tamil director
-
సఖి.. ఫస్ట్ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం
సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్ హిట్. పేరుకే డబ్బింగ్ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అయింది.మాధవన్‌కు బదులుగా..తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్ షారూఖ్, కాజోల్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్‌తో దిల్సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్‌ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 తెరకెక్కించాడు.చదవండి: సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్! -
ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సారీ చెప్పిన దర్శకుడు
సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మిస్కిన్ క్షమాపణలు చెప్పాడు. బాటిల్ రాధ సినిమా ఈవెంట్లో మిస్కిన్ మాట్లాడుతూ.. తాను పెద్ద తాగుబోతునని చెప్పాడు. ఎన్నో సమస్యలకు మందు పరిష్కారమని చెప్పాడు. ఇళయరాజా సంగీతం వల్ల ఎందరో మద్యానికి అలవాటుపడ్డారన్నాడు. ఇళయరాజాపై ఈయన చేసిన కామెంట్లు వివాదాస్పదమవడంతో నేడు సారీ చెప్పాడు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారని పేర్కొన్నాడు.చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదుతాజాగా ఈ వివాదంపై తమిళ హీరో విశాల్ (Vishal) స్పందించాడు. అందరూ ఆరాధించే ఇళయరాజాను అగౌరవపర్చడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. ఆయన సంగీతం వల్ల ఎంతోమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని తెలిపాడు. అలాంటి మహనీయుడు గురించి, ఆయన సంగీతం గురించి చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించాడు. విశాల్-మిస్కిన్ కాంబోలో 2017లో వచ్చిన తుప్పరివాలన్(తెలుగులో డిటెక్టివ్) పెద్ద హిట్ అయింది.చేదు అనుభవం బయటపెట్టిన దర్శకుడుఇకపోతే మిస్కిన్ తాజాగా బాటిల్ రాధ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 2013లో ఒనాయుమ్ ఆట్టుకుట్టియుమ్ సినిమా తీశాను. కొందరు ఈ మూవీ టెలివిజన్ రైట్స్ హక్కులు కొనేందుకు నన్ను సంప్రదించారు. ఓ బడా దర్శకుడు నాకు ఫోన్ చేసి ఈ సినిమా తాను కొంటానని, అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బిస్తానంటూ ఓ చోటుకు రమ్మన్నాడు.(చదవండి: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!)సగం కంటే తక్కువకే ఇచ్చేయమన్నారుసరేనని అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాను. నన్ను ఓ పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో 20 మంది ఉన్నారు. రూ.75 లక్షలకే డిజిటల్ రైట్స్ ఇవ్వమని అడిగారు. ఎంతో కష్టపడి తీశాను సర్.. ఇది చాలా మంచి సినిమా.. కనీసం రూ.2 కోట్లు ఇవ్వండి అని కోరాను. కానీ వాళ్లు మాత్రం నా మాట వినలేదు. అంత డబ్బు ఇవ్వలేం.. మేము అడిగినదానికే డీల్ కుదిర్చేయ్ అని బలవంతం చేశారు. బెదిరించి బలవంతంగా సంతకంకాసేపటికి వాళ్లందరూ గూండాలని అర్థమైంది. నన్ను బెదిరించి పత్రాలపై సంతకం తీసుకున్నారు. వాళ్లు చెప్పినట్లు రూ.75 లక్షలే ఇచ్చారు. ఇదంతా వెనకుండి నడిపించిన వ్యక్తి ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్. నా సినిమాను ఇప్పటివరకు వారి ఛానల్లో 80 సార్లు వేసి ఉంటారు. అది టీవీలో కూడా హిట్టయింది అని చెప్పుకొచ్చాడు.చెప్పు విసురుతానని..ఇళయరాజాపై వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. కొన్నిరకాల వివాదాలు నిర్మాతలను ఇబ్బందిపెడతాయి. అందుకే నా వల్ల ఏ సమస్యా ఉండకూడదని సారీ చెప్తున్నాను. అయితే నా వ్యాఖ్యలు విన్న నా స్నేహితుడు నాపై చెప్పు విసురుతానన్నాడు. నా చెప్పు సైజ్ 8.. కాబట్టి ఒకటికి బదులుగా రెండు విసరమని చెప్పాను. అతడికి కూడా క్షమాపణలు చెప్పాను. ఆరోజు సరదాగా అన్న మాటల్ని చాలాదూరం తీసుకెళ్తున్నారు. అందుకే సారీ చెప్తున్నా అన్నాడు మిస్కిన్.చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
చిన్న వయసులోనే యువ దర్శకుడు కన్నమూత
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులుగా లివర్ (కాలేయ) సమస్యలతో బాధపడుతున్న ఈయన.. శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇతడి ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: )2017లో 'ఒరు కిడైయిన్ కరు మను' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు.. గతేడాది 'సత్య సొతనై' అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కమెడియన్ యోగిబాబుతో ఓటీటీ సినిమా కూడా తీశాడు.అయితే గత కొన్నాళ్లుగా లివర్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైరెక్టర్ సురేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ) -
తమిళ డైరెక్టర్ అందరిముందు నన్ను కొట్టాడు: హీరోయిన్
ఓ తమిళ దర్శకుడు తనను అందరిముందే కొట్టాడంటోంది హీరోయిన్ పద్మప్రియ జానకిరామన్. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ఓ దర్శకుడు షూటింగ్ పూర్తయ్యాక సెట్లో అందరిముందే నాపై చేయి చేసుకున్నాడు. అసత్య ప్రచారంకానీ నేనే అతడిని కొట్టానని మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆ దర్శకుడిపై సినిమా అసిసోయేషన్కు నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అతడు చేసిన తప్పును నాపై రుద్దాలని ప్రయత్నించారు. కానీ నా ఫిర్యాదు వల్ల ఆ దర్శకుడిని 6 నెలలపాటు సినిమాలు చేయకుండా నిషేధించారు. ఇదే సమస్యతప్పు ఎవరివైపు ఉందని కూడా ఆలోచించకుండా ఆడవారినే దోషులుగా నిలబెట్టాలని చూస్తారు.. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్య ఇదే అని చెప్పుకొచ్చింది. కాగా పద్మప్రియ.. మలయాళంలో టాప్ హీరోయిన్. సీను వాసంతి లక్ష్మి అనే తెలుగు చిత్రంతో 2004లో కెరీర్ మొదలుపెట్టింది. అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈమె తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.చదవండి: మోసం చేశారంటూ తృప్తి డిమ్రీపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్! -
తెలుగు హీరోలను మాయ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్..
-
భర్త పుట్టినరోజు.. బోలెడంత ప్రేమతో నయనతార పోస్ట్ (ఫొటోలు)
-
తమిళ డైరెక్టర్ నా జీవితంతో ఆడుకున్నాడు: మలయాళ నటి
ఓ తమిళ డైరెక్టర్ తనను కీలుబొమ్మలా వాడుకున్నాడంటోంది మలయాళ నటి సౌమ్య. 18 ఏళ్ల వయసులో అతడు చేసిన పాడుపని, వేధింపుల వల్ల నరకయాతన అనుభవించానంటోంది. ఇప్పటికైనా తన పేరును పోలీసుల ముందు బయటపెడతానని చెప్తోంది.18 ఏళ్ల వయసులో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు నా పేరెంట్స్‌కు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. అయితే నటి రేవతి మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. తనను చూసి నేను కూడా ఊహల ప్రపంచంలో తేలిపోయాను. ఆ ఆఫర్‌కు ఓకే చెప్తూ స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లాను. అప్పుడు నాది చిన్నవయసు కావడంతో నాకంత తెలిసేది కాదు.ఆమెకు బదులుగా అతడు..కానీ ఆ సినిమా డైరెక్టర్‌ను కలిసిన ఫస్ట్ మీటింగ్‌లోనే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయం ఇంట్లో చెప్పాను. అప్పటికే అతడు మా నాన్నను కలిసి స్క్రీన్ టెస్ట్ కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశామంటూ ఒప్పించాడు. తనతో అవుట్డోర్ షూట్‌కు తొలిసారి వెళ్లినప్పుడు అతడేమీ నాతో మాట్లాడలేదు. నిజానికి ఆ సినిమాకు అతడి భార్య దర్శకురాలు అని అగ్రిమెంట్ పేపర్లో రాసుంది. కానీ రియాలిటీలో మాత్రం ఆమెకు బదులుగా అతడే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అతడి భార్య లేని సమయంలో..తను నన్ను కోపంగా చూస్తూనే కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ దంపతులు వారి ఇంటికి తీసికెళ్లారు. (వారికి ఓ కూతురు ఉండేది కానీ తండ్రి అత్యాచారం చేశాడంటూ ఇంటి నుంచి పారిపోయింది) సడన్‌గా నన్ను కూతురిలా భావిస్తూ నాతో చాలా మంచిగా ఉన్నారు. రుచికరమైన భోజనం పెడుతూ బాగా చూసుకున్నారు. ఓ రోజు ఆ డైరెక్టర్ అతడి భార్య లేని సమయంలో నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాడు.బలవంతంగా..ఒక్కసారిగా షాకయ్యాను. నేనే ఏదైనా తప్పు చేశానా? అని భయపడిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయినా రిహార్సల్స్ కోసం ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని. అలా అతడు నెమ్మదిగా నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఓ రోజయితే బలవంతంగా నాపై అత్యాచారం చేశాడు. ఇలా చాలాసార్లు నన్నొక బానిసగా చూశాడు.నాతో బిడ్డను కంటానని..నన్ను కూతురిగా పిలుస్తూనే నాతో బిడ్డను కంటానని చెప్పేవాడు. నాతో ఆడుకున్నాడు అని చెప్తూ ఎమోషనలైంది. ఇదంతా నిస్సిగ్గుగా బయటకు చెప్పడానికి 30 ఏళ్లు పట్టిందని, కచ్చితంగా అతడి పేరు పోలీసులకు వెల్లడిస్తానంది. అలాగే తనను వేధించిన ఓ నటుడి పేరు హేమ కమిటీ రిపోర్టులో ఉందని పేర్కొంది. చదవండి: హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్ -
పేపర్ టీ కప్ కాంట్రవర్సీలో 'తంగలాన్' డైరెక్టర్
సెలబ్రిటీలు తమ సినిమా రిలీజ్‌కి ముందు వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేం కాదు. కావాలని చేస్తారో లేదంటే అనుకోకుండా జరుగుతుందో తెలీదు గానీ ఇలా జరిగిపోతుంటాయి. ఆగస్టు 15కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో డబ్బింగ్ మూవీ 'తంగలాన్' ఒకటి. దీని డైరెక్టర్ పా.రంజిత్. ఇతడే తాజాగా అంటరానితనంపై విచిత్రమైన కామెంట్స్ చేసి ట్రోలర్స్‌కి టార్గెట్ అయిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత ఇన్నాళ్లకు తిరుమలలో వరుణ్-లావణ్య)తమిళంలో రజనీకాంత్‌తో 'కబాలి', 'కాలా' సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్.. 'సార్పట్టా పరంపరై' అనే సినిమా తీశాడు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మీరు చూసే ఉంటారు. అగ్ర కులాల ఆధిపత్య ధోరణిపై ఎక్కువగా సినిమాలు తీసే ఇతడు.. తన భావజాలన్నే ఎక్కువగా చూపిస్తుంటాడనే పేరుంది. ఇప్పుడు 'తంగలాన్' రిలీజ్‌కి ముందు విచిత్రమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయిపోయాడు.'పేపర్ కప్పుల్లో టీ తాగడం అనేది కూడా ఆధునిక యుగంలో అంటరానితనమే' అని డైరెక్టర్ పా.రంజిత్ అన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడంలో భాగంగా పేపర్ కప్స్ అనేవి ప్రవేశపెట్టారు. ఈ చిన్న లాజిక్ మిస్ ఎలా మిస్ అయిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)Pa.Ranjith about paper cup in tea stalls. https://t.co/If0v93KsWX— Blue Sattai Maran (@tamiltalkies) August 14, 2024 -
ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి పోదామనుకున్నా!
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ పార్థిబన్. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే ఈయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగానూ సుపరిచితులే. భారతి కన్నమ్మ (తమిళ) సినిమాకు ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారం అందుకున్నాడు. యుగానికి ఒక్కడు మూవీలో చోళరాజుగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. కొత్త సినిమారచ్చ, పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. పుదియ పాదై, హౌస్‌ఫుల్, ఇవన్, విటగన్, ఒత్త సెరుప్పు సైజ్ 7, ఇరవిన్ నిడల్ సినిమాలతో దర్శకనిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం టీన్జ్. ఈ మూవీలో పార్థిబన్ కీలక పాత్రలో నటించగా ఆయన కుమార్తె కీర్తన క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసింది. జూలై 12న తమిళనాట రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా పార్థిబన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా'ఫ్రెండ్స్.. టీన్జ్ సినిమాకు పిల్లలు, కుటుంబాల నుంచి మంచి స్పందన రాకపోతే నా ఊపిరిగా భావించిన సినిమాను వదిలేద్దామనుకున్నాను. ఇండస్ట్రీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్నాను. కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సినిమాను ఆదరిస్తున్నారు. థాంక్యూ' అని ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేయడం గమనార్హం. The wait is over!TEENZ from Today in cinemas worldwide@rparthiepan@immancomposer@dopgavemic@k33rthana@GenauRanjith@lramachandran@AdithyarkM@Iam_Nithyashree@shreyaghoshal@Arivubeing@iYogiBabu@onlynikil@j_prabaahar@shrutihaasan@CVelnambi@teenzmovieoffl… pic.twitter.com/F0hbYzxCaH— Radhakrishnan Parthiban (@rparthiepan) July 12, 2024 చదవండి: ఆ సినిమా చేస్తే కెరీర్ ముగిసినట్లేనని వార్నింగ్.. అయినా వినలేదు! -
విజయ్ సేతుపతి సరసన...
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్... ఇలా విభిన్న పాత్రలతో విలక్షణ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా తమిళ దర్శకుడు పాండిరాజ్ ఓ కథను రెడీ చేశారట. గతంలోనే ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించారట పాండిరాజ్. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ను హీరోయిన్గా అనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలైన ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఉంది. -
సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
మరో డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుక చాలా సింపుల్‌గా జరిగిపోయింది. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్‌గా నిర్వహించాడు. దీనికి పలువురు తమిళ సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. అయితే ఈ డైరెక్టర్ పెళ్లి వెనక ఓ స్పెషాలిటీ ఉంది. ఇంతకీ అదేంటంటే?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కొన్నాళ్ల క్రితం 'సైరన్' సినిమా రిలీజైంది. జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ సరిగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఆంథోని భాగ్యరాజ్.. మే 19న రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.అయితే గత కొన్నేళ్ల నుంచి తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. దర్శకుడు అయ్యాకే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. 'సైరన్' మూవీతో తన కల నెరవేరినందున ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!) -
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
దర్శకుడు అమీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉయిర్ తమిళుక్కు. చాందిని శ్రీధర్ హీరోయిన్గా నటించారు. అనంద్రాజ్, ఇమాన్ అన్నాచ్చి, రాజ్‌కపూర్, మారిముత్తు, సుబ్రమణిశివ, మహానది శంకర్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, శరవణ శక్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.ఎవరూ ముందుకు రావట్లేఈ మూవీ విడుదల హక్కులను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం చైన్నెలో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత ఆదంబావ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దర్శకుడు అమీర్ హీరోగా నటించడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.ఆయన అలా.. ఈయన ఇలాతనను దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనేనన్నారు. అమీర్ తనకు 40 ఏళ్ల మిత్రుడని చెప్పారు. తామిద్దం మదురైకు చెందిన వారిమేనని చెప్పారు. అమీర్ మదురైలో భాషాలా ఉండేవారని, సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాణిక్యంగా మారారని, ఇప్పుడు దావూద్ ఇబ్రహీంగా మార్చుతున్నారన్నారు. అమీర్ తమిళంపై ప్రేమతో చాలా కోల్పోయారని, ఆయన సమకాలీకుడు సీమాన్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా రాణిస్తున్నారన్నారు.ఆ అవసరం నాకు లేదుదర్శకుడు, ఈ చిత్ర కథానాయకుడు అమీర్ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ఇరైవన్ మిగ పెరియవన్ చిత్ర నిర్మాత నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటుంటే తనను అందుకు బాధ్యుడిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం నాకు లేదన్నారు. అయినా ఈ కేసు విచారణలో ఉందని, తాను ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. -
ఆ కంఫర్ట్ కోసమే నిర్మాతగా మారా: దర్శకుడు
స్టార్స్‌కు తగ్గట్టుగా కథలను రాసుకునే దర్శకులు కొందరైతే, కథలకు తగ్గట్టు నటీనటులను ఎంపిక చేసుకునే దర్శకులు మరికొందరు! ఈ రెండో కోవకు చెందినవారే దర్శకుడు శాంతకుమార్. ఈయన స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం చేసుకున్న తరువాతే నటీనటుల గురించి వేట మొదలుపెడతారు. ఈయన సినిమా టైటిల్స్ కూడా అర్థవంతంగా ఉంటాయి. అలా ఇంతకు ముందు చేసిన మౌనగురు, మహాగురు సినిమాలు రెండూ ప్రేక్షకుల ఆదరణను పొందాయి. 24 అవార్డులు గెలుచుకున్న మూవీవీటిలో మౌనగురు తమిళంతోపాటు తెలుగు, కన్నడం వంటి భాషల్లోనూ రీమేక్ అయింది. మహాగురు చిత్రం 30 అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో ప్రదర్శింపబడి 24 అవార్డులను గెలుచుకుంది. కాగా శాంతకుమార్ తాజాగా తెరకెక్కించిన చిత్రం రసవాది: ది ఆల్కెమిస్ట్రీ. అర్జున్‌దాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తాన్యా రవిచంద్రన్, రమ్య సుబ్రమణియన్ హీరోయిన్లుగా నటించారు.సిద్ధవైద్యుడు జీవితంలో జరిగే పరిణామాలేనిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రసవాది ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది.దీని గురించి దర్శకుడు శాంతకుమార్ మాట్లాడుతూ.. ఒక సిద్ధవైద్యుడు జీవితంలో జరిగే పరిణామాలే రసవాది అని చెప్పారు. ఇది ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. తాను కథను సిద్దం చేసుకున్న తరువాతనే అందుకు తగిన నటీనటులను ఎంపిక చేసుకుంటానని, ఈ మూవీకి కూడా అదే పద్ధతి ఫాలో అయినట్లు చెప్పారు. కంఫర్ట్ కోసమే..కంఫర్ట్ కోసమే ఈ సినిమాకు నిర్మాతగా మారానన్నారు. ఈ నెల 10వ తేదీన పలు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటికి పోటీగా మీ చిత్రాన్ని విడుదల చేసే ధైర్యం చేయడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తమ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు ఉంటారన్న నమ్మకమేనని దర్శకుడు శాంతకుమార్ బదులిచ్చారు. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. కమల్ హాసన్ ఎమోషనల్
ప్రఖ్యాత సినీ దర్శకుడు పసిదురై (84).. వృద్ధప్య సమస్యల కారణంగా సోమవారం కొడైక్కానల్‌లో కన్నుమూశారు. 1974లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తమిళ చిత్రసీమలో రాణించారు. నిర్మాతగానూ పలు మూవీస్ చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 46 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన అసలు పేరు దురై. కాగా 1979 ఈయన దర్శకత్వం వహించిన పసి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి.. ఇలా మూడు విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రం పసి. తమిళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను, ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. దీంతో దురై పేరు పసిదురైగా మారిపోయింది. పసి చిత్రంతో పాటు అవళుమ్ పెణ్‌దానే, ఆశై 60 నాళ్, పావత్తిన్ సంబళం, ఒరువీడు ఒరు ఉలగం, కిళింజల్గళ్ లాంటి చిత్రాలని ఈయన తీశారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరో కమలహాసన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తనని నటుడిగా మార్చడంలో మామ శీనివాసన్ (దురై) పాత్ర ఎంతో ఉందన్నారు. కాగా పసిదురైకి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. (ఇదీ చదవండి: కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?) -
ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత
సీనియర్ దర్శకుడు, నటుడు ఆర్ శంకరన్ (93) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చైన్నెలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దర్శకుడు భారతి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గురువు శంకరన్ మృతి తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు శంకరన్‌కు నివాళులు అర్పిస్తున్నారు. 1962లో విడుదలైన 'ఆడి పేరుకు' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు శంకరన్. ఆ తర్వాత ఊరు, ఖైదీ, లీలావతి, ఖాదర్ కోట్టై తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్, రేవతి జంటగా నటించిన మౌనరాగం చిత్రంలో రేవతి తండ్రిగా చంద్రమౌళి అనే పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఈయన చివరిగా 1999లో అళగర్ సామి అనే చిత్రంలో నటించారు. 1974లో విడుదలైన ఒన్నే ఒన్ను కన్నె కన్ను అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేన్ సింధు దే వానం, దుర్గాదేవి, ఒరువనుక్కు ఒరుత్తి, తూండిల్ మీన్, పెరిమై కురియవన్, వేలుమ్ మైలుమ్ తున్నై, కుమారి పెణిన్ ఉళ్లత్తిలే వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు భారతి రాజా ఈయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. எனது ஆசிரியர் இயக்குனர் திரு.ரா.சங்கரன் சார் அவர்களின் மறைவு வேதனை அளிக்கிறது. அவரை இழந்து வாடும் அவரது குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக் கொள்கிறேன். pic.twitter.com/SJmO0dApeq — Bharathiraja (@offBharathiraja) December 14, 2023 చదవండి: అది కుక్కల చేతుల్లోకి వెళ్తోంది.. వారు విషం చిమ్ముతున్నారు.. -
రాఘవకు హీరోగా కెరీర్ ఇచ్చిన డైరెక్టర్ మృతి..
తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు అర్పుదాన్(52) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా అర్పుదాన్ తమిళంలో ఎన్నో సినిమాలు తీశారు. టాలెంట్ ఉండి అవకాశాల కోసం తిరుగుతున్న రాఘవ లారెన్స్‌ను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఆ సినిమాయే అద్భుతం. ఇది 2002లో రిలీజైంది. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అప్పటికే లారెన్స్ తెలుగులో హీరోగా సినిమా చేశాడు. తమిళంలో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అద్భుతం సినిమాతో కోలీవుడ్‌లోనూ హీరోగా మారాడు. ఈ మూవీ రాఘవ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది. ఇక అర్పుదాన్.. మనతోడు మళైకాలం, షామ్, సెప్పవే సిరుగాలి వంటి పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా లవ్ టుడే చిత్రానికి దర్శకత్వం వహించారు. చదవండి: అర్జున్ చేతుల మీదుగా భార్యకు సీమంతం.. సీక్రెట్స్ చెప్పిన ఆ ముగ్గురు.. గుండె బరువెక్కడం ఖాయం! -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
బాలీవుడ్‌లోకి కీర్తీ సురేష్.. దర్శకుడిగా అట్లీ
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్‌గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట. వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్‌తో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట కాలిస్. కీర్తీసురేష్‌కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ ‘తేరీ’ హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కూడా బాలీవుడ్లో విని పిస్తోంది. -
పవన్ కల్యాణ్ అలా అనడం కరెక్ట్ కాదు: దర్శకుడు
తమిళ సినిమా 'ఐమా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిస్, ఎల్విన్ జులియట్ యువ జంటగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించారు. తమిళ్ ఎగ్జాటిక్ ఫిలిమ్స్ పతాకంపై షణ్ముఖ రామస్వామి నిర్మించి ప్రతినాయకుడిగా నటించారు. విష్ణు కన్నన్ ఛాయాగ్రహణం, కేఆర్ రాహుల్ సంగీతం అందించిన ఐమా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఇందులో నటుడు, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం అధ్యక్షుడు కె.రాజన్, దర్శకుడు పేరరసు, కేబుల్ శంకర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఛాన్సులు ఎలా అడగాలో తెలియట్లేదు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, ప్రతినాయకుడు షణ్ముఖ రామస్వామి మాట్లాడుతూ తాను ఐటీ రంగానికి చెందిన వ్యక్తినని, సినిమా రంగంపై చాలా ఆసక్తి ఉందన్నారు. తనకు నటన అంటే ఇంకా ఇష్టం అన్నారు. అయితే అవకాశాలు అడగటం తెలియదన్నారు. అందుకే నటుడు కావడం కోసమే నిర్మాతగా మారినట్లు చెప్పారు. చిత్రం బాగా వచ్చిందని తెలిపారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఐమా అంటే దైవశక్తి అని అర్థం అన్నారు. ఇందులో అధికంగా కేరళకు చెందిన కళాకారులు నటించారని పేర్కొన్నారు. స్టార్ హీరోలు నటిస్తున్న తమిళ చిత్రాల షూటింగ్‌ను ఇతర రాష్ట్రాల్లో భారీ సెట్స్ వేసి రూపొందిస్తున్నారనన్నారు. సెల్వమణి వ్యాఖ్యలు వక్రీకరించారు.. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సాంకేతిక వర్గమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. తమిళ చిత్రాల్లో మన కళాకారులకు, సాంకేతిక వర్గానికి పని కల్పించాలన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఒక భేటీలో పేర్కొన్నారని, దాన్ని కొందరు వక్రీకరించారని, తెలుగు నటుడు పవన్ కల్యాణ్ దీనిపై స్పందిస్తూ ఆర్కే సెల్వమణి వ్యాఖ్యలు సముచితం కాదని, స్వార్థ పూరితంగా ఉన్నాయని పేర్కొనడం తగదన్నారు. మన కళాకారులకు, సాంకేతిక వర్గానికి పని ఇవ్వాలని కోరడం తప్పు కాదని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు. చదవండి: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి! -
తొలి అడుగు
ఇటు సౌత్.. అటు నార్త్.. కాస్త ఖాళీ దొరికితే డిజిటల్ వరల్డ్... ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. అయితే తొలిసారి ఈ బ్యూటీ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తమిళ దర్శక–నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఇటీవల కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఓ కథ తయారు చేశారని, ఈ కథ విని, ఇందులోని పాత్ర నచ్చడంతో అదితీరావ్ హైదరి పచ్చ జెండా ఊపారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుందట. లేడీ ఓరియంటెడ్ చిత్రాల పరంగా అదితీకి ఇది తొలి అడుగు. మరి.. ఈ తొలి అడుగుతో ఈ తరహా చిత్రాలు ఇంకెన్ని చేస్తారో చూడాలి. ఇక ‘సమ్మెహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి చిత్రాలతో అదితీరావ్ హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య.. అందుకే విడాకులు!
ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణ విషయం. కొన్ని ప్రేమలు బ్రేకప్‌తోనే ఆగిపోతే, మరికొన్ని మాత్రం పెళ్లయ్యాక విడాకులతో ముగిసిపోతాయి. తమిళ సినీ జంట సంయుక్త-విష్ణుకాంత్లు రెండో కోవలోకి చెందుతారు. 'సిప్పినీల్ ముత్తు' సీరియల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు పెద్దల అంగీకారంతో మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. బ్యూటిఫుల్ కపుల్ అని అంతా పొగిడారో లేదో అంతలోనే విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. పెళ్లైన రెండు నెలలకే విడాకులు తమ పెళ్లి ఫోటోలను సైతం సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. ఆ సమయంలో విష్ణుకాంత్.. 'మౌనంగా ఉంటే ఎఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి' అని పోస్ట్ చేశాడు. అటు సంయుక్తా కూడా.. 'ఇది కొత్త జీవితానికి ఆరంభం, ఇక మీదట మరింత ధృడంగా ముందుకు వెళ్తా'నని పోస్ట్ చేసింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోయిన ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్‌ను నెట్టింట రిలీజ్ చేశాడు విష్ణు. సంయుక్త తన మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని తెలియజేస్తూ ఈ క్లిప్ వదిలాడు. విష్ణుకాంత్తో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా మాజీ ప్రేమికుడిని మర్చిపోలేనందువల్లే వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విష్ణు ఆమె అందాన్ని కోరుకున్నాడు ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ తమిళనాట బుల్లితెర ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఇది చూసిన కొందరు సంయుక్తను విమర్శిస్తుండగా ఆమె అభిమానులు మాత్రం మేము నీవెంటే ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. 'విష్ణు చెప్పేది తప్పా?ఒప్పా? అనేది పక్కన పెడితే పాత ఆడియో రికార్డింగ్‌ను ఇప్పుడు నెట్లో పెట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ విష్ణునే సంయుక్త అందాన్ని చూసి పడిపోయి ఆమెతో శారీరకంగా కలిసి ఉండాలనుకున్నాడు. కానీ పెళ్లనేది ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వారి పెళ్లి వర్కవుట్ కాలేదు. సామ్ ప్రేమ వ్యవహారం విష్ణుకు తెలుసు తను నిజంగా సామ్‌ను ప్రేమిస్తే ఇలా అందరి ముందు ఆమెను అవమానపర్చడు. సామ్, రవి ఇద్దరూ 'నిరమతే నిలవే' అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో వారు తమ గురించి బాహాటంగానే చెప్పారు. కాబట్టి పెళ్లికి ముందే ఆమె గతం గురించి అతడికి కచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్లు నటిస్తున్నాడు. సామ్ ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను' అని కామెంట్ చేశాడు. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన సంయుక్త.. లవ్ ఎమోజీతో పాటు కృతజ్ఞతగా నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. చదవండి: పవిత్రా లోకేశ్ ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా? -
నేను చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నా: సెల్వరాఘవన్
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ అందరికీ సుపరిచితులే. 'తుళ్లువదో ఇలమై' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు సెల్వరాఘవన్. ఇందులో ఆయన సొంత సోదరుడు ధనుష్ హీరోగా చేశాడు. మరోసారి ధనుష్‌ను హీరోగా పెట్టి 'కాదల్ కొండై' తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అక్కడి నుంచి వరుసగా ప్రేమకథలు తీసుకుంటూ పోయిన ఆయన ఎన్నో హిట్స్ అందుకున్నాడు. తర్వాత నటనా రంగంలోనూ అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తా నిరూపించుకున్నాడు. తాజాగా ఓ నెటిజన్ సెల్వ రాఘవన్ గురించి పొగుడుతూనే ఆయన ఇక లేరన్నట్లుగా ట్వీట్ చేశాడు. 'ఆయన సినిమాలు తీయడం ఆపేసినట్లున్నారు, లేదంటే చనిపోయారేమో' అని ట్వీట్ చేశాడు. దీనికి సెల్వ రాఘవన్ ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. 'ఎందుకలా అన్నావు మిత్రమా? నేను చనిపోలేదు, అలా అని సినిమాలు తీయడం అపలేదు. ఏదో నా కోసం నేను కొంత సమయం తీసుకుంటూ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానంతే! నేను ఇంకా నలభైల్లోనే ఉన్నాను. త్వరలోనే మంచి సినిమాలతో ముందుకు వస్తాను' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్వ రాఘవన్ తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో గుర్తింపు పొందాడు. ఆయన చివరగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిన్ని చిత్రంలో నటించాడు. ప్రస్తుతం యోగి బాబు, సునీల్ నటిస్తున్న ఓ సినిమాలోనూ ఆయన యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో ఆయన తెరకెక్కించిన హిట్ చిత్రాల్లో 7/G బృందావన కాలనీ ఒకటి. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తీయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో చూడాలి! Why my friend ? I'm not dead or retired. I have just spent some time for myself. I'm just in my forties .. And I'm back. https://t.co/CYdLcoG97k — selvaraghavan (@selvaraghavan) May 3, 2023 చదవండి: శరత్‌బాబు ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తే కేసు సినిమాల్లోకి రావాలన్న ఇంట్రస్టే లేకుండే: త్రిష -
డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్ ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో -
ఎన్టీఆర్ తో సినిమా పై వెట్రిమారన్ సంచలన కామెంట్స్
-
వారియర్ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు. చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. pic.twitter.com/aJujcEr01m — Lingusamy (@dirlingusamy) April 13, 2023 -
అడగ్గానే రిప్లై.. వివాదంలో ప్రముఖ నటుడు.!
కన్నుమ్ కన్నుమ్, విమల్ పులివాల్ వంటి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన మరిముత్తుకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆతను పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. జీవా, పరియేరుమ్ పెరుమాళ్, కొంబన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా తిరుచెల్వం దర్శకత్వం వహించిన కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్లో అతని పాత్ర మంచి గుర్తింపు వచ్చింది. అలా నటనలో దూసుకెళ్తున్న మరిముత్తు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా ప్రముఖ దర్శకులైన వసంత్, ఎస్.జె.సూర్య, మణిరత్నం, సీమాన్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. సోషల్ మీడియాలో ఓ మహిళ నేను మీకు కాల్ చేయొచ్చా అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. అరకొర దుస్తులు ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నటుడు మరిముత్తు వెంటనే ట్విటర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు. అందులో ఏకంగా తన మొబైల్ నంబర్ కూడా పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ తిన్నారు. ఆ తర్వాత నంబర్ ట్రూ కాలర్‌లో చెక్ చేశారు. ఆయనదే కావడంతో ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మరిముత్తు తనయుడు అఖిలన్ వివరణ ఇచ్చాడు. ఆ పోస్ట్ చేసింది మా నాన్న కాదని చెప్పారు. ఎవరో కావాలనే అలా చేశారని అన్నారు. మా నాన్న నంబర్ చాలామందికి తెలుసని.. అందుకే ఎవరో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తన వివరణ తర్వాత ఆ నకిలీ రికార్డును తొలగించారు. On behalf of @ActorMarimuthu (his official account) - The account that has commented with his phone number doesn’t belong to him and his phone number is out in the public for quite sometime and it has been misused here. I kindly request @Schumy_Official to remove this post 🙏🏾 — Akilan Marimuthu (@akilangm) February 26, 2023 -
పా.రంజిత్‌కు నేను వ్యతిరేకిని కాదు: దర్శకుడు
తాను దర్శకుడు పా. రంజిత్‌కు వ్యతిరేకిని కాదని దర్శక నిర్మాత మోహన్ జి పేర్కొన్నారు. ఇంతకుముందు పళయ వన్నారపేటై, ద్రౌపది, రుద్రతాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వ రాఘవన్ కథానాయకుడు. నట్టి, రాధా రవి, కే రాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ప్రతిభ లేకపోతే ఎవరూ కథానాయకులుగా సక్సెస్ కాలేరన్నారు. మోహన్ జి కఠిన శ్రమజీవి, ప్రతిభావంతుడు అని, సినిమాపై ఎంతో మర్యాద, నమ్మకం కలిగిన మంచి దర్శకుడు అని ప్రశంసించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన దర్శకుడు మోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శక నిర్మాత మోహన్.జీ మాట్లాడుతూ.. బకాసురం చిత్రం చాలా మంది ప్రశంసించారని, అందుకు తనతోపాటు పనిచేసిన అందరూ కారణమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్, చాయాగ్రాహకుడు ఫరూక్ ముఖ్యమైన వారన్నారు. సెల్వ రాఘవన్ సైలెంట్‌గా ఉంటారని.. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని తెలిపారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను సెల్వరాఘవన్ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రాన్ని చూసిన తర్వాతే తనకు దర్శకుడు కావాలన్న కోరిక కలిగిందని చెప్పారు. లేకపోతే తాను ఒక వర్గానికి సంబంధించిన కథా చిత్రాలనే చేస్తానని ప్రచారం ఉందన్నారు. అందుకోసం తాను సినిమాలోకి రాలేదని స్పష్టం చేశారు. దర్శకుడు పా.రంజిత్ బడుగు వర్గాల ఇతివృత్తాలతోనూ, తాను ఓబీసీ ప్రజల కోసం చిత్రాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అయితే సినీ పరిశ్రమలో తాను ఎవరిని వ్యతిరేకులుగా భావించడం లేదని, ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్‌కు తాను వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. బకాసురన్ అందరి చిత్రం అని దర్శక నిర్మాత మోహన్.జి పేర్కొన్నారు. చదవండి: నా మనసు నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే.. శృతిహాసన్ పోస్ట్ వైరల్ -
ప్రముఖ దర్శకుడు, కమెడియన్ కన్నుమూత
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్, కమెడియన్ టీపీ గజేంద్రన్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శనివారం ఇంటికి వచ్చారు. కానీ ఆ మరునాడే తుదిశ్వాస విడవడంతో విషాదం నెలకొంది. కాగా టీపీ గజేంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్‌కు క్లోజ్ ఫ్రెండ్. 1985లో చిదంబర రహస్యం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు టీపీ గజేంద్రన్. 1988లో వీడు మనైవి మక్కల్ మూవీతో దర్శకుడిగా మారారు. బడ్జెట్ పద్మనాభం, చీనా తానా, మిడిల్ క్లాస్ మాధవన్, బండ పరమశివం వంటి సహా తమిళంలో పలు కామెడీ చిత్రాలను తెరకెక్కించారు. దాదాపు వంద సినిమాల్లో నటించిన ఆయన చివరగా యోగిబాబు పన్ని కుట్టి చిత్రంలో కనిపించారు. చదవండి: హీరోయిన్ ఇంట పెళ్లి సందడి.. ఫోటో షేర్ చేసిన హలో బ్యూటీ -
తమిళనాడు రాజకీయ విభేదాలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
తమిళ సినిమా: ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు, రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, బీజేపీ తమిళ భాషాభివృద్ధి అధ్యక్షుడు పేరరసు విళిత్తెళు చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై శివగంగ నగర్ మండ్రం అధ్యక్షుడు, నటుడు సీఎం దొరై ఆనంద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మురుగా అశోక్, గాయత్రి జంటగా నటిస్తున్నారు. ఏ.తమిళ్ సెల్వన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ గురువారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు పేరరసు, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పారిశ్రామికవేత్త దామ్ కన్నన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న వారిని చూస్తుంటే తమిళ భాషాభిమానులని తెలుస్తోందన్నారు. ఇప్పుడు తమిళ భాషపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే తమిళంపై రాజకీయాలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. తమిళం అన్నా, తమిళనాడు అన్నా ఒకటి కాదా అంటూ ప్రశ్నించారు? తమిళనాడు వర్ధిల్లాలి.. తమిళం వర్ధిల్లాలి అన్నవి రెండు ఒకటే అన్నారు. రాజకీయ పార్టీల్లో పలు విభాగాలు ఉండవచ్చని, అయితే తమిళుడు తమిళుడుగానే ఉండాలని పేర్కొన్నారు. గవర్నర్ అనే వ్యక్తి రెండేళ్లలో వెళ్లిపోతారని తమిళులు ఇక్కడే ఉంటారని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు తమిళుడు మోసపోతూనే ఉన్నాడు అనే పదం ఉందన్నారు. అది నిజమేనన్నారు. కాబట్టి తమిళ రాజకీయాల్లో తమిళుడు చిక్కుకోరాదని ఈ సందర్భంగా పేరరసు అన్నారు. -
సందేశాత్మక చిత్రాలను మనమే ఆదరించడం లేదు: డైరెక్టర్ ఆవేదన
తమిళ సినిమా: సపర్బ్ క్రియేషన్స్ పతాకంపై నవ నిర్మాత రాజగోపాల్ ఇళంగోవన్ నిర్మించిన చిత్రం వెల్లిమలై. ఓం విజయ్ కథ బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ నటుడు సపర్ గుడ్ ఫిలిమ్స్ సుబ్రమణి ప్రధాన పాత్రలో నటించారు. నటి మంజు నాయకి. రఘునందన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో ఒక ముఖ్యమైన అంశాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం వెల్లిమలై. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ వేడుకలో నామ్ తమిళం పార్టీ నేత సీమాన్, దర్శకుడు కేఎస్ రవికుమార్ మిష్కిన్, పేరరసు, దిండుక్కల్ లియోన్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ చిత్రం కోసం దిండుక్కల్ లియోన్ ఒక పాట పాడటం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు మిష్కన్ మాట్లాడుతూ.. మంచి సందేశంతో కూడిన చిత్రాలను కూడా మనం ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లో సినిమాలకు ఆదరణ కరువైందని, ఓటీటీలో సినిమా చూడటమంటే రౌడీయిజంతో సమానమంటూ ఆసక్తిక వ్యాఖ్యాలు చేశారు. ఇంతకుముందు మణికంఠన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నిర్మించి ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కడైసీ వ్యవసాయి అన్నారు. ఆ చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. కానీ మనం మాత్రం ఈ సినిమాను ఆదరించలేదన్నారు. రూ. 300, 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల మధ్య కడైసీ వ్యవసాయి చిత్రానికి రూ. 30 కోట్లు కూడా రాకపోవడం విచారకరమన్నారు. మంచి సందేశంతో వస్తున్న ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని మిష్కిన్ పేర్కొన్నారు. -
పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు
కల్పిక గణేశ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె తరచూ తన సహానటీనటులను టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలా వివాదాలతో, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తున్న కల్పిక ఓ నటి గురించిన సంచలన విషయం బయపెట్టింది. ప్రముఖ నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్, రెక్కీ వంటి వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులైన డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది నటి కల్పిక. రీసెంట్ తన యూట్యూబ్ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. ఇక ఆ వీడియోలో కల్పిక మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా పెట్టేశారు. వీరిద్దర పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. అతడు ఆమె టార్చర్ పెడతాడామో అని అనుకున్నా. కానీ, వారిద్దరు చాలా ఆన్యోన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూడ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. అయితే ఇది డైరెక్టర్ బలాజీనే వీడియోను డిలిట్ చేయించారని ఆరోపిస్తు ఆమె తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Balaji Mohan (@directormbalaji) -
మధ్యలో ఆగిపోయిన స్టార్ హీరో సినిమా.. కారణం అదే..!
కోలీవుడ్‌లో తమిళ స్టార్ హీరో సినిమా ఆగిపోయింది. ప్రముఖ దర్శకుడు బాల, స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అచలుడు(తమిళంలో వనంగాన్)'. అయితే పరస్పర అంగీకారంతోనే సూర్య తప్పుకుంటున్నట్లు డైరెక్టర్ బాల వెల్లడించారు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేసినందున సూర్యకు సరిపోదని దర్శకుడు అన్నారు. కథపై ఉన్న నమ్మకంతోనే సూర్య ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని.. అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు దర్శకుడు. త్వరలోనే మరో కొత్త హీరోతో ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ బాల తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు 40శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నంద, శివపుత్రుడు చిత్రాలు పలు ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రంలో సూర్య మత్స్యకారునిగా కనిపించనుండగా.. కృతి శెట్టి తమిళంలో ఈ సినిమాతో అరంగేట్రం చేయనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తుండగా.. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డ్రామాను దాదాపు పది భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
అదే జరిగితే ' అంతకుముందు.. ఆ తర్వాత'.. డైరెక్టర్ లింగుస్వామి సీరియస్..!
అనువాద చిత్రాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'వారిసు' రిలీజ్‌పై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు లింగుస్వామి స్పందించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏం చేయాలో మాకు తెలుసన్నారు. (చదవండి: టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం) సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే థియేటర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు విమర్శలు చేశారు. ఇలా వ్యవహరించడం పద్ధ కాదని డైరెక్టర్ లింగుస్వామి అన్నారు. ఒకవేళ ఆ విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లింగుస్వామి హెచ్చరించారు. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారిసుకు రావాల్సిన థియేటర్లు లభించకపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. వారు ఇలాగే వ్యవహరిస్తే 'వారిసుకు ముందు, వారిసుకు తర్వాత' అనేలా ఉంటుందని దర్శకుడు లింగుసామి అన్నరు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించారు. -
ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్
నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం కోలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు శింబు సరసన ఈశ్వరన్, జయం రవికి జంటగా భూమి చిత్రాల్లో మెరిసింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్ చిత్రంలో నాయికగా నటించింది. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా నటి నిధి అగర్వాల్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కలగ సంఘం చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకసారి దర్శకుడు మగిళ్ తిరుమేణి నుంచి ఫోన్ వచ్చిందని, వెంటనే ఆయన్ని కలుస్తానని చెప్పానంది. అలా కలిసిన వెంటనే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోమని చెప్పారంది. ఆ తర్వాత ఆయన తన ముఖ కవళికలను మాత్రమే ఫొటో షూట్ చేశారని చెప్పింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించాలని తెలిపారు. ఇందులో నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పింది. ఆయన సహ నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారంది. ఉదయనిధి స్టాలిన్‌కు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, పనుల ఒత్తిడి ఉంటుందని, అయితే వాటిని షూటింగ్లో ఎప్పుడు కనబరిచే వారు కాదని చెప్పింది. తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పటి నుంచి తమిళభాషను నేర్చుకుంటున్నానని నిధి అగర్వాల్ తెలిపింది. చదవండి: మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్ ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే..
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ.. పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. చదవండి: ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే ఈ క్రమంలో తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఆమె కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. ప్రస్తుతం దక్షిణాన పలు చిత్రాలు చేస్తున్న ఈషా ఈక్రమంలో అక్కడి ఓ స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందట. ఇక త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారని, కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఒక్కటికాబోతున్నారంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ తెలుగు బ్యూటీ స్పందించేవరకు వేచి చూడాలి. ఇక ఈషా పెళ్లి వార్తలు బయటకు రావడంతో ఆ తమిళ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆమె ఫాలోవర్స్. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత -
తెలుగు నిర్మాతల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: తమిళ డైరెక్టర్
సుందర పాండియన్ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు ఎస్ఆర్ ప్రభాకరన్. ఆ చిత్రం హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. శశికుమార్ కథానాయకుడుగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును గెలుచుకున్న దర్శకుడు ఎస్ఆర్ ప్రభాకరన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. అవార్డులు దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం కథను రాయలేదని, సహజత్వంగా ఉండాలన్న దృష్టిలో పెట్టుకుని కథలు రాశానన్నారు. దర్శకుడు, నటుడు శశికుమార్ కూడా కథా చిత్రాలు సహజత్వానికి దగ్గరగా ఉండాలని భావిస్తారన్నారు. శశికుమార్ వద్ద సహాయకుడిగా పని చేశానని ఆయన చిత్రాలు చాలా యదార్థంగా ఉంటాయని తెలిపారు. ఆయన నిర్మిం కథానాయకుడిగా నటించిన సుందరపాండియన్ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం శశికుమార్ కథానాయకుడిగా ముందానై ముడిచ్చు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా నటి తాన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రలో రెక్కై ములైత్తేన్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా రరల్ పొలిటికల్ క్రైమ్ కథాంశంతో కొలైక్కారన్ కైరేఖగళ్ పేరుతో వెబ్‌సిరీస్‌ను జీ–5 సంస్థ కోసం రపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కలైయరసన్ వాణిభోజన్ జంటగా నటిస్తున్నారని తెలిపారు. అలాగే ఇతర దర్శకులకూ అవకాశం ఇస్త చిత్రాలు నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. తనకు నటుడు అవ్వాలన్న ఆసక్తి లేదని, మంచి చిత్రాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగులో చిత్రాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగులోనూ చిత్రాలు చేసే ఆలోచన ఉందని చెప్పారు. చిత్రాలు ఓటీటీలో విడుదల చేయడం వ్యాపారం కోసం అని పేర్కొన్నారు. కాగా ఇటీవల నటీనటులు వారి సహాయకుల వేతనాలను వారే చెల్లించాలని తెలుగు సినీ వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, దీనిని కోలీవుడ్‌లోనూ అమలు పరచడానికి తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. -
హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెట్టుబడికి ముప్పు లేకపోవడంతో దర్శక, నిర్మాతలు కూడా వెబ్‌సిరీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తాజాగా రూపొందిన వెబ్ సిరీస్ ‘పేపర్ రాకెట్’. ఇది జీ చానల్ ఒరిజినల్ వెబ్‌సిరీస్. శ్రీనిధి సాగర్ నిర్మించిన దీనికి కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఇందులో గౌరీ జి.కిషన్, నాగివీడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి జీ చానల్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్, శింబు, విజయ్ ఆంటోని, దర్శకుడు మిష్కిన్, మారి సెల్వరాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకురాలు కృతిక మాట్లాడుతూ.. తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు శింబుతో చిత్రం చేయాలన్నది తన కోరిక అని, అది ఈ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. శింబు తొలిసారి హీరోగా నటిస్తున్నప్పుడు తనకి ఇంకా పెళ్లి కాలేదని ఒక యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా రకరకాల విమర్శలు చేస్తుంటారని అదే విధంగా తొలి చిత్రం సమయంలో శింబుపై కూడా ఇతను హీరోనా అని విమర్శలు వచ్చాయని అన్నారు. చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ అయితే ఆయన నటిస్తున్న తొలి చిత్రం స్టిల్స్ బయటకు వచ్చినప్పుడు ఆ చిత్ర యూనిట్లో ఉన్నత స్థాయికి ఎదిగేది శింబునే అని తాను భావించానన్నారు. ఇక ఉదయనిధి గురించి చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళుతానని చెప్పగానే ఆయన చాలా ఆలోచించారన్నారు. ఆ తరువాత తాను ఇంటిలో చేసే గోల పడటం కంటే సినిమా రంగంలోకి వెళ్లడమే మంచిదని, తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించారేమో గాని సమ్మతించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలకు సపోర్టు అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృతిక ఉదయనిధి అన్నారు. -
ఫిలిం జర్నలిస్ట్‌తో ప్రముఖ డైరెక్టర్ నిశ్చితార్థం, కొత్త జంటకు స్టార్ హీరో విషెస్
ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఓ ఫిలిం జర్నలిస్ట్‌తో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. తమిళ చిత్రం హీరో ఫేం పీఎస్ మిత్రాన్ ఫిలిం జర్నలిస్ట్ ఆశామీరా ఆయప్పన్ల నిశ్చితార్థం శుక్రవారం(జూన్ 24న) ఘనంగా నిర్వాహించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్‌గా అవుతున్నాయి. దీంతో డైరెక్టర్ మిత్రాన్కు కోలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్ Dear @psmithran and @aashameera many congratulations on your engagement! Let the love❤️ grow stronger😊. — Actor Karthi (@Karthi_Offl) June 25, 2022 హీరో కార్తీ, డైరెక్టర్ రవి కుమార్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా ఈ కొత్త జంటగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆశామీరా సైతం దర్శకుడు మిత్రాన్తో తన నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడిస్తూ.. తమపై ఇంత ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసింది. కాగా మిత్రాన్ హీరో విశాల్ అభిమన్యుడు(తమిళంలో ఇరుంబుతిరై) మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల మిత్రాన్ ఈ మూవీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. అనంతరం శివ కార్తికేయన్‌తో హీరో మూవీని తెరకెక్కించి తన మార్క్‌ను చూపించాడు. ప్రస్తుతం మిత్రాన్ కార్తీ హీరో సర్దార్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. చదవండి: ‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ Happy Engagement! Congrats @Psmithran @aashameera 💐💐 pic.twitter.com/8ZlasqXlc9 — Ravikumar R (@Ravikumar_Dir) June 23, 2022 .@Psmithran and I are humbled and a tad overwhelmed by all the love pouring in. Thank you so much for making our day much more special. ☺️😁♥️ — Ashameera Aiyappan (@aashameera) June 24, 2022 -
‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? రానా కామ్రేడ్ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి లీడ్రోల్లో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్ పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబులు సంయుక్తంగా నిర్మించారు. #Viraataparvam is the best Telugu film I've watched in recent times. Producers & dir @venuudugulafilm deserve much appreciation for making this film without any compromises.Special appreciations to @RanaDaggubati for accepting &doing this role & @Sai_Pallavi92 has done superbly👏 — pa.ranjith (@beemji) June 19, 2022 -
సినిమా సక్సెస్ అవాలంటే కథే హీరోగా ఉండాలి
తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ ఆదరణ ఉంటుందని దర్శకుడు పేరరసు అన్నారు. శివాని స్టూడియోస్ పతాకంపై సుభా సెంథిల్ నిర్మించిన చిత్రం టేక్ డైవర్షన్. శివాని సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ చిత్రం ఫేమ్ శివకుమార్, నటి పాడినికుమార్ హీరో హీరోయిన్లుగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం విజయం సాధించాలంటే కథే హీరోగా ఉండాలని పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు ఒకే నటుడితో కార్గిల్ అనే చిత్రంతో కొత్త ప్రయోగం చేసి మంచి గుర్తింపు పొందారన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. చదవండి 👇 'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' కాస్మొటిక్ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్ కేర్! -
బీస్ట్ సినిమాలో స్క్రీన్‌ప్లే ఏమైనా బాగుందా?: విజయ్ తండ్రి అసహనం
తమిళ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఏప్రిల్13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా దీనిపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మీద అసహనం వ్యక్తం చేశాడు. బీస్ట్ మంచి కలెక్షన్లు రాబడుతుందేమో కానీ స్క్రీన్‌ప్లేలో అసలు మ్యాజిక్ మిస్సయిందని చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్‌తో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'అరబిక్ కుతు సాంగ్‌ను డైహార్డ్ ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో నేనూ అలాగే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్ కేవలం విజయ్ స్టార్డమ్ మీదే నమ్మకం పెట్టుకుని నడిచినట్లు ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్ ఉండాలి. కానీ సినిమాలో అదెక్కడా కనిపించనే లేదు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్ ఏం చేస్తారు? వారు ఎలా ప్రవర్తిస్తారు? అనేది లోతుగా తెలుసుకుని సినిమాను తెరకెక్కించాల్సింది. బీస్ట్ సినిమా సక్సెస్‌పై అనుమానించాల్సిన అవసరమే లేదు. సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్, ఎడిటర్, హీరో.. వీళ్ల వల్లే బీస్ట్ సక్సెస్ అయింది అని తెలిపాడు. కానీ విజయానికి కారణమైనవారి జాబితాలో డైరెక్టర్ నెల్సన్ పేరును ప్రస్తావించలేదు. కాగా సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. చదవండి: స్టార్ హీరోలతో స్టెప్పులేయించిన బాబా భాస్కర్ 'తెలుగు వారి హిందీ దర్శకుడు' తాతినేని చివరి సినిమా ఏదంటే? -
లగ్జరీ బైక్ కొన్న ప్రముఖ దర్శకుడు, ధర ఎంతంటే?
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కొత్త బైక్ కొన్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన కలల బైక్‌ను సొంతం చేసుకున్నాడు. లగ్జరీ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూకు చెందిన హైస్పీడ్ సూపర్ బైక్‌ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ బైక్ ధర దాదాపు 18 లక్షల రూపాయలపైనే ఉంటుందని తెలుస్తోంది. కాగా వెట్రిమారన్ అసురన్, పొల్లధవన్, వడ చెన్నై వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఆయన 'విడుతాలై' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీని తర్వాత సూర్యతో 'వడివాసల్' సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో పలు ప్రాజెక్టులు పట్టాలెక్కించనున్నాడు. -
అఘాయిత్యాలకు మహిళలే కారణం: దర్శకుడు కామెంట్స్
సాక్షి, చెన్నై: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మహిళలే కారణమని దర్శకుడు పేరరుసు పేర్కొన్నారు. రెయిన్బో ప్రొడక్షన్స్ పతాకంపై వరదరాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెన్ విలై వెరుమ్ 999 రూపాయ్ మట్టుమే’. నటుడు రాజ్‌కమల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. దీని యాక్షన్ రియాక్షన్ సంస్థ అధినేత జెనీష్ విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ రూపొందించిన చిత్రం అని చెప్పారన్నారు. -
వైద్యురాలిని పెళ్లాడిన తమిళ దర్శకుడు
చెన్నై: సిక్సర్ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు చాచి. ఆయన బుధవారం ఓ ఇంటివారయ్యారు. చెన్నైకు చెందిన వైద్యురాలు శరణ్యని కోవిలంబాక్కంలో వివాహం చేసుకున్నా రు. నటుడు శివకార్తికేయన్, సతీష్, మిర్చి శివ, సంగీత దర్శకుడు జిబ్రాన్, చాయాగ్రాహకుడు పి.జి.ముత్తయ్య, నృత్య దర్శకుడు అజయ్, నటి రిత్విక, ఆకాష్ దంపతులను ఆశీర్వదించారు. చదవండి : డ్రగ్స్ కేసు : నేడు విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక -
ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్(90) కన్నుమూశాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు(జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్వాస విడిచాడు. నేడు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దర్శకుడి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా 'మీందమ్ కోకిల', 'మహారసన్' వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు. My Father, my mentor , my love ... passed away today morning around 8.45 am. Need all your prayers to keep my family in strength 🙏 pic.twitter.com/tpTfvjG474 — Gnr.kumaravelan (@gnr_kumaravelan) June 3, 2021 'కల్యాణరామన్, ఎల్లం ఇంబమాయం, కాదల్ మీంగల్, ముత్తు ఎంగల్ సొత్తు, పల్లవి మీందుమ్ పల్లవి మీందమ్ పల్లవి, అడుత్తతు ఆల్బర్ట్' వంటి చిత్రాలకు రంగరాజన్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన తనయుడు జీయన్నార్ కుమారవేలన్ కూడా కోలీవుడ్‌లో దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఇతడు 'నినైతలే ఇనిక్కుమ్', 'యువన్ యువతి', 'హరిదాస్', 'వాగా' వంటి చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ప్రస్తుతం కుమారవేలన్ నటుడు అరుణ్ విజయ్‌తో కలిసి 'సినం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చదవండి: భార్య మరణించిన కొన్ని రోజులకే నటుడు కన్నుమూత లుగులో సినిమాలు చేస్తున్న బాలీ, కోలీ, మాలీ, శాండల్... వుడ్స్ డైరెక్టర్లు -
డైరెక్షన్ టు టాలీవుడ్!
పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్ మారింది. వాళ్ల డైరెక్షన్ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్... ఈ అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్ వైపు తిప్పుకుంటున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కెరీర్లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ అనే మైథాలజీ ఫిల్మ్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేయడం విశేషం. అలాగే హిందీ సినిమా ‘వార్’ ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్’ ‘జీన్స్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్లో శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఉన్న మంచి మాస్ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్ రావ్ డైరెక్షన్లో రానా హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో రానా పోలీసాఫీసర్ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు. వీళ్లూ వస్తారా? తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. -
KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్(54) తుది శ్వాస విడిచాడు. శుక్రవారం ఆయన చెన్నై ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించాడు. కాగా రెండు వారాల క్రితం ఆయన భార్య, కూతురు కోవిడ్ బారిన పడగా స్వీయనిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలో కేవీ ఆనంద్ సైతం ఊపిరాడకపోవడం, ఛాతీ నొప్పి వంటి కరోనా లక్షణాలతో బాధపడ్డాడు. దీంతో తనే స్వయంగా కారు నడుపుకుంటూ చెన్నై ఆస్పత్రికి చేరగా అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. అనంతరం వచ్చిన కోవిడ్ ఫలితాల్లో ఆనంద్‌కు పాజిటివ్ అని తేలింది. Gone from our sight, but never from our hearts. K.V. Anand sir you will be missed forever. Prayers for the departed soul. Pranams 🙏 pic.twitter.com/q84wsusJDq — Mohanlal (@Mohanlal) April 30, 2021 ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'డైరెక్టర్ కేవీ ఆనంద్ ఇక లేరన్న వార్తతో నిద్ర లేచాను. అద్భుతమైన కెమెరామన్, గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం. ఆయనను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం.. ఆయన కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. Just woke up to this sad news that Dir KV Anand garu is no more. Wonderful cameraman , brilliant director and very nice gentleman . Sir you will always be remember & missed . Condolences to the near , dear & family . Rest in Peace Sir . #KVAnand pic.twitter.com/V6ombIxZcy — Allu Arjun (@alluarjun) April 30, 2021 కేవీ ఆనంద్ ఫొటో జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించాడు. గోపుర వాసలిలె, మీరా, దేవార్ మాగన్, మఅరన్, తిరుద తిరుద సినిమాలకు సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. 1994లో తొలిసారిగా మలయాళ మూవీ 'తెన్మావిన్ కోంబత్'కు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. తొలి సినిమాతోనే జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నాడు. సుమారు పదేళ్ల పాటు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన కేవీ ఆనంద్ 2005లో 'కన కందేన్' సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్, కో, మాట్రాన్, అనేగన్, కవన్, కప్పాన్ సినిమాలకు సైతం డైరెక్షన్ చేశాడు. ఆయన తీసిన 'రంగం', 'శివాజీ' తమిళ చిత్రాలు తెలుగులోనూ రిలీజై ఎంతో పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 'బందోబస్త్' సినిమా సైతం తెలుగులోనూ విడుదలైంది. చదవండి: OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! -
మరో విషాదం: కరోనాతో దర్శక-నిర్మాత మృతి
ప్రముఖ నటుడు, కమెడియన్ వివేక్ మృతి మరువకముందే తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమీరా(53) మంగళవారం కరోనాతో కన్నుముశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఆయన చెన్నైలో ఓ ఆస్పత్రిలో చేరారు.అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికి ఆయన ఆరోగ్యం రోజుకు రోజుకు మరింత క్షీణించడంతో ఆస్పత్రిలోనే నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. Absolutely shocking to hear. Very sad. Life is becoming very short for many. Director #Thamira is a fine gentleman & a good friend. Unable to accept these losses. #RIPThamira sir. You will be badly missed by us. Condolences to his family. Take care friends. Be safe 🙏🙏🙏 pic.twitter.com/Qx3V8e4tZV — Dr. Dhananjayan BOFTA (@Dhananjayang) April 27, 2021 కాగా తమిళంలో ఆయన పలు సినిమాలకు నిర్మాత వ్యహరించారు. 2010లో రెట్టైసుజి అనే మూవీతో నిర్మాత సినీ పరిశ్రమలోకి అరంగ్రేట్రం చేశారు. ఆయనకు కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. తమీరా దర్శకుడు కె బాలచందర్, భారతీరాజా వంటి దిగ్గజ దర్శకులు వద్ద పనిచేశారు. ఆయన మొదటి సారిగా తెరకెక్కించిన రెట్టైసుజి మూవీ విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. I went back to this song today and realised that every word and essence in this song is reminding me of #Thamira sir's. I'm sad yet I'm sure he is watching over us with Hope. Let's promise to make this world a better place! https://t.co/lMnyLBgegV pic.twitter.com/FWQLlYFspX — Ghibran (@GhibranOfficial) April 27, 2021 చదవండి: నాని మూవీకి హ్యాండ్ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్ వాయిదా! Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్, హీరోగా బండ్ల గణేశ్ -
'పక్కన ఉండుంటే సూసైడ్ చేసుకోనిచ్చేవాడిని కాదు'
చెన్నై: తమిళ రియాలిటీ షో డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వానవిల్ సూపర్ స్టార్స్ షో డైరెక్టర్ దేవ్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మలేషియాలో స్థిరపడిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది నెలల క్రితం భారత పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న తనకు చెన్నైలోని తన నివాసంలో దేవ్ మంచి ఆతిథ్యమిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. దేవ్‌తో వుండివుంటే ఆత్మహత్య ఆలోచనలనే రానిచ్చేవాడిని కాదని, ప్రాణం తీసుకోకుండా అడ్డుకునేవాడిని అన్నాడు. కాగా దేవ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. துக்க செய்தி இங்கு 'Super Singer' போல மலேஷியாவில் Astro channel-ல் 'வானவில் சூப்பர் ஸ்டார்' என்றொரு நிகழ்ச்சி... Posted by James Vasanthan on Saturday, 24 April 2021 చదవండి: మరోసారి ఆ డైరెక్టర్‌తో జతకట్టనున్న ధనుష్ అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే? -
ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం
సాక్షి, చెన్నై: తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జననాథన్ సోదరి లక్ష్మి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ (మార్చి ,14న) అకాల మరణంతో షాక్‌లో ఉన్న వారి కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత) లక్ష్మి హఠాన్మరణంపై మూవీ ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా 'లాభం' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జననాథన్ తీవ్ర అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. -
దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్!
తెర మీద హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. తెర వెనుక కూడా చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమలో పడతారు. అయితే కొన్నిసార్లు దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమపాఠాలు చెప్పుకుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 2017లో నటించిన 'ఆక్సిజన్' సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. ఇక ఈ వార్తలపై అను ఇమ్మాన్యుయేల్ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కాగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడే ఈ జ్యోతి కృష్ణ. అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికి వస్తే.. 'యాక్షన్ హీరో బైజు' చిత్రంతో హీరోయిన్గా అడుగు పెట్టిందీ బ్యూటీ. ఇది మలయాళ సినిమా అయినప్పటికీ అనుకు ఆఫర్లు వచ్చింది మాత్రం తెలుగులోనే. అలా టాలీవుడ్లో తొలి చిత్రం 'మజ్ను'లో నాని సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్టవ్వలేదు. ఇక 'శైలజా రెడ్డి' అల్లుడు తర్వాత ఇక్కడ పూర్తిగా స్లో అయిన అను ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్'లో నటించింది. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కోలీవుడ్‌లోనూ రెండు, మూడు సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న 'మహాసముద్రం'లో ఓ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి! చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’.. -
నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు
తమిళ దర్శకుడు దేసింగ్ పెరియసామి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, కాస్ట్యూమ్ డిజైనర్ నిరంజని అగత్యాన్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిరంజని అక్క భర్త, ఫిల్మ్‌మేకర్ తిరు ధృవీకరించాడు. ఈ మేరకు ఓ పెళ్లి పత్రికను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. పాండిచ్చేరిలో ఫిబ్రవరి 25న పెళ్లి జరగనున్నట్లు డైరెక్టర్ దేసింగ్ పేర్కొన్నారు. (చదవండి: ఘనంగా మలయాళ నటి, ట్రాన్స్ వుమెన్ పెళ్లి) దేసింగ్ పెరియసామి 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తల్' చిత్రం ద్వారా దర్శకుడిగా తెరంగ్రేటం చేశాడు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని, సినిమా అద్భుతంగా ఉందని సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ఇక ఇదే చిత్రంలో ప్రముఖ దర్శకుడు అహాతియాన్ కూతురు నిరంజని అగత్యాన్ కూడా నటించగా.. చిత్రీకరణ సమయంలోనే ఆమెతో దర్శకుడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో వచ్చే నెలలోనే వీళ్లిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇండస్ట్రీ మిత్రుల కోసం చెన్నైలో మరో ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: విషాదం: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య) -
విలన్‌గా మారిన దర్శక నిర్మాత
సినీరంగంలో ఒక శాఖలో పేరు తెచ్చుకున్న వ్యక్తి మరో శాఖలో ప్రవేశించడం సులభమే. అయితే అన్ని శాఖల్లోనూ రాణించడం అంత సులభం కాదు. అలాంటిది పదమ్ కుమార్ మాత్రం ఇందుకు అతీతం అనే చెప్పాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రాహకుడు. అంతేకాకుండా భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత కూడా. అంతకుమించి పదమ్ కుమార్ తండ్రి హెచ్ఎస్.వేణు దివంగత ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణ అందించారు. కాగా పదమ్ కుమార్ కూడా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు చాయాగ్రాహకుడిగా పనిచేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన దక్షిణాది చిత్రాలకు ఈయన నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. అలా 2014లో నాని, వాణీకపూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ఆహా కళ్యాణం పదం కుమార్ నిర్మాణ సారథ్యంలోనే రూపొందింది. అదేవిధంగా తమిళ్లో శింబు, వరలక్ష్మి జంటగా నటించిన పోడాపోడీ చిత్రాన్ని నిర్మించి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈయనే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని మొదటిసారిగా సినిమాకు పరిచయం చేసిన నిర్మాత కూడా పదమ్ కుమార్‌నే. ఈయన కథా రచయిత కూడా. అన్ని శాఖల్లో ప్రావీణ్యం కలిగిన పదమ్ కుమార్ తాజాగా నటుడి అవతారమెత్తారు. ఇటీవల ఓటీటీలో వడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న పావ కథైగళ్ సిరీస్‌లో నిలవ్ పన్న ఉట్రనుమ్ సెగ్మెంట్లో విలన్ పాత్రల్లో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. విశేషమేంటంటే తాను దర్శకుడిగా పరిచయం చేసిన విఘ్నేష్ శివన్నే పదమ్ కుమార్‌ను ఈ సిరీస్ ద్వారా నటుడిగా పరిచయం చేశారు. -
సినీ దర్శకుడు కన్నుమూత
చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో మరో మరణం చోటు చేసుకుంది. కరోనా తదితర సమస్యల కారణంగా ఇప్పటికే పరిశ్రమ పలువురు సినీ ప్రముఖులను కోల్పోయింది. తాజాగా దర్శకుడు బాబు శివన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన వయసు 54 ఏళ్లు. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన ‘వేట్టైక్కారన్’ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. అలాగే విజయ్ హీరోగా ఏవీఎం సంస్థ నిర్మించిన ‘కురివి’ చిత్రానికి సంభాషణలు అందించారు. తదుపరి బుల్లి తెరపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. కాలేయం, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాబు శివన్ వైద్యం ఫలించక బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు శివన్ మృతితో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. (చదవండి: లెజెండరీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్) -
మరోసారి తమిళదర్శకుడితో మహేష్‌బాబు!
ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల విషయంలో అంతగా ప్రయోగాలు చేయడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో చేసిన ప్రయోగాలు దెబ్బ కొట్టడంతో ఆయన చాలా వరకు సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం మహేష్‌బాబు పరశురామ్ దర్శకత్వంలో కమర్షియల్ ఫార్మాట్ లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ సరసన నటించనుంది. మహేష్ బాబు దర్శకులను ఎంతగానో నమ్ముతాడు. డైరెక్టర్లు ఏది చెబితే అది చేస్తాను అని మహేష్ చాలా సందర్భాలలో చెప్పారు. తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు స్పైడర్ అనే భారీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్‌గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు ఇప్పుడు మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజుతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే తన అభిరుచికి తగినట్టుగా కాకుండా ప్రేక్షకులకు నచ్చే కథలనే ఎంచుకొని సినిమాలను చేస్తానని చెప్పిన మహేష్‌బాబు ఈసారి ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారో తెలియాల్సి ఉంది. చదవండి: ‘రాజకుమారుడు’కి 21 ఏళ్లు.. మహేష్ ట్వీట్ -
నూతన దర్శకుడు కన్నుమూత
చెన్నై: తమిళ నూతన దర్శకుడు బాలమిత్ర గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఆయన కన్నుమూశారు. కాగా బాలమిత్ర లాక్‌డౌన్‌కు ముందు "ఉడుక్కై" చిత్రం తెరకెక్కించాడు. ఈ సినిమాతో వెండితెరపై దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నది అతని కల. షూటింగ్ దాదాపుగా పూర్తైన ఈ చిత్రం కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం షూటింగ్స్ సహా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. (హీరో అజిత్‌కు ఏమైంది? ) దీంతో అతను తన 'ఉడుక్కి' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇంతలోనే ఆయన మరణించడం చిత్రబృందానికి తీరని విషాదాన్ని నింపింది. 'ఉడుక్కై' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి సంజనా సింగ్ ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. "ఒక మంచి వ్యక్తి ఇంత త్వరగా లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు. బాలమిత్రకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. (వడివేలు స్నేహాన్ని వదలుకోను) -
యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్
చెన్నై : యువ దర్శకుడు అరుణ్ ప్రసాత్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న అరుణ్‌ను.. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని మెట్టుపాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అరుణ్.. జీవీ ప్రకాష్ కుమార్, గాయత్రి సురేష్, సురేష్ మీనన్, సతీష్ ముఖ్య పాత్రల్లో 4 జీ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే సీవీ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు కారణాలతో ఇప్పటివరకు విడుదల కాలేదు. అరుణ్ ఆకస్మిక మరణం కోలివుడ్లో విషాదం నెలకొంది. పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అరుణ్ మృతిపై దర్శకుడు శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. యువదర్శకుడు, తన మాజీ అసిస్టెంట్ అరుణ్ ఆకస్మిక మరణం.. తనను కలిచివేసిందని చెప్పారు. అరుణ్ మృదు స్వభావి అని, పాజిటివ్ థింకింగ్‌తో కష్టపడుతూ ముందుకు సాగేవాడని గుర్తుచేసుకున్నారు. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హీరో జీవీ ప్రకాష్, హాస్యనటుడు మనోబాలా కూడా అరుణ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. (చదవండి : అనసూయను అభినందించిన రాచకొండ పోలీసులు) Heartbroken by the sudden demise of the young director and my ex-assistant, Arun. You were always sweet, positive and hardworking. My prayers are forever with you and my deepest condolences to your family and friends.🙏 pic.twitter.com/ZA6kvfcYLj — Shankar Shanmugham (@shankarshanmugh) May 15, 2020 -
నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్
సాక్షి, పెరంబూరు(చెన్నై): మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో గానీ, తాజాగా తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కే.భాగ్యరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఒక సినీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సూది తావివ్వకపోతే దారం అందులోకి పోలేదని అంటారన్నారు. ఆ విధంగా స్త్రీలు అవకాశం ఇవ్వడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి మహిళలు జాగరూకతతో ఉండాలన్నారు. ఈ విషయంలో మగవారిని తప్పు పట్టడం సరికాదన్నారు. మగవారు తప్పు చేస్తే కాలానుగుణంగా సమసిపోతుందన్నారు. అదే ఆడది తప్పు చేస్తే అది చాలా చేటుకు దారి తీస్తుందన్నారు. అందువల్ల మహిళలు కట్టుబాట్లు విధించుకోవాలని అన్నారు. ఇప్పుడు మోబైల్ఫోన్ల అభివృద్ధి కారణంగా మహిళలు ఎక్కడికో వెళ్లిపోతున్నారనీ, అందువల్ల తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటనలో మగవారిని మాత్రమే తప్పు పట్టలేమన్నారు. మహిళల బలహీనతను మగవారు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మగవారిది తప్పు అయితే అందుకు అవకాశం కల్పించిన మహిళలదీ తప్పే అవుతుందని అన్నారు. అలా మహిళలందరినీ కించపరచేలా మాట్లాడిన కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు కళైసెల్వి చెన్నై పోలీస్ కార్యాలయంలో గురువారం చేసిన పిర్యాదులో పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్ ఈ వ్యవహారంపై దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆయన ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అత్యాచారాలు హద్దు మీరుతున్న సంఘటనల్లో ఆడ, మగ ఇద్దరిదీ తప్పు ఉంటుందని, అలాంటి సమయాల్లో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదనే రీతిలో తాను మాట్లాడానని చెప్పారు. ఉదాహరణకు ఒక సినిమాలోనో, సీరియల్లోనో సీరియస్‌గా మనసుగా ఆవేదన కలిగించే సన్నివేశం ఉంటే దాన్ని రాసిన రచయితను ఎవరూ తిట్టరని, తెరపై కనిపించే కథా పాత్రలనే తిట్టిపోస్తారని అన్నారు. మన సమాజంలో స్త్రీలను దైవంగా భావిస్తారన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యలకు ఆస్కారం ఉండదన్న భావంతోనే తాను మాట్లాడానని చెప్పారు. తన కాలంలో మహిళలకు ఉండే కట్టుబాట్లు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడు వారికి సాంకేతికపరమైన అభివృద్ధితో అన్ని రకాలుగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభిస్తున్నాయని అన్నారు. పురుషాధిక్యం, స్వేచ్ఛ అంటూ మహిళలు మద్యం చేవించడం, పొగతాగడం వంటి చెడు అలవాట్లతో కట్టుబాట్లను వీరడం బాధనిపిస్తోందన్నారు. అదేవిధంగా స్త్రీలు తప్పుదారి పట్టడంతో అది వారినే కాకుండా వారి కుటుంబాలను బాధిస్తుందన్నారు. కాబట్టి తప్పు జరగడానికి మహిళలు కారణం అన్నాను కానీ, మహిళలు మాత్రమే కారణం అని అనలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వ్యతిరేకతకు కారణం అనీ, దీన్ని సరిగా అర్థం చేసుకున్న పలువురు దర్శకులు నిజాన్ని ధైర్యంగా చెప్పావంటూ తనను అభినందిస్తున్నారని కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. -
మహిళలపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్లో ఉంటున్నారు.. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరుపారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు.. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదు అని అన్నారు. అంతేకాదు తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో బాలురుపైన మాత్రమే నిందలు వేయడం సరికాదని వ్యాఖ్యానించాడు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయన్నారు. మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించు కొచ్చిన ఆయన ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిదిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పురుషుడికి చిన్నిల్లు (రెండవ భార్య) వుంటే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఆమెకు డబ్బు, ఆస్తి లభించడంతో పాటూ, మొదటి భార్యకు ఏ కష్టం కలగదు. కానీ ఒక మహిళకు కల్లా కదలన్ (రహస్య ప్రేమికుడు) వుంటే భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. రోజూ దినపత్రికల్లో వస్తున్న కేసులను ఈ సందర్భంగా ఉదాహరిస్తూ.. మహిళలు పరిమితుల్లో ఉండాలని సూచించారు. తాను ఉమ్మడి కుటుంబం నుండి వచ్చినందున, తన సినిమాల్లో ‘తెలియకుండానే’ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పుకొచ్చిన భాగ్యరాజా, ‘ఉసి ఇడామ్ కుదుతా థాన్ నూల్ నుజాయ ముడియం’ మహిళల పట్ల తీవ్ర అవమానకరమైన తమిళ సామెతను ఉటంకిస్తూ, అత్యాచారాలకు మహిళలదే తప్పు అన్నట్టుగా రెచ్చిపోయారు. కాగా ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమంలో చెలరేగిన ఆరోపణలతో తమిళ చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. తాజాగా భాగ్యరాజ్ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపనున్నాయి. ‘కరుతుకలై పాతివు సీ’ సినిమా సోషల్ మీడియా ద్వారా ఒక మహిళపై లైంగిక దాడులు (పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు ఆధారంగా) అనే కథాంశంతో కూడుకున్నది కావడం గమనార్హం. కాగా తమిళ రియాలిటీ షో బిగ్ బాస్-3 పార్టిసిపెంట్, ఫెమినిస్టు మోడల్ మీరా మిథున్, కస్తూరి రాజా, ఎస్ వె శేఖర్, నటుడు-సినిమాటోగ్రాఫర్ నటరాజ్, సంగీత దర్శకుడు ధీనా వంటి ప్రముఖులు ఈ వేదికపై ఉండగా భాగ్యరాజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వారు మౌన ప్రేక్షకులుగా ఉండడం మరింత బాధాకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
దర్శకుడు మహేంద్రన్ కన్నుమూత
కోలీవుడ్ సినీదర్శక దిగ్గజాల్లో ఒకరైన జె. మహేంద్రన్ మంగళవారం కన్నుమూశారు. నటుడు కూడా అయిన మహేంద్రన్ గతనెల విడుదలైన తమిళ చిత్రం ‘బూమరాంగ్’లో ఓ పాత్ర చేశారు. అలా కొన్ని చిత్రాల్లో నటించిన మహేంద్రన్ ఆనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 79 ఏళ్లు. నటుడు కమలహాసన్ ప్రోత్సాహంతో దర్శకుడయిన ఈయన రజనీకాంత్‌లోని నటుడిని వెలికి తీసిన దర్శకుడిగా వాసికెక్కారు. తమిⶠసినిమా గర్వించదగ్గ చిత్రాలను రూపొందించిన దర్శకుడు మహేంద్రన్. దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మెచ్చిప దర్శకుడీయన. ఆయన ప్రోత్సాహంతోనే సినీ రంగప్రవేశం చేసిన మహేంద్రన్ స్వగ్రామం శివగంగై జిల్లాలోని ఇళైయాన్గుడి. ఈయన అసలు పేరు జే. అలెగ్జాండర్. 1939 జూలై 25న జోసఫ్ సెల్లయ్య,మనోన్మణి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత ఊరులోనే అభ్యసించిన ఈయన ఉన్నత చదువును మధురైలోని అమెరికన్ కళాశాలలో చదివారు. కారైక్కుడిలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ కళాశాల వార్షికోత్సవ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజీఆర్ హాజరయ్యారు. ఆ వేదికపై మహేంద్రన్ వాక్చాతుర్యాన్ని, పత్రిభను ఎంజీఆర్ ప్రశంసించారు. ఆ తరువాత న్యాయవాది కోర్స్ చేయడానికి చెన్నై వెళ్లారు మహేంద్రన్. అయితే అది పూర్తి చేయకుండానే ‘ఇళముళక్కమ్’ అనే సినిమా పత్రికలో విమర్శకుడిగా చేరారు. కాగా సినిమాలకు దూరంగా ఉన్న ఎంజీఆర్ మళ్లీ నటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మహేంద్రన్ వెళ్లారు. అప్పుడు ఎంజీఆర్ ఆయన్ని గమనించి లాయడ్స్ రోడ్డులో గల తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మహేంద్రన్ ఆయన ఇంటికి వెళ్లగా తాను నటించాలని ఆశించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను ఇచ్చి దానికి కథనాన్ని తయారు చేయమని పురమాయించారు. ఆ తర్వాత తన నాటక సంఘం కోసం దాన్ని నాటకంగా తీర్చిదిద్దమని చెప్పడంతో అదీ సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అవి రెండూ జరగలేదు. ఆ తరువాత మహేంద్రన్ ఎంజీఆర్ ద్వారా బాలన్ మూవీస్ సంస్థ అధినేత నిర్మించిన ‘నామ్ మూవర్’చిత్రానికి కథను అందించారు. అందులో జయశంకర్, రవిచంద్రన్, నాగేశ్‌లు నటించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో మహేంద్రన్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ‘శభాష్ తంబి, పణక్కార పిళ్లై, నిరైకుడమ్, తిరుడి, తంగపతకం, ఆడుపులి ఆట్టం వంటి పలు చిత్రాలకు కథ, కథనాలను అందించారు. మహేంద్రన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ముల్లుమ్ మలరుమ్’. రజనీకాంత్, శరత్‌బాబు, పటాఫట్ జయలక్ష్మీ, శోభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. రజనీకాంత్‌ను నటుడిగా కొత్త మలుపు తిప్పిన చిత్రం ‘ముల్లుమ్ మలరుమ్’. ఆ తరువాత ‘ఉదిరిపూక్కళ్, పూట్టాద పూట్టుగళ్, జానీ, నెంజల్తై కిల్లాదే, మెట్టి, నండు, కన్నుక్కు మై ఎళుదు, అళగియ కన్నే, కై కొడుక్కుమ్ కై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1992లో తెరకెక్కించిన ‘ఊర్ పంజాయత్తు’ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న మహేంద్రన్ ‘కలైజ్ఞర్’ (1999) అనే చిత్రానికి రచయితగా వ్యవహరించారు. మళ్లీ సినిమాలకు దూరమైన ఆయన 2004లో ‘కామరాజ్’ అనే చిత్రంలో నటుడిగా కనిపించారు. 2006లో తీసిన ‘సాసనం’ దర్శకుడిగా మహేంద్రన్‌కి చివరి సినిమా. విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ చిత్రంలో ఓ పాత్ర చేసిన ఆయన రజనీకాంత్ ‘పేటా’లో కూడా నటించారు. ‘కాటమరాయుడు’ చిత్రంలోనూ నటించారు మహేంద్రన్. ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ తెలుగు చిత్రం ‘ప్రేమించేది ఎందుకమ్మా’కి దర్శకత్వం వహించడంతో పాటు దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్‌తో ‘నీతో’ చిత్రం తెరకెక్కించారు. మహేంద్రన్ మరణంతో తమిళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మహేంద్రన్ భౌతికకాయాన్ని సందర్శించి రజనీకాంత్ కన్నీటి పర్యంతమయ్యారు. రజనీకాంత్‌తో ‘ముళ్లుమ్ మలరుమ్’ తర్వాత కాళీ, జానీ, కై కొడుక్కుమ్ కై వంటి సినిమాలు తీశారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, కె.భాగ్యరాజా, సంగీతదర్శకుడు ఇళయరాజా, డీఎంకే నేత స్టాలిన్ తదితర సినీ, రాజకీయ రంగ ప్రముఖులు మహేంద్రన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. – బి.నాగేశ్వరరావు, సాక్షి, చెన్నై -
లెజెండరీ డైరెక్టర్ ఇకలేరు
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు జె. మహేంద్రన్(79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు. మహేంద్రన్ తమిళంలో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శంకర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ముల్లుమ్ మలరుమ్, జానీ, నెంజతై కిల్లాడే చిత్రాలు మహేంద్రన్‌కి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. రజనీకాంత్‌కు ఎక్కువ గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఈయన ఒకరు. నటుడిగాను పలు చిత్రాలలో నటించిన ఆయన ఇటీవలే విజయ్ సేతుపతి సీతాకాతి, రజనీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాలలో కనిపించారు. 2018లో ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్ రెండు సార్లు జాతీయ అవర్డును అందుకున్నారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌కి గురయింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
డైరెక్షన్ మారుతోంది
టాలీవుడ్‌కి దిగుమతి జోరు పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్లు, విలన్లు ఇక్కడ హల్చల్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కూడా వస్తున్నారు. ఈ ఏడాది డైరెక్టర్లు కూడా వచ్చారు. గతంలోనూ పరభాషల దర్శకులు తెలుగు సినిమాలు చేశారు కదా? అనుకోవచ్చు. అయితే ఒకే ఏడాదిలో నలుగురైదుగురు వేరే భాషల దర్శకులు వచ్చిన దాఖలాలు తక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకూ ముగ్గురు నలు గురు పరభాష దర్శకులు వస్తే వచ్చే ఏడాది కూడా ఆ నంబర్ కంటిన్యూ కానుంది. చెప్పాలంటే ఎక్కువ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. సొంత భాష నుంచి పరభాషకు డైరె క్షన్ మార్చుతున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం... అట్లీ ఖాయం ‘రాజా రాణి, తేరి (తెలుగులో పోలీసోడు) మెర్సెల్ (తెలుగులో అదిరింది) చిత్రాలు సూపర్ హిట్. ఈ మూడు హిట్స్‌తో తమిళ దర్శకుడు అట్లీ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడీయన మళ్లీ విజయ్‌తోనే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన ‘మెర్సెల్’ బంపర్ హిట్ కాబట్టి తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాది అట్లీ మన తెలుగు ఇండస్ట్రీకి వస్తారు. ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని టాక్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ మధ్య ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. అట్లీతో కూడా ఓ సినిమా ఉందన్నారాయన. దీంతో ఎన్టీఆర్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్ ఒక కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా వచ్చే ఏడాది చివరికి ఓ కొలిక్కి వస్తుంది కాబట్టి 2020 స్టార్టింగ్‌లో ఎన్టీఆర్–అట్లీ–అశ్వనీదత్ సినిమా స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాకి అట్లీ దర్శకుడు కాకపోతే ఎలానూ నిర్మాత అశ్వనీదత్ ఈ దర్శకుడితో ఓ సినిమా అన్నారు కాబట్టి అట్లీ రావడం ఖాయం. కోలీ అర్జున్ హీరో అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. త్రివిక్రమ్, విక్రమ్ కె. కుమార్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా అధికారికంగా ఏ దర్శకుడి పేరు ఫిక్స్ కాలేదు. అయితే తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తమిళంలో ‘వేదాలం, వీరమ్, వివేగమ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఇటీవల కొన్ని గాసిప్‌లు వినిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రానికి లింగుస్వామి దర్శకుడని చెప్పలేం కానీ ఫ్యూచర్లో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. మల్లూ అర్జున్ అంటారు. ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడితో చేసి, ‘కోలీ అర్జున్’ అని కూడా అనిపించుకుంటారేమో. రానా రౌండప్ ‘బాహుబలి’ సినిమా తర్వాత రానా క్రేజ్ డబుల్ ట్రిపుల్ అయ్యింది. అందుకే పరభాష డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్ సత్యశివ, ప్రభు సాల్మన్ దర్శకత్వాల్లో రూపొందుతున్న ‘మడైతిరందు, కాడన్’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు రానా. మలయాళ దర్శకుడు కె.మధు దర్శకత్వంలో ఆయన హీరోగా ‘అంజామ్ తిరునాళ్ మార్తాండ వర్మ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపొందిన ‘హౌస్‌ఫుల్ 4 సినిమాలో రానా ఓ కీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా అన్ని ఇండస్ట్రీల సినిమాలతో రానా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. ఇలా అన్ని భాషల దర్శకులు రానాని రౌండప్ చేస్తున్నారు. అన్నట్లు రానా పరభాషల్లో నటిస్తున్న చిత్రాల్లో ఏకకాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నవి ఉన్నాయి. ఆ రకంగా ఆ దర్శకులు మన భాషకు వస్తున్నట్లే కదా. కోలీ అసోసియేట్.. టాలీలో డైరెక్టర్ ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘పంతం’ సినిమాతో పాతిక చిత్రాలను కంప్లీట్ చేశారు గోపీచంద్. ఇప్పుడాయన నెక్ట్స్ సినిమాను బిన్ను సుబ్రహ్మణ్యం అనే కొత్త తమిళ దర్శకుడు తెరకెక్కించనున్నారని సమాచారం. కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మోహన్‌రాజా (‘తని ఒరువన్’ మూవీ ఫేమ్) దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేశారట బిన్ను సుబ్రహ్మణ్యం. దర్శకుడిగా తొలి అడుగుని తెలుగులో వేయనున్నారన్న మాట. తెలుగులో ముద్ర కోసం... స్టెప్ బై స్టెప్ కెరీర్లో ఎదుగుతున్నారు హీరో నిఖిల్. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’. తమిళంలో రూపొందిన ‘కణిదన్’ చిత్రానికిది రీమేక్. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి హాయ్ చెప్పనున్నారు. తెలుగులో తనదైన ముద్ర వేసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ వచ్చేశారహో గతంలో పలువురు పరభాషల దర్శకులు తెలుగు తెరపై సినిమా చూపించారు. కె. బాలచందర్, పి. వాసు, సురేష్‌కృష్ణ, ఉదయ్‌కుమార్, కె.యస్. రవికుమార్, కరుణాకరన్, రాధామోహన్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, వంటి దర్శకులు తెలుగులో సినిమాలు తెరకెక్కించారు. ఆ తర్వాత మురుగదాస్, రీసెంట్ టైమ్స్‌లో ‘ఇష్క్, మనం, 24’ సినిమాలతో విక్రమ్ కె.కుమార్ టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇక ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయ్యారు. రానా, విజయ్ దేవరకొండ, నిఖిల్, ఎన్టీఆర్ దీంతో కోలీవుడ్ నుంచి కబురొచ్చింది విజయ్‌కి. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘నోటా’ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చాయనే టాక్ కూడా వినిపించినప్పటీకీ ఆ వెంటనే ‘టాక్సీవాలా’ సక్సెస్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు విజయ్. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్లో సమంతకు ఎంత పాపులారిటీ ఉందో కోలీవుడ్‌లోనూ దాదాపు అంతే ఉంది. ఈ ఏడాది ఆమె ‘యు–టర్న్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా పవన్ కుమార్ అనే కన్నడ దర్శకుడు టాలీవుడ్‌కి వచ్చారు. కన్నడ ‘యు–టర్న్’ను సేమ్ టైటిల్‌తో తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘హమ్‌తుమ్, ఫనా, ఫిర్ సే’ వంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకుడు కునాల్ కోహ్లీ. ప్రజెంట్ థియేటర్స్‌లో ఆడుతున్న ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాకు ఆయనే దర్శకుడు. ఇలా మరికొంతమంది పరభాష దర్శకులు తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్. తెలుగు ఇండస్ట్రీది విశాల హృదయం. ఎవరు వచ్చినా అవకాశం ఇచ్చేస్తుంది. అందుకనే మన భాషలో పరభాషల హీరోయిన్లు, విలన్లు, ఇప్పుడు దర్శకుల జోరు కూడా మొదలైంది. కొందరు ఏకకాలంలో ద్విభాషా చిత్రాలు చేస్తూ.. ఆ విధంగా సొంత భాషకు దగ్గరగా ఉంటూనే పరభాషకు కూడా దగ్గరవుతున్నారు. -
దర్శకుడి అనుమానాస్పద మృతి
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు సీ శివకుమార్(46) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విరుగుమ్బాక్కంలోని శివకుమార్ ఇంటికి రెండు రోజులుగా తాళం వేసి ఉండటం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ ఇంటికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివకుమార్ మృతిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా కె. భాగ్యరాజా వంటి పలువురు ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శివకుమార్ ‘ఆయుధ పూజై’ సినిమాతో దర్శకుడిగా మారారు. అజిత్, అర్జున్ వంటి పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలు రూపొందించిన శివకుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే కావాలని ఉంది: డైరెక్టర్
సాక్షి, చెన్నై: దర్శకుడు పేరరసు ఎమ్మెల్యే కావాలని ఆశ పడుతున్నారట. కళాకారులను ప్రోత్సహించే విధంగా 2017 రైజింగ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవల స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. భాస్కర్ మీడియా, ఆర్కేవీ ఫిలింఇన్స్టిట్యూట్, ఇండియన్ క్లాసిక్ అండ్ కల్చరల్ ట్రస్ట్, ఆరోగ్య ఇనిప్పు తులసీ చారు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, ఆర్వీ.ఉదయకుమార్, జాగ్వర్‌తంగం, పవర్‌స్టార్ శ్రీనివాసన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2017లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ పరిచయ కథానాయకుడి అవార్డును నందన్ (పళ్లిపరువత్తిలే), ఉత్తమ పరిచయ కథానాయకి అవార్డును అతిథిబాలన్ (అరువి), ఉత్తమ పరిచయ దర్శకుడు – అరుణ్‌ప్రభు పురుషోత్తమన్ (అరువి), ఉత్తమ ప్రతినాయకుడు –డేనియల్ బాలాజీ (ఇప్పడై వెల్లుమ్), ఉత్తమ కథారచయిత – గోపీనైనార్ (అరమ్), ఉత్తమ దర్శకుడు – జిప్సీరాజ్కుమార్ (అయ్యనార్ వీధి) ఉత్తమ సంగీతదర్శకుడు–శ్యామ్ సీఎస్ (ఇరుదుచుట్రు) అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ 2017లో చిన్నచిత్రాలే పెద్ద విజయాలను సాధించాయన్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు. రైజింగ్ స్టార్ అవార్డులను అందుకున్న కళాకారులందరికీ అభినందలు తెలుపుతున్నానన్నారు. ఈ రోజుల్లో దర్శకత్వం కంటే నటనే బెటర్ అనిపిస్తోందన్నారు. దర్శకత్వంతో గౌరవం లభించడం లేదన్నారు. ఇకపై తానూ నటనపై దృష్టి సారించాలనుకుంటున్నానని అన్నారు. తద్వారా కనీసం ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నానని దర్శకుడు పేరరసు ఈ సందర్భంగా అన్నారు. -
ప్రముఖ దర్శక,నిర్మాత ఆత్మహత్య
ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా బెదిరిస్తుండటమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది. మరోవైపు అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పదించిన హీరో సిద్ధార్థ్ ' ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది. తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం'. అంటూ ట్వీట్ చేశారు. Very painful to hear of a young man's death because of financial pressure. Tamil Cinema is full of such debt, but all the world sees are the lies of success and fame. The entire system needs overhaul. Farmer or film maker, suicide is a curse. Condolences to Sasikumar and family. — Siddharth (@Actor_Siddharth) 22 November 2017 -
వర్థమాన సినీ దర్శకుడు మృతి
చెన్నై: కోలీవుడ్ వర్థమాన సినీ దర్శకుడు కన్నన్ రంగస్వామి (27) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తమిళంలో గత మార్చిలో విడుదలైన ‘దాయం’ చిత్రంకు కన్నన్ రంగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రంలో కొత్తవారిని నటీనటులుగా పరిచయం చేశారు. కాగా కన్నన్ రంగస్వామి గతవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై వడపళణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్నన్ రంగస్వామి తుదిశ్వాస విడిచారు. దాయం చిత్ర సంగీత దర్శకుడు సతీష్ సెల్వం దర్శకుని మృతదేహానికి అంజలి ఘటించారు. -
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
కేకే నగర్(చెన్నై): ప్రముఖ సినీ దర్శకుడు ఎన్కే.విశ్వనాథన్(75) మంగళవారం రాత్రి 7.30 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు నటులు కమలహాసన్, సత్యరాజ్, పాండ్యరాజన్, సంగిలి మురుగన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి సహా పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. చట్టం ఎన్ కైయిల్, కడల్ మీన్‌గల్, మీన్‌డుం కోకిల, సగాదేవన్ మగాదేవన్ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఎన్‌కె.విశ్వనాథన్, తరువాత విజయకాంత్ నటించిన పెరియమరుదు, నమితం, వడివేలు నటించిన జగన్మోహిని, రామ్‌కి, నిరోషా నటించిన ఇనైంద కైగల్ వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి బుధవారం పోరూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి డీఎండీకే నేత విజయకాంత్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
తమిళ స్టార్ డైరెక్టర్ మృతి
తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.సుభాష్ బుధవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు. 1987లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నాయగన్( తెలుగులో నాయకుడు) సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంబించిన సుభాష్, 1988లో ప్రభు హీరోగా తెరకెక్కిన కలియుగం సినిమాతో దర్శకుడిగా మారారు. 1990లో విజయ్‌కాంత్ హీరోగా తెరకెక్కిన శత్రియనా ఆయనకు స్టార్ ఇమేజ్ను తీసుకువచ్చింది.తన కెరీర్లో 20 సినిమాలకు దర్శకత్వం వహించిన సుభాష్, చివరగా బాలీవుడ్లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో ఇన్సాన్ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాక సండే, ఎంటర్టైన్మెంట్, హౌస్‌ఫుల్ 3, చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు.