హైవే స్పీడ్ ఆలియా ..! | special story on Alia Bhatt | Sakshi
Sakshi News home page

హైవే స్పీడ్ ఆలియా ..!

Published Sat, Nov 25 2017 11:26 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

special story on Alia Bhatt - Sakshi

ఆలియా ఇండస్ట్రీకి రావడమే సెన్సేషన్‌.. చేసే ప్రతి సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూనే పోయింది.హైవేతో ఫుల్‌ స్పీడ్‌లో ఆమె తన కెరీర్‌కు వేసుకున్న రూట్‌ అయితే.. తిరుగులేనిది. ఇప్పుడు ఆ స్పీడ్‌ అలాగే ఉంది. ఆ స్పీడ్‌లోనే దూసుకుపోతోన్న ఆలియా గురించి కొన్ని విశేషాలు.. 

తగ్గితేనే ఛాన్స్‌.. 
ఆలియాభట్‌ ఫ్యామిలీ అంతా సినిమా స్టార్సే! దీంతో చిన్నప్పట్నుంచే ఆలియా కూడా స్టార్‌ అవ్వాలనే అనుకుంది. 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో ఎంట్రీ ఇవ్వకముందు ఆలియా చాలా లావు ఉండేదట. ఆ సినిమా దర్శకుడు కరణ్‌ జోహార్‌.. బరువు తగ్గితేనే హీరోయిన్‌ చాన్స్‌ అన్నాడట. ఇంకేముంది? బరువు తగ్గడమే పనిగా పెట్టుకుంది ఆలియా. వర్కవుట్స్‌ చేసి.. చేసి.. 16కిలోలు తగ్గి పర్ఫెక్ట్‌ హీరోయిన్‌ అనిపించుకునేలా తయారైంది. ‘ఎంత లావు ఉండేదాన్నో నేనప్పుడు’ అని చెప్పుకుంటుంది ఆలియా, తన ఫస్ట్‌ సినిమాను గుర్తు చేసినప్పుడల్లా!

దేవుణ్ని నమ్మను!
ఆలియా భట్‌ తండ్రి మహేష్‌ భట్‌ బాలీవుడ్‌లో పెద్ద ఫిల్మ్‌మేకర్‌. స్వతహాగా ఆయన నాస్తికుడు. కూతురు ఆలియాను కూడా ఆయన అలాగే పెంచాడు. ఆలియా పుట్టుకతోనే నాస్తికురాలు. ఆమె దేవుణ్ని నమ్మదట. ‘నేను నాస్తికురాలిగానే పెరిగా’ అని చెప్పుకుంటుంది ఆలియా.

హైవేతో రేసులోకి.. 
ఆలియా భట్‌కు సూపర్‌ బ్రేక్‌ ఇచ్చి, ఆమెను స్టార్‌ చేసిన సినిమా ౖ‘హెవే’. 2014లో వచ్చిన ఈ సినిమాలో ఒక టీనేజ్‌ యువతి పాత్రలో ఆలియా అద్భుతంగా నటించేసింది. పెద్ద పెద్ద స్టార్స్‌కే పోటీ ఇవ్వగల స్టార్‌గా ఆలియాను నిలబెట్టింది ఈ సినిమానే! దీంతో కెరీర్‌ మొదట్లో అంతంతమాత్రంగానే ఉన్న క్రేజ్‌ ఈ సినిమాతో అమాంతంగా పెరిగిపోయింది. సక్సెస్‌లు కూడా వరుసగా వచ్చిపడ్డాయి. ఈతరం హీరోయిన్లలో ఆలియా టాప్‌ రేసులోకి దూసుకొచ్చింది కూడా హైవేతోనే! 

మల్టీ టాలెంటెడ్‌.. 
ఆలియా మల్టీ టాలెంటెడ్‌. యాక్టింగ్‌ చిన్నప్పుడే మొదలుపెట్టేసింది. ఇరవై ఒక్కో ఏటే హీరోయిన్‌గా స్టార్స్‌కే గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడే ఆగిపోలేదామె. తనకెంతో ఇష్టమైన సింగింగ్‌ను వదులుకోలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన సినిమాలతో పాటు, ఇతరుల సినిమాలకూ పాటలు పాడడం మొదలుపెట్టింది. సరిపోలేదు. చాలా షోస్‌లో ప్రదర్శనలు ఇచ్చింది. తనకు ఇష్టమైన క్లాతింగ్‌ ఫీల్డ్‌లోకీ దిగిపోయి బిజినెస్‌ వైపుకూ అడుగులేసింది. ఇన్ని పనులు చేస్తున్నా యాక్టింగ్‌ అంటే పిచ్చి ఇష్టం. అదే ఫస్ట్‌ ప్రయారిటీ అని చెబుతుంది ఆలియా. ఆ ఫస్ట్‌ ప్రయారిటీలో ఆమె ఇంకెన్నో అద్భుతాలు సాధించాలని కోరుకుందాం!  

నేనూ నవ్వుకుంటా! 
ఆలియాపై వచ్చినన్ని ట్రోల్స్‌ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్‌పై రాలేదనే చెప్పాలి. ఒక టాప్‌ టీవీ షోలో ‘భారత రాష్ట్రపతి ఎవరు?’ అన్న ప్రశ్నకు ఆలియా తప్పుడు సమాధానం ఇచ్చింది. ఇక అది మొదలుకొని, ఆలియాకు బొత్తిగా జనరల్‌ నాలెడ్జ్‌ లేదని వేలల్లో జోక్స్‌ వచ్చాయి. కొన్ని నెలలపాటు ఈ జోక్స్‌ అలా కొనసాగుతూనే పోయాయి. తనపై వచ్చిన జోక్స్‌ చూసుకొని ఆలియా ఫీల్‌ అవ్వలేదు. ‘‘నేనేం ఫీల్‌ అవ్వలేదు. నిజం చెప్పాలంటే కొన్ని జోక్స్‌ నాక్కూడా విపరీతంగా నచ్చాయి. ఆ జోక్స్‌కి నేనూ నవ్వుకుంటా.’’ అని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement