mahesh bhatt
-
గ్లామర్ హీరోయిన్.. మతిస్థిమితం కోల్పోయి.. చివరి రోజుల్లో తిండి మానేసి..
అందంతో కట్టిపడేసింది. నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అందచందాలకు జనాలే కాదు సినీఇండస్ట్రీ దాసోహమైంది. తనతో పరిచయం పెంచుకోవాలని చూసినవారు కొందరైతే ప్రేమాయణం నడిపినవారు మరికొందరు. కానీ ఏ ప్రేమా పెళ్లిదాకా వెళ్లలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్స్‌తోనే సావాసం చేసింది. ఆఖరి రోజుల్లో మానసిక స్థితి సరిగా లేక.. అనారోగ్యంతో కన్నుమూసింది. వెండితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన ఆవిడ పేరు పర్వీన్ బాబి. నేడు (జనవరి 20) ఆమె ఇరవయ్యవ వర్ధంతి. ఈ సందర్భంగా తనపై ప్రత్యేక కథనం..పద్నాలుగేళ్లకు పుట్టిన ఆశాదీపం పర్వీన్పర్వీన్ బాబి (Parveen Babi) గుజరాత్లో పుట్టింది. పెళ్లయిన పద్నాలుగేళ్లకు పర్వీన్ పుట్టడంతో ఆ పేరెంట్స్ సంతోషపడిపోయారు. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా పెంచారు. కానీ తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత తల్లితో ఓ హవేలీలో నివసించింది. సైకాలజీ చదివిన పర్వీన్ మోడలింగ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడి నుంచి సినీపరిశ్రమవైపు అడుగులు వేసింది. క్రికెటర్ సలీమ్ దురానీ సరసన చరిత్ర మూవీలో యాక్ట్ చేసింది. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చింది దర్శకుడు కిశోర్ సాహు. వేశ్యగా నటించిన పర్వీన్తనకు గుర్తింపు ఇచ్చిన ఫస్ట్ మూవీ మజ్బూర్ అయితే సెన్సేషన్ సృష్టించింది మాత్రం దీవార్. ఈ సినిమాలో పర్వీన్.. వేశ్యగా నటించింది. తర్వా అమర్ అక్బర్ ఆంటోని, కాల పత్తర్, సుహాగ్, షాన్, నమక్ హలాల్, ద బర్నింగ్ ట్రైన్.. ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్‌తో ఆరు సినిమాలు చేయగా అన్నీ హిట్లు, సూపర్ హిట్లుగానే నిలవడం విశేషం. ఎక్కువగా మోడ్రన్, గ్లామర్ పాత్రలే వేస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన మొట్టమొదటి బాలీవుడ్ నటిగానూ చరిత్ర సృష్టించింది.ప్రేమ- పెళ్లి?1969లో పాకిస్తాన్‌కు చెందిన దూరపు బంధువుతో ఎంగేజ్మెంట్ జరిగింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆ నిశ్చితార్థం పెళ్లిదాకా రాకుండానే ఆగిపోయింది. తర్వాత నటుడు, విలన్ డేనీ డెంజోంగ్పా(Danny Denzongpa)ను ప్రేమించింది. చిత్రపరిశ్రమ అంతా పర్వీన్ వెంటపడుతుంటే ఆమె మాత్రం డానీ కోసం పరితపించింది. అతడు కూడా పర్వీన్‌ను చూసి ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. కానీ ఇద్దరూ సినిమాలతో బిజీ అవడంతో కాసేపు కలిసుండే సమయం కూడా కరువైంది. దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఫ్రెండ్షిప్ను కొనసాగించారు.(చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?)పెళ్లయిన వ్యక్తితో లవ్అనంతరం నటుడు, వివాహితుడు కబీర్ బేడీ (Kabir Bedi)తో ప్రేమలో పడింది. ఇటాలియన్ సీరియల్ సెట్ వీరి ప్రేమకు పునాది వేసింది. కానీ కబీర్‌కు యూరప్‌లో గ్రాఫ్ పెరగడంతో బాలీవుడ్ రాలేకపోయాడు. అటు పర్వీన్.. తను సంతకం చేసిన సినిమాల కోసం ముంబై తిరిగిరాక తప్పలేదు. రెండేళ్ల లవ్ జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది. గుండె నిండా ఆ బాధ కూరుకుపోయినప్పుడే ఉన్నప్పుడే మహేశ్ భట్ (Mahesh Bhatt) పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం.. స్నేహంగా, ప్రేమగా మారింది. కానీ అప్పటికే మహేశ్‌కు పెళ్లయి కూతురు (పూజా భట్) కూడా ఉంది. పర్వీన్‌కు పిచ్చి అభిమాని అయిన మహేశ్ కుటుంబాన్ని వదిలేశాడు. ఇల్లొదిలేసి పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. మూడేళ్లు కలిసున్నారు.దిగజారిన మానసిక స్థితిఓ రోజు మహేశ్ ఇంటికి వచ్చేసరికి పర్వీన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను చంపడానికి అమితాబ్ ఫ్యాన్‌లో ఏదో డివైజ్ పెట్టాడు అంటూ కత్తి పట్టుకుని నిల్చుంది. అమితాబ్ తనను కిడ్నాప్ చేయించాడంది. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడున్న శంఖంలో బాంబ్ ఉందంటూ అరిచి గోల చేసింది. తనను ఎవరో ఏదో చేస్తారని మంచం కింద దాక్కునేది. తనకు పెట్టే భోజనంలో విషం కలుపుతున్నారని అనుమానించేది. ఎవరైనా ఒక ముద్ద తింటేకానీ ప్లేటు ముట్టేది కాదు. ఇలా రోజురోజుకూ ఆమె మానసిక ఆరోగ్యం దిగజారుతుంటే మహేశ్‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉన్న ఒక్క స్నేహితుడినీ గెంటేసిన హీరోయిన్సైకియాట్రిస్ట్కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. టాబ్లెట్స్‌తో ఫలితం లేకపోవడంతో సినిమా వాతావరణానికి దూరంగా బెంగళూరులో ఉంచారు. అక్కడ ఆమె ఎక్కువరోజులు ఉండలేక ముంబైకి తిరుగుప్రయాణమైంది. డానీ.. తనకు ఏ కాస్త సమయం దొరికినా పర్వీన్ దగ్గరకు వెళ్లి ఆమెను సరదాగా ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఓ రోజు డానీని ఇంట్లోకి రానివ్వలేదు పర్వీన్. నన్ను చంపేందుకు నిన్ను అమితాబ్ పంపాడు కదా.. గెటవుట్ అని అరిచింది. బిగ్‌బీ మనుషులు తనను చంపాలనుకుంటున్నారన్న అనుమానంతో నిద్రాహారాలకు దూరమైంది. ఒంటరిగా..మహేశ్ తన పరిస్థితి చూడలేక ఇంట్లో నుంచి వచ్చేశాడు. భార్యకు దగ్గరయ్యాడు. దీంతో పర్వీన్ ఒంటరిగానే మిగిలిపోయింది. మధుమేహం, కీళ్లనొప్పులతోనూ బాధపడింది. 2005 జనవరి 20న పర్వీన్ (50) చనిపోయింది. ఆ విషయం రెండు మూడు రోజులవరకు ఇరుగుపొరుగుకు కూడా తెలియలేదు. తిండి మానేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్తుంటారు. పర్వీన్ మరణవార్త తెలిసి పరుగెత్తికొచ్చిన మహేశ్ ఆమె అంత్యక్రియలు జరిపించాడు. పర్వీన్ తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమానంగా రాసిచ్చింది.చదవండి:ర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
తండ్రితో వివాదాస్పద ఫోటోషూట్.. హీరోయిన్ ఏమందో తెలుసా?
పిచ్చి ముదిరితే రోకలి తలకి చుట్టుకుంటారు.. నాగరికత ముదిరితే నాన్నని ముద్దెట్టుకుంటారు అన్నట్టుగా ఉంది ఆ హీరోయిన్ శైలి అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ తండ్రి కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకోవడానికి ఓ విలువ ఉంది. మరింత ముందుకెళ్లి బుగ్గ మీద కిస్ చేసినా.. ఆ ముద్దులోనూ ఆప్యాయతనే చూడొచ్చు. కానీ తండ్రీ కూతుర్లు ఏకంగా లిప్‌లాక్ చేసుకుంటే... అందులో ఏం చూడాలి?అప్పట్లో టాప్ లేపిన బ్యూటీఈ విషయాన్ని బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరోయిన్ పూజా భట్ (Pooja Bhatt)ని అడగాలి. దాదాపుగా 3 దశాబ్ధాల క్రితం పూజాభట్ ఓ టాప్ బాలీవుడ్ నటి. దిల్ హై మాంగ్తా నహీ, సడక్... తదితర సినిమాలతో కుర్రకారు కలల బ్యూటీగా వెలిగిపోయింది. ఆ తర్వాత తర్వాత వయసు పెరిగినా రకరకాల పాత్రలతో ఇంకా బాలీవుడ్లో తనదైన సత్తా చాటుతూనే ఉంది. మన టాలీవుడ్ హీరో నాగార్జున సరసన ఈమె జఖ్మ్ అనే బాలీవుడ్ మూవీలో కూడా నటించింది. అయితే 3 దశాబ్దాలకు పూర్వం టీనేజ్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన పూజా భట్ అప్పట్లో మోడ్రన్ అమ్మాయిలకు కదిలే సింబల్‌లా ఉండేది. తండ్రితో ఫోటోషూట్ఆధునిక హీరోయిన్గా అందాల ఆరోబోత మాత్రమే కాదు తెరపై లిప్లాక్స్లోనూ ముందుండేది. దాంతో ఆమెకు మీడియాలో బాగానే ప్రచారం లభించేది. అదే సమయంలో ఈమె తన తండ్రి విఖ్యాత బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ (Mahesh Bhatt) తో కలిసి చేసిన ఓ ఫొటో షూట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫొటో షూట్ చేసి ఊరుకుంటే ఫర్వాలేదు, ఓ మ్యాగ్జైన్ కవర్ పేజీపై ఆ ఫొటో పబ్లిష్ అయింది. తండ్రి మహేష్ భట్, కుమార్తె పూజాభట్ కలిసి పెదాల్ని ముద్దాడుతూ దిగిన ఆ ఫొటో 1990ల నాటి మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రచురించడంతో అనేక మంది భగ్గుమన్నారు. తండ్రీ కూతుర్లను తిట్టిపోశారు.(చదవండి: సరిదిద్దుకోలేని తప్పు చేశా.. మోసం చేశా.. ఇన్నాళ్లకు తెలుసుకున్నా: ఆర్జీవీ)అందులో అసభ్యత లేదుఆమధ్య ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ పూజాభట్ మరోసారి ఆ వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. నాటి 1990 మ్యాగజైన్ కవర్ చుట్టూ అల్లుకున్న వివాదం, గురించి చర్చించింది, మరోసారి తనను తాను సమర్ధించుకున్న పూజాభట్ అందులో ఏ మాత్రం అసభ్యత లేదంటున్నారు. అలాంటి దృశ్యాల్ని కూడా నీచంగా చూసేవాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నీతులు వల్లించేవారు, సంప్రదాయవాదులు... ఆ ఫొటో మీద మండిపడడాన్ని తప్పుబట్టారు. విడ్డూరంగా ఉందితండ్రీకూతుళ్ల అనుబంధం, గురించి అలా మాట్లాడేవాళ్లు ఇలాంటి సందర్భాల్లో కుటుంబ విలువల గురించి చర్చించడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (‘అగర్ లోగ్ బాప్ ఔర్ బేటీ కే రిష్టే కో అలగ్ నజారీయే సే దేఖ్ సక్తే హై తో వో కుచ్ భీ కర్ సక్తే హైం) తండ్రీ కుమార్తెల అనుబంధాన్ని తప్పుడు దృష్టితో చూసేవాళ్లు ఏదైనా చేయగలరు. అలాంటివాళ్లు కుటుంబ విలువల గురించి మాట్లాడడ అద్భుతమైన జోక్‘ అని ఆమె పేర్కొంది. తప్పు కాదా?అయితే అలా చూసే పరిస్థితికి కారణం ఎవరు? అనేది పూజాభట్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆమె చేసింది తప్పుకానట్లయితే మళ్లీ ఇప్పటి దాకా అలాంటి పని మరెవ్వరూ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అనుబంధాల్ని అందంగా ఆవిష్కరించే శక్తి ఉన్న నటీనటుటు...ఆసభ్యంగా మార్చడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే? -
ఆ సినిమా చేస్తే కెరీర్ ముగిసినట్లేనని వార్నింగ్.. అయినా వినలేదు!
కొన్ని పాత్రలు కత్తి మీద సాములా ఉంటాయి. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎక్కడైనా తేడా వచ్చిందో.. మొత్తం కెరీరే దిక్కుతోచని పరిస్థితిలో పడుతుంది. అయినా సరే కొందరు తారలు ధైర్యం చేసి మరీ అటువంటి పాత్రలు చేస్తుంటారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా అంతే!నెగెటివ్ క్యారెక్టర్2010లో వచ్చిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' సినిమాలో షోయబ్ ఖాన్ పాత్ర... ఇది గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఈ మూవీ ఆఫర్ చేయగానే ఇమ్రాన్ వెంటనే ఓకే చెప్పేశాడు. కానీ అతడి బంధువు, డైరెక్టర్ మహేశ్ భట్ మాత్రం రిస్కు అవసరమా? అని హెచ్చరించాడు. అదొక నెగెటివ్ క్యారెక్టర్ అని.. ఆలోచించుకోమని సూచించాడు.రిస్కు తప్పదుఈ విషయాన్ని ఇమ్రాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'షోయబ్ పాత్రలో నటిస్తే నా కెరీర్ ఖతమవుతుందని మహేశ్ హెచ్చరించాడు. అయినా ఈ సినిమా చేశాను. తీరా పెద్ద హిట్టయింది. అప్పుడు మహేశ్.. వన్స్ అపాన్ ఎ టైమ్.. చిత్ర దర్శకుడు మిలన్ లుథిరాను పిలిచి తన అంచనా తప్పయిందంటూ క్షమాపణలు చెప్పాడు. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ చూస్తాం' అని పేర్కొన్నాడు.చదవండి: శివకార్తికేయన్ కుమారుడి బారసాల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
కన్నీళ్లు పెట్టించే సినిమా.. రియల్ లైఫ్‌లో అంతకంటే దారుణం!
ఒక్కగానొక్క కొడుకు.. అతడి మీదే ఆధారపడుతున్న తల్లిదండ్రులు.. న్యూయార్క్‌లో జీవిస్తున్న ఆ కుమారుడిపై ముష్కరులు దాడి చేసి చంపేస్తారు. ఈ విషయం తెలిసి ఆ వృద్ధ దంపతులు కుప్పకూలిపోతారు. అద్దె ఇంటికి మారతారు. కొడుకు అస్థికల కోసం నెలల తరబడి ఎదురుచూస్తారు. చివరకు అతడి అస్థికలు, తను వాడిన వస్తువులు అన్నీ ఇండియాకు వస్తాయి. కానీ అవి ఇవ్వాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందేనన్నారు అధికారులు. వృద్ధాప్యంలో ఉన్న తాము ఎక్కడి నుంచి డబ్బులు తేగలమని ప్రశ్నించాడా తండ్రి. వస్తువులు ఉంచేసుకోండి, కనీసం అస్థికలైనా ఇవ్వమని అర్థించాడు. అవమానించారు. చివరకు కస్టమ్స్ ఆఫీసు ప్రధాన అధికారిని కలిసి మొరపెట్టుకున్నాడు, కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పుడు కానీ ఆ కొడుకు అస్థికలు, వస్తువులు తన చేతికి రాలేదు.. ఇది 1984లో వచ్చిన హిందీ మూవీ సారాంశ్ సినిమా కథ! ఆఫీసర్లకు లంచం ఇలాంటి ఘటనలు రీల్ లైఫ్‌లో కన్నా రియల్ లైఫ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సారాంశ్ సినిమా వచ్చి 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేశ్ భట్ ఓ నిజ సంఘటనను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'సింగర్ జగజీత్ సింగ్ కుమారుడు ఓ యాక్సిడెంట్లో మరణించాడు. అప్పుడతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి జూనియర్ ఆఫీసర్లకు లంచం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. సారాంశ్ సినిమా ప్రాముఖ్యత అప్పుడర్థమైందన్నాడు. చాలాచోట్ల తమ సొంత కుటుంబీకుల మృతదేహాలను చూసేందుకు, ఇంటికి తీసువెళ్లేందుకు సాధారణ ప్రజలు ఎంతగానో ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. జగజీత్ సింగ్ 20 ఏళ్లకే మరణం కాగా జగజీత్ సింగ్- చిత్రల ఏకైక తనయుడు వివేక్ 1990లో కారు ప్రమాదంలో మరణించాడు. అప్పుడతడి వయసు 20 ఏళ్లు మాత్రమే! తనయుడి మరణం వారిని ఎంతగానో కుంగదీసింది. కొంతకాలానికి ఇద్దరూ సంగీతపరిశ్రమకు దూరమయ్యారు. సారాంశ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మహేశ్ భట్ తెరకెక్కించాడు. అనుపమ్ ఖేర్ ఈ మూవీ ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు. అప్పుడతడి వయసు 28 ఏళ్లు. అయినప్పటికీ పాత్ర నచ్చడంతో 60 ఏళ్ల వృద్ధుడిగా నటించాడు. చదవండి: ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలే.. నా జీవితంలో.. -
ఆ కారణంతో నాన్న మద్యానికి బానిసయ్యారు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ భామ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీకి ప్రేమ కహానీ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ.. బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ కూతురిగానే ఇండస్ట్రీకి పరిచయమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భామ.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పేశా.. ఎందుకంటే?: రవీనా టండన్ ) అలియా భట్ మాట్లాడుతూ.. 'గతంలో నాన్న చాలా సినిమాలు తెరకెక్కించారు. పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ల్స్గా నిలిచాయి. దీంతో నాన్న మద్యానికి బానిసయ్యారు. అదే సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ కొద్ది రోజుల తర్వాత మద్యం మానేశారు. ఆ తర్వాత అమ్మా, నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని ఒడుదొడుకులు అధిగమించి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా చేసిన కామెంట్స్ బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. అంతే కాకుండా తన తల్లి సోనీ రజ్దాన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అమ్మ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఎవరు తెలియదని చెప్పింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందని పేర్కొంది. థియేటర్స్, సినిమాలు, టీవీలతో పాటు చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చేదని తెలిపింది. సినిమాల కోసం కష్టపడటం అనే విషయాన్ని అమ్మ దగ్గరే నేర్చుకున్నా అని ఆలియా వెల్లడించింది. (ఇది చదవండి: నడిరోడ్డుపై జరిగే అత్యాచారానికి ఇదేమీ తక్కువ కాదు: నటి) -
తండ్రితో హీరోయిన్ లిప్‌లాక్.. 33 ఏళ్ల తర్వాత రియాక్షన్
దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఫోటో షూట్ గురించి తాజాగా బాలీవుడ్ నటి పూజా భట్ స్పందించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం తన తండ్రి, దర్శకుడు మహేశ్ భట్‌తో కలిసి ఆమె ముద్దు పెట్టుకున్నారు. అప్పట్లో సినిమా కోసం చేసిన ఆ ఫోటో షూట్ స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చింది. తండ్రీకూతుళ్లు ఇలా ఎప్పుడూ ముద్దుపెట్టుకోరని, అది అసహజమని వీరిద్దరినీ తప్పుబడుతూ ఎంతోమంది ఆరోజుల్లో పలు విమర్శలు చేశారు. అంతేకాకుండా పూజా తన కూతురు కాకపోతే పెళ్లి చేసుకునేవాడినని మహేష్ భట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పూజ పట్ల మహేష్ భట్‌కు తండ్రి భావాలు లేవని కూడా పలువురు విమర్శించారు. దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన ఈ సినిమాపై ఇప్పుడు పూజా భట్ స్పందించారు. ఆ ఫోటో షూట్లో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని ఆమె అన్నారు. ఆ సమయంలో తమ ఉద్దేశం మంచిదే కానీ చూసేవాళ్లే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజా భట్ తెలిపారు. (ఇదీ చదవండి: కేఎల్ రాహుల్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన అతియా) 'దురదృష్టవశాత్తూ ఆ ఫొటోలను కొంతమంది వేరేలా అర్థం చేసుకున్నారు. ఆ ఫొటోషూట్‌పై విమర్శలు వచ్చిన సమయంలో షారుఖ్ ఖాన్ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు.. తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దుపెట్టుకుంటారు. ప్రజలు తమకు తోచినది చెబుతారు. పర్వాలేదు, పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు. నిజం చెప్పాలంటే, ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పాపలానే చూస్తారు.' అని ఆమె తెలిపారు. ఈ ఫొటోషూట్ జరిగినప్పుడు సమాజం గురించి తనకు పెద్దగా తెలియదని పూజా భట్ చెప్పారు. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. అది సహజమేనని ఆమె చెప్పుకొచ్చారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని వాళ్లు వేరేలా చూడాలనుకుంటే.. ఎవరమైనా ఏం చేస్తామని ఆమె ప్రశ్నించారు. -
'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహిరించిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2కు సోమవారం శుభం కార్డ్ పడింది. ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులో మనీషా రాణి ఒకరు. అయితే ఈ షోలో ప్రత్యేక అతిథిగా ఆలియా భట్ ఫాదర్ మహేశ్ భట్ పాల్గొన్నారు. హోస్‌మేట్స్‌తో ముచ్చటించిన ఆయన.. అదే సమయంలో మనీషా రాణి చేతిని సరదాగా ముద్దాడారు. అయితే దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రోల్స్‌కు గురయ్యారు. వయసులో పెద్దవ్యక్తి అయినా మహేశ్.. ఆమెను అసభ్యకరంగా తాకడం ఏంటని నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెపై వస్తున్న ట్రోల్స్‌పై మనీషా రాణి స్పందించింది. మహేశ్ భట్ తీరు పట్ల ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి! ) మనీషా రాణి మాట్లాడుతూ..'మహేష్ భట్ చాలా పెద్ద డైరెక్టర్. అతడిని కలవాలనేది నాకల. ఆయన అలా చేయడం వల్ల నాకు అసౌకర్యంగా అనిపించలేదు. అలా తాకాడని ప్రజలు భావిస్తే.. అది చాలా తప్పు. అతను నాకు అంకుల్‌తో సమానం. వృద్ధులు తమ ప్రేమను కొన్నిసార్లు వారిని తాకడం ద్వారా వ్యక్తం చేస్తారు. ఆయన ఉద్దేశం చాలా స్వచ్ఛమైంది.' అని చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫైనలిస్ట్, మహేశ్ భట్ కూతురు పూజా భట్ మీడియాతో మాట్లాడింది. మనీషాతో పాటు తన తండ్రి ఇతర కంటెస్టెంట్స్‌ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని తెలిపింది. బిగ్ బాస్ హౌస్‌లో కొద్ది సమయమే ఉన్నారని పేర్కొంది. మనీషా ఇతరులను కౌగిలించుకుని ముద్దులు పెట్టినప్పుడు ఎవరికీ సమస్య ఉండదు..కానీ ప్రజలు నిజంగా అలా ఆలోచిస్తే వారికి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది. అంతే కానీ దీనిపై మా నాన్న, నేను ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పూజా భట్ తెలిపింది. ఈ సీజన్లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ విన్నర్‌గా నిలిచి.. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఈ సీజన్లో టాప్ -5 ఫైనలిస్ట్‌లలో ఎల్విష్, అభిషేక్ మల్హన్, మనీషా రాణి, బేబికా ధుర్వే, పూజా భట్ ఉన్నారు. (ఇది చదవండి: అమ్మపై దారుణ కామెంట్స్.. ఇప్పుడు కూడా: బుల్లితెర నటి) #Livefeed !! Mahesh Bhatt ne #Manisha ke hath pe kiss kiya!! #BiggBossOTT2pic.twitter.com/mt1ZVVKmuD — Livefeed Videos (@BBosslivefeed1) August 1, 2023 -
నా కల నెరవేరింది
‘‘నేను హారర్ సినిమాలను భయపడుతూ చూస్తాను. ‘రాజుగారి గది 3’ హారర్ కామెడీ. కానీ ‘1920’ సినిమా సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి.. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత మరిన్ని హారర్ కథల కోసం దర్శక–నిర్మాతలు నన్ను సంప్రదిస్తారని భావిస్తున్నాను’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేష్ భట్ రచన, సమర్పణలో రూపొందిన చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’. కృష్ణ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవికా గోర్ లీడ్ రోల్లో నటించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘మహేష్ భట్, విక్రమ్ భట్‌లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేయడం నా కల. ‘1920’ చిత్రంతో అది ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. మహేష్ భట్, విక్రమ్ భట్ గార్లతో మాట్లాడుతునప్పుడు సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నాగార్జునగారిలో కూడా ఆ క్వాలిటీ చూశాను. ‘1920’ కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ఈడీ స్క్రీన్) వాడాం.. దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను నటించిన ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. ఆది సాయికుమార్‌కి జోడీగా నటించనున్న ‘అమరన్’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
ప్రముఖ నిర్మాతకు హార్ట్ సర్జరీ
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్ భట్‌కు హార్ట్ సర్జరీ జరిగింది. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ తనయుడు రాహుల్ భట్ మీడియాకు వెల్లడించాడు. గత నెలలో మహేశ్ భట్ అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు వీలైనంత త్వరగా ఆయన గుండెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అందుకు మహేశ్ కుటుంబం అంగీకరించడంతో ఐదు రోజుల క్రితమే మహేశ్ భట్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పాడు రాహుల్. మహేశ్ భట్ విషయానికి వస్తే ఆయన నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు రచయితగా, దర్శకుడిగానూ పని చేశారు. 1974లో వచ్చిన 'మంజీలే ఔర్ భీ హై' సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. వెండితెరకు ఎన్నో హిట్స్ ఇచ్చిన ఆయన బుల్లితెరపై పలు సీరియల్స్‌ను డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన చివరి చిత్రం కార్టూన్. ఈ సినిమా తర్వాత ఆయన రచయితగా, నిర్మాతగా మారి మరెన్నో సినిమాలను రూపొందించారు. చదవండి: నిర్మాత ఎఫైర్లు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య అంబానీ ఇంట్లో ఫంక్షన్.. వేసుకోవడానికి వేరే డ్రెస్సులే దొరకలేదా? నటుడిపై ఫైర్ -
సుష్మితను బతకనివ్వండి.. ట్రోలర్స్‌కు డైరెక్టర్ కౌంటర్
పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత తెలిసిందే కదా! పక్కింట్లోని వంటలే కాదు, వారి జీవితాల్లో తొంగి చూడటం కూడా సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో! మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో కూడా సాధారణ జనాల జోక్యం ఎక్కువైపోయిందీ రోజుల్లో.. వారు ఏం చేసినా తప్పుపట్టడమే తరువాయి అన్న చందంగా తయారైంది సోషల్ మీడియా. గత కొద్ది రోజులుగా నటి సుష్మితా సేన్, లలిత్ మోదీల ప్రేమ గురించైతే ఎన్ని పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇద్దరినీ తిట్టిపోసినవారే ఎక్కువమంది. అయితే ఈ వైఖరి అంత మంచిది కాదని విమర్శించాడు దర్శకుడు మహేశ్ భట్. అదే సమయంలో సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది. ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. అంతటి గట్స్ ఆమెకున్నాయి. తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను. తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్ చేయాల్సిందే! ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి' అని ట్రోలర్స్‌కు గట్టి కౌంటరిచ్చాడు. గతంలో విక్రమ్ భట్‌తో నడిపిన ప్రేమాయణం గురించి చెప్తూ.. 'దస్తక్ సినిమా చేద్దామనుకున్నాను. అందుకామె ఓకే చెప్పింది. తర్వాతేం జరిగిందో మీకందరికీ తెలుసు. దస్తక్ షూటింగ్ సమయంలో సుష్మితా సేన్, విక్రమ్ భట్ ప్రేమించుకున్నారు. విక్రమ్ నాకు కుడిభుజంలా ఉండేవాడు. అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని. సెట్స్‌లో ఆమెతో సరదాగా కలిసిపోయేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్ భట్. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్! క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
నాన్న తాగొచ్చాడని బాత్రూమ్లో లాక్ చేసింది: పూజా భట్
కొందరు సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటారు. మరికొందరు మాత్రం అన్నింటినీ గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. కానీ బాలీవుడ్‌లోని భట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మొదటి కోవకే చెందుతారు. తమ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా నిర్మొహమాటంగా బయటకు చెప్తుంటారు. ఇందుకు బాలీవుడ్ నటి, దర్శకురాలు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పూజా భట్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంఘటనే ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతకీ పూజా భట్ దేని గురించి మాట్లాడిందంటారా? తన తండ్రి తాగినప్పుడు తల్లి ఎలా రియాక్ట్ అయిందో తెలిపింది. 'ఒక రోజు రాత్రి నాన్న తాగి తూలుతూ వచ్చాడు. దీంతో అమ్మ అతడిని బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టింది. ఇది చూసి నేను బెడ్‌పైనే ఏడ్చుకుంటూ ఎందుకు నాన్నను బంధించావని అడిగాను. వెంటనే అమ్మ నువ్వు నాన్న పార్టీనా? నా పార్టీనా? అని అడిగింది. ఇది టూమచ్ అనుకున్నా. కానీ సైడ్ తీసుకోవాల్సి వస్తే తప్పకుండా నాన్నవైపే వెళ్తాను' అని కుండ బద్ధలు కొట్టేసింది. ఎప్పుడూ నాన్నసైడ్ నిలబడుతున్నందుకు తన సోదరుడు మహేశ్ భట్ చెంచా అని ఆటపట్టించేవాడని పేర్కొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: రాకింగ్ రాకేశ్‌కు ఖరీదైన ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత ఆ వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు.. -
బాలీవుడ్‌ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆలియా భట్- రణ్‌బీర్ పెళ్లి.. అతిథులు ఎంతమందంటే..
బాలీవుడ్లో ఇప్పుడు ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లి గురించి తెగ చర్చ నడుస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది అతిథులు వస్తారు వంటి పలు విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి బట్టలు, నగలు దగ్గరినుంచి పెళ్లయ్యాక వెళ్లే హనీమూన్ స్పాట్ ఏదై ఉంటుంది వంటి రకరకాల అంశాలపై బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఆలియాభట్ సోదరుడు రాహుల్ భట్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లికి కేవలం 28మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారని, వీరిలో ఎక్కువమంది కుటుంసభ్యులే అని పేర్కొన్నారు. మహేష్ భట్ మొదటి భార్య కిరణ్ భట్‌కు కలిగిన సంతానమే రాహుల్ భట్ అన్న సంగతి తెలిసిందే. కాగా రాహుల్ ప్రకటన ప్రకారం బయటి వారెవరికీ ఆహ్వానం లేనట్లే అని తెలుస్తోంది. ఇక పెళ్లి వేడుక ముంబైలోని చెంబూర్‌లో జరగనునుందని, అలాగే రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసంలో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్వరలోనే స్పష్టత రానుంది. -
ఆ స్టార్ డైరెక్టర్ జీవితంలో చిచ్చు పెట్టిన అమలాపాల్!
సినిమాల్లో అమాయకపు ఎక్స్ప్రెషన్స్, వినయంతో కనిపించే హీరోయిన్ అమలాపాల్ బయటక మాత్రం సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తరచూ వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సౌత్‌లో వెలుగు వెలిగిన ఆమె కెరీర్ ఒక్కసారిగా స్లో అయ్యింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్స్ అందుకున్న ఆమె కెరీర్ గ్రాఫ్ అంతే తొందరగా పడిపోయింది. దీనికి ఆమె తీరు ఒక కారణమనే చెప్పొచ్చు. ఈ క్రమంలో కెరీర్ మళ్లీ స్టార్ట్ చేసిన ఈ డస్క్రీ బ్యూటీ ఆడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టికొస్తుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. ఇప్పటికే అమల తెలుగులో ‘కుడిఎడమైతే’ అనే వెబ్ సీరిస్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె హందీలో ‘రంజిష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇప్పుడు అది జనవరి 13 నుంచి ప్రముఖ ఓటీటీలో వూట్(Voot)లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అమలాపాల్ మద్యానికి, ధూమపానానికి బానిసైన స్టార్ నటిగా కనిపించనుంది. స్టార్ డైరెక్టర్-నిర్మాత మహేశ్ భట్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్ బాబీ పాత్రలో అమల ఒదిగిపోయిందని, చాలా బాగా నటించిందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను నిర్మాత మహేశ్ భట్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్‌గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అని, కొన్ని ఫిక్షన్ అని తాహిర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇందులో అతడు మహేశ్ భట్ పాత్రలో దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల అత్యంత విధేయుడిగా ఉండే ఆ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ పర్విన్ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథ. ఇందులో అమలాపాల్ దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చపెట్టే సదరు స్టార్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె మద్యం తీసుకోవడం, సిగరెట్ తాగడం, లిప్‌లాక్ చేయడం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్లో చూపించారు. ఇలా అమలా పాల్ చూసిన నెటిజన్లు ప్రస్తుతం ఆమె పరిస్థితికి అన్వయించుకుని తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. -
అలియా సంపాదనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహేశ్ భట్
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అలియా భట్ తోలి సినిమాతో భారీ విజయం సాధించింది. ప్రముఖ ప్రొడ్యూసర్ మహేశ్ భట్ వారసురాలిగా సినిమాల్లోకి అడుగు పెట్టి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ఇక సంపాదన విషయంలో అయితే తండ్రినే మించిపోయిందట. ఈ విషయంలో అలియా గురించి చెబుతూ మురిసిపోతున్నాడు మహేశ్ భట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా రంగంతో పాటు ఎక్కడైనా సరే రాణించాలంటే టాలెంట్ ఉండాలి. చదవండి: మరో వివాదంలో చిక్కుకున్న రాజ్‌కుంద్రా దంపతులు కొంతమంది తమ టాలెంట్‌తో చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అందులో నా కూతురు అలియ ఉండటం గర్వంగా ఉంది. తన టాలెంట్‌తో ఆలియా మంచి పేరుని సంపాదించడమే కాక నేను 50 ఏళ్లలో కష్టపడి సంపాదించినంత డబ్బును ఆలియా కేవలం రెండేళ్లలోనే సంపాదించింది’ అంటూ తండ్రిగా మురిపిపోయాడు. అయితే గతేడాది అలియా లండన్‌లో ఓ విల్లా కొనుగోలు చేయగా ఇటీవల ముంబైలోని జూహులో ఓ ఇల్లు ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అలియా సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె తెలుగులో నటించిన ‘ఆర్ఆర్ఆర్’, హాందీ బ్రహాస్త్ర చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకోని విడుదలకు సిద్దమవుతున్నాయి. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
నా భర్తకు తెలియకుండా అవకాశాల కోసం ప్రయత్నించా: అలియా భట్ తల్లి
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ తల్లిదండ్రులు మహేశ్ భట్, సోనీ రాజ్దాన్ నటులనే సంగతి తెలిసిందే. వారిద్దరూ 1986 ప్రేమ వివాహం చేసుకోగా సంతానంగా 1988లో షాహీన్ భట్, 1993లో అలియా కలిగారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పెళ్లి తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వెల్లడించింది. భర్తకు తెలియకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినట్లు ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వూలో సోనీ తెలిపింది. ఆ సమయంలో ఓ ప్రోడ్యూసర్ వద్దకి వెళ్లి పని కోసం అడగగా ‘మీకు పెళ్లైంది కదా?’ అడగారని, ఈ కారణంగా అవకాశం ఇవ్వకపోవడం బాధించిందని చెప్పింది. ఈ ప్రయత్నాలన్నీ తనకు రెండో సంతానంగా అలియా పుట్టిన తర్వాత చేసినట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఆమె రెండో ఇన్సింగ్స్‌లో భాగంగా సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు, ఓటీటీలో షోలు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాల్ మై ఏజెంట్’ నటిస్తూ బిజీగా ఉంది. చదవండి: రణ్‌బీర్ అంటే అప్పటి నుంచే ఇష్టం: అలియా -
తాగుడుకు బానిసయ్యా, కానీ: నటి
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ కూతురు, నటి పూజాభట్ మద్యానికి బానిసయ్యాననని, అయితే దాని నుంచి బయటప పడేందుకు తను చేసిన ప్రయత్నం ఓ పోరాటమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘దిల్ హై కి మంతా నహీన్’ మూవీ జూలై 12తో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ మూవీ సంబంధించిన విషయాలను, తనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాలో పూజ మద్యానికి బానిసైన తండ్రిని కాపాడుకునే కూతురి పాత్ర పోషించింది.ఈ నేపథ్యంలో ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ నిజ జీవితంలో తాను కూడా మద్యానికి బానిసైయినట్లు వెల్లడించింది. ‘ఈ సినిమాలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని దానిని నుంచి ఆయనను బయటక పడేసే కూతురి పాత్రలో నటించాను. ఇందులో మాదిరిగానే నేను కూడా నిజం జీవితంలో విపరీతంగా మద్యం సేవించేదాన్ని. అయితే నాలుగేళ్ల క్రితమే మానేశాను. దానిని నుంచి బయట పడాలనుకన్నాను. ఆ సమయంలో మద్యం నుంచి నా ఆలోచలను బయట పడేయడం చాలా కష్టంగా ఉండేది. చెప్పాలంటే అది ఒక పోరాటం’ అంటూ చెప్పుకొచ్చారు.అంతేగాక ‘ఇలాంటి విషయాలను ఆడవాళ్లు బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. కానీ ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే ఆడవాళ్లు ఈ విషయంపై నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వారికి స్ఫూర్తిని నింపాలనే ఇప్పుడు నేను దీనిపై నేను పెదవి విప్పాల్సి వచ్చింది. కానీ నేను తాగుడు నుంచి బయట పడేందుకు పోరాటమే చేశాను’ అని పూజ అన్నారు. కాగా మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ హై కి మంతా నహీన్’ మూవీ పూజ భట్ లీడ్ రోల్ పోషించగా, తండ్రి పాత్రలో అనుపమ్ ఖేర్ నటించాడు. ఇందులో ఆమీర్ ఖాన్ హీరో. అయితే ఈ సినిమాను తన నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా మహేష్ భట్ పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pooja B (@poojab1972) -
18 ఏళ్లకే ఫస్ట్ కిస్, నాన్న ప్రోత్సాహంతోనే: పూజా భట్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురు పూజా భట్ 18 ఏళ్లకే తన ఫస్ట్ కిస్ అనుభవాన్ని చుశానని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరీర్ ప్రారంభంలోని సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘సడక్’ చిత్రంలోని ఓ ముద్దు సన్నివేశం గురించి వివరించారు. ఆ సీన్లో నటించేందుకు తను ఇబ్బంది పడుతుంటే తన తండ్రి(మహేష్ భట్) దగ్గరుండి ఆ సన్నివేశాన్ని చేయించారన్నారు. ‘సడక్ మూవీ చేస్తున్న సమయానికి నాకు 18 ఏళ్లు. ఈ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు భయంతో వణికిపోయాను. నాన్న ముందు ఆ సీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో నాన్న నన్ను పక్కకు తీసుకెళ్లి నువ్వు ముద్దును వల్గర్‌గా ఫీల్ అయ్యావంటే అందులో నీకు వల్గారిటియే కనిపిస్తుంది. అదే నువ్వు ముద్దు సన్నివేశాన్ని గౌరవించి.. ఎంత ఇష్టంతో నటిస్తే ఆ సన్నివేశం అంతబాగా పండుతుంది. కథలో భాగంగా ప్రతి సీన్లోని ఇంటెన్షన్ తెలుసుకోవాలని’ చెప్పారని పేర్కొన్నారు. అలా తన తండ్రి మహేష్ భట్ ప్రోత్సాహంతో ముద్దు సీన్లో నటించగలిగానని, అప్పుడు ఆయన చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకుంటూ కెమెరా ముందు నిబద్ధతతో నటిస్తుంటానని పూజా తెలిపారు. కాగా పూజా భట్ 1991 చిత్రం సడక్తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ దత్‌కు ఆమె హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పూజా భట్ ఇటీవల 'బాంబే బేగమ్స్' అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెట్ ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ విడుదలైంది. చదవండి: ట్రెండింగ్: సడక్ 2కు డిస్‌లైకుల వర్షం -
రాహుల్ రాయ్‌కు ఆరోగ్య ప్రమాదం..
ముంబై: ‘ధీరే ధీరే సే మేరె జిందగీ మే ఆనా’, ‘సాన్సోకి జరూరత్ హై జైసే’... వంటి సూపర్‌హిట్ పాటలతో వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఆషికీ’ సినిమా హీరో రాహుల్ రాయ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నవంబర్ 2020లో కార్గిల్ సమీపాన షూటింగ్ చేస్తూ ఉండగా అతనికి బ్రైన్స్ట్రోక్ వచ్చింది. వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన ముంబై తరలించి నానావతి హాస్పిటల్లో చేర్చారు. అక్కడి నుంచి మరో హాస్పిటల్‌కు మారి రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు నెలన్నర రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిన రాహుల్‌ను అతని చెల్లెలు ప్రియ, ఆమె భర్త చూసుకున్నారు. రాహుల్ రాయ్‌కు ఇంకా స్పీచ్ థెరపి, ఫిజియో థెరపీలు ఉన్నాయి. రాహుల్ రాయ్ ‘ఆషికీ’తో వచ్చిన ఫేమ్‌తో చాలా పేరు సంపాదించినా ఆ తర్వాత తగినన్ని హిట్స్ లేక తెర మరుగు అయ్యాడు. బిగ్‌బాస్ హిందీలో పాల్గొని విజేతగా నిలిచి మళ్లీ న్యూస్‌లోకి వచ్చాడు. అతనికి బాలీవుడ్లో వేషాలే దొరకట్లేదని చెప్పాలి. ఎందుకనో ‘ఆషికీ’ సినిమా దాని దర్శకుడు మహేష్ భట్‌కు లాభించినట్టుగా దాని హీరో హీరోయిన్లకు లాభించలేదు. ఇక ఆ సినిమా హీరోయిన్ అనూ అగర్వాల్ భయంకరమైన ప్రమాదంలో ఆమె ముఖమే పాడవగా తెరమరుగైపోయింది. ఇపుడు రాహుల్ రాయ్‌కు ఆరోగ్య ప్రమాదం... ఏదేమైనా రంగులు హంగులతో పాటు ఊహించని ఘటనలు నిండి ఉండే చోటు బాలీవుడ్. -
నటి ఆరోపణలు.. ఖండించిన దర్శకుడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, ఆయన కుటుంబం తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు నటి లువైనా లోధ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లువినా ఆరోపణలను ఖండిస్తూ మహేష్ భట్ న్యాయవాది శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. ‘లువైనా లోధ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి. తను విడుదల చేసిన వీడియో చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. ఈ ఆరోపణలను మా క్లైయింట్ మహేష్ భట్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు) View this post on Instagram A post shared by Vishesh Films (@visheshfilms) on Oct 23, 2020 at 4:55am PDT మహేష్ భట్, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల లువైనా లోధ్ వీడియో పోస్టు చేశారు. 1 నిమిషం 48 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో తనను తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత తను, తన కుటుంబ భద్రత కోసమే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా తాను మహేష్ భట్ మేనల్లుడు సుమిత్ సబర్వాల్‌ను వివాహం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. (చదవండి: ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2) View this post on Instagram I m being harrased by Mahesh Bhatt & family. Pls support. A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on Oct 23, 2020 at 2:26am PDT -
పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు
కబీర్ బేడీతో అనుబంధాన్ని తెంచుకున్నంత వేగంగా ఆ బాధలోంచి బయటపడలేకపోయింది పర్వీన్. ఆ సమయంలో డానీ స్నేహం ఒక్కటే ఆమెకు కాస్త ఊరటైంది. అప్పుడే మహేశ్ భట్ తారసపడ్డాడు ఆమెకు. ఆనాటికే ఆమె స్టార్డమ్తో ఉంది. మహేశ్.. దర్శకత్వంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పర్వీన్ బాబీకి పిచ్చి అభిమాని కూడా. తొలి పరిచయంలోనే అతను ఆమెకు మంచి స్నేహితుడిగా కనిపించాడు. టీకి ఇంటికి ఆహ్వానించింది. చెలిమి పెరిగింది. మహేశ్ భట్ సాంగత్యంలో గతం మరిచిపోగలుగుతోంది. దాంతో ఆమెకు అతను సాంత్వన అయ్యాడు. ఆమె అతనికి ప్రేమిక అయింది. అప్పటికే మహేశ్ భట్‌కు లారెన్ బ్రైట్‌తో పెళ్లయి కూతురు కూడా (పూజా భట్). పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు. ఇల్లొదిలి వచ్చేశాడు. పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత స్నేహితురాలి మొహంలో నవ్వు చూసి సంతోషపడ్డాడు డానీ. అమితాబ్ చంపే ప్లాన్ చేస్తున్నాడు! పర్వీన్, మహేశ్ భట్ దాదాపు మూడేళ్లు కలిసున్నారు. తనకు తెలిసిన ప్రపంచాన్నంతా పర్వీన్‌కు చూపించాడు మహేశ్. తన గైడ్, ఫిలాసఫర్.. జిడ్డు కృష్ణమూర్తినీ పరిచయం చేశాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్నప్పుడు ఒకరోజు.. మహేశ్ భట్ షూటింగ్ ముగించుకొని ఇంటికొచ్చేటప్పటికి పర్వీన్ వాళ్లమ్మ భయంభయంగా కారిడార్‌లో పచార్లు చేస్తోంది. ‘ఏమైంది?’ అని మహేశ్ భట్ అడిగేలోపే ‘పర్వీన్‌ను చూస్తే భయమేస్తోంది’ అంటూ భోరుమంది. ఆవిడను సముదాయించి అతను లోపలికెళ్లిచూస్తే.. కనీసం షూటింగ్ కాస్ట్యూమ్స్ కూడా తీయకుండా చేతిలో కూరగాయల కత్తితో గోడకు ఆనుకొని బెదిరిపోతూ కనిపించింది పర్వీన్. ‘పర్వీన్..’ అని మహేశ్ పిలిచేసరికి ‘ష్.. గట్టిగా మాట్లాడకు. ఆ ఫ్యాన్‌లో ఏదో సీక్రెట్ డివైజ్ ఉంది’ అంది ఆమె ఫ్యాన్‌ను చూపిస్తూ. విస్తుపోయిన అతను.. ‘ఏం డివైజ్? ఎవరు పెట్టారు?’ అని అడిగాడు. ‘నన్ను చంపడానికి.. అమితాబ్ బచ్చన్ పెట్టించాడు’ చెప్పింది పర్వీన్. హతాశుడయ్యాడు మహేశ్. ఇంకోసారి.. ఎప్పటిలాగే ఓ రోజు డానీని భోజనానికి పిలిచింది పర్వీన్. డైనింగ్ టేబుల్ మీద వెండి శంఖం కనబడేసరికి.. ఊదాలని సరదాపడ్డాడు డానీ. అంతే ‘అమ్మో.. దాంట్లో బాంబ్ ఉంది. అవతల పడేసేయ్’ అంటూ గట్టిగట్టిగా అరిచిందట పర్వీన్. ఈసారి షాక్ అవడం డానీ వంతైంది. ‘ఈ మధ్య తరచూ ఇలాగే ప్రవర్తిస్తోంది. నాకేం అర్థం కావట్లేదు’ చెప్పాడు మహేశ్. ఆ సంఘటన నుంచి పర్వీన్ మానసిక ఆరోగ్యం దిగజారిపోయింది. మహేశ్‌కు కంటిమీద కునుకు కరువైంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. మాత్రలతో ఫలితం కనిపించలేదు. బెంగళూరు, జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు తీసుకెళ్లాడు పర్వీన్‌ను. కొన్నాళ్లు సినిమా వాతావరణానికి దూరంగా, ప్రశాంతంగా అక్కడే బెంగుళూరులో ఉండమని ఆమెకు సలహానిచ్చిడు కృష్ణమూర్తి. అయిష్టంగానే ఒప్పుకుంది. కాని ఉండలేక ముంబైకి తిరుగు ప్రయాణమైంది. డానీ సమక్షంలోనే కాస్త తేలికపడేదట పర్వీన్. అది గ్రహించిన మహేశ్ ‘నీ మాటలతో కాస్త ధైర్యపడుతున్నట్టుంది. వీలుచిక్కినప్పుడల్లా వస్తూ ఉండు’ అంటూ డానీని అభ్యర్థించాడు. అప్పటి నుంచి తనకు ఏ కాస్త టైమ్ దొరికినా వాళ్లింటికి వస్తూ పర్వీన్‌ను సరదాగా ఉంచే ప్రయత్నం చేయసాగాడు డానీ. ఆ క్రమంలో ఒకరోజు తమ ఇంటికి వచ్చిన డానీని గుమ్మంలోంచే బయటకు పంపించేసింది పర్వీన్.. ‘నన్ను చంపడానికి నిన్ను అమితాబ్ పంపాడు కదా? నువ్వు అతని ఏజెంట్‌వి. గెటవుట్’ అని అరుస్తూ. స్థాణువైపోయాడు డానీ. అతను వెళ్లిపోయే వరకు అరుస్తూ ఉందట పర్వీన్. దానికి కారణం.. ఆ రోజు ఓ పత్రికలో ఆమె అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ చదవడం. అందులో అమితాబ్.. డానీని తన ఆప్తమిత్రుడుగా పేర్కొనడం. కోలుకోలేదు మందులు వాడినా ఆమె మానసిక స్థితి మెరుగుపడలేదు. తనను అమితాబ్ మనుషులు వెంటాడుతున్నారని, ఇంట్లో దాక్కున్నారని, తనను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే నిరంతర అనుమానాలతో నిద్రాహారాలకు దూరమైంది. మహేశ్‌కు నరకాన్ని తలపించింది. ఇక ఆమెతో ఉండలేక ఆ ఇంట్లోంచి వచ్చేసి అతను తర్వాత భార్య లారెన్‌కు దగ్గరయ్యాడు మళ్లీ. ఒంటరిగానే మిగిలిపోయింది పర్వీన్. పారనాయిడ్ స్కిజోఫ్రీనియా, మధుమేహం ఇతర ఆరోగ్య సమస్యలతో 2005లో ఈ లోకాన్ని విడిచిపోయింది పర్వీన్ బాబీ. ఆమె చనిపోయిన రెండు రోజులకుగాని ఆ విషయం ఆమె ఇరుగుపొరుగుకు తెలియలేదు. పర్వీన్ మరణవార్త విన్నవెంటనే పరిగెత్తుకొచ్చాడు మహేశ్. డానీ, కబీర్‌బేడీ చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలను మహేశ్ భట్ జరిపించాడు. పర్వీన్‌కు తుది వీడ్కోలు పలికిన వాళ్లలో ఈ ముగ్గురితోపాటు జానీ బక్షి, రంజిత్, ప్రొడ్యూసర్ హరీష్ షా మాత్రమే ఉన్నారు. తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమంగా రాసిచ్చింది పర్వీన్ బాబీ. ∙ఎస్సార్ -
వాళ్ల గురించి పట్టించుకున్నారా.. సరేగానీ
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ కేసులో పలువురు నటుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీ-టౌన్ సెలబ్రిటీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్ మాఫియాతో సంబంధాల గురించి నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ పార్లమెంటులో ప్రస్తావించారు. బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారు. అదే విధంగా ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సైతం సినీ ఇండస్ట్రీలో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని, లోతుగా దర్యాప్తు చేస్తే సగం మంది ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(చదవండి: సుశాంత్‌తో టచ్‌లో లేను.. కానీ నాకు తెలుసు!) ఈ నేపథ్యంలో నటి పూజా భట్ ఆసక్తికర ట్వీట్‌తో సోషల్ మీడియాలో చర్చ లేవనెత్తారు. పేదరికంలో మగ్గిపోతూ, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారి గురించి ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘ సమాజంలో అట్టడుగువర్గాలుగా పరిగణింపబడుతూ, బాధల నుంచి విముక్తి పొందేందుకు మత్తు పదార్థాలను ఉపయోగించే ప్రజల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? కలలు కల్లలైపోయి పేదరికంలో మునిగి దుర్భర జీవితం గడుపుతున్న వాళ్ల పునరావాసం, బాగోగుల గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా?’’అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించారు. మీ నాన్న పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలో కొంతమంది పూజాకు మద్దతుగా కామెంట్లు చేస్తుంటే.. మరికొంత మంది నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ వారి కోసం ఇప్పుడు సెలబ్రిటీలను వదిలిపెట్టమంటారా? రియా అరెస్టు అయ్యింది. మీ నాన్న, మీ చెల్లెళ్ల గురించి ఏమంటారు’’అంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, పూజా భట్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు మహేష్ భట్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు ఆయన మద్దతుగా నిలిచారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పూజ సోదరి అలియా భట్ నెపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో స్థానం సంపాదించగలిగిందంటూ, ఇటీవల ఆమె నటించిన సడక్ 2 సినిమాకు ఘోరమైన రేటింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Does anyone care about people who live on the ultimate fringe of society,who use drugs to make the pain of living go away? The ones who are too battered & broken to chase dreams but chase substances amidst much poverty & squalor? Anyone interested in their rehabilitation? — Pooja Bhatt (@PoojaB1972) September 16, 2020 -
రియా, మహేష్ భట్ల వాట్సాప్ చాట్ వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రతి రోజు ఏదో ఒక మలుపు చోటు చేసుకుంటుంది. తాజాగా సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తి, నిర్మాత మహేష్ భట్ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న అధికారులు దీనిని మీడియాకు అందించారు. ఈ సంభాషణ జూన్ 8 తర్వాత అంటే రియా, సుశాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయిన తర్వాత జరగడం గమనార్హం. ఈ మెసెజ్‌లలో రియా ‘అయేషా మూవ్స్ ఆన్ సర్.. ఇప్పుడు చాలా ఉపశమనంగా’ ఉంది అంటూ మహేష్ భట్‌కు మెసేజ్ చేసింది. అయేషా అనేది ‘జలేబి’ చిత్రంలో రియా చక్రవర్తి పోషించిన పాత్ర పేరు. దీనికి మహేష్ భట్ నిర్మాత. ఆ తర్వాత ‘మీరు నాకు చేసిన చివరి కాల్ వేక్ అప్ కాల్ లాంటిది. మీరు నా ఏంజెల్.. ఇప్పుడు ఎప్పుడు’ అని రియా మెసేజ్ చేస్తే.. అందుకు మహేష్ భట్.. ‘ఇక వెనక్కి తిరిగి చూడకు.. అనివార్యమైన దాన్ని సాధ్యం చేయండి. మీ తండ్రికి నీ ప్రేమ.. అతను సంతోషంగా ఉంటాడు’ అని రిప్లై ఇచ్చాడు. అందుకు రియా ‘ఆ రోజు మీరు మా నాన్న గురించి ఫోన్లో చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నేను బలంగా ఉండటానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాయి’ అంటూ వారి సంభాషణ కొనసాగింది. ఈ సందేశాలు పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు రియా చెప్పిన విషయాల ప్రామాణికత గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పూర్తి సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. (రియా కాల్ రికార్డు: మహేష్ భట్‌కు 16 కాల్స్) రియా మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలు ఇక విచారణలో రియా పోలీసులకు సుశాంత్‌తో బంధం తన తండ్రికి ఇష్టం లేదని... మహేష్ భట్ కూడా తమ రిలేషన్ గురించి హెచ్చరించారని తెలిపింది. అంతేకాక రియా తన సన్నిహితులకు సుశాంత్ వ్యాధి గురించి చెప్పడమే కాక.. దాని వల్ల తాను ఎంతో ఇబ్బందిపడుతున్నట్లు వారి దగ్గర వాపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ అధికారులు జూన్ 8న రియా చక్రవర్తి, సుశాంత్‌ల మధ్య ఏం జరిగిందనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దాని గురించి ఆమె మాత్రమే సరిగ్గా చెప్పగలదని సీబీఐ భావిస్తోంది. (అలా బయటకు కనిపిస్తారా?) జూన్ 8న ఏం జరిగింది అంటే.. రియా తరఫు న్యాయవాది సతీష్ మనేషిందే విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘సుశాంత్ ముంబై నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో తన కుటుంబ సభ్యులను తన దగ్గరకు రావాల్సిందిగా ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. అతడి సోదరి శ్వేత జూన్ 8న సుశాంత్‌ని కలవడానికి అంగీకరించింది. అందువల్ల సుశాంత్ రియాను ఆమె అమ్మనాన్నల దగ్గరకు వెళ్లమని కోరాడు. కానీ సుశాంత్‌తో కలిసి ఉన్నప్పటి నుంచి రియా కుటుంబం ఆమెతో సరిగా మాట్లాడటం లేదు. దాంతో వారి వద్దకు వెళ్లడానికి రియా ఇబ్బంది పడింది. జూన్ 8న రియా సుశాంత్ కోసం సుసాన్ వాకర్‌తో థెరపి సేషన్ని ఏర్పాటు చేసింది. అది పూర్తయ్యాక వెళ్తానని కోరింది. కానీ సుశాంత్ వెంటనే ఆమెని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని అభ్యర్థించాడు. దాంతో రియా అఇష్టంగానే అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఏదైనా అవసరం ఉంటే తనకు లేదా తన సోదరుడికి కాల్ చేయమని సుశాంత్‌కు చెప్పి రియా అతడి ఇంటి నుంచి వెళ్లి పోయింది’ అని ఈ ప్రకటనలో తెలిపారు. -
ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2
సోషల్ మీడియా తలుచుకుంటే జరగనిదంటూ ఏదీ లేదని మరోసారి నిరూపితమైంది అలియా భట్ చిత్రం "సడక్ 2" నుంచి విడుదలైన ట్రైలర్ ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్లైక్డ్ వీడియోగా రికార్డులకెక్కింది. ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు 61 మిలియన్ల మంది వీక్షించగా, జస్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ కుండపోతగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 11.65 మిలియన్ల మంది ఈ వీడియోకు డిస్లైక్ కొట్టడంతో ప్రపంచ రికార్డు కొట్టేసింది. దీంతో అప్పటివరకు అత్యధికంగా డిస్‌లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉన్న జస్టిన్ బీబర్ బేబీ పాట మూడో స్థానానికి దిగజారింది. బీబర్ రికార్డు బద్ధలు కొట్టడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టడం గమనార్హం. 18 మిలియన్ల డిస్‌లైకులతో "యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వన్ కంట్రోల్స్ రివైండ్" వీడియో అగ్ర స్థానంలో ఉంది. ఆగస్టు 12 సడక్ 2 సినిమా ట్రైలర్ విడుదల అవగా ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే నిలుస్తుండటం విశేషం. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు) బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అలియా భట్, మహేశ్ భట్, రియా చక్రవర్తి, పలువురు సెలబ్రిటీల వల్లే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2పై ప్రతికూల ప్రభావం పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ను అణగదొక్కి, మానసికంగా నరకం చూపి, పరోక్షంగా ఆత్మహత్యకు కారణమై, మీరు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారా? అని అబిమానులు సోషల్ మీడియాలో ఆక్రోశం వెల్లగక్కారు. (సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు) దీంతో "సడక్2కు డిస్‌లైక్‌లు కొడదాం" అని ప్రతిజ్ఞ పూని ఓ రకంగా ఉద్యమమే మొదలు పెట్టారు. ఈ ప్రతిజ్ఞ దావానంలా వ్యాపించి ప్రతి ఒక్కరినీ తమ ప్రమేయం లేకుండానే డిస్లైక్ కొట్టించేలా చేసింది. దీనికి యూట్యూబ్‌లో కన్పిస్తున్న కామెంట్లే నిదర్శనం. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, ఇలా ఎన్నో దేశాల నుంచి కూడా సుశాంత్ అభిమానులు యాంటీ సడక్ ఉద్యమంలో పాల్గొని డిస్లైక్ కొట్టారు. "కేవలం డిస్లైక్ కొట్టడానికే ఈ వీడియో ఓపెన్ చేశాను" అంటూ ఎంతో మంది కామెంట్లు చేశారంటే సడక్ 2పై ఏమేరకు ప్రభావం పడిందో అర్థం చేసుకోవచ్చు. (దర్శకుడు నిషికాంత్ ఇకలేరు) -
సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు
ఏ సినిమా అయినా ఎక్కువ వ్యూస్ వస్తూ, అధిక లైకులు తెచ్చుకుంటుంటే గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఓ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. కానీ దీని కథ, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్.. పూర్తిగా వేరు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటించిన తాజా చిత్రం 'సడక్ 2'. ఆమె తండ్రి మహేశ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది గంటల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అతని మరణంతో బాలీవుడ్లో నెపోటిజమ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రాజుకున్నాయి. (అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది) Sadak2 trailer released on YouTube , meanwhile boycott gang.... #sadak2trailer pic.twitter.com/CVDyoxfhoz — तूफ़ान का देवताᵀʰᵒʳ 🚩 (@iStormbreaker_) August 12, 2020 బయట నుంచి వచ్చిన సుశాంత్‌కు అవకాశాలు ఇవ్వకుండా, సహనటుడిగా కనీస గౌరవం ఇవ్వకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు మానసిక క్షోభకు గురి చేశారన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. దానికి పరిణామంగా స్టార్ కిడ్స్‌పై ఆగ్రహావేశాలు, వారిని అన్‌ఫాలో చేయడం, దర్శక నిర్మాతలను విమర్శించడంలాంటివి చూస్తూనే ఉన్నాం. ఓ పాత వీడియోలో సుశాంత్ ఎవరో తెలీదన్న అలియాను కూడా నెటిజన్లు ఏకిపారేశారు. అలాగే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో సన్నిహితంగా ఉన్న ఆమె తండ్రి మహేశ్ భట్‌పై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేమంటూ అభిమానులు సోషల్ మీడియాలో "డిస్లైక్ క్యాంపెయిన్" చేపడుతూ వారి ప్రతాపాన్ని చూపిస్తూన్నారు. (సుశాంత్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్) Alia bhatt and mahesh bhatt after seeing memes on #sadak2trailer #Sadak2 ~ pic.twitter.com/LrN2osKDkg — 𝙋𝙍𝙄𝙏𝘼𝙈 🎧 (@impritzz) August 10, 2020 ఫలితంగా యూట్యూబ్‌లో "సడక్ 2 ట్రైలర్‌కు 2.4 మిలియన్ల డిస్‌లైకులు వచ్చిపడ్డాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చూస్తుంటే ప్రపంచంలోనే అత్యధిక డిస్‌లైకులు తెచ్చుకున్న ట్రైలర్‌గా సడక్ 2 నిలిచే అవకాశం ఉంది. దీనికి లైకులు మాత్రం లక్షా 41 వేలుగా ఉంది. ట్రైలర్ కింద ఈ సినిమాను విమర్శిస్తూ "జస్టిస్ ఫర్ సుశాంత్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల అవుతుండటంతో #UninstallHotstar సైతం సోమవారం ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ సినిమా ఆస్టు 28న హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. కాగా సుశాంత్ ఫ్యామిలీ రూపొందించిన నెపోమీటర్ కూడా ఈ చిత్రాన్ని 98 శాతం సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారితో తెరకెక్కించారని ప్రకటించిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా) Sadak2 trailer getting negative reviews and many dislike . Bollywood critics to Public : pic.twitter.com/st2jbv4y92 — Sachin 🇮🇳 (@Sarcasmbro10) August 12, 2020 సోషల్ మీడియాలో సడక్ 2 ట్రైలర్‌పై ఏమంటున్నారంటే.. ఈ సమయం కోసం కదా ఇన్నాళ్లు మేము వేచి చూస్తుంది అంటూ మీమ్స్‌రాయుళ్లు చెలరేగిపోతున్నారు. 'ఎంతగా ఎదురు చూశానో డిస్లైక్ కొట్టడానికి అంటూ ఓ మీమ్ చాలామంది పరిస్థితికి అద్దం పడుతోంది. మరి ఈ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. Me waiting for #Sadak2 trailer so I can report n dislike it..😎#UninstallHotstar pic.twitter.com/5zjS1biohr — Shivanshu Mishra (@shivanshuBTC17) August 10, 2020 #UninstallHotstar for releasing sadak 2 amid the ongoing case on bollywood mafia . Le Hotstar : pic.twitter.com/AwptPPJAjk — Sachin 🇮🇳 (@Sarcasmbro10) August 10, 2020 #UninstallHotstar is trending because of #Sadak2. But IPL starts from next month and people need Hotstar again. *Hotstar to everyone: pic.twitter.com/llwQXtzM5H — Soumya Gorai (@ItzSoumyaHere) August 10, 2020 Me disliking both the Sadak2 trailers on Hotstar and Foxstar pic.twitter.com/mw7zAhJ7LT — Kaushal (@varishchik) August 12, 2020 More power 💪 to the that Dislike Button who is bearing so much hit right now for,, being on #sadak2trailer for,,🥶🥶#Sadak2 #AliaBhatt #BycottBollywood #BycottSadak2 pic.twitter.com/TF63saSxM2 — Sushant (@its_sushant1) August 12, 2020 Me while watching #Sadak2 trailer!! No wonder this will be the most disliked trailer on YouTube Dislike Dislike Dislike!!!! pic.twitter.com/i6sZzV36Ay — Vanita (@ChaiPeCharcha__) August 12, 2020 -
అలియాకు షాక్.. డిస్‌లైక్‌ల వరద
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్లైక్ చేశారు. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.(ఓటీటీలో సడక్ 2) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. -
ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్
ముంబై : సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా మహేశ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2 ట్రైలర్ వచ్చేసింది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి రవివర్మ పాత్రలో నటిస్తున్న సంజయ్ తన భార్య(పూజా భట్) చనిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్ వృత్తిని మానేసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెడుతన్న నకిలీ బాబా గుట్టును బయటపెట్టడానికి ఆలియా ప్రయత్నిస్తుంటుంది. సంజయ్, ఆదిత్యారాయ్ కపూర్ల సహకారంతో నకిలీ బాబా గుట్టును ఆమె ఎలా బహిర్గతం చేస్తుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. (ఓటీటీలో సడక్ 2) నకిలీ బాబా పాత్రలో మకర్ దేశ్ పాండే, గుల్షన్ గ్రోవర్, జిష్ణు సేన్ గుప్తా తదితరులు నటిస్తున్నారు. విశేష్ ఫిలింస్ బ్యానర్ పేరు మీద ముఖేశ్ భట్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది. కాగా సంజయ్ దత్ మంగళవారం నానావతి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ బారీన పడినట్లు సమాచారం. సంజయ్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది.('సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు') -
రియా కాల్ రికార్డు: మహేష్ భట్‌కు 16 కాల్స్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసును సీబీఐకి ఆదేశించడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పోలీసులు గతేడాది రియా కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి చిత్రనిర్మాత మహేష్ భట్‌కు 16 కాల్స్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేగాక ఆమె తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో గత సంవత్సరంలో 1122 సార్లు మాట్లాడారు. (చదవండి: ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?) రియా మేనేజర్, సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శృతి మోదీకి 808 కాల్స్ చేశారు. తన సోదరుడు షోయిక్ చక్రవర్తి ఆమె తల్లి సంధ్య చక్రవర్తికి పలుసార్లు ఫోన్ చేశారు. అయితే సుశాంత్ మృతి కేసులో సీబీఐ నిన్న(గురువారం) రియా, షోయిక్ ఇంద్రజిత్, రియా తల్లి సంధ్య చక్రవర్తితో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అంతేగాక సీబీఐ ఎఫ్ఐఆర్ జాబితాలో సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ కూడా ఉన్నారు. అలాగే సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్, రియా సహచరుడు శామ్యూల్ మిరాండాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. (చదవండి: సుశాంత్ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ) -
జస్టిస్ ఫర్ సుశాంత్.. నిజాలు బయటపెట్టాలి
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో న్యాయం చేయాలని కోరుతూ సుశాంత్ సోదరి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నిజాలు బయటపడవు. జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజేంద్రనగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్ కుటుంబం ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తికి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. (సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు) సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టించింది. నెపోటిజంపై బాహాటంగానే విమర్శలు చేసిన నటి కంగనా రనౌత్ బీటౌన్‌లో పెద్ద చర్చను లేవనెత్తారు. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా సుశాంత్‌ను బెదిరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ నిర్మాణ సంస్థ సుశాంత్‌తో మూడు సినిమాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నా రెండు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్ పై కూడా కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒకవేళ అవసరమైతే కరణ్ జోహార్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని మహారాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనౌను కూడా విచారణకు పిలవగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో తాను ముంబై రాలేనని, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అధికారుల బృందాన్ని మనాలికి పంపాలని, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని పేర్కొంది. కాగా సుశాంత్ ఆత్మహత్య కేసుసు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు 42 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. (‘కంగనపై ఈర్ష్య, అసూయతోనే విమర్శలు’) View this post on Instagram If truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 28, 2020 at 12:51pm PDT -
సుశాంత్ కేసులో మహేష్ భట్ వాంగ్మూలం నమోదు
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించారు. జూలై 27న శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు హాజరైన మహేష్ భట్‌ను కొన్ని గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మహేష్ భట్‌తోపాటు కరణ్ జోహార్ మేనేజర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర హోశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కోరారు. అలాగే నటి కంగనా రనౌత్‌ను కూడా వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు రావాలని సూచించారు. (అక్కడికి రావాలనిపిస్తోంది అక్కా: సుశాంత్) కాగా జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, రియా చక్రవర్తి సహా 37 మందిని పోలీసులు విచారించారు. ఇప్పుడు మహేష్ భట్‌ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో తను సుశాంత్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే కలిసినట్లు మహేష్ భట్ వెల్లడించారు. నవంబర్ 2018లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి అని పేర్కొన్నారు. (‘మరోసారి నా హృదయం ముక్కలైంది’) ‘సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నా 2018 చిత్రం 'జలేబీ'లో పనిచేసింది. ఆ సమయంలో కలిసి పనిచేయడం వల్ల రియా నన్ను ఒక మెంటర్‌గా గౌరవించేది. నా చిత్రాల్లో నటించాలని సుశాంత్ నటించాలని ఏ రోజు కోరలేదని ఆ ఉద్దేశ్యం నాకు లేదు’ అని తెలిపారు. అయితే సడక్-2 సినిమాలో ముందుగా సుశాంత్‌ను అడిగి ఆ తర్వాత ఆదిత్యారాయ్ కపూర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని ప్రశ్నించగా అలాంటిదేం లేదని, 'సడక్ 2' లో నటించడానికి సుశాంత్‌తో చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. (‘దిల్ బేచారా’ మరో రికార్డు) అంతేగాక దివంగత నటుడు సుశాంత్ తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాడని కూడా వెల్లడించాడు. తన ప్రాజెక్టులలో తనకు కనీసం ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరాడని భట్ తెలిపారు. ఇదిలావుండగా సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మున్ముందు ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
పూజాభట్- కంగనాల మధ్య ముదురుతున్న వివాదం!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో మొదలైన నెపోటిజం గొడవ రోజులు గడుస్తున్న ఇంకా చల్లబడటం లేదు. నెపోటిజం గురించి బయటకి వచ్చి బహిరంగంగానే స్టార్స్ కిడ్స్‌ని, మహేష్ భట్, కరన్‌జోహార్ లాంటి నిర్మాతలను విమర్శించిన వారిలో కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు. ఇక నెపోటిజానికి సంబంధించి సోషల్‌మీడియా వేదికగా మహేష్ కుమార్తె పూజా భట్‌కు, కంగనా రనౌత్‌కు మాటల యుద్దం నడుస్తూనే ఉంది. 2006 ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించినందుకు గాను కంగనా బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కంగనా మహేష్ భట్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) తాజాగా పూజాభట్ ఈ వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వీడియోలు కూడా అబద్ధమా? నేను ఆరోపణలను వారికే వదిలేస్తున్నాను, నేను వాస్తవాలను మీ ముందుంచాను’ అని పూజా తన పోస్ట్‌కు శీర్షికను పెట్టారు. తన కుటుంబం మీద వస్తున్న నెపోటిజం ఆరోపణలపై స్పందించిన పూజా... విశేష్ ఫిల్మ్ ఒకప్పుడు కొత్తవారితో మాత్రమే పనిచేసినందుకు అపఖ్యాతి పాలైందని గుర్తుచేశారు. ఇక దీనిపై స్పందించిన కంగనా రనౌత్ సోషల్ మీడియా టీం మహేష్ భట్ ప్రొడక్షన్ హౌస్ నటుల కోసం అంత ఎక్కువగా డబ్బు ఖర్చు చేయదని పేర్కొంది. కంగనా లాంటి టాలెంట్ ఉన్న వారు తక్కువ డబ్బులకు చేయడానికి దొరకడంతో మహేష్ భట్ ఆమెకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మొత్తం మీద సోషల్‌మీడియా వేదికగా పూజా భట్-కంగనాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. చదవండి: 'కంగనా.. నీకు ఆ అర్హత లేదు' -
ఆలియా, మహేష్ భట్‌పై కేసు నమోదు
హిందూ మనోభావాలను దెబ్బతీసేలా సడక్-2 పోస్టర్ ఉందంటూ ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు మహేష్ భట్, నిర్మాత ముఖేష్ భట్, నటి ఆలియా భట్‌పై సెక్షన్ 120బి, 295ఎ కింద కేసు నమోదైంది. సికందర్పూర్ ప్రాంతానికి చెందిన ఆచార్యచంద్ర కిషోర్ అనే వ్యక్తి తన న్యాయవాది సోను కుమార్ ద్వారా కేసు నమోదు చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల అనంతరం కూతురు ఆలియాతో మహేష్ భట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సడక్-2 చిత్రంలో ఆలియాతో పాటు పూజా భట్, సంజయ్‌దత్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. 1991 సంవత్సరంలో విడుదలైన సడక్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (నెపోటిజమ్‌కు కేరాఫ్‌గా సడక్-2 ) మహేష్ భట్ బుధవారం సడక్-2 పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే సుశాంత్ మరణానికి కారణమయ్యారంటూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సుశాంత్‌కు ఇవ్వలేదన్న వాదన బలంగా వినిపిస్తున్న తరుణంలో ఎంతో మంది ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో మహేష్ భట్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సడక్-2 పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈయనపై మరోసారి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (ఆమె చివరి భావోద్వేగ పోస్ట్ అతడి గురించే) View this post on Instagram A love story that began 29 yrs ago now journeys towards a new horizon. Sadak2 - The road to love ❤️ Here’s presenting our FIRST TEASER POSTER🌞💃🏻 First day First show, from the comfort of your homes! Watch #Sadak2 on @DisneyPlusHotstarVIP with #DisneyPlusHotstarVIPMultiplex @adityaroykapur @duttsanjay @poojab1972 @maheshfilm #MukeshBhatt @visheshfilms #SuhritaSengupta A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Jun 29, 2020 at 5:34am PDT -
సడక్-2కు సుశాంత్ ఫ్యామిలీ ఝలక్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజం)పై విస్తృత చర్చ లేవనెత్తింది. బాలీవుడ్లో స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సుశాంత్‌కు ఇవ్వలేదన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎందరో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి తిరిగిన దర్శకుడు, చిత్ర నిర్మాత మహేశ్ భట్ కూడా ఒకరు. ఆయన బుధవారం సోషల్ మీడియాలో "సడక్-2" చిత్ర పోస్టర్‌ను విడుదల చేశాడు. హీరోయిన్ అలియాభట్ నటించిన ఈ సినిమా పోస్టర్ లుక్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదిలా ఉంటే సుశాంత్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ చిత్రాల్లో ఎంతవరకు నెపోటిజమ్ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు గురువారం "నెపోమీటర్"ను ప్రారంభించారు. ఇది ఐదు కేటగిరీలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్) నిర్మాత, ప్రధాన పాత్రలు, ఇతర పాత్రలు, దర్శకుడు, రచయిత ఆధారంగా సినిమాలో ఎంతమేరకు బంధుప్రీతి ఉందో నిరూపిస్తూ ఫలితాన్ని వెల్లడిస్తుంది. దీనికోసం సోషల్ మీడియాలో నెపోమీటర్ అని అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. అందులో అలియాభట్ సడక్-2 చిత్రం 98% నెపోటిస్టిక్ అని తెలిపింది. అంటే ఈ చిత్రంలో ఐదు కేటగిరీల్లోని నాలిగింట్లో బాలీవుడ్ ప్రముఖుల వారసులే ఉన్నారని స్పష్టం చేసింది. బాలీవుడ్లో నెపోటిజమ్ రూపుమాపాలన్న ప్రయత్నంతోనే దీన్ని ప్రవేశపెట్టామని సుశాంత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బయట నుంచి వచ్చేవారికి అవకాశాలు ఇవ్వని సినిమాలు చూడవద్దని అభిమానులను కోరారు. కాగా నెపోమీటర్ ఎక్కువ శాతాన్ని చూపిస్తే అది అందులో స్టార్ల కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నట్లు.. తక్కువగా చూపిస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారు సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు అర్థం. (సుశాంత్ ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు) View this post on Instagram #Sadak2 is 98% Nepotistic. We rated it based on 5 categories, Producer, Lead Artists, Supporting Artists, Director & Writer. 4 out of 5 categories have Bollywood Family members. When #nepometer is high, it’s time to #boycottbollywood Will you watch this movie? Tell us in comments. A post shared by Nepometer (@nepometer) on Jul 1, 2020 at 9:43pm PDT -
సుశాంత్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్
ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి వారం దాటుతున్న బాలీవుడ్లో మాత్రం ఇంకా ఆ మంటలు చల్లారలేదు. ప్రస్తుతం సుశాంత్ మరణానికి సంబంధించిన కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, మహేష్ భట్ కలిసివున్న పాత ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. దీనితో పాటు సుశాంత్ చనిపోవడానికి ముందు అతని ఫ్లాటులో సీసీ కెమెరాలు ఆఫ్ చేయబడ్డాయని, కొంత మంది స్నేహితులు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రాత్రి అతని గదికి వచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అతని ఫ్లాట్ నుంచి ఒక శబ్ధం వినిపించిందని, కానీ అది డిప్రషన్లో అరిచే అరుపు కాదని అంటున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: స్పందించిన సల్మాన్) సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తాడు మీద అతని చూపుడు వేలు, మధ్యవేలు, చిటికెన వేలు గుర్తులు మాత్రమే ఉన్నాయని మిగిలిన వేలి గుర్తులు లేవని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు సుశాంత్ ఆత్మహత్యకు ముందు రియా చక్రవర్తి సుశాంత్‌తో ఉన్న ఫోటోలన్నింటిని సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు కూడా వైరల్ వీడియోలో ఉంది. ఇంకా సుశాంత్ ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని మహేష్‌భట్ అన్నారని అది ఈ రోజు నిజమయ్యిందని, రియాతో సన్నిహితంగా ఉంటే చంపేస్తామని సుశాంత్‌ను ఎవరో బెదిరించినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రియా, మహేష్ భట్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలు ఎంత వరకు నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. రియాను సుశాంత్ చనిపోయిన తర్వాత పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్) -
‘క్రిమినల్’కు పాతికేళ్లు ఈ సందర్భంగా..
అక్కినేని నాగార్జున హీరోగా మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘క్రిమినల్’. మనీషా కోయిరాల, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సంగీతం దిగ్గజం ఎమ్ఎమ్ కీరవాణి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘తెలుసా మనసా’ సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పాతికేళ్లు పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా, ఈ సినిమాలోని తెలుసా మనసా పాట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. సినిమా విడుదలై పాతికేళ్లు అవుతున్న సందర్భంగా అనూప్ శంకర్ ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో పాడి నిస్వార్ధంగా సమాజానికి సేవ చేస్తున్న వారికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించారు. ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ నాగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇక తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు. Thank you anoop Shankar!! It’s been 25 years since this beautiful song was composed by @mmkeeravaani 🙏 so happy to know You are Dedicating this song to the Selfless hearts who serve society!!👉 https://t.co/0AtrQpfAzf#worldnursesday #tribute insta Id @singeranoopsankar — Nagarjuna Akkineni (@iamnagarjuna) May 12, 2020 చదవండి: రేపే హీరో నిఖిల్-పల్లవి వివాహం? పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’? -
కొన్ని అలా జరిగిపోతాయంతే
సినిమా: ఎన్నో అవాంతరాలను, వివాదాలను ఎదుర్కొని నిలబడ్డ నటి అమలాపాల్. నటిగా రంగప్రవేశం, ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ నటన ఇలా అన్నీ చకచకా అమలాపాల్ జీవితంలో జరిగిపోయాయి. ప్రస్తుతం అమలాపాల్ చాలా బిజీగా ఉంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఆమె నటించిన అదో అంద పరవై పోల చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియన్‌టెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగిన అమలాపాల్ తాజాగా బాలీవుడ్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమలాపాల్‌కు అలాంటి అవకాశం ముంగిటవాలింది. దర్శకుడు మహేశ్‌భట్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో అమలాపాల్ నాయకిగా నటించనుంది. దీని గురించి అమాలాపాల్ స్పందిస్తూ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియకుండానే జరిగిపోతాయని అంది. అలాంటిదే బాలీవుడ్ దర్శకుడు నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం రావడం అని పేర్కొంది. మహేశ్‌భట్ యూనిట్‌తో అమలాపాల్ ఆయన చిత్రాల్లో నటించాలని దక్షిణాది హీరోయిన్లు కలలు కంటారని అంది. ఆయన చిత్రాల్లో కథానాయకి పాత్రలు బలంగానూ, అర్థవంతంగానూ ఉంటూ జీవితంలో గుర్తుండిపోతాయని పేర్కొంది. ఆయన స్కూల్లో నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పింది. ఆయని నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌ను పుషబ్దీప్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పింది. ఆయన చాలా ప్రతిభావంతుడైన దర్శకుడని పేర్కొంది. ఆయన ఇచ్చిన కథను చదివినప్పుడు ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంటుందని భావించానని తెలిపింది. ఈ వెబ్ సిరీస్ 1970 కాలానికి చెందిన విజయం కోసం పోరాడే దర్శకుడికి, ఒక స్టార్ హీరోయిన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే ఇతి వృతంతో కూడిందట. హిందీ చిత్రం చిచ్చోర్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రశంసలు పొంది మహేశ్ భట్‌ను ఆకట్టుకున్న తాహీర్ ఈ వెబ్ సిరీస్‌లో దర్శకుడి పాత్రలోనూ అమలాపాల్ స్టార్ హీరోయిన్‌గానూ నటించనున్నారు. ఇందులోని సవాల్‌తో కూడిందని అందుకే మూడు నెలల పాటు వేషభాష, హావబావాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆ సిరీస్ యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం ఈమె ఆడు జీవితం, కడావర్ అనే రెండు మలయాళ చిత్రాలతో పాటు తెలుగులో రీమేక్ అవుతున్న అసురన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఘోస్ట్ స్టోరిస్ అనే హిందీ చిత్రంలోనూ అమలాపాల్ బిజీగా ఉంది. -
పర్వీన్ బాబీగా అమలాపాల్?
‘‘1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్ ప్రయాణం మొదలుపెడుతున్నాను’’ అని ఆ మధ్య ప్రకటించారు హిందీ దర్శక–నిర్మాత మహేశ్ భట్. అయితే ఇది నటి పర్వీన్ బాబీకి, మహేశ్ భట్‌కి మధ్య జరిగిన వాస్తవ కథే అని బాలీవుడ్ టాక్. పర్వీన్ బాబి బయోపిక్ తరహాలోనే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. పర్వీన్ బాబీగా అమలాపాల్ నటించబోతున్నారన్నది తాజా వార్త. పర్వీన్ బాబీ పాత్రకు అమలా పాల్ కరెక్ట్‌గా సరిపోతారని టీమ్ భావించారట. ఈ వెబ్ సిరీస్‌ను మహేశ్ భట్, ముఖేష్ భట్ కలిసి విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తారు. త్వరలోనే ఈ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారట అమలా పాల్. -
ఇలా జరుగుతుందని ముందే చెప్పానా!
తల్లిదండ్రులు మహేష్ భట్, సోనీ రాజ్దాన్ స్పూర్తితో సినిమాల్లోకి వచ్చారు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. మహేష్ భట్ దర్శక నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్న అలియా.. నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తోనే హిట్ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్ర, సడక్-2 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. టాలీవుడ్‌లోనూ సందడి చేయనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్మకత్వంలో భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఆమె నటిస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన అలియా తండ్రి మహేష్ ప్రవర్తన పట్ల అసహనానికి గురయ్యారు. మహేష్ భట్ కూతురు, అలియా సోదరి షాహిన్ భట్ తాను డిప్రెషన్‌కు గురైన నాటి విషయాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భట్ కుటుంబం మొత్తం హాజరైంది. ఈ ఈవెంట్‌కు అలియా భట్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి ప్రవర్తనను చూసి అలియా కాస్తా నిరాశకు గురయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు భట్ సహనం కోల్పోయి మీడియాపై విరుచుకుపడ్డాడు. మధ్యలో అలియా కలుగజేసుకొని తండ్రిని శాంతించాలంటూ పక్కన నుంచి సైగలు చేసినా.. ఆయన పట్టించుకోకుండా అలాగే మాట్లాడాడు. దీంతో అలియా కాస్తా తండ్రి ప్రవర్తన పట్ల అసహనానికి గురయ్యారు. ‘ఇలా జరుగుతుందని ముందే చెప్పానా’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram When daddy gets angry. #maheshbhatt got emotional during #shaheenbhatt book launch #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Dec 7, 2019 at 1:52am PST -
తండ్రిని మించిన తార
ఆలియా భట్ ఒక ఇంటర్వ్యూలో తనను తాను ‘డఫర్’గా పేర్కొంది. అంటే ‘చవటాయి’ అని అర్థం. అవును. ఆమెకు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు. తలసరి ఆదాయం ఎంతో తెలియదు. ఇవన్నీ తెలిసినవారి మీద, ఆమె మీద జోకులు కట్ చేసే వారి మీద కెమెరా పెట్టి యాక్షన్ అంటే వాళ్లు కూడా ‘డఫర్’లు అవుతారు. ఆమె ‘జీనియస్’ అవుతుంది. నటనకు సంబంధించిన ముఖకవళికలకు ఒక ఎన్సైక్లోపిడియా ఉంటే ఆలియా ఒక ఎన్సైక్లోపిడియా. నటిని నటన అడగాలి. భావోద్వేగం అడగాలి. మంగళయాన్‌ను సక్సెస్ చేసిన శాస్త్రవేత్త పేరు కాదు. ఇవాళ ఆలియా భట్ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరు. ఆమె డేట్స్ కోసం బాలీవుడ్ పడిగాపులు గాస్తోంది. డైరెక్టర్లు స్క్రిప్ట్‌లు పట్టుకొని చక్కర్లు కొడుతున్నారు. హీరోలు ఖాళీగా కూర్చుని ఉన్నారు. అయితే ఈ స్థితికి ఆలియా అంత సులువుగా రాలేదు. ఆమె వెండి స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టి ఉండవచ్చు. అయితే కెమెరాకు ఆ చరిత్ర అక్కర్లేదు. అది కేప్చర్ చేసేది ముఖాన్ని. ఆ ముఖంలో అందం, ప్రతిభ ఉండాలి. అవి ఉన్నాక కూడా కష్టపడి తన దగ్గరకు చేరుకుంటేనే అది కటాక్షించేది. ఓటమి ఎరగని పాప ఆలియా భట్ మహేష్ భట్ కుమార్తె. మహేష్ భట్ రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటి భార్య కిరణ్ భట్. రెండో భార్య బ్రిటిష్ మూలాలు ఉన్న నటి సోని రాజ్దాన్. ఆలియా మహేష్‌భట్‌కు–సోని రాజ్దాన్ల రెండో కూతురు. చిన్నప్పుడు ఆలియా పేరు ‘ఆలూ’ (బంగాళాదుంప). ఇప్పటికీ కొందరు ముద్దుగా ‘ఆలూ’ అనే పిలుస్తారు. దాని కారణం ఆలియా చాలా బొద్దుగా ఉండేది. చాలామంది ఆ అమ్మాయిని అబ్బాయి అనుకునేవారు. ‘ఈ బాబు ఎంత ముద్దొస్తున్నాడో’ అని బుగ్గలు పుణికితే ‘నేను అమ్మాయిని’ అని ఉడుక్కునేది. చిన్నపిల్ల కాబట్టి తల్లిదండ్రులు ముద్దు చేయడంతో లోకం తన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని అనుకునేది. నాలుగో క్లాస్‌లో స్కూల్లో తల మీద పుస్తకాలు పెట్టుకొని పరిగెత్తే పోటీ పెడితే అందరి కంటే ముందు ఉండాలని పరిగెత్తితే పుస్తకాలు కింద పడిపోయాయి. పోటీలో ఫెయిల్ అయిపోయింది. ఆ చిన్న వయసులో ఆలియాకు ఓటమి అంటే ఏమిటో మొదటిసారి తెలిసింది. ఆ రోజంతా ఇంట్లో ఏడుస్తూనే ఉంటే తల్లిదండ్రులకు తాము చేసిన తప్పు అర్థమైంది. అప్పుడు తండ్రి అన్నాడు ‘ఓటమి గెలుపుకు మొదటి మెట్టు. ఈసారి గెలువు పట్టుదలగా. గెలుపు పెద్ద అసాధ్యమైన విషయం కాదు’ అని. అది తండ్రి నుంచి అందుకున్న మొదటి పాఠం. ‘ఏమీ నేర్పించని తండ్రి’ ఆలియా చిన్నప్పుడు గోవిందా ఫ్యాన్. గోవిందా పాటలు టీవీలో చూసి గోవిందా, కరిష్మా కపూర్లు విదేశాలలో రోడ్లమీద, బిల్డింగ్‌ల మీద, పార్కులలో డాన్సులు చేస్తుంటే ఇదేదో బాగుందే... నేనూ సినిమా యాక్టర్ అవుతా అనుకుంది. వయసు పెరిగే కొద్దీ మెల్లగా అర్థమైంది.. యాక్టింగ్ అంటే పాటలు మాత్రమే కాదు... డైలాగులూ ఎక్స్ప్రెషన్లూ ఉంటాయని. ‘అవి కూడా చేసేస్తాలే’ అని తండ్రితో అంది. ‘అయితే నువ్వు నా దగ్గర చేయొద్దు. వేరే డైరెక్టర్ దగ్గర చెయ్. నా దగ్గర చేస్తే నా మీద డిపెండ్ అయిపోతావ్’ అన్నాడు మహేష్ భట్. అంతేకాదు ‘నిన్ను నమ్మే ఒక డైరెక్టర్ దొరికేంత ప్రతిభ నీలో ఉందో లేదో నీకు తెలియాలి’ అని కూడా అన్నాడు. ఆలియాకు పట్టుదల వచ్చింది. బరువు తగ్గింది. యాక్టింగ్ మీద శ్రద్ధ పెట్టింది. అందరూ కొత్తవాళ్లు తిరిగినట్టే తానూ దర్శకుల దగ్గరకు అవకాశాల కోసం తిరిగింది. చివరకు కరణ్ జోహర్ ఆమెకు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో బ్రేక్ ఇచ్చాడు. ఆ సినిమా మొదటిరోజు షూటింగ్‌కు వెళ్లేటప్పుడు ఆలియాకు చాలా భయం వేసి తండ్రికి మెసేజ్ చేసింది ‘నాన్నా... భయంగా ఉంది’ అని. ఆయన మెసేజ్ పెట్టాడు ‘వెంటనే ఆఫీస్‌కు రా’ అని. ఆఫీసుకు వెళితే తండ్రి అనునయిస్తాడని వెళ్లింది. కాని అక్కడ పెద్ద దర్బార్‌లాగా అందరినీ కూచోబెట్టి ‘ఇప్పుడు చెప్పు... అందరికీ నీకెందుకు భయం వేస్తోందో’ అనేసరికి ఆలియా ఒకటే ఏడుపు. ఏడ్చి ఏడ్చి మెల్లగా తేలిక పడింది. ‘సెట్లో ఏడవకుండా ఇక్కడే ఏడ్చేశావ్. ఇక పోయి హాయిగా యాక్టింగ్ చేసుకో’ అని చెప్పి పంపాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పెద్ద హిట్ అయ్యింది. ఆలియా స్టార్‌గా అవతరించింది. మహేష్ భట్ వచ్చి తొలి ఆటోగ్రాఫ్ అడిగితే ‘థ్యాంక్యూ నాన్నా... ఏమీ నేర్పకుండా నన్ను కాపాడినందుకు’ అని రాసి సంతకం పెట్టింది. దానిని మహేష్‌భట్ దాచుకున్నాడు. నటిగా ఎదిగింది సినిమా పరిశ్రమలో తారగా ఉద్భవించడం వేరు... నటిగా ఆవిష్కృతం కావడం, ఎదగడం వేరు. ఏదో గ్లామర్ డాల్‌గా ఉన్న ఆలియాను దర్శకుడు ఇంతియాజ్ అలీ ‘హైవే’ కోసం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ సినిమాలో డబ్బున్న అమ్మాయి ఆలియాను కొంతమంది కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ అయ్యాక ఆ అమ్మాయి ఒక లారీ ప్రయాణంలో తనను తాను కనుగొనడమే సినిమా. ఆ సినిమా కోసం ఆలియా నిజంగానే ఒక లారీ క్లీనర్ స్థాయి మనిషిలా ఉండటం నేర్చుకుంది. రోడ్డు ప్రయాణాల్లో ఉండేవారు వ్యవహరించినట్టే వ్యవహరించడం మొదలుపెట్టింది. రోడ్డు మీదే తినడం, రోడ్డు పక్కనే నిద్రపోవడం ఆ శ్రమ స్క్రీన్ మీద కనపడింది. సినిమా రిలీజయ్యాక జనం ఆలియాకు బ్రహ్మరథం పట్టారు. తండ్రి నిశ్శబ్దంగా గర్వపడ్డాడు. హిట్ సినిమాలు ‘టూ స్టేట్స్’, ‘హంప్టీ శర్మకి దుల్హనియా’, ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’, ‘‘బదరీనాథ్ కీ దుల్హనియా’, ‘రాజీ’, ‘గల్లీ బాయ్’.... ఆలియా చేసిన సినిమాలలో తొంభై శాతం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆమె పాకిస్తాన్లో భారతీయ గూఢచారిగా నటించిన ‘రాజీ’ మహిళా ప్రధాన పాత్రగా విడుదలైన హిందీ సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ఇది ఆలియా ఘనత. ఈ స్టార్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండటం వల్ల తెలుగువారు ఆమె నటనను మన మాట పలుకుతుండగా చూడనున్నారు. ఆలియా వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు. ఎప్పుడూ ఆమె వార్తలలో ఉంటుంది. ఆమె ఉన్న చోట మీడియా వార్త సృష్టిస్తుంటుంది. ఆమె ఆకర్షణ శక్తి అలాంటిది. చుట్టూ ఎన్ని జరిగినా ఏకాగ్రత నటన నుంచి మరల్చకపోవడం, కష్టపడటం మానకపోవడం ఆమె నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఆలియాను నిన్నమొన్నటి దాకా మహేష్‌భట్ కుమార్తె అనేవారు. ఇవాళ మహేష్‌భట్‌ను ఆలియా తండ్రి అంటున్నారు. ఆలియా కచ్చితంగా తండ్రిని మించిన తార. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
‘మీ భార్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’
‘గజల్ కింగ్’గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు జగ్జీత్ సింగ్ వర్ధంతి నేడు. భౌతికంగా దూరమైనప్పటికీ.. ‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో’ పాటకు గాత్రదానం చేసిన ఆయన.. నేటికీ అభిమానుల మనస్సులో సజీవంగా ఉన్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన శ్రావ్యమైన గొంతుతో ఎంతో మందికి ఊరట కలిగించిన జగ్జీత్ జీవితంలో మాత్రం విషాదఘటనలే ఎక్కువగా ఉండటం విచారకరమైన అంశం. కాగా గురువారం నాటికి జగ్జీత్ తుదిశ్వాస విడిచి ఎనిమిదేళ్లు అయిన సందర్బంగా సగటు అభిమానులతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటున్నారు. ‘ నా గాయాలను తన గొంతులో పలికించారు. ఆర్త్ సినిమా పాటలు ఇంకా నా గుండెలో నిలిచే ఉన్నాయి. నా జీవితాన్ని సార్ధకం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ జగ్జీత్ సింగ్‌తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 1982లో మహేష్ భట్ దర్శకత్వంలో షబానా అజ్మీ, కుల్‌భూషణ్ కర్బందా, స్మితా పాటిల్, రోహిణి హట్టంగడి తదితర తారాగణంతో తెరకెక్కిన ఆర్త్ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. భర్త వదిలేసిన స్త్రీగా, ఒంటరి మహిళగా షబానా అద్భుత నటనకు.. జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు జగ్జీత్ సింగ్, చిత్రా సింగ్ సంగీతం అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే తొలుత జగ్జీత్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడని చిత్రా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భార్యగా ఆయన జీవితంలో అడుగుపెట్టడం విశేషం. 1967లో ప్రారంభమైన జగ్జీత్-చిత్రాల పరిచయం క్రమేపీ బలపడి ప్రేమ బంధానికి దారితీసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలకు కలిసి పనిచేసిన వీరు ‘హిట్ పెయిర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిత్రా ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చారట జగ్జీత్. అయితే అప్పటికే తనకు డెబో ప్రసాద్‌తో పెళ్లి కావడం, ఓ కూతురు కూడా ఉండటంతో జగ్జీత్ ప్రేమను ఆమె నిరాకరించారట. భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన మరో పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పారట. అయితే జగ్జీత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా తన ప్రయత్నాలు కొనసాగించారట. చిత్ర మీద ఉన్న అమితమైన ప్రేమతో ఏకంగా ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్లి... ‘ నేను మీ భార్యను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను’ అని చెప్పారట. చెప్పినట్లుగానే ప్రసాద్- చిత్ర విడాకులు తీసుకున్న అనంతరం 1969లో జగ్జీత్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు చిత్ర మొదటి భర్త కూతురు మోనికాకు కూడా తండ్రిప్రేమ పంచారు. కొడుకు మరణం.. కూతురు ఆత్మహత్య సాఫీగా సాగిపోతున్న సంగీత జంట జగ్జీత్- చిత్రాల జీవితంలో వారి కొడుకు వివేక్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 1990లో జరిగిన ఓ కారు ప్రమాదంలో వివేక్(20) దుర్మరణం పాలయ్యాడు. ఈ బాధతో చిత్ర.. సంగీతాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. జగ్జీత్ కూడా ఏడాది పాటు సంగీతానికి దూరం అయినప్పటికీ.. తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను సంగీతం రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన చిత్ర దంపతులను 2009లో మరో విషాదం వెంటాడింది. తన వైవాహిక జీవితం విఫలమైందనే బాధతో చిత్ర కూతురు మోనికా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో 2011, అక్టోబరు 10న తన 70వ ఏట.. తన భార్య చిత్రను ఒంటరిని చేస్తూ జగ్జీత్ తుదిశ్వాస విడిచి ఆమెను మరింత విషాదంలోకి నెట్టారు. అభిమానులను శోకసంద్రంలో ముంచారు. He made my ‘wounds’ sing. The songs of Arth still resonate in my heart. Thank u for touching my life. 🙏🙏🙏 https://t.co/7h6pYYaXnf — Mahesh Bhatt (@MaheshNBhatt) October 10, 2019 -
గర్భవతిగా ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చా : నటి
బాలీవుడ్ : 1993లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గుమ్రహా. ఈ సినిమాలో మహేష్ భట్ భార్య, అలియా భట్ తల్లి సోని రజ్దానా సిగరెట్లు తాగే మహిళ పాత్ర చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అలియా కడుపులో ఉన్న విషయం తెలియక ఆ పాత్ర చేశానంటూ ట్వీటర్ ద్వారా తన సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి, సంజయ్ దత్‌లు హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో తన పాత్ర వినూత్నంగా ఉంటూ అందరి ప్రశంసలు అందుకుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తను గర్భవతిగా ఉన్న విషయం తెలియక చాలా సిగరెట్లు కాల్చానని చెప్పింది. అలాగే షూటింగ్లో శ్రీదేవితో తనకు మంచి అనుబంధం ఎర్పడిందని, అలాంటి గొప్ప నటితో కలిసి నటించానంటే తాను నమ్మలేక పోతున్నానని, ఇది ఓ గొప్ప అనుభూతి అంటూ సోని రజ్దానా ట్వీటర్లో పెర్కోన్నారు. -
కంగనా చిన్నపిల్ల..చనిపోయేదాకా నేనింతే!
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, భట్ కుటుంబం మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారని ఆమె సోదరి రంగోలి చందేల్ ట్వీట్ చేశారు. అదే విధంగా వీలు చిక్కినప్పుడల్లా అలియా భట్ నటనను విమర్శిస్తూ కంగనా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంగనాకు అవకాశాలు ఇచ్చి తన భర్త (మహేష్ భట్) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె.. ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని అలియా తల్లి సోని రజ్దాన్ మండిపడ్డారు. అయితే కంగనా తనను విమర్శించినప్పటికీ ఆమే తన అభిమాన నటి అని, ఇక తనపై కంగనాకు ఉన్న అభిప్రాయం గురించి పట్టించుకోనని అలియా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి మహేష్ భట్ కంగనా తన కూతురు వంటిదంటూ.. కంగనా, రంగోలి ఆరోపణలను తేలికగా తీసిపారేశారు. ఈ విషయం గురించి మహేష్ భట్ మాట్లాడుతూ.. ‘కంగనా చిన్నపిల్ల. నా కూతురు వంటిది. మాతోనే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తన బంధువు నాపై ఏవో ఆరోపణలు చేసినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల ప్రవర్తన పట్ల వేలు ఎత్తి చూపే సంస్కృతి మనది కాదు. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం సాధ్యం కాని పని. అలాంటివి నేను చేయను కూడా. నాకున్న సంస్కారం కారణంగానే ఎవరేమన్నా ఊరుకున్నాను. చనిపోయేదాకా ఇలాగే ఉంటాను’ అంటూ పరోక్షంగా కంగనా తీరును ఎత్తిచూపారు. కాగా 2006 గ్యాంగ్‌స్టర్ సినిమాతో కంగనా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేష్ భట్ తన సోదరుడితో కలిసి నిర్మించారు. అయితే ఈ సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన కారణంగా మరో సినిమాలో నటించాల్సిందిగా కోరగా.. అందులోని సూసైడ్ బాంబర్ పాత్ర నచ్చకపోవడంతో కంగనా మహేష్ ఆఫర్‌ను తిరస్కరించిందని రంగోలి పేర్కొంది. దీంతో కంగనాపై కక్ష గట్టిన మహేష్ భట్.. వాహ్ లంహే చిత్రాన్ని చూసేందుకు కంగనా రాగా ఆమెపై చెప్పు విసిరాడని ఆరోపించింది. ప్రివ్యూ థియేటర్లోకి కంగనాను అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించడంతో ఆ రాత్రంతా కంగనా ఏడుస్తూనే ఉందని చెప్పుకొచ్చింది. -
ముంబైలోనే మకాం
తిరిగి తిరిగి ముంబైలోనే మకాం పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘సడక్’ టీమ్. 1991లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సడక్ 2’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ చిత్రం కోసం మళ్లీ డైరెక్టర్ చైర్లో కూర్చోనున్నారు మహేశ్‌భట్. చివరిసారిగా 1999లో ‘కారతూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు మహేశ్‌భట్. తాజాగా ఆయన తీయనున్న ‘సడక్ 2’లో సంజయ్‌దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్యతారలుగా నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ని ముందుగా రొమేనియాలో ప్లాన్ చేశారు. అక్కడి లొకేషన్లను కూడా పరిశీలించారు. అక్కడి లొకేషన్స్ నచ్చినప్పటికీ లోకల్ కాస్ట్ అండ్ క్రూ, కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలోనే జరపాలనుకుంటున్నారు. ఆల్రెడీ ముంబైలోని ఓ స్టూడియోలో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. తొలుత సంజయ్‌దత్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు టీమ్. మే 15 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. -
‘కంగనాపై మహేష్ భట్ చెప్పు విసిరారు’
ముంబై : బాలీవుడ్ భామలు కంగనా రనౌత్, అలియా భట్ల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారని ఆమె సోదరి రంగోలి చందేల్ తాజా ట్వీట్లో పేర్కొనడం సంచలనం రేపింది. 2006లో కంగనా రనౌత్ తాను నటించిన వాహ్ లంహే చిత్రాన్ని చూసేందుకు రాగా ఆమెపై మహేష్ భట్ చెప్పు విసిరాడని రంగోలి చందేల్ వరుస ట్వీట్లలో భగ్గుమన్నారు. ప్రివ్యూ థియేటర్లోకి కంగనాను అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించడంతో ఆ రాత్రంతా కంగనా ఏడుస్తూనే ఉన్నారని, అప్పుడామెకు 19 ఏళ్లు ఉంటాయని అన్నారు. తాజా ట్వీట్లతో కంగనా సోదరి రంగోలి, మహేష్ భట్ భార్య, అలియా భట్ తల్లి సోని రజ్దాన్ మధ్య సాగుతున్న ట్వీట్ వార్ మరింత ముదిరింది. కంగనా రనౌత్‌కు అవకాశాలు ఇచ్చి తన భర్త (మహేష్ భట్) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని సోని రజ్దాన్ మండిపడిన విషయం తెలిసిందే. అలియా భట్‌పై గత కొంతకాలంగా వీలుచిక్కినప్పుడల్లా కంగనా రనౌత్ మండిపడుతున్నారు. తాను నటించిన మణికర్ణిక మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపించినా, అలియా మౌనం దాల్చడంపై కంగనా భగ్గుమన్నారు. అలియా భట్ నటనను చిన్నబుచ్చుతూ తనను ఆమెతో పోల్చవద్దని క్వీన్ పేర్కొనడం కూడా కంగనా, అలియా భట్ల మధ్య దూరాన్ని పెంచింది. -
మా అమ్మాయి లవ్‌లో ఉంది
ఎయిర్పోర్ట్, రెస్టారెంట్, పార్టీలు.. ఇలా ఎక్కడికెళ్లినా జంటగా దర్శనం ఇస్తున్నారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది కానీ ఈ విషయంపై అధికారికమైన స్పష్టత రాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రేమను ఆలియా తండ్రి, ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ అధికారికంగా ధ్రువీకరించారు. ‘‘రణ్‌బీర్ అంటే నాకు ఇష్టం. గొప్ప వ్యక్తి. రణ్‌బీర్, ఆలియా లవ్‌లో ఉన్నారని తెలుసుకోవడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. వారి రిలేషన్షిప్ సవ్యంగానే సాగుతోంది. ఈ బంధాన్ని వాళ్లు పెళ్లి వరకూ తీసుకెళతారా? లేదా? అనేది చూడాలి. నా అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది వారి పెళ్లి జరిగే అవకాశం ఉంది. కానీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ముందే ఊహించి చెప్పలేం’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్‌భట్ చెప్పుకొచ్చారు. -
హింసను బయటకు చెప్పకూడదా?
‘‘అందరూ తమ బాధను మర్చిపోవడానికో, తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికో లైంగిక వేధింపుల గురించి బయటకు మాట్లాడుతున్నారు. నేను ఒకప్పుడు మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండేదాన్ని. అతన్ను నన్ను శారీరకంగా హింసించే వాడు. ఆ హింసను బయటకు చెప్పడానికి నేను మొహమాటపడలేదు, భయపడలేదు’’ అని బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత, ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తనయ పూజా భట్ పేర్కొన్నారు. ‘మీటూ’ ఉద్యమం ఎవ్వరికీ వినిపించని గోడులను నిర్భయంగా బయటకు చెప్పుకునే అవకాశం తీసుకువచ్చింది. ప్రపంచంలోని అన్ని మూలలా ఉన్న ప్రతి ఒక్కరూ తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటకు చెప్పుకోగలుగుతున్నారు. కేవలం వాళ్ల బాధను వెలిబుచ్చుకోవడం కోసమే కాదు. ఇలాంటివి మళ్లీ జరక్కుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ ఉద్యమం సాగుతోంది. తాజాగా ఈ ఉద్యమంలో తన గొంతునూ వినిపించారు పూజా భట్. లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కానీ మన ఇళ్లలో, మన పడకగదుల్లో మార్పు వచ్చే వరకూ ఏ మార్పు రాదు. కేవలం అబద్ధాలకే అలవాటు పడ్డ ప్రపంచంలో నువ్వు నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ప్రజలు చెవిటివారిలా నటించడంలో ఆశ్చర్యం లేదు. మార్పు గురించి అందరం మాట్లాడతాం తప్పితే ఆ దిశగా ఎవ్వరం నడవం. మన ఇంట్లో సురక్షితమైన వాతావరణం ఉంటే ప్రపంచం 90 శాతం శాంతియుతంగా మారిపోతుంది. ఎందుకంటే 90 శాతం వేధింపులు మన ఇంట్లోనే జరుగుతాయి కాబట్టి. నా సమస్య గురించి బయటకు చెప్పినప్పుడు ఎందుకు ఇంట్లో సమస్యను పబ్లిక్‌లో పెడుతున్నావేంటి? అన్నారు. మహేశ్ భట్ కూతుర్ని కాబట్టి నాకు బాధ తక్కువగా ఉంటుందా? హింసను బయటకు చెప్పకూడదా’’ అన్నారు పూజా. -
20 ఏళ్ల తర్వాత!
ఇక మహేశ్ భట్ మెగాఫోన్ పట్టుకునే చాన్స్ లేదు. డైరెక్షన్‌కి ఫుల్స్టాప్ పెట్టేసినట్లే అని ఎవరికి వాళ్లు ఫిక్స్ అవుతున్న తరుణంలో ఆయన ఓ షాకిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘కార్తూస్’ 1991లో విడుదలైంది. ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నారు కాబట్టి అలా అనుకోవడం సహజం. అయితే 70వ పుట్టినరోజు (గురువారం) నాడు తన కొత్త సినిమాని మహేశ్ భట్ ప్రకటించారు. 1991లో తాను తెరకెక్కించిన ‘సడక్’ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి పూనుకున్నారు. ‘అర్థ్, సారాన్ష్, దిల్ హై కే మాన్తా నహీ, ఆషికీ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మహేశ్ భట్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ‘సడక్ 2’ నటీనటుల విషయానికి వస్తే... సంజయ్‌దత్, ఆలియా భట్, పూజా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రలు చేయనున్నారు. సంజయ్ దత్, పూజా భట్ తొలి పార్ట్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో తండ్రి మహేశ్ భట్‌తో తొలిసారి వర్క్ చేయనున్నారు ఆలియా భట్. అలాగే సిస్టర్ పూజా భట్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నారు. మహేశ్ భట్ దర్శకత్వంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు సంజయ్ దత్. వీరిద్దరి కాంబినేషన్లో చివరిసారిగా 1993లో ‘గుమ్రాహ్’ సినిమా వచ్చింది. అలాగే ‘ఆషికీ 2’ తర్వాత ముఖేష్ భట్ నిర్మాణంలో ఆదిత్యారాయ్ కపూర్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ‘సడక్ 2’ సినిమాకు సంజయ్‌దత్‌నే అంకురార్పణ చేశారట. ‘‘నాన్నగారి బర్త్‌డేకి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నటించాలన్న నా కల నిజమైంది’’ అని ఆలియా ఓ ఎమోషనల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ చిత్రం 2020 మార్చి 25న రిలీజ్ కానుంది. -
ఆ విషయం అలియానే అడగండి : నటి
సాక్షి, ముంబై : రణ్‌బీర్ కపూర్- అలియా భట్లు ప్రేమలో ఉన్నారంటూ బీ- టౌన్లో వార్తలు విన్పిస్తోన్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్, సోదరి రిదిమా కూడా అలియాతో సత్సంబంధాలే కలిగి ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెతో టచ్‌లో ఉండడంతో పాటు ఇటీవల రణ్‌బీర్ కుటుంబమంతా కలిసి అలియాను డిన్నర్‌కి కూడా తీసుకువెళ్లారు. తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామంటూ రణ్‌బీర్ అంగీకరించగా.. అలియా మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. అయితే రణ్‌బీర్- అలియాల రిలేషన్షిప్ గురించి అలియా సోదరి పూజా భట్‌ను ప్రశ్నించగా.. ‘ఈ విషయం గురించి మీరు అలియానే అడగాలి. నా వ్యక్తిగత విషయాల గురించి అడిగితే సమాధానం చెప్పగలను కానీ నా సోదరి విషయంలో ఎలా మాట్లాడగలను’ అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా ‘ప్రస్తుతం అలియా కెరీర్ లైమ్‌లైట్‌లో ఉంది. తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ విషయంలో నేను, నాన్న(మహేష్ భట్) సంతోషంగా ఉన్నాం. తన కెరీర్ గురించి సలహాలు ఇవ్వగలం గానీ తన వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదంటూ’ వ్యాఖ్యానించారు. కాగా మహేష్ భట్ మొదటి భార్య కిరణ్ భట్ కూతురు పూజా భట్ నటిగా, ఫిల్మ్‌మేకర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. -
‘ఆషికీ 3’ హీరోగా సిద్ధార్థ్.!
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్టైనర్లు ఆషికీ, ఆషికీ 2. ముఖ్యంగా ఆషికీ 2 ఘనవిజయం సాధించటమే కాదు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సిరీస్‌లో మరో భాగాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే మూడో భాగంలో హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత మహేష్ భట్ ఆషికీ 3కి సంబంధించి సిద్ధార్థ్ తో చర్చలు జరిపారు. సిద్ధార్థ్ కూడా ఈ సూపర్ హిట్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆషికీ 2 చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వంలో వహించారు. మరో మూడో భాగానికి మోహితే దర్శకత్వం వహిస్తారా లేక మరో దర్శకుడు తెర మీదకు వస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
అలియాకు ప్రేమతో...
ముంబై: అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాజీ’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ‘రాజీ’ విజయాన్నిఎంజాయ్ చేస్తున్న అలియాకు మరో కానుక అందింది. ‘రాజీ’ విజయవంతమైన సందర్భంగా అలియ తండ్రి మహేష్ భట్ కూతురును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా అలియాను ఉద్దేశిస్తూ ట్విటర్లో ‘నా ప్రియమైన అలియా నిన్ను చూసి నేను చాలా సంతోష పడుతున్నాను, నువ్వు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి. నిన్ను నువ్వు మెరుగుపర్చుకోవడాన్ని ఒక వ్యసనంగా మార్చుకో.. ప్రేమతో మీ నాన్న’ అంటూ మేసేజ్ చేశారు. శుక్రవారం విడుదలైన ‘రాజీ’ సినిమా తొలిరోజు 7.53 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే వారాంతంలో(శని, ఆదివారాల్లో) 50 శాతం అధికంగా వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ. 32.94 కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది. అలియా నటన, బలమైన కథ ‘రాజీ’ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘రాజీ’ చిత్రాన్ని హరిందర్ సిక్క రాసిన పుస్తకం ‘కాలింగ్ సేహమత్’ ఆధారంగా తెరకెక్కించారు. గూఢచర్యం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో అలియా పాక్ సైనిక రహస్యాలను భారతీయ ఆర్మీకి చేరవేసే ‘స్పై’గా అద్భుతంగా నటించి విమర్శకులను సైతం మెప్పించింది. -
‘శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు’
ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం నుంచి అభిమానులు, ఆమెతో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు, సహ నటులు ఇంకా తేరుకోలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమె జ్ఞాపకాలను గర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్‌భట్.. శ్రీదేవికి సినిమాల పట్ల ఉన్న అంకితభావాన్ని వెల్లడించారు. ‘‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్’’(ఔత్సాహిక నటినటులను ప్రోత్సాహించే షో) కార్యక్రమానికి హాజరైన భట్ తన అభిమాన నటి శ్రీదేవికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవికి సినిమాల పట్ల ఉన్న అంకితభావానికి అద్దం పట్టే ఘటన గురించి చెప్పారు. ‘గుమ్రాహ్ చిత్రాన్ని తీసేటప్పుడు నీటిలో తడుస్తూ నటించే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి వచ్చింది. కానీ అప్పటికే శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. శ్రీదేవి దగ్గరకు వెళ్లి షూటింగ్‌ను వాయిదా వేద్దామని చెప్పాను. కానీ శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు. జ్వరంతో బాధపడుతూనే గంటల తరబడి నీటిలో తడుస్తూ షూటింగ్లో పాల్గొన్నారు. ఆమెకు అంతటి అంకితభావం, కష్టపడే స్వభావం ఉన్నాయి కాబట్టే గొప్ప నటిగా ఎదిగార’ని మహేష్‌భట్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. -
విరుష్క...మరో హాట్ టాపిక్!
సాక్షి, ముంబై: నిన్నటిదాకా విరుష్క పెళ్లి హాట్ టాపిక్. ఇపుడిక కొత్త జంట విరాట్ కోహ్లి- అనుష్క శర్మ రిసెప్షన్ ఎక్కడజరుగుతోంది అని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి రిసెప్షన్ కార్డు నెట్ లో హల్చల్ చేస్తోంది. దీంతో విరుష్క వెడ్డింగ్ కార్డ్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ దీంతో ఫుల్ ఖుషీ. మరోవైపు ప్రముఖ కండోమ్ తయారీ కంపెనీ ఈ స్టార్ కపుల్‌కు విషెస్ తెలుపుతూ ట్విట్ చేయడం ఆసక్తికరంగామారింది. డిసెంబర్ నెల 21న ఢిల్లీలో తాజ్ డిప్లొమాటిక్ ఎంక్లేవ్‌లో బంధువులకు 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆహ్వానితులకు ఇన్విటేషన్లు కూడా అందాయి. దీంతో చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా ఈ కొత్త జంటకు విషెస్ పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆహ్వాన పత్రికను డైరెక్టర్ మహేశ్ భట్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వేల రూపాయల విలువైన రిసెప్షన్ కార్డుతోపాటు అతిథులను ఆహ్వానించే సమయంలో మరో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది కొత్త జంట. విందుకు ఆహ్వానిస్తూ పంపే కార్డుతోపాటు ఓ మొక్కను కూడా జతచేశారు.. పర్యావరణానికి ఎటువంటి హాని చేయని పేపర్‌బ్యాగులో ఆ మొక్కని పెట్టి కార్డుతో అందిస్తున్నారట. ప్రముఖ కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ ఇండియా విరాట్-కోహ్లీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం విశేషం. దీంతో బిప్స్- జాన్ అబ్రహం కండోమ్ యాడ్‌ను గుర్తు చేసుకుంటున్నారట అభిమానులు. They made it ! Our heartiest congratulations to Anushka & Virat. We pray that this love story goes on forever and ever. Amen !@imVkohli @anushkasharma pic.twitter.com/dk9sqm4WgU — Mahesh Bhatt (@MaheshNBhatt) December 13, 2017 Finally, Virat Kohli bowled his maiden over. #VirushkaKiShadi pic.twitter.com/skZWdcn20y — Durex India (@DurexIndia) December 12, 2017 -
హైవే స్పీడ్ ఆలియా ..!
ఆలియా ఇండస్ట్రీకి రావడమే సెన్సేషన్.. చేసే ప్రతి సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూనే పోయింది.హైవేతో ఫుల్ స్పీడ్‌లో ఆమె తన కెరీర్‌కు వేసుకున్న రూట్ అయితే.. తిరుగులేనిది. ఇప్పుడు ఆ స్పీడ్ అలాగే ఉంది. ఆ స్పీడ్‌లోనే దూసుకుపోతోన్న ఆలియా గురించి కొన్ని విశేషాలు.. తగ్గితేనే ఛాన్స్.. ఆలియాభట్ ఫ్యామిలీ అంతా సినిమా స్టార్సే! దీంతో చిన్నప్పట్నుంచే ఆలియా కూడా స్టార్ అవ్వాలనే అనుకుంది. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వకముందు ఆలియా చాలా లావు ఉండేదట. ఆ సినిమా దర్శకుడు కరణ్ జోహార్.. బరువు తగ్గితేనే హీరోయిన్ చాన్స్ అన్నాడట. ఇంకేముంది? బరువు తగ్గడమే పనిగా పెట్టుకుంది ఆలియా. వర్కవుట్స్ చేసి.. చేసి.. 16కిలోలు తగ్గి పర్ఫెక్ట్ హీరోయిన్ అనిపించుకునేలా తయారైంది. ‘ఎంత లావు ఉండేదాన్నో నేనప్పుడు’ అని చెప్పుకుంటుంది ఆలియా, తన ఫస్ట్ సినిమాను గుర్తు చేసినప్పుడల్లా! దేవుణ్ని నమ్మను! ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ బాలీవుడ్లో పెద్ద ఫిల్మ్‌మేకర్. స్వతహాగా ఆయన నాస్తికుడు. కూతురు ఆలియాను కూడా ఆయన అలాగే పెంచాడు. ఆలియా పుట్టుకతోనే నాస్తికురాలు. ఆమె దేవుణ్ని నమ్మదట. ‘నేను నాస్తికురాలిగానే పెరిగా’ అని చెప్పుకుంటుంది ఆలియా. హైవేతో రేసులోకి.. ఆలియా భట్‌కు సూపర్ బ్రేక్ ఇచ్చి, ఆమెను స్టార్ చేసిన సినిమా ౖ‘హెవే’. 2014లో వచ్చిన ఈ సినిమాలో ఒక టీనేజ్ యువతి పాత్రలో ఆలియా అద్భుతంగా నటించేసింది. పెద్ద పెద్ద స్టార్స్‌కే పోటీ ఇవ్వగల స్టార్‌గా ఆలియాను నిలబెట్టింది ఈ సినిమానే! దీంతో కెరీర్ మొదట్లో అంతంతమాత్రంగానే ఉన్న క్రేజ్ ఈ సినిమాతో అమాంతంగా పెరిగిపోయింది. సక్సెస్‌లు కూడా వరుసగా వచ్చిపడ్డాయి. ఈతరం హీరోయిన్లలో ఆలియా టాప్ రేసులోకి దూసుకొచ్చింది కూడా హైవేతోనే! మల్టీ టాలెంటెడ్.. ఆలియా మల్టీ టాలెంటెడ్. యాక్టింగ్ చిన్నప్పుడే మొదలుపెట్టేసింది. ఇరవై ఒక్కో ఏటే హీరోయిన్గా స్టార్స్‌కే గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడే ఆగిపోలేదామె. తనకెంతో ఇష్టమైన సింగింగ్ను వదులుకోలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన సినిమాలతో పాటు, ఇతరుల సినిమాలకూ పాటలు పాడడం మొదలుపెట్టింది. సరిపోలేదు. చాలా షోస్‌లో ప్రదర్శనలు ఇచ్చింది. తనకు ఇష్టమైన క్లాతింగ్ ఫీల్డ్‌లోకీ దిగిపోయి బిజినెస్ వైపుకూ అడుగులేసింది. ఇన్ని పనులు చేస్తున్నా యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం. అదే ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతుంది ఆలియా. ఆ ఫస్ట్ ప్రయారిటీలో ఆమె ఇంకెన్నో అద్భుతాలు సాధించాలని కోరుకుందాం! నేనూ నవ్వుకుంటా! ఆలియాపై వచ్చినన్ని ట్రోల్స్ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్‌పై రాలేదనే చెప్పాలి. ఒక టాప్ టీవీ షోలో ‘భారత రాష్ట్రపతి ఎవరు?’ అన్న ప్రశ్నకు ఆలియా తప్పుడు సమాధానం ఇచ్చింది. ఇక అది మొదలుకొని, ఆలియాకు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదని వేలల్లో జోక్స్ వచ్చాయి. కొన్ని నెలలపాటు ఈ జోక్స్ అలా కొనసాగుతూనే పోయాయి. తనపై వచ్చిన జోక్స్ చూసుకొని ఆలియా ఫీల్ అవ్వలేదు. ‘‘నేనేం ఫీల్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే కొన్ని జోక్స్ నాక్కూడా విపరీతంగా నచ్చాయి. ఆ జోక్స్‌కి నేనూ నవ్వుకుంటా.’’ అని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. -
ఆలియా భట్... ఒక తెలివైన అమ్మాయి
తెలివికి జనరల్ నాలెడ్జ్ కొలబద్ద అయితే గూగుల్ కంటే జీనియస్ మరొకరు ఉండరు.ప్రాణం లేని కంప్యూటర్లో జ్ఞానం ఉండొచ్చు.కాని ప్రాణం ఉన్న మనిషికి అనుభవం ఉంటుంది. ఒక మనిషి జ్ఞానాన్ని అంచనా వేయాల్సింది సామర్థ్యం, అనుభవం, చేస్తున్న ప్రయాణాన్నిబట్టి. అంతే తప్ప జీకేను బట్టి కాదు. ఆలియా క్విజ్ ఆన్సర్ చేయలేదు. కాని కెమేరాకు భేషైన సమాధానం చెప్పగలదు. జోసఫ్ కబీలా ఎవరో తెలుసా?ఆలోచించండి. తెలీదా? ఇతను కాంగో దేశ అధ్యక్షుడు. ఆ సంగతి మనకు తెలియనంత మాత్రాన మనం శుంఠలవుతామా? కాము. కనుక ఆలియా భట్ కూడా కాదు. ఆలియా భట్‌ను ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు ‘హోలీ ఎందుకు చేసుకుంటారు’ ఎందుకు చేసుకుంటారో అందరికీ ఎందుకు తెలియాలి? ఆలియా భట్‌కు తెలియదు. అంత మాత్రాన ఆమెను దద్దమ్మ కింద జమ కట్టవచ్చా? మగవాళ్లలో రాహుల్ గాంధీ మొద్దు పిల్లాడట. ఆడపిల్లల్లో ఆలియా భట్ మొద్దు అమ్మాయి అట. గుజరాత్ ముఖ్యపట్టణం ఏది, కాశ్మీర్లో ఏ నెలలో మంచు కురుస్తుంది, కన్యాకుమారి సముద్రపు లోతెంత.. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆమె జవాబు చెప్పలేదు. లేదా ఇలాంటి ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పలేకపోయింది. అంతమాత్రాన ఆమె మొద్దు అమ్మాయా? ఆమె మీద బోలెడు జోకులు పుట్టించారు. వాట్సప్‌లో ప్రచారం చేశారు. అరె బడుద్ధాయ్... చుట్టూ వంద మంది చూస్తూ ఉండగా వంద లైట్లు వెలుగుతుండగా కెమెరా రోల్ అవుతూ ఉండగా డైరెక్టర్ యాక్షన్ అని చెప్తే ఒక్క నత్తు కొట్టకుండా డైలాగ్ చెప్తూ అద్దిరిపోయే ఎక్స్ప్రెషన్ ఇస్తుందే... అలా నువ్వు చెయ్యగలవా? మరి నిన్ను మొద్దు పిల్లాడు అనవచ్చునా? ఆలియా జీనియస్. అవును. జనరల్ నాలెడ్జ్‌లో కాదు. నటనలో నిజంగానే జీనియస్. సినిమాల్లో నటించినంత మాత్రాన మన కోసం తెర మీద రకరకాల పాత్రలు పోషించినంత మాత్రాన వాళ్లు మనకు లోకువ అయిపోరాదు. వాళ్ల గురించి ఏదైనా సరే మాట్లాడేయవచ్చు అనే నైతిక హక్కు మనకు వచ్చేయరాదు. వాళ్ల జీవితాలు వాళ్లకుంటాయి. వాళ్ల కష్టాలు వాళ్లకుంటాయి. వాళ్ల ప్రయాణం, ఎదురు దెబ్బలు వాళ్లకుంటాయి. ఆలియా భట్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆ అమ్మాయి పేరు షాహీన్ భట్. ఆమె చాలా రోజులుగా డిప్రెషన్‌తో బాధ పడుతోంది. ఆమెకు నిద్ర పట్టదు. ఇన్సోమ్నియా. అలాంటి ఒక చెల్లెలు ఉంటే ఆ తోడబుట్టినదానికి ఎంత కష్టంగా ఉంటుంది. ఎంత ఆరాటంగా ఉంటుంది. ఆ చెల్లెలి కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. ఏం చేయగలదు. తను డాక్టర్ కాదు. నటి. అందుకే అలాంటి పాత్ర చేసింది. ‘డియర్ జిందగీ’ సినిమాలో ఆలియా భట్ పోషించింది అలాంటి పాత్రనే. అందులో ఆలియాకు డిప్రెషన్ వస్తుంది. నిద్ర లేమి బాధిస్తుంది. సైకియాట్రిస్టుగా ఉన్న షారుక్ ఖాన్‌ను కలిసి ధైర్యం తెచ్చుకుని కౌన్సిలింగ్ ద్వారా సమస్య దూరం చేసుకుని జీవితంలో ముందుకు సాగుతుంది. తన చెల్లెలు వంటి ఇంకా అలా ఉన్న సవాలక్ష మంది ఆడవాళ్ల గురించి కూడా ఆలియా ఆ పాత్ర చేసి ఉండవచ్చు. మరి అంతటి బాధ్యత ఉన్న అమ్మాయిని మొద్దమ్మాయి అని అనవచ్చా? ప్రాణసఖుడు అనే మాటను మనం వింటుంటాం. ఇది ఎవరో రాకుమారులకో చక్రవర్తులకో కాదు మహేష్ భట్‌కు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అతడు చాలామంది స్త్రీల ప్రాణసఖుడు. తన ఇరవయ్యో ఏటే కిరణ్ భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు నటి పూజ భట్, నటుడు రాహుల్ భట్ సంతానం. అయితే ఆ తర్వాత నటి పర్విన్ బాబీతో అతడి ప్రేమకథ మొదలైంది. దాంతో మొదటి పెళ్లి పెటాకులు అయ్యింది. ఆ తర్వాత మహేష్‌భట్ నటి సోనీ రాజ్దాన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా కలిగిన సంతానమే ఆలియా భట్, షాహీన్ భట్. ఈ పెళ్లి చేసుకున్నా మహేష్ తన సినీ జీవితంలో చాలా బిజీగా ఉండేవాడు. విడివిడిగా ఉన్నా అవసరమైనప్పుడు కలివిడిగా ఉండే కుటుంబం తమది అని వాళ్లు చెప్పుకుంటారు. అలాంటి వాతావరణంలో ఆలియా పెరిగింది. చదువులో అంతంత మాత్రం. పెద్దయ్యి ఏం కావాలి? దానికి సమాధానం గోవిందా, కరిష్మా కపూర్ల రూపంలో దొరికింది. ఆలియా చిన్నప్పుడు టీవీలో వీడియో కేసెట్ల సినిమాలు బాగా చూసేది. ఆ కాలంలో గోవిందా, కరిష్మా కపూర్లు హిట్ పెయిర్. వాళ్ల పాటల్లో తరచూ విదేశాలు కనిపించేవి. ఆ వీధులు, సరస్సులు, కొండలు.. అవి కాదు ఆలియాను ఆకర్షించింది... పల్లవికి ఒక డ్రస్సు, చరణానికి ఒక డ్రస్సు వాళ్లు మార్చేవారు. అది చూసి ‘అరె... సినిమాల్లో యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా... చాలా డ్రస్సులు మార్చవచ్చు’ అని అనుకుంది ఆలియా. ఇంటర్ పూర్తయ్యాక లండన్ వెళ్లి ఏదైనా యాక్టింగ్ స్కూల్లో చేరి వద్దామని కూడా అనుకుంది. కాని ఈలోపలే అదృష్టం కరణ్ జోహర్ రూపంలో తలుపు తట్టింది. 2012. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో అవకాశం. నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్. జాక్పాట్లాంటి అవకాశం. కాని నిర్వర్తించడానికి చిన్న ఇబ్బంది ఉంది. ఆలియా లావుగా ఉండేది. టీనేజ్‌లో ఉండే బేబీ ఫ్యాట్ అది. లేదా బాగా తినడం వల్ల వచ్చిన లావు కూడా కావచ్చు. ఆ లావు సగానికి తగ్గాలి అన్నాడు కరణ్ జొహర్. 17 ఏళ్ల వయసులో వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆలియా బరువు తగ్గడానికి నిశ్చయించుకుంది. తల్లి సోని రాజ్దాన్ సాయంతో డైటింగ్ మొదలెట్టింది. దాని వల్ల వచ్చిన ప్రమాదం తరచూ అనారోగ్యం పాలు కావడం. అంతే కాదు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లోకేషన్లలో చాలాసార్లు స్పృహ తప్పి పడిపోయేది. అంతే కాదు షూటింగ్లో రేయింబవళ్లు కష్టపడాల్సి వచ్చేది. ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అన్నీ చేసింది ఆలియా. అందరూ తెర మీద ఆమె మెరుపులాంటి సౌందర్యం చూశారు. దాని వెనుక పడ్డ కష్టం చూళ్లేదు. తనకు నచ్చిన రంగంలో రాణించడానికి ఇంత కష్టపడ్డ అమ్మాయి మొద్దమ్మాయి అవుతుందా? ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎవరైనా సరే చెంగు చెంగున గెంతే హీరోయిన్ వేషాలు వేసుకుని సుఖంగా ఉండేవారు. కాని ఆలియా మాత్రం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘హైవే’ పాత్రను అంగీకరించింది. పెళ్లి పీటల మీద నుంచి హైజాక్‌కు గురయ్యి, తనను హైజాక్ చేసిన మొరటు మనిషితోనే అనుబంధం పెంచుకునే పాత్ర అది. సినిమా అంతా డీ గ్లామర్‌గా పిచ్చి బట్టల్లో కనిపించాలి. రెండో సినిమాలోనే ఏ కొత్త హీరోయినూ అలా కనిపించదు. కాని ఆలియా నిర్ణయం సరైనది అని సినిమా రిలీజయ్యాక రుజువైంది. ‘హైవే’కు మంచి పేరొచ్చింది. ఆలియాకు ఇంకా మంచి పేరు. ఆలియా తెలివైనది. ఆలియా ఇప్పటి వరకూ నటించిన సినిమాలు చూడండి. ‘టూ స్టేట్స్’, ‘హమ్టీ శర్మకి దుల్హనియా’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘ఉడ్తా పంజాబ్’... అన్నీ భిన్నమైనవి. ఆలియాను ఈ సినిమాలు స్టార్‌గా కూచోబెట్టాయి. ఎంత స్టార్ ఇమేజ్ రాకపోతే షారుక్ ఆమెను తన పక్కన నటించడానికి యాక్సెప్ట్ చేస్తాడు. చిన్నప్పుడు తాను నోరెళ్లబెట్టి టీవీలో చూసిన నటుడి పక్కన నాలుగైదు సినిమాలకే నటించే సత్తా తెచ్చుకుందంటే ఆ అమ్మాయి తెలివైనదే అవ్వాలి తప్ప మొద్దు కాదు. కాబోదు. ఆలియా తాజా సినిమా ‘బద్రీనాద్ కి దుల్హనియా’ ఈరోజే విడుదలవుతోంది. ఆలియా బోలెడన్ని యాడ్స్ చేస్తోంది. బాగా డబ్బులొస్తున్నాయి. వాటిలో కొంత ‘పెటా’ వంటి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. విదేశాలలో షోస్ చేసి ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో వరద బాధితులకు సాయం చేసింది. ఎక్కడో ఉన్న కాంగో దేశపు అధ్యక్షుడు ఆమెకు తెలియకపోవచ్చు. కాని పొరుగున ఉన్న మనిషికి సాయం చేయడం తెలుసు. ఎందుకంటే ఆలియా– తెలివైన అమ్మాయి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హీరోయిన్ ను బెదిరించి దొరికిపోయాడు
ముంబై: ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరించిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సందీప్ సాహు.. లక్నోకు చెందిన నిరుద్యోగిగా గుర్తించారు. సందీప్ అండర్ వరల్డ్ డాన్ బాబ్లూ శ్రీవాస్తవ పేరుతో ఫోన్ చేసి మహేశ్ భట్ కుటుంబాన్ని బెదిరించాడు. తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మహేశ్ భట్ కూతురు, హీరోయిన్ ఆలియా భట్, భార్య సోనీ రజ్దాన్‌ను చంపేస్తా అంటూ ఫోన్ లో బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహాయంతో 12 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. బంధువుల నుంచి తీసుకున్న రూ. 6 లక్షల అప్పుతీర్చేందుకు అతడు బెదిరింపులకు దిగినట్టు పోలీసులు గుర్తించారు. వ్యాపారంలో నష్టం రావడంతో గతేడాది ముంబైకి వచ్చిన సందీప్ సినిమాల్లో నటించాలని ప్రయత్నించాడు. అవకాశాలు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో అతడు బెదిరింపులకు దిగినట్టు పోలీసులు వెల్లడించారు. -
హీరోయిన్ను చంపేస్తామంటూ బెదిరింపులు
బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. మర్యాదగా 50 లక్షల రూపాయలు ఇచ్చారో సరే.. లేకపోతే మీ కూతురు ఆలియా భట్‌ను, భార్య సోనీ రజ్దాన్‌ను చంపేస్తా అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మహేష్ భట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి, భట్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ కేసును ముంబై పోలీసు శాఖలోని యాంటీ ఎక్స్టార్షన్ సెల్ (ఏఎన్సీ)కి బదిలీ చేశారు. తాను ఒక గ్యాంగ్ లీడర్ని అని చెప్పుకొని అతడు బెదిరించినట్లు చెబుతున్నారు. మొదట అదేదో ఉత్తుత్తి బెదిరింపు అని మహేష్ భట్ వదిలేశారు. అయితే, వరుసపెట్టి వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా సందేశాలు పంపుతూ, తన బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించాడు. తాను ఆలియా, సోనీలను చంపేస్తానని, వాళ్ల శరీరాల్లోకి పలు రౌండ్ల బుల్లెట్లు కాలుస్తానని అన్నాడు. మరికొన్ని మెసేజిలు కూడా పంపి, ఆ తర్వాత ఆపేశాడు. లక్నోకు చెందిన ఒక బ్యాంకు శాఖలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించాడు. తన భార్య, కుమార్తెల ప్రాణాలకు ముప్పు ఉండటంతో మహేష్ భట్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీన్ని తీవ్రంగానే పరిగణించి, భట్ కుటుంబం నివసించే ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇంతకుముందు కూడా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మొత్తం భట్ కుటుంబాన్ని చంపేయడానికి కుట్ర పన్నగా, వారిని 2014 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. -
నా ఫస్ట్ నైట్...వాళ్లకు అంకితం!
కొత్త ఇల్లు.. కొత్త కాపురం.. పెళ్లికి ముందే ప్రముఖ హిందీ దర్శకుడు మహేశ్ భట్ ముద్దుల కూతురు ఆలియా భట్ వేసిన ప్లాన్ అదుర్స్ అంటున్నారు ముంబై జనాలు. సిస్టర్ షహీన్‌తో కలసి తల్లిదండ్రులకు కాస్త దూరంగా ఆలియా వేరే ఇంట్లోకి మకాం మార్చనున్నారనే మాట ఎప్పట్నుంచో వింటున్నాం. ఇప్పుడా మాట నిజం కాబోతోంది. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లోకి త్వరలోనే అక్కాచెల్లెళ్ల్లు ఆలియా, షహీన్‌లు అడుగు పెట్టనున్నారు. గృహ ప్రవేశం రోజున, ఆ రాత్రి ఏం చేయాలో.. ఇప్పుడే ప్లాన్ చేసేశారు. ‘‘ద ఫస్ట్ నైట్ ఇన్ ద న్యూ హౌస్ విల్ బి డెడికేటెడ్ టు మై పేరెంట్స్’’ అని ఆలియా భట్ స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో తొలి రాత్రిని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చేస్తారట. గృహ ప్రవేశం రోజు రాత్రి అమ్మానాన్నలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని చెబుతున్నారు. ‘‘నా జీవితంలో ఆ ఫస్ట్ నైట్ (అదేనండీ.. కొత్తగా కట్టుకున్న ఇంట్లో తొలిరాత్రి) చాలా ముఖ్యమైన వేడుక. అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటాననే అనుకుంటున్నా’’ అన్నారు ఆలియా. ఇరవై మూడేళ్లకు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు సొంతంగా ఇల్లు కొనుక్కున్న ఆలియాను ముంబై జనాలు అభినందిస్తున్నారు. -
'మహేశ్ భట్ మూర్కుడు'
ముంబై: పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ప్రదర్శించరాదని సినిమా ధియేటర్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) స్వాగతించింది. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఎమ్మెన్నెస్ నాయకుడు అమేయ్ ఖోపకార్ పునరుద్ఘాటించారు. దర్శకుడు మహేశ్ భట్ మూర్కుడిలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహేశ్ భట్ భారతీయులా వ్యవహరించడం లేదని, ఆయనను పాకిస్థాన్ కు పంపించాలని డిమాండ్ చేశారు. ఆయనేం మాట్లాడినా లెక్కచేయబోమని అన్నారు. పాకిస్థాన్ నటీనటులతో సినిమాలు తీస్తే దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కొంతమంది హింసోన్మాదులు చేసిన మతిలేని చర్యలకు తనలాంటి ఎంతోమంది శాంతికాముకులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదని 'ప్రొఫైల్ ఫర్ పీస్' నినాదంతో మహేశ్ భట్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. -
'నా కూతురు సూపర్'
ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్.. తన కుమార్తె అలియా విజయం చూసి గర్వపడుతున్నారు. ఊహించిన దాని కంటే ఆమె ఎక్కువ విజయాన్ని సాధించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైవే, టూ స్టేట్స్, హంప్టీ శర్మ కీ దుల్హనియా, కపూర్ అండ్ సన్స్, తాజాగా ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలతో అటు కమర్షియల్‌గా సక్సెస్ అందుకోవడంతోపాటు నటిగా కూడా ప్రశంసలు అందుకుంటోంది ఆలియా. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు కావస్తుండగా కూతురి కెరీర్ గురించి మహేష్ భట్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. అంతా బాగానే ఉంది, ఇక ఇప్పుడు ఫెయిల్యూర్ని కూడా అలియా రుచి చూడాలంటున్నారు ఆమె తండ్రి. ఆమె కూడా అందరిలా సాధారణ మనిషే కదా, విజయంతో పాటు అపజయం ఎలా ఉంటుందో కూడా అలియాకు తెలియాలని అన్నారు. 'ఉడ్తా పంజాబ్'లో ఆమె నటన చూసి అబ్బురపడ్డాను, అంత భావోద్వేగపూరితమైన నటనను అలియా ఎలా కనబరిచగలిగిందా అని ఆశ్చర్యానికి లోనయ్యాను' అని ఆయన తెలిపారు. ఇంత చిన్న వయసులో అలియా (23) సాధిస్తున్న విజయాలను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. అయితే ఇతర హీరోయిన్ల మాదిరిగా అలియా హాలీవుడ్‌కి వెళ్లేందుకు ఆసక్తి కనబరిస్తే మీరు ఓకే చెబుతారా అంటూ ప్రశ్నించగా.. తానెప్పుడూ కూతురికి అండగా ఉంటానని మహేష్ భట్ తెలిపారు. తన జీవితానికి తనే మాస్టర్ అని, తనకేం కావాలో ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఆమెకు ఉందని, తండ్రిగా తానెప్పుడూ ఆమె పక్కనే ఉండి ప్రోత్సహిస్తానని తెలిపారు. -
ఈ హీరో అసలు పేరు తెలుసా?
యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ బాలీవుడ్లో అడుగుపెట్టి అప్పుడే 25 ఏళ్లు పూర్తయింది. 1991లో సౌగంధ్ సినిమాతో ఆయన బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. కానీ నిజానికి 1987లోనే అక్షయ్ వెండితెరపై కనిపించారు. దర్శకుడు మహేశ్ భట్ తీసిన ‘ఆజ్’ సినిమాలో ఆయన కరాటే శిక్షకుడిగా కేవలం పదిసెనక్లపాటు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఈ సినిమాలో అక్షయ్ కనిపించింది తక్కువసేపే అయినా అతనికి ఇది మాత్రం స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది. వాస్తవానికి అక్షయ్ అసలు పేరు రాజీవ్ భాటియా. కానీ ‘ఆజ్’ సినిమాతోనే అతనికి స్క్రీన్ నేమ్ అక్షయ్ కుమార్‌గా స్థిరపడిపోయింది. ‘ఆజ్’ సినిమాలో హీరో పాత్ర పోషించిన కుమార్ గౌరవ్ పేరు అక్షయ్ కుమారే. ఆ పేరు బాగా నచ్చడంతో దానిని తన అధికారిక పేరుగా అక్షయ్ ఫిక్స్ చేశాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు పెట్టిన రాజీవ్ భాటియా పేరు అంటే కూడా తనకు ఇష్టమేనని, కానీ బాలీవుడ్లో హీరో అవతారంలో కనిపించడానికి అక్షయ్ కుమార్ పేరే సరిగ్గా తనకు సూట్ అయిందని, చక్కని ధ్వనితో ఉన్న ఆ పేరును ఆయన అమితంగా ఇష్టపడతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో కుటుంబసభ్యులతో కలిసి విహరిస్తున్న అక్షయ్ పేరు మార్చుకున్న విషయంలో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. -
మూడో ప్రేమికుడు
1990లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికి’ మ్యూజికల్‌గా ఎంత సూపర్‌హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే పంథాలో ‘ఆషికి-2’ పేరుతో మూడేళ్ల క్రితం వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఓవర్‌నైట్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ‘ఆషికి’కి మూడో భాగం రానుంది. ఇందులో జంటగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్లు నటించనున్నారు. తొలి చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తోనే మంచి జంట అనిపించుకున్న వీరిద్దరూ ఇటీవల ‘కపూర్ అండ్ సన్స్’లో నటించారు. రియల్ లవర్స్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ రీల్ లవర్స్గానూ ఎలాగూ రాణిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
హీరోయిన్ల పరిస్థితి పనిమనుషుల కన్నా దారుణం!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శక నిర్మాత మహేశ్ భట్ ఇండస్ట్రీలోని నటీమణుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది టీవీ, సినిమా నటీమణులు బహిరంగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతున్నా, ఇంట్లో వారి పరిస్థితి పనిమనుషుల కంటే దారుణంగా ఉందని పేర్కొన్నారు. టీవీనటి ప్రత్యూష బెనర్జీ మృతి నేపథ్యంలో టీవీ, సినీ రంగాల్లో విజయవంతమవుతున్న మహిళలు కూడా భాగస్వాముల విషయంలో ఎందుకు బలహీనంగా మారిపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై మహేశ్ భట్ మాట్లాడుతూ సినీ రంగుల ప్రపంచంలో వృత్తిపరమైన విజయం సాధించినంతమాత్రాన అది భావోద్వేగమైన స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. 'ఇది నిజంగా విషాదకరం. అసహనం వెళ్లగక్కే తమ భాగస్వాముల నుంచి మహిళలు విముక్తి పొందేందుకు ఆర్థిక స్వాతంత్ర్యం వారికి దోహద పడుతుందని ఒకప్పుడు నేను అనుకునేవాణ్ని. కానీ, చిత్రసీమలో నేను ఎంతోమంది నటీమణులను చూశాను. వారి వద్ద ఊహించలేనంత డబ్బు ఉంది. మహిళలు, మహిళల సాధికారిత గురించి వారు అద్భుతమైన అభిప్రాయాలు వెల్లడించేవారు. వాళ్లు చెప్పే సూక్తుల కోసం చాలామంది ఎదురుచూసేవాళ్లు. కానీ వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎంతగా హింస ఎదుర్కొన్నారంటే.. పనిమనుషులు కూడా అంతటి అరాచకాన్ని సహించేవాళ్లు కాదు' అని భట్ విలేకరులతో అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు సైతం తమ భర్తలు పెట్టే హింస భరించలేక, తమ బంధాన్ని తెంపేసుకుంటున్నారని, కానీ చాలామంది నటీమణులు మాత్రం ఇప్పటికీ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న అనుబంధాలను పట్టుకొని వేలాడుతున్నారని, ఎంతటి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికీ పలువురు స్టార్ హీరోయిన్లు ఇదేరకమైన అనుబంధాల్లో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'లవ్ గేమ్స్' సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. -
తెరపై... 18 ఏళ్ల తర్వాత!
దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై నటించడానికి పూజా భట్ సిద్ధం అవుతున్నారు. ‘జిస్మ్’ చిత్రంతో దర్శక, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావడం హిందీ సీమలో చర్చనీయాంశమైంది. పూజాభట్ 1990లోనే ‘డాడీ’ చిత్రంలో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2001లో ‘ఎవ్రీ బడీ సేస్ ఐ యామ్ ఫైన్’ తర్వాత మళ్లీ ఏ చిత్రంలోనూ కనిపించలేదామె. విశేషం ఏమిటంటే, ఆమె నటించిన తొలి చిత్రం ‘డాడీ’కి మహేశ్‌భట్ కథ అందించి, దర్శకత్వం వహించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆమె నటించనున్న కొత్త చిత్రానికి కూడా కథారచయిత మహేశ్భటే. అప్పట్లో వచ్చిన ‘డాడీ’ చిత్రం ఓ తండ్రికి, కూతురికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో సాగితే, ఈ సినిమా మాత్రం అందుకు రివర్స్ అట. ఇందులో ఓ తల్లికీ, కూతురికీ మధ్య అనుబంధాన్ని తెరకెక్కించనున్నారు. ‘‘మా నాన్నగారు ఎప్పుడైతే డెరైక్షన్ ఆపేశారో, నేను అప్పుడే నటన నుంచి తప్పుకున్నాను. అయితే ఇప్పుడు మంచి మంచి కథలు తెరపై చెబుతున్నారు. అందుకే ఇప్పుడీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను’’ అని చెప్పారామె. -
దర్శకుడికి 'అవార్డు' నటుడి గురుదక్షిణ
ముంబై: పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. దర్శకుడు మహేష్ భట్‌కు గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మహేష్ భట్‌కు వెయ్యి రూపాయల నోటు ఇచ్చి, తనకు కెరీర్ ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. భట్ దర్శకత్వం వహించిన 'సారాంశ్' చిత్రం ద్వారా ఖేర్ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భట్, ఖేర్‌ల మధ్య గురుశిష్యుల బంధం కొనసాగుతోంది. భట్‌ను కలసినపుడు తీసిన ఫొటోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఖేర్ వెయ్యి రూపాయల కాగితాన్ని అందించి, ధన్యవాదాలు తెలపగా, భట్ ఆయన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టాడు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ఖేర్‌కు భట్ అభినందనలు తెలిపాడు. ఈ అవార్డు రావడం గర్వంగా ఉందని చెప్పాడు. -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మహేష్ భట్ (దర్శక, నిర్మాత) సౌందర్య (నిర్మాత - రజనీకాంత్ కుమార్తె) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవి సంఖ్య కావడం వల్ల కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త టెక్నాలజీ తెలుసుకుంటారు. మీ టెక్నాలజీని మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉపయోగించి, లాభపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటమే కాదు, వాటిని మీ ఉన్నతికి ఉపయోగించుకోగలుగుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పుట్టిన తేదీ 20. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలవుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, మానసిక ఆందోళన తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,7; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు, క్రీమ్, బ్రౌన్; లక్కీ కలర్స్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: అనాథలకు బెల్లం పాయసం తినిపించటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం లేదా వినడం, వీలైనంత సేపు వెన్నెలలో విహరించడం, తల్లిని లేదా తత్సమానురాలిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఇంటి గడప దాటుతున్న ఇంతులు!
స్వేచ్ఛగా బతకడం అంటే ఏంటి?... అనే ప్రశ్నకు ఎవరెన్ని రకాలుగా సమాధానాలిచ్చినా, హిందీ రంగంలో కొంతమంది కుర్ర కథానాయికలు మాత్రం ‘అమ్మ, నాన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉండటం’ అని సమాధానం ఇచ్చేంతగా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. సరే.. వేరే నగరం నుంచి ముంబయ్‌లో అడుగుపెట్టి, సినిమాలు చేస్తున్న తారలైతే అమ్మ, నాన్నకు దూరంగా ఉండక తప్పదు. కానీ, ముంబయ్ మహానగరంలోనే పుట్టి, పెరిగిన తారలు కూడా అమ్మ, నాన్నలకు దూరంగా ఇల్లు తీసుకుని, ఒంటరిగా ఉండాలనుకోవడం విచిత్రం. అఫ్కోర్స్ పెళ్లయితే ఫర్వాలేదు. కానీ, పెళ్లి కాని ఆలియా భట్, శ్రద్ధాకపూర్ వంటివాళ్లు కూడా విడిగా ఇల్లు తీసుకుని ఒంటరి జీవితం గడిపే ప్రయత్నం మీద ఉన్నారు.. పెద్దవాళ్లతో కలిసి ఉంటే ఓ రక్షణ ఉంటుంది కదా? అని ఈ ముద్దుగుమ్మలకు ఎవరూ బుద్ధి చెప్పడానికి సాహసం చేయడంలేదట. ఒకవేళ చెప్పడానికి ప్రయత్నించినా, ‘‘మాది నైన్ టూ సిక్స్ జాబ్ కాదు కదా.. అర్ధరాత్రి దాటాక, ఒక్కోసారి తెల్లవారుజాము.. ఇలా ఎలా పడితే అలా ఇంటికి వెళతాం. మావాళ్లకు డిస్టర్బెన్స్...’’ అనే తరహాలో సమాధానం చెబుతున్నారట. ప్రియాంకా చోప్రా అయితే.. ‘మా అమ్మగారే నన్ను విడిగా ఉండమన్నారు. అప్పుడే జీవితం గురించి మంచి అవగాహన వస్తుందన్నారు’ అని చెబుతున్నారట. ఇక, క్యూట్ గాళ్ ఆలియా భట్ అయితే, ‘వేళాపాళా లేని నా ఉద్యోగంతో మా అమ్మ, నాన్నకు సమస్య.. ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాలింగ్ బెల్ నొక్కితే వాళ్ల నిద్ర పాడవుతుంది’ అని సన్నిహితులతో అంటున్నారట. అందుకే, ప్రస్తుతం ముంబయ్ వీధుల్లో వలేసి మరీ, మంచి ఇంటి కోసం వెతుక్కుంటున్నారని భోగట్టా. ఈ వ్యవహారం విన్నవాళ్లు ‘ఆలియా తండ్రి మహేశ్‌భట్ పెద్ద దర్శకుడు, నిర్మాత. వేళాపాళా లేని ఉద్యోగం చేసిన ఆయన మరి.. తన కుటుంబాన్ని వదిలి విడిగా ఉండలేదు కదా’ అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి తన కూతురు విడిగా ఉండటం మహేశ్భట్కి కూడా ఇష్టం లేదట. కానీ, ఆలియా ససేమిరా అంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? మరో ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ కూడా అమ్మ,నాన్న ఉంటున్న ఇంటి గడప దాటేయాలనుకుంటున్నారట. ఆలియా భట్లానే ఇల్లు వెతు క్కుంటున్నారట. ఆమె తండ్రి శక్తికపూర్ కూడా ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన నటుడేననీ, కానీ, ఆయన ఒంటరిగా ఉండాలని ఎందుకు అనుకోలేదని బాలీవుడ్లో జోకేసుకుంటున్నారు. శ్రద్ధాకపూర్‌ని ఇంటి విషయం గురించి ఎవరైనా అడిగితే... ‘అలాంటిదేమీ లేదండి బాబు. నేను ఇల్లు వెతకడంలేదు అంటున్నారట. కానీ, ఇంటి అన్వేషణ పూర్తిగా నిజమని బాలీవుడ్ వారు అంటున్నారు. మరి.. ఒంటరి జీవితంలో ఏం మజా ఉంటుందో వీళ్లకే తెలియాలి... -
ట్వీట్స్
ప్రేమంటే, మీ ముద్దుల కుక్కపిల్ల భరించలేనంత వాసన వచ్చినా సరే, ఆప్యాయంగా పలకరించడం. -సోనాక్షి సిన్హా నీలో దాగిన ప్రతి కిరణాన్ని లోకానికి పంచు. కనిపించని దారులకు కొత్త వెలుగు ఇవ్వు. -మహేష్‌భట్ -
చూశారు... మెచ్చారు...
‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ మొబైల్ ద్వారా విడుదల చేశారు. ఓ ప్రత్యేక ప్రదర్శనలో సినిమాను చూసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘సైబర్ క్రైమ్ ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇది లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉంది. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి’’ అని ఆకాంక్షించారు. పి. మంజునాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ 30న విడుదల కానుంది. గతంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘మాయ’ చిత్రాన్ని మహేశ్‌భట్ ‘మర్డర్-4’గా హిందీలోకి రీమేక్ చే స్తున్నారు. -
మళ్లీ హిందీలో...
కొద్దిగా విరామం తరువాత అమల అక్కినేని ఇప్పుడు హిందీ తెరపై మెరిసిపోనున్నారు. అదీ ఏకంగా ప్రముఖ దర్శక, నిర్మాత మహేశ్‌భట్ చిత్రంలో! ‘‘టైమ్‌లెస్ బ్యూటీ అమల అక్కినేని మా ‘హమారీ అధూరీ కహానీ’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయడానికి అంగీకరించారు. చాలా ఆనందంగా ఉంది’’ అని మహేష్ భట్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, అక్కినేని ఇంటి కోడలైన తర్వాత అమల సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఆమె తెరపై కనిపించిన తెలుగు చిత్రం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలోని ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఆ తర్వాత అమల దక్షిణాదిన వేరే సినిమా ఒప్పుకోలేదు కానీ, గత ఏడాది ఒక హిందీ చిత్రంలో తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ‘ఉయిర్‌మై’ అనే తమిళ టీవీ ధారావాహికలో నటిస్తున్న అమల... ‘హమారీ అధూరీ కహానీ’లో పాత్ర నచ్చడంతో, నటించడానికి పచ్చజెండా ఊపారు. గతంలో ‘దయావాన్, కబ్ తక్ ఛుపే రహూంగీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించారు. దక్షిణాదిన ఘనవిజయం సాధించిన ‘శివ’ హిందీ రీమేక్‌లో కూడా ఆమే కథానాయిక. ఆ విధంగా హిందీ ప్రేక్షకులకు అమల సుపరిచితురాలే. ఇక తాజా చిత్రం ‘హమారీ అధూరీ కహానీ’ చిత్రం విషయానికొస్తే.. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో మహేష్ భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తల్లిదండ్రులు షిరీన్ మొహమ్మద్ అలీ, నానాభాయ్ భట్, సవతి తల్లి జీవితాల ఆధారంగా మహేష్ భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
అప్పుడే హిందీలోతీయాలనుకున్నా: నీలకంఠ
‘‘నా అభిమాన దర్శకుల్లో మహేష్ భట్ ఒకరు. ఆయన ‘మాయ’ చిత్రం చూసి, హిందీలో నిర్మించాలనుకుంటున్నాననడంతో పాటు నన్నే డెరైక్షన్ చేయమన్నారు. వాస్తవానికి ‘మాయ’ పాయింట్ అనుకున్నప్పుడే తెలుగు, హిందీ భాషల్లో చేయాలనుకున్నాను. కానీ, బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని విరమించుకున్నాను. ఇప్పుడు హిందీలో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు మహేష్ భట్, విక్రమ్ భట్ ‘మాయ’ చిత్రాన్ని హిందీలో ‘మర్డర్ 4’గా పునర్నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘జోష్ మీడియా ప్రతినిధులు వీరేన్, వందనలకు మహేష్ భట్‌గారితో మంచి అనుబంధం ఉంది. వాళ్ల ద్వారానే ‘మాయ’ చిత్రం మహేష్‌భట్ దృష్టికెళ్లింది. తెలుగువారికి నచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ‘మర్డర్ 4’ నిలుస్తుందనే నమ్మకాన్ని వీరేన్ వెలిబుచ్చారు. ఈ చిత్రంతో దర్శకుడిగా నీలకంఠ బాలీవుడ్లో స్థిరపడతారని నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నా కంటే మా అమ్మాయిలే తెలివైనవాళ్లు
న్యూఢిల్లీ: తన కంటే తన కుమార్తెలే తెలివైనవాళ్లని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ అన్నారు. ప్రాక్టికల్‌గా కూడా వాళ్లే బాగుంటారని కితాబిచ్చారు. అమ్మాయిల నుంచి తాను సలహాలు కూడా తీసుకుంటుంటానని మహేష్ భట్ చెప్పారు. మహేష్ భట్‌కు పూజా భట్, షహీన్, అలియా భట్ సంతానం. హీరోయిన్గా నటించిన పూజాభట్ ఆ తర్వాత నిర్మాతగా మారారు. షహీన్ రచయిత కాగా, అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ వర్ధమాన హీరోయిన్. తన కుమార్తెలు ఎవరి సాయం లేకుండా వారివారి రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని మహేష్ భట్ చెప్పారు. తండ్రిగా తాను గర్విస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. -
సేవ మన తత్వం
‘సేవాతత్పరత అనేది భారతీయుల రక్తంలోనే ఉంది. సేవాగుణంలో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు’ అని అంటున్నారు ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌భట్. నగరవాసి నిర్వహిస్తున్న రైస్ బకెట్ చాలెంజ్‌కు మద్దతుగా తొలుత ఆయన తాజ్ ఫలక్‌నుమా వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆసుపత్రి దగ్గర అన్నార్తులకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీనిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరణ్ జోహార్‌కు రైస్ బకెట్ చాలెంజ్‌ను విసురుతున్నట్టు ప్రకటించిన ఆయన మాట్లాడుతూ ‘ రైస్ బకెట్ చాలెంజ్ అనే నిరుపేదలకు ఉపకరించే కార్యక్రమం రూపుదిద్దినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది హైదరాబాదీ కావడం ఈ నగరవాసులు గర్వించాల్సిన విషయం’ అనికొనియాడారు. తెలుగు సినిమా రూపొందించడంపై మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ భాషల్లో సినిమా తీసే ఆలోచన లేదు. కాబట్టి, తెలుగు సినిమా తీసే అవకాశం లేదు. అయితే ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులున్న రంగంగా తెలుగు సినీ రంగం మీద నాకు చాలా గౌరవం ఉంది’ అన్నారు. కాగా, శృంగారభరిత చిత్రాలను రూపొందించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ప్రేక్షకులు వాటినే ఆదరిస్తున్నారు. నేను సిటీలైట్ అనే క్లాసిక్ మూవీ తీస్తే ఎవరూ చూడలేదు. అదే జిస్మ్, మర్డర్.. సూపర్‌హిట్ అయ్యాయి. అందుకే అలాంటి సినిమాలే ఎక్కువ తీస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలే ఎవరైనా తీయాలనుకుంటారని, వారికి నచ్చని సినిమాలు తీసి చేతులు కాల్చుకోవాలని ఎవరూ అనుకోరని’ అన్నారాయన. - ఎస్.సత్యబాబు -
కరణ్ జోహర్ తోనే అన్ని పంచుకుంటా: ఆలియా
ముంబై: సాధారణంగా సినీ తారలు తల్లి, తండ్రి నుంచి సలహాలను తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కాని బాలీవుడ్ తార ఆలియా భట్ మాత్రం ప్రఖ్యాత దర్శకుడు, తండ్రి మహేశ్ భట్ ను సలహాలను తీసుకోవడానికి ఇష్టపడదట. ఎదైనా సలహాలు తీసుకోవాల్సి వస్తే దర్శకుడు కరణ్ జోహార్ ను సంప్రదిస్తానని ఆలియా వెల్లడించింది. కరణ్ జోహర్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారానే ఆలియా బాలీవుడ్ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. తాను కెరీర్, లైఫ్, లవ్ లాంటి విషయాలను కరణ్ జోహార్ తో పంచుకుంటానని ఓ ప్రైవేట్ చానెల్ టాక్ షోలో వెల్లడించింది. అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ లతో అఫైర్లపై మీడియాలో వస్తున్న పుకార్లపై ఆలియా భట్ వివరణ ఇచ్చింది. అర్జున్, వరుణ్ లు కేవలం సహనటులు మాత్రమేనని, వారితో ఎలాంటి అఫైర్ లేదని ఆలియా స్పష్టం చేసింది. -
మహేశ్‌భట్ మాయ
నీలకంఠ ‘మాయ’ చిత్రానికి సుప్రసిద్ధ హిందీ దర్శకుడు మహేశ్‌భట్ ప్రశంసలు లభించాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని నిర్మాతలు ముఖేష్‌భట్, విశేష్భట్లతో కలిసి మహేశ్‌భట్ వీక్షించారు. దర్శకుడు నీలకంఠ, చిత్ర నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ‘మాయ’ ఓ వినూత్న ప్రయత్నమనీ, ఈ కథాంశాన్ని హిందీలో నిర్మిస్తామనీ, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తామనీ మహేశ్‌భట్ తెలిపారు. -
మహేష్ భట్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా
ముంబై: బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మహేష్ భట్ తన అభిమానులకు సూచించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. 'కొందరు నా పేరుపై ఫేస్బుక్లో అకౌంట్ తెరిచి అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నాడు' అని మహేష్ భట్ ట్వీట్ చేశాడు. మహేష్ భట్ కూతురు, యువ హీరోయిన్ అలియా భట్‌కు కూడా ఇటీవల ఇలాంటి సమస్యే ఎదురైంది. తనకు ఫేస్బుక్లో అకౌంట్ లేదని అలియా వివరణ ఇచ్చింది. -
ఇంటి కోసం పొదుపు..
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ డెరైక్టర్ మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ (21) .. లుక్స్, యాక్టింగ్ నైపుణ్యాలపరంగా బాలీవుడ్లో బోలెడంత పేరు తెచ్చుకుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటించిన ఆలియా.. ప్రతి సినిమాకు రూ. 2-5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని పరిశ్రమలో టాక్. సిల్వర్ స్పూన్‌తో పుట్టినప్పటికీ ఆలియా భట్ డబ్బు విషయంలో ఆచి తూచే వ్యవహరిస్తుందట. బడ్జెట్‌కు లోబడే ఖర్చు చేస్తుంది. తాను పాటించే ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాలు తన మాటల్లోనే.. ‘నా పాకెట్ మనీ రూ. 500తో మొదలైంది. నేను, మా అక్క జాగ్రత్తగా ఖర్చు చేయడాన్ని బట్టి పాకెట్ మనీ పెరిగేది. ఇంటర్లో ఉన్నప్పుడు నెలకు రూ. 4,000కు చేరింది. రెండేళ్ల క్రితం వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మొట్టమొదటిసారిగా రూ. 2.5 లక్షల చెక్ అందుకున్నాను. మేం ఏదైనా బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలంటే మా సంపాదనతోనే కొనుక్కోమంటారు మా పేరెంట్స్. నా పారితోషికంతో ఖరీదైన ప్రాదా బ్యాగ్ కొందామనుకున్నాను. కానీ, అంతలోనే డబ్బు విషయంలో బాధ్యతగా ఉండాలన్నది గుర్తొచ్చింది. దీంతో, ఆ డబ్బు అలా బ్యాంకులోనే ఉంచేశాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతే డెబిట్ కార్డు చేతికొచ్చింది. ఈ ఏడాదే నా ఇరవై ఒకటో పుట్టినరోజు నాడు మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు వచ్చింది. రోజువారీ చేసే ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండాలన్నది ఇవి నేర్పాయి. ఖర్చుల విషయానికొస్తే.. నా బిల్స్ అన్నీ మా అమ్మే కడుతుంది. కానీ వాటికి సంబంధించిన చెక్కులపై నేనే సంతకం చేస్తాను కాబట్టి అన్ని ఖర్చుల గురించీ నాకు తెలుసు. అంతే కాదు నేను ఎంత ఇన్‌కం ట్యాక్స్ కట్టేదీ నాకు తెలుసు. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నాకు ఆసక్తి ఎక్కువే. ఫిక్సిడ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ వంటి సాధనాల గురించి తెలుసుకుంటుంటాను. ఇల్లు కొనుక్కోవాలన్నది నా ఆలోచన. దీనికోసమే నేను పొదుపు చేస్తున్నాను. అఫ్కోర్స్ కారు కూడా కొనుక్కోవాలని ఉంది. అయితే, మూడు నెలలకోసారి మనసు మారిపోతుంటోంది కనుక.. ఏది కొంటానో చూడాలి’. -
త్వరలో మమ్మీతో కలిసి ఓ సినిమా చేస్తా
ముంబై:త్వరలో తన తల్లి సోనీ రజ్ దాన్ తో కలిసి ఓ గంభీరమైన చిత్రంలోనటిస్తానని బాలీవుడ్ నటి అలియా భట్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆ సినిమాకు నాన్న మహేష్ భట్ దర్శకత్వం వహిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసింది. 2005 లో వెండితెరకు దూరమైన తన తల్లి ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించిందన్న విషయాన్ని అలియా గుర్తు చేసుకుంది. నాకైతే దర్శకత్వం చేసే ఆలోచన లేదని అలియా తెలిపింది. కాకపోతే ఇద్దరం కలిసి ఒక మంచి సినిమాలో నటిస్తామని అంటోంది. ' త్వరలో మేమిద్దరం సినిమా చేస్తాం. ఆ స్క్రిప్ట్ ను కూడా విన్నాం. అది మా ఇద్దర్నీ ఆకట్టుకుంది' అని అలియా పేర్కొంది. ప్రస్తుతం 'హంప్టీ శర్మకీ దుల్హనియా' చిత్రంలో వరుణ్ ధావన్ కు జత కట్టిన అలియా ఆ చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉంది. మరో మూడు రోజుల్లో(జూలై 11న)ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాన్న స్క్రిప్టు రాసిస్తానన్నారు
భవిష్యత్తులో నాన్న తనకోసం స్క్రిప్టు రాసిస్తానన్నారని ప్రముఖ నిర్మాత మహేశ్‌భట్ కుమార్తె అలియాభట్ చెప్పింది. ‘ నాన్న ఆ సినిమాకు దర్శకత్వం వహించరు. అయినప్పటికీ కచ్చితంగా నాకోసం ఓ స్క్రిప్టు రాసిస్తానని హామీ ఇచ్చారు.ఆ సినిమాలో నా ప్రతిభ చూపుతా. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది’ అని అంది. త్వరలో విడుదల కానున్న ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న అలియా అనేక విషయాలు చెప్పింది. అలియా గతంలో హైవే సినిమాలో పాడింది. దీంతోపాటు ‘మైన్ తెన్ను సంఝావా’ అనే ఆల్బంకు కూడా తనస్వరాన్ని అందించింది. నగరంలో బుధవారం జరిగిన ఈ ఆల్బం విడుదల కార్యక్రమానికి అలియా తండ్రి, బాలీవుడ్ నిర్మాత మహేశ్భట్కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ ‘కుమార్తె అలియా పాడిన పాట వినగానే ఆనందంతో కళ్లు చెమర్చాయి. సాధారణంగా అలియా పాల్గొనే కార్యక్రమాలకు నేను హాజరుకాను. అయితే ఇవాళ వచ్చా. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం అలియా తాను పాడిన పాటను నాకు పంపింది. దానిపై నా అభిప్రాయం కోరింది. ఈ పాట వినగానే నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఈ పాట తన హృదయంతో పాడినట్టు నాకు అనిపించింది. గీతాలాపనకు సంబంధించి అలియా ఎటువంటి శిక్షణ పొందలేదు. అయినప్పటికీ ఇదే చెప్పుకోదగ్గ విషయం’ అని అన్నాడు. అనంతరం అలియా మాట్లాడుతూ ‘గీతాలాపన తనకు వారసత్వంగా వచ్చింది. మా నాన్న వయోలిన్ వాయించేవారు. మా కుటుంబంలో సంగీతం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మా కుటుంబమంతా సంగీతాన్ని ఆస్వాదిస్తుంది’ అని ఈ 21 ఏళ్ల ముగ్ధమనోహరి తెలిపింది. -
అంతిమ విజయం సాధించలేదు: అలియా
ముంబై: అంతిమ విజయం(అల్టిమేట్ సక్సెస్) ఇంకా చవిచూడలేదని బాలీవుడ్ నటి అలియా భట్ పేర్కొంది. 2011లో తెరగ్రేటం చేసిన అలియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసినప్పటికీ తానింకా అంతిమ విజయం సాధించలేదని చెప్పింది. తానందుకున్న విజయాలు స్వల్పమని, వాటితోనే విర్రవీగబోనని తెలిపింది. సక్సెస్ సాధించిన వ్యక్తిని తన తండ్రి మహేష్ భట్ బాంబు పేలుడు బాధితుడిగా భావిస్తారని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితి తాను తెచ్చుకోదల్చుకోలేదన్నారు. తన కోసం స్కిప్ట్ తయారు చేస్తానని తన తండ్రి మాటయిచ్చారని అలియా తెలిపింది. ఇది తనకు అవార్డు తెచ్చే సినిమా అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. -
ప్రీతి జింతా లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారింది
ముంబై: బాలీవుడ్ సుందరి ప్రీతి జింతా, వ్యాపార వేత్త నెస్ వాడియాల ప్రేమ బంధం ముగియడం దురదృష్టకరమని దర్శకుడు మహేష్ భట్ అన్నారు. ప్రీతి, నెస్ వాడియాల లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారిందని ట్వీట్ చేశారు. ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రీతి సహ భాగస్వామి. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో నాలుగేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. 2009లో వీరిద్దరూ విడిపోయారు. నెస్ వాడియా కూడా ఐపీఎల్ పంజాబ్ టీంకు భాగస్వామిగా వ్యవహరించారు. -
'మా నాన్న నాకు పెళ్లి చేయట్లేదు'
తండ్రులకు కూతుళ్లంటే ఎక్కడలేని అభిమానం ఉంటుంది. తమ గారాలపట్టి ఎప్పటికీ తమ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. తన తండ్రి కూడా అలాగే ఉంటున్నారని, తనకు పెళ్లి చేయాలని ఆయన అనుకోవట్లేదని బాలీవుడ్ అగ్ర నిర్మాత మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ చెబుతోంది. తనతోను, తన సోదరి షహీన్ తోను ఇటీవల ఆయన మాట్లాడారని, 'మీరు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేసేస్తా' అన్నారని, తామిద్దరిపైనా ఆయనకున్న అచంచల ప్రేమకు ఇది నిదర్శనమని ఆలియా చెప్పింది. తన అక్క బోయ్‌ఫ్రెండ్ ఎప్పుడైనా తనకు బహుమతులు తెస్తే, నాన్న రెండు తెస్తానని చెబుతారని తెలిపింది. ఆలియా తాజాచిత్రం 2స్టేట్స్ లో ఒక ముద్దు సన్నివేశం ఉంది. దాని గురించి అడగ్గా, సినిమాల్లో కాబట్టి.. ఆయన ఊరుకుంటున్నారని, అదే తాను ఆయన ఎదురుగా తన బోయ్‌ఫ్రెండును ముద్దు పెట్టుకుంటే వెంటనే లెంపకాయ ఇవ్వడం ఖాయమని ఆలియా చెప్పింది. ఇంతకుముందు ఆలియా నటించిన హైవే చిత్రం బాగా హిట్టయింది. తాను ఎప్పటికీ నటిగానే ఉండాలనుకుంటున్నాను తప్ప స్టార్ అవ్వాలనుకోవట్లేదని తెలిపింది. -
సిటీలైట్స్ కోసం ఎంతో కష్టపడ్డా!
ఇది వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా నటించిన సిటీలైట్స్ సినిమా ఒకెత్తని హీరో రాజ్‌కుమార్ రావు అంటున్నాడు. ఇంతకుముందు విడుదలైన కోయి పో చే, షహీద్ సినిమాలు మనోడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2010లో హత్యకు గురైన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది షహీద్ ఆజ్మీ జీవితగాథ ఆధారంగా షహీద్ తీశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బ్రిటన్ నుంచి వచ్చిన మెట్రో మనీలా ఆధారంగా సిటీలైట్స్ రూపొందించారు. ‘దీని సినిమా షూటింగ్‌ను ఇటీవలే ముగించాం. మంచి జీవితం కోసం రాజస్థాన్ నుంచి ముంబై వచ్చిన జంట కథ ఇది. కొత్త నగరంలో వాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ప్రేమకథలో ఎన్నో మలుపులు ఉంటాయి’ అని రాజ్‌కుమార్ వివరించాడు. మహేశ్ భట్ నిర్మించగా, హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటిన విడుదలయ్యే అవకాశముంది. కొత్తనటి పత్రలేఖ ఇందులో హీరోయిన్గా కనిపిస్తుంది. షహీద్ సినిమాతో తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మెహతా కుటుంబసభ్యుడి వంటివాడేనని రావు అన్నాడు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటామని, పాత్రలను ఎలా తీర్చిదిద్దాలో బాగా తెలుసని చెప్పాడు. ఆయన దమ్మున్న దర్శకుడు కాబట్టే సిటీలైట్స్లో నటించడానికి సంతోషంగా ఒప్పుకున్నానని ఈ 29 ఏళ్ల నటుడు అన్నాడు. కంగనా రనౌత్ ప్రధానపాత్రధారిగా ఇటీవలే వచ్చిన క్వీన్లోనూ రావు ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రియురాలిని ప్రేమలోకి దింపడానికి ఎన్నో కష్టాలు పడే ఢిల్లీ యువకుడు విజయ్ ధింగ్రాగా సత్తా ప్రదర్శించాడు. ‘ఇది హీరోయిన్ ఆధారిత సినిమా అని తెలిసినా, నాకూ నటించే అవకాశముంటుంది కాబట్టి అంగీకరించాను. ఇందులో విజయ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది’ అని చెప్పిన రాజ్‌కుమార్ రావు ఢిల్లీడాలీ సినిమాలో సోనమ్ కపూర్ సరసన నటించే చాన్స్ కొట్టేశాడు. -
హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ
స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన 'హైవే' చిత్రంలో మహేష్ భట్ కూతురుఆలియా భట్ నటన చాలా బాగుందని అలనాటి నటి షబానా అజ్మీ ప్రశంసలు కురిపించారు. ఆమె నేరుగా భట్ ఇంటికి వెళ్లి ఆలియాకు, ఆమె తల్లిదండ్రులకు స్వయంగా అభినందనలు తెలిపారు. 20 ఏళ్ల వయసులోనే ఆలియా అద్భుతంగా నటించిందని చెప్పారు. పలుమార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న షబానా అజ్మీ.. ఆలియా సహజనటి అని, ఏ రకంగా చూసినా అద్భుతంగా చేసిందని తెలిపారు. తన భర్త జావేద్ అక్తర్‌తో కలిసి నేరుగా ఆలియా ఇంటికి వెళ్లినట్లు ఆమె చెప్పారు. తామిద్దరికీ ఆమె నటన చాలా నచ్చిందని, ఆలియాను చూసి చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే.. ఆలియా తండ్రి మహేష్ భట్ మాత్రం హైవే సినిమాను 1982లో షబానా నటించిన 'అర్థ్' సినిమాతో పోల్చారు. ఆ సినిమాకు గాను ఆలియా భట్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. మహేష్ ఏదో ఆషామాషీగా ఆ మాట అనలేదని, అలాగే ఆలియా తన కూతురు కాబట్టి కూడా చెప్పలేదని, నిజంగానే ఆమె పనితీరు అందులో అంత అద్భుతంగా ఉందని అన్నారు. ఆలియాను ఎంతో ముద్దుగా చూసుకునే ఆమె అక్క పూజాభట్ కూడా ఈ సినిమాను ప్రశంసించింది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంలో ఆమె యువనటిగా వస్తే, హైవేతో పూర్తి స్థాయి నటిగా నిరూపించుకుందని, ఆమెను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ఇంతియాజ్ అలీకి ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటానంది. -
నేను స్వతంత్రురాలిని..
నేను ఎలాంటి సినిమాలు చేయాలనే విషయమై నా తండ్రి ఏనాడూ కలుగజేసుకోలేదు.. ఆ విషయంలో నేను స్వతంత్రురాలిని.. అని ప్రముఖ నిర్మాత మహేష్ భట్ కుమార్తె, బాలీవుడ్ నటి ఆలియా భట్ తెలిపింది. ఆమె ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తనకు దర్శకుడు కరణ్ జోహార్‌తో మంచి స్నేహం ఉందని, సిని మాల గురించి అతడితో చర్చించినంత తండ్రితో కూడా చర్చించనంది. ‘కరణ్ నా శ్రేయోభిలాభి.. నాకు ఎటువంటి ఆఫర్ వచ్చినా మొదట అతడికే ఫోన్ చేసి చెబుతాను.. ఆ తర్వాతే నా తండ్రికి..’ అని ఆమె చెప్పింది. కాగా తనకు ధర్మ ప్రొడక్షన్‌తో కాంట్రాక్ట్ ఉందని, ఆ బ్యానర్ కింద మూడు సినిమాల్లో నటిం చేందుకు వచ్చే ఐదేళ్ల పాటు వారి తోనే తాను పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ‘నా వృత్తికి సంబంధించి మా నాన్న నాతో మాట్లాడుతాడు తప్పితే నిర్ణయాల్లో కలుగజేసుకోడు.. అందుకే కరణ్ సాయం తీసుకుంటా..’ అని ముద్దుగా చెప్పింది. ‘నా తండ్రికి సినిమాలంటే ప్రాణం.. దానిపైనే దృష్టి ఎక్కువ.. నిజం చెప్పాలంటే ఆ తర్వాతే మేమంతా.. నేను చిన్నప్పుడు ఏ తరగతి చదువుతున్నానో కూడా అతడికి తెలిసేది కాదు.. అయితే సినిమాల్లో పనిచేసేందుకు నేను ఆసక్తి చూపించిన తర్వాత నా గురించి పట్టించుకోవడం మొదలుపెట్టాడు.. నాకు ఒక ట్రాక్ ఏర్పాటుచేశాడు..’ అని తన తండ్రికి వృత్తిపై ఉన్న మమకారాన్ని తెలిపింది. ‘జయాపజయాలను ఒకేలా తీసుకోవడం నేర్చుకోమని మా నాన్న నాకు ఎప్పుడూ చెబుతాడు.. విజయం వచ్చిందంటే ఫెయిల్యూర్‌ను భరించేందుకు మానసికంగా సిద్ధంగా ఉండమని నాకు నూరిపోస్తాడు..’ అని చెప్పింది. మహేష్ భట్‌కు విశేష్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అయితే అందులో అప్పుడే తాను పనిచేయనని ఆలియా చెబుతోంది. అక్కడ తాను పనిచేయడానికి సరైన స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతే నటించడానికి ఒప్పుకుంటానని ఈ 20 ఏళ్ల చిన్నది తన గురించి చెప్పుకొచ్చింది. -
నాన్న దర్శకత్వంతో నటించాలి
సినిమా కుటుంబంలోనే పుట్టిపెరిగిన ఆలియా భట్ మనసులో ఒక ఆశ ఉంది. మరేంటో కాదు తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో నటించాలన్నది ఈ 20 ఏళ్ల బ్యూటీ కోరిక. అయితే నాన్న మళ్లీ దర్శకత్వం వహించే అవకాశాలు తక్కువేనని చెబుతోంది. అర్ధ్, సారాంశ్, జఖ్మ్, కార్టూస్ వంటి మంచి సినిమాలు తీసిన భట్ 1999 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. సోదరుడు ముకేశ్ భట్‌తో కలసి విశేష్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. సొంత బ్యానర్లో సినిమాల్లోనూ నటించాలని ఆలియా కోరుకుంటోంది. ‘అవును. విశేష్ ఫిల్మ్స్ లోనూ నటించాలనుంది. నాన్న అంటే భయం లేదు. ఆయనలోని జ్ఞానమే భయపెడుతుంది. ఆయన వయసులో నాకంటే చాలా పెద్దవారు కావొచ్చు కానీ మనసు నా వయసుదే. ఇంట్లో అందరికంటే ఆయనే ఉత్తేజంగా కనిపిస్తారు’ అని వివరించింది. గత ఏడాది విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తెరపైకి వచ్చిన ఆలియా సినిమాలు ఈ ఏడాది ఒక్కటీ విడుదల కాలేదు. అయితే చేతిలో మాత్రం దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇంతియాజ్ అలీ తీస్తున్న హైవేలోనూ ఆలియాకు అవకాశం దక్కింది. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ తీస్తున్న మూడు సినిమాల్లోనూ ఆలియాకు చాన్స్ రావడంతో ఖుషీగా ఉంది. ఇటీవల విడుదలైన హైవే ట్రయలర్‌లో ఆలియా నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ‘ ఈ వీడియోలో నేను గన్‌తో కాలుస్తున్న దృశ్యాలు చూశాక చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నా మొదటి దానికి పూర్తి విభిన్నమైన సినిమా ఇది. హైవే విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. ఇంతియాజ్ అలీతో పనిచేయడం అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది’ అని ఆలియా వివరించింది. -
మళ్లీ బుల్లితెరవైపు మహేశ్ భట్ చూపు
అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు బుల్లితెరపై ప్రత్యక్షమవుతూ ఇంటిల్లిపాదిని చూపుతిప్పుకోనీయకుండా చేస్తుంటే దర్శక నిర్మాత మహేశ్ భట్ చూపు కూడా మరోసారి బుల్లితెరవైపు మళ్లింది. ఇప్పటికే భట్ ‘ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ స్కై’ ఇంగ్లిష్ షో ద్వారా బుల్లితెరపై తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాక ‘స్వాభిమాన్’ వంటి సీరియల్‌ను తెరకెక్కించి కుటుంబాన్ని మొత్తం టీవీ ముందు కట్టిపడేశాడు. అనురాగ్ కశ్యప్ రాసిన ‘కభీ కభీ’కి దర్శకత్వం వహించి, బుల్లితెరపై తానెవరికీ తీసిపోనని నిరూపించుకున్నాడు. అయితే తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు తన మాయాజాలాన్ని చూపాలనుకుంటున్నాడు మహేశ్ భట్. సరికొత్త ఆలోచనతో వచ్చే సంవత్సరం ఓ టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ‘24’ షో ద్వారా ప్రముఖ నటుడు అనిల్ కపూర్ టీవీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’తో సంచలనాలే సృష్టించాడు. అయితే వీటిని మించి ప్రేక్షకాదరణ పొందే ఓ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన షో ఎలా ఉంటుంది? ఎవరెవరు అందులో పాత్రధారులు కానున్నారు? అసలు తన ఆలోచన ఏంటి? ఎవరిని లక్ష్యంగా చేసుకొని షోను ప్లాన్ చేస్తున్నారు? తదితర వివరాలేవీ తాను ఇప్పుడు వెల్లడించలేనని, అయితే షోను స్టార్ చానల్లో ప్రసారం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు. అయితే కుటుంబాన్ని మొత్తం అలరించేలా తన షో ఉంటుందని, టీవీ మాధ్యమానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో మరోసారి ఇటువైపు చూడాల్సి వస్తోందన్నాడు. షోకు సంబంధించి కూడా సాంకేతిక నిపుణులు, ఇతరులు కొందరితో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని, అవి పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. మొత్తానికి 2014లో ఓ కొత్త టీవీ షో మనల్ని అలరించనుందన్నామాట. -
'కర్లే ప్యార్ కర్లే' చిత్రం ఆడియో
-
'కృష్ణమూర్తిని కలిశాకే డ్రగ్స్ నుంచి బయటపడ్డాను'
నా జీవితంలో భగవంతుడికి పెద్దగా ప్రాధాన్యత లేదు అని బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. ఇండియన్ లాంగ్వేజ్ ఫెస్టివల్ 'సమన్వయ్' లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జీవితంలో కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో దేవుడిపై అసంతృప్తి పెరిగిపోయింది అని వ్యాఖ్యలు చేశారు. తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి జీవితాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటూ.. చిత్రాల్లో నటించడానికి ముందు డ్రగ్స్, ఎల్ఎస్ డీలకు అలవాటు పడ్టాను. అయితే ఉప్పలూరి గోపాల(యూజీ) కృష్ణమూర్తిని కలిశాక ఒక్కసారి జీవితమే మారిపోయింది. అప్పుడే జీవితం, సమాజం విలువ తెలుసుకున్నాను. తమ కుమారుడి పోగొట్టుకున్న ఓ దంపతులను చూశాక జీవిత సారాంశాన్ని తెలుసుకున్నాను. అప్పడే నాకు పునర్మన్మ సిద్దాంతం గురించి తెలిసిందని ఆయన అన్నారు. 'జక్మ్' చిత్ర నిర్మాణ సందర్భంగా తాను ఎన్నో కష్టాలు అనుభవించాను. అనేక రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొన్నాను. రాజకీయ నేతల నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేము అని అధికారుల చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నతనం నుంచే దేవుడంటే నమ్మకం లేదు అని తెలిపాడు. నా తండ్రి ఎక్కువ కాలం బ్రతకాలని...నాతో ఉండాలని కోరుకున్నాను. అయితే నేను అనుకున్నట్టు జరగకపోవడంతో దేవుడిపై నమ్మకం కోల్పోయాను. నా సన్నిహితుల్లో ఎక్కువ మందికి దేవుడిపై నమ్మకం ఉన్నా.. నేను ఎప్పడూ వారి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు అని అన్నారు. -
ఆస్కార్ కోసం కాదు.. ప్రేక్షకుల కోసమే:మహేశ్ భట్
కోల్ కతా: తాను అవార్డుల కోసం సినిమాలు చేయడం లేదని బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలిపారు. భారతీయ చిత్రాలు నిర్మించేది ఆస్కార్ లాంటి అవార్డుల దక్కించుకోవడం కోసం కాదన్నారు . ఈ సందర్భంగా ఐఎన్ఎస్ తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్డడించారు. అవార్దు అనేది..ప్రస్తుతం చేస్తున్న సినిమాకు ప్రామాణికం కాదన్నారు. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను నిర్మిస్తేనే బాగుంటదన్నారు. అవార్డుల కోసం మాత్రమే సినిమాలు చేయడం మంచి పద్దతి కాదనదే తన అభిప్రాయంగా తెలిపారు. ఏ దర్శకుడైనా, రచయిత అయినా, నిర్మాత అయిన సినీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. తాను మాత్రం ప్రేక్షకులు కోసమే సినిమాలు తీస్తున్నానని తెలిపారు. 'మనం ఆస్కార్ అవార్డుల కోసం తీస్తున్నామా?లేక భారతీయ ప్రేక్షకులు కోసమా? ' అనేది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలన్నారు. తాను నిర్మాతగా చేసిన ఆషికి-2 భారీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. తొలి వారంలో ఆ చిత్రం రూ.20 కోట్లు వసూలు చేయగా, నెలలోనే రూ.100 కోట్లు కలెక్షన్ లతో ప్రభంజన సృష్టించిందని తెలిపారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ. 9 కోట్ల వ్యయంతో మహేశ్ భట్ నిర్మించారు.