సెలబ్రిటీలు తమ సినిమా రిలీజ్‌కి ముందు వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేం కాదు. కావాలని చేస్తారో లేదంటే అనుకోకుండా జరుగుతుందో తెలీదు గానీ ఇలా జరిగిపోతుంటాయి. ఆగస్టు 15కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో డబ్బింగ్ మూవీ 'తంగలాన్' ఒకటి. దీని డైరెక్టర్ పా.రంజిత్. ఇతడే తాజాగా అంటరానితనంపై విచిత్రమైన కామెంట్స్ చేసి ట్రోలర్స్‌కి టార్గెట్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత ఇన్నాళ్లకు తిరుమలలో వరుణ్-లావణ్య)
తమిళంలో రజనీకాంత్‌తో 'కబాలి', 'కాలా' సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్.. 'సార్పట్టా పరంపరై' అనే సినిమా తీశాడు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మీరు చూసే ఉంటారు. అగ్ర కులాల ఆధిపత్య ధోరణిపై ఎక్కువగా సినిమాలు తీసే ఇతడు.. తన భావజాలన్నే ఎక్కువగా చూపిస్తుంటాడనే పేరుంది. ఇప్పుడు 'తంగలాన్' రిలీజ్‌కి ముందు విచిత్రమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయిపోయాడు.
'పేపర్ కప్పుల్లో టీ తాగడం అనేది కూడా ఆధునిక యుగంలో అంటరానితనమే' అని డైరెక్టర్ పా.రంజిత్ అన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడంలో భాగంగా పేపర్ కప్స్ అనేవి ప్రవేశపెట్టారు. ఈ చిన్న లాజిక్ మిస్ ఎలా మిస్ అయిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)
Pa.Ranjith about paper cup in tea stalls. https://t.co/If0v93KsWX
— Blue Sattai Maran (@tamiltalkies) August 14, 2024
Comments
Please login to add a commentAdd a comment