
బాలీవుడ్‌లో ఇప్పుడు ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లి గురించి తెగ చర్చ నడుస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది అతిథులు వస్తారు వంటి పలు విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి బట్టలు, నగలు దగ్గరినుంచి పెళ్లయ్యాక వెళ్లే హనీమూన్ స్పాట్ ఏదై ఉంటుంది వంటి రకరకాల అంశాలపై బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఆలియాభట్ సోదరుడు రాహుల్ భట్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పెళ్లికి కేవలం 28మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారని, వీరిలో ఎక్కువమంది కుటుంసభ్యులే అని పేర్కొన్నారు. మహేష్ భట్ మొదటి భార్య కిరణ్ భట్‌కు కలిగిన సంతానమే రాహుల్ భట్ అన్న సంగతి తెలిసిందే. కాగా రాహుల్ ప్రకటన ప్రకారం బయటి వారెవరికీ ఆహ్వానం లేనట్లే అని తెలుస్తోంది. ఇక పెళ్లి వేడుక ముంబైలోని చెంబూర్‌లో జరగనునుందని, అలాగే రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసంలో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్వరలోనే స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment