
పెరంబూరు: భావ స్వేచ్ఛకు హద్దులుండవా? అంటూ న్యాయమూర్తి సినీ దర్శకుడు పా.రంజిత్‌ను ప్రశ్నించారు. దర్శకుడు పా.రంజిత్ ఇటీవల తంజావూరు జిల్లా, తిరుప్పనందాల్ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని రాజ రాజ చోళన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పా.రంజిత్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కోర్టు ఆయన్ని ఈ నెల 19వ తేదీ వరకూ అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఆ గడువు పూర్తి కావడంతో దర్శకుడు పా.రంజిత్ మరోసారి ముందస్తు బెయిల్ కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం తిరుప్పనందాల్ పోలీసులకు ఈ కేసులో తగిన ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. కేసు పరిశీలించిన న్యాయమూర్తి భావస్వేచ్ఛకు హద్దులు ఉండవా? అంటూ దర్శకుడు పా.రంజిత్‌ను ప్రశ్నించారు. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment