
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబై, బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే వివాహాం అనంతరం తొలి ఫోటోను ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'మా కుటుంబం, స్నేహితుల సమక్షంలో మాకెంతో ఇష్టమైన ప్రదేశంలోనే మేం పెళ్లి చేసుకున్నాం.
గత ఐదేళ్లుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి జరగడం సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి జంటగా మరెన్నో జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆలియా ఆనందం వ్యక్తం చేసింది.
నీతూ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ సహా తదితరులు పెళ్లింట సందడి చేశారు. కాగా ఆలియా షేర్ చేసిన పెళ్లి ఫోటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment