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు తలైవా. భారీ యాక్షన్ సీన్స్, రేసీ స్క్రీన్ ప్లే లేకపోయినా కేవలం రజనీ మానరిజమ్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. ఫైట్స్, హీరోయిజంతో పాటు అద్భుతమైన ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు. తెర మీద కనిపించేది కొద్ది సేపే అయినా రాధిక ఆప్టే మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా కబాలిని తిరిగి కలుసుకునే సన్నివేశంలో ఆమె నటన ప్రేక్షకులతో కంటతడిపెట్టిస్తుంది. లేడీ డాన్‌గా కనిపించిన ధన్సిక నటనతో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. స్టైలిష్‌గా కనిపిస్తూనే.. మంచి ఎమోషన్స్‌ను పండించింది. విలన్‌గా నటించిన విన్స్స్టన్ చావో డాన్ లుక్‌లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. రాక్షసుడైన గ్యాంగ్ స్టర్‌గా చావో నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీ స్టార్ డమ్ ను ఢీకొనే పర్ఫెక్ట్ విలన్‌గా కనిపించాడు. ఇతర పాత్రలలో కిశోర్, జాన్ విజయ్, నాజర్, దినేష్ రవి లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కబాలి లాంటి కథతో రజనీని ఒప్పించిన దర్శకుడు అప్పుడే సగం విజయం సాధించేశాడు. ఈ కథకు రజనీ అంతటి భారీ స్టార్ డమ్ ఉన్న నటుడు తప్ప మరే హీరో చేసినా.. వర్క్ అవుట్ కాదు. అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా సినిమాను ప్రమోట్ చేసిన దర్శకుడు.. సినిమాలో ఆ వేగం చూపించలేకపోయాడు. స్లో నారేషన్ ఇబ్బంది పెట్టినా.. రజనీని కొత్తగా చూపిస్తూ అన్నింటిని కవర్ చేశాడు. ఇక సినిమాకు మరో ఎసెట్ సంతోష్ నారాయణ్ సంగీతం. కబాలి థీం మ్యూజిక్‌తో కట్టిపడేసిన సంతోష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫి లాంటివి ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ మెయిన్ స్టోరి లైన్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ ఓవరాల్‌గా కబాలి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా.. రజనీ అభిమానులకు మాత్రం బాషాను గుర్తు చేస్తోంది. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్. -
అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!
అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు ఊహించని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ప్రస్తుతం ‘కబాలి’ సినిమా సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ‘కబాలి’ని చూసిన చాలామంది అమెరికన్ ఇండియన్లు అభిమానులకు ఈ సినిమా పండుగేనని అంటున్నారు. ‘కబాలి తలైవా అభిమానులకు పైసా వసూల్ సినిమా. అభిమానులు మెస్మరైజ్ అయ్యే సీన్లు ఎన్నో ఉన్నాయి. పలుసార్లు థియేటర్ హర్షధ్వానాలతో దద్దరిల్లింది’ అని ఇండస్ట్రి ఇన్సైడర్ రమేశ్ అమెరికాలో వస్తున్న రెస్పాన్స్ మీద స్పందిస్తూ ట్వీట్ చేశారు. #Kabali U.S distributor @CineGalaxyUSA with @superstarrajini after special show pic.twitter.com/gmdjRagp3b — Studio Flicks (@StudioFlicks) July 21, 2016 -
’కబాలి’ రివ్యూ అప్పుడే వచ్చేసింది!
‘కబాలి’ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్నంటేశాయి. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా హాట్ హాట్ చర్చ కొనసాగుతోంది. ‘కబాలి’ ఫీవర్ అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే విడుదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో ‘కబాలి’ సినిమాపై తన రివ్యూను ఇచ్చాడు. బాలాజీ శ్రీనివాసన్ పేరిట ఆయన పెట్టిన రివ్యూ కొన్ని గంటల్లోనే వైరల్ గా మారిపోయింది. ఏకంగా 30వేల మంది ఆయన పేరును ఫేస్బుక్లో సెర్చ్ చేశారు. అయితే, కొన్ని గంటలకే ఆయన తన రివ్యూను తొలగించారు. అయినప్పటికీ ఆయన రివ్యూ పలుచోట్ల షేర్ అయింది. ఇంతకూ ఆయన ఏం రాశారంటే.. బే ఏరియా సినీ పరిశ్రమ స్నేహితులకు కృతజ్ఞతలు.. ‘కబాలి’ సినిమా ప్రివ్యూను నేను చూశాను. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లాను. మిశ్రమ భావాలతో బయటకు వచ్చాను. రజనీ అభిమానులకు ఇది కచ్చితంగా పైసా వసూల్ సినిమానే. వయస్సు మీదపడిన సూపర్ స్టార్ ప్రదర్శించే దూకుడును చూసి ఇతరులూ ఛలోక్తులతో ఆనందించవచ్చు. కథ విషయానికొస్తే.. మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్ నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు. రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది. మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు. (ఇది ఫేస్బుక్లో బాలాజీ శ్రీనివాసన్ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే) -
‘కబాలి’ని ఎందుకు చూడాలి??
‘కబాలి’ సినిమా సంబురాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. చెన్నైలోని చాలా థియేటర్ల వద్ద రజనీకాంత్ అభిమానుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఇటు దేశవ్యాప్తంగా ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నది? అసలు ‘కబాలి’ ఏం చేయబోతున్నాడు? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు (శుక్రవారం) ‘కబాలి’ విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమాను ఎందుకు చూడాలి? అంటే.. ఇదిగో ఈ ఐదు కారణాలు చెప్పవచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు.. 1. రజనీ ఒక ప్రభంజనం రజనీకాంత్ అంటే అభిమానులకు దేవుడు.. రజనీ సినిమాల్లో చేసే కొన్ని అద్భుతాలను పక్కనబెడితే.. సినీ ప్రేమికులూ ఆయన చిత్రాలను ఇష్టపడతారు. రజనీలో మంచి నటుడున్నాడని విమర్శకులు ఒప్పుకుంటారు. కానీ మాస్ ఇమేజ్, మ్యానరిజం చట్రంలో పడిపోయాడని పేర్కొంటారు. మొత్తానికి 1975లో మొదలైన ‘తలైవా’ ఇమేజ్ ఇప్పుడు శిఖరస్థాయిని అందుకుంది. రజనీ గత రెండు సినిమాలు- కొచ్చాడైయన్, లింగా- బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ నేపథ్యంలో తన సర్వశక్తులొడ్డి.. తనను తాను బాక్సాఫీసు బాషాగా పునర్ ఆవిష్కరించికోవడానికి రజనీ చేసిన ప్రయత్నమే ‘కబాలి’ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రజనీ తొలిసారి తన ఒరిజినల్ లుక్‌తో కనిపించనున్నారు. తొలిసారి 50, 60 ఏళ్ల వ్యక్తిగా ఎలాంటి మేకప్ ట్రిక్కులు పెద్దగా లేకుండా, వెంట్రుకలకు రంగు వేసుకోకుండా రజనీ లుక్ ఇప్పటికే అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తోంది. 2. కపాలీశ్వర్ కథ! కథ గురించి పెద్దగా తెలియదు. కపాలీశ్వరన్ అనే చెన్నై గ్యాంగ్‌స్టర్ గా రజనీ కనిపించనున్నారు. మలేషియాలో మొదలైన ఆయన జీవితం.. అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్న తమిళులకూ సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్థూలంగా ఈ సినిమా కథ అని వినిపిస్తోంది. చరిత్రలోకి తొంగిచూస్తే 11వ శతాబ్దం పల్లవులు, చోళుల కాలం నాటి నుంచి తమిళులు మలేషియాలో ఆవాసం ఏర్పరుచుకొని జీవిస్తున్నారు. బ్రిటీష్ హయాంలోనూ ఎంతోమంది అక్కడికి వలసవెళ్లారు. ఈ నేపథ్యంలో తమిళుల హక్కులు అనే ఎమోషనల్ అంశం చుట్టూ ‘కబాలి’ కథ తిరుగొచ్చని అంటున్నారు. 3. యువ దర్శకుడి మ్యాజిక్ దర్శకుడిగా పా రంజిత్ ఇప్పటివరకు తెరకెక్కించినవి రెండే చిత్రాలు. కానీ ఈ రెండు చిత్రాలతో తనదైన ముద్రను అతను వేసుకున్నాడు. మంచి కథలను ఎంచుకొని.. దానికి లోకల్ ట్విస్టు యాడ్ చేసి.. నిజంగానే జరిగిందా? అన్నంత అద్భుతంగా పా రంజిత్ తన చిత్రాల్లో మ్యాజిక్ చేశాడు. అతడు తెరకెక్కించిన మద్రాస్, అడ్డకత్తి చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఈ నేపథ్యంలో రజనీలాంటి సూపర్ స్టార్‌ను రంజిత్ ఎలా చూపించాడు.. కథను ఎలా హ్యాండిల్ చేశాడు.. తెరపై చూపాడు అన్నది ఆసక్తికరంగా మారింది. 4. సినిమా నిండా కొత్త రక్తం! ‘కబాలి’ సినిమాకు దర్శకుడే కాదు.. చాలావరకు టెక్నిషియన్స్, తారాగణం కూడా కొత్తవారే. రజనీ సినిమాకు సాధారణంగా ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తారు. కానీ ఈ సినిమాకు 33 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్‌కు అవకాశమిచ్చారు. ‘నెరుప్పుడా’ పాటతో అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ భామ రాధికా ఆప్టేకు మంచి నటిగా పేరుంది. ఆమెను రజనీ పక్కన హీరోయిన్గా తీసుకోవడం కూడా కలిసి వచ్చింది. ఇద్దరి మధ్య వయస్సుపరంగా వ్యత్యాసమున్నా.. రజనీ మ్యాజిక్ అది కవర్ చేస్తుందని అంటున్నారు. 5. కొత్త తరహాలో టేకింగ్.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నదో కొంతవరకు హింట్ ఇచ్చాయి. అభిమానులు పడిచచ్చే ‘రజనిజం’ మ్యానరిజానికి ఈ సినిమాలో కథానుగుణంగా కనిపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా పాత సినిమాల్లో మాదిరిగా రజనీ తన క్రాప్‌ను స్టైలిష్‌గా సరిచేసుకోవడం.. ‘కబాలి, రా’ అంటూ తనదైన స్టైల్లో పేర్కొనడం ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెబుతున్నది. రజనీ మ్యానరిజం, స్టైల్స్ లోపించకుండా దర్శకుడు కథను ఎలా ముందుకు నడిపించాడో తెలుసుకోవాలంటే.. రేపటివరకు ఆగాల్సిందే. -
టికెట్ల కోసం రికమండేషన్ లెటర్
కబాలి ఫీవర్ చెన్నై రాజకీయాలను సైతం తాకింది. ఇప్పటికే కబాలి టికెట్ల కోసం భారీ పోటి నెలకొన్న దృష్ట్యా సీన్లోకి పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ అయ్యారు. తొలి రోజు సినిమా టికెట్ల కోసం రాష్ట్ర మంత్రుల ఆఫీసుల నుంచి రికమండేషన్ లెటర్ వస్తుండటంతో థియేటర్ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇన్ఫర్మేషన్, పబ్లిసిటీ మంత్రి.., సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పేరిట.. అభిరామి థియేటర్ మేనేజర్‌కు లెటర్ వచ్చింది. కబాలి సినిమా పది టికెట్లను తిరు, రిజ్వాన్‌లకు ఇవ్వాలంటూ ఈ లెటర్లో సూచించారు. అడ్వాన్స్ బుకింగ్‌లతో పాటు ఫ్యాన్స్ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న థియేటర్ యాజమాన్యాలకు రాజకీయనాయకుల రికమండేషన్ లు మరింత సమస్యగా మారాయి. -
నిజమే... రజనీ ఇంట్రో సీన్ లీక్ అయ్యింది..!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కబాలి లీక్ అయ్యింది. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న చిత్రయూనిట్ ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా రజనీ ఇంట్రడక్షన్‌కు సంబంధించిన సన్నివేశాన్ని కర్ణాటకకు చెందిన ప్రజా టీవీ ప్రసారం చేసింది. దీంతో లీక్ అయిన విషయం నిజమే అన్న నమ్మకం కలిగింది. రెండు నిమిషాలకు పైగా ఉన్న పూర్తి సన్నివేశాన్ని ప్రజాటీవీ ప్రసారం చేసింది. ఆ టీవీలో ప్రసారం చేసిన ఈ కథనం యూట్యూబ్‌లో కూడా పెట్టేయటంతో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ యూట్యూబ్ నుంచి వీడియోను తొలగించినా.. ఇప్పటికే చాలా మంది వీడియోను డౌన్ లోడ్ చేసుకున్నారు. -
నెట్లో రజనీ ఇంట్రడక్షన్ సీన్..?
కొద్ది రోజులుగా కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ సినిమాకు సంబందించిన లింక్స్ కనిపించకపోయినా., సినిమా లీక్ అయ్యిందంటూ పెద్ద హడావిడే జరిగింది. చిత్ర నిర్మాతలు సైతం, పోలీస్ శాఖను సంప్రదించిన పైరసీని అరికట్టాలని కోరారు. 250కి పైగా పైరసీ సైట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చివరకు సినిమా లీక్ అవ్వలేదంటూ ట్విస్ట్ ఇచ్చి అంతా తూచ్ అనేశారు. తాజాగా మరోసారి కబాలిలో రజనీ ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాలకు ప్రింట్స్ చేరుకోవటంతో అక్కడే సినిమా లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. లీక్ అయిన సీన్లో అరబిక్ సబ్ టైటిల్స్ ఉండటంతో ఈ సీన్ గల్ఫ్ దేశాల్లో లీక్ అయ్యిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. రజనీ జైలు నుంచి బయటకు వస్తున్న రెండు నిమిషాల సన్నివేశం లీక్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. -
కబాలి క్లైమాక్స్‌పై షాకింగ్ న్యూస్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కబాలి గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాలలో కూడా కబాలినే ట్రెండ్ అవుతోంది. అందుకే కబాలి సంబందించిన ఏ చిన్న వార్త అయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కబాలి సినిమా క్లైమాక్స్‌కు సంబందించిన ఓ వార్త రజనీ అభిమానులకు షాక్ ఇస్తోంది. ముందుగా కబాలి కథను రజనీకాంత్‌కు వినిపించిన దర్శకుడు పా రంజిత్ ఆ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ను సూచించాడట. రజనీకి ఆ పాయింట్ నచ్చినా.., అభిమానులు అంగీకరిస్తోరో.. లేదో అన్న అనుమానం వ్యక్తం చేశాడట. అయితే దర్శకుడు మాత్రం సినిమాకు ఈ క్లైమాక్స్ అయితేనే కరెక్ట్ అని అదే కొనసాగించాడన్న టాక్ వినిపిస్తోంది. నెగెటివ్ క్లైమాక్స్అంటే ఏంటి.. సినిమా చివర్లో రజనీ పాత్ర విలన్ చేతిలో ఓడిపోతుందా..? లేక కబాలి చనిపోతాడా..? నిజంగా రజనీ ఓటమిని అభిమానులు అంగీకరిస్తారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నిజంగానే పా రంజిత్ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇచ్చాడా..? అసలు విషయం తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి ఫీవర్ నడుస్తోంది. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మనదేశంలోని అభిమానులే కాదు.. ఇతర దేశాల్లోని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కబాలి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ల మీద రికార్డ్‌లు తిరగరాస్తోంది. అంచనాలకు మించి కబాలి కోసం డిస్ట్రిబ్యూషన్ రేట్లు చుక్కలు తాకాయి. దాదాపు 223 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడుకు 68 కోట్లు, తెలుగు రాష్ట్రాలకు 32 కోట్లు, కేరళ హక్కులు 7.5 కోట్లు, కర్ణాటక హక్కులు 10 కోట్ల వరకు కబాలికి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో కూడా కబాలి సత్తా చాటింది. అన్ని దేశాలకు కలిపి 25 కోట్లకు కబాలి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో 40 కోట్లు కబాలి ఖాతాలో చేరాయి. -
'కబాలి' పేరుకాదు.. ఓ బ్రాండ్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా కనిపిస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు జరగని స్థాయి ప్రచారం ఈ సినిమా కోసం జరుగుతోంది. పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కబాలి సినిమా ప్రమోషన్లో భాగం పంచుకుంటున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్లను ముంద్రించటంతో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో తెలిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఏసియాతో పాటు ఎయిర్టెల్, ముత్తూట్ లాంటి సంస్థలు ప్రచారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వీటికి తోడు కబాలి పోస్టర్లతో తయారు చేసిన కీచైన్లు, టీషర్లు తమిళ నాట హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కబాలి, ఇప్పటికే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలి వారంలోనే సంచలనాలు నమోదు చేస్తుందని భావిస్తున్న ఈ సినిమా, టోటల్ రన్లో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని నమ్ముతున్నారు. తొలిసారిగా మలేషియా అభిమానుల కోసం మలయ్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రిలీజ్ కాని చాలా దేశాల్లో కబాలి బోణి చేయడానికి రెడీ అవుతుంది. ఓవర్ సీస్ మార్కెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న చిత్రయూనిట్, ఒక్క అమెరికాలోనే 400 వందల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా 5000ల స్క్రీన్స్ లో కబాలిని ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కబాలి.. అభిమానుల ఆశలు నిజం చేస్తుందో లేదో చూడాలి. -
కబాలి ప్రమోషన్‌కు రజనీ రాడా..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా నడుస్తోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్లో జోరు చూపిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఉత్పత్తులతో కలిసి సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు, టెలికాం ఆఫర్లు, కబాలి టీషర్ట్లు, కీచైన్లు ఇలా సినీ ప్రచార తీరును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇంత హడావిడి జరుగుతుంటే ఆ చిత్ర హీరో రజనీకాంత్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. కబాలి షూటింగ్ తరువాత విదేశాలకు వెళ్లిన రజనీ దాదాపు 40 రోజులుగా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. రజనీ ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు వినిపిస్తున్నా, ఆయన సన్నిహితులు ఆ వార్తలను ఖండిస్తున్నారు. మరి అంతా బాగానే ఉంటే రజనీ ప్రచార కార్యక్రమాలకు ఎందుకు రావటం లేదు. కబాలి సినిమాపై ఇప్పటికే 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తే తప్ప సినిమా హిట్ రేంజ్‌కు చేరదు. మరి రజనీ రాకుండా అంతటి వసూళ్లు సాధ్యమవుతాయా..? ఈ నెల 20న రజనీ చెన్నై వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత సినిమా రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రజనీ చేసే ప్రచారం సినిమాకు సరిపోతుందా..?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ తలైవా అభిమానులను కలవరపెడుతున్నాయి. -
కబాలి రిలీజ్ డేట్ వచ్చేసింది
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి విడుదలపై సందిగ్ధత తొలగిపోయింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు నమోదు చేసిన కబాలి రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్ లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా సూచించకపోవటం విశేషం. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాలం, హిందీలలోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్న కబాలి మలయ్ లాంటి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. కొచ్చాడయాన్, లింగా లాంటి భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. #Kabali will be releasing worldwide on 22 July 2016 !! We couldn't be more excited @superstarrajini @beemji :) pic.twitter.com/HOll88EzuU — Kalaippuli S Thanu (@theVcreations) 11 July 2016 -
రూట్ మార్చిన సూర్య
కొంత కాలంగా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య రూట్ మారుస్తున్నాడు. ఎక్స్పరిమెంటల్ మూవీస్‌తో మంచి పేరు వస్తున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం రాకపోవటంతో, మాస్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇటీవల విడుదలైన 24తో కూడా మంచి సక్సెస్ సాధించిన సూర్య.. కమర్షియల్‌గా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వరుసగా మాస్ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం సింగం సీరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్3లో నటిస్తున్న సూర్య ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఆ తరువాత కూడా మాస్ జానర్లోనే కొనసాగాలని భావిస్తున్నాడు. అందుకే ఇటీవల విశాల్ హీరోగా రాయుడు లాంటి ఊర మాస్ సినిమాను రూపొందించిన ముత్తయ్య దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య సెలక్షన్ చూస్తే ఇప్పట్లో ప్రయోగం చేసే ఆలోచన లేనట్టుగా కనిపిస్తోంది. -
ప్రయోగాలను పక్కన పెట్టేసిన సూర్య
కొంత కాలంగా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య రూట్ మారుస్తున్నాడు. ఎక్స్పరిమెంటల్ మూవీస్‌తో మంచి పేరు వస్తున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం రాకపోవటంతో, మాస్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇటీవల విడుదలైన 24తో కూడా మంచి సక్సెస్ సాధించిన సూర్య.. కమర్షియల్‌గా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వరుసగా మాస్ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం సింగం సీరీస్‌లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్3లో నటిస్తున్న సూర్య ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఆ తరువాత కూడా మాస్ జానర్లోనే కొనసాగాలని భావిస్తున్నాడు. అందుకే ఇటీవల విశాల్ హీరోగా రాయుడు లాంటి ఊర మాస్ సినిమాను రూపొందించిన ముత్తయ్య దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య సెలక్షన్ చూస్తే ఇప్పట్లో ప్రయోగం చేసే ఆలోచన లేనట్టుగా కనిపిస్తోంది. -
'ఆ ఫ్లైట్ డిజైనింగ్‌కు నెల రోజులు పట్టింది'
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలి. ఈ సినిమాకు అఫీషియల్ ఎయిర్‌లైన్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏసియా ఇండియా, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏసియాలోనే తొలిసారిగా ఓ పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సినిమా పోస్టర్లతో డిజైన్ చేయించింది. ఈ శుక్రవారం నుంచి ఈ కబాలి ఫ్లైట్ గగనవీధుల్లో షికారు ప్రారంభిస్తున్న సందర్భంగా.. ఎయిర్ ఏసియా ప్రతినిధి, ఫ్లైట్ డిజైనింగ్ వెనుక కష్టాలను వివరించాడు. ఫ్లైట్‌పై కబాలి పోస్టర్‌ను ఏర్పాటుచేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ ఫ్లైట్ బెంగళూరు, న్యూ డిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు సేవలందించనుంది. అంతేకాదు కబాలి సినిమా రిలీజ్ తరువాత కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. మలేషియాలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ వయసు మళ్లిన డాన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి సినిమాను ఈ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే..
ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కబాలి. రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డ్‌లు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్రయూనిట్ భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే కబాలి చిత్రానికి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రజనీ లుక్. వయసైన డాన్ పాత్రలో రజనీ లుక్కు మంచి స్పందన వచ్చింది. భాషా సినిమా తరువాత రజనీ డాన్‌గా నటిస్తుండం కూడా సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వటానికి కారణం అయ్యింది. అయితే కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. కబాలి సినిమాలో రజనీ కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే డాన్ కనిపిస్తాడట. మలేషియాలో ఉంటున్న శరణార్థుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ ఎక్కువగా భాగం యంగ్‌గానే కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌లో వచ్చే కీలక సన్నివేశాల్లో మాత్రం రజనీ డాన్ లుక్‌లో కనిపిస్తాడట. మరి రజనీని డాన్ గా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. -
కాసులు తెచ్చే సినిమా కావాలి
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సౌత్ హీరో సూర్య. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసే సూర్య మాస్ క్యారెక్టర్స్ తోనూ అదరగొడుతున్నాడు. అయితే కొద్ది రోజులుగా వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఈ మ్యాన్లీ స్టార్, భారీ కలెక్షన్లు సాధించే సినిమాలను మాత్రం అందించలేకపోతున్నాడు. తన తోటి హీరోలు 50 కోట్లు, 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే భారీ వసూళ్లను సాధించటంలో సూర్య వెనకపడిపోతున్నాడు. ఇటీవల విడుదలైన 24 బిగ్ హిట్ అనిపించుకున్నా, భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో పోటీలో నిలబడేందుకు ఓ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య. ప్రస్తుతం తనకు వరుస హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో సింగం సినిమాకు రెండో సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఎస్ 3లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలను కమర్షియల్ హిట్స్‌గా మలిచేందుకు కష్టపడుతున్నాడు ఈ విలక్షణ నటుడు. -
నాన్నకు ప్రేమతో.. ఆ సినిమా చేయించా!
రేపు.. అంటే ఆదివారం ఫాదర్స్ డే. వేలు పట్టి నడిపించిన తండ్రి కోసం పిల్లలు ఏమైనా చేస్తారు. అదే సెలబ్రిటీల పిల్లలైతే.. మరికొంచెం ఎక్కువగా చేసి తండ్రికి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మరి ఆలిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఏం చేసింది? నాన్నకు ప్రేమతో.. ఓ సినిమా చేయిస్తోంది. ఆ సినిమా టీజర్ దగ్గర నుంచి పాటల వరకు ప్రతి ఒక్కటీ యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతున్నాయి. అవును.. రజనీకాంత్ కూతురు సౌందర్య పూనుకోవడం వల్లే కబాలి సినిమా వస్తోంది. ఈ విషయం ఇంతవరకు బయటపడలేదు. తాజాగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ సినిమా వెనక కథ చెప్పింది. వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్‌గా చేసే రోజుల నుంచి పా రంజిత్ ఎవరో సౌందర్యకు తెలుసు. నిజానికి రంజిత్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అట్టకత్తికి సౌందర్యే నిర్మాత కావాలి గానీ కుదరలేదు. ఒకరోజు తండ్రీ కూతుళ్లు మాట్లాడుకుంటుండగా.. రంజిత్ తీసిన 'మద్రాస్' సినిమా ప్రస్తావన వచ్చింది. అది చాలా బాగుందని రజనీ అన్నారు. తర్వాత రంజిత్‌ను సౌందర్య కలిసినప్పుడు, 'నాన్న కోసం ఓ సినిమా కథ చెబుతావా' అని అడిగేసరికి ఆయన షాకయ్యాడు. కొన్ని రోజులు ఆగి స్టోరీ లైన్ చెప్పాడు. 'ఆయనో మలేషియన్ డాన్' అన్నాడు.. అంతే, అదే లైను గురించి రజనీకి సౌందర్య చెప్పారు. ఆయనకు అది వెంటనే నచ్చి, ఓకే అనేశారు. కలైపులి ఎస్.థానుకు స్వయంగా ఫోన్ చేసి, ఈ సినిమాను నిర్మించాలని అడిగారు. ఎప్పుడో తీసిన భైరవి సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. ఇది ఏకంగా రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నది కావడంతో కలైపులినే నిర్మాతగా రజనీ ఎంచుకున్నారు. ఇందులో రజనీకాంత్ కబాలీశ్వరన్ అనే ముసలి డాన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య కుందనవల్లిగా రాధికా ఆప్టే నటిస్తోంది. ఒకప్పుడు తాను ఏలిన, తాను ఎంతగానో ప్రేమించే చెన్నై నగరానికి మలేషియన్ డాన్ కబాలి తిరిగి రావడం, ఇక్కడ మళ్లీ రాజ్యమేలడం లాంటివి ఈ సినిమా ప్రధానాంశాలని తెలుస్తోంది. -
రజనీ ఫ్యాన్స్‌కు నిరాశే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జులై 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన కబాలి టీజర్ ఆన్లైన్లో సంచలనాలు సృష్టిస్తుండగా.. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ నెల 12న కబాలి ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా, కబాలి ఆడియోను ఎలాంటి ఫంక్షన్ లేకుండా డైరెక్ట్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేయానలని భావిస్తున్నారట. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కబాలి చిత్రానికి ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే అభిమానుల అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు భారీ ఫ్లాప్‌ల తరువాత రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమాకు పా రంజిత్ దర్శకుడు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ధన్సికతో పాటు పలువురు మలేషియన్ నటులు కూడా విలన్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తున్న కబాలి, రిలీజ్ తరువాత మరిన్ని రికార్డ్‌లు బద్దలు కొట్టడం కాయంగా కనిపిస్తోంది. -
అదీ.. సూపర్ స్టార్ స్టామినా..!
రెండు సినిమాలు భారీ డిజాస్టర్లు అయిన తరువాత ఎంతటి స్టార్ హీరోకయినా వెనకడుగు తప్పదు. ఆ తరువాత చేయబోయే సినిమాల రికార్డ్‌లు, బిజినెస్ విషయంలో ఆ ఫ్లాప్ సినిమాల ప్రభావం బాగానే కనిపిస్తోంది. కానీ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇలాంటి వాటికి అతీతుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రజనీ హీరోగా తెరకెక్కిన కొచ్చాడయాన్, లింగా సినిమాలు భారీ డిజాస్టర్లు అయినా, కొత్త సినిమా కబాలీ సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. రజనీ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన కబాలీ టీజర్ హాలీవుడ్ సినిమాలకు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ సృష్టించిన కబాలీ ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా రికార్డ్ సృష్టించింది. అవేంజర్స్ లాంటి హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి రజనీ సాధించిన రికార్డ్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక బిజినెస్ విషయంలో కూడా రజనీ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. డిజాస్టర్ టాక్‌తో కూడా రజనీ లింగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఇప్పుడు కబాలీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా రిలీజ్‌కు ముందే కబాలీ 200 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇండియాతో పాటు రజనీకి బాగా పట్టున్న జపాన్, తొలిసారిగా మలేషియాలో కూడా భారీగా కబాలీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తమిళ బ్యూటి ధన్సిక లేడీ డాన్‌గా కనిపిస్తుండగా, మరికొంత మంది హాలీవుడ్ స్టార్లు విలన్లుగా నటించారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 11న, సినిమాను జులై 1న రిలీజ్ చేయనున్నారు. -
జూన్ 11న కబాలీ ఆడియో
సూపర్ స్టార్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. లింగా లాంటి డిజాస్టర్ తరువాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. తొలి టీజర్‌తోనే అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కబాలీ, ఆడియో కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్‌గా జూలై 1న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతకు ముందు ఆడియో రిలీజ్‌ను కూడా రజనీ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ముందుగా జూన్ 9న ఆడియో రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న రజనీ ఆ సమయానికి అందుబాటులో ఉండడన్న ఉద్దేశంతో, జూన్ 11న ఆడియో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. చెన్నైలోని వైయంసీఏ గ్రౌండ్లో అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తమిళ్, తెలుగుతో పాటు మలేషియాలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కబాలీ టీజర్ ఆన్ లైన్లో 2 కోట్లకు పైగా వ్యూస్‌తో సంఛలనం సృష్టిస్తుండగా ఆడియో రిలీజ్ అయితే మరిన్ని రికార్డ్‌లు కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
రికార్డుల మోత మోగిస్తున్నాడు
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆన్లైన్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రజనీ లేటెస్ట్ సినిమా కబాలి టీజర్.. ఊహకందని లెక్కలతో బాలీవుడ్ తారలకు కూడా చుక్కలు చూపిస్తోంది. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది కబాలి. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్‌తో ఇండియాలోనే అతి ఎక్కువ మంది వీక్షించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక లైక్స్ విషయంలో అయితే అంతర్జాతీయ సినిమాలతో పోటి పడుతోంది కబాలి. 4 లక్షలకు పైగా లైక్స్ సాధించిన కబాలి టీజర్, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమా ఏవెంజర్స్ 5.12 లక్షల లైక్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా జూన్ 9ల కబాలి తొలి థియట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. టీజర్‌తోనే సంచలనాలు నమోదు చేసిన కబాలి.., ట్రైలర్‌తో ఇంకెన్ని రికార్డ్‌లు సృష్టిస్తాడో చూడాలి. రజనీకాంత్ వయసుమల్లిన డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడిగా రాధికా ఆప్టే నటిస్తుంది. యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత కలైపులి యస్ థాను భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఆ భాషలో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కబాలీ
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇన్నాళ్లు ఎక్కువగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసిన రజనీ చాలా కాలం తరువాత ఓ యువ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాడు. మద్రాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ కబాలీ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ ఇమేజ్, స్టైల్‌కు తగ్గట్టుగా భారీగా ఈ సినిమాను తెరకెక్కించాడు రంజిత్. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలీ రజనీ కెరీర్లో సరికొత్త రికార్డ్లను సెట్ చేస్తోంది. జపాన్ లాంటి దేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీ ఈ సినిమాతో మలేషియా ఆడియన్స్‌ను టార్గెట్ చేశాడు. ఎక్కువగా భాగం మలేషియాలోనే షూటింగ్ జరుపుకొన్నకబాలీలో చాలా మంది మలేషియన్ నటులు నటించారు. అందుకే ఈ సినిమాను తమిళ్, తెలుగుతో పాటు ఒకేసారి మలేషియా అధికారిక భాష మళాయ్లోనూ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో మళాయ్ భాషలో రిలీజ్ అవుతున్న తొలి దక్షిణాది చిత్రంగా కబాలీ రికార్డ్ సృష్టించనుంది. -
సూపర్ స్టార్ సినిమా మరోసారి వాయిదా
వరుస ఫ్లాప్‌ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీ ఏజ్‌కు, ఇమేజ్‌కు తగ్గ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను సమ్మర్ సీజన్ మొదట్లోనే రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది. ఆ తరువాత తమిళనాట ఎన్నికల హడావిడి మొదలు కావటంతో రజనీ మరోసారి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఎన్నికలు పూర్తవ్వగానే ఎట్టి పరిస్థితుల్లో కబాలీ రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరోసారి షాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. జూన్ 3న రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమాను వాయిదా వేశారు. నెల ఆలస్యంగా జూలై 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రజనీ నిర్ణయం అభిమానులకుకు నిరాశ కలిగించినా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్‌కు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అ.. ఆ..' సినిమా జూన్ 3న రిలీజ్ అవుతోంది. అదే రోజు కబాలీ కూడా రిలీజ్ అవుతుందని టెన్షన్ పడుతోన్న చిత్రయూనిట్, రజనీ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కబాలీలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా, రజనీ ముసలి డాన్‌గా కనిపిస్తున్నాడు. -
కబాలీ మళ్లీ వాయిదా
వరుస డిజాస్టర్ల తరువాత సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. ఎక్కువుగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసే రజనీ చాలా కాలం తరువాత ఓ యువ దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో కబాలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వయసైపోయిన మాజీ డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు రజనీ. తన వయసుకు తగ్గ పాత్రే అయినా స్టైల్, మేనరిజమ్స్‌లో మాత్రం తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ముందుగా సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే తమిళనాట ఎలక్షన్ల వేడి కారణంగా కబాలీ వాయిదా పడింది. మే నెలాఖరున కబాలీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడిందన్న వార్త ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను కలవర పెడుతోంది. కారణాలేంటన్నది వెల్లడించకపోయినా కబాలీ సినిమాను జూన్ రెండో వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. -
చాక్లెట్ రజనీతో సెల్ఫీ
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్, కబాలీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే తమిళనాట ఎన్నికల జరుగుతుండటంతో ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది. దీంతో తమిళనాట కబాలీ ఫీవర్ తగ్గకుండా ఉండేందుకు చిత్రయూనిట్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఓ రజనీ విగ్రహం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కబాలీ ప్రమోషన్లో భాగంగా పాండిచ్చేరికి చెందిన ఓ చాక్లెట్ తయారీ కంపెనీ వినూత్న ప్రయోగం చేసింది. తమ సంస్థ నుంచి తయారయ్యే చాక్లెట్‌తో ఆరడుగుల రజనీ విగ్రహాన్ని కబాలీ గెటప్‌లో తయారు చేయించి ప్రదర్శనకు ఉంచారు. ఈ విగ్రహాన్ని తమ సంస్థ నిర్వహిస్తున్న అన్ని రెస్టారెంట్లలోనూ ప్రదర్శనకు ఉంచటమే కాకుండా, ఆ విగ్రహంతో సెల్పీ దిగే అవకాశం కూడా కల్పిస్తున్నారు. చాలా కాలం తరువాత రజనీ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా తమిళ హీరోయిన్ ధన్సిక లేడీ డాన్‌గా అలరించనుంది. బ్యాంక్, హాంకాంగ్‌లలో భారీగా తెరకెక్కిన ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రజనీ.. సినిమా వాయిదా వేయమన్నాడు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన సినిమా రిలీజ్ విషయంలో భయపడుతున్నాడట. అందుకే తన లేటెస్ట్ ఎంటర్టైనర్ కబాలిని వాయిదా వేయాలని నిర్మాత ఎస్ థానుకు సూచించాడు. అయితే రజనీకాంత్ తన సినిమాను వాయిదా వేస్తోంది, ఇతర సినిమాలతో పోటి కారణంగా కాదు. త్వరలో తమిళ నాట ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ప్రభావం తన సినిమా మీద పడకుండా ఉండేందుకు రిలీజ్ వాయిదా వేయాలని భావిస్తున్నాడు. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ మాఫియా డాన్‌గా నటిస్తున్న సినిమా కబాలి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే రజనీ మాత్రం ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెపుతున్నాడు. తమిళనాట సినీ రంగంపై రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. రాజకీయాల కారణంగా పలు సినిమాల రిలీజ్‌లను అడ్డుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఇబ్బందులేవి కలగకుండా ఉండేందుకు తన సినిమా వాయిదా వేయాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రజనీ కబాలీ వాయిదా వేయటం మాత్రం కన్ఫామ్ అంటున్నారు తమిళ ఇండస్ట్రీ వర్గాలు. -
రజనీ సినిమా కాపీనా..?
రెండు భారీ డిజాస్టర్ల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్ చేస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'కపాలి'. కోలీవుడ్‌లో రియలిస్టిక్ సినిమాలతో ఆకట్టుకుంటున్న పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా రజనీ కొత్త సినిమా కాపీ అంటూ వస్తున్న వార్తలు సూపర్‌స్టార్ అభిమానులను కలవరపెడుతున్నాయి. కపాలి సినిమాలో రజనీ తెల్లగడ్డంతో వయసైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఒకప్పుడు డాన్‌గా చక్రం తిప్పి తరువాత వాటన్నింటికీ దూరంగా ఉండే డాన్ కూతురు కిడ్నాప్ అవ్వటం, ఆమెను రక్షించుకునేందుకు తిరిగి మాఫీయా రంగంలోకి అడుగుపెట్టడం అనే లైన్‌తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ సీరీస్ 'టేకెన్' కథకు కాపీ అన్న టాక్ వినిపిస్తోంది. 'టేకెన్' సినిమాలో హీరో భారీ యాక్షన్ సీక్వెస్స్లు చేస్తాడు, మరి రజనీ ఈ ఏజ్‌లో అలాంటి సీన్స్ చేస్తాడా..? లేక కేవలం రజనీ స్టైల్స్ బిల్డప్ మీదే సినిమా నడిపించేస్తారా..? అన్న ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ వార్తలన్నింటికీ చెక్ చెప్పాలంటే చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది.