మా అమ్మాయి లవ్‌లో ఉంది | Mahesh Bhatt confirms daughter Alia Bhatt love | Sakshi
Sakshi News home page

మా అమ్మాయి లవ్‌లో ఉంది

Published Wed, Dec 12 2018 2:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Mahesh Bhatt confirms daughter Alia Bhatt love - Sakshi

ఎయిర్‌పోర్ట్, రెస్టారెంట్, పార్టీలు.. ఇలా ఎక్కడికెళ్లినా జంటగా దర్శనం ఇస్తున్నారు రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది కానీ ఈ విషయంపై అధికారికమైన స్పష్టత రాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రేమను ఆలియా తండ్రి, ప్రముఖ దర్శకుడు మహేశ్‌ భట్‌ అధికారికంగా ధ్రువీకరించారు. ‘‘రణ్‌బీర్‌ అంటే నాకు ఇష్టం. గొప్ప వ్యక్తి. రణ్‌బీర్, ఆలియా లవ్‌లో ఉన్నారని తెలుసుకోవడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు.

వారి రిలేషన్‌షిప్‌ సవ్యంగానే సాగుతోంది. ఈ బంధాన్ని వాళ్లు పెళ్లి వరకూ తీసుకెళతారా? లేదా? అనేది చూడాలి. నా అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది వారి పెళ్లి జరిగే అవకాశం ఉంది. కానీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ముందే ఊహించి చెప్పలేం’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్‌భట్‌ చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement