డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ పార్థిబన్. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే ఈయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగానూ సుపరిచితులే. భారతి కన్నమ్మ (తమిళ) సినిమాకు ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారం అందుకున్నాడు. యుగానికి ఒక్కడు మూవీలో చోళరాజుగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నాడు.
కొత్త సినిమా
రచ్చ, పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. పుదియ పాదై, హౌస్‌ఫుల్, ఇవన్, విటగన్, ఒత్త సెరుప్పు సైజ్ 7, ఇరవిన్ నిడల్ సినిమాలతో దర్శకనిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం టీన్జ్. ఈ మూవీలో పార్థిబన్ కీలక పాత్రలో నటించగా ఆయన కుమార్తె కీర్తన క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసింది. జూలై 12న తమిళనాట రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా పార్థిబన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా
'ఫ్రెండ్స్.. టీన్జ్ సినిమాకు పిల్లలు, కుటుంబాల నుంచి మంచి స్పందన రాకపోతే నా ఊపిరిగా భావించిన సినిమాను వదిలేద్దామనుకున్నాను. ఇండస్ట్రీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్నాను. కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సినిమాను ఆదరిస్తున్నారు. థాంక్యూ' అని ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేయడం గమనార్హం.
The wait is over!
TEENZ from Today in cinemas worldwide@rparthiepan@immancomposer@dopgavemic@k33rthana@GenauRanjith@lramachandran@AdithyarkM
@Iam_Nithyashree@shreyaghoshal@Arivubeing@iYogiBabu@onlynikil@j_prabaahar@shrutihaasan@CVelnambi@teenzmovieoffl… pic.twitter.com/F0hbYzxCaH— Radhakrishnan Parthiban (@rparthiepan) July 12, 2024
చదవండి: ఆ సినిమా చేస్తే కెరీర్ ముగిసినట్లేనని వార్నింగ్.. అయినా వినలేదు!
Comments
Please login to add a commentAdd a comment