కొన్ని పాత్రలు కత్తి మీద సాములా ఉంటాయి. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎక్కడైనా తేడా వచ్చిందో.. మొత్తం కెరీరే దిక్కుతోచని పరిస్థితిలో పడుతుంది. అయినా సరే కొందరు తారలు ధైర్యం చేసి మరీ అటువంటి పాత్రలు చేస్తుంటారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా అంతే!
నెగెటివ్ క్యారెక్టర్
2010లో వచ్చిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' సినిమాలో షోయబ్ ఖాన్ పాత్ర... ఇది గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఈ మూవీ ఆఫర్ చేయగానే ఇమ్రాన్ వెంటనే ఓకే చెప్పేశాడు. కానీ అతడి బంధువు, డైరెక్టర్ మహేశ్ భట్ మాత్రం రిస్కు అవసరమా? అని హెచ్చరించాడు. అదొక నెగెటివ్ క్యారెక్టర్ అని.. ఆలోచించుకోమని సూచించాడు.
రిస్కు తప్పదు
ఈ విషయాన్ని ఇమ్రాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'షోయబ్ పాత్రలో నటిస్తే నా కెరీర్ ఖతమవుతుందని మహేశ్ హెచ్చరించాడు. అయినా ఈ సినిమా చేశాను. తీరా పెద్ద హిట్టయింది. అప్పుడు మహేశ్.. వన్స్ అపాన్ ఎ టైమ్.. చిత్ర దర్శకుడు మిలన్ లుథిరాను పిలిచి తన అంచనా తప్పయిందంటూ క్షమాపణలు చెప్పాడు. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ చూస్తాం' అని పేర్కొన్నాడు.
చదవండి: శివకార్తికేయన్ కుమారుడి బారసాల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment